Tuesday, October 24, 2017

ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బింభిస్తున్నదా ?

ప్ర : ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బింభిస్తున్నదా ?


జ : ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతిబింభించడం లేదేమో నని    అనిపిస్తుంది . 

సాధారణ ఎన్నికల సమయాలలో , ప్రజలు గత పాలకుల వలన కలిగిన భాధలు , కష్టాలు గుర్తుకు తెచ్చుకొని లేదా నాయకుల వాగ్దానాలను నమ్మి , భావోద్వేగాలకు లోనయి , కొన్ని పార్టీలను తూడ్చి పెడుతారు , మరి  కొన్ని పార్టీలను అందల మెక్కిస్తారు . ఒక సంవత్సరమో , రెండు సంవత్సరాలో గడుస్తే గాని వారి నిజ స్వరూపం బయట పడదు . వారి నిజ స్వరూపం బయట పడేసరికి , వారు ప్రజల కంట్రోల్ లో  లేకుండా పోతున్నారు . ఎన్నికైన  ఏ పార్టీ అయినా  5 సంవత్సరాలు  పాలించాలి . అలాంటి  సమయాల్లో , రాష్ట్ర పతి ఎన్నికలు జరుగుతున్నాయి . అప్పుడు అధికార పార్టీలు       ' విప్పు'  జారీ చేయడం , రాష్ట్ర పతి ఎన్నిక పూర్తి అవడం మొదలైనవీ,  కొన్ని సార్లు , ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన రాష్ట్ర పతి ఎన్నిక ప్రతిబింభించడం  లేదేమో నని అని పిస్తుంది .


www.sollutions2all.blogspot.com

Sunday, October 22, 2017

How to find the Diseases and how to control Diseases? జబ్బు లను కనుక్కోవడం ఎలా ? జబ్బు లను నివారించడం ఎలా ?

Q.How to find the Diseases and how to control Diseases?
ప్ర. జబ్బు లను కనుక్కోవడం ఎలా ? జబ్బు లను నివారించడం  ఎలా ?

జ . ఈ కాలం లో  , ఏ చిన్న  జబ్బు చేసినా  హాస్పిటల్స్ కు వెలుతాము .  పదుల సంఖ్య లో , అవసరం ఉన్నా , లేకున్నా   డాక్టర్లు  అనేకమైన టెస్టులు  వ్రాస్తారు . జబ్బులకు  మందులు  కొనక ముందే  , ఉన్న డబ్బులన్నీ  ఊడ్చేస్తారు .  పరీక్షలు వారి ల్యాబ్ ల్లోనే    చేయించు కోవాలి , మందులు  వారి  హాస్పిటల్  లోనే  కొనాలి .  కొందరు  హాస్పిటల్స్ వారు  ,  అవసర మున్నా , లేకున్నా    హాస్పిటల్  లోనే   జాయిన్  కావాలంటారు . మరి కొన్ని  హాస్పిటల్స్ వారు  , చని పోయిన  శవం  పైనా  బిల్లులు  దండు కుంటారు .  ఈ కారణంగా  అనేక మంది  నిరు పేద , సామాన్య , మధ్య తరగతి  ప్రజలు  ,  దొరికిన కాడల్లా  అప్పులు చేసి , ఆ అప్పులు తీర్చలేక , రోగాలు తగ్గక   ఆత్మ హత్యకు  పాల్పడుతున్న వారెందరినో  , మనం  రోజూ  చూస్తున్నాం . 

మరి దీనికి  పరిష్కారం  లేదా ?

ఎందుకు లేదు . ఉంది . మనసుంటే  మార్గముంటుంది . ఆలోచిస్తే  అవకాశాలుంటాయి . ప్రయత్నిస్తే  ఫలితాలుంటాయి . డబ్బులు  ఆదా చేసు కోవాలన్నా , ఆరోగ్యాన్ని  కాపాడుకోవాలన్నా , అంతా  మన చేతిలోనే  ఉంది . 

అందుకు  చేయవలసిందల్లా , వారి  జీవిత  కాలంలో, వారికీ, వారి కుటుంభం సభ్యులకు  ఎదురైనా  జబ్బులను , వాటి కొరకు  తీసుకున్న  జాగ్రత్తలను , పరీక్షలను , మందులను  ఒక డైరీ లో వ్రాసుకొంటూ  పోవాలి .  ఈ విధంగా  వ్రాసుకుంటూ  , మరల  చదువుకుంటూ  అనలైజ్  చేసుకుంటూ పోతే ,  ప్రతి ఒక్కరూ , తమ చిన్న చిన్న జబ్బులకు  పరిష్కారం చూప గలిగే  ఒక  చిన్న డాక్టర్  కాగలరు  .

"మనిషి  మర్మం  పరమాత్మకెరుక"  అన్నట్లు ,  మనిషి  అనారోగ్య రహస్యం  శరీరానికెరుక . అంతర్గత  జబ్బులకు   , ప్రతి బింభం  మన  బాహ్య శరీరం . మనిషి  లోపలి అనారోగ్య సమస్యలన్నీ , ఎప్పటికప్పుడు మనిషి శరీరం పైన కనిపిస్తాయి .  వాటిని విశ్లేషించుకుని , తగు చర్యలు  తీసుకుంటే  శరీరానికి  హాయి , డబ్బు ఆదా  మరియు సమయం ఆదా అవుతాయి .

తెలుగులో   ఒక సామెత , "ఆరోగ్యమే  మహా భాగ్యం " అన్నారు  పెద్దలు . మనం ఆరోగ్యాంగా ఉంటేనే మనకు  ఎంతో సంపద ఉన్నట్టు లెక్క .  అలానే  ఆంగ్లంలో  ఒక సామెత  ఉంది ,   " PREVENTION IS BETTER THAN CURE"  అని . జబ్బు  రాక  ముందే , మన బాహ్య శరీరం పై కనపడే   లక్షణాలను (SYMPTOMS)  బట్టి  , మన శరీరంలోపల  కలిగే  నొప్పులను , వాంతులను , మోషన్స్ ను  బట్టి  తగిన జాగ్రత్తలు , నివారణ చర్యలు  తీసుకోవడం మేలు  అనేది  దీని భావం . ఈ  రెండూ  మన ఆరోగ్యానికి  సంబంధించినవే . ప్రతి సామెతలో , ప్రతి నానుడిలో  ఎంతో అర్ధం ఉంటుంది .   అనేక మంది మానవుల   గొప్ప  అనుభవం నుండి  బయట పడిన  సత్యాలే , సామెతలు . ఆ విధంగా   మానవుల అనుభవాలతో   గొప్ప  డాక్టర్లు గా  ప్రధమ చికిత్సలను  అందించా వచ్చు  . అనారోగ్యానికి  గురి కాకుండా  చూడ వచ్చు .   ప్రతి ఒక్కరూ , తమ కుటుంభం వరకైనా  ఒక డాక్టర్ గా   మార  వచ్చు .  మాకు ఏమి తెలుసు అనుకుంటే , ఎప్పటికి మీరు ఏమి కాలేరు . 

మనుష్యులకు  సాధారణముగా  వచ్చే  జబ్బులు కొన్నిటిని గురించి ఇక్కడ  తెలుసుకుందాం:

డయాబేటిస్  (DIABETES):

దీనినే  షుగర్ వ్యాధి అని కూడా అంటారు . 

డయాబేటిస్  (DIABETES), రెండు రకాలుగా ఉంటుంది . మొదటిది  టైప్  -1 ,                రెండవది  టైప్ -2. 


టైప్  -1, డయాబేటిస్  (DIABETES)  వలన  మనకు  కనబడే / ఏర్పడే  లక్షణాలు :



అ ) . తరుచుగా  మూత్రానికి  వెళ్లడం జరుగుతుంది ,
ఆ ) . ఆకలిగా  ఉండడం, 
ఇ ) .  తొందరగా అలిసి పోవడం, 
ఈ ) . కండ్లు  మంట  మండటం , మసక బారడం ,
ఉ ) . గాయాలైతే  తొందరగా మానక పోవడం ,
ఊ ) . అరికాళ్ళల్లో  మంటలు  ఏర్పడటం ,
రు ) . శరీరం మీద పలు చోట్ల  గోకుడు / దురద పుట్టడం  మొదలైనవి . 


టైప్  -2, డయాబేటిస్  (DIABETES)  వలన  మనకు  కనబడే / ఏర్పడే  లక్షణాలు :



అ ) .  అధికంగా   మూత్రానికి  వెళ్లడం జరుగుతుంది , 
ఆ ) . అధికంగా ఆకలిగా  ఉండడం ,
ఇ ) .  అధికంగా  అలిసి పోవడం ,
ఈ ) . కండ్లు  మంట  మండటం ,మసక బారడం ,
ఉ ) . గాయాలైతే  అసలే  మానక పోవడం  మొదలైనవి . 
ఊ ) . అరికాళ్ళల్లో  మంటలు  బాగా  పొడిచినట్లుగా    ఏర్పడటం , 

రు ) . శరీరం మీద పలు చోట్ల  గోకుడు / దురద పుట్టడం , 
రూ) . ఇంకను  అధిక మైతే , సొమ్మసిల్లడం లేదా   క్రింద పడి  పోవడం జరుగ వచ్చు . 

ఇలాంటి లక్షణాలు  (SYMPTOMS) , ఏ  ఒకటో రెండో కాకుండా   కనీసం  3 - 4  ఏర్పడి నప్పుడు  లేదా  కనబడినప్పుడు , ఈ క్రింది  నివారణ చర్యలు  తీసుకోవాలి . 
అ ) . తీపి  పదార్ధాలు , మిఠాయిలు  తినడం  మాని వేయాలి ,
ఆ ) . టీ , కాఫీ లలో  చక్కర మాని వేసి , షుగర్  బిళ్ళలు  గాని , పౌడర్  గాని టీలో  వాడాలి ,
ఇ ) .  పిండి పదార్ధాలు  తినడం తగ్గించాలి ,
ఈ ) . రోజుకు ఒక పూట అన్నం తిని ,మరొక పూట గోధుమ లేదా జొన్న  రొట్టెలను  తినడం  అలవాటు చేసు కోవాలి.  
ఉ ) . రోజు పరి గడుపున , రాత్రి పూట  కొన్ని మెంతులు  నాన బెట్టి .  ఆ నీటిని  త్రాగాలి . 
ఊ ) . లేదా  రోజూ  పరి గడుపున  మెంతి పౌడర్ ను  పావు  గ్లాస్ నీటిలో కలుపుకుని త్రాగాలి.
రు ) . వారానికి ఒక సారి  మెంతి ఆకు పచ్చడిని , పూదీన  ఆకు పచ్చడిని , కాకర కాయ  కూరను  వండుకుని తినాలి . 
రూ ) . ప్రతి రోజు కొంత టైం ,  వారికీ  సాధ్యమైన / అనుకూలమైన రీతిలో   వ్యాయాయం  చేయాలి,
రు ) . ఒంటరిగా ఉండకుండా  అందరితో  కలిమిడిగా ఉండటం అలవాటు చేసుకోవాలి . 

ఈ విధంగా  చేయడం వలన , ప్రాధమిక దశలో  ఉన్న వారికీ  పూర్తిగా కంట్రోల్ అవుతుంది . ఇక అప్పటికే  టైప్ 2 లోకి  వెళ్లిన వారికీ  , కంట్రోల్ కావడం  కొంచం కష్టం కావచ్చు . అలాంటి వారికీ , అవే  లక్షణాలు కనబడుతున్నట్లయితే ,  ఒక సారి  సరియైన  డాక్టర్ కు   చూపించుకుని  ' బ్లడ్ షుగర్ ' పరీక్షలు  చేయించుకోవాలి. దీని కొరకు  2 సార్లు  రక్త పరీక్ష లు చేస్త్తారు . ఉదయం లేవగానే  పరిగడుపున  ఒకసారి  బ్లడ్ తీసుకుని  మరియు  భోజనం చేశాక  2 గంటల తరువాత  మరల బ్లడ్ తీసుకుని ,  ' బ్లడ్ షుగర్ ' టెస్ట్ చేస్తారు . 
పరిగడుపున   టెస్టులో  రీడింగ్  70-100 mg/dl ఉన్నా మరియు  అన్నం తిన్న తరువాత టెస్ట్ లో  101  -140 mg/dl  వరకు  ఉన్నా  నార్మల్  గానే భావించాలి .  అంత కంటే  ఎక్కువ గా ఉంటే  మాత్రం , డాక్టర్   సూచించిన  మందులను  క్రమంగా  వాడాలి . అలానే , పైన  సూచించిన నివారణ చర్యలు  కంటిన్యూ చేయాలి . 

జ్వరం  ( FEVER):

జ్వరం (FEVER) అనేది సర్వ సాధారణం . జ్వరం (FEVER) అనుభవం  లేని వారు  ఈ ప్రపంచంలో  ఏ ఒక్కరూ  లేరు . అందుకని కేవలం  జ్వరం (FEVER) వచ్చిందని  ఏ  ఒక్కరూ  భయపడ నవసరం లేదు . 

జ్వరాలలో  కూడా అనేక రకాలు ఉంటాయి . సాధారణ జ్వరం , వైరల్  జ్వరం , మలేరియా జ్వరం , టైఫాడ్ జ్వరం , ఎల్లో జ్వరం ,  డెంగ్యూ  జ్వరం , చికెన్  గున్యా జ్వరం  మొదలైన వాటిని ముఖ్యంగా  చెప్పుకోవచ్చు . 

సాధారణంగా  ఒక మనిషి   'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE) 98.4 P/H డిగ్రీలు  ఉంటే  నార్మల్ అని చెబుతారు . ఒకవేల  'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE)  100.4 P/H డిగ్రీలు  ఉన్నా పెద్ద సమస్యగా భయపడనవసరం లేదు . అయితే 100.4 P/H డిగ్రీలు  దాటి అది కంటిన్యూగా ఉన్నా , తగ్గుతూ పెరుగుతూ ఉన్నా , వెంటనే  హాస్పిటల్ కు  తీసుకుని వెళ్లి  " బ్లడ్  టెస్ట్ " లను చేపించి దానికి  అనుగుణంగా  డాక్టర్ సూచించిన మందులు  వాడల్సి ఉంటుంది . జ్వరం (FEVER) రక ముందే  లేదా  కాస్త  జ్వరం (FEVER) అనేది  కనబడి నప్పుడే తగిన చర్యలు  తీసుకున్నట్లయితే , జ్వరం(FEVER) 100.4 P/H డిగ్రీలు దాటదు. 


జ్వరం (FEVER) రావడానికి  అనేక కారణాలు  ఉంటాయి . ఒక్కో రకం జ్వరాని కి  (FEVER), ఒక్కో రకం కారణం (REASON) ఉంటుంది . 

జ్వరం (FEVER) రావడానికి కారణాలు (REASONS) :

01. అధిక పనుల కారణంగా  అలసి పోవడం వలన ,
02. ఎండలో తిరగడం వలన ,
03. వాతావరణంలో మార్పులు కలగడం ,
04. కాలుష్యమైన  ఆహారాన్ని భుజించడం ,
05. కాలుష్యముతో కూడిన  గాలిని, విష వాయువులను  పీల్చడం వలన ,
06. కాలుష్యముతో కూడిన నీటిని త్రాగి నప్పుడు ,
07. భయం వలన 
08. దోమలు కుట్టడం వలన 
09. జంతువులు ( కుక్కలు , పందులు )  కరువడం  వలన , పక్షులు  , క్రిమి కీటకాలు  కుట్టి నపుడు ,
10. గాయాలు తగిలినప్పుడు ,
11. కాలినపుడు , కరెంట్ షాకు తగిలినప్పుడు ,
12. ఆపరేషన్  చేసి నప్పడు ,
13. ప్లాసిటిక్  కప్పులలో  టీ  లు త్రాగి నప్పుడు , ప్లాస్టిక్ ప్లేట్లల్లో  టిఫిన్ , భోజనం  చేసినప్పుడు , ప్లాస్టిక్ కవర్లలో పానీయాలు త్రాగి నపుడు , ఇలా అనేక కారణాల వలన , టెంపరేచర్ పెరుగడం , జ్వరం కలుగుతూ ఉంటుంది . 


సాధారణ జ్వరం (FEVER):  

సాధారణ జ్వరం (FEVER)  అలసి పోవడం వలన , ఎండలో  తిరగడం  వలన  వాస్తు ఉంటుంది , పోతూ  ఉంటుంది .  ఇలాంటి జ్వరం అయినట్లవుతే  ప్యారాసిటమాల్  మందులతో  తగ్గి పోతుంది . 

వైరల్  జ్వరం (VIRAL FEVER):

వైరల్  జ్వరం (VIRAL FEVER) , ఇది  ఇన్ఫెక్షన్  వలన వస్తుంది . అంటే కలుషితమైన  ఆహారాన్ని గాని , పదార్ధాలను తిన్నపుడు  , పానీయాలను  గాని  నీటిని గాని  త్రాగి నప్పుడు , కలుషితమైన గాలిని  పీల్చినపుడు , శరీరం లో , బ్లడ్ లో ఇన్ఫెక్షన్  ఫామ్  అవుతుంది . ఆ కారణంగా వైరల్  జ్వరం (VIRAL FEVER)  వస్తుంది . అప్పుడు  డాక్టర్ సూచించిన  పారాసిటమాల్ మరియు  అంటి బయాటిక్  కలిపి  తీసుకున్నట్లయితే వైరల్  జ్వరం (VIRAL FEVER)  రెండు మూడు రోజులలో తగ్గి పోతుంది .  జ్వరం తీవ్రతను బట్టి  డాక్టర్లు సెలైన్ ఎక్కిస్తారు . 



TO BE CONTINUED........

నోట్ : ఇది  కేవలం  ప్రజల  అవగాహన  కొరకు మాత్రమే  సూచించడం  జరిగింది .  ఎవరి నిర్ణయాలకు , ఎవరి ఖర్చులకు , ఎవరి ఆరోగ్యాలకు  వారే బాధ్యులు . అవసరం అనుకున్న వారు , వారి జబ్బులను బట్టి , సరియయిన డాక్టర్లను  సంప్రదించి  పరీక్షలు చేయించుకోవాలి , మందులు వాడాలి . వెళ్లిన ప్రతి సారీ  ఉచితంగా చేసే టెస్ట్ లు 'టెంప రేచర్' , 'బి . పి 'ని  అడిగి ప్రిస్క్రి ప్సన్  మీద వ్రాయ మని చెప్పాలి .