Monday, February 3, 2025

బతుకమ్మ ఉయ్యాల పాట

తేది:02.10.2014

బతకమ్మ ఉయ్యాల పాట:

************************

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో - బంగారు బతకమ్మ ఉయ్యాలో "2"

రజాకార్లతో నాడు ఉయ్యాలో - రగిలి పోయే తెలంగాణా ఉయ్యాలో

తెలంగాణా ప్రజలను ఉయ్యాలో - తరిమి తరిమి కొట్టిరి ఉయ్యాలో

ఆడ పడుచులను ఉయ్యాలో - అవమాన పరిచిరి ఉయ్యాలో

చిన్న పిల్లలను ఉయ్యాలో - చితక బాదిరి ఉయ్యాలో

రాణి రుద్రమదేవి ఉయ్యాలో - ప్రతాప రుద్రుడు ఉయ్యాలో

ఓరు గల్లు నుండి ఉయ్యాలో - పాలించే రాష్ట్రాన్ని ఉయ్యాలో

సమ్మక్క సారక్కలు ఉయ్యాలో - చీల్చి చెండాడిరి ఉయ్యాలో

చాకలి ఐలమ్మ నాడే ఉయ్యాలో - చావ బాదే రజాకార్ల ఉయ్యాలో 

కొమురం భీమ్ ఉయ్యాలో - కొరివినే అంటించే ఉయ్యాలో

దాశరధి కృష్ణమా చార్య ఉయ్యాలో - కోటి రతనాల వీణ అనే ఉయ్యాలో

ప్రజా కవి కాలోజి ఉయ్యాలో - కవులకు ఊపిరి పోసే ఉయ్యాలో

కొండా బాపూజీ ఉయ్యాలో - బాంబులే వేసిరీ ఉయ్యాలో

కసాయి రాజాకార్లపై ఉయ్యాలో - కన్నెర్ర చేసే 'పటేలు' ఉయ్యాలో

'పటేలు' ఆక్షన్తో ఉయ్యాలో - తోక ముడిచే రజాకార్లు ఉయ్యాలో

ఆంద్రుల పాలనతో ఉయ్యాలో - తెలంగాణా అంధ కారమాయే ఉయ్యాలో 

అన్ని రంగాల్లోనూ ఉయ్యాలో - అభివృద్ధి కుంటు పడే ఉయ్యాలో

పది జిల్లాలలోను ఉయ్యాలో - ప్రజలు పస్తులే ఉండిరీ ఉయ్యాలో

కూడూ గుడ్డా కొరకు ఉయ్యాలో - ప్రజలు చెట్లల్లో దాగిరి ఉయ్యాలో

విద్యా ఆరోగ్యం కొరకు ఉయ్యాలో - విల విలా లాడిరి ఉయ్యాలో

చుట్టూ గోదావరే ఉన్నా ఉయ్యాలో - చెలుకలెండి పోయే ఉయ్యాలో

నదులెన్నో మన కున్నా ఉయ్యాలో - త్రాగు నీరే లేక పాయే ఉయ్యాలో

జయ శంకర్ ఊతంతో ఉయ్యాలో - జై తెలంగాణా నినాదాలతో ఉయ్యాలో

అపర గాంధీ చంద్రన్న ఉయ్యాలో - అహింసా విధానంతో ఉయ్యాలో

ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉయ్యాలో - ఉద్యమాలే చేసిరి ఉయ్యాలో

తెలంగాణా విముక్తికి ఉయ్యాలో - దీక్షలే చేసిరి ఉయ్యాలో

చావు బ్రతుకుల మద్య ఉయ్యాలో - చంద్రన్న నిమ్స్ లో చేరే ఉయ్యాలో

ఆత్మ త్యాగాలతో రాష్ట్రం ఉయ్యాలో - దద్దరిల్లి పాయే ఉయ్యాలో

పదమూడేండ్లల్లో ఉయ్యాలో - పన్నెందొందల మంది ఉయ్యాలో

బలి దానాలు చేసిరి ఉయ్యాలో - పుత్ర శోకం పెట్టిరి ఉయ్యాలో 

ఎందరో ఉద్యమ కారులతో ఉయ్యాలో - ఎగిసి పడే తెలంగాణా ఉయ్యాలో

కళా కారుల ఆటలతో ఉయ్యాలో - కదిలి వచ్చిరి జనులు ఉయ్యాలో

కళా కారుల పాటలతో ఉయ్యాలో - కలిసి వచ్చిరి జనులు ఉయ్యాలో

ఆహ్మదలీ నీడ లోన ఉయ్యాలో - తెలంగాణా మొగ్గ తొడిగే ఉయ్యాలో

కోదండ రామ్ అండ ఉయ్యాలో - కొండంత బలమాయే ఉయ్యాలో

కె టీ ఆర్ మాటలు ఉయ్యాలో - గెలుపు తూటాలాయే ఉయ్యాలో

హరీషు ఎత్తులతో ఉయ్యాలో - ఆంద్రులు బిత్తర పోయిరీ ఉయ్యాలో

జాగృతి కవితమ్మ ఉయ్యాలో - చాప కింద నీరులా ఉయ్యాలో

ముల్లోకాలు తిర్గి ఉయ్యాలో - ముచ్చెమటలు పుట్టించే ఉయ్యాలో

శ్రీనివాసు లందరూ ఉయ్యాలో - సమర సింహాలైరి ఉయ్యాలో

నాయిని నరసింహ రెడ్డి ఉయ్యాలో - నార సింహుడాయే ఉయ్యాలో

రాజేందర్ రణంతో ఉయ్యాలో - జనమంతా కదిలొచ్చే ఉయ్యాలో

వినయ భాస్కర్ వినయంతో ఉయ్యాలో - ఓరుగల్లు కదిలి వచ్చే ఉయ్యాలో

దేవీ ప్రసాద్ ధీరత్వంతో ఉయ్యాలో - ఉద్యోగులేకమయిరి ఉయ్యాలో 

కన్నె ప్రభాకర్ ఉయ్యాలో - జనుల కలుపుకుంటూ పోతూ ఉయ్యాలో

రాజయ్య రాకతో ఉయ్యాలో - ఉద్యమానికి షోకు వచ్చే ఉయ్యాలో

వినోదన్న విజ్ఞ్యతతో ఉయ్యాలో - ఉద్యమం ఉడుకెక్కే ఉయ్యాలో

ఉద్యమాల పోరుతో ఉయ్యాలో - సకల జనుల సమ్మెతో ఉయ్యాలో 

స్తంభించే పాలన ఉయ్యాలో - కేంద్రమే దిగి వచ్చే ఉయ్యాలో

ఎట్టకేలకు కేంద్రం ఉయ్యాలో - దిగి వచ్చి, బిల్లు పెట్టె ఉయ్యాలో 

సోనియా మోడీలతో ఉయ్యాలో - తెలంగాణా మనకొచ్చే ఉయ్యాలో

జూను రెండవ రోజున ఉయ్యాలో - రెండు వేల పదునాల్గున ఉయ్యాలో

తెలంగాణా ఏర్పడే ఉయ్యాలో - సంబురాలు మిన్నంటే ఉయ్యాలో

తెలంగాణా రాష్ట్రానికి ఉయ్యాలో - కె సి ఆర్ ముఖ్య మంత్రి యాయె ఉయ్యాలో

బంగారు తెలంగాణా కు ఉయ్యాలో - ముఖ్య మంత్రి కె సి ఆర్ ఉయ్యాలో

ప్రజల ఆలోచనలతో ఉయ్యాలో - ఆధి కారుల సహా కారంతో ఉయ్యాలో

సంక్షేమ పధకాలు ఉయ్యాలో - దారి తప్పకుండా ఉయ్యాలో

జెట్ వేగంతోటి ఉయ్యాలో - జన హితం చూస్తుండే ఉయ్యాలో

రాష్ట్ర అంబా సిడరుగా ఉయ్యాలో - సానియాను నిలబెట్టే ఉయ్యాలో

బతుకమ్మ బోనాల ఉయ్యాలో - రాష్ట్ర పండుగలుగా చేసే ఉయ్యాలో

భూములు లేని వారికి ఉయ్యాలో - పట్టాలే ఇచ్చిరి ఉయ్యాలో

అవినీతి అంతానికి ఉయ్యాలో - కుటుంభ సర్వే జరిపి ఉయ్యాలో

చరిత్ర సృస్టించి ఉయ్యాలో - దేశ ప్రజల మన్ననల పొందే ఉయ్యాలో

రాష్ట్ర రైతు లందరి కీ ఉయ్యాలో - లక్ష రుణ మాఫీ చేసే ఉయ్యాలో

బతుకమ్మ పండుగకు ఉయ్యాలో - పది కోట్లు కేటాయించే ఉయ్యాలో

తెలుగు మహిళలందరికీ ఉయ్యాలో - స్వేఛ్చ వచ్చే నేడు ఉయ్యాలో 

అధికారులమనకుండా ఉయ్యాలో - ఊడగం వారనకుండా ఉయ్యాలో

ఆడ వారందరం కలిసి ఉయ్యాలో - ఆహ్లాద కరంగా ఉయ్యాలో

ట్యాంక్ బండు కు చేరి ఉయ్యాలో - కోలాటం ఆటలతో ఉయ్యాలో 

బతకమ్మ పాటలతో ఉయ్యాలో - హోరు గొట్టించిరి ఉయ్యాలో

బతుకమ్మ పండుగను ఉయ్యాలో - ఘనంగా జరుపుతూ ఉయ్యాలో

బంగారు తెలంగాణాను ఉయ్యాలో - కలసి సాధిస్తిమి ఉయ్యాలో

No comments: