Thursday, July 31, 2025

గృహ హింస నాడు -నేడు

అంశం: గృహ హింస


శీర్శిక: *గృహ హింస నాడు - నేడు*

*యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః*
ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడుతారో
అక్కడ దేవతలు కొలువై ఉంటారు
అనేది భారతీయ సంస్కృతి సంప్రదాయం
అదే నేటికీ అనుసరిస్తున్న నియమం!

నాడు:
"స్త్రీకి స్త్రీ యే శత్రువు అన్నట్లు"
ఒక తరంలో అత్త మరో తరానికి కోడలు
ఒక తరంలో కోడలు మరో తరానికి అత్త
పురుషులు నిమిత్త మాత్రులు!

అమ్మ అమ్మమ్మ నానమ్మ అక్కా చెల్లెలు
వదిన మరదలు అనే స్త్రీల వల్లనే
అది పెంపకం బోధన చాడీలు కావచ్చు 
వీటి కారణంగానే నాడు భర్త
అభం శుభం తెలియని మరొక స్త్రీని
అనేక విధాలుగా హింసించే వారు
చిత్ర హింసలు పెట్టే వారు

అది కేవలం తల్లిదండ్రుల పెంపకం లోపమేనా?
కాదు అందుకు అనేక కారణాలుండవచ్చు
ఒంటరి కుటుంబాలు పెరగడం 
సమాజం ప్రభావం  పరువు ప్రతిష్టలు
ఇగోలు పంతాలు పట్టింపులు
స్త్రీ పురుషుల ఆరోగ్య మానసిక పరిస్థితులు
గ్రహాల కారణంగా స్త్రీల హార్మోన్ల ప్రభావం
పూర్వ కర్మలు ఆర్ధిక పరిస్థితులు మరెన్నో!

నాడు అలా అధికంగా స్త్రీలే
గృహ హింసకు గురయ్యేవారు
అబలలుగా వారి వారి తల్లిదండ్రులకు
మాట రాకుండా చూడటానికి కావచ్చు
కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడడానికి
ఆచారాలు సంప్రదాయాలు పాటించి
గృహహింసను భరించేవారు!

నేడు:
గృహ హింస స్త్రీలకు తగ్గుతుంది
పురుషులకు పెరుగుతుంది
కుటుంబ పరువు కాపాడుకోడానికి
బయటకు చెప్పుకోలేక కక్కలేక మ్రింగలేక
మానసికంగా కృంగి పోతున్నారు
ఆయుష్షు తగ్గిపోతుంది
అందుకు కారణాలు సమాజంలో
పురుషులనగానే తప్పువారిదనే భావన
స్త్రీల పై సానుభూతి ఉండటం
చట్టాలు స్త్రీలకు సంపూర్ణ చుట్టాలవడం
స్త్రీలు ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించడం
సాధికారత పెరగడం 
మహిళా సంఘాలు ఉండటం
మొదలగు కారణాల వలన 
నేడు పురుషులకు గృహ హింస పెరుగుతుంది
ఏదైనా పెరుగుట విరుగుట కొరకే!
 

No comments: