Monday, December 23, 2024

అడవి జీవులు

అంశం: "అడవి దివిటీలు*


శీర్షిక: *అడవి జీవులు*

ఎత్తెన  *కొండలు*
*కొండల* మధ్య  *సెలయేర్లు*
*సెలయేర్ల*  నానుకుని  *అడవులు*
*అడవుల*  మధ్య బీడు  *భూములు"
*భూముల* లో చిన్న చిన్న  *గుడిసెలు*
*గుడిసెల*  లోనే అడివి  *జీవులు*
*జీవుల* జీవితాలు నేడు *అగమ్య గోచరం*

గుండెలు మండుతున్నయి
బండలు కాలుతున్నయి
కడుపులు మాడుతున్నయి
అగ్ని జ్వాలలు ఎగురు తున్నయి!

స్వాతంత్ర్యం వచ్చి
ఏడు దశాబ్దాలు దాటినా
నేటికీ రవాణా సౌకర్యాలు
విద్యుచ్ఛక్తి సౌకర్యాలు
త్రాగు నీటి సదుపాయాలు
విద్య వైద్య సౌకర్యాలు
మృగ్యమనే చెప్పాలి

తినుబండారాలు కావాలన్నా
విద్య వైద్య అవసరాల కొరకు
అడవి ఉత్పత్తులను అమ్మాలన్నా
పది పదిహేను మైళ్ళు నడవాల్సిందే

ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి
ఎన్నికలప్పుడే నాయకులు కనబడుతారు
ఓటుకో నోటు చేతికి ఇచ్చి ,
ఆ పూటకు పావు షేర్ పోయించి
ఆ రోజు కడుపు నిండా తినబెట్టి
కనబడరు మరో ఐదేళ్ల వరకు
ఇంకెంత కాలం ఈ బానిసత్వం
ఇంకెన్నాళ్ళు  ఈ నిరంకుశత్వం
ఇంకెన్నాళ్ళు ఈ అంధకారం
మరెంకెన్నాళ్ళు ఈ ఈసడింపు
ఇంకెన్నాళ్ళు ఈ ఆటవిక జీవితాలు

ఇక నైనా ప్రభుత్వాలు గుర్తించి
అడివి జీవుల బాధలను తొలగించాలి
రవాణా, విద్య వైద్యం విద్యుత్తు
సదుపాయాలను అభివృద్ధి చేయాలి
వారి భూములను వారు సాగు చేసుకోడానికి
వారి ఉత్పత్తులను వారు అమ్ముకునే విధంగా
గిట్టుబాటు ధరలను నిర్ణయించాలి
రాజ్యాంగ హక్కులను
మన్నెం ప్రజలకు కల్పించాలి

     

Sunday, December 22, 2024

నారి బాగుంటె మనుగడ

అంశం: నారీ
శీర్షిక: *నారి బాగుంటే మనుగడ*

 అంతర్జాతీయ మహిళాదినోత్సవం :
 *మహిళ బాగుంటె మనుగడ* 
(ప్రక్రియ: మణిపూసలు)

01.
సృష్టికి మూలం స్త్రీయే
ప్రకృతికి రూపం స్త్రీయే
స్త్రీ యే కదా భూదేవి
సహన శీలియు  స్త్రీయే!
02.
అమ్మగా ఆలిగానూ
అక్కగా చెల్లిగానూ
ఎన్నో వరుసలతో
అలరించు ప్రేమతోనూ!
03.
అబలలు కాదు సబలలు
చదువులలోనూ మహిళలు
అనేక రంగాలలోను
ముందు నిలిచే తరుణిలు!
04.
ఉద్యోగంలో వివక్ష
జీతం లోనా వివక్ష
గౌరవం లోను తేడా
మరెంతకాలమీ కక్ష!
05.
పిల్లలపై మహిళలపై
అత్యాచారం తమపై
లైంగిక వేధింపులు
పిచ్చి బిచ్చగత్తెలపై!
06.
చట్టాలెన్నో ఉన్నను
కోర్టులెన్నో ఉన్నను

ఎన్ని ఉన్న ఏమిఫలము

సాక్షాలు లేకున్నను!
07.
తమలో మార్పురావాలి
మానవత్వం విరియాలి
స్వేచ్ఛ ఉండటమే కాదు
సాధికారత రావాలి!
08.
ఒక మహా పురుషుడి గెలుపు
ఒక గొప్ప పురుషుడి మలుపు
వెనుక  స్త్రీ హస్తము ఉండు
గుర్తించరు వనిత మెరుపు!
09.
నారి బాగుంటె మనుగడ
లేదంటె ఇంట్లో రగడ
ప్రతి ఒక్కరూ మారాలి
అసభ్య రాక్షస పోకడ!
10.
వేతనం లేకుండా
సెలవులే లేకుండా
చెమటోడ్చుతూ నారీ
బ్రతుకు పనిమానకుండా!

Friday, December 20, 2024

ధైర్యే సాహాసీ లక్ష్మీ

అంశం: గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల


శీర్శిక: ధైర్యే సాహాసీ లక్ష్మీ

*గుప్పెడంత ధైర్యం కొండంత బలాన్నిస్తుంది*

ఈ సృష్టిలో
డబ్బు వలన తృప్తి లభించదు
సంపద వలన తృప్తి లభించదు
విద్య వలన హోదా వలన తృప్తి లభించదు
శారీరక సుఖం వలన తృప్తి లభించదు
కేవలం *విజయం* వలన తృప్తి లభిస్తుంది
*ధైర్యం* మే విజయానికి మూలం
ఆ ధైర్యం మనో నిగ్రహం వలన లభిస్తుంది
గెలుపునకు కావాల్సింది
బలం కాదు, శారీరక దృఢత్వం కాదు
గెలుపునకు కావాల్సింది
నమ్మకం, సంకల్పం, మనో ధైర్యం

నీవు భయపడుతుంటే
ఈగ దోమ కూడా నెత్తిమీద కూర్చుని
సవారి చేస్తాయి

భయపడకుండా
నీవు ధైర్యంగా ఉండి
ఎదురు తిరిగెతే
ఈగ దోమనే కాదు
ఎలాంటి వారైనా తోక జాడించాల్సిందే

ధైర్యం ఒంటరిగా ఉన్నపుడు
కొంత తగ్గవచ్చు
సమైక్యంగా ఉన్నపుడు ధైర్యం
మరింత ఇనుమడిస్తుంది

జింక ఒంటరిగా కనబడినా
దున్నలు ఒంటరిగా కనబడినా
పులి వెంటబడి పంజా విసురుతుంది
పది జింకలు లేదా పది దున్నలు
తిరుగ బడితే  పులి పలాయనం చిత్తగిస్తుంది

*ధైర్యే సాహాసీ లక్ష్మీ* అన్నారు పెద్దలు
ధైర్యం సాహాసాన్ని సంపదను
సకలం సమకూరుస్తుంది
తనకాళ్ళ మీద తాను నిలబడాలన్నా
ఎదుటి వారిని ఎదిరించాలన్నా
ప్రతి మనిషికి ఉండాలి ధైర్యం


ఆకాశంలో విహరించే
పక్షులకు క్రింద పడిపోమనే
నమ్మమే వాటికి ధైర్యం

ధైర్యం సాహసం ఉంటేనే
ఏదైనా సాధించవచ్చు
నమ్మకానికి ధైర్యం తోడైతేనే విజయం

పరిస్థితులను బట్టి కూడా
ధైర్యం ఏర్పడుతుంది
ఒక కోడి తన పిల్లలను
తన్నుకు పోయే గ్రద్ద వచ్చినప్పుడు
కోడి తరిమి కొడుతుంది

పిల్లి తన పిల్లలకు జన్మనిచ్చినపుడు
పిల్లి వంక చూస్తేనే పులిలా మారిపోతుంది
పిల్లలను రక్షించు కోడానికి గాండ్రిస్తుంది
బలం ఉన్నా లేకున్నా ధైర్యం ఉండాలి

ధైర్యం వ్యక్తిత్వం లో భాగం
ధైర్యం ఉంటే ఎలాంటి చీకటినైనా చేధించవచ్చు
నీపై నీకు నమ్మకం, క్రమ శిక్షణ ధైర్యం ఉంటే,
ఎంతటి ఉన్నత స్థాయికైనా సునాయాసంగా
చేరవచ్చు

పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా 

శీర్షిక: *ప్రాణత్యాగి*
(మినీ కవిత: ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)

01.
తెలుగురాష్ట్ర జాతిపిత
పెంచెను రాష్ట్రము ఘనత
ఆమరణ ధీక్షతో
అమరుడయ్యెనూ నేత!

02.
అతి నిరాడంబరుడు
దిశా నిర్ధేశకుడు
ప్రజల చైతన్యపరిచే
వాక్పటిమ గలవాడు!

03.
మద్రాసు రాష్ట్రమున
మార్చినెల పదహారున
పొట్టి శ్రీ రాములు
జన్మించెనతడు భువిన!

04.
తండ్రి గురువయ్య గారు
తల్లి లక్ష్మమ్మ గారు
సాంప్రదాయ కుటుంబము
పెరిగె వినయముగ వీరు!

05.
ప్రత్యేక రాష్ట్రమనేది
జాతి గౌరవం అనేది
శ్రీరాములు  తత్వం
సాధించడమూ అనేది!

06.
ఉన్నత విధ్యాధికుడు
ఇంజినీర్ చదివినాడు
బహు భాషా వేత్తగా
మన్ననలను పొందాడు!

07.
మేటి సంస్కరణ వాది
ఆత్మీయతావాది
వెలకట్ట లేనట్టి
భారతీయ, ప్రతినిధి!

08.
స్థిర లక్ష్యంబు గలవాడు
పరిణత ఉపన్యాసకుడు
ఆంధ్రరాష్ట్రం నిలిపిన
స్వాతంత్ర్యసమరయోధుడు!

09.
తెల్ల దొరలను తరమడము
బానిసత్వం వదలడము
*తెలుగు వారి స్వేచ్ఛనే*
రాములు గారీ లక్ష్యము!

10.
ఉప్పుకై సత్యాగ్రహము
సహాయా నిరాకరణము
గాంధి గారితో పాల్గొనె
క్విట్ ఇండియా ఉధ్యమము!

11.
ఆలోచనలు ఉన్నతము
*మౌనం* వారి ఆయుధము
శ్రీ రాములు ఆశయంబు
*అహింస*,తన సిద్ధాంతము!

12.
ఉచిత విద్య అందాలనె
ఉచిత వైద్యమందాలనె
హరిజన వర్గం లోనూ
ఆనందం విరియాలనె!

13.
ఫలాలందరికి అందిన
స్త్రీలు నిశి తిరుగగలిగిన
రాష్ట్ర పితకుకలుగు శాంతి
ప్రజలు హాయిగ బ్రతికిన!


Wednesday, December 18, 2024

లక్ష్యం

అంశం: *హత్తుకున్న స్వప్నాలు*


శీర్శిక: లక్ష్యం

*"మనిషి తలుచు కుంటే సాధించలేనిది ఏమిటి?"*

*"కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి"*
అంటారు గోప్ప శాస్త్ర వేత్త డాక్టర్ అబ్దుల్ కలాం

ప్రతి మనిషిలో ఒక లక్ష్యం , ఒక స్వప్నం
అంటూ ఏర్పరుచు కోవాలి

ఆ కలను, ఆ డ్రీమ్ ను సాధించడానికి
దార్శనికత కలిగి ఉండాలి
ముందు చూపు ఉండాలి
నిరంతరం కృషి చేయాలి
స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి

కలలు కనడం ఎవరికైనా సాధ్యమే
కానీ స్వప్నాలు సాధికారం చేసుకోవడంలో
ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి
వాటిని అధిగమిస్తేనే లక్ష్యం చేరడం సాధ్యం

ఎవరైనా ఊహించి ఉంటారా
మారుమూల గ్రామంలో జన్మించి
గ్రామీణ వాతావరణంలో పెరిగి, అక్కడే చదివి
చింత గింజలు, వేప గింజలు ఏరుకుని అమ్మి
ఇంటింటా పాల ప్యాకెట్లు, పేపర్లు వేసి
స్కూల్లో వెనుక బేంచీలో కూర్చునే అబ్బాయి
ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త అవుతాడని గానీ
భారత దేశ రాష్ట్రపతి అవుతాడని గానీ
*భారత రత్న*  అందుకుంటాడని గానీ

కానీ , నిరంతర కృషి, పట్టుదల, సంకల్పంతో
తన స్వప్నాన్ని సాధించారు డాక్టర్. కలామ్

స్వప్నాన్ని సాధించడం ఏ వయసులో నైనా
సాధ్యపడుతుంది
పదహారు సంవత్సరాలు స్కూలుకు వెళ్ళకుండా
తండ్రితో చిన్నా చితకా పనులు చేస్తూ
ఆటా పాటలతో కాలం గడుపుతూ
ఆ తర్వాత అయ్యారు , గురుముఖతః
గొప్ప వ్యాకరణ కర్తగా,
తెలుగు‍ నిఘంటువు కర్తగా, కవిగా
పండితుడిగా, సాహితీ వేత్తగా
ఉత్తమ ఉపాధ్యాయుడుగా,
బహు భాషా కోవిదుడుగా రాణించారు
"చిన్నయసూరి* .

లోకజ్ఞానం వచ్చాక
లేదా జీవితంపై అవగాహన ఏర్పడ్డాక
కలలను కనాలి, లక్ష్యం ఏర్పరుచు కోవాలి
డ్రీమ్స్ ను స్వంతం చేసుకోవడానికి
కలలను సాకారం చేసుకోవడానికి
వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ
నిత్యం శ్రమించినట్లైనా
అనుకున్నది తప్పకుండా సాధించవచ్చు

సాధించిన స్వప్నాలను
హృదయానికి హత్తుకుని
సంతోషాలలో తేలిపోవచ్చు
ఆనందాలతో పరవళ్లు తొక్కువచ్చు
 

అలా

అంశం: సిగ్మాలు

శీర్షిక: *అలా?*

*ఎందుకు* ఈ పెళ్లి ఖర్చు
*ఎందుకు* అనిపించడం లేదా నీకు

*ఏమిటి* నీ చేతిలో ఉంది చూడవచ్చా
*ఏమిటి* అంత ధరనా, వృధా ఖర్చు

*ఎలా* ఉంది ఈ కాకి బంగారం గొలుసు
*ఎలా* ఉన్నాయి ఈ వెండి పట్టీలు

*ఎప్పుడు* అటో ఇటో చూస్తావేంటీ
*ఎప్పుడు* ఇలానే ఉంటావా రాధిక

*ఎక్కడ* ఉన్నారు మీ అమ్మానాన్నలు
*ఎక్కడ* ఉన్నారు మా అమ్మానాన్నలు

బంధువులు *ఎవరు* ఇంకా రాలేదేమీ
అయిననూ  *ఎవరు* రాకుంటే ఏమి

*ఇలా* మాట్లాడుతున్నానని  ఏమీ అనుకోకు
*ఇలా* దగ్గరకు రా రాధిక

*చేత* నైనంతనే డబ్బు ఖర్చు చేద్దాం
*చేత* కాకుంటే అది అనవసరం అని అనుకుందాం

నీ *వలె* అందరూ ఉంటే ఆ కుటుంబం స్వర్గం
నీ *వలె* ఎదురు మాట్లాడకుండాకుంటే ఆ జీవితం ధన్యం

*అలా* వెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకుందామా!
*అలా* నే హానీ మూన్ కూడా వెల్దాం, సరేనా!

గూడు చెదిరిన పక్షులు


అంశం: సామాజికం

శీర్షిక: "గూడు చెదిరిన పక్షులు"
(ప్రక్రియ: మణిపూసలు)
(రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం) 

పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
ఆశ పెరిగె మనసులో
దూరమయె కుటుంబం!

                   ఆస్తులొస్తాయని పంపె
                   దూరదేశాలకు పంపె
                    నీవెంతని అహము తోటి
                    భార్య భర్తననిచి పంపె!

త్రాగుడుకు బానీసాయె
చెడు తిరుగుళ్ళుమొదలాయె
పరువు పదవి గాలిలో
ఆస్తులు ఆవిరై పోయె!

                      అందముందని భార్య
                      వయసుఉందని భార్య
                      పక్క వాడితో పోయే
                      సంపదుందని భార్య !
                      

మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
కనుమరుగై పోయెనే!

                      ఉభయులకూఅర్ధమాయె
                       కాలమంత గడిచిపోయె
                       కోర్టులచుట్టుతిరుగుతూ
                       గూడు లేని పక్షులాయె!

సమస్యలూ సహజము
అందరికుండు నిజము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండునెంతొ ఫలితము!
                                   
                        కోర్టులో నలిగె కేసులు
                        గడిచినవి రావు రోజులు
                        ఎంత ఉండి ఏమివచ్చే
                        రోడ్డున పడె కుటుంబాలు!


జీవితంబు ఉత్కృష్టము
సర్దుబాటెంతొ ముఖ్యము
ఆగమాయె బిడ్డ భవిత
కలిసి పోతే గౌరవము!
 

హత్తుకున్న స్వప్నాలు

అంశం: *హత్తుకున్న స్వప్నాలు*


శీర్శిక: *కలనా నిజమా*

*స్వప్నాలు సత్యాలవుతాయా!*
*అవి మనసుకు హత్తుకుంటాయా!*

ఏమో ,
నిజమూ కావచ్చు
అబద్దమూ కావచ్చు
కళ్ళు తెరవగానే
మనసు నుండి ఎగిరి పోవచ్చు

నిద్రలలో రకాలు ఉన్నట్లే
కలలలో పలువిధాలు
ఉంటాయంటారు
మధ్యాహ్నం పడుకున్నపుడు
వచ్చే కలలను "పగటి కలలు'' అంటారు
పగటికలలకు ప్రాధాన్యత ఇవ్వరు

బ్రహ్మముహూర్తంలో వచ్చే స్వప్నాలకు
ఎంతో ప్రాముఖ్యత నట

స్వప్నాలనేవి
మనిషి మానసిక స్థితిని బట్టి
మనిషి ఆలోచనలు బట్టి
చుట్టు పక్కల వాతావరణం బట్టి
కాలాలను బట్టి వస్తుంటాయి

ఏవో ఏవో స్వప్నాలు
అలా అలా మెరుపు తీగల్లా
మబ్బుల్లో తేలినట్లుగా
నిదురలో వస్తుంటాయి
ఏవో గుర్తుంటే కదా
వస్తుంటాయి మదిలో
తళుక్కుమంటాయి
మాయ మవుతాయి

సుస్వప్నాలయితే సంతోషమే
దుస్వప్నాలయితేనే బాధ, బయం
పట్టించుకోకుండా ఉంటేనే మేలు

ఆది జనవరి పద్దెనిమిది,
పందొమ్మిది వందల తొంబది ఆరు
బ్రహ్మ ముహూర్తంలో ఓ పీడ స్వప్నం
ఎవరో అతనిని వెనుకనుండి
షూట్ చేసినట్లుగా
రుధిరం వరుదలై పారుతుంది
ఆ మనిషి చని పోయారు
వెంటనే మేలుకువ వచ్చింది
ఫ్యామిలీ తో పంచుకున్నను

ఉదయం ఆరుగంటలకే
టీ.వి.లలో వార్త
గుండె పోటు తో చనిపోయినట్లుగా
*కలనా నిజమా* ఆశ్చర్యమేసింది
నిజం కాకూడదని
భగవంతుడిని ప్రార్ధించాను

ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు
నటరత్న నందమూరి తారక రామారావు

అందుకే అంటారు
కొన్ని స్వప్నాలు నిజం కావచ్చు
కొన్ని కలలు అబద్ధాలు కావచ్చు
కొన్ని బాధ పెడితే, మరికొన్ని
సంతోషాన్నిస్తాయి

       

గురజాడ అప్పారావు

శీర్షిక : గురజాడ అప్పారావు 

(ముక్తాగ్రస్తాలంకారం లో)

తేనె లొలుకు భాష *తెలుగు బాష*
*తెలుగు భాష* ఎంతో వెలుగు నిచ్చు  *భాష*
*భాష* లన్నింటిలో  *తెలుగు లెస్స*
*తెలుగు లెస్స* అని పలికె *గురజాడ*
*గురజాడ* మహా *గొప్ప కవి*
*గొప్ప కవియే గాదు గురజాడ  *సంఘ సంస్కర్త*
*సంఘసంస్కర్త* గా రచించె  *కన్యాశుల్కం*
*కన్యాశుల్కం* పాత్రలు నేడు ఎందరికో *ఆదర్శం*
*ఆదర్శం* అయినట్టి పాత్రల  చక్కగా మలిచాడు *గురజాడ*
*గురజాడ* తల్లిదండ్రులు వెంకట రామదాసు, *కౌసల్యమ్మ*
*కౌసల్యమ్మ  ముద్దుల తనయుడు *గురజాడ*
*గురజాడ*. సాహితీ కారులలో  ఒక గొప్ప *హేతువాది*
*హేతువాది* గా వారి రచనలు నేటికి *విశ్వజనీయం*
*విశ్వజనీయం* గా పేరుగాంచిన గురజాడ  నవంబర్ 30, 1915 లో *కన్నుమూశారు*
*కన్ను మూసినా* భౌతికంగా , సాహితీ లోకంలో, చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయారు.

               

నేను పుస్తకమైతే

శీర్శిక: *నేను పుస్తకంలో అక్షరమైతే*


*పుస్తకం పూల తోటైతే *
*అక్షరాలు, గుణింతాలు,సున్న*
*విసర్గః లు , తోటలోని పుష్పాలు , పండ్లు*

నేను పుస్తకంలో అక్షరమైతే
అద్భుతాలను సృష్టిస్తా
నేను పుస్తకంలో అక్షరమైతే
అజ్ఞానాన్ని పారదోలుతా
నేను పుస్తకంలో అక్షరమైతే
అవినీతి నాయకుల తరిమి కొడుతా

అందుకే,
*నా అక్షరాలతో రచించబడ్డాను
ఎన్నికల సంస్కరణల దిక్సూచి*
తొణుకుల ప్రక్రియలో
నేను ఒక తెలుగు పుస్తకాన్ని !

నేను మనసున్న దానను
జనుల మనసెరిగిన దానను
స్వార్ధమేది లేదు నాలో
సగటు గుణమున్న దానను!

అవసరాలెరిగిన దానను
అవకాశాలున్న దానను
కులము మతము లేదు నాకు
ప్రాంత భేదమేది లేదు నాకు!

అవసరమైన వారికెల్ల
అందుబాటులో ఉంటాను
జ్ఞానాన్ని పంచడానికి సిద్దంగా ఉన్నాను
అరుగ దీయకు ,కరుగదీయకు నన్ను!

గుడిలోనూ ఉంటాను
బడిలోనూ ఉంటాను
అందరికి విజ్ఞానం అందిస్తాను
అందరి ఆధరణ పొందుతాను!

చిక్కు ముడులెన్నున్నా
టక్కున విప్పుతాను
పక్క పక్కనే ఉంటాను
చక్కగ నేనుంటాను!

విజ్ఞానం పెంచడానికి
టీచర్లను చేయడానికి
డాక్టర్లను చేయడానికి
ఇంజినీర్ల చేయడానికి!

నాయకులను చేయడానికి
సైనికులను చేయడానికి
నావికులను చేయడానికి
అధికారులను చేయడానికి!

లాయర్లను చేయడానికి
శాస్త్ర వేత్తలను చేయడానికి
మానవతా వాదులను చేయడానికి
ఆధ్యాత్మిక వాదులను చేయడానికి!

యోధులను చేయడానికి
యోగులను చేయడానికి
సమస్యల పరిష్కరించడానికి
నేను భగవద్గీత పుస్తకమైత
నింగి నేలను అనుసంధానం చేస్తా!

పుస్తకం హస్త భూషణం
చరిత్రలన్నీ పుస్తకాలలోనే నిక్షిప్తం
బావి తరాలకు పుత్తం ఆదర్శం
పుస్తకం సమస్త విజ్ఞాన భాండాగారం!

 

Saturday, December 14, 2024

పాట: ట్యూన్ లిరిక్స్

ట్యూన్ లిరిక్స్:

పల్లవి:-

అతడు:-

సుందరమైనది నా చెలి
సువిశాలమైనదీ తన హృదయం
కమనీయం  ఆమె అందం
               ||సుందరమైనది||
చరణం:-
ఆకాశంలో పక్షుల పరుగులు
అందమైన పచ్చని తరువులు
ఎత్తైన శిఖరాలు ఎటు చూసినా
కనుల విందుచేసే కొలను లోని చేప పిల్లలు
               ||సుందరమైనది||
చరణం:-
చిరుగాలిలో ఒళ్ళు పులకరించె
చెలి కోసం ఎదురు చూసే నా హృదయం
కనుచూపులో కానరాకుండే
చెలిమి కోసం వస్తుందిలే
             ||సుందరమైనది||
చరణం:-
సప్త సముద్రాల హోరు జోరు
విన్యాసం చేస్తుండే కనుల ముందర
కట్టి పడేశాయి నన్ను కదలకుండా
కనికరం లేకుండే నా చెలి గుండెలో
తేలియాడనా తెమ్మెరల దొంతరలలో
               ||సుందరమైనది||
చరణం:-
పాయపాయలుగా పారు నదీ జలాలు
నిశ్శబ్దంగా నుండీ పోయే నన్ను జూసి
పక్షుల కిలకిలా రావాలు మూగబోయే
సంధ్యావేళ దాటిపోయే
కాన రాదాయే నా అందాల సుందరి
             ||సుందరమైనది||
 

Wednesday, December 11, 2024

గీత సారం /భగవద్గీత

అంశం: గీతా జయంతి

శీర్శిక: *గీతా సారం*

శ్లోకం: *పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ*
           *దుష్కృతామ్! ధర్మ సంస్థాపనార్ధాయ*
           *సంభవామి యుగే యుగే!*
                   (4 అధ్యాయం 8 వ శ్లోకం)

*భగవద్గీత ఒక కల్పతరువు*
*విశ్వ మానవాళికి ఆది గురువు*
*జీవిత అనుసంధానానికి సందేశాత్మక సింధువు*

గీతను బోధించిన శ్రీకృష్ణుడు జగద్గురు
*వందే కృష్ణం జగద్గురుం*

మహాభారతంలో కురుక్షేత్రం సందర్భంగా
శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను
ఉపదేశించిన రోజే  "గీతా జయంతి"
భగవద్గీత సారాంశంమే *గీతా సారం!*

భగవద్గీత,  కృష్ణ పరమాత్మ అర్జునునకు
అందించిన జ్ఞానప్రభోదమే కాదు
గీత - కుల మత జాతి ప్రాంత ఖండాలకు
అతీతంగా విశ్వ జనులందరికీ సమస్యా
పరిష్కార మార్గదర్శి!

ఒక వైద్యుడు రోగి జబ్బులను నయం చేస్తే
ఒక న్యాయవాది మనిషిని శిక్షల నుండి రక్షిస్తే 
ఒక జ్యోతిష్యుడు శుభాశుభాలను తెలియజేస్తే 
భగవద్గీత సమస్యలనే రాకుండా చేస్తుంది!

ఎలాంటి సమస్యలతో సతమతమౌతున్నా 
మానసిక బాధలతో కృంగి పోతున్నా
భగవద్గీత మనసుకు స్వాంతన నిస్తుంది
మనిషిని నవనవోన్మేషం దిశగా నడిపిస్తుంది!

జలముతో శారీరక మాలిన్యం తొలగినట్లే
గీతాధ్యయనంతో మానసిక మాలిన్యం
నశించి పోతుంది

"తల్లి చనుబాలకంటే శ్రేష్టమైనది భగవద్గీత"
అంటారు వినోబా భావే

శ్రీ కృష్ణుడు జూదంలో శకుని, పాండవులను
మోసంతో ఓడించినపుడు
శకునిని దండించే ధైర్యం లేక కాదు
ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినపుడు
కౌరవులను శిక్షించే శక్తి లేక కాదు
కురుక్షేత్ర యుద్ధంలో, అధర్మానికి పాల్పడిన
కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టే మార్గం లేక కాదు

ఏదైనా సమస్య పక్వానికి రావాలి
సమస్తలోకానికి దాని పర్యావసానం తెలియాలి
ధర్మాధర్మాలు సత్యం సమాజానికి తెలియాలి
మంచి ఏదో చెడు ఏదో అనుభవం లోకి రావాలి 
ఒక మానవుడిగా సమస్యలను ఎదుర్కోవాలి
అని భావించాడు కృష్ణ పరమాత్ముడు!

కురుక్షేత్ర సంగ్రామంలో,
అటువైపు తండ్రులు, అన్నదమ్ములు,
గురువులను తనవాళ్ళను చూసాక 
హృదయం ద్రవించి పోగా
అర్జునుడు దుఃఖితుడై అస్త్ర శస్త్రాలను
వదిలేసి నేను యుద్ధం చేయనంటూ
విషాద వదనంతో

నా వాళ్ళను సంవరించాక సాధించిన
రాజ్యాలు  భోగాలు నాకు వలదని 
రథం లోనే ధనుస్సును జారవిడవగ!

అప్పుడు రథ సారథి అయిన శ్రీ కృష్ణుడు
అర్జునుడికి గీతోపదేశం చేసే!

"పార్ధా! యుద్దాన్ని వారే కోరుకున్నప్పుడు
బంధుత్వం ఆలోచించడం తగదు"
నీ పైకి యుద్దానికి వచ్చిన వారు బంధువులేల?

"చావు పుట్టుకలు సహజం. 
పుట్టిన వారు ఏ రూపం ధరిస్తారో తెలియదు
అయినా నీ బంధువుల శరీరమే నాశనమౌతుంది
ఆత్మ కాదు, అందుకు విచారించడం తగదు
ధర్మాన్ని నిర్వర్తించడం లోనే నీకు అధికారం
కానీ దాని కర్మఫలాన్ని అనుభవించడంలో 
లేదు నీకు అధికారం"

అంటూ యుద్దానికి  సన్నద్ధం చేసి
అధర్మ పాలకులైన దుర్మార్గులైన కౌరవులను
కురుక్షేత్ర సంగ్రామంలో సంవరించడానికి
యుద్ధంలో గెలుపుకు మూల కారకుడై
విశ్వ మానవాళి జీవిత సమన్వయానికి
గొప్ప సందేశం అందించాడు
శ్రీ కృష్ణ భగవానుడు, అదియే గీతా సారం!

వృత్తి - ప్రవృత్తి

అంశం:: విజ్ఞతల విత్తు నాటుదాం

శీర్శిక: వృత్తి - ప్రవృత్తి పైన ప్రేమ

*వృత్తియే దైవం ప్రజలే దేవుళ్ళు*
కావల్సిందల్లా చేసే వృత్తి ప్రవృత్తి పైన ప్రేమ బాధ్యత
అంకితభావం

*సంకల్పం ఉంటే సాధించలేనిదేముంటుంది
*విజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతే
విషాదం ఎందుకుంటుంది*
*వెలుతురు మొలిచిన చోట చీకటి ఎందుకు*
*ఉంటుంది*

భూమి ఎంతో విశాలమైనది
ప్రతి మనిషి అందులో పది విత్తనాలు నాటాలి
ఒకటి పుచ్చి పోవచ్చు ఒకటి వాయుదేవుడు
ఎత్తుకుని పోవచ్చు మరొక దానిని పక్షి తినవచ్చు
మొక్కమొలిచాక ఒక దానిని మేక తినవచ్చు
ఇంకో మొక్క సాలు దున్నినపుడు పోవచ్చు
చివరికి ఐదు చెట్లైన మిగిలిన
అవి పెరిగి కోట్లాది సంపదను చేకూర్చు

ఈ ప్రపంచంలో అవకాశాలు ఎన్నో
ప్రతి మనిషి అలా తమ వృత్తినే గాకుండా
ఆదాయ ప్రవృత్తులను ఎంచుకుంటే
డబ్బుకు  ఆనందానికి కొదువ ఉండదు
సుఖాలకు సంతోషాలకు హద్దు ఉండదు

టీచర్ వృత్తి అయినపుడు, షేర్ మార్కెట్,
మూచువల్ ఫండ్స్, ఏజెంట్లు, రియలెస్టేట్
సలహాదారు, యూట్యూబ్ ఛానెల్స్, ట్యూషన్లు
నటనలు, నృత్యం, పాటలు వ్రాయడం, మరెన్నో
ప్రవృత్తులవుతాయి

వృత్తి ఆదాయం అనేది అరువది యేండ్ల వరకే
ప్రవృత్తి వనరులు నూరేళ్ళ వరకూ ఉంటుంది
అంతేకాదు , అనంతకాలమనే చెప్పాలి
ఇలా వృత్తి ప్రవృత్తులను ఎంచుకోవడమే విజ్ఞత
కాస్త వివేచన ఉంటే చాలు

*మనం నిద్రపోయినప్పుడు కూడా*
*మన సంపద పెరుగాలి అంటారు*
- వారెన్ బఫెట్
విజ్ఞానం సమాజ వికాసానికి దారితీయాలి
కానీ మానవ వికారానికి దారి తీయకూడదు
మోసాలకు, స్కాములకు పాల్పడకుండా
ఉంటే మేలు

           

విజయం /యాక్సెప్ట్ మై ఛాలెంజ్

*ప్రక్రియ : * యాక్సెప్ట్ మై ఛాలెంజ్ *

 కవిత
  శీర్షిక: విజయం 

భయమెందుకు నీకు మిత్రమా
మిత్రమా కష్టసుఖాలు ఎవరికైనా సహజం
సహజమైన దాని గురించి చింతించ తగదు మిత్రమా
మిత్రమా , నీకు విద్య ఉంది వినయం, తెలివి ఉంది
తెలివితో పాటు  అన్నీ ఉన్నాయి

నీవే భగవంతుడివి కావాలి ఎందుకంటే 
ఎందుకంటే నీలో శక్తి ఉంది యుక్తిఉంది
యుక్తిఉండటమే కాదు దైవానుగ్రహం
దైవానుగ్రహంతో పాటు గ్రహ బలం
బలమంటే గుర్తుకు వచ్చింది ధృడంగా నున్నావు

అన్నీ తెలిసి అభాగ్యుడివిగా జీవించకు
జీవించడమనేది ఒక కళ
కళలు అరువది నాలుగు అంటారు
అంటారు కాదు అది నిజమే

నిజాన్ని ఎప్పుడూ నీరు గార్చకు
కార్చావో ఇక నీవు ఏమి సాధించలేవు
సాధించడమనేది మనిషి జీవితంలో గొప్ప విజయం
విజయం వలననే అత్యంత తృప్తి కలుగుతుంది


నేనిచ్చే ఛాలెంజ్

జీవిత లక్ష్యం
సాధించలేనిది ఏమీ లేదు
పుట్టుకకు అర్ధం ఉండాలి
ఈర్ష్య అసూయలు


Note :పై పదాలతో అంత్యానుప్రాస అలంకారం  కవిత రాయండి

పర్యాయ పదాలు:
జాలి: దయ, కరుణ
కన్నీరు: బాష్పము, అశృవు
ఇష్టం: మక్కువ, అభిరుచి
మానవుడు: మనిషి, నరుడు

Tuesday, December 10, 2024

రాజకీయ చతురత

 అంశం: నైతిక రాజకీయం

శీర్శిక: *రాజకీయ చతురత*

ఇంటిపై  పన్ను
పెట్రోల్ పై పన్ను
డిజిల్ పై పన్ను
అవినీతి నాయకులపై ఏది పన్ను?

త్రాగే నీటిపై పన్ను
తినే తిండిపై పన్ను
త్రాగే సిగరెట్లపై పన్ను
అవినీతి సర్కారుపై ఏది పన్ను?

ఆల్కాహాల్ పై పన్ను
ఉద్యోగులపై వృత్తి పన్ను
వేతనాలపై ఆదాయ పన్ను
రాజకీయుల జీతాలపై ఏది పన్ను?

ఉద్యోగుల బోనస్ పై పన్ను
ఉద్యోగుల బత్యాలపై పన్ను
ఇతర ఆదాయాలపై పన్ను
రాజకీయుల ఆదాయాలపై ఏది పన్ను?

వ్యాపారస్తుల ఆదాయాలపై పన్ను
ఆదాయపన్నులపై సర్ చార్జ్
ఆదాయపన్నులపై సెస్సు 
ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏది సెస్సు?

టానిక్, మందుబిల్లలపై పన్ను
హాస్పిటల్ బిల్లులపై పన్ను
హాస్పిటల్ రూములపై పన్ను
ప్రభుత్వ అలసత్వంపై ఏది పన్ను?

ఆల్కాహాల్ పై టాక్స్
రహదారులపై టోల్ టాక్స్
వెహికిల్స్ పై టాక్స్
అక్రమ ఆర్జనపై ఏది టాక్స్?

రాంగ్ రూట్ లో వస్తే చలాన్
త్రాగి డ్రైవ్ చేస్తే చలాన్
ఆక్సిడెంట్ జరుగుతే చలాన్
ఉద్యోగుల లంచాలపై ఏది చలాన్? 

వేహికిల్ రోడ్డుపై ఆగిపోతే ఫైన్
ఇన్స్యూరెన్స్ లేకపోతే ఫైన్
పొల్యూషన్ రషీదు లేకపోతే ఫైన్
రోడ్లు బాగుచేయించక పోతే ఏది ఫైన్?

నీటి బిల్లులపై పన్ను
కరెంట్ బిల్లులపై పన్ను
సినిమా టికెట్లపై పన్ను
చట్టాల నమలు చేయనివారిపై ఏది పన్ను?

కిరాణా షాపులపైనా పన్ను
ప్యాకింగ్ తో కూడిన ప్రతి వస్తువుపై పన్ను
ఇన్స్యూరెన్స్ ప్రీమియంపైనా పన్ను
రాజకీయుల పెన్సన్లపై ఏది పన్ను?

పెట్టుబడులపై పన్ను
స్కూలు ఫీజులపై పన్ను
కూడబెట్టుకున్న పొదుపుపై పన్ను
అమలు చేయని హామీలపై ఏది పన్ను?

నల్ల ధనంపై ఏది పన్ను?
భూకబ్జాలపై ఏది పన్ను?
బినామీ ఆస్తులపై ఏది పన్ను?
ఏది రాజకీయ నైతికత?
రాజకీయ చతురత తప్పా!