Sunday, March 30, 2025

ఇది ఒక విషమ పరీక్షా సమయం

అంశం: *పరీక్ష*


శీర్షిక: *ఇది ఒక విషమ పరీక్షా సమయం*

ఆకాశంలో పరుగులు తీసే గ్రహాలకు
అవనిలోని ఉరుకుల పరుగుల జనాలకు
ఇది ఒక విషమ పరీక్షా సమయం
షష్ట గ్రహాలన్నీ ఒకే గడిలోకి రాబోతున్నాయి
రాహువు కేతువుల మధ్య బంధింప
పడబోతున్నాయి!

ప్రతి యేడాది మార్చి ఏప్రిల్ మాసాలలో
విద్యార్ధులకు పరీక్షా సమయం
పది ఇంటర్ డిగ్రీ పరీక్షల హడావుడి
దిశను భవిష్యత్తును నిర్దేశించే కాలం
ర్యాంకులు గ్రేడులంటూ కార్పోరేట్ సంస్థల
ఆరాటం పోరాటం విద్యార్థులపై వత్తిడి!

*ఇది ప్రజలకు పరీక్షా సమయం*
విద్యార్థుల పరీక్షలతో తల్లిదండ్రులలో అలజడి
అతివృష్టి అనావృష్టి పంటలు లేక పనులు లేక ఇండ్లు కూల్చడం ఉద్యోగాలు ఊడి
మరి కొందరు సతమతం!

*ఇది భారత దేశానికి పరిక్షా సమయం*
ప్రజల సమిష్టి అభివృద్ధే దేశాభివృద్ధి
ట్రంప్ రాకతో ప్రపంచ దేశాలు వణికీ
పోతున్నాయి అందులో ముఖ్యంగా
భారత దేశానికి పెద్ద అగ్ని పరీక్ష

అదిగో టారిఫ్ ఇదిగో టారిఫ్ లు అంటూ
హెచ్చరికలు జారీ చేస్తుండే
షేర్ మార్కెట్ కుప్పకూలే
బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటే
ఇన్వెస్టర్ల జీవితాలు అగమ్యగోచరం
ఏడు ట్రిలియన్ల అభివృద్ధి ప్రశ్నార్థకమాయే
ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నమవుతుండే
ఫారెన్ ఇన్వెస్టర్లకు పండుగే పండుగ!

నిన్నగాక మొన్న పెద్దన్న మరో బాంబు వేసే
హేచ్ 1 బి పొందగోరు వారు లక్ష డాలర్లు
చెల్లించాలని ఆర్డర్ జారీ చేసే
ఇప్పుడు అమెరికా వెళ్ళే ఉద్యోగులకు
వారి తల్లిదండ్రులకు ఒక అగ్ని పరీక్ష!

నేడు దేశ ప్రధానికి అగ్ని పరీక్షగా మారే
చైనాతో ఇతరదేశాలతో ట్రేడ్ ఒప్పందాలు
జి.ఎస్టీ.తగ్గింపులు విదేశీ వస్తువుల రద్దు
పొరుగు దేశాలపై ఆధార పడటం తగ్గించాలని
దేశ ప్రజలకు సందేశమిస్తుండే!

*ఇది ప్రకృతికి ఒక పరిక్షా సమయం*
షష్ట గ్రహ కూటమి కావడం గ్రహాలు ఏర్పడటం
పలు కారణాల వలన అనేక ఉపద్రవాలు
సముద్రాలలో ఆటుపోటులు కరువుకాటకాలు
జరుగుతాయని జ్యోతిష్యశాస్త్రం హెచ్చరిక!

పరీక్షలు వస్తుంటాయి పోతుంటాయి
సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి

No comments: