సీస పద్యాలు - ఛందస్సు (CHANDASSU ) - లిరిక్స్
కృషితో నాస్తి దుర్భిక్షం . ప్రయత్నం చేస్తే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు అంటారు పెద్దలు. అందుకని కాస్త సాధన చేయండి , సాధించండి ఫలితాలు .
ఛందస్సు ను సులువుగా నేర్చుకోవచ్చు . సాధన మొదలుపెట్టండి ఈ రోజే .
పద్యాలలో అనేక రకాలు ఉంటాయి , అందులో,
I. జాతిపద్యాలు
II. ఉపజాతిపద్యాలు
III. వృత్తపద్యాలు
I. జాతిపద్యాలు:
a).కందము
b)ద్విపద మొదలయినవి
II. ఉపజాతి పద్యాలు:
a) ఆటవెలది పద్యాలు
b) తేటగీతి పద్యాలు
c) సీస పద్యాలు
III. వృత్తపద్యాలు:
a) ఉత్పలమాల చంపకమాల
b) శార్దూలం
c) మత్తేభం
d) మత్తకోకిల
e) తరలము మొదలయివి
ఆటవెలది లక్షణాలు:
ఇందులో నాల్గు పాదాలు ఉంటాయి
ఒక్కొక్క పాదానికి ఐదేసి గుణాలుంటాయి
ఒకటోపాదం,మూడోపాదం ఒకవిధంగా ఉంటాయి
రెండో పాదం,నాలుగో ఒకవిధంగా ఉంటాయి
మొదటి పాదంలో వరుసగా మూడు సూర్య గణాలు,రెండు ఇంద్రగణాలుంటాయి
గణాలు:
నలము (IIII)
నగము (IIIU)
సలము (IIIU)
భగణం (UII)
రగణము (UIU)
తగణము(UUI)
పైవాటిని ఇంద్రగణాలంటారు
నగణం(III)
హగణం(UI)
పైవాటిని సూర్యగణాలంటారు
ప్రతిపాదంలో,నాలుగో గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
ప్రాసయతి నియమం:
పాదంలో మొదటి గణం హగణమయితే..నాలుగో గణంలో మొదటి రెండక్షరాలు హగణంగా ఉండాలి.
పాదంలో మొదటి గణం నగణమయితే...నాలుగో గణంలో మొదటి మూడక్షరాలు నగణంగాఉండాలి.
వేమన ఆటవెలది:
ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
చూడఁజూడ రుచుల జాడవేరు
పురుషులందుఁబుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ!!
ఈపద్యాన్ని బాగా గమనిస్తే,
ఒకటి,మూడు,నాలుగు పాదాలకు యతిమైత్రి చెల్లింది.
రెండోపాదంలో మాత్రం యతి మైత్రి చెల్లలేదు.
అందుకే వేమనకవి..ఈపాదంలో ప్రాసయతి వేసాడు
చూడ...జాడ
UI.....UI
చూడ..హగణం
జాడ...హగణం
ప్రాసయతిలో మాత్రలు సమానంగా ఉండాలి.
No comments:
Post a Comment