Friday, June 13, 2025

జ్ఞానం అంతు చిక్కని నిధి

అంశం: *విజ్ఞాన జ్యోతి*

శీర్శిక: *జ్ఞానం అంతు చిక్కని నిధి*

త్రికాల దార్శనికులు  త్రిగుణ సంపన్నులు
త్రికర్మ సాధకులు  జ్ఞాన సాగరులు!

జ్ఞానం ఎవరి సొత్తు కాదు 
కానీ జ్ఞానాన్ని సముపార్జించడం
జ్ఞానాన్ని అర్ధం చేసుకోవడం
దానిని విశ్వ శ్రేయస్సుకు ఉపయోగించడం
అంత తేలికైన విషయం కాదు
జ్ఞానం ఎవరికీ అంతు చిక్కని నిధి!

విద్య విజ్ఞానం అనంతం 
మొదటి గురువులైన తల్లిదండ్రుల నుండి 
సమాజం నుండి ప్రకృతి నుండి 
జ్ఞానం లభిస్తుంది 
బడిలో చదువుకున్నను విద్య వస్తుంది
గురువుల వలన అస్త్రశస్త్ర విద్య లభిస్తుంది!

పెద్ద పెద్ద విద్యాలయాల్లో చదువడం
ఉన్నత చదువులు చదువడం
విదేశాలలో డిగ్రీలు సంపాదించడం
గొప్ప చదువులకు జ్ఞానానికి కొలబద్ద కాదు
సంస్కారం లేని చదువు చదువే కాదు!

ఎంత చదివినా ఎక్కడ చదివినా
సంపూర్ణ జ్ఞానం సముపార్జించినట్లు కాదు
ఎంతో కొంత లోటు ఉండనే ఉంటుంది
ఎవరూ పూర్తి జ్ఞానాన్ని పొందిన వారు కాదు!

జ్యోతిని వెలిగించడం వలన చీకటి తొలగి
వెలుతురు ప్రకాశించు నట్లే
సద్గురువుల వద్ద విద్య అభ్యసించడం వలన
సత్సాంగత్యం వలన తల్లి దండ్రుల వలన
ఆధ్యాత్మిక చింతన వలన అజ్ఞానం తొలిగి
జ్ఞానం లభిస్తుంది
సంస్కారంతో ఆ జ్ఞాన సారాన్ని
సమాజ హితానికి ఉపయోగిస్తే యోగిస్తాడు
ఎంత జ్ఞానం నేర్చిన అది అణువు మాత్రమే
అది గుర్తిస్తే *మహా మనీషి*  అవుతాడు!

No comments: