Thursday, April 24, 2025

నచ్చిన కవి విశ్వ కవి శ్రీ శ్రీ

అంశం: మీకు నచ్చిన కవి


శీర్షిక: విశ్వ కవి శ్రీ శ్రీ

అక్షరాన్ని అలవోకగా ఆయుధంగా చేసుకుని
సాహిత్యాన్ని నడిపిన సాహాస కవి
అల్ప అక్షరాల నుండి అనల్ప భావాలను
తీసిన గొప్ప కవి శ్రీరంగం శ్రీనివాసరావు!

కష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుని
విప్లవ సాహిత్యంలో తేలి యాడుతూ
శ్రమ జీవులలో ధైర్యం నింపుతూ
*కొంత మంది యువకులు ముందు*
*తరం దూతలు* అంటూ
కలం పట్టి నడిపించె కార్మిక కర్షక
తాడిత పీడిత వర్గాల *అభ్యుదయ* కవి!

అభాగ్యుల గుండెల్లో రగిలే మంటల నెరిగి
శ్రమైక జీవన సౌందర్యానికి సాటిలేనిదేదీ లేదని
దగాపడిన తమ్ముళ్ళ కొరకు చివరి వరకు
పోరాడిన సాహాసోపేతుడు విశ్వకవి శ్రీ శ్రీ!

గ్రాంధిక భాష ఛందోబద్ధ సాహిత్యాన్ని వదిలి
గురజాడ బాటలో నడుస్తూ తాను
*మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు*
*పదండి పదండి తోసుక పైపైకి* అంటూ
యువతరాన్ని ఉర్రూతలూపిన విప్లవకవి శ్రీ శ్రీ 

*కుక్క పిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా*_
*హీనంగా చూడకు దేన్నీ!*
*కవితామయమేనోయ్ అన్నీ!* అంటూ 
కుండ బద్దలు కొడుతూ 
*మహా ప్రస్థానం* తో ఈ శతాబ్దం నాదే
అని ప్రకటించిన ఏకైక కవి శ్రీశ్రీ 



No comments: