Tuesday, December 3, 2024

ప్రపంచీకరణ (GLOBALISATION)

అంశం: వెలుగుల కబుర్లను చెప్పుకుందాం:

శీర్శిక:  *ప్రపంచీకరణ*


"నేటి కాలము కన్న నాటి కాలమే మేలు"

పందొమ్మిది వందల తొంబది ఒకటిలో 

దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి

ప్రపంచీకరణను తీసుకొచ్చారు

నాటి ప్రధాని శ్రీ పి.వి. నర్సింహారావు 


"ప్రపంచీకరణ" రెండు వైపులా

పదునైన కత్తి లాంటిది 

అది మంచి చెడును రెండింటినీ

మోసుకొచ్చింది 

బెల్లం చుట్టే ఈగలు వాలుతాయన్నట్లు

జనులు చెడు వైపే మొగ్గు చూపారు

ఆర్ధిక వ్యవస్థ బాగుపడింది గానీ

పేదలకు అందని ద్రాక్షే అయింది


లక్షాధికారులు కోటీశ్వరులయ్యారు 

కానీ, బిక్షాధికారులు 

మరింత దిగజారి పోతున్నారు 

చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు 


లోపమెక్కడుందని భూతద్దం పట్టిచూస్తే 

ఒకరిపై మరొకరు నెపం మోపుతున్నారు

కాలుకు నిప్పంటిన పిల్లుల్లా 

నేను నేను కాదు అంటున్నారే తప్పా 

ఒప్పుకోవడం ఎవరికీ ఇష్టం లేదు

వాస్తవానికి సర్వం అవినీతి మయం 


ప్రపంచీకరణ వలన 

"ప్రపంచం ఒక కుగ్రామం' గా మారింది

అవకాశాలు దండిగా పెరిగాయి 

అవి అవకాశ వాదులకు స్వర్గధామాలయ్యాయి

ఆమాయకులను బలిపశువులను చేశాయి


చట్టాలు ధనికులకు చుట్టాలుగా మారాయి

పేదలకు చట్టాలు భారమయ్యాయి 

రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకునే 

అవకాశాలు మెరుగయ్యాయి 

ధనికులు అందల మెక్కడానికి మార్గాలు 

సుగమం అయ్యాయి 


రాజ్యాంగ వ్యవస్థలు పేరుకు వేరుగా ఏర్పడినా

వాస్తవానికి , ఎవరు నమ్మినా నమ్మక పోయినా 

వ్యవస్థలన్నీ నేతల కబంధ హస్తాలలో 

బంధించ బడినాయి 

వ్యవస్థల ఏర్పాట్లు, ఆఫీసర్ల అపాయింట్మెంట్లు 

వేతనాల నిర్ణయాలు, ట్రాన్సఫర్లు , టర్మినేషన్లు 

అన్నియు నాయకుల చేతుల్లోనే


దేశంలోని కోట్లాది ప్రజలు 

ఈ పాలకుల చేతుల్లోనే కొట్టుమిట్టాడిల్సిందే

అడ్డూ అదుపూ లేని నేతలు

ప్రజలను ఉచితాలకు బానిసలను చేసి

సోమరితనాన్ని అలవాటు చేసి

శ్రమ జీవనానికి దూరం చేసి

జీవశ్చావాలుగా మార్చేశారు 

అందినంత దోచుకుని 

విదేశాల్లో దాపెడుతున్నారు 

రాబోయే ఎన్నికల ఖర్చుకు 

లాయర్ల ఫీజులకు కూడబెడుతున్నారు 


ఉచితాలకు , మద్యానికి బానిసలను చేసి 

ప్రశ్నించే గొంతులకు తాళం వేసి

పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు పాలకులు 

పేరుకే ప్రజాస్వామ్యం , చూపేది నిరంకుశత్వం


ఉచిత విద్యకు, ఉచిత ఆరోగ్యానికి 

ఎగనామం పెడుతూ

ఉపాధి అవాకాశాలను కాలరాస్తే

కట్టుకున్న గూళ్ళను కూల్చుతుంటే 

బీదలు బీదవారు గాక 

ధనవంతులు ఎలా అవగలరు


కారణాలు ఏమైనా

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటినా

భారత దేశం అభివృద్ధి చెందుతున్న 

దేశం గానే మిగిలిపోయింది

యాంత్రిక జీవితంలా మారిపోయింది 

*నేటి కాలం కన్న నాటి కాలమే మేలనిపిస్తుది*

జ్ఞానోదయం

 జ్ఞానోదయం:


ఒక రోజు యధావిధిగా సన్యాసి తన శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలు దేరాడు.

అలా అలా దారి వెంట వెలుతూ ఉంటే , ప్రజలు వారి స్థోమతకు తగ్గ, వారికి అందుబాటులో ఉన్న బియ్యం, పండ్లు, డబ్బు వారి జోలెలో వేసి మ్రొక్కే వారు. వారికి ఆ సన్యాసి ఆశిస్సులు అందించి ముందుకు సాగే వాడు.

అలా దారి వెంట వెలుతుండగా ఒక ఆమె ఎదురుగా వచ్చి ఆ సన్యాసిని నిలదీసింది, 

" ఏమయ్యా నీవు చూస్తే కండలు పెంచుకుని ధృడంగా ఉన్నావు. ముఖం తేజస్సుతో వెలిగి పోతుంది. ఇలా ఇండ్ల చుట్టూ తిరుగుతూ అడుక్కోవటం నీకు సిగ్గు అనిపించడం లేదా? ఏదో ఒక పని చేసి, కాయా కష్టం చేసి సంపాదించుకోవచ్చు కదా?"  అంటూ నానా మాటలు అంటూ, పో పో అని అంది.

శిష్యులకు పట్టరాని కోపం వచ్చింది. ఒక సమయంలో ఆ స్త్రీ ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ వారి గురువు గుర్తుకు తెచ్చుకుని కోపాన్ని అనుచుకున్నారు. కేవలం కోపంతో ఆమెవైపు చూసారు తప్పా ఏమి అనలేక పోయారు.

ఇక ఆ సన్యాసి, ఆమె వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, ముందుకు సాగాడు.

శిష్యులు పట్టరాని కోపంతో ఉన్నారు. గురువు, ఆమె యెడల అంత మౌనంగా ఎందుకు ఉన్నారు, ఒక్క మాటైన ఆమెను అనలేదు. కోప్పడకుండా, పైగా చిరునవ్వు నవ్వి సాగి పోతున్నాడు అని.  ఒక వైపు బాధ మరో వైపు భయం. ఎలా అడుగాలని.

వారిలో ఒక శిష్యుడు ధైర్యం చేసి, ఇలా అడిగాడు,
"స్వామీ, నా మాట తప్పైతే క్షమించండి,  ఆమె అంతలా అన్నన్ని మాటలు అంటుంటే, మీరు ఏమి అనకుండా , ఆమె వైపు చూసి, చిరునవ్వు నవ్వి ముందుకు సాగారు. మాకు చెప్పినా మేము ఆమెను తిట్టే వాళ్ళం కదా, కొట్టే వాళ్ళం కదా"  అని అన్నాడు.

సన్యాసి, అప్పుడు కూడా ఆ శిష్యుడి వైపు చూసి, ఒక చిరునవ్వు నవ్వి, 
"చూడు నాయనా! ఆంతకు ముందు ప్రజలు మనకు ఎన్నో రకాల ద్రవ్యాలు సమర్పించుకున్నారు. వాటిని మనం స్వీకరించాం.అవి మన వెంట వస్తున్నాయి. అవి మనకు బరువుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఆమే ఏవో మాటలు అన్నది అని అంటున్నావు. వాటిని మనం స్వీకరించలేదు. మన వెంట తీసుకుని రావడం లేదు. ఆమె మాటలను అక్కడే వదిలేసాము. ఇక ఆమె మాటలు మనకు బరువు ఎలా అవుతాయి? బాధను ఎలా కలిగిస్తాయి? ఆమె మాటలు ఆమె వద్దనే ఉన్నాయి కాబట్టి, ఆమెనే బాధిస్తాయి" అని అంటాడు.

శిష్యులకు కళ్ళు చెదిరిపోయాయి. జ్ఞానోదయం కలిగింది. తమ తప్పును మన్నించమని , గురువులైన సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేసి ముందుకు సాగారు. 

ఆ గురువు ఎవరో కాదు *గౌతమ బుద్ధుడు*.

సైన్సుకు అందని సత్యం


శీర్షిక: "సైన్సుకు అందని సత్యం"

"సృష్టి ఎంత విచిత్రం
తెలుసుకునుట కాదు మానవ తరం"
వినీలాకాశంలో నక్షత్రాలు
పరుగులు పెడుతున్నాయి
అవనిలో అంధకారం అలుముకుంది
విశ్వం నిశ్శబ్దం ఆవహించింది
పండు అమావాస్య రోజు
జనులు పశు పక్షాదులు
నిద్రలోకి జారుకున్నాయి
రాత్రి సూరీడు వచ్చేవేళ
దగ్గర బడుతుంది

రాజు తమ వాహనాలకు
వార్తను అందించారు
అవి ఆ ఇంటి దగ్గరలో
దక్షణం వైపున కూర్చుని
బోరుమని రోధనలు చేస్తున్నాయి

ఏమి జరుగుతుందో
యేమి జరుగబోతుందో
ఎవరికీ తెలియని
అయోమయ పరిస్థితి

రాజు  ఆజ్ఞ మేరకు
కత్తులు కఠారులు పట్టుకుని
త్రాళ్ళు పలుగులు పుచ్చుకుని
దక్షణం నుండి భటులు వచ్చారు
ఆ భటులు ఎవరో కాదు, యమ దూతలు

వచ్చిన విషయాన్ని చెప్పారు
మర్యాదగ వస్తావా  లేక
మమ్మల్ని ఎత్తుకు పొమ్మంటావా
అని గద్ధించారు

అంతే,
ఆ తల్లి ఎవర్రా మీరు అంటూ
కాళికా దేవిలా గర్జించింది
బడితే చేతిలో బుచ్చుకుంది
నాకు ఇంకా బ్రతకాలని ఉందిరా
నా ఇల్లును ఇంకా అమ్మలేదురా
నాకు ఇంకా ఎన్నో పనులున్నాయిరా
అంటూ తరిమి తరిమి కొట్టింది
ఒక్కసారే, అమ్మ వారిలా
విశ్వరూపం చూసేసరికి
యమదూతలకు బయం వేసి
వినేటట్లు లేదని , చేసేది ఏమీ లేక
వెంట తెచ్చుకున్న  అస్త్ర శస్త్రాలతో
యమధర్మరాజు వద్దకు బయలు దేరారు

గెలిచిన విజయోత్సాహంతో
ఆ తల్లి అదే నిండు నిశి వేళ
స్నానం గావించి
ఆనందంగా నిదురలోకి జారుకుంది

మరికొన్నాళ్లకు
ప్రతి రోజు పగలు కొడుకు కోడలుతో
సేవలు చేయించు కోవడం
రాత్రి వేళల్లో తన వారిని
అమ్మ అక్క మనుమరాలా
అంటూ పిలవడం
తమ్ముళ్ళను, మరుదండ్లను
తలుచుకోవడం
వారు స్వర్గం నుండో నరకం నుండో
ఆ తల్లి వద్దకు రావడం
వారితో చిన్న నాటి సంఘటనలు
బాధలు చెప్పడం, వారు చెప్పేది వినడం
నిత్య కృత్యంగా మారింది

పొద్దస్తమానం వారితోనే
ముచ్చట్లు అచ్చట్లు
చీదరింపులు బెదిరింపులు
తిట్ల పురాణాలు
అప్పుడే, ప్రేమలు గార్వాలు,
అలకలు ఊరడింపులు

పాలు పోస్తుంటే
భోజనం వడ్డిస్తుంటే
తన వారికి పెట్టమని
బ్రతిమి లాడుతుంది
ఇప్పటికీ అమ్మన్నా, అక్కన్నా
తన వారన్నా ఎంత ప్రేమో !

ఏరి వారు అని గట్టిగా ప్రశ్నిస్తే
ఇదుగో ఇప్పుడు ఇక్కడే ఉండిరి బిడ్డా
అని అంటుంది
సరే అని కొడుకు, నేను తీసుకెలుతున్నాను
మీ అమ్మకు బయట భోజనం పెడుతాను అంటే
చిన్న పిల్లలా ఇక తీసుకపోతవులే అంటూ
ముసిముసి నవ్వులు నవ్వుతుంది

ఆ తల్లి తిన్నా తినకున్నా
తనకు పెట్టిన అన్నంలో
కొంత తీసి అమ్మా అమ్మా అంటూ
అక్కా అక్కా అంటూ
పిలిచి వారికి వేరే రికాపులో పెడుతుంది

పన్నా పడుకోకున్నా ,
ఓ మూలకు పడుకుని
తన మంచం పైన చోటిచ్చి
బ్లాంకెట్ వారికి నిండుగా కప్పుతుంది
చాలామంది వస్తె వారికి చాప వేస్తుంది

తెల్లవారు కొడుకు కోడలు చూస్తే
మరో రికాపులో అన్నం దర్శనం
ఇదేమిటంటే, వాల్లకు గర్ర వచ్చింది
తినలేదు బయట పారేయంటుంది

తెల్లవారేసరికి, నిద్ర మబ్బు వదలగానే
బయటకు వచ్చి వారు ఏరిరా,
మా అమ్మ పిల్లలు ఏరిరా అంటుంది

నిత్యం ఇదే తంతు
ప్రతినిత్యం ఒక వింత దృశ్యం
ఎవరికీ అంతుచిక్కని చిత్రం
అంతా సృష్టి మహత్యం
సైన్సుకు అందని సత్యం
సిల్వర్ లైన్ కలిసి ఉండటం వలన
సగం భువిలో, సగం దివిలో
గడిపే ఆ నూరేళ్ళ తల్లి
మరో నూరేళ్ళు జీవించాలని
కోరుకుందాం


బానిసత్వం బానిసత్వమే

అంశం: సంకెళ్లు

శీర్శిక:బానిసత్వపు సంకెళ్లు 

*కాలం మారుచుంటే*
*కనికట్టు మారిన చందంగా*
మార్చుతున్నారు మోసపు తీరులు
కాలం తోనే సాగుతారు ఈ మోసగాళ్ళు!

శ్వాస ఉన్నన్ని రోజులు ఆశ అనివార్యం
ఆత్యాశ కోరికలు ఉన్నన్ని రోజులు
స్వార్ధం మోసాలు నేరాలు ఘోరాలు
అవకాశవాదులు అతి సహజం!

గొర్రె కసాయినే నమ్ముతుందన్నట్లు
బానిసలు బలిచేయు వారినే నమ్ముతారు!

మోసపోయే వారు ఉన్నంత కాలం
మోసం చేసే స్వార్ధపు నాయకులు ఘనం 
నీడలా వెంటాడుతునే ఉండటం సహజం
ఉచితాలకు ఆశ పడేవారున్నంత కాలం
నేతలు ఓటర్లను బానిసలుగానే భావించడం
ప్రశ్నించ కూడదనుకునే వారున్నంత కాలం
అధికారులు వంచుతునే ఉండటం నిజం!

చదువులు పెరిగాయి ఉద్యోగాలు శూన్యం
డిజిటల్ మీడియా పెరిగింది ఉపాధి మృగ్యం 
ఇంటర్నెట్ పెరిగింది నియంత్రణంటే భయం 
ఉచితాలకు క్యూకడుతున్నారు జనం
ఉచిత సంపదకు ఎగబడుతున్నారు స్కామర్లు
జనులను ఆధునిక బానిసత్వం అగాధం లోకి
త్రోసేస్తున్నారు తెల్ల చొక్కా వీరులు! 

నాడు నేడు భానిసత్వం "భానిసత్వమే"
కానీ తీరే మారింది టెక్నాలజే పెరిగింది 
చెరువులు మత్తళ్ళు పడినపుడు
కొత్త చేపలు ఎగసి పడినట్లుగా
కొత్త బానిసలు పుట్టుకొస్తున్నారు
దోచుకునే స్కామర్లు పుడుతునే ఉన్నారు
మోసం చేసే పద్దతులే మారుతున్నాయి!

ప్రతి మనిషికి
ప్రశ్నించే తత్వం అలవడిన
ఉచితాలను ఏవగించుకొనిన
మనుషులను అర్ధం చేసుకొనిన
వ్యక్తిత్వం పెంచుకొనిన
అత్యాశలు కోరికలు తగ్గించుకొనినను
బానిసత్వపు *సంకెళ్లను*  పెకిలించవచ్చు
 

Sunday, November 24, 2024

ఇక తనంతే

 శీర్శిక: ఇక తనంతే


కోకిల కూసినా
మంచు కురిసినా
ప్రకృతి వికసించినా
పిల్లగాలులు వీచినా
పిండి వెన్నెల కాసినా
పరిమళాలు వెదజల్లినా
గులాబీల సువాసన గుప్పుమన్నా
పౌర్ణమి అమావాస్య ఎదురొచ్చినా
తన్మయం చెందు!

సూర్యుడు బగబగ మండినా
ఉరుములు మెరుపులు మెరిసినా
పిడుగులు పడినా
కుంభవర్షం కురిసినా
నదులు పొంగిపొర్లినా
వరదలు పారినా
ఎవరైనా అడ్డుపడినా
అగ్నిగుండంలా మండుతుండు!

నేను నడిచేదే బాట
నేను చెప్పేదే వేదం
నేను చేసేదే న్యాయం
నేను చూసేదే నిజం
నేను వినేదే వాస్తవం
నేను నమ్మేదే సత్యం
నేను అమలు చేసేదే ధర్మం
నాకేంటి
ఈ సమాజంతో సంబందం
నాకేంటి
ఈ కుటుంబతో బంధం
నా జీవితం నా ఇష్టం
ఇదే తన ధోరణి!

వయసు పెరిగినా
బుద్ది పెరుగదు
అనుభవం గడించినా
మనసు మారదు
భూమికి దూరమైనా
కాటికి దగ్గరైనా
నా దారే రహదారి
ఇదే తన ధోరణి!

అవే వంకర చూపులు
అవే పిచ్చి చేష్టలు
అవే అహంకార మాటలు
అవే అడ్డ దారులు
అవే వితండ వాదాలు
అవే మూఢ నమ్మకాలు
అవే అస్థిర భావాలు
ఇదే తన ధోరణి
ఇక తనంతే!

కలియగంలో ఒక నలక
వ్యవస్థలో ఒక పేలిక
సమాజానికి ఒక మరక
కుటుంబంలో ఒక సుందెలుక
జగతిని కాల్చే నిప్పుకణిక
అంతా దేవునికే ఎరుక
ఇక తనంతే!

ఇదంతా
శరీర స్వభావమా?
లేక హార్మోన్ల ప్రభావమా?
లేక గ్రహాల భ్రమణమా?
లేక సమాజ దుస్వభావమా?
లేక పూర్వ జన్మ కర్మానుసారమా?
అంతా అయోమయం
ఇక తనంతే!

Thursday, November 14, 2024

నిమిత్త మాత్రులం

 తేది: 14.11.24

శీర్షిక: నిమిత్త మాత్రులం

ఏది యెప్పుడు జరుగుతుందో
యెవరికి తెలుసు
ఏది ఎక్కడ జరుగనుందో
యెవరికి తెలుసు
ఏది ఎలా జరుగనుందో
యెవరికి తెలుసు!

అంతా మనమనుకున్నట్లే జరుగుతే
ఇక దేవుడెందుకు?
మనిషి ఒకటి తలుస్తే
దైవం మరొకటి తలుస్తుందంటారు!

చావు పుట్టుకలు సహజం
పుట్టిన వారు గిట్టక మానరు
గిట్టిన వారు పుట్టక మానరు
ఆయుష్షు ఉన్నంత వరకే
మనిషి భూమ్మీద బ్రతుకుతాడు
ఎన్ని ప్రయత్నాలు చేసినా
వెళ్లి పోతాడు!

మనిషి నడుస్తూ వెలుతుంటాడు
పోటు రాయి తాకి పడిపోతాడు
హాస్పిటల్ లో చేరిపోతాడు
నీవు చూసుకుని నడుస్తే బాగుండు
ముహుర్తం చూసుకుని పోతే బాగుండు
అంటే ప్రమాదం జరుగకుండా
ఉంటుందా ఏమి?

మనిషి దేహాన్ని వదిలాక
వైన్ త్రాగకుండా ఉంటే బాగుండేది
టీ కాఫీలు త్రాగకుండా ఉంటే బాగుండేది
బీడి సిగరెట్లు కాల్చకుండా ఉంటే బాగుండేది
చికెన్ మటన్ తినకుండా ఉంటే బాగుండేది
బిపి షుగర్ వచ్చేది కాదు
క్యాన్సర్ వచ్చేది కాదు
అంటే తిని త్రాగిన వాల్లందరూ
చని పోతున్నారా ఏమి?

అదే నిజమైతే ప్రభుత్వాలు
ఎందుకు నిషేధించడం లేదు
వీటి వలన ఆరోగ్యం చెడుతుందనేది
ప్రజలకు తెలియదనుకోవాలా
జనులకు బ్రతకాలని లేదనుకోవాలా
చావుకోరుకుని తింటున్నారనీ
త్రాగుతున్నారనీ అనుకోవాలా!

యుద్దమంటే ఎంత నష్టమో
ఇజ్రాయెల్ కు ఇరాక్ తెలియదా
అయినా చేస్తున్నారు
అది కూడా కొన్ని నెలలకు తరబడి
ఎందుకు?
ఎవరి ఉనికి కొరకు వారు
ఎవరి ఉన్నతి కొరకు వారు
ఎవరు చస్తే వారికేంది
ఎంత నష్టమైతే వారికేంది!

నలుగురు కలిసినపుడు
మాట్లాడాలని యేదో
ఊక దంపుడు మాటలు
అనుకోవడమే తప్పా
ఆచరణలో ఏదీ జరుగదు
ఎలా జరుగాల్సింది
అలానే జరుగుతూనే ఉంటుంది
మనమందరం నిమిత్త మాత్రులం !

 

నిదుర ఎంత మధురం


శీర్షిక: నిదుర ఎంత మధురం

అదో స్వప్న సుందరి
కంటికి కనబడనిది
చేతికి తగలనిది
ఊహాకు అందనిది!

హాయి నిస్తుంది
అలసట తీరుస్తుంది
స్వాంతన నిస్తుంది
బాధను తగ్గిస్తుంది
భారం తగ్గిస్తుంది
ఆలోచనలు రేకెత్తుస్తుంది!

రోజూ మనతోనే ఉంటుంది
అదను కోసం వేచి చూస్తుంది
మగతలో మైమరిపిస్తుంది
కాదు పొమ్మంటే ఊరుకోదు
ఆద మరిచి పడుకుంటే
ఆకాశంలో విహరించు!

తెల్లని మెరుపు తీగను
వదులదు
పది నిమిషాలు
అలా అలా వెళ్ళి వచ్చు
ఊసులెన్నో మోసుకొచ్చు!

జోకొడుతుండు
బుజ్జగిస్తుండు
మేల్కొలుపుతుండు
పడుకోబెడుతుండు
మరల ఎగిరిపోతుండు!

ఎన్ని మార్లో
ఒక లెక్క లేదు
అన్ని రాత్రులు అంతే
పూదోటలో త్రిప్పు
ప్రేమికులను కల్పించు
సంతోషాలను పంచు
దుఃఖాలను రుచిజూపు!

నరకాన్ని చూపించు
స్వర్గాన్ని చూపించు
జరిగింది చెబుతుండు
జరుగబోయేది దర్శనమిచ్చు
సూచనలు చేయు
హెచ్చరికలు చేయు!

అశ్వమేధం ఎక్కించిందా
ఏనుగులు , పూలతోటలు
దర్శనమిచ్చాయా
నీకు దగ్గరలో
శుభం జరుగనున్నట్లే
సింహాన్ని చూపించిందా
నీకేదో ముంచుకొస్తున్నట్లే
దున్నపోతు ఎక్కించిందా
నీకు ఆరునెలల లోపల
ఏదో అపాయం ఉన్నట్లే!

నిదుర
వెలకట్టలేనిది
అంగడిలో లభ్యమవనిది
కొందామన్నా  దొరకనిది
నిదుర ఎంత మధురం!

Sunday, August 4, 2024

నదుల అనుసంధానం /P

అంశం: వర్షం


శీర్షిక: " నదుల అనుసంధానం "

వర్షానికే
మాటలు వస్తే
పరవసించి పోతుంది
భూదేవి
కడుపు నింపమనీ
మనసారా
వేడుకుంటుంది
నేల తల్లి!

"మడి" కట్టకుండా
నారు
మొలకెత్తునా?
"తడి" లేకుండా
పుడమి
పంట నిచ్చునా?
"మేఘాల" మనసు
కరుగ కుండా
వర్షం
కురుయునా?

నింగీ నేల నీరు
వాయువు అగ్ని
వీటిలో
ఏది ప్రకోపించినా
రైతు కంట కారేది
కన్నీటి దారలే !

పంచభూతాల
చిత్ర విచిత్రాలను
అందులో
వర్షపు రాణిని
దర్శించ గలమేమో
కానీ
వర్ణించడం సాధ్యమా ?

స్వాతి చినుకులు
వర్షపు జల్లులు
గాలి వానలు
వడగండ్ల వానలు
చేపల వర్షాలు
కుంభ వర్షాలు
తుఫానులు  సైక్లోన్లు
ఒకటా రెండా ?

వర్షమంటే
ఎవరికుండదు హర్షం!

కానీ
అది సకాలంలో
సరియైన ప్రాంతాలలో
పడితేనేకదా!

"వాన రాకడ
ప్రాణం పోకడ
ఎవరికీ తెలియదన్నట్లు"
వాన ఎప్పుడు 
ఎక్కడ పడుతుందో
ఎవరికి తెలుసు?

సమయానుకూల
వర్షాలు
పంట పొలాల్లో
కురిపించు రైతులకు
వరాల మూటలు !

పట్టన రోడ్లల్లో
పెట్టు జనులను
ముప్పుతిప్పలు
తెప్పించు ఉద్యోగులకు
ట్రాఫిక్ ఇక్కట్లు!

ఎడారులలో
జలాలు శూన్యం
అదే
హిమాలయాలు
మంచు మయం
సముద్ర తీరాలు
జలమయం !

ఎండాకాలంలో
వర్షాలు మొండికేస్తాయి
చలికాలంలో
ముడుచుకుంటాయి
వర్షాకాలంలో
చెలరేగిపోతాయి !

ఏమిటీ
ఈ సృష్టి విచిత్రం
శాస్త్ర వేత్తలకు
విజ్ఞానానికి
అందని రహస్యం!

"అతివృష్టి- అనావృష్టి"
రెండూనూ
జీవకోటికి హాని కరమే"!

దేశం చుట్టూరా
సప్త సముద్రాలు
శతకోటి జీవ నదులు
వాగులు వంకలు
చెరువులు కుంటలు,
చేద బావులు,!

కొన్ని ప్రాంతాల్లోనే 
కుంభ వర్షాలతో
జల ఉత్పాతాలు
మరికొన్ని ప్రాంతాల్లో
గుక్కెడు
త్రాగునీరు దొరుకక
దప్పిక తీరక
గొంతెండి చావటాలు!

కొట్లాటలు
పగలు పంచాయితీలు
సాగునీరు కొరకు
పచ్చని పైరుల కొరకు
పోరాటాలు
కోట్లల్లో
కోర్టుల్లో కేసులు!

నీరేకదా
జీవకోటికి మూలాధారం
అదే లేకుంటే లోకమంతా
హాహాకారం !

మానవుడు
వర్షాలను
కురుపించక పోవచ్చు
వర్షాలను
అదుపు చేయలేక పోవచ్చు
వర్షాలను
మరో ప్రాంతానికి
తరలించ లేక పోవచ్చు!

కానీ
మనిషి తలుచుకుంటే
సాధ్యం కానిదేమిటి ?

త్రాగు నీటిని
సాగు నీటిని
ఎడారు ప్రాంతాలకు
ఎత్తెన కొండల ప్రాంతాలకు
మారు మూల గ్రామాలకు
పీఠభూమి నగరాలకు
చేరవేయ గలడు
సమస్త జీవులకు
ప్రాణ దాత కాగలడు
భూ మండలాన్ని
సస్యశ్యామలం
చేయగలడు!

కులాల మతాల
ప్రాంతాల
భేదాభిప్రాయాలను
ప్రక్కన పెట్టి
దేశాభివృద్ధిని
దృష్టిలో పెట్టుకొని

"నదుల
అనుసంధానం" చేసే
సాహాసం చేయాలి

డ్యాములను నిర్మించాలి
కాలువలను త్రవ్వించాలి
పైపులైన్లను వేయించాలి!

ప్రతి వర్షపు
చుక్కను
ఒడిసి పట్టుకోవాలి
పొదుపుగా ఒడుపుగా
వాడుకోవాలి !

పారే వాగులతో
కాలువలతో
ఇండ్ల నిర్మాణాలతో 
భూగర్భ జలాలను
పెంచాలి
బీడు భూములను సహితం
పంట భూములుగా
మార్చాలి!

లేదంటే జగతిలో
మున్ముందు
త్రాగునీరు కొరకు
సాగునీరు కొరకు
ఆకలి దప్పులకు
జలయుద్దాలు
తప్పవు!

Monday, July 22, 2024

ఎందుకు పురుషులపై వివక్ష?

శీర్షిక: *ఎందుకు పురుషులపై వివక్ష?*

సృష్ఠిలోనా ఉంది 
ప్రకృతిలోనా ఉంది 
సమాజంలోనా ఉంది 
అన్ని  కాలాల యందుంది
పురుషులపై వివక్ష దండిగానుంది!

చెట్టుకు పుట్టకూ స్త్రీ లింగమే
చెరువుకు చేనుకూ స్త్రీ లింగమే
గ్రహాలకు తారలకు స్త్రీ లింగమే
పంచ భూతాలకు స్త్రీ లింగమే
పవిత్ర స్థలాలకూ స్త్రీ లింగమే!


పాపైనా బాబైనా 
జన్మించు నొకే తల్లి గర్భాన
పుట్టినపుడు శిశువులకు
యిచ్చు నొకే చనుబాలు అమ్మ!

పెరిగి పెద్దవారవుతుంటే చాలు
వివక్ష స్పష్టంగా గోచరించు
పాపలపై సానుభూతి
బాబులపై కరుకు తనం!

మగ పిల్లలే బడులకు వెళ్ళాలి
ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాలి
ఆడ పిల్లలు నీడకు సుఖపడాలి
ఎవరో కొందరు తప్పనిసరై చదవాలి!

కొడుకులు సంపాదించిన డబ్బు
జీవితాంతం తల్లి దండ్రులకే
కూతుర్లు సంపాదించిన డబ్బు
భర్తా ,అత్తా మామలకే!

అప్పు చేసి కూతుర్లకు ఘనంగా
వివాహాలు జరిపించాలి
డబ్బు సంపాదించుకున్నాకనే
కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకోవాలి!

కూతుళ్ళ చదువు ,పెళ్ళిళ్ళ అప్పులు
తల్లి దండ్రులు కొడుకులు తీర్చాలి
ఆస్తులలో కూతుళ్ళకు వాటా ఇవ్వాలి
లేదంటే కోర్టులలో కేసులు పెడుతారు!

ఇంట్లో తాత నాణమ్మలున్నా
అవిటి అక్కా తమ్ముళ్ళు ఉన్నా
కూతుళ్ళకు భాద్యత ఉండదు
కానీ ఆస్తులపై సర్వ హక్కు లుంటాయి!

పెళ్ళి కావాలంటే మగవారే
ఉద్యోగస్తులై ఉండాలంటారు
ఉద్యోగం, అదియును సాఫ్టవేర్
కాకుంటే పిల్లనివ్వ నంటారు!

ఆడపిల్ల కంటే మగవారే ఎత్తు ఉండాలి
ఎత్తు లేకుంటే పెళ్ళి చేసుకోరు
మీసాలు రాకుంటే పెళ్ళికి పనికి రారు
ఆడవారికి లేకుంటే అందమైన వారు!

పురుషులకు ఏడ్వడానికి హక్కు లేదు
ఏడుస్తే నవ్వుతుంది సమాజం
స్త్రీలకు ఏడ్వడానికి హక్కు ఉంది
ఏడుస్తే, అది సానుభూతి చూపు తుంది!

పుట్టినింటి నుండి మెట్టినింటికి పోతే
వనితల భాద్యతలు మాయ మవుతాయి
తల్లి దండ్రుల పోషించు భాద్యతలు
పురుషులపైననే పడు తుంటాయి!

పండుగలకు పబ్బాలకు కూతుళ్ళకు
పుట్టింటి వారు కట్నకానుకలు పెట్టాలి
ఆ అప్పులు కొడుకులే తీర్చాలి
కూతుళ్ళకు  ఉండవు భాద్యతలేవీ!

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయాలి
మీసాలు గుండ్లు కొట్టించు కోవాలి
యేడాది వరకు సూతకం పాటించాలి
నెల మాషికాలు,యాడాది మాషికాలు ,
బ్రతికున్నంతకాలం పెట్టాలి తద్దినాలు!

ఆస్తి హక్కులని గొంతెత్తుతారు
చట్టాలను చూపెట్టి భయ పెట్టుతుంటారు
తల్లిదండ్రుల ,అంగ వికలుల,
పోషించుట మా భాద్యత కాందంటారు!

అత్తా మామలు బ్రతికి ఉంటే
ఇక ఆడిస్తారు చూడూ భర్తలను 
బ్లాక్మేల్  చేస్తూ భయ పెడుతుంటారు
భాద్యత గల భర్తలు సర్దుకు పోతుంటారు!

భార్యలకు ఇష్టమైన వాటిని కొంటే
వాటిని యింపుగా చూస్తారు
ఇష్టం లేని వాటిని కొంటే
భర్తలను ఇరుకున పెడుతారు!

అడ్వర్టైజ్ మెంట్లలో కూడా
వనితలకే అధిక పారితోషకం
ప్రభుత్వ స్కీములలోనూ
బస్సులలో ఉచిత ప్రయాణమూ
పడతులకే అధిక సదుపాయం!

ఇంట్లోనూ , ఆఫీసుల్లోనూ
సమాజం లోనూ , కోర్టులలోనూ 
రాజకీయాల్లోనూ ,రాచరికల్లోనూ
మగువల పైననే సాను భూతీ
స్త్రీల పైననే జాలీ దయ కరుణ!

ఆయుష్షు లోనూ అదే వివక్ష
మహిళలు ఎక్కువ కాలం 
జీవిస్తే
పురుషులు తక్కువ కాలం 
జీవిస్తారు 

ఏమిటీ సంస్కృతి , సాంప్రదాయాలు
ఏమిటీ విషమ పరిస్థితి 
ఎందుకీ పురుషులపై వివక్ష
ఇంకెంత కాలం ఈ దుర్వ్యివస్థ!

తెలంగాణా బతుకమ్మ పాట

 "తెలంగాణా బతుకమ్మ పాట"

**************************

బతుకూ బతుకూల బొమ్మ , బంగారు  ముద్దుల గుమ్మ 

మా  భూములన్నీ దోచే నమ్మో , ఈ పేట లోన                                        "బతుకూ "

మొండీ ధైర్యంతో మోహిని, కారులో పోతుంటే

నేతలూ  చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                    "బతుకూ " 

పరుగో పరుగున పారణి , సమ్మెలకూ పోతుంటే

పోలీసులు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                "బతుకూ " 

జోరుగా రాగిణి , హరిణీ  క్షేత్రం పొతుంటే

మీడియా చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                "బతుకూ " 

కట్టూ కథలతో కాలిని , కోర్టూ కు పోతుంటే 

లాయర్లు చుట్టూ ముట్టే నమ్మో , ఈ పేట లోన                                 


బతుకూ బతుకూల బొమ్మ , బంగారు  ముద్దుల గుమ్మ

మా భూములన్ని దోచెనమ్మో, ఈ పేటలోన "2"


మా ఊరు సీ.పద్యం /MY VILLAGE

శీర్షిక: మా ఊరు 

సీ.ప:1

పచ్చని పొలాలు పారేటి వాగులు

ఎత్తైన వృక్షాలు నెచట జూడ

మట్టి గోడలయిండ్లు మానవీయ జనులు

కష్టించు కార్మిక కర్షకులును

కలివిడి మనుషులు కమనీయ మమతలు

పంటలు పండించు కుంట భూమి 

పండుగ లొచ్చిన పరవసం చెందేరు

కష్టాలు వచ్చిన కలిసి యుంద్రు!!


ఆ.వె:

సూరిపెల్లి మాది చురుకైన యువకులు

ఊరు చిన్న దైన జోరు కల్లు 

చుట్టు చెరువులుండు చెట్టుపుట్టలు నుండు

ఓరుగల్లు జిల్ల పోరునెల్ల!!


సీ.ప:2

పల్లెల భూముల్లొ పండించు రైతులు

పాడిపంటలు మెండు పల్లెలందు

కాయగూరలుతాజ కందాయ ఫలములు 

పుష్టిగ పండును పురముబంప 

శ్రమకోర్చు యువకులు శక్తినింపుకొనియు

సిద్ధము నుందురు సేద్యమునకు 

పల్లెసీమలుదేశ పట్టుగొమ్మలు నేడు 

సాధించ వలయును జగతి నంత!!


ఆ.వె:

ప్రకృతి తాండ వించు పల్లెసీమల నందు

స్వచ్ఛ గాలి యుండు జలము నిండు 

అలసట మరిచేరు హాయిగా నుండేరు 

పేద రికములైన పెద్ద మనసు!!

రోజులు మారుతున్నట్లే - రాజులు మారాలి

 శీర్షిక: రోజులు మారుతున్నట్లే - రాజులు మారాలి


సూర్యుడు ఉదయిస్తే

జగతి ప్రకాశిస్తుంది

జగతి ప్రకాశిస్తే

ప్రకృతి పరవశిస్తుంది

భానుడిలో 

స్వార్థం కనబడదు 

అవినీతి వినబడదు

ఆశ్రిత పక్షపాతం చూడలేదు 

సూర్యుడు

అలసి సొలసి అస్తమిస్తే

జగతి అంధకారం 

రాజు పాలిస్తే

జగతి అభివృద్ధి చెందుతుంది

జగతి అభివృద్ధి చెందుతే

మానవాళి పురోగతి చెందుతుంది

మూర్ఖ రాజు పాలిస్తే

రాజ్యం అవినీతి మయం

ప్రజల జీవితాలు అంధకారం 

రోజులు మారినట్లే

రాజులు మారాలి

ఋతువులు మారినట్లే 

బతుకులు మారాలి 

కాలాలు మారినట్లే 

పాలకులు మారాలి 

మూర్ఖ నేతలలో

స్వార్థం ఉంటుంది

అవినీతి ఉంటుంది

ఆశ్రిత పక్షపాతం ఉంటుంది 

అందుకే 

ఐదేళ్ల కొకసారి 

అవినీతి నేతలు మారాలి

స్వార్ధపు నేతలు మారాలి

దోపిడి నేతలు మారాలి 

అప్పుడే కదా తెలిసేది

ఎవరు నీతి పరులో

ఎవరు అవినీతి పరులో

ఎవరు మోసగాళ్ళో

ఎవరు నిజాయితీ పరులో

ఎవరు భూకబ్జా దారులో

ఎవరు భూపంపక దారులో 

ఎవరు లోటు బడ్జెట్ పెంచుతారో

ఎవరు మిగులు బడ్జెట్ పెంచుతారో 


ఎవరు అసమర్ధులను చేస్తారో

ఎవరు సమర్ధులను చేస్తారో

చుట్టాలు ధనికులకే చుట్టాలు

వ్యవస్థలు చట్టాలకే చుట్టాలు

అధికారులు ఏమీ చేయలేరు 

నేతల మార్పుకు ఓటు వేద్దాం

అవినీతి నేతల సాగనంపుదాం!

కత్తి కంటే గొప్పది కలం

అంశం:కలం
శీర్షిక: *కత్తి కంటే కలం గొప్పది*
కవి: మార్గం కృష్ణ మూర్తి
ఊరు: హైదరాబాద్

అవినీతి అంతమొందించ
కరుడు గట్టిన నేతల 
దుమ్ముదులిపేయ
విషనాగుల్లాంటి 
మూడనమ్మకాల 
పార ద్రోలా
తరతరాల
భారతీయ సంస్కృతి
సాంప్రదాయాలను రక్షించ
ప్రకృతి సౌందర్యాలను కాపాడ
దేశం సంపదను సంరక్షించ
శత్రు మూకలను తరిమి కొట్ట
అన్నదాతలను ఆదుకొన
వీరు సైనికులను ప్రోత్సహించ
కత్తులు కటారాలే కావాలా?
ఉద్యమాలే చేయాలా?
యుద్ధాలే రావాలా?

భారతం వ్రాసిన  వ్యాసుడు 
ఏ కత్తి పట్టాడు ,
ఎక్కడ చేసాడు యుద్ధం?

రామాయణం వ్రాసిన వాళ్మీకి 
ఏ ఆయుధం పట్టాడు, 
ఎక్కడ చేసాడు యుద్ధం?

భగవద్గీత వ్రాసిన కృష్ణుడు
ఏ ఖడ్గం చేతబూనాడు
ఎప్పుడు చేసాడు యుద్ధం ?

నన్నయ తిక్కన ఎర్రన
కాలిదాసు  విశ్వనాధుడు 
శ్రీ శ్రీ  దాశరథి గిడుగు కాళోజీ
సినారె ఇలా ఎందరో
ఏ యుద్ధం చేయకుండానే
సాధించారు ఘన విజయాలు!

అహముతో సాధించలేనివెన్నియో
అభిమానంతో సాధించవచ్చు!
అజ్ఞానంతో సాధించలేని వెన్నియో
విజ్ఞానంతో సాధించవచ్చు!
కత్తితో సాధించలేనివెన్నియో
కలంతో సాధించ వచ్చు!

ఆందుకే ,
*కత్తి కంటే కలం గొప్పది*
*దళం కంటే గళం గొప్పది*
*అహం కంటే అభిమానం గొప్పది*
*అజ్ఞానం కంటే విజ్ఞానం గొప్పది*

*ఒక్క సిరా చుక్క లక్షమెదళ్ళను కదిలించగలదన్న*
ఆంగ్ల సామెతను మరిచి పోగలమా!

 

బర్రెలక్క

 శీర్షిక: బర్రెలక్క 


బర్రెలక్క బర్రెలక్క బర్రెలక్క

బర్రెలక్క పేరు మారుమ్రోగుతుంది రాష్ట్రాన 

బర్రెలక్క ఎమ్మెల్యే గా నామినేషన్ వేసింది 

ఊరూ వాడా కదులుతుంది

నేతల గుండెల్లో దడ పుడుతోంది !


శిరీష ఒక నిరు పేదరాలు

తడకల ఇల్లు , తలబోసుకును తావులేదు 

వర్షం కురిస్తే రోజంతా జాగారాలు 

విద్యాధిక యువతి, నిరుద్యోగ పడతి

ఆమెనే బర్రెల కాపరి, బర్రెలక్క!


చేతిలో రూపాయి లేదు

అంగ బలం ఆర్ధిక బలం లేదు 

రాజకీయ అనుభవం లేదు

ఓడి పోతాన్న భయం లేదు!


ఉద్యోగం ఇక రాదని తెలిసింది

బర్రెలను కొనుక్కొని కాస్తుంది

దానిపై ఒక వీడియో చేసింది 

బర్రెలక్క పై కేసు పడింది 

దానితో వస్థలపై అసహనం పెరిగింది

ఎమ్ ఎల్ ఎ గా పోటీ చేస్తుంది!


రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది

నిరుద్యోగ యువత బాసటగా నిలిచింది

ఒంటరి యువతి అని మీడియా కదిలింది 

సహాయ సహకారాలు అందిస్తుంది

గెలుపు కొరకు రాత్రి పగలు కృషి చేస్తుంది!


బర్రెలక్క ధైర్య సాహసాలు

యువతి యువకుల్లో పెరుగుతున్నాయి ఆశలు

గెలిపించుకోవాలనే ధీమాలు

కనబరుస్తున్నారు కొల్లాపూర్ ఓటర్లు!


దక్షిణాది రాష్ట్రాలలో 

అభిమానులు పెరుగుతున్నారు 

సొంత డబ్బుతో ప్రచారాలు చేస్తున్నారు 

దాతలు పెరుగుతున్నారు

సరిపడా డబ్బు సర్ధుతున్నారు

మరేమి కావాలి  గట్టి సాక్ష్యం 

బర్రెలక్క గెలవడం తధ్యం

ఇది సత్యం!

బాలలు - భావి తరాలకు వారధులు

అంశము: బాలల దినోత్సవం 

శీర్షిక: *నేటి బాలలే రేపటి పౌరులు*


ఆ.వె:1

నేటి బాలలగును మేటి పౌరులు రేపు

ప్రేమ కరుణ తోడ పెంచ వలెను 

సత్య ధర్మములను బోధించిన యెడల

గొప్ప వారయేరు మెప్పు పొందు!


ఆ.వె:2

చింత గింజ లమ్మి జీవితం సాగించి 

ఇష్టముగను చదివె కష్టపడుతు

విద్య నేర్చి గొప్ప విజయుడాయెను కలామ్ 

శాస్త్ర వేత్త యాయె దేశమేలె!


ఆ.వె:3

బాల్య మందు శాస్ర్తీ బాధలెన్నొ పడిరి

కష్టపడుతు చదివె కష్ట జీవి

దేశ మంత్రి యాయె ధైర్యంగ పాలించె 

ఎవరు యేమి యగునొ యెవరు నెరుగు ! 

 

ఆ.వె:4

పేద తనము పుట్టి బాధలెన్నొ భరిస్తు

పెద్ద దాయె తాను విద్య నేర్చె

ఊరికుండలేక నుద్యోగములులేక 

బర్రెలెంచు కునెను బర్రెలక్క!


ఆ.వె:5

ప్రేమ తోడ నెహ్రు పిల్లల గోముగ 

చూసే తనివి దీర చోద్యముగను

నెహ్రు జన్మ దినము నెంచిరి సర్కారు 

బాలలుత్సవంబు నెల్ల వేళ!