అంశం :- *ఉగాది*
శీర్షిక :- *పరాభవ నామ సంవత్సరం*
మామిడి వేప కొమ్మలకు పూతలు పూయగా
లేలేత చిగురులు తింటూ వసంత కోకిలలు కూయగా
మంచు తెరలు చీల్చుకుంటూ భానుడు ప్రకాశించగా
తరలి వస్తుంది ఉగాది అదిగదిగో యుగానికి ఆదిగా!
జీవిత అనుభవాలను తెలియజేసే వేడుక
భారతీయ సంస్కృతిసాంప్రదాయాలకు ప్రతీక
ఆనందాలకు ఐకమత్యానికి ఔన్నత్యానికి సూచిక
పచ్చని తోరణాలతో వసంత లక్ష్మికి స్వాగతమిక!
చేదు తీపి వగరు పులుపు కారం ఉప్పు
సమ్మేళనంతో తయారైన ఆరోగ్యసూత్రాల పచ్చడి
బోధించు జనులకు కష్ట సుఖాలు బాధలు
లాభనష్టాలు అన్నీ జీవితంలో సహజమేనని!
భవిష్యత్తును తెలియజేసే పంచాగ శ్రవణ అలవాట్లు
గ్రహస్థితులను వింటూ సంతోషంతో చప్పట్లు
అయ్యవారలతో ప్రజలు జాతకరీత్యా ముచ్చట్లు
పరిహారాలతో తీర్చుకునేరు రాబోయే గ్రహపాట్లు!
పప్పు బెల్లాలు నేతితో పసందైన వంటకం
పిల్లలలో పెద్దలలో "పరాభవ నామ" ఉగాది సంబరం
కొత్తబట్టలు పిండివంటలతో ఇంటిల్లిపాదికి ఆనందం
కులమతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పర్వం!
SOLUTIONS 2 ALL: Blog Description
"ప్రకృతి సిద్ధమైనవి, అసాధారణమైన సంఘటనలను , అసాధారణమైన జీవులను మినహాయిస్తే , సాదారణంగా యే సమస్య అయినా మనిషి సృష్టించు కున్నదే . కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది . లేదా ప్రత్యామ్నాయమైనా ఉంటుంది . సమస్యను పరిష్కరించడం ద్వారా మనకు ప్రయోజనం కలుగుతే దానిని సమస్య అనే కంటే ఇది ఒక " అనుభవం " (Experience) " అవకాశం " (Turning point) అనుకోవడం సరియైనది . ప్రయత్నించి చూడండి. విజయం మీదే . సర్వే జన: సుఖినో భవంతు "
Pages
- Home
- About us
- Privacy Policy
- Disclaimer
- సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)
- వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)
- ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)
- జ్యోతిష్యం (JYOTHISHYAM)
- Quiz /Puzzles
- AROGYAME MAHABHAGYAM
- బాల గేయాలు
- సీస పద్యాలు -ఛందస్సు - వీడియోలు (SEESA PADYALU - CHANDASSU- VIDEOS)
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- షేర్ మార్కెట్ /మ్యూచువల్ ఫండ్స్ (SHARE MARKET & MUTUAL FUNDS)
- కవి పరిచయాలు / INTRODUCTION OF POETS
- జీవిత సత్యాలు / LIFE CHANGING QUOTES / JEEVITHA SATYALU
- ఐడియాలు / టిప్స్ & ట్రిక్స్ (IDEAS / TIPS & TRICKS )
- ఛందస్సు (CHANDASSU ) - నేర్చుకుందామా !
- Sinima Songs -Lyrics / సినిమా పాటల - లిరిక్స్
- Budget 2023
- తెలుగు సాహిత్య ప్రక్రియల వీడియోలు / Sahitya Prakriyala Videos
Total Pageviews
Monday, March 9, 2026
ఉగాది - వచన కవిత
Monday, January 26, 2026
మాట్లాడటం ఒక కళ
అంశం: గమ్యం చెదరని కడలి అలలా
శీర్షిక: *మాట్లాడటం ఒక కళ*
*నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అంటారు*
*మాట* రెండక్షరాల పదమే
కానీ అది శక్తి వంతమైన *తూట*
అవసరమైతే కూల్చుతుంది బొబ్బిలి *కోట*
మంచనిపిస్తే వేస్తుంది జనులకు రాచ *బాట!*
మాట్లాడటం ఒక కళ
మనలో నుండి వచ్చేది మాట
మధురంగా ఉండాలి ప్రతి చోట
లేదంటే అవుతుంది జీవితం వేట
*గమ్యం చెదిరిన కడలి అలలా!*
మాట అర్ధ వంతంగా ఉండాలి
మాటలో పరి పక్వత ఉండాలి
సుగంధ పరిమళాలు వెదజల్లాలి
జన బాహుళ్యాన్ని ఆకట్టుకోవాలి
లేదంటే అవుతుంది లక్ష్యం
*గమ్యం చెదిరిన కడలి అలలా!*
ఏ సమస్య గురించి మాట్లాడుతున్నారో
దానికి పరిష్కారం కనబడాలి
సమస్య మరింత జటిలం కాకూడదు
క్రొత్త సమస్యలు సృష్టించ కూడదు
లేదంటే అవుతుంది సమస్య
*గమ్యం చెదిరిని కడలి అలలా!*
మాటలకు హద్దులు ఉండాలి
మంచి మాటలు పంచు కోవాలి
చెడు మాటలు దాచి పెట్టాలి
కఠిన మాటలను ఎవరితో చెప్పకూడదు
లేదంటే అవుతుంది మనుగడ ప్రశ్నార్థకం
*గమ్యం చెదిరిన కడలి అలలా!*
అందుకే అంటారు;
*మాట పెదవి దాటితే పెన్న దాటి నట్లని*
మాట్లాడటం రాక పోయినా
విషయం అర్ధం కాక పోయినా
సమాధానం లేకపోయినా
మౌనంగా ఉండటం సముచితం
లేదంటే బంధువులలో
స్నేహితులలో సమాజంలో
మనఃస్పర్ధలు పెరిగి, విభేదాలు తలెత్తి
ఆ మాటలే ఆగిపోవచ్చు
స్నేహబంధాలు దూరం కావచ్చు
*గమ్యం చెదిరిన కడలి అలలా!*
Wednesday, October 22, 2025
సాహిత్యంలో రాజకీయం
అంశం: సాహిత్యంలో రాజకీయం
శీర్శిక: యధారాజా తధాప్రజా
పగలంతా బగ బగ మండే కిరణాలతో
వెలుగులు చిమ్మే భాస్కరుడు
నిశిలో వెన్నెల రాణి చంద్రమతి
కోట్లాది తారలు, పంచ భూతాలు
నిత్యం డేగ కళ్ళతో వీక్షిస్తున్నా!
చావడులు ఎన్ని ఉన్నా
చట్టాలు ఎన్ని ఉన్నా
సి.సి. కెమరాలు ఎన్ని ఉన్నా
సి.బి.ఐ.లు ఎన్ని ఉన్నా
జీతాలను పెంచుకుంటూ
ఐదేళ్ళ సేవకే పెన్సన్లను తీసుకుంటూ
నటన చేస్తుండే స్వార్ధ నేతలు
విశ్వమంతా వ్యాపించే అవినీతిపరులు!
దీపముండగానే ఇల్లుచక్కబెట్టుకున్నచందాన
అధికారం చేపట్టి అందలమెక్కను
దేశ సంపదలను దోచుకునను
అమృత్ మహోత్సవ్ జరుపుకున్నా
రిజర్వేషన్లను కదిలించరైరి!
ఓటుబ్యాంక్ ను పదిలపరచుకుంటూ
కొత్త సీసాలో పాత బీరులా
ఏలు తుండిరి దేశాన్ని యధేచ్ఛగా
యధా రాజా తధా ప్రజ అన్నట్లు
సాగుతుండే లోకం
చావకుండ బ్రతుక కుండ
గడుస్తుండే పేదల కటిక జీవితం!
ఇక రాజకీయాలు సాహిత్యం లోకి ప్రవేశిస్తే
అవినీతికి చట్టబద్ధత ఏర్పడుతుంది
అది మూడు పువ్వులు ఆరు కాయలుగా
పరిఢవిల్లుతుంది.
కవులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కరువవు
దేశం నేతల ఆగడాలకు నెలవవు!
Tuesday, September 16, 2025
బహుముఖ ప్రజ్ఞాశాలులు ఇంజినీర్లు
*నేటి అంశం*- *కవితార్చన*
*సమాజాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రశీర్షిక: *బహుముఖ ప్రజ్ఞాశాలులు ఇంజినీర్లు*
గుండు సూది నుండి విమానాల
తయారీలో
నేల నుండి చంద్రమండలం పైకి
అంతరిక్ష నౌకలను పంపించడంలో
సందులోని కాలువల నుండి సముద్రాలపై
ఆనకట్టలు నిర్మించడంలో
ప్రముఖ పాత్ర పోషించే వారు ఇంజినీర్లు
ఇంజినీర్లు మెకానికల్ ఎలక్ట్రికల్
ఎలాక్ట్రానిక్ ఏరోస్పేస్ మైనింగ్ నేవీ
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎవరైనా కావచ్చు
నాణ్యమైన ఉత్పత్తులకు మూలవిరాట్టులు
నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ప్రముఖులు
భారత దేశాభివృద్ధిలో కీలక పాత్రధారులు
ఇంజినీర్లు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలులు
దేశ రక్షణలో మిస్సైల్స్ యుద్ద విమానాలు
నౌకల తయారీలో
ఆకాశ హార్మ్యాలు నిర్మించడంలో
రాకెట్లు పంపించడంలో
పోషిస్తున్నారు మన ఇంజినీర్లు శాస్త్రవేత్తలు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య డాక్టర్ ఎపిజె
అబ్దుల్ కలాం నరేంద్ర సింగ్ సత్య నాధన్
మాధవన్ గోపాల్ ఆల్బిన్ మరెందరో
ప్రముఖ ఇంజినీర్లకు నెలవు పుణ్య దేశం
భారత దేశం!
Wednesday, August 27, 2025
నిశీధిలో జాబిలి P
అంశం: చిత్ర కవిత
శీర్షిక: *నిశీధిలో జాబిలి*
నింగి లోన చందమామ నిగనిగ లాడుతూ
తొంగి చూస్తూ కొలను లోకి
నిదుర లేపి కలువ భామను వెన్నెల వెలుగులో
లేలేత బుగ్గలను ముద్దాడే!
ప్రతి మాసం శుక్ల పక్షం రోజులలో చకోరపక్షిలా
నిత్యం ఎదురు చూస్తున్న కలువ భామ
అరవిరిసిన ముద్దు గుమ్మలా
సిగ్గులొలక బోస్తూ చేయి చాపే!
సిగ్గు పైటను తొలగించి చందమామ
కలువను కనులారా తిలకించ
జనులకు కనబడకుండా చెలిని
మాయజేసే పడవను అడ్డంగాపెట్టి!
ఆహా! ఎంతటి మనోహర దృశ్యం నిశీధిలో
నిశ్చలమైన నదిలో జాబిలి వెన్నెలకు
చేపలు ఎగిరి పడుతుండే చంద్రవంకలా
పడవ నిట్టూర్పుతో బానిసై కదలకుండే!
Tuesday, August 26, 2025
లౌక్యం - సౌఖ్యం P
అంశం: *ఐచ్ఛికం*
శీర్షిక: *లౌక్యం- సౌఖ్యం*
*పెట్టని తల్లి పెట్టకనే పాయే*
*రోజూ పెట్టే ముదునష్టపుదన్న పెట్టకపాయే*
అనేది వాడుకలో ఉన్న నానుడి
దీనిని జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కోని వారు
బహుశా ఒక్కరైనా ఉండకపోవచ్చు!
ఎన్నో సార్లు సహాయం చేసినా
అనేక సార్లు ఆహారాలు అందించినా
వందల సార్లు దానధర్మాలు చేసినా
చాలా సార్లు మంచి సలహాలు ఇచ్చినా
పలు మార్లు శుభ కార్యాలకు వెళ్ళినా
ప్రతిసారీ అశుభ కార్యాలకు పోయినా!
వీలు గాక ఒక్కసారి చేయక పోతే
సమయం కుదరక ఒక్క సారి వెళ్ళకపోతే
గతంలో చేసినన్నీ వ్యర్ధమైపోతాయి
మీరు నీచంగా హీనంగా చూడబడుతారు
అంతేనా మీపై కోపం కలుగవచ్చు దూషించ వచ్చు
కారాలు మీరాలు రువ్వ వచ్చు
బంధుత్వం స్నేహం దూరం కావచ్చు!
అలా కాకుండా!
మీకు ఎప్పుడు వారితో అవసరమో
అప్పుడే సహాయం చేయడమో
అడిగినప్పుడే సలహాలు ఇవ్వడమో
అత్యవసర కార్యక్రమాలకు వెళ్ళడమో చేస్తే
వేయి సహాయాలు చేసిన గౌరవం
గొప్ప తనం ఆ ఒక్క సారికే దక్కుతాయి
కీర్తిస్తారు ఇదే నేటి సమాజం తీరు!
స్వార్ధమే కావచ్చు కానీ *లౌక్యం* అంటే ఇదే
మీకు సౌఖ్యం లభించేది కూడా ఇక్కడే!
భూ కైలాస్ దేవాలయం
అంశం: మై సెల్ఫీ
శీర్షిక: *భూ కైలాస్ దేవాలయం*
అదిగదిగో భూ కైలాస్ దేవాలయం
తాండూరు పట్టణం నడిబొడ్డున వెలసిన
అవనిలో అద్భుత కట్టడం సుందర జల మార్గం
జల మార్గం ఉంటుంది రెండు వందల మీటర్లు
అందులో గలగలా పారుతుంది స్వచ్ఛమైన నీరు
చల్ల చల్లని నీటిలో మెల్లమెల్లగా అడుగులెస్తుంటే
ఆహా! ఏదో తీయని ఆనందం మదిలో మెదులు
ఇక భక్తుల నోటిని ఆపడం ఎవరి తరం
ఓం నమః శివాయ అంటూ కేరింతలతో
మారుమ్రోగు భూకైలాస జలమార్గం!
వెళ్ళడానికి రావడానికి వెడల్పాటి ఒకే మార్గం
పొడుగూనా మధ్యలో బిగించిరి స్టీల్ పైపులు
ఒకరికొకరు తగలరు ఎవరి దారి వారిదేనోయ్
జల మార్గాంతం వరకూ జ్యోతిర్లింగాలే!
నీటి లోతు ఉండు మోకాళ్ళ నుండి గొంతు వరకు
ఎవరి భక్తి వారిదే కొడుతారు కొబ్బరి కాయలు
ఆనందంతో కొడుతుంటారు పిల్లలు కేరింతలు
అబ్బో! పెద్దలు మునుగుతారు తేలుతారు!
చివరలో ఉంటుంది శివుని ఆలయం
శివుని సేవించు కొని తీర్థం పుచ్చుకొని
తిరిగి జల మార్గం గుండా రావచ్చూ
లేదా అక్కడి నుండే బయటకు వెళ్ళ వచ్చు!
వారేవా!ఎత్తెన తరువులు ఆహ్లాదకర ప్రకృతి
చుట్టూరా అందమైన మనోహర శివపార్వతుల
సప్త ఋషుల త్రిమూర్తుల గణపతి విగ్రహాలు
ఎన్నో మరెన్నో అనుభవిస్తే గానీ తనివి తీరదు
అన్నీ వసతులు ఉచిత భోజనమూ!
Saturday, August 23, 2025
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
అంశం: విప్లవ జ్వాల
శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*
*ప్రభువెక్కిన పల్లకి కాదు*
*దానిని మోసిన బోయలెవ్వరు?*
అంటూ మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లు
నేతలు పదవులు అధికారం
చేపట్టడంతోనే హీరోలు కారు
అందులో నాయలకు ఓటు వేసి గెలిపించిన
ఓటర్లే నిజమైన హీరోలు!
అలాంటి ఓటర్లను ప్రజలను
లెక్క చేయకుండా అధికార దాహంతో
దోచుకుంటూ మోసం చేస్తూ
భూ కబ్జాలు చేస్తూ అవినీతి పాలనతో
ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ!
ఉచితాల మాయలో దింపినా
త్రాగుడుకు బానిసలును చేసినా
చిత్రసీమలో లాగా వారసులను
పోటీలో దింపుతూ దోచకుంటున్నా
దేశ రాష్ట్రాల సంపద ఏవో కొన్ని కుటుంబాల
కబంధ హస్తాలలో బంధించబడినా!
ఏదో ఒక రోజు విప్లవ జ్వాలలా
స్వార్ధ అవినీతి ప్రభుత్వాలను
ప్రజలు గద్దెలు దింపుతారు!
*పిల్లి యే కదా అని దానిని*
*నాలుగు జైలు గోడల మధ్య బంధిస్తే*
*అది పులిగా మారి రక్కుతుంది*!
ఎన్నో దశాబ్దాలు గడిచినా
నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నా
ప్రజల సమస్యలు పరిష్కారం
కాక పోవడమే కాదు పై పెచ్చు పెరుగు తుండే!
ప్రజలు కలిసి కట్టుగా ఉండి
విప్లవ జ్వాలలు రగిలిస్తే
అది అగ్ని పర్వతమైనా బద్దలవక తప్పదు
అగ్ని జ్వాలలు ఎగిసి పడక తప్పవు!
ఈ సారి అయినా ప్రతి ఐదు సంవత్సరాలకు
ఒక సారి రాష్ట్ర పతి పాలన రావాలని కోరాలి
అవినీతి భూతాన్ని శాశ్వతంగా
వదిలించుకోవాలి!
హృదయాలను విశాలం చేసుకుంటేP
*నేటి అంశం: సామాజికం*
శీర్షిక: *హృదయాలను విశాలం చేసుకుంటే*
పెళ్ళంటే నూరేళ్ళ పంట
అదే నిజం కావాలి ఇంటింటా
కానీ దురదృష్టవశాత్తు
మనుసులు భావాలు కలియక
అవుతున్నాయి జీవితాలు పెంట పెంట!
వివాహం చేసుకునే ముందే
అర్ధం చేసుకోవాలి ఒకరినొకరు
మోహాన్ని ప్రేమని భ్రమ పడక
అందం ఆహార్యం అద్భుతమనుకోక
భాష సంస్కృతి సాంప్రదాయాలు
సమ్మతమైతేనే నిర్ణయం తీసుకో!
మనస్థత్వాలు భావాలు ఆలోచనలు
కలిసాకనే పెళ్లి వేడుకలు జరుపుకో
ఇక ఆ తరువాత కష్టమో నష్టమో
కలిసి నూరేళ్ళు అన్యోన్యంగా జీవించు!
చేతికున్న ఐదు వ్రేళ్ళే
సమానంగా ఉండవనేది నగ్నసత్యం
ఒకే కడుపులోజన్మించిన ముగ్గురుపిల్లలు
అందాలకు ఆలోచనలకు పోలికెక్కడ?!
అలాంటిది కొత్త వ్యక్తులు తక్షణమే
కలిసిపోతారనుకోవడం అత్యాశే
పెళ్ళిబంధమన్నాక సమస్యలు సహజం!
హృదయాలను విశాలం చేసుకుంటే
ఎలాంటి సమస్యలైనా చిన్నవగును
ఒకరినొకరు అర్ధం చేసుకొని
సంయమనం పాటిస్తూ
సర్దుబాటు చేసుకోగలిగితే
ఆ జీవితం స్వర్గధామం!
లేదంటే పెళ్ళైన ఆరు నెలలకే
విలువైన జీవితం కాలం ధనం వృధానే
పరువు ప్రతిష్టలు గంగలో కలియు
ఇరుకుటుంబాలు నడిసంద్రంలో ఈదుతూ
విడాకుల కొరకు కోర్టుల చుట్టూ తిరుగేరు!
పంతాలుపట్టింపులతో విడాకులు వచ్చినా
ఆ తరువాత ఇరువురూ
మరల పెటాకులైన వారితోనే వివాహాలు
లేదా ఒంటరిజీవితాలేనన్న పచ్చి నిజాన్ని మరువరాదు!
మెగాస్టార్
అంశం: చిరంజీవి
శీర్శిక: *మెగాస్టార్*
మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు
నాటి మేటి నటులలో గొప్ప నటుడు
చలనచిత్ర రంగంలో ప్రవేశించి నటనలో
నవనవోన్మేషంతో విభిన్న వేషధారణలతో
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రేక్ డాన్స్ లతో
కొత్త ఒరవడి సృష్టించిన మహానటుడు!
పాత్ర ఏదైనా అందులో లీనమయ్యే స్వభావం
అతడికి దేవుడిచ్చిన వరం
డాక్టర్ గానూ లాయర్ గానూ
రాజకీయ నాయకుడుగానూ నృత్యం లోనూ
మరెన్నో పాత్రలలోనటించి సత్తాచూపిన
బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి
మెగాస్టార్ నటుడే కాదు
గొప్ప మహోన్నత మానవతావాది
బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి ఎంతోమందికి
ఉచితంగా రుధిరాన్ని అందిస్తున్న ప్రాణదాత
చిరంజీవి నటుడు మానవతా వాదే కాదు
నిజ జీవితంలో రాజకీయ నాయకుడు
దానకర్ణుడు సంఘసంస్కర్త సామాజిక వేత్త
వారసత్వ నటుల సృష్టి కర్త ఆదర్శమూర్తి
వినూత్నమైన గొప్ప నటనలకు గాను
అనేక నంది అవార్డులు రివార్డులు
పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి
ఎన్నో పురస్కారాలు అందుకున్న
వినూత్నమైన హీరో మెగాస్టార్ చిరంజీవి
Thursday, August 21, 2025
వృద్ధాప్య దశ
అంశం: చిత్ర కవిత (వృద్ధాప్య దశ)
శీర్షిక: *ఎండిన మ్రానులా*
*సముద్రాన్నైనా ఈదవచ్చు నేమో గానీ
ఈ జీవన సాగరంలో
ఎన్నో ఆటుపోట్లను మరెన్నో ఇక్కట్లు
సముద్రంలోని సుడిగుండాల వలెను
ఎన్నెన్నో అవమానాలు మరెన్నో అగచాట్లు
బాధలు సంతోషాలు సుఖాలు దుఃఖాలు
అచ్చట్లు ముచ్చట్లు అందమైన తీపి గుర్తులు
గెలుపులు ఓటమిలు నిందలు అపనిందలు
దెబ్బలు ఎదురు దెబ్బలు
ఆరోగ్యాలు అనారోగ్యాలు అన్నీ గుండెలోనే
సంపద పోగు చేస్తే నిరుపయోగమని
పైసా పైసా కూడబెట్టి పిల్లలను చదివిస్తే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలై
మనసుకు నచ్చిన వారిని మనువాడి
రెక్కలొచ్చిన పక్షుల్లా తెగిన గాలిపటాల్లా
దారిన వదిలేసి దూరం వెడలి పోయిరి
అంతిమ దశలో అర్ధమాయే
పిల్లలకు కష్ట సుఖాలు తెలుపాలని
ఆర్ధిక వ్యవహారాలు వివరించాలని
పిల్లలను డబ్బు డాబుసరితో కాదు
మంచి మనసుతో ప్రేమతో ఉన్నతంగా పెంచాలని
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
ఇప్పుడు విచారిస్తే ఏమి ప్రయోజనం
గడిచిన కాలం తరిగిన వయసు తిరిగి రాదు
జీవిత కాలం తోడుంటానని బాస చేసిన
భాగస్వామి స్వార్డంతో వెడలి పోగా
*ఎండిన మ్రాను* వోలే మొండి బ్రతుకాయే
ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి?
ఎక్కడికి వెళ్ళాలి? ఈ చేతి కర్ర సాయంతో
ఇంకెంత కాలం ఈదాలి? ఈ జీవన సాగరంలో
ఆ పడమటి సంధ్యాతీరం కోసం వేచి చూస్తూ!
మహా పతివ్రత మండోదరి
శీర్షిక: మహా పతివ్రత మండోదరి
అందాల రాశి
అతిలోక సుందరి
అపురూప సౌందర్యవతి
మమతానురాగాలకు మారు పేరు
మృదుభాషిణి రావణ సతి *మండోదరి*!
విశ్వకర్మ కుమారుడు రాక్షసరాజు మయుడు
దేవకన్య హేమల గారాల పుత్రిక
సకల వేద పండితుడైన రావణుడి భార్య
పంచకన్యలలో మండోదరి ఒకరు!
మహా సాత్వికీ సద్గుణాల వాణి
పరమపవిత్ర పతివ్రతా శిరోమణి
లంకా రాజ్యానికి పట్టపు రాణి
మహిళా లోకానికి ఆదర్శ వనిత!
రావణుడు తనను సామవేద దాన
దండోపాయాలతో మోహించి పెళ్ళి చేసుకోగా
తల్లి దండ్రుల క్షేమ కాంక్షతో
రావణుడిని వివాహమాడిన పుణ్య స్త్రీ!
భర్త క్షేమం కోరి ఇంద్రలోకం వెళ్ళి
విభీషణుడి సహాయంతో అమృతభాండం
రావణుడి పొత్తికడుపులో పెట్టి
ఆయుష్షును పెంచిన ప్రతివ్రత మండోదరి!
Tuesday, August 19, 2025
దేవుడే వరమిస్తే P
అంశం: విశ్వ ప్రేమ / దైవం యెడల ప్రేమ/భక్తి
శీర్షిక: *దేవుడే వరమిస్తే*
*సృష్టి ప్రతి సృష్టికి మూలం*
*ఈ విశ్వానికి ప్రకృతి తోరణం*
*విశ్వంలో ఉంది ఏదో ఒక శక్తి, అదే దైవం!*
ఈ సృష్టి ఎంతో విచిత్రం
అందులో మానవ జీవితం నిమిత్త మాత్రం
దేవుడు వరమిస్తాననడం మరో విచిత్రం
మానవుడికి ఇంకేమి కావాలి సంతోషం!
ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో
మానవ జీవితం ఉత్కృష్టం మహోన్నతం
మనిషి జీవితమే దేవుడిచ్చిన ఒక వరం
అందుకు చెప్పాలి నిత్యం ప్రణామం!
పైకి ఏది విసిరితే అదే క్రింద పడుచుండు
విశ్వానికి ఏమి ఇస్తే అదే మనకు లభించు
మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడునే
భక్తి తోనే ముక్తి దైవ కాంక్ష తోటే మోక్షం!
దేవుడే వచ్చి వరమిస్తానంటే
కోరుకుంటా విశ్వ శాంతిని
ప్రకృతి పంచభూతాలు సమన్వయంతో
ప్రశాంతంగా ఉండాలనీ ప్రార్ధిస్తా!
ప్రజలందరికీ సద్బుద్ధిని ప్రసాదించమని
అందరూ ఆనందంగా సంతోషంగా
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
జీవించాలని దైవాన్ని స్మరిస్తా
అందరిలో ఒకరిని కావాలని వేడుకొంటా!
Monday, August 18, 2025
ప్రతిస్పందన
అంశం: ప్రతిస్పందన
శీర్శిక: *పుండొక చోట ఉంటే మందొకచోట*
మత్తు పానీయాలు సారా బ్రాండీ బీరు విస్కీ
వంటివి శీతల పానీయాలు మత్తు పదార్ధాలు గంజాయి జర్దా కొకిన్ సిగరెట్ల వంటివి
రాష్ట్రంలో చాక్లెట్లు బిస్కెట్లు లాగా!
మొదట ఆశలు రేకెత్తిస్తాయి ధ్యాసలు పెంచుతాయి
కోరికలు పుట్టిస్తాయి తియ్యగా ఆకర్షిస్తాయి
జోలపాటలు పాడుతాయి జోకొడుతాయి
మత్తు లోకి దించుతాయి మాయజేస్తాయి!
సరదాగా ప్రారంభమైన మత్తు పానీయాలు
మనిషికి అలవాటుగా మారి పోతాయి
ఆ అలవాటే మరికొన్నాళ్ళకు మెల్లమెల్లగా
గమ్మత్తు గా తనను బానిసను చేస్తాయి!
అవి పోకిరిగాను సంఘ విద్రోహ శక్తిగాను
సమాజానికి గుదిబండగా మార్చుతాయి
మత్తు పానీయాలు మత్తు పదార్థాలు
స్వయం కృపారాధంతో సర్వం నాశనం చేసి
మనిషిని *చిత్తు* చిత్తు చేస్తాయి!
*పుండొక చోట ఉంటే మందొక చోట* పెడుతే
ప్రయోజనం శూన్యం
అన్నింటికీ మూలం అవినీతి స్వార్ధ నేతలే
నేతలకు మడుగులొత్తే బ్యూరో క్రాట్స్
పోలీసు వ్యవస్థలు
చట్టాలు ధనికుల చుట్టాలు
తోటలో తులసి మొక్కలను పెంచుతే
తులసి మొక్కలు
గంజాయి మొక్కలను పెంచితే
గంజాయి మొక్కలే పెరుగుతాయి
Saturday, August 16, 2025
గజల్
గజల్
విదేశీ వస్తువుల వాడొద్దు /భారత ప్రగతినీ
మరువద్దుస్వదేశీ వస్తువుల వీడొద్దు /భారత ఉన్నతినీ మరువద్దు
***
మనజాతీమతాలు వేరైన / భారతీయులంతా ఒకటేను
మన దేశ ఉత్పత్తి మనదోయి /నాయకుల వినతినీ మరువద్దు
***
పరదేశ వస్తువుల వాడకము/ నిశ్చయము జనులు ఆపాలోయి
స్వదేశీ సరుకుల నెప్పుడునూ /జాతి ఉత్పత్తినీ మరువద్దు
***
టారిఫ్ లు పెంచినా /భీతిల్ల జేసినా/ బెదురకూడదోయీ
ఎగుమతులు తగ్గినా /దిగుమతులు పెరిగినా/ నీతినీ మరువొద్దు
***
కల్తియే లేనట్టి చౌకైన వస్తువులు /మనవేను కృష్ణా!
స్వయం సమృద్ధిని సాధించు /భారత జాతినీ మరువొద్దు