అంశం: *పదాల పదనిస*
శీర్షిక : *పడతులకు గోరింట పండుగ*
యేడాదిలో ఆషాఢమాసం పడతులకు *గోరింట* పండుగ ....
ఇంటింటా గోరంట సందడే *పోదరింట* నవ్వుల పువ్వలే...
గోరింటాకు పండగా రాలే *నీకంట* ఆనందభాష్పాలు జలజలా ....
నిత్యం *పూవింట* మల్లెల మాలలతో ఇంటింటా ఆనందోత్సవాలు....
గోరింటాకు పండించు మదిలోని ఊసులు *రేయంట* ....
చలి గాలుల తిమ్మరలతో రోజంతా మనసు *హాయంట* ...
*నీజంట* నాకు వేయి జన్మలు నోచిన వరమోయ్ ....
మరుజన్మలోనూ నీకు తోడూ నీడా *నేనంట* ....
పట్టు పరుపులపై నీవు ఒంటరిగా పవళించాలట *పడకింట* ...
మన జంటలో ఉన్నది మహోన్నతమైన *ప్రేమంట* ....
No comments:
Post a Comment