*అంశం*మద్యపానం*
శీర్షిక: మద్యపాననిషేధం ఎన్నికల ఎజెండా కావాలి
మద్యం మత్తు పానీయాలు డ్రగ్స్
అవి మనిషిని మత్తులో పెడుతుంటాయి
జనులను మాయ చేస్తుంటాయి
మద్యానికి డ్రగ్స్ కు తెలియవు
కులమత జాతి భేదాలు పేద ధనిక వర్గాలు
స్త్రీ పురుష లింగ వయసు వివక్షతలు
భాషా ప్రాంత తారతమ్యాలు
అందరూ వాటికి చుట్టాలే
కాదు ప్రభుత్వాలే కలిపాయి బంధుత్వం!
మొదట సరదాగనే ఉన్నా
కాలక్రమేణా అలవాటు వ్యసనంగా మారి
ఒల్లు చిత్తు చేస్తాయి ఆపై సర్వం గుల్ల చేస్తాయి!
కాలక్రమేణా అలవాటు వ్యసనంగా మారి
ఒల్లు చిత్తు చేస్తాయి ఆపై సర్వం గుల్ల చేస్తాయి!
మద్య పానం డ్రగ్స్ చల్లచల్లగా మెల్లమెల్లగా
మనిషి లోని పేగులకు అవయవాలకు
హాని చేకూరుస్తుందని తెలుసినా
ఆపై ప్రాణం సహితం తీస్తుందని ఎరిగినా
కొందరు త్రాగుడుకు బానిసలు అవుతున్నారు
ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి!
మద్యం త్రాగాక డ్రగ్స్ వాడాక
మంచి ఏదో చెడు ఏదో మసకబారు
నింగి ఏదో నేల ఏదో అర్ధం కాదు
కళ్ళు బైర్లు కమ్మి వావివరుసలు తెలియవు
మనవారెవరో పరవారెవరో అర్ధం కాదు
కాదు కాదు అవుతుంది మద్యం దిగాక
లేదా సాటి వారు నాలుగు చివాట్లు పెట్టాకనో
నష్టం జరిగాకనో కష్టం ఏర్పడ్డాకనో!
"త్రాగిన వారి నోట నిజాలు తన్నుకుంటూ
వస్తాయంటారు"
కొంత వరకు నిజమే మత్తులో ఉన్నపుడు
మనిషి మాయలోకి వెళ్లి పోగా
వర్తమానంలోనివి ఏవీ కనపడకపోవడతో
గతంలో విన్నవి కన్నవి కక్కేయడం సహజమే!
మద్యం వలనననే ఎన్నో కుటుంబాలు
కోపాలు తాపాలు కొట్లాటలు తగాదాలతో
నిండు పచ్చని సంసారాలు మండుతున్నాయి
మానవ విలువలు కుప్పకూలుతున్నాయి
మరెన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయి!
ప్రభుత్వాలు ప్రజల మానప్రాణాలతో
చెలగాటం ఆడకుండా
ముఖ్య ఆదాయ వనరులుగా ఎంచకుండా
మధ్య నిషేధం చేపట్టాలి
ఎన్నికలలో అదే ఎజెండాగా నిలువాలి!
మరెన్నో అనర్ధాలకు దారి తీస్తున్నాయి!
ప్రభుత్వాలు ప్రజల మానప్రాణాలతో
చెలగాటం ఆడకుండా
ముఖ్య ఆదాయ వనరులుగా ఎంచకుండా
మధ్య నిషేధం చేపట్టాలి
ఎన్నికలలో అదే ఎజెండాగా నిలువాలి!
No comments:
Post a Comment