అంశం:రూపాయి బంధం
శీర్శిక: *డబ్బు రెండు వైపులా పదునైన కత్తి*
*ధనం మూలం ఇదం జగత్*
అన్నారు పెద్దలు
జ్యోతి ప్రకాశించాలంటే నూనె ఎంత ముఖ్యమో
వ్యవహారాలు జరగాలంటే ధనం అంతే ముఖ్యం
ధనం లేకుండా ఏదీ జరగదు
డబ్బు ఉంటేనే అన్ని పనులు
ధనం ఉంటేనే విలువ గౌరవం
డబ్బు లేకుంటే జీవితం అంధకారం
అందుకే ఓ సినీ కవి అంటారు
"ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము
విలువ తెలుసుకొనుట మానవ ధర్మం" అని
రూపాయి సృష్టించింది మానవుడే
అదే రూపాయికి దాసుడయ్యింది మానవుడే
రూపాయి అందుబాటులోకి రాక ముందు
మార్పిడి పద్దతి అందుబాటులో ఉండేది
ఒక వస్తువుకు మరొక వస్తువు ఇవ్వడం
శేరు వడ్లు ఇస్తే సేటు శేరు ఉప్పు ఇచ్చేవాడు
ఎప్పుడైతే రూపాయి
అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుండి
రూపాయితో మనిషికి బంధం ఏర్పడింది
ఆ బంధం ఇప్పుడు మనిషిని దాసున్ని చేసింది
అందుకే అంటారు:
*డబ్బుకు లోకం దాసోహం* అని
డబ్బుతో ఏదైనా కొన వచ్చనే నమ్మకం
మనిషిలో బలంగా ఏర్పడింది
అందుకే మానవుడు ఏదో విధంగా
డబ్బు సంపాదించాలి కూడ బెట్టాలి
అని దాని వెంటే పరుగెడుతున్నాడు
కానీ *డబ్బు రెండు వైపులా పదునైన కత్తి*
అది ప్రాణాన్ని సృష్టిస్తుంది అదే డబ్బు
ప్రాణాన్ని తీస్తుంది అన్న విషయం
మరిచి పోతున్నాడు
డబ్బుంటేనే విలువ గౌరవం కీర్తి అనేది
రూపాయితోనే అన్నీ కొనగలం అనేది భ్రమ
రమణ మహర్షి వివేకానంద బుద్ధుడు గాంధీజీ
వాజ్ పాయ్, అన్నాహజారే, అబ్దుల్ కలాం
మరెందరో ప్రతిభతో కీర్తి ప్రతిష్టలు పొందారు
No comments:
Post a Comment