శీర్షిక: అహం కవిస్మీ
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
మంచి చేసే వారిని పొగుడుతాను
చెడు చేసే వారిని తెగుడుతాను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధిని నేనే
బడుగు బలహీనులకు సారధిని నేనే
కవిని నేనే నేనే కవిని
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
ఒప్పులుంటే ప్రశంసిస్తాను
తప్పులుంటే అభిశంసిస్తాను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
అన్నీ గమనిస్తూనే ఉంటాను
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
అన్నీ గమనిస్తూనే ఉంటాను
అవకాశవాదులను గమనిస్తుంటాను
జనులను చైతన్య పరుస్తుంటాను
కవిని నేనే నేనే కవిని
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
అవినీతి పరులను స్వార్ధ పరులను
హంతకులను అసాంఘిక శక్తులను
మోసకారులను అడ్డుకుంటాను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
నీతులు చెబుతూ గోతులు త్రవ్వే వారిని
సేవని చెప్పుకుంటూ చాపకింద నీరులా
నిలువునా దోచేవారిని వదిలి పెట్టను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవిని గాంచని చోటుగాంచు కవిని నేనే!
నీతి పరులను నిజాయితీ పరులను
సేవా పరులను త్యాగధనులను
నిస్వార్ధ పరులకు చేతులు జోడిస్తాను
కవిని నేనే నేనే కవిని
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
అవినీతి పరులను స్వార్ధ పరులను
హంతకులను అసాంఘిక శక్తులను
మోసకారులను అడ్డుకుంటాను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవి గాంచని చోటుగాంచు కవిని నేనే!
నీతులు చెబుతూ గోతులు త్రవ్వే వారిని
సేవని చెప్పుకుంటూ చాపకింద నీరులా
నిలువునా దోచేవారిని వదిలి పెట్టను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవిని గాంచని చోటుగాంచు కవిని నేనే!
నీతి పరులను నిజాయితీ పరులను
సేవా పరులను త్యాగధనులను
నిస్వార్ధ పరులకు చేతులు జోడిస్తాను
అవినీతి పరులను అక్రమార్జితులను
భూకబ్జాదారులను ఆడిస్తాను
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవిని గాంచని చోటుగాంచు కవిని నేనే!
అహం కవిస్మీ!
నేనే కవిని కవిని నేనే
సరళము నేనే గరళము నేనే
రవిని గాంచని చోటుగాంచు కవిని నేనే!
అహం కవిస్మీ!
No comments:
Post a Comment