అంశం: పదాల కవిత
శీర్షిక: *కాశ్మీర్ అందాలు*
వెండి కొండలలో ప్రకృతి సోయగాలతో కాశ్మీర్ *అందాలు*
ఆ మధురాతి మధుర సుందర స్వప్నాల మధ్య కనపడవు కోడి *పందాలు*
పురాతన కాలం నుండే అన్యోన్యం కాశ్మీర్ పండితుల *బంధాలు*
వికసించిన కుంకుమ పుష్పాలతో పరిమళాలను వెదజల్లుతున్నాయి సు *గంధాలు*
మంచు కొండలు వృక్షాలు లోయలు
ఆహా! ఏమీ కాశ్మీర్ అంద *చందాలు!*
చల్లని వాతావరణం పచ్చిక బయళ్ళు మనసును పులకరింపజేసే *డెందాలు*
ఆ సుందర స్వప్నాలను కాపాడను నిత్యం గస్తీ తిరుగుతుంటాయి మిలిటరీ *బృందాలు*
కాశ్మీర్ అందాలను దర్శించ దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు మహా *సంద్రాలు*
దేశ విదేశ పర్యాటకుల వేషభాషలతో పిల్లల కోలాహలంతో వెల్లివిరిస్తాయి *ఆనందాలు*
పర్యాటకుల బంధుమిత్రుల ఆనందాలతో ఇనుమడిస్తాయి వారి బంధాలు *అనుబంధాలు*
No comments:
Post a Comment