Friday, April 4, 2025

పర్యావరణ రక్షతి రక్షితః

అంశం: పర్యావరణ పరిరక్షణ

శీర్షిక: *మట్టి గణపతినే పూజిద్దాం*

చవితి రోజున పుట్టిన
'"మట్టి గణపతి" నే పూజిద్దాం
గట్టిగ గణనాధుడిని సేవిద్దాం
ఉట్టిగ డబ్బు వృధా చేయకుండా
తొట్టిలో కరిగే మట్టి వినాయకుడునే కొలుద్దాం
పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం!

*పర్యావరణమంటే పరిసరాలే కాదోయ్*
*పర్యావరణమంటే పంచభూతాలోయ్*

పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవాళిపురోగతి 
కాదు కూడదని పట్టించుకోకుంటే అధోగతి 
ప్రతి ఒక్కరికీ కాపాడాలని ఉండాలి మతి 
లేదంటే విషమించుతుంది జీవుల పరిస్థితి 

పరిశ్రమలు పెట్రోల్ డిజిల్ యుద్ధాలతో 
పెరిగి పోతుంది వాయు శబ్ధ కాలుష్యం
ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ వంటి వాటితో
నదులు సముద్రాలు ఝరుల కాలుష్యం 
వాడి పారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో 
భూములు తరులు వాతావరణం కాలుష్యం! 

పర్యావరణం ప్రకృతి దేశ సంపద 
దానిని మనం రక్షించు కోలేకుంటే
నశించి పోతుంది మానవ సంపద!

చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల
రిసైక్లింగ్ చేస్తూ ధరిత్రి కాలుష్యాన్ని
మురుగునీటిని శుద్ధిచేస్తూ జలకాలుష్యాన్ని
మొక్కలను పెంచుతూ వాయు కాలుష్యాన్ని
ఎలక్ట్రిక్ వేహికిల్స్ సైకిల్లను వాడుతూ
వాయు శబ్ధ కాలుష్యాలను అరికట్టాలి!

*ప్రతి ఒక్కరం మట్టి గణపతులనే పూజిద్దాం*
భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం
పర్యావరణాన్ని రక్షిద్దాం! పర్యావరణ రక్షతి రక్షితః!

No comments: