Monday, May 12, 2025

కలలు కనాలి సాకారం చేసుకోవాలి

అంశం: కలల ఆరాధన

శీర్శిక: కలలు కనాలి సాకారం చేసుకోవాలి

అడుగకుండా అమ్మైనా అన్నం పెట్టదు
ఆరాధించ కుండా దుర్గా దేవైనా ఆశిస్సులు అందించదు!

కలలు మనిషి అభివృద్ధికి సోపానాలు
కలలు కనాలి సాధన ఆరాధన చేయాలి
వాటిని సాకారం చేసుకోవాలి
అంటారు భారత రత్న డా.అబ్దుల్ కలాం!

ప్రతి మనిషికి ఒక జీవిత లక్ష్యం ఉండాలి
లక్ష్యం పై పూర్తి విశ్వాసం పెంచుకోవాలి
నిత్యం ఆలోచించాలి స్వప్నించాలి 
సంబంధించిన సమాచారం సేకరించాలి!

పట్టుదలతో సాధన ఆరాధన చేయాలి
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
పరిసర లోకజ్ఞానం పెంచుకోవాలి
తత్ఫలితంగా కలలు సులభం అవుతాయి!

తాహత్తుకు తగ్గ కలలనే కనాలి
కానీ పగటి కలలు కాకూడదు!

ఒక నిరుపేద
తెల్లారేసరికి అంబానీ కావాలనుకోవడం
ఆకాశహార్మ్యాలు నిర్మించాలనుకోవడం
చంద్రమండలంలో విహరించారు కోవడం
సాధ్యం కాకపోవచ్చు!

అలాఅని కొట్టి పారేయలేము
అట్టడుగు జీవితం గడిపిన డా.అంబేద్కర్
రాజ్యాంగ కర్తగా భారత రత్న అయ్యారు
పేపర్లు పాలపాకెట్లు పెంచే డా.అబ్దుల్ కలాం
గొప్ప సైంటిస్ట్ రాష్ట్ర పతి అయ్యారు
టీ అమ్ముకునే శ్రీ నరేంద్ర మోడీ
దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తున్నారు!

కలలపై అప నమ్మకాలు పెట్టుకోకూడదు
లక్ష్యాలను తేలికగా తీసుకోకూడదు!

ఒకరిద్దరికి కొన్ని సంఘటనలు మినహాయిస్తే
కలలు కనకుండా ఆరాధన చేయకుండా
ప్రణాలికలు వేయకుండా పట్టుదల లేకుండా
కృషి చేయకుండా సాధన చేయకుండా
లక్ష్యం చేరుకోవడం విజయం సాధించడం అసాధ్యం!

No comments: