Monday, July 28, 2025

అన్యోన్య దాంపత్యం

*పదాల కవిత*: *జీవన సమరం* *అన్యోన్య దాంపత్యం***మధుమాసం* *సంధ్యా సమీరం*


శీర్షిక: *వివాహ బంధం పవిత్రమైనది*

పెళ్ళంటే నూరేళ్ళ పంట
అది నిలవాలి కలకాలం మన ఇంట
సంసారం ఒక సాగరం అది *జీవన సమరం*
వివాహం జీవితంలో ఒక భాగం
అంతే గానీ వివాహమే జీవితం కాకూడదు!

"నీటిలో పడప ప్రయాణించాలి గానీ
పడవలోకి నీరు చేరకూడదు'
చిన్న చిన్న సమస్యలు రావడం సహజం
వాటిని సర్దుబాటు చేసుకుంటూ
*అన్యోన్య దాంపత్యం* తో జీవనం సాగించాలి!

భార్యా భర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో
ఒకరిపై ఒకరు గౌరవంతో ప్రేమతో
అనురాగంతో ఆత్మీయతతో కోపతాపాలు
దాపరికాలు లేకుండా జీవనం సాగిస్తే
నిత్యం *మధు మాసమే*

నేనే గొప్ప అనుకుంటే అహంకారం
మనమే గొప్ప అనుకుంటే మమకారం
ఒకరికొకరం తోడు అనుకుంటే సహకారం
ఎవరికీ ఎవరం కాదనుకుంటే *సంధ్యా సమీరం*


          

No comments: