Tuesday, March 11, 2025

బతుకమ్మ పండుగ

అంశం: *బతుకమ్మ పండుగ*

శీర్షిక: *తీరొక్క పూల పండుగ*

సమైక్యతకు ఆనందాలకు ప్రతీక
సంస్కృతి సాంప్రదాయాలకు వేదిక
చెట్లకు పూచిన పూలకు మహాభాగ్యమిక
బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టుక!

పిల్లా పెద్ద లందరికీ ఆనందాలిక
ఆడపడుచులు, అమ్మమ్మలు ఆడాలిక
పూల బతుకమ్మ పండుగ ఒక ప్రతీక
దేశ దేశాల తెలుగు ప్రజలకు గొప్ప వేడుక!

తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వు
గునుగు పువ్వు  కట్లపువ్వు  బంంతిపువ్వు
గోరంట పువ్వులు  చేమంతి పువ్వులు
రంగు రంగుల తీరొక్కపువ్వుల కోసుకొచ్చి!

పిల్ల బతుకమ్మ తల్లి బతుకమ్మ అని
బతుకమ్మలను త్రికోణాకారంలో పేర్చి
ధూప దీపాలతో పసుపు కుంకుమలతో
ఘనముగా బతుకమ్మలకు పూజలు చేసి 
ఆఱుబయట పెట్టి అమ్మలక్కలు పాడి!

సంధ్యా వేళ  బతుకమ్మల నెత్తుకుని
డప్పు వాయిధ్యాలతో కొలను వరకు వెళ్లి
పసుపు తులసిమొక్కతో గౌరమ్మనుప్రతిష్టించి
వనితలు చుట్టూర బతుకమ్మలను పెట్టి!

చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు 
అంగ రంగ వైభవంగా ఒక్కొక్క పువ్వేసంటూ
అద్భుత లయలతో ఆడుతూ పాడుతూ
యింపైన సొగసులతో కోలాటమాడి!

బతుకమ్మల ధూపదీపాలతో నీటిలోవదిలి
ఇచ్చుకో వాయినం పుచ్చుకో వాయినమని
వాయినాలు యిచ్చుకుని  ఇష్టముగ తిని
ఆనందగా వెళ్ళెదరు ఎవరింటికి వారు
ప్రేమాప్యాయతలతో పిలుచుకుంటూ!

No comments: