Wednesday, April 16, 2025

అక్షరమే ఆయుధం P

*అంశం: *అక్షరం*

శీర్షిక: *జగతికి వెలుగు అక్షరం* 

*అక్షరం* రెండు వైపులా పదునైన ఖడ్గం
రావణుడి చేతిలో దివ్యాస్త్రాలు కాకుండా
అక్షరం రాముడి చేతిలో రామబాణంలా
అందరి మన్ననలు పొందగల్గాలి!

కుసుమాలను దారం ఆధారంతో
పూల గుత్తులను మాలలుగా అల్లినటుల!

అక్షరాలను తెల్లని కాగితంపై 
పేర్చి వ్రాసి ముద్రించి పదాలు గాను 
వాక్యాలుగానూ ప్రయోగించ వచ్చు
అక్షరం సాక్షిగా తారక మంత్రాలను
సంధించవచ్చు!

తిమిరంలో చిరు దివ్వెలా 
*జగతిలో వెలుగుకు అక్షరమే సాక్షి* 
అక్షరమే లేకుంటే మనుషులు
పశుపక్షాదులుగా మారే వారిమేమో 
అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని 
ప్రసాదించేది అక్షరమే! 

ప్రేమను పంచేది అక్షరమే 
శూలంలా గాయం చేసేది అక్షరమే 
మనిషి తన మనో భావాలను
వ్యక్త పరుచడానికి ఉపయోగ పడేది అక్షరమే!

విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి 
టీచర్లు  డాక్టర్లు  ఇంజినీర్లు అవడానికి 
లాయర్లు శాస్త్రవేత్తలుగా రాణించడానికి
ప్రజలను నవనవోన్మేషంతో నడిపించడానికి
తరతరాల చరిత్రలను నిక్షిప్తం చేయడానికి 
అక్షరం సాక్షీభూతంగా నిలుస్తుంది!
 
అక్షరం సంస్కృతి సాంప్రదాయాలను
ప్రకృతిని ధర్మ సూత్రాలను పరిరక్షించే
రేపటి తరాలకు అందించే వారధి రథసారధి
అక్షరమే లేకుంటే నేడు విశ్వమంతా శూన్యమే!

No comments: