శీర్షిక: బంధాలు - అనుబంధాలు
నేడు బంధాలు అనుబంధాలు
సారం లేని మానులు వట్టి పోయిన కొమ్మలు
వాలి పోయిన ఆకులు వాసన లేని పువ్వులు!
కాగడ పట్టి వెతికినా కానరావు ప్రేమానురాగాలు
కనుమరుగవుతున్నాయి ఆత్మీయతలు
మృగ్యమవుతున్నాయి రక్త సంబంధాలు
దూరమవుతున్నాయి రాకపోకలు!
రక్త మాంసాలు ధారపోసి కండరాలు కరిగించి
కాలుకు ముల్లు గుచ్చితే పంటితో పీకి
కంట్లో నలుసు పడితే నాలుకతో తీసి
శ్రమించి చెమటోడ్చి పెంచి పెద్ద చేసి
విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకుల చెస్తే
ప్రేమలు తరిగి పోయే మమతలు కరిగిపోయే
సేవలకు వెలకడుతుండే మనసు కలవరపెడుతుండే!
గడిచిన కాలం మరల రాదు
రేపటి రోజు ఉంటుందో లేదో తెలియదు
తలుచుకుంటేనే గుండెలో బాధ
అయినా దాచుకోవాలి హృదయంలోనే వ్యధ
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది రుధిరం!
బంధాలు అనుబంధాలు
రక్త సంబంధాలు ఇక రైలు పట్టాలేనా!
No comments:
Post a Comment