అంశం: పదాలు కవిత
(మౌనం మయూరం సహనం ప్రవాహం ఆశలు ఆకాశం)శీర్షిక: ఇక ఆకాశమే హద్దులే
అందమైన ఓ నా చెలీ!
ఎందుకో ఈ *మౌనం*
సుందరం నీ సౌందర్యం
నిగనిగలాడే నీ లేత బుగ్గలు
అద్భుతం నీ నుదుట సిందూరం
*మయూరం* లా వయ్యారం నీ నడక
తామర కాడ లాంటి నీ నడుము
మనోహరం హంస రెక్కల వంటి నీ కనురెప్పలు!
ఎందుకో ఆ అలక!
నల్లని మేఘాల కురులను తాకలేదనా
చిగురాకు పచ్చ చీరను తాక లేదనా
సముద్ర కెరటాలలా ఎగిసి పడే సొగసులను
పొగడలేదనా
ఎందుకు నా *సహనం* పరీక్షిస్తావు
అవునులే స్త్రీల మనోగతం పసిఫిక్
మహాసముద్రమంత లోతైనది కదా
తెలుసు కోవడం కష్టమే మరి!
ఓ నా నిచ్చెలీ!
నీ అలక తీర్చ నేనేమి చేయను
మురళీ రవం ఊదనా జోల పాట పాడనా
స్వర్గాన్ని నీ ముందుకు తీసుకొనిరానా
ఏమీ నా మాటలు నీకు *ప్రవాహం* లా
వినిపిస్తున్నాయా!
ఓ అరవిరిసిన పూతేజమా!
కొలనులోని తామర కమలమా!
ఎగిరెగిరి పడే కెరటాల సంద్రమా
అర్ధమయ్యాయిలే నీ *ఆశలు*
వస్తుందిలే ఇక మధు మాసం!
ఇక *ఆకాశమే* హద్దులే
తీరుతుందిలే నీ సుందర స్వప్నం
తృప్తి నొందునులే నీ మానసం!
No comments:
Post a Comment