Monday, December 23, 2024

ఆత్మాభిమానం - అహంకారం

అంశం: అహంకారం

శీర్శిక: *అహంకారం - ఆత్మాభిమానం*

*అహంకారానికి ఆత్మాభిమానానికి*
*మధ్య తేడా కేవలం వెంట్రుక వాసి*
*మాత్రమే"*

అతి ఏదైనా అనర్ధమే
మితమేదైనా అమృత తుల్యమే

పరిమిత అహంకారం లేకుండా
అభివృద్ధి లేదు
పరిమిత ఆత్మాభిమానం లేకుండా
వికాసం లేదు

భార్యా భర్తల మధ్య సంబంధాలు
తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు
బంధుమిత్రుల మధ్య సంబంధాలు
బెడిసి కొట్టడానికి కారణం
అధిక ఆత్మాభిమానం అధిక అహంకారం

ఆత్మాభిమానం అధికమైనా
అహంకారం అధికమైనా
అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగిరి
వ్వవస్థలు భస్మీపఠలం అవుతాయి

ఆత్మాభిమానం కోల్ఫోయావంటే
ఎదుటి వారికి బానీసయినట్లే
ఆత్మాభిమానం అహం గానీ లేదంటే
నీలో రోషం చీము నెత్తురు లేనట్లే

ఆత్మాభిమానం కోల్పోయిన వారు
సోమరులుగా తయారవుతారు
అహంకారం ఇగో పెరిగిన వారి వలన
వ్యవస్థలో సమాజంలో కుటుంభాలలో
కోపాలు తాపాలు మనస్పర్థలు పెరిగి
వినాశనానికి దారి తీస్తాయి

ఆత్మాభిమానం తగ్గినా అహంకారం పెరిగినా
రెండూ తమకు తమ కుటుంబాలకు
వ్యవస్థలకు తీరని నష్టం చేకూరుస్తాయి

ఆత్మాభిమానం వ్యక్తిత్వంలో అంతర్భాగం
పరువు ప్రతిష్టలలో ముఖ్య భూమిక పోషిస్తాయి
ఆరోగ్యంగా ఉన్నంతకాలం
ఊరికినే కొడుకు కోడలు వద్ద ఉండాలన్నా
కూతురు అల్లుడి ఇంట్లో ఉండాలన్నా
ఏదో ఒక మాట పడాలన్నా ఆత్మాభిమానం
అడ్డు వస్తుంది

పిల్లలు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా
ఇష్టమైన చదువులు చదువకున్నా
కొడుకులు బిడ్డలు తల్లిదండ్రుల మాటను
లెక్క చేయకున్నా
ఇరుగు పొరుగు సూటిపోటి మాటలన్నా
ఆత్మాభిమానం అడ్డు వచ్చి
ఆత్మ హత్యలు చేసుకున్న వారు లేకపోలేదు

నిన్నటి తరంలో ఉన్నంత ఆత్మాభిమానం గల
జనులు నేటి తరంలో తగ్గారు
నేటి తరంలో ఉన్నంత ఆత్మాభిమానం
గల ప్రజలు రేపటి తరంలో చాలా తగ్గిపోతారు
స్వార్ధం సంపాదన సోమరితనానికి
అలవాటు పడిన నరులు ఆత్మాభిమానం
కోల్పోతున్నారు ఇది చాలా ప్రమాదకరం

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా
తెలిసిన వారే జీవితంలో విజయం సాధిస్తారు
అలానే ఆత్మాభిమానంలో కూడా
సల్లుబిగులు ఉండాలి

ఆత్మాభిమానం పౌరుషం రేషం
పూర్తిగా లేకుండా బానిసలుగా
జీవించు వారు బ్రతికినా
మరణించినట్లుగానే భావిస్తారు!

          

No comments: