అంశం:ప్రణయ సాగరం
శీర్షిక: *మధుర స్వప్నం*
రాధా...! ఏమీ నీ అందం
శివుని సిగలో చంద్రికలా
జీవ కళ నింపుకున్న పుష్పం
ఇపుడిపుడే ఎదుగుతున్న తరుణం
తళతళ మెరిసే సుగంధ పరిమళాల
స్వర్ణ కమలం!
తుమ్మెదల ఊహకందని
స్వచ్ఛమైన మకరంద కుసుమం
చిరు గాలి సోకని చిత్ర విచిత్రాల
ఇంపైన సంపెంగ పుష్పం
సూర్య రశ్మి సోకని ఎరుపెక్కిన సుగంధాల మకరందాల మందారం!
నీ హొయలు వర్షపు చుక్క తాకని
సుకుమార స్వేత గులాబీల పరిమళం
మన బంధం అధరాలలో ఒదిగి పోయిన
ప్రణయ సాగర సోయగం!
గుండెలలో సరిగమలు మదిలో ఆనందాలు
హృదయాలలో ఆహ్లాదాలు కురుపిస్తాయి
మధురామృతాలు చిలుకుతాయి
మహాద్భుతాలు సృష్టిస్తాయి జగతిలో!
నీ ప్రేమ గలగల పారే జలపాతంలా
స్వచ్ఛమైన గంగా నదిలా
ఆకాశంలో చిరు గాలిలో తేలిపోయే తెల్లని
మబ్బుల్లా
మిలమిల మెరిసే తారల్లా నిండు పున్నమి నాటి జాబిలిలా!
శశి చూపులతో పరవసించి
విప్పారిని కొలనులోని కలువల్లా
విరిసిన నిండు గర్భిణి మల్లెల సుగంధాల పరిమళాల్లా
ఆకాశంలో మెరిసిన అద్భత సప్తవర్ణ
ఇంద్రధనుస్సులా వెలిగి పోతున్నావు
స్వచ్ఛమైన మన స్నేహం ఎంతో అద్భుతం
ఆనంద మయం అది జన్మ జన్మలకు
మరువలేని మధుర స్వప్నం!
No comments:
Post a Comment