శీర్షిక: బతకమ్మ ఉయ్యాల పాట
బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో - బంగారు బతకమ్మ ఉయ్యాలో "2"
రజాకార్లతో నాడు ఉయ్యాలో - రగిలి పోయే తెలంగాణా ఉయ్యాలో
తెలంగాణా ప్రజలను ఉయ్యాలో - తరిమి తరిమి కొట్టిరి ఉయ్యాలో
ఆడ పడుచులను ఉయ్యాలో - అవమాన పరిచిరి ఉయ్యాలో
చిన్న పిల్లలను ఉయ్యాలో - చితక బాదిరి ఉయ్యాలో
రాణి రుద్రమదేవి ఉయ్యాలో - ప్రతాప రుద్రుడు ఉయ్యాలో
సమ్మక్క సారక్కలు ఉయ్యాలో - చీల్చి చెండాడిరి ఉయ్యాలో
చాకలి ఐలమ్మ నాడే ఉయ్యాలో - చావ బాదే రజాకార్ల ఉయ్యాలో
కొమురం భీమ్ ఉయ్యాలో - కొరివినే అంటించే ఉయ్యాలో
దాశరధి కృష్ణమా చార్య ఉయ్యాలో - కోటి రతనాల వీణ అనే ఉయ్యాలో
ప్రజా కవి కాలోజి ఉయ్యాలో - కవులకు ఊపిరి పోసే ఉయ్యాలో
కొండా బాపూజీ ఉయ్యాలో - బాంబులే వేసిరీ ఉయ్యాలో
కసాయి రాజాకార్లపై ఉయ్యాలో - కన్నెర్ర చేసే 'పటేలు' ఉయ్యాలో
'పటేలు' ఆక్షన్తో ఉయ్యాలో - తోక ముడిచే రజాకార్లు ఉయ్యాలో
ఆంద్రుల పాలనతో ఉయ్యాలో - తెలంగాణా అంధ కారమాయే ఉయ్యాలో
అన్ని రంగాల్లోనూ ఉయ్యాలో - అభివృద్ధి కుంటు పడే ఉయ్యాలో
పది జిల్లాలలోను ఉయ్యాలో - ప్రజలు పస్తులే ఉండిరీ ఉయ్యాలో
కూడూ గుడ్డా కొరకు ఉయ్యాలో - ప్రజలు చెట్లల్లో దాగిరి ఉయ్యాలో
విద్యా ఆరోగ్యం కొరకు ఉయ్యాలో - విల విలా లాడిరి ఉయ్యాలో
చుట్టూ గోదావరే ఉన్నా ఉయ్యాలో - చెలుకలెండి పోయే ఉయ్యాలో
నదులెన్నో మన కున్నా ఉయ్యాలో - త్రాగు నీరే లేక పాయే ఉయ్యాలో
జయ శంకర్ ఊతంతో ఉయ్యాలో - జై తెలంగాణా నినాదాలతో ఉయ్యాలో
ప్రత్యేక రాష్ట్రం కొరకు ఉయ్యాలో - ఉద్యమాలే చేసిరి ఉయ్యాలో
తెలంగాణా విముక్తికి ఉయ్యాలో - దీక్షలే చేసిరి ఉయ్యాలో
ఆత్మ త్యాగాలతో రాష్ట్రం ఉయ్యాలో - దద్దరిల్లి పాయే ఉయ్యాలో
పదమూడేండ్లల్లో ఉయ్యాలో - పన్నెందొందల మంది ఉయ్యాలో
బలి దానాలు చేసిరి ఉయ్యాలో - పుత్ర శోకం పెట్టిరి ఉయ్యాలో
ఎందరో ఉద్యమ కారులతో ఉయ్యాలో - ఎగిసి పడే తెలంగాణా ఉయ్యాలో
కళా కారుల పాటలతో ఉయ్యాలో - కలిసి వచ్చిరి జనులు ఉయ్యాలో
ముల్లోకాలు తిర్గి ఉయ్యాలో - ముచ్చెమటలు పుట్టించే ఉయ్యాలో
జూను రెండవ రోజు ఉయ్యాలో - రెండు వేల పదునాలుగున ఉయ్యాలో
తెలంగాణా ఏర్పడే ఉయ్యాలో - సంబురాలు మిన్నంటే ఉయ్యాలో
బతుకమ్మ బోనాల ఉయ్యాలో - రాష్ట్ర పండుగలుగా చేసే ఉయ్యాలో
తెలుగు మహిళలందరికీ ఉయ్యాలో - స్వేఛ్చ వచ్చే నేడు ఉయ్యాలో
అధికారులమనకుండా ఉయ్యాలో - ఊడిగం వారనకుండా ఉయ్యాలో
ఆడ వారందరం కలిసి ఉయ్యాలో - ఆహ్లాద కరంగా ఉయ్యాలో
ట్యాంక్ బండు కు చేరి ఉయ్యాలో - కోలాటం ఆటలతో ఉయ్యాలో
బతకమ్మ పాటలతో ఉయ్యాలో - హోరు గొట్టించిరి ఉయ్యాలో
బతుకమ్మ పండుగను ఉయ్యాలో - ఘనంగా జరుపుతూ ఉయ్యాలో
బంగారు తెలంగాణాను ఉయ్యాలో - కలసి సాధిస్తిమి ఉయ్యాలో
(తెలంగాణ వచ్చిన తరువాత 2014 లో వ్రాసిన పాట, కొన్ని సవరణలతో)
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Wednesday, March 26, 2025
తెలంగాణా బతుకమ్మ పాటP
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment