Sunday, July 27, 2025

రామ చిలుకా నా వాడెక్కడే

శీర్షిక: రామ చిలుకా - నా వాడెక్కడే?

(హాస్య కవిత)
సుందరమైన అందగాడు సువిశాల హృదయం గలవాడు...

పొడుగాటి బాహువులు గ్రద్ద ముక్కు చిన్నపాటి కాళ్ళున్నవాడు..

చలాకి గా మాటలాడు హుషారు గొలుపు మనస్కుడు వాడు...

మూగ వాడు ఎవరు పిలిచినా పట్టించుకోడు నా వాడు...

మెల్లె కన్ను వాడు కొంటె చూపులతో చూస్తాడు చక్కని వాడు...

కుడి బుగ్గ మీద పుట్టు మచ్చ గలవాడు బుంగ మూతి పెడుతాడు...

ముంజేతికి కంకణం ఉంది గజ్జెల మొల త్రాడు ఉంది ఏడి నా వాడు...

కాలుకు అందె ఉంది వ్రేలుకు రాగి ఉంగరం ఉంది....

నడుముపై నాగసరంలా వాత ఉంది కనపడకుండా కట్టి పెడుతుంటాడు...

గారే పండ్లు ఉంటాయి మూతిపై మీసాలు ఉండవు వాడే నా వాడు...

నొసలు పై నామాలు ఉంటాయి తలపైన జుట్టు ఉండదు...

తెల్లని దోతి కడుతడు పైన బనీను వేస్తడు తలకు రుమాలు...

భుజంపైన గొంగళి ఉంటది చేతిలో ముల్లుకర్ర ఉంటది...

ఒంటికి సోయి ఉండదు ఎక్కడ ఏమి వదిలేస్తాడో తెలియదు...

వాడే నా వాడు ఎక్కడ దాచావో చెప్పవే ఓ నా రామచిలుకా...

 

No comments: