మెరసం పద్యం రచనలు:
తేది: 23.04.23
అంశం: భారతీయ పండుగలు
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
పద్యం క్రమసంఖ్య: 01
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *సంక్రాంతి సంబురాలు*
సీ . సంక్రాంతి పండుగ సంబరాలే గొప్ప
రంగురంగులముగ్గు రాత్రి లోన
వాడవాడలవేయ వాకిళ్ళు నిండెను
గాలిపతంగులు గగన మంత
పక్షుల వోలెనే పరుగులు తీయును
గంగిరెద్దులవారు గాన మూద
హరిదాసులనువారు హరికీర్తనలుపాడ
పిట్టలదొరగొప్ప గుట్టు విప్ప
తే. గీ.
భోగి పండుగ రోజున భోగి మంట
కనుల పండుగ సంక్రాంతి గడుచు చుండు
మూడు రోజుల పండుగ ముచ్చటగను
జరుపు కొనెదరు జనులెల్ల జగతి లోన
మెరసం పద్య రచనలు:
తేది: 24.04.23
అంశం: పుస్తకం
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
పద్యం క్రమసంఖ్య:02
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: పుస్తకం
సీ.ప:
ఋషులకాలముననే ఋగ్వేదము వెలిగె
జనులకు నేర్పిన ఘనులు మునులె
విద్యనేర్వనివారు వింత పశువులని
నాటినుండియు గట్టి మాట నొక్కి
చెబుతు వేదములను చెక్కుచెదరకుండ
విస్తరించ నరులు విస్తుపోయె
మనిషికి జ్ఞానము మనసుకుల్లాసము
నిచ్చె పుస్తకము లిలన నేడు
ఆ.వె:
చిరిగిన చొక్కాలు చింపురు జుట్టును
వేసుకొనిన గాని విడువ రాదు
మరువ రాదెప్పుడు మంచిపుస్తకమును
కృష్ణ మాట వినుము తృష్ణ దీరు!
మెరసం పద్య రచనలు:
తేది: 26.04.23
అంశం: బలగమే బలం
క్రమం సంఖ్య:03
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *తోబుట్టువులు*
సీ .ప:
కొండంత సంపద కొలనంత పాయసం
ధనములెన్నియునున్న దండుగేను
కష్టము వచ్చిన కాళ్ళును నొచ్చిన
డబ్బేమి చేయును డాక్టరైన
కడుపున పుట్టిన కొడుకులు బిడ్డలు
కోడండ్లు యల్లుండ్లు కొత్త వాళ్ళు
బలగమంతయుచేర బలమునెంతోయుండు
చెలిమితో యిక్కట్లు చెదిరి పోవు
ఆ.వె:
ఉన్న నాడు తినిన లేనినాడెండిన
బలగమున్న యెడల బలము నుండు
తోడు నీడ వారె తోబుట్టువులునంత
కలిసి యున్న చాలు కలిమి చేరు!
మెరసం పద్య రచనలు:
తేది: 28.04.23
అంశం: మహిళాభ్యుదయం
క్రమం సంఖ్య:04
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *సవ్యసాచి*
సీ .ప:
ఉదయించు సూర్యుడి కుదహరించెద స్త్రీల
రవితోనె మేల్కొని రాత్రి వరకు
సకలము పనులను సక్రమముగ చేసి
కునుకు తీయును కాస్త కనులు మూసి
తల్లిగా నాలిగాచెల్లిగా బిడ్డగా
సవ్యసాచి తరుణి భవ్యసేవ
రాతికాలపునాటి నాతికాదుయిపుడు
రాజకీయమునందు రాటుదేలె
ఆ.వె:
అంచెలంచెలుగను నన్నిరంగములందు
నడుగువేయ జనులు నాదరించ
గొప్ప తీరు తోడ మెప్పును పొందేటి
మహిళ త్యాగ మెవరు మరిచి పోరు!
మెరసం పద్య రచనలు:
తేది: 30.04.23
అంశం: శ్రీ శ్రీ
క్రమం సంఖ్య:05
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *విప్లవ సాహిత్య కవి*
సీ .ప:
కష్టాలను తనకు యిష్టముగా మార్చు
విప్లవ సాహిత్య విరసము కవి
శ్రమజీవులయెడ సమరము జేసిన
సాహస వంతుడు సంగ్రమమున
గ్రాంథిక భాషను గడిచిన భాషని
ఛందస్సును కూడ చక్క దిద్ద
సరిపోదనుచు నాడె సడలించి, గురజాడ
బాటలో నడిచిన బాట సారి
ఆ.వె:
అగ్గిపుల్లయుగాని యటకుక్కపిల్లయు
సబ్బుబిళ్ళయుగాని సరియెగొప్ప
కవిత రాయుటకును కథలు రాయుటకును
పనికి వచ్చు ననియు రణము జేసె!
మెరసం పద్య రచనలు:
తేది: 02.05.23
అంశం: భారతీయుల జనజీవనం
క్రమం సంఖ్య:06
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *భరతుడు యేలిన భాగ్యదేశము*
సీ .ప:
భరతుడు యేలిన భాగ్యదేశము యిదే
భారతీయ నరుల బాధ్యతొకటె
ఐకమత్యముతోడ లోకములో నుండ
జనులు వేరైనను జగతి ఘనము
భాషలు నెన్నియో భావమొక్కటె యుండె
సంస్కృతియొక్కటే సతతముండు
పట్టణ మందున పల్లెలో నంతట
పాటించెదరునంత పరవశమున!
ఆ.వె:
కులము మతము నన్న కుత్సితములులేవు
భిన్న జాతి జనులు నున్న గాని
కలిసి మెలిసి యుండు కలహము లేకుండ
భారమైన నేమి బాధ పడరు!
మెరసం పద్య రచనలు:
తేది: 04.05.23
అంశం: జల సంరక్షణ
క్రమం సంఖ్య:07
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *నీటి పొదుపు నియమ మేది?*
సీ .ప:
సూర్యుడు లేకుండ సూర్యరశ్మి యులేదు
భానుడి యెండలు భగ్గు మనగ
వాయువు మేఘాలు వానలు కురువంగ
చెరువులు నిండును కరువు బాయు
పడినట్టి వర్షము ప్రవహించి నేరుగా
చేరెను సంద్రము చెడుగ మారె
చుట్టూర నీరునే దిట్టముగా సాగె
నీటియమ్మకములు నీతి మరిచి!
ఆ.వె:
జలము లేక జనులు కలవరపడుచుండ
నీటి పొదుపు చేయ నియమ మేది?
ఉచిత నీరు నమ్మి నుసురుపోసుకొనిరి
నీరు లేక రైతు బోరుమనియె!
మెరసం పద్య రచనలు:
తేది: 07.05.23
అంశం: తెలుగు భాష ఔన్నత్యం
క్రమం సంఖ్య:08
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: మాతృభాష
సీ.మాళిక :
దేషభాషలయందు తెలుగులెస్సయనెను
దేవరాయలు నాడె దివ్యముగను
నన్నయ తిక్కన పిన్నలు యెర్రన
కావ్యముల్ రచియించె కనుల కింపు
తెలుగు తీయదనము తెలియదు నెవరికి
దేశదేశాలందు తెలుగు వారు
మాతృభాష లయెంచి మనుగడ సాగించ
కన్నతల్లిని మించి కాదు పిన్ని
తెలుగు భాష జనుల వెలుగులు నింపగా
భారత దేశపు భవిత పెరిగె!
ఆ.వె :
పాలవెల్లి వలెను పరుగులెత్తి తెలుగు
విశ్వ మంతనదియు విస్త రించె
అమ్మ జన్మ నిచ్చి నందించి నట్టిది
మాతృభాష యున్న మనుగడుండు!
మెరసం పద్య రచనలు:
తేది: 09.05.23
అంశం: సమాజ సేవ
క్రమం సంఖ్య:09
పేరు: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్
హామి: ఇది నా స్వీయ రచన
శీర్షిక: *అబ్బబ్బ పాలన*
సీ .ప:
అబ్బబ్బ పాలన నబ్బురముగ నుండె
భగభగ ధరలన్ని భగ్గుమనెను
గబగబ నాయకుల్ గుబులును రాజేసి
బుస్సుబుస్సుమనుచు బుసలు కొట్ట
దడదడ గుండాలు బడితపూజలు జేయ
దబదబ పేదల ధరణి దోచె
లడలడ మద్యము గడగడ త్రాగించి
డబడబ తరుముచు డబ్బులాగ!
ఆ.వె:
విస్కి విస్కి యంటు వింతలు జేయుచు
గుట్టు చప్పుడుగను గూడు కూల్చి
వొట్టు పెట్టి తట్టి వోట్లను లాగిరి
సేవ యిదియెననిరి సేదతీరి !
No comments:
Post a Comment