"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
▼
▼
Pages
▼
బాల గేయాలు
అంశం: బాల గేయాలు/పాటలు
శీర్షిక: మేమే మేమే బాలలం!
మేమే మేమే బాలలం,
భావి తరానికి వారసులం
దేశాభివృద్ధికి కారకులం ,
జగతికి మేమే దివ్వెలం!! "మేమే మేమే"
ప్రాతఃకాలాన లేచెదము
కూర్చుని శ్రద్ధగ చదివెదము
అమ్మ చెప్పిన పనులు చేసెదము
తల్లిదండ్రులకు సేవ చేసెదము!! "మేమే మేమే"
అందరం బడికి వెళ్ళెదము
పాఠాలు చక్కగా వినెదము
ఆటలు బాగా ఆడెదము
ప్రేమ దయతో ఉండెదము!! "మేమే మేమే"
కుల మతాలు మాకూ లేవు
ఈర్ష్య అసూయలు లేనే లేవు
పేద ధనిక భేదాల్లెవు
ప్రాంతీయ విభేదాల్లేవు!! "మేమే మేమే"
మూఢనమ్మకాలు వీడెదము
సత్యాలనే మేము నమ్మెదము
నీతి నిజాయితిగా ఉండెదము
గొప్ప నాయకుల మయ్యెదము !! "మేమే మేమే"
No comments:
Post a Comment