Monday, June 2, 2025

జయహో తెలంగాణ తల్లి

అంశం: చిత్ర కవిత (తెలుగు తల్లి)

శీర్షిక : జయహో తెలంగాణ తల్లి

జయహో తెలంగాణ తల్లి
జయ జయహో తెలంగాణ కల్పవల్లి
కళకళ లాడుతోంది తెలుగు తల్లి
నాలుగు కోట్ల జనులకు ఇంపైన అమ్మ
అమ్మ మెడలో మల్లెల హారం మనోహరం
ఉట్టిపడే మోము ప్రశాంతతకు ప్రతిరూపం

ముదురు ఎరుపు రవికె శౌర్యానికి ప్రతీక
ఆకు పచ్చని పీతాంబరపు చీర కట్టు
అది పాడి పంటలకు ప్రతి బింబం
నుదుట పొద్దు పొడుపు సిందూరం
భారతీయ సంస్కృతికి ఆనవాలు
ఇక శత్రు దేశాలకు గుబులే గుబులు

శిరస్సుపై దగదగ మెరిసే బంగారు కిరీటం
అది ఉన్నతికి పరుగులు తీసే సూచిక
కుడి హస్తంలో అభయమిచ్చు సందేశం
ఎడమ హస్తంలో మొక్క జొన్న పొత్తులు
సజ్జ కంకుల పరవళ్ళు

ముంజేతి కరాలకు ముచ్చటైన పచ్చని గాజులు
సౌభాగ్యాల సౌందర్య వతికి ప్రతీక
నల్లని మేఘాల నిగనిగలాడే కురులు
ధీరత్వానికి దృడ సంకల్పానికి సంకేతం
మిలమిల మెరిసే కాటుక కన్నులు
శాంతి స్వరూపంతో ముఖాన చిరునవ్వు 

తెలుగు తల్లి ప్రశాంతత మహిళలకు ప్రతీక
చతుష్షష్టి కళలను కలబోసిన తెలుగు తల్లి      
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు
తెలుగు మహిళలకు గొప్ప నిదర్శనం 
తెలుగు తల్లి గాంభీర్యం వనితలకు మనోధైర్యం

No comments: