Sunday, August 27, 2017

ప్ర : సెల్ ఫోన్ /స్మార్ట్ ఫోన్ ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే ఏమి చేయాలి ?

ప్ర :  సెల్  ఫోన్ /స్మార్ట్ ఫోన్  ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే  ఏమి చేయాలి ?


జ :  సెల్  ఫోన్ /స్మార్ట్ ఫోన్  ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే  వెంటనే  ,

01. అందులోని  ఫోన్ నెంబర్లకు  ఫోన్ చేయాలి . ఒక వేల  రింగు అవుతూ  ఎవరూ  లిఫ్ట్  చేయడం లేదంటే , అది  ఎక్కడో ఒక చోట  ఉంది , మనం మరిచి పోయి ఉంటాం   అని ,  తిరిగిన  చోట్లన్నీ వెదకుతో , అక్కడికి  వెళ్లి  చూడాలి . కనబడక పోతే మళ్ళీ ఫోన్ చేయాలి .  రింగ్ శబ్దాన్ని  బట్టి   మనం  సులువుగా  ఫోన్ ను గుర్తించ వచ్చు .

02.  ఆ ఫోన్ లోని  నెంబర్లకు  ఫోన్  చేసి నట్లయితే ,  అందరూ  ఒక్క తీరుగా  ఉండరు కదా .  కొందరు  న్యాయ బద్దంగా  నడుచుకునే వారు ,  వెంటనే  లిఫ్ట్ చేసి  ' ఫోన్  పలానా  చోట పడిందండి , నా వద్ద ఉంది . వచ్చి తీసుకెళ్లండి  ' అని చెబుతారు .  వెంటనే  థాంక్స్  తెలిపి , వారి వద్దకు వెళ్లి  ఫోన్ తీసుకొచ్చు కోవాలి .  ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగినవి .

03.  ఫోన్ చేసినప్పుడు , ఒక వేల  స్విచ్  ఆఫ్ చేసి  ఉన్నట్లయితే  , దానికి మూడు  కారణాలు ఉంటాయి .  ఒకటి,  ఛార్జింగ్ లేక  ఫోన్ రింగ్ కాక పోవడం. రెండు , సిగ్నల్స్  లేక పోవడం . మూడు , ఎవరైనా తీసుకుని  , దానిలోని  సిమ్  లను  తీసివేయడం  లేదా బ్యాటరీ తీసి వేయడం  లేదా స్విచ్ ఆఫ్ చేయడం .

04. అన్ని ప్రయత్నాలు  చేసాక  , ఫోన్ ఎవరి చేతిలోనో  పడిందని నిర్ధారించుకున్నాక , ఇక మనకు దొరకదు  అనుకున్నపుడు , వెంటనే  అందులోని  సెల్ నెంబర్లను  బ్లాక్ చేయాలి .

05. సెల్ నెంబర్లను  బ్లాక్ చేయాలంటే , ఒక్కో సర్వీస్  ప్రొవైడర్ కు  , ఒక్కో పద్ధతి , టోల్ నెంబర్స్ ఉంటాయి .

06. BSNL  Cell Number  అవుతే  BSNL Service provider  టోల్  ఫ్రీ నెంబరుకు  ఫోన్ చేసి  బ్లాక్ చేయ మని చెప్పాలి .  ఉదా : BSNL Service provider  టోల్  ఫ్రీ నెంబరుకు , BSNL  సెల్  నెంబరు నుండే   ఫోన్  చేయాలను కుంటే 1503 నెంబరుకు , ఇతర నెట్  వర్క్  నుండి ఫోన్ చేయాలంటే   1800-180-1503  ఫోన్  చేసి  , రికార్డెడ్  వాయిస్ ప్రకారం  ఫాలో  అయి , చివరగా  ఆపరేటర్ తో  మాట్లాడి , సెల్ నెంబరును  బ్లాక్ చేయ మని చెప్పాలి .  అప్పుడు  వారు బ్లాక్  చేసి  మనకొక  రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు .  అటుపిమ్మట  BSNL Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన  అప్లికేషన్ ఫిల్  చేసి , ఆధార్  జిరాక్స్ కాపీ  , ఒక ఫోటో  ఇచ్చినట్లయితే  10 రూ . లు . తీసుకుని  అదే నెంబర్ తో కొత్త  'SIM' ఇస్తారు .  సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్  కంటిన్యూ  అవుతుంది . కాంటాక్ట్స్  , సిమ్  లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ  మన  సెల్ నెంబర్ ను  మిస్ యూస్  చేయడానికి , మన పైన ఇతరుల కు  సంబందించి న  కేసులు  పడకుండా  ఉండడానికి  వీలవుతుంది . 

07. అలానే  Rel.Jio  Cell Number  అవుతే, Rel.Jio  సెల్  నెంబరు నుండే   ఫోన్  చేయాలను కుంటే   Rel.Jio  Service provider  టోల్  ఫ్రీ నెంబరు 198 లేదా 199 కు లేదా ఇతర నెట్ వర్క్ ఫోన్ నుండి ఫోన్ చేయాల్సి వస్తే  1800-88-99999 కు  ఫోన్ చేసి ,ఆపరేటర్ కనెక్ట్ అయ్యాక  బ్లాక్ చేయ మని చెప్పాలి .  అటుపిమ్మట  Rel.Jio Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన  అప్లికేషన్ ఫిల్  చేసి , ఆధార్  జిరాక్స్ కాపీ  , ఒక ఫోటో  ఇచ్చినట్లయితే  ఉచితంగా  అదే నెంబర్ తో కొత్త  'SIM' ఇస్తారు .  సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్  కంటిన్యూ  అవుతుంది . కాంటాక్ట్స్  , సిమ్  లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ  మన  సెల్ నెంబర్ ను  మిస్ యూస్  చేయడానికి , మన పైన ఇతరుల కు  సంబందించి న  కేసులు  పడకుండా  ఉండడానికి  వీలవుతుంది . 

08. ఆ  తరువాత  వెంటనే  మీ  సేవద్వారా   అన్ని వివరాలతో , పత్రాలతో  కంప్లైన్ట్  చేయాలి . దానికి  వారు  145/- రూ . లు . ఫీజు  తీసుకుని  ఒక రసీదు  ఇస్తారు . దానిని  తీసుకుని వచ్చి  మరల  , మీకు  దగ్గర  లోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి F. I. R  బుక్ చేయించాలి .  మీ సెల్ కు ఇన్సూరెన్స్  ఉంటే  , మీరు సుమారు  75% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా   క్లెయిమ్  చేసుకోవచ్చు .  లేక పోతే  2 నుండి  6 నెలల  లోపు  దొరుకుతే  పోలీసులే  కాల్ చేసి ఇస్తారు.  అప్పుడప్పుడు  పోలీస్ స్టేషన్ లో  వాకబ్  చేస్తూ ఉండాలి .  చాన్సెస్  మాత్రం  1 తో 5%. 
All the best.

www.sollutions2all.blogspot.com


Saturday, August 26, 2017

ప్ర : మతి మరుపు (LOSS OF REMEMBRANCE) ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ?

ప్ర : మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ? మతి మ రుపు  ఎందు వలన కలుగుతుంది ? దీనిని  అధిగమించడం ఎలా ?

మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ?
జ : మతి మరుపు  (LOSS OF REMEMBRANCE) అనగా  జరిగిన, జరుగ బోయే  సంఘటనలు  , చేసిన , చేయ బోయే  పనులు  మరియు  పేర్లు , వస్తువులు  గుర్తు లేక పోవడం  , బంధు మిత్రులను గుర్తు పట్టలేక పోవడం , మరిచి పోవడం  మొదలైన వాటిని  మతి మరుపు  అంటారు . ఒక్కోసారి  మన  మైండు , అనుకోకుండానే  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది . ఎంతటి తెలివి గల వారైనా , క్షణ క్షణం ఎన్ని జాగ్రత్తలు  తీసుకున్నా ,  ఒక్కో సారి  మతి మరుపు  బారినుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరు . ఎవ్వరూ ఎదో ఒకటి  పోగొట్టుకో కుండా  , మరిచి పోకుండా  ఉండ లేరు . ఇది నగ్న సత్యం . అంత మాత్రాన   వీరిని  తెలివి తక్కువ  వారు  అని గాని, ఎందుకు  పనికి  రాని  వారు అని గాని  అనడం , నిందించడం  తగదు.   ఒక సారి   గొప్ప శాస్త్ర వేత్త ' ఆల్బర్ట్  ఐనస్టీన్' డబ్బులు  డిపాజిట్  చేద్దామని  బ్యాంకుకు  వెళ్ళాడట .  గొప్ప  శాస్త్ర  వేత్త  కాబట్టి , తెలిసిన వారు దగ్గర వచ్చి  పలకరించడం  , నమస్కరించడం  చేస్తున్నారు . డబ్బులు డిపాజిట్ చేద్దామని  వచ్చాక  తన పేరునే  మరిచిపోయాడు . అప్పుడు  అతను  తన ప్రక్కనున్న వారిని  తన  పేరు ఏమిటో  చెప్పమన్నా డట .  వారు ముందుగా ఆశర్యపోయినా  చెప్పక తప్పలేదు . మీ పేరు  ' ఆల్బర్ట్  ఐనస్టీన్'  అని చెప్పారట .  దీని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది . మాటి  మాటికీ  పిల్లలను గాని , పెద్దలను గాని  , మతి మరుపు  అని అనడం వలన , నిందించడం వలన మతి మరుపు  అనేది మరింత  పెరిగే అవకాశం  ఉంది.  మతి  మరుపు  అనేది  ఒక జబ్బు కాదు . ఇది దీర్ఘ కాలం  ఉండదు .  

మతి మరుపు  ఎందు వలన కలుగుతుంది ? 

మతి  మరుపు కలగడానికి  అనేక మైన కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైన  కారణాలు :

01. పుట్టుకతోనే , జన్యు పరమైన  మానసిక లోపాలుండటం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

02.  అనారోగ్యం  బారిన పడటం . ఉదా : తీవ్ర  జ్వరం , హై  బి . పి  ,  టైపు 2  షుగర్  వ్యాధి , క్యాన్సర్  ,  మూర్ఛ  , హార్ట్ అటాక్ , దీర్ఘ కా ల వ్యాధులు  మొ. లైన  వాటి వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

03.  ఒక్కో  సారి  కొన్ని  కుటుంభ సమస్యల వలన లేదా  బయటి సమస్యల వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

04.  కొన్ని  అనుకోని సంఘటనల  వలన  మనసు కంట్రోల్ తప్పి  మతి మరుపు  ఏర్పడవచ్చు .

05. ఆర్ధిక  , సామజిక , రాజకీయ , శారీరక  బాధల  వలన , ఆందోలనల  వలన మతి మరుపు  ఏర్పడవచ్చు .

06. ఆహార లోపం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

07.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం వలన , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

08. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

09. ఇష్టం  లేని  వ్యక్తులు  తారస పడినా , ఇబ్బంది  అనిపించే  వ్యక్తులు  ఇంటికి వచ్చినా , ఇష్టం  లేని  వ్యక్తుల తో  ప్రయాణం చేసినా  , షాపింగ్ చేసిన మైండు కంట్రోల్ తప్పి , మైండ్  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది  . అప్పుడు ఏమి జరిగింది , జరుగా బోయేదేదో   గుర్తుండదు .  మన పంచేంద్రియాలు  అచేతనంగా  ఉంది పోతాయి .  ఆ విధంగా  చేతిలోని  స్టీరింగ్  చేయి సడలి  ఆక్సిడెంట్లు  కావచ్చు . చేతిలోని  వస్తువులను  మరిచి పోవచ్చు  . అందువలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

10. అత్యంత ఇష్టమైన  వ్యక్తులు  చూసినా , కలిసినా , మాట్లాడినా  ఆ సంతోషంలో   , ఆ మైకంలో పడి  , మన  పంచేంద్రియాలు  గాడి తప్పి  నష్టాల  బారిన  లేదా  కష్టాల  బారిన  పద వచ్చు . 

11. ఆయాసం , అలసట , గాయాల పాలవడం , నిద్రలేమి  మొదలగునవి  కూడా  మతి మరుపుకు  దరి తీయవచ్చు .  

12.  వయస్సు మీద  పడుతున్న కొలది   మన పంచేంద్రియాల  శక్తి తగ్గి పోతుంది .  సుమారుగా  50 - 60 సం . రాలు  దాటా మంటే   వినికిడి శక్తి  తగ్గి పోతుంది .  కంటి చూపు  మందగిస్తుంది  , స్పర్శ  జ్ఞ్యానం  కోల్పోతాం .   రుచి  వాసన   గుర్తించ లేక పోవచ్చు . మతి మరుపు  ఏర్పడవచ్చు .

13. ఒంటరి తనం గా జీవించడం  వలన  మతి మరుపు  పెరుగుతుంది . అలానే  ఆయుస్సు కూడా  తగ్గిపోతుంది . 

మతి మ రుపు ను  అధిగమించడం ఎలా ?

మతి మరుపు  బారిన పడకుండా  ఎవ్వరూ  తప్పించుకోలేరు . అయినా  కొన్ని  ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడం వలన మతి మరుపు  బారిన పడకుండా  కొంత వరకు  తగ్గించు కోవచ్చు . అవి ,

01.  జన్యు పర లోపాలు జరుగకుండా  రక్త సంబంధీకులైన  , దగ్గరి  మేన రికాలతో వివాహాలు  జరుప కూడదు . 

02. ముందు జాగ్రత్తగా  ఆరోగ్య పరమైన  చర్యలు తీసుకోవడం వలన , జన్యులోపాలు  లేకుండా  , మెంటల్ డిజార్డర్  లోపాలు లేని  పిల్లలు జన్మించడానికి  అవకాశముంటుంది . 

03. రెగ్యులర్ గా  హెల్త్ చెకప్ చేయించుకుని  సరియయిన మందులు  వాడటం వలన  మతి మరుపును  నివారించవచ్చు . 

04. రెగ్యులర్  గా  సమతుల్య ఆహారం  ,  పాలు,  పండ్లు , గ్రుడ్లు తీసుకోవడం  వలన  మతి మరుపును  దూరం చేయవచ్చు . 

05. రెగ్యులర్ గా మెడిటేషన్ , వ్యాయామం  చేయడం వలన  మతి మరుపును తగ్గించ వచ్చు .

06. ఎల్లప్పుడూ  మానసికంగా , శారీరకంగా  ఉత్సహంగా , ఉల్లాసంగా  ఉండే విధంగా  ప్లానింగ్ చేసుకోవాలి . 

07. కనీసం  రోజుకు   6 గంటలు  (  వీలు కాకా పోతే  ఏ  సమయమైనా కావచ్చు )  నిద్రించే విధంగా  ఏర్పాటు చేసుకోవాలి . 

08. క్రమ బద్దంగా   భోజనం చేయడం  అలవరచు కోవాలి . 

09.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం  , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం  మొదలైన వాటిని  తగ్గించాలి . 

10. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  తగ్గించి , శాకాహారులు గా  మారాలి  . 

11.  ప్రతి వ్యక్తికి  నిత్యం ఏర్పడే సమస్యలకు  , బాధలకు  , నష్టాలకు   వేంటనే   భీతి   చెంద  కూడదు . ఆందోళనకు గురి కాకూడదు . 

12. అందరిలో  కలిసి జీవించడం  ,  ఆడటం , పాడటం , ఆహ్లాద కర వాతావరణంలో  నివసించడం వలన  మతి మరుపు ను  నివారించ వచ్చు .    ఆయుస్సును కూడా  పెంచుకోవచ్చు . 
www.sollutions2all.blogspot.com

Friday, August 18, 2017

ప్ర : Aadhaar Card (ఆధార్ కార్డు ) ఉందా లేదా , ఉంటే సెల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా , ఈ ఆధార్ నెంబర్ గల వారు మగ లేక ఆడ నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది మొదలైన విషయాలను తెలుసుకోవడం ఎలా ?

ప్ర :   Aadhaar Card  (ఆధార్  కార్డు )  ఉందా  లేదా , ఉంటే  సెల్ నెంబర్  లింక్  అయ్యిందా లేదా ,  ఈ ఆధార్  నెంబర్  గల వారు  మగ  లేక  ఆడ  నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది  మొదలైన  విషయాలను  తెలుసుకోవడం  ఎలా ?


జ :  ఆధార్  కార్డు  ఉందా  లేదా , ఉంటే  సెల్ నెంబర్  లింక్  అయ్యిందా లేదా ,  ఈ ఆధార్  నెంబర్  గల వారు  మగ  లేక  ఆడ  నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది  మొదలైన  విషయాలను  తెలుసుకోవడం   చాలా  సులువు . 

ఈ మధ్య కాలంలో  సుమారుగా  80 లక్షల  ఆధార్ కార్డులను  రద్దు చేశారు .  అందుకు  కారణాలు అనేకం .  పిల్లల  వివరాలు  రెండు  సార్లు  తప్పుగా నమోదు చేయడం  కావొచ్చు ,  మరణించినవారివి కావొచ్చు ,  వ్రేలు ముద్రలు  ఒకసారి ఇచ్చి  , మరోసారి ఇవ్వకుండా  , తప్పుడు పేర్లతో  తీసుకోవడం  కావొచ్చు .  ఈ విధమైన  కారణాల వలన  సుమారుగా  80 లక్షలకు  పైగా   ఆధార్ కార్డులను  రద్దు చేశారు .

అందుకని  మీ ఆధార్ కార్డులు  ఉన్నాయా లేక రద్దయినవా  తెలుసుకోవడం  అత్యవసరం . ఎందుకంటే  నేడు  ఆధార్ కార్డులకు  ఉన్నంత ప్రాముఖ్యత  మరో కార్డుకు  లేదు . ఏ  సంక్షేమ పధకాలు  అందాలన్నా ,  సెల్ కనెక్షన్ కావాలన్నా , గ్యాస్ కనెక్షన్ కావాలన్నా , బ్యాంకులో అకౌంట్  తెరువాలన్నా , పాన్ కార్డు , పాస్ పోర్ట్ కావాలన్నా  ఆధార్ కార్డు కావల్సిందే .  రేపు  ఓటు వేయా  లన్నా  ఆధార్ కార్డునే  నిర్బంధం  చేయ వచ్చు .  అందుకనే  దీనిని  ' బహుళార్ధ సాధక  కార్డు '  ఆని చెప్పుకోవచ్చు .  

ఆధార్ కార్డు ఉందా లేదా  తెలుసుకోవడం ఎలా ?

01. www.uidai.gov.in  అనే   వెబ్ సైట్  ను  ఓపెన్ చేయండి . 
02. అందులో 'Home page'  లో   'Aadhar online Services'  క్రింద  3 సబ్  టాబ్స్  కనిపిస్తాయి . 
03.  3 సబ్  టాబ్స్ లలో , 3 వ టాబ్  ' Aadhar Services'   (ఆధార్ సర్వీసెస్ )  క్రింద  ' Verify Aadhar Number'  అని కనిపిస్తుంది . దానిని  క్లిక్  చేయండి . 
04. క్లిక్ చేయగానే  , వేరే పేజీ లోకి వెళుతుంది  అని  మెస్సేజ్ వస్తుంది . అప్పుడు 'OK' ను   క్లిక్  చేయండి . 
05.  వేరే  పేజీ ఓపెన్ అయ్యాక , అక్కడ మీ ఆధార్  నెంబరును  ఎంటర్ చేయండి . 
06.  ఆ తరువాత , 'క్యాప్చాను '  ఎంటర్ చేసి , ' Verify' ని  క్లిక్ చేయండి . 

వెంటనే మీకు  ఎడమ బాగాన , గ్రీన్ కలర్ లో  రైట్ గుర్తు వస్తుంది . అప్పుడు  మీ ఆధార్ కార్డు లైవ్ లో ఉంది అని అనుకోవాలి .  దానితో పాటే ,  సుమారుగా మీ వయస్సు ఎంత , మగ  లేక  ఆడ ,  సెల్ నెంబర్  ఆధారుకు  లింక్ అయ్యిందా  లేదా, ఒక వేల  లింక్ అవుతే  ఏ సెల్ నెంబర్ లింక్ అయ్యింది  మొదలైన  అన్ని వివరాలు  మనకు  కనిపిస్తాయి . 

సద్వినియోగం చేసుకోండి . మీకు నచ్చుతే షేర్ చేయండి . 

www.sollutions2all.blogspot.com

Wednesday, August 16, 2017

Q. Is Aadhar Cards link up with the 'Voter cards' necessary to control duplicate and Fake voters as well as 'Corruption' and Black Money'?

Q. Is Aadhar Cards link up with the 'Voter cards' necessary to control duplicate and Fake voters as well as 'Corruption' and Black Money'?

A. Yes Aadhar Cards link up with the 'Voter cards' is necessary to control duplicate and Fake voters as well as 'Corruption' and Black Money'.

Recently there is a news that about 11.34 Lakhs. 'PAN Cards' were found by the Central Board Of Direct Taxes (CBDT) as duplicate and fake. In the same way, If the State and Central Govt(s) and the Central Election Commission plans to link up Aadhaar Cards with 'Voter Cards', about 3 Cr. and above duplicate and Fake 'Voter cards' may be found in our country to cancel them. As we aware that the value of one duplicate and fake vote. 'Black Money' people , may win in the elections with the one fake vote also. That is the opportunity in our election system. Or permit only 'Aadhar Cards' as the 'Voter Cards'. Cancel all the 'Voter Cards' . For the transparent elections and for the transparent Governments, and for the transparent ruling this linking , 'Aadhar cards to Voter Cards' may helpful to control the 'Corruption' and to control the 'Black Money.' We hope the Hon'ble and dynamic Prime Minister and the 'Central Election Commission' may take necessary steps to eradicate the Duplicate and Fake Voter Cards.

www.sollutions2all.blogspot.com

Tuesday, August 15, 2017

వృద్దాప్య దశలో (OLD AGE PERIOD) ఒంటరి తనానికి కారణాలు ఏమిటి ? వృద్ధాప్య దశలో లేదా ఒంటరి తనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? వీటిని అధిగమించడం ఎలా ?

ప్ర : వృద్దాప్య  దశలో (OLD AGE PERIOD)  ఒంటరి తనానికి  కారణాలు ఏమిటి ? 


జ . వృద్ధాప్య దశ  అనేది  ఎవరికైనా  సహజం . వృద్దాప్య  దశ  ను ( అకాల మరణాలు తప్పా )  ఎవరూ  తప్పించుకోలేరు . అలానే  వృద్దాప్య  దశ లో వచ్చే  మానసిక , శారీరక  మార్పులను , చిన్న చిన్న  జబ్బులను   ధన  వంతులైనా  , పేద వారైనా  , స్త్రీలైనా , పురుషులైనా  అనుభవించి   తీరాల్సిందే .

వృద్దాప్య  దశలో (OLD AGE PERIOD)  ఒంటరి తనానికి  కారణాలు;

01. వృద్ధాప్య దశ లో  భార్య  మరణిస్తే  భర్త  ఒంటరి అవుతాడు . భర్త  మరణిస్తే భార్య ఒంటరి అవుతుంది . 


02. పిల్లలు లేక పోవడం వలన  వృద్ధాప్య దశ లో భార్యా  భర్తలు  లేదా ఎవరో ఒకరు  ఒంటరి వారు అవుతారు . 



03. పిల్లలు  ఉన్నా  , వారు విదేశాలలో  ఉద్యోగాలు చేస్తూ   అక్కడే  స్థిర పడి  పోతే, స్వదేశంలో  తల్లి దండ్రులు  ఒంటరిగానే  జీవించ వలసి వస్తుంది .  

04. స్త్రీలు గాని  , పురుషులు గాని  అసలు వివాహమే  చేసుకోక పోవడం వలన  , చుట్టాలు , బంధువులు  లేదా స్నేహితులు  ఎవ్వరూ  తోడు లేక పోయినా , వృద్ధాప్య  దశలో  ఒంటరి వారవుతారు . 

www.sollutions2all.blogspot.com


   

Saturday, August 5, 2017

ప్ర . 'స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ' (STATE BANK OF INDIA ) బ్యాంక్ , సేవింగ్స్ అకౌంట్లపైన చెల్లించే వడ్డీని 4% నుండి 3. 5% తగ్గించాక , పొదుపు చేసుకునే ప్రజలకు ప్రత్యామ్నాయం ( ALTERNATIVE SAVING METHODS WITH HIGH INTEREST RATES ) ఏమీ లేవా ?

ప్ర:  'స్టేట్ బ్యాంక్ అఫ్  ఇండియా ' (STATE BANK OF INDIA )  బ్యాంక్ ,  సేవింగ్స్  అకౌంట్లపైన  చెల్లించే వడ్డీని  4% నుండి  3. 5%  తగ్గించాక , పొదుపు చేసుకునే  ప్రజలకు  ప్రత్యామ్నాయం      ( ALTERNATIVE  SAVING METHODS WITH HIGH INTEREST RATES )  ఏమీ లేవా  ?

జ : 'స్టేట్ బ్యాంక్ అఫ్  ఇండియా ' (STATE BANK OF INDIA ) తీసుకున్న  నిర్ణయం , చిన్న పొదుపు దారులకు  పెను శాపంగా మారి పోయింది . ది . 31.07. 2017 . నుండి  కోటి రూపాయల  వరకు  పొదుపు చేసుకున్న  చిన్న మదుపు  దారులకు , అకస్మాత్తుగా   సాలుసరి వడ్డీని  4% నుండి 3.5% నికి  తగ్గించి వేసింది .  ఇక కోటి , ఆపైన  సేవింగ్ అకౌంట్లల్లో  పొదుపు చేసిన వారికీ  4%  వడ్డీని  యదా విధిగా  కొనసాగించ నుంది . రేపు  మిగిలిన  బ్యాంకులు  కూడా  అదే  బాట  పట్ట వచ్చు .   



వాస్తవంగా  చూస్తే , 3.50%  అంటే , రూ . లు . 100/-  365 రోజులు  పొదుపు చేస్తే ,  ఆ  తరువాత  బ్యాంకు వారు  మంకు   చెల్లించే  వడ్డీ  రూ . లు . 3.50/-. అంటే  రోడ్డు మీద  కనీసం  ఒక్క ' టీ ' కూడా రాదన్న మాట . అదే  బ్యాంకు వారు  మినిమమ్ బ్యాలన్స్  ఒక్క రూపాయి  తగ్గినా  100/- రూ . లు. మరియు జి ఎస్ టి  18% కలిపి  118 రూ . లు .  సేవింగ్  అకౌంట్లకు డెబిట్ చేస్తారు . కరెంట్ అకౌంట్లో  కోట్ల డబ్బు  ఉన్నా  రూపాయి  వద్దే చెల్లించారు .  పెద్ద వాండ్లు తీసుకున్న  లక్షల  కోట్ల రూపాయలను  సునాయాసనంగా  రద్దు చేస్తారు . ఆర్ . బి . ఐ  గణాంకాల  ప్రకారం  గత 5 సం . రాలలో  బ్యాంకులు రద్దు చేసిన రుణాలు , 2012-13 లో  27,231 కోట్లు, 2013-14 లో  34,409 కోట్లు , 2014-15 లో 49,018 కోట్లు ,2015-16 లో  57,586 కోట్లు   మరియు 2016-17 లో 81,683 కోట్లు  . మొత్తం  2,49,927  కోట్లు .   



సామాన్య  , మధ్య తరగతి  పొదుపు దారుల వద్ద  ఎక్కువ  డబ్బు ఉందనుకుని , వీరికి  ఆదాయ  అవకాశాలు అధికమని  అనుకుని  వడ్డీ రేటును  వీరికి  3.50%  తగ్గించారా లేక   కోటి , ఆపైన  పొదుపు చేసిన  వారు ,  పేద వారు అని  అను కుంటున్నారా   లేక వారి వడ్డీ  తగ్గిస్తే   బ్యాంకులో  ఉన్న డబ్బును  విత్ డ్రా  చేస్తారని  అనుకున్నారో  సామాన్య ప్రజలకు  తెలియడం లేదు . కోట్ల కొద్దీ  డబ్బు  కలిగి ఉన్నవారు ,   నిజాయితీగా  కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి  పన్నులు  సక్రమంగా  చెల్లిస్తున్నారు  అని   వీరికి  వడ్డీని  యదా విధిగా   4%  ఉంచారా , లేదా  బ్యాంకులకు పేద వారిని నుండి  అయితే  ఎక్కువ  ఆదాయం  సంపాదించ వచ్చు  , ఏ పేచీ  కూడా  ఉండదు అని అను కున్నారా   ఏమో  పేద మధ్య  తరగతి  ప్రజలకు  పాలు  పోవడం లేదు .  వీటికి  తోడు   మదుపు దారులకే  , మినిమమ్  బ్యాలన్స్  చార్జీలు ,  అనేక మెయిన్  ఇతర చార్జీలు  పడుతుంటాయి .  31 మే  వచ్చిందంటే , ముక్కు పిండి  భీమా డబ్బులను వసూలు  చేస్తారు .  పేద వారు కాబట్టి  , ఒక వేల  సరిపడా బ్యాలన్స్ లేక పోతే ,  భీమా డబ్బులు  డెబిట్ కాక్క పోతే  ' జన్ ధన్ భీమా ' వర్తించదు . కరెక్టుగా  మినిమమ్ బ్యాలన్స్ వరకే  మెయింటైన్  చేస్తే , ఇలాంటి  భీమా డబ్బులు డెబిట్ అయినా , ఎస్ ఎం ఎస్  చార్జీలు  డెబిట్ అయినా , మినిమమ్ బ్యాలన్స్ తగ్గిందని  మరల చార్జీలు  డెబిట్ చేస్తారు . దీనికి  జి ఎస్ టి (GST) 15 %  నుండి  18% పెరగడం వలన  , కొంత కాలం పోతే బ్యాంకు లంటే ప్రజలకు విసుగు కలగ  వచ్చు . అప్పుడు  మరల ' బార్ట్ ర్  సిద్ధాంతాని ' (BARTER SYSTEM) కి  వెళ్లి పోయే అవకాశాలు మెండుగా  ఉన్నాయి . 



ప్రాక్టికల్ గా  ఆలోచిస్తే ,  కేవలం   వేయి  రూపాయల నుండి  5 లక్షలు  డబ్బు ఉన్న  పేద మధ్య తరగతి  ప్రజలు  మాత్రమే  , సేవింగ్ ఆకొంట్లలో  డబ్బును  అలానే నిల్వ ఉంచు కుంటారు . అధిక  మొత్తం  కోట్లల్లో  ఉన్న వారు  ( బినామీ అకౌంట్ హోల్డర్లు , ఫేక్ అకౌంట్ హోల్డర్లు , ఇన్ ఆపరేటివ్  అకౌంట్ హోల్డర్లు  , కోర్టు ప్రకారం  లావాదేవీలను  నిలిపివేసిన  హోల్డర్లు మినహాయిస్తే )  ఖచ్చితంగా  వారు  , ఇంత కంటే ఎక్కువ  ఆదాయం  లభించే  సాధనాలలోనే  డిపాజిట్ చేస్తారు . 


కాబట్టి  5 లక్షల  నగదు నిల్వలు  ఉన్న సేవింగ్ అకౌంట్లకు  4% వడ్డీని  ,  5 లక్షల నుండి  ఆపైన  ఒక కోటి  డబ్బులు  కలిగి ఉన్న సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు  3.5% , కోటి ఆపైన  నగదు నిల్వలు  ఉన్న అకౌంట్లకు  3%  వడ్డీని  నిర్ణయిస్తే  బాగుండేదని  పేద మధ్య తరగతి  ప్రజల ఆలోచన . 

ఏది ఏమైనా  , నిర్ణయం జరిగి పోయింది కాబట్టి ,  చిన్న మదుపు దారులు , అధిక ఆదాయం కొరకు , వడ్డీ ఎక్కువ లభించే  ప్రత్యామ్నాయ  మార్గాల కొరకు  అన్వేషించక  తప్పదు . వాటిలో  ముఖ్య మైనవి ;


01.  సీజనల్ గా  చౌకగా దొరికే   మనకు  కావాల్సిన నిత్యావసర, మరియు  అత్యవసర    సరుకులను / వస్తువులను  3 నెలలకు  సరిపడా   లేదా  6 నెలలకు  సరిపడా ,లేదా 12 నెలలకు  సరిపడా    కొని  జాగ్రత్తగా నిలవ  చేసుకోవాలి .  దీని వలన  అధిక  పొదుపు కల్సి వస్తుంది . 

ఉదా : వర్షా  కాలంలో ఉల్లిగడ్డలు  రూ . లు .10/- కిలో ఉంటే  , అవే  ఎండా కాలంలో                  రూ. లు.100 /-  లకు  కిలో  అవుతుంది. చింత పండు  10/- కిలో  సీజన్లో ఉంటే  , 6 నెలల తరువాత  100/- కి కిలో అవుతుంది . నూనెలు , పప్పు దినుసులు, కరం , పసుపు , ఎల్లిగడ్డలు ,  బియ్యం, ధాన్యాలు  ఇలా ఎన్నో నిలువ ఉండే వస్తువులు / సరుకులు ఉన్నాయి . వాటిల్లో పొదుపు చేయండి . కుండలో  నీరు  నిండుగా ఉంటే ,  డబ్బాలో బియ్యం నిండుగా గా వుంటే   ఆ మానసిక  ధైర్యమే వేరు . జీవించగలమనే ధై ర్యం  ఏర్పడుతుంది , జీవించాలనే ఆశ కలుగుతుంది  .  నేటి మన  పొదుపు క్రమ శిక్షణే  పొదుపు మనకే కాకుండా , రేపటి తరాలకు కూడా  ఆటో మాటిక్ గా  పాసాన వుతుంది 


02. అధిక వడ్డీ లభించే  ఫిక్స్డ్ డిపాజిట్లల్లో  పొదుపు చేయాలి . కొన్ని బ్యాంకులు  7 రోజులు ఆ పైన రోజులకు కూడా  ఫిక్స్డ్ డిపాజిట్లను  ఇస్స్యూ చేస్తున్నాయి . అక్కడ  అక్కౌంట్స్ ఓపెన్ చేసుకుని  అక్కడ  పొదుపు చేయండి . ముందుగా  మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే  ఆరాతీయండి . ఎక్కడ వడ్డీ  ఎక్కువ వస్తుందో  అక్కడే  ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి .  ఏ బ్యాంక్ అయితే దగ్గరగా ఉంటుందో , ఏ బ్యాంక్ అయితే  సరియయిన సేవలను అందిస్తుందో , ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీ   చెల్లిస్తుందో  అబ్యాంకునే ఎంచు కొండి .  చిన్న చిన్న మొత్తలుగా  ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి , ఆటోమాటిక్  రోలోవర్  అప్షన్ , మరియు  ఆన్  లైన్ ఎనీ వేర్ అప్షన్  కావాలని అడగండి .  నామినీ ని  రిజస్టర్ చేయ మనండి . 



03. బ్యాంకుల కంటే ,  పోస్టాఫీసులలో  కొంచెం అధికంగానే  వడ్డీ లభిస్తుంది .   వీటినైనా ఎంచు కోవచ్చు . కాక పోతే ఇక్కడ  ఏజెంట్ల బెడద అధికంగా ఉంటుంది . బ్యాంకులంత  స్పీడ్ ఉండదు . లిక్విడిటీ  తక్కువ . ఈ  10 నిమిషాల్లో ఓ 2 లక్షలు కావలనంటే  మీనా మేషాలు లెక్క బెడుతారు . కొంత మంది  క్లర్కులు  కొట్లాటకే  దిగుతారు. ఒక రోజు ముందుగా చెప్పాలని వాదిస్తారు . బ్యాంకులలో  అలాంటి  సమస్యలు  లేవు . 



04.  కాస్త చదువుకున్న వారు , షార్ట్ టర్మ్ కొరకు ,  మేలిమైన , మన్నికైన  ' మ్యూచువల్  ఫండ్స్ '  (MUTUAL FUNDS)  లలో ని  డెట్స్  ఫండ్స్ లలో గాని , లీక్వ్డ్ ఫండ్స్ ల లో గాని  పెట్టుబడులు చేయవచ్చు .  అదే లాంగ్ టర్మ్ కొరకయితే  లార్జ్ క్యాప్ ఫండ్స్లో  గాని , సెక్టార్ ఫండ్స్ ల లో గాని ,  పన్నులు తగ్గించే  ఫండ్స్  (ELSS)ల లో గాని  పొదుపు చేయ వచ్చు .  ఇక్కడ మరల  గ్రోత్  ఫండ్స్  లేదా  డివిడెండ్  అప్షన్లను ఎంచు కోవచ్చు .' సిస్టమాటిక్ ఇన్వెస్టుమెంట్ ప్లాన్  ' (SIP)  ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయ వచ్చు . 'సిస్టమాటిక్ విత్ డ్రాల్  ప్లాన్ '(SWP)  ఎంచు కోవచ్చు . ఎక్కడైనా  50,000/- పొదుపు మించితే  ' పాన్ ' (PAN) కంపల్ సరి . అలానే ఇక్కడ పొదుపు  చేయాలనంటే  50,000/- లోపైనా  ' పాన్ '(PAN) అవసరం . 



05. మరింత అనుభవం  ఉన్న వారు  లాంగ్  టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు , మంచి  కంపెనీల  షేర్లల్లో  పెట్టుబడి పెట్ట వచ్చు . కనీసం  5 , 10 సం . రాలైనా  వేచి ఉంటేనే  లాభాలకు ఆస్కారం ఉంటుంది . పెన్నీ  షేర్ల జోలికి  వెల్ల  కూడదు . స్పెక్యులేషన్ చేయ కూడదు . అత్యాశకు పోకూడదు . ర్యూమర్లను  నమ్మకూడదు . అప్పు చేసి  శేర్లల్లో గా ని , మ్యూచువల్ ఫండ్స్ లలో  గాని పెట్టుబడులు చేయ రాదు . 



06. క్యాష్ లెస్ మెడిక్లైయిం  పాలసీలను , కుటుంభం మొత్తానికి  కలిపి  తీసుకోవచ్చు .  సేవింగ్ ఆకొంట్లలో డబ్బు నిలువ ఉంచుకునేది ఇలాంటి అవసరాలకే  కదా . అందు కని , ముందు జాగ్రత్త గా  , ఇలాంటి పాలసీలను , మంచి ఇన్స్యూరెన్స్  కంపెనీల వద్ద  తీసుకున్నట్లయితే , సేవింగ్ అకౌంట్లలో డబ్బు లేకున్నా పెద్ద సమస్య ఉండదు . 



07. ఏమైనా  హౌసింగ్  లోన్స్ , వెహికిల్ లోన్స్ , బయట ఎక్కువ వడ్డీ అప్పులు ఉన్నట్లయితే , అడ్వాన్సుగా తీర్చి వేయవచ్చు . ఇప్పడు ముందస్తుగా తీర్చినా పన్నులు గాని , రుసుములు గాని ఉండవు . 



08. ఖచ్చితంగా  అవసరం ఉంటుంది అని మీరు  అనుకుంటే ఇప్పుడే అవసరమైన  బంగారు  నగలను  కొని పెట్టు కోవచ్చు . ఎందు  కంటే , ఒక  వైపు  పొదుపు ఖాతాలో  వడ్డీ రేటు తగ్గింది . మరో వైపు  అక్కడ చౌకగా బంగారు  నగలు లభిస్తున్నాయి .  మల్లీ  బంగారం  ధర  పెరుగ  వచ్చు గాని , ఇప్పట్లో వడ్డీ రేట్లు పెరుగవు .

09. సేవింగ్ అకౌంటల్లల్లో  అధిక నగదు నిల్వలు ఉంటె , అదే బ్యాంకులో  ' రికరింగ్  డిపాజిట్  అకౌంట్ '  ఓపెన్  చేస్తే  , ఖచ్చితంగా  అధిక వడ్డీ  లభిస్తుంది.

10. ఎల్ . ఐ . సి . వారి  సీనియర్  సిటిజన్స్  పెన్షన్ పధకం  లో  ( 60 సం . రాలు  దాటినా వారు )  గాని , పోస్టాఫీసు  సీనియర్ సిటిజన్ పధకంలో కానీ  డిపాజిట్ చేసి నట్లవుతే  సాలుసరి   8.3%   వడ్డీ లభిస్తుంది .  



11. మనకున్న  వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసు కోవచ్చు . 



12. ఉన్న గృహాలను  రెన్నొవేషన్  చేసు కోవచ్చు .  లేదా కొత్తవి కట్టు కోవచ్చు .

13. పిల్లల  ఉన్నత  చదువులకు , లోన్లు తీసుకునే బదులు , పెట్టుబడులు పెట్టవచ్చు . 
14. చట్ట బద్దంగా  రియల్ ఎస్టేట్  బిజినెస్   చేయ వచ్చు .  




N.B: " MUTUAL FUNDS AND SHARES INVESTMENTS  ARE SUBJECT TO MARKET RISKS. READ ALL THE RELATED DOCUMENTS CAREFULLY BEFORE INVESTING".




 N.B: " THE SUGGESTIONS GIVEN AT THE INTEREST OF POOR AND MIDDLE CLASS PEOPLE. BEFORE TAKING ANY  INVESTMENT DECISIONS , CONTACT ANY RELIABLE INVESTMENTS CONSULTANTS. THIS BLOG WRITER IS NOT LIABLE FOR ANY DAMAGE OR LOSS TO ANY ONE ".  




www.sollutions2all.blogspot.com



'

Friday, August 4, 2017

Q. HOW TO GET TRADE LICENCE (PROVISIONAL) THROUGH ONLINE? ప్ర . ట్రేడ్ లైసెన్సు (తాత్కాలికం ) ను ఆన్ లైన్ ద్వారా పొందడం ఎలా ?

Q:   HOW TO GET TRADE LICENCE  (PROVISIONAL) THROUGH ONLINE? 
ప్ర: ట్రేడ్ లైసెన్సు  (తాత్కాలికం ) ను  ఆన్ లైన్ ద్వారా  పొందడం ఎలా ?

జ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక , మన రాష్ట్రంలో  అన్నీ  ఆన్ లైన్ ద్వారా  పొందడం  సులువై  పోయాయి . మరియు  పారదర్శకంగా  ఉంటున్నాయి . సత్వరం సేవలు అందుతున్నాయి . అవినీతి కి  ఆస్కారం  లేకుండా  జరిగే సేవలు  కాస్త మెరుగవుతున్నాయి . 
'తాత్కాలికమైన  ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE)  ను తీసుకోడానికి , లేదా అప్ప్లై  చేయ డానికి  ముందుగా  మీరు ఈ  క్రింది వాటిని  రడీగా  పెట్టుకోవాలి . అవి ,

01. ఆధార్  కార్డు (AADHAR CARD),
02. పాన్  కార్డు  (PAN CARD),
03. ఇ మెయిల్  ఐడి  (e.Mail Id),
04. సెల్ నెంబర్ 
05. రెంట్ అగ్రిమెంట్ లేదా  సొంత  ఆస్తి  పత్రాలు  ( RENT AGREEMENT OR OWNER SHIP     
      TITLE DEED) ,
06. ప్రాపర్టీ టాక్స్  రశీదు . (PROPERTY TAX RECEIPT),
07. కరెంట్ బిల్  (ELECTRICITY BILL)
08. డెబిట్ కార్డు  ( DEBIT CARD )  ఆన్ లైన్లో   పన్ను  చెల్లించ డానికి , మొదలైనవి . 


ఆ తరువాత ,  ఆన్ లైన్లో  ఏ జిల్లా అయితే  ఆ జిల్లా వెబ్ సైట్ ద్వారా   ' ఆన్ లైన్ ట్రేడ్ లైసెన్సు ' లింకును   క్లిక్ చేస్తే   ఫామ్ ఓపెన్ అవుతుంది .  ఉదా : సిద్దిపేట్  జిల్లా వెబ్ సైట్ కావాలను కున్నపుడు  ఈ క్రింది విధంగా   http://siddipetmunicipality/tradeapp)    లేదా  CDMA website http://cdma.telangana.gov.in/tradeapp   అని అడ్రస్ బార్లో టైప్ చేసి  ఎంటర్ బటన్ నొక్కాలి . 

అప్పడు మనకు దానికి సంబంధించిన   వెబ్సైట్  ఓపెన్  అవుతుంది . అక్కడ  ఎడమ వైపు  మనకు కొన్ని  లింకులు  బ్లింక్  అవుతూ  కనబడుతాయి.  అక్కడ '' అప్లికేషన్ కొరకు  ట్రేడ్  లైసెన్సు  న్యూ''  ( Application for Trade licence NEW) ను   క్లిక్ చేయాలి . అప్పుడు ఓక  అప్లికేషన్ ఫారం  ఓపెన్ అవుతుంది .  అక్కడ అడిగినవన్నీ   ఫిల్   చేసి , అడిగిన డాక్యుమెంటును  అప్ లోడ్ చేసి , సబ్మిట్  చేయాలి . ఆ తరువాత  సూచించిన  రుసుమును  ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి . అప్పుడు మన సెల్  కు   ఒక రెఫరెన్సు  నెంబరు వస్తుంది . దీనిని జాగ్రత్త పరుచుకోవాలి . 

ఆ తరువాత , సంబంధించిన  అధికారులు  వచ్చి , వాస్తవాలు నిర్ధారించుకున్నాక , కమీషనరుకు   రిపోర్ట్ పంపిస్తారు .  వివరాలు అన్ని కరెక్టుగా ఉన్నలయితే ,  'తాత్కాలికమైన  'ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE)  ను అప్ లోడ్ చేస్తారు . 

ఎప్పటికప్పుడు  అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు .  అదే వెబ్ సైట్  డౌన్ లోడ్స్ లోకి  వెల్లి ,  'ట్రేడ్ లైసెన్సు ' (PROVISIONAL TRADE LICENCE)  ను డౌన్ లోడ్ చేసుకోవాలి . 

ఆల్ ద  బెస్ట్ . 

ఇది మీకు న చ్చితే  ఇతరులకు షేర్ చేయండి . 

www.sollutions2all.blogspot.com