అంశం: త్రిశ్ర గతి గజల్స్ 33333333-24
నింగి లోన చందమామ *కదులుతోంది చూసావా!*
నేలమీద వెన్నెలనూ *పరుచుతోంది చూసావా!*
చెట్టు పైన కోయిలమ్మ కుహూకుహూ నని కూయగ!
గూటిలోన పక్షిపిల్ల *ఎగురుతోంది చూసావా!*
చిన్న చిన్న చినుకులకే దారులన్ని వరదలాయె!
నాయకులకు మనసిప్పుడు *కరుగుతోంది చూసావా*
కాయలన్ని తీగలకే ఎలా కాయు చున్నాయో!
నేలపైన తీగ యెటుల *పారుతోంది చూసావా!*
ప్రకృతిలోన పరవశాలు ఎన్నెన్నో ఓ కృష్ణా!మధురముగా మనసులోన *మెదులుతోంది చూసావా!*
No comments:
Post a Comment