Friday, June 30, 2017

ప్ర : HOW TO LINK AADHAR NUMBER TO PAN NUMBER ? ఆధార్ నంబర్ (AADHAR NUMBER) ను పాన్ నంబర్ (PAN NUMBER) కు లింకు చేయడం ఎలా ?

ప్ర :  ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (PAN NUMBER)  కు  లింకు చేయడం  ఎలా ? 

జ : ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (PAN NUMBER)  కు  లింకు చేయడానికి  చివరి తేదీ  30.06. 2017. 

01. ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (NUMBER)  కు  లింకు చేయడం  చాలా  సులువు .  అందుకు గాను ,  https://incometaxindiaefiling.gov.in/  అనే  వెబ్ సైట్ ను  టైప్ చేసి , ఎంటర్ కొట్టండి .  లేదా  Google Search లో   incometaxindia అని  టైపు చేసి ఎంటర్ కొట్టండి .  అప్పుడు అనేకమైన  అడ్డ్రస్ లు  కనిపిస్తాయి . అందులో నుండి  మీకు కావాల్సిన  లింకును   https://incometaxindiaefiling.gov.in/ సెలక్ట్ చేసుకుని  క్లిక్ చేయండి .

02. అప్పుడు మీకు  ' e-Filing Anywhere Anytime ' అనే   ఆదాయ  పన్నుల శాఖ వారి , ఒక  బ్రోవుజర్ (Browser ) ఓపెన్ అవుతుంది .   

03. అక్కడ  ఎడమ బాగాన (LEFT SIDE), 'Link Aadhar New ' అనే  లింక్ కనబడుతుంది . దానిని  క్లిక్ చేయండి . అప్పుడు మరో  బ్రోవుజర్ (Browser ) ఓపెన్ అవుతుంది . 

04.  ఇక్కడ   కొన్ని వివరాలను  నింపమని  అడుగుతుంది .  అందులో  
మొదటిది,  PAN  . -----పాన్ నంబర్  ను  క్యాపిటల్ లెటర్స్ లో  ఎంటర్ చేయండి . 
రెండవది ,  Aadhar Number     అడుగుతుంది . ఆధార్ నంబర్ ను  ఎంటర్ చేయండి . 
మూడవది , Name as per Aadhar   అడుగుతుంది.  కరెక్టుగా  ఆధార్ ప్రకారముగా  ఎంటర్ చేయండి .   
నాల్గవది , I have only year of  birth in Aadhar card.     'టిక్'     చేయండి . 
ఐదవది , క్యాప్చాను  ....... ... ఎంటర్ చేయండి . 

ఆ తరువాత  దేనిని టచ్  చేయ కుండా , ' Link Aadhar ' ను  క్లిక్ చేయండి . 

సరిపోతుంది .  అప్పుడు మీకు 'Aadhar link with PAN successful'  నే మెస్సేజ్ వస్తుంది . అంటే  ఆధార్ నంబర్  , పాన్ నంబర్  కు  లింక్ అయ్యింది  అని  గుర్తించాలి . 

N.B: ఇక్కడ  ఒక ముఖ్య విషయాన్ని  గమనించాలి .  ఆధార్ కార్డు లోని పేరు ,  పుట్టిన రోజు  అలానే  పాన్ కార్డు లో ఉన్న పేరు,  పుట్టిన రోజు  అక్షరం ముక్క తేడా లేకుండా  ఉండాలి . అప్పడే  లింక్  అవుతుంది . లేక పోతే ఎట్టి  పరిస్థితులలో కూడా  లింకు కాదు .  దాని గురించి  10 సార్లు ప్రయత్నం  చేయ కూడదు .  సర్వర్ బిజీ  గాకుండా మరొకరికి  అవకాశం ఇవ్వాలి .  ఇక  ఆధార్ కార్డు సరిచేసు కోడానికి  https://uidai.gov.in/te  ని  సందర్శించండి .  అలానే  పాన్ కార్డు సరిచేసి కోడానికి ,  సెల్ నెంబర్  ఆప్డేట్  చేసు కోడానికి  దగ్గరలో ఉన్న  అధికార బ్రోకర్ సంస్థ లను  గాని ,  ఇన్కమ్ టాక్స్  డిపార్ట్మెంట్    ను గాని సందర్శించండి . 

www.sollutions2all.blogspot.com 


ప్ర : WHAT IS GST ? జి ఎస్ టి అంటే ఏమిటి ? ఎన్ని రకాల పన్నులు జి ఎస్ టి (GST) లో ఉంటున్నాయి ?

ప్ర : WHAT IS GST ? జి ఎస్ టి అంటే  ఏమిటి ? ఎన్ని రకాల  పన్నులు  జి ఎస్ టి (GST) లో ఉంటున్నాయి  ?

జ : సామాన్య  ప్రజానీకానికి  అర్థ మయ్యే  విధంగా  చెప్పాలంటే, జి ఎస్ టి (GST)  అనగా   'పన్ను' (TAX).  ఇంకాస్త  వివరంగా  చెప్పాలంటే , ఉత్పత్తి దారులు , వ్యాపారులు , వినియోగదారులు,   వారు  కొనే వస్తువులపై  ప్రభుత్వానికి  చెల్లించాల్సిన  ' పన్ను ' ను జి ఎస్ టి (GST)  లేదా  " వస్తు సేవల పన్ను ( GOODS AND SERVICES TAX)  అని అంటారు . " ఒకే దేశం  ఒకే పన్ను " అనేది  జి ఎస్ టి  నినాదం . అయితే  ప్రతి ఒక్కరూ  గమనించాల్సిన  అంశం  ఒకటుంది . " జి ఎస్ టి "  అనే పన్ను పేరు  మాత్రమే ఒకటి  గాని , పన్నుల  స్లాబులు  మళ్ళీ అనేకం . 0% నుండి  మొదలుకుని 1%, 3%,  5%, 12%, 18% 28% ........ 290%  వరకు  పన్ను స్లాబులు  విస్తరించి బడ్డాయి . " ఒకే దేశం  ఒకే పన్ను " అంటే   దేశం అంతా   ఓ  5% మో  లేక  18% మో  మాత్రం కాదు . తరు వాత  మరో విషయం ఏమిటంటే , కొన్ని వస్తువులు జి . ఎస్ . టి (GST) పరిధిలోకి రాలేదు . ఉదా : క్రూడ్ ఆయిల్ , అనగా పెట్రోల్ , డిజిల్ , ఫుయెల్  మరియు  మానవులు త్రాగే  ఆల్కహాల్  మొదలైనవి  జి . ఎస్ . టి (GST) పరిధిలోకి రాలేదు .

జి ఎస్ టి (GST)  అంటే  ఇప్పటికే అర్థ మయ్యింది  అని అనుకుంటాను .  ఇప్పుడు మరింత  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .  జి ఎస్ టి (GST)  అనేది  పరోక్ష  పన్ను (INDIRECT TAX) .  పరోక్ష  పన్ను (INDIRECT TAX)  అని ఎందుకంటున్నాం అంటే , మనం ఏదేని ఒక వస్తువు కొనేటప్పుడు , దాని పైన  టాక్స్ కడుతాం . ఆ టాక్స్ ను  అమ్మకపు దారు , 10 , 20 రోజుల తరువాత , తమ తమ జి ఎస్ టి (GST)  రిటర్న్స్  సబ్మిట్  చేసి , తనకు  రావాల్సిన ఇన్పుట్ టాక్స్ ఉంటే  అడ్జస్ట్  చేసుకుని  మిగిలినది   ప్రభుత్వానికి  చెల్లిస్తాడు . అంటే  ఆదాయ పన్ను (INCOME TAX) లాగా దీనిని  డైరెక్ట్ గా  మనం ప్రభుత్వానికి  చెల్లించం.

ఇక్కడ  జి ఎస్ టి (GST) లో  G -అనగా  GOODS ., S - అనగా   SERVICE., T-  అనగా  TAX. 
ఆ విధంగా  జి ఎస్ టి (GST) అనగా  " వస్తు సేవల పన్ను ( GOODS AND SERVICES TAX). 

అయితే  జి ఎస్ టి (GST) కి  ఇంత  ప్రచారం దేనికి  అనే సందేహం మీకు కలుగ వచ్చు . అది సహజం కూడా .  అందుకు కారణం లేక పోలేదు . నేటి వరకూ అనగా 30.06.2017 వరకూ ,   ఒక్కో రాష్ట్రం లో  ఒక్కోరకమైన  పన్నులు ఉండేవి . రాష్ట్రాలకైతే  వ్యాట్  (VAT)  పన్నులు  ఉండేవి . కేంద్రానికైతే  (CST)  పన్నులు  ఉండేవి . వీటికి తోడు  అనేక రకమైన పరోక్ష పన్నులు ఉండేవి . ఉదా : ఎక్సయిజ్  పన్ను ,  సర్వీస్ టాక్స్ , వినోద పన్ను , ఆక్ట్రాయ్ , వృత్తి పన్ను , సి వి డి , ఎంట్రీ టాక్స్, టోల్ టాక్స్   మొదలగు 16 రకాల  పన్నులు  ఉండేవి .  వీటివలన  వస్తువుల ధరలు పెరిగి , అవి చివరికి  వినియోగదారుల మీద  అధిక భారం పడేది .  వీటన్నిటిని  ఎత్తి వేసి , ఆ పనులన్నింటికీ  బదులుగా ,  "భారత దేశం "       ( INDIA )   మొత్తానికి  వర్తించే విధంగా  ఒకే  రకమైన  పన్ను పేరును   రూపొందించడం  జరిగింది .       అదే జి ఎస్ టి (GST). 

ఆ విధంగా  దేశం మొత్తానికి వర్తించే విధంగా   మెజారిటీ వస్తువులను  5 క్యాటగిరీలుగా చేసి  , అందులో ఒక క్యాటగిరీకి  పన్నులనుండి  మినహాహించి ( పాలు , పెరుగు , నూనె , బియ్యం , గోధుమలు , పప్పులు , ఉప్పు , మర మరాలు , అటుకులు , చికెన్ , మటన్ , కూర గాయలు, కారం , చింత పండు , బెల్లం , విద్య , ఆరోగ్యం  , మెట్రోరైల్  కు 0% పన్ను ) , మిగిలిన 4 క్యాటగిరీలకు  4 రకాల పన్నులను రూపొందించారు . అవి  5%, 12% , 18% మరియు 28%.  ( కొన్ని స్పెషల్ వస్తువులకు  ఇతర పన్నురేట్లను విధించారు . ఉదా . బంగారానికి 3% ,గుట్కాలకు 42% , సిగరెట్లకు 290%) . ఇక  అన్ని రకాల  సేవలకు  వర్తించే విధముగా  పన్నును  నేటి వరకు  ఉన్న 15%  ను  ఎత్తి వేసి , 18%  పన్నును  విధించడం జరిగింది . దీని వలన  అన్ని రకాల సేవలకు  గాను 3% అధిక భారం ప్రజలందరి  మీద  పడబోతోంది . 

తేదీ .30.06.2017 న  ఫైనల్  గా  , జి ఎస్ టి  (G. S. T)   రాష్ట్రాలు కోరిన విధంగా  కొన్ని  పన్ను రేట్లకు  మార్పులు , చేర్పులు  జరుగ వచ్చు . 

జి ఎస్ టి (GST) అనేది  తేదీ 01. 07. 2017   ( అనగా 30 .06. 2017 అర్ధ రాత్రి ) నుండి  దేశం మొత్తం ఒకే సారి అమలు లోకి  రావడం జరుగుతుంది . ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం  మరియు  వ్యాపారస్తులకు  సాఫ్టువేర్  ఎలా  వాడాలో , ఎలా రిటర్నులు  ఫైల్  చేయాలో  అవగాహన  కలిగించాల్సిన  అవసరం  ప్రభుత్వాలకు  ఉంది .   అందుకే  ఇంత  ప్రచారం జరుగుతుంది . 

www.sollutions2all.blogspot.com

Thursday, June 29, 2017

ప్ర . జి ఎస్ టి (GST) లో 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) అంటే ఏమిటీ ? 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ప్రయోజనాలు ఏమిటి ? 'ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (INPUT TAX CREDIT) కు ఎవరు అర్హులు ? 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు , నిభందనలు ఏమిటి ?

ప్ర .  జి ఎస్ టి (GST) లో   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)  అంటే ఏమిటీ ? 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ప్రయోజనాలు ఏమిటి ? 'ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (INPUT TAX CREDIT) కు ఎవరు అర్హులు ?  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)  కు , నిభందనలు  ఏమిటి ? 

జ.   జి ఎస్ టి (GST) లో   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)  అంటే,  ఒక  వ్యాపారస్తుడు  లేదా ఉత్పత్తి దారుడు  , తమ  వ్యాపారానికి  లేదా ఉత్పత్తికి సంబందించిన ' రా మెటీరియల్స్ ' గాని ,  కన్సూమబుల్ గూడ్స్ గాని  లేదా  ఫినిష్డ్ గూడ్స్ గాని  కొనేటప్పుడు  కొంత పన్ను చెల్లిస్తాడు . ఇది  జి ఎస్ టి (GST) లో   5% నుండి 28% మధ్యలో ఉంటుంది .  ఉదా : 100 రూ . ల.  వస్తువు  కొన్నపుడు  5% పన్ను పడింది అనుకుందాం . అప్పుడు అతను 105 రూ  . లు . పెట్టి  ఆ వస్తువు కొంటాడు .  మరల  ఆ కొన్న వస్తువును  15 రూ . ల .  లాభం కలుపుకుని  రూ .లు  120/-   కి ,  జి. ఎస్. టి . (GST)  5% కలిపి  వినియోగ దారుడికి   రూ . లు . 126/- అమ్మినట్లైతే, వినియోగ దారుడు  భరించాల్సిన ధర  126/-.  అమ్మకపు దారుడు, వస్తువు అమ్మినపుడు  రూ . లు 6/-  పన్ను రూపేన  వసూలు  చేస్తాడు . కానీ   ప్రభుత్వానికి చెల్లించాల్సిన  పన్ను మాత్రం  రూ . లు .1/- మాత్రమే .  ఎందుకంటే  వస్తువు  అమ్మినప్పుడు  రూ . లు . 6/- జి ఎస్ టి వసూలు  చేసాడు . అదే వస్తువు కొన్నప్పుడు రూ . లు . 5/-  జి ఎస్ టి  చెల్లించాడు .  ఆ చెల్లించిన జి ఎస్ టి ని  తగ్గించి , (6-5=1) నికరంగా  1/- రూపాయి మాత్రమే  చెల్లిస్తాడు . ఈ విధంగా , ఒక  రిజిస్టర్డ్  జి ఎస్ టి (GST)  వ్యాపారి , తాను చెల్లించిన జి ఎస్ టి ని , అమ్మకపు జి ఎస్ టి (GST) నుండి తగ్గించు కోవడాన్ని  లేదా  చెల్లించిన  జి ఎస్ టి (GST) ని యదా విధిగా  రిఫండ్ తీసుకోవడాన్ని ,   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)   అంటారు .  మరో ముఖ్యమైన విషయం , ఎంత  జి ఎస్ టి (GST)  చెల్లిస్తే  అంత  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) గా తీసుకోవచ్చు .  ఈ కారణంగా    జి ఎస్ టి (GST) లో  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)  కు అత్యంత ప్రాధాన్యత ఉంది . జి ఎస్ టి లో  దీనిది  కీలక పాత్ర .  ఉత్పత్తి కాస్ట్ ను తగ్గించడంలో  మరియు  అమ్మకపు  కాస్ట్ ను తగ్గించడంలో  ప్రముఖ  పాత్ర వహిస్తుంది . 

'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ప్రయోజనాలు ఏమిటి ?

01. ఉత్పత్తి దారులకు  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) వలన , ఉత్పత్తి కాస్ట్ తగ్గి , అమ్మకాలు పెరిగి , లాభాలు రావడానికి  అవకాశాలు  మెండు గా ఉన్నాయి . 

02. జి ఎస్ టి  వ్యాపారులకు  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) , అమ్మకపు కార్చి తగ్గి , బిజినెస్ పెరిగి లాభాల బాట పట్ట  వచ్చు . 

03. ఎగుమతి దారులకు  జి ఎస్ టి  లేదు .  ఇక 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) పూర్తిగా  ప్రభుత్వం నుండి వాపస్  తీసుకోవచ్చు . ఈ కారణంగా  ఎగుమతి వ్యాపారుల బిజినెస్  3 పువ్వులు 6 కాయలుగా  అభివృద్ధి  చెందు తాయి . 

04. వినియోగ దారులకు  అనేక మైన వస్తువులు  తక్కువధరలకు  లభిస్తాయి . 


'ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు ఎవరు అర్హులు ?

01. 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు ,  జి ఎస్ టి ( GST) లో  రిజిస్ట్రేషన్   చేయించు కున్న వారు మాత్రమే  అర్హులు . 

'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT)  కు , నిభందనలు  ఏమిటి ? 

01. 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను  జి ఎస్ టి ( GST) లో  రిజిస్టర్డ్ అయినా వారు  మాత్రమే తీసుకోవడానికి  వీలవుతుంది . 

02. కాంపోజిషన్ స్కీం లో  ఉన్న వారు  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను  తీసుకోవడానికి వీలు లేదు . 

03. చిన్న వ్యాపారస్తులు , జి ఎస్ టి ( GST) లో  రిజిస్టర్డ్  కాని  వారు ,  'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను తీసుకోవడానికి వీలు లేదు . 

04. 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను  6 నెలలు లేదా  180 రోజుల లోపుననే   వినియోగించుకోవాలి  లేదా డిక్లేర్  చేయాలి . 

05.   జి ఎస్ టి ( GST)  చెల్లించినట్లుగా   వరిజినల్  ఇన్వాయిస్ లు , బిల్లులు  ఉండాలి . 

06. 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) , జి ఎస్ టి ( GST) లో  రిజిస్టర్డ్ అయిన  వారి నుండి  కొంటేనే వర్తిస్తుంది . 

07. వ్యాపార నిమిత్తానికి   వినియోగించే  వస్తువులు   లేదా   సేవలకు  చెల్లించే   పన్ను మాత్రమే   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) గా  తీసుకోవడానికి వీలవుతుంది . 

08.  ఆయా  వస్తువులను  అమ్మే వ్యాపారికి  , ప్రభుత్వానికి చెల్లించాల్సిన  పన్ను బకాయీలు   ఉండ రాదు .   అలానే  వారు  సక్రమంగా   నెల  వారీ  రిటర్నులు  ఫైల్  చేసి ఉండాలి . 

09.  సి జి ఎస్ టి (CGST)  క్రింద  పొందిన   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను ,  ఎస్ జి ఎస్ టి (SGST) మరియు  యూ టి జి ఎస్ టి (UTGST)    బకాయిలను  చెల్లించ డానికి వీలు లేదు .  అలానే  ,  ఎస్ జి ఎస్ టి (SGST) మరియు  యూ టి జి ఎస్ టి (UTGST)   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను ,    సి జి ఎస్ టి (CGST)  బకాయిలను  చెల్లించ డానికి వీలు లేదు . 

10.  తెలిసో , తెలియకో  , కావాలనో   'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను ,  వర్తించకపోయినా  తీసుకున్నా  లేదా  అధికంగా తీసుకున్నా  , ఆ మొత్తానికి  వడ్డీ  పడుతుంది ,  పెనాలిటీ  పడుతుంది , 'ఇన్ ఫుట్  టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను  తిరిగి  చెల్లించాల్సి ఉంటుంది .

11.  కొనుగోలు రిటర్న్స్ లేదా  అమ్మకపు రిటర్న్స్  , ఏమైనా ఉంటే  , అవి 6 నెలలు లేదా 180 రోజుల లోపున జరిగి ఉంటే ,  చెల్లించిన పన్నులను , వసూలు చేసిన పన్నులను  సర్దు బాటు  చేసు కోవచ్చు . 

పూర్తి  వివరాలకు  ప్రభుత్వ అధికార  వెబ్ సైట్లను <www.gst.gov.in> వీక్షించండి . 
 

Wednesday, June 28, 2017

ప్ర . చిన్న పిల్లల (Minors) పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవచ్చా ? చిన్న పిల్లల పేరున 'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవడం వలన చట్టబద్దమైన ప్రయోజనాలు ఏమిటి ?

ప్ర . చిన్న పిల్లల (Minors) పేరున  'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవచ్చా ? చిన్న పిల్లల పేరున   'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకోవడం  వలన చట్టబద్దమైన  ప్రయోజనాలు ఏమిటి ?

జ . సాధారణంగా  18 సం . రాలు  నిండిన తరువాత   'పాన్ కార్డు ' (PAN CARD)  కు అప్ప్లయ్  చేయాలి .  కానీ  చిన్న పిల్లల (Minors) పేరున కూడా   'పాన్ కార్డు ' (PAN CARD)  నిరభ్యరంతంగా  తీసుకోవచ్చు . ఎలాంటి అడ్డంకులు లేవు .  బాబు లేదా పాప  పుట్టిన 10 వ రోజునుండి  కూడా  చిన్న పిల్లల పేరున  'పాన్ కార్డు ' (PAN CARD)  తీసుకోవచ్చు .  సహిదా  అనే  అమ్మాయి   జూన్ 8 న  పుట్టింది . వాళ్ళ నాన్న  జూన్ 13 న  ఆమె పేరున  'పాన్ కార్డు ' (PAN CARD) బర్త్ డే గిఫ్ట్ గా తీసుకున్నాడు .  ఎందుకు  ఇంత తొందరగా  చిన్న పిల్ల పేరున  'పాన్ కార్డు ' (PAN CARD)  తీసుకుంటున్నావని  , డిపార్ట్మెంట్ వారు అడుగుతే , అతని సమాధానం ఏమిటో తెలుసా ?  పుట్టిన నాటి నుండే  ఇండియన్ సిటిజన్ గా ఉండాలని  తన  తండ్రి గారి కోరిక . అలానే  ప్రతి ఒక్కరూ  'పాన్ కార్డు ' (PAN CARD) తీసుకుని నిజాయితీగా  పన్నులు చెల్లించి , ప్రభుత్వానికి అండగా నిలవాలని 'పాన్ కార్డు ' (PAN CARD) పాప  పేరున తీసుకుంటున్నాను అని  అన్నాడు . 



'పాన్ కార్డు ' (PAN CARD)   ను  హార్డ్ కాపీ ద్వారా గాని  , ఆన్ లైన్ ద్వారా గాని   అప్ప్లయ్  చేయ వచ్చు . 

అయితే  , చిన్న పిల్లల (Minors) పేరున  'పాన్ కార్డు ' (PAN CARD)  తీసుకోవాలంటే  కొన్ని నిబంధనలను  పాటించాలి . అవి ఏమంటే, 

01. ఫామ్ 49 లేదా  49/A  స్టేటస్ ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి . దీనిని   నల్లటి ఇంకుతో మాత్రమే  కరెక్టుగా ఫిల్ చేయాలి .  

02. పాప  లేదా బాబు పేరును వ్రాయాలి . 

03. గార్డియన్ గా తండ్రి  పేరును గాని , తల్లి పేరును గాని  వ్రాయాలి .  తల్లి గాని , తండ్రి గాని లేదా  మరెవ్వరైనా ( గార్డియన్ )  సరే , వారే సంతకం చేయాలి . గార్డియన్  ఫోటోనే  అతికించాలి .   ఎవరు  గార్డియన్ గా ఉంటే  వారికే  వీరి ఆదాయం క్లబ్ అవుతుంది . ఆ గార్డియన్ మాత్రమే , వారి వారి స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి .

 04. పుట్టిన తేదీకి  ధ్రువీకరణ పత్రంగా  , బర్త్ సర్టిఫికెట్ గాని , పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని   సమర్పించాలి .

05. ఐడెంటిఫికేషన్ కు పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని   సమర్పించాలి .

06. అడ్డ్రస్ ప్రూఫ్ కు , పాస్ పోర్ట్ ను గాని , ఆధార్ కార్డును గాని , రేషన్ కార్డును గాని, ఓటర్ కార్డును గాని   సమర్పించాలి .

07. తగిన ఫీజ్ తో NSDL లో గాని  లేదా  UTI లో గాని లేదా  ఇతర  అధికార ఏజెన్సీ లలో గాని  సమర్పించాలి . 

08. అన్నీ కరెక్టుగా ఉంటె 10 రోజులలో  'పాన్ కార్డు ' (PAN CARD) రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా  లేదా కొరియర్ ద్వారా  ఇంటికి వస్తుంది . 

అలానే  ఆన్ లైన్ ద్వారా అప్ప్లై  చేయాలి . మీ సేవ ద్వారా కూడా  అప్లై చేయ వచ్చు . 

మైనర్స్ 'పాన్ కార్డు ' (PAN CARD) లు  తీసుకోవడం వలన ప్రయోజనాలు ఏమిటి ?

01. పిల్లలు  (Minors) వారి వారి  క్రియేటివిటీ  ద్వారా , అంటే ఆటల  ద్వారా , పాటల  ద్వారా , నాట్యం ద్వారా  లేదా మరేవిధంగా సంపాదించినా , అది వారి  అకౌంట్ లోనే జమ అవుతుంది . వీరు పన్ను పరిధిలోకి  రాక  పోతే పన్ను  పడదు . ఈ ఆదాయం పేరేంట్స్ అకౌంట్ కు క్లబ్ కాదు . 

02. వారికీ  వచ్చిన  బ్యాంక్ ట్రాన్స్ఫర్ ( గిఫ్టులు ), నగదు  మొదలైనవి  మైనర్ల అకౌంట్ క్రిందికే  వస్తాయి . వాటిపైన వచ్చే వడ్డీ 10,000/- రూ . లు . లోపు ఉంటే  పన్ను పడదు . వారి మొత్తం  ఆదాయం  2 లక్షల 50 వేల  రూ  ల . లోపు  ఉంటే  పన్ను పడదు . 

03. పిల్లల  (Minors)  పేరున   'పాన్ కార్డు ' (PAN CARD)  ఉన్నట్లయితే ,  వారికి వచ్చిన నగదు  గిఫ్టులు   వీరి పేరున  డిపాజిట్ చేస్తే  దానిపై  వచ్చే వడ్డీకి , నిబంధనల మేరకు  పన్ను పడదు .  వీరు రిటర్నులు  ఫైల్  చేయాలి .  

04. ఒక వేల  చిన్న పిల్లలు ( Minors ) , అంగ  వికలురైతే  ( గుడ్డి , మూగ , అంగ వైకల్యం ) (సె క్షన్ . 80యు   ప్రకారం ), ఎలాంటి  ఆదాయం అయినా పన్ను భారం ఉండదు . 

05. పెద్ద వాండ్ల లాగానే  అన్ని మినహాయింపులు లభిస్తాయి .   

ఈ క్రింది సందర్భాలలో  మైనర్స్ 'పాన్ కార్డు ' (PAN CARD) లు  విధిగా  తీసు కోవాలి :

01. 50,000/- రూ  ల  కంటే  ఎక్కువగా  నగదు అకౌంట్ లో  డిపాజిట్  చేయ వలసి  వచ్చి  నప్పుడు .

02. రూ . లు . 2  లక్షలకు  మించి  బంగారం  పిల్ల ల పేరున  కొన్నపుడు , 

03. రూ . లు . 5  లక్షలకు  మించి స్థిరాస్థులు పిల్ల ల పేరున  కొన్నపుడు , 

04. పిల్లల పేరున  10,000/- మించి  వడ్డీ బ్యాంకు ద్వారా  లభించి నప్పుడు ,

05.  అధిక మొత్తంలో  తల్లి దండ్రులు  బ్యాంకుల్లో  ఎఫ్ . డి . లు చేసి  , నామినీగా  మైనర్లను పెట్టినప్పుడు , ఆ మైనర్లకు  కంపల్సరీగా   'పాన్ కార్డు ' (PAN CARD)   ఉండి  తీరాలి . 

06. డీ మ్యాట్  అకౌంట్  ఓపెన్  చేయాల్సి వచ్చి నప్పుడు  ఆ మైనర్లకు  కంపల్సరీగా   'పాన్ కార్డు ' (PAN CARD)   ఉండి  తీరాలి . 

www.sollutions2all.blogspot.com



Thursday, June 22, 2017

ప్ర .ఆదాయ పన్ను శాఖ యొక్క ( Income Tax Department) , పన్ను చెల్లించే వారికీ సంభందించి 26 ఏ . ఎస్ . ( FORM 26AS) చూడటం ఎలా ? ఒక ఆర్ధిక సంవత్సరంలో , వారి టి . డి . ఎస్ ఎంత కట్ అయ్యిందో తెలుసుకోవడం ఎలా ?

ప్ర .ఆదాయ పన్ను శాఖ యొక్క   ( Income Tax Department) ,  పన్ను చెల్లించే వారికీ  సంభందించి  26 ఏ . ఎస్ .  ( FORM 26AS)   చూడటం ఎలా ? ఒక ఆర్ధిక సంవత్సరంలో , వారి టి . డి . ఎస్  ఎంత  కట్  అయ్యిందో  తెలుసుకోవడం  ఎలా ? 


జ :  ఆదాయ పన్ను చెల్లించే వారు , వారికీ  సంబందించిన   టి . డి . ఎస్ / టి . సి . ఎస్ .  (TDS / TCS) గాని ,  వారి వారి  ఆదాయ  మూలల్లో  తగ్గించి  నట్లవుతే , వారు గాని ,  వారికీ సంభందించిన  వృత్తి నిపుణులు గాని  , ఆదాయానికి  సంభందించిన  రిటర్నులు  ఫైల్  చేయునపుడు , ప్రతి   సంవత్సరం  ఫామ్  26 (ఏ. ఎస్ ).  ( FORM 26AS)   తప్ప కుండా చూడాల్సి ఉంటుంది . ఎందుకంటే  ఈ మొత్తాన్ని ,  చెల్లించే పన్నులనుండి  తగ్గించుకొడానికి  వెసులుబాటు ఉంది .  

ఫామ్  26 (ఏ. ఎస్ ).  ( FORM 26AS) చూడటం ఎలా ?

01. మొదట  ఆదాయ  పన్ను శాఖ వారి  అధికారక  వెబ్ సైట్  https://incometaxindiaefiling.gov.in ను ఓపెన్  చేయండి. 

02. అప్పుడు  మనకు ఒక   e-Filing  any where any time   అనే పేజీ ఓపెన్   అవుతుంది . ఇక్కడ  లాగిన్ కావాల్సి ఉంటుంది . ఒక వేల  ఇది వరకే  రిజిస్టర్ అయి ఉన్నట్లయితే  , యూజర్ ఐ .డి . ( అనగా వారి పాన్  నెంబర్ /PAN Number in capital letters) , పాస్వర్డ్ ( Password) , పుట్టిన తేదీ ( కంపెనీ అయితే  ఇన్ కార్పొరేషన్  తేదీ ) ,  మరియు  క్యాప్చా  (CAPCHA)  ఎంటర్ చేయాల్సి ఉంటుంది .  ఓ . టి . ఫై బాక్స్  ను టిక్ చేయాల్సి ఉంటుంది . ఒక వేల  గతంలో  రిజిస్టర్ కాని  వారయితే , కొత్తగా రిజిస్టర్  చేసుకోవాల్సి ఉంటుంది .  దీనికి ఇదే పేజీలో  ' న్యూ రిజిష్టరును ' (New Register) క్లిక్ చేస్తే , పాన్ నెంబర్ , పుట్టిన తేదీ , పాన్ నెంబర్ , సెల్ నెంబర్ , ఆధార్ నెంబర్  మొదలగు వాటిని అడుగుతుంది . వాటి ప్రకారం   ఫిల్  చేసి  క్యాప్చా  (CAPCHA) టైప్  చేస్తే , పాస్వర్డ్  ను ఇమెయిల్  అడ్రస్ కు మరియు  ఫోన్ నెంబర్ కు పాస్వర్డ్  పంపిస్తుంది . 

03.   లాగిన్  క్లిక్  చేశాక , మరో పేజీ  ఓపెన్  అవుతుంది . ఇక్కడ  రిజిస్టర్ సెల్  నెంబర్  కరక్టేనా  అని అడుగుతుంది .  సెల్ నెంబర్ కరక్ట్ అవుతే  " కంటిన్యూ '  ను క్లిక్ చేయాలి . 


04. ఆ తరువాత   మరో పేజీ    ఓపెన్  అవుతుంది . అందులో  'ఓటీపీ  నెంబర్ ' అడుగుతుంది .  సెల్ కు వచ్చిన  ' 'ఓటీపీ  నెంబర్ ' (OTP)  ను ఎంటర్   చేసి  సబ్మిట్ చేయాలి  . 


05. ఆ  తరువాత మరో   పేజీ  ఓపెన్ అవుతుంది . ఇందులో  పై బాగాన  ' My Account ' క్లిక్  చేస్తే  ఒక డ్రాప్ బాక్స్  వస్తుంది . అందులో  ' View form 26 AS / Credits' ను క్లిక్ చేయాలి . 

06. అప్పుడు  మరో పేజీ ఓపెన్ అయ్యి , ఇది మరో వెబ్ సైట్ కు వెలుతుంది , ' కన్ ఫామ్ ' ((Confirm) చేయాలా వద్ద అడుగుతుంది .  ' కన్ ఫామ్ ' ((Confirm) క్లిక్  చేయాలి . 

07. అప్పుడు  'TRACES' వెబ్  సైట్ కు వెలుతారు . ఇక్కడ  'Proceed'  అని కనిపిస్తుంది . నిబంధనలను  ఆక్సెప్ట్  చేస్తున్నట్లుగా  అక్కడి   బాక్స్ లో  టిక్ చేసి , 'Proceed'  ను  క్లిక్ చేయాలి .  ఆ తరువాత  అదే పేజీలో   క్రింది బాగాన 'Click View Tax Credit (Form 26 AS) ను క్లిక్  చేయాలి . 

08. ఆ తరువాత  మరో పేజీ వస్తుంది . ఇందులో   ఏ  అసెస్ మెంట్  సంవత్సరమో  ( Assessment Year)   సెలెక్ట్ చేసుకోవాలి . ఎలా చూడాలి అనుకుంటున్నారో  ( html /text/ pdf ) View/ Down load సెలెక్ట్ చేసుకొని  సబ్మిట్ చేయాలి . 

09. మనమిచ్చిన ఆప్స్ ను  ప్రకారం  ఓపెన్ అవ్వడమో  లేదా ' డౌన్ లోడ్ ' అవ్వడమో  జరుగుతుంది . డౌన్ లోడ్ అయ్యాక  మల్లీ  పాస్వర్డ్ ఆడుగు తుంది . ఫార్మాట్ ప్రకారం  వారి  పుట్టినతేదీని  (ddmmyyyy) ను  ఎంటర్ చేస్తే  Form 26 AS ఓపెన్ అవుతుంది .  ఒక  వేల  కంపెనీ అయినట్లవుతే , చిన్న లెటర్స్ లో  ( Small letters) ' PAN INCORPORATION DATE' వరుసగా  ఎంటర్ చేయాలి  (ఎక్కడా  space  , right bars ( / ) ఉండకూడదు ).  
ఈ విధంగా  సులువుగా  టి . డి . ఎస్ / టి . సి . ఎస్ .  (TDS / TCS) ఎంత  జమ ( Credit)  ఉందో  తెలుసుకోవచ్చు . 
 www.sollutions2all.blogspot.com

Wednesday, June 14, 2017

IS IT POSSIBLE TO SAVE THE BANK CHARGES? బ్యాంక్ చార్జీలను తగ్గించు కోవడం సాధ్యమా ?


ప్ర . IS IT POSSIBLE TO SAVE THE BANK CHARGES?  బ్యాంక్  చార్జీలను తగ్గించు కోవడం  సాధ్యమా ?

జ . Yes it is  possible to save the Bank Charges. అవును.  బ్యాంక్  చార్జీలను తగ్గించు కోవడం  సాధ్యమే .


ముందుగా  బ్యాంక్ చార్జీలు  ఏ  అకౌంట్లో  పడుతున్నాయి ? ఎలా పడుతున్నాయి ? ఎందుకు పడుతున్నాయి ? ఎప్పడు పడుతున్నాయి ?  ఎంత పడుతున్నాయి ,అనలైజ్  చేసుకోవాలి .  ఒక్కొక్కరి  ట్రాన్సక్షన్స్ ఒక్కోరకంగా ఉంటాయి . వారి వారి  అవసరాలను బట్టి , వారి  కున్న  అకౌంట్లు , డెబిట్  కార్డులు , క్రెడిట్ కార్డులను  బట్టి   ఒక్కొక్కరి  బ్యాంక్ చార్జీలు  ఒక్కోరకంగా ఉంటాయి .



బ్యాంకు చార్జీలు  తగ్గించుకోవాలని  ఆసక్తి  ఉంటే  ఈ క్రింది వాటిని  పరిశీలించ వచ్చు :



01. చాలా మందికి , అనేక మైన  బ్యాంక్   అకౌంట్లు ఉంటున్నాయి . అవసరం లేని వాటిని  క్లోజ్  చేయండి . దీని వలన  ఈ అకౌంట్ కు  సంభందించిన  , అనగా  ATM Card , Debit Card ,Credit Card , SMS , Bank Account Maintenance, Bank statement, With Drawl,  Deposit  మొదలైనవన్నీ  తగ్గి పోతాయి .



02. కొందరు  ఒక  బ్యాంక్ అకౌంటులో  పెద్ద మొత్తం  ఉంచి , మిగిలిన అకౌంట్లను  పట్టించు కోరు . దీని వలన  మినిమమ్ బ్యాలన్స్ తక్కువగా  ఉన్న  అకౌంట్లలో బ్యాంక్ చార్జీలు పడుతాయి . పట్టించుకోక పోతే  మైనస్ బ్యాలెన్స్ కూడా రావచ్చు . అప్పుడు  ఆ  మైనస్  బ్యాలన్స్ ను  డిపాజిట్ చేస్తేనే , బ్యాంక్ అకౌంట్ ను  క్లోజ్ చేయడం వీలవుతుంది .  అందు వలన , ఎక్కువ  మొత్తం  ఉన్న బ్యాంక్ అకౌంట్ లో నుండి తీసి , బాలన్స్  తక్కువగా  ఉన్న బ్యాంక్  అకౌంట్లలో  వేస్తే , మినిమమ్ బ్యాలన్స్ బ్యాంకు చార్జీలు  తగ్గి పోతాయి . కాబట్టి తక్షణమే  ఉపయోగం లేని  మరియు మరిచి పోయిన అకౌంట్లను  వెతికి పట్టి  క్లోజ్ చేయండి . లేదంటే మైనస్  బ్యాలన్స్ లోకి వెళ్లి పోతుంది . అప్పుడు  మైనస్ బ్యాలన్స్ కాళీయర్ చేసే దాక అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు . ప్రతి బ్యాంక్ అకౌంట్ కు  ' ఆధార్ ' మరియు ' పాన్ కార్డు ' నెంబర్ లింక్ చేస్తారు .( అసలు GST  రిజిస్ట్రేషన్ తోటే అన్ని లింక్ అయి పోతున్నాయి ). 



03. అనవసరమైన  బ్యాంక్ ట్రాన్సాక్షన్స్  తగ్గించు కోవాలి . ఒక నెలలో 3 ట్రాన్సక్షన్స్  కంటే ఎక్కువ కాకుండా  చూసుకోవాలి . అంతా  ఆన్ లైన్లోనే వ్యవహారాలు సాగించాలి . మెయిన్ అకౌంట్ సెల్ నెంబర్ కే  ' OTP' నెంబర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసు కోవాలి . సాధ్య మైనంత వరకు  ప్రతి 15 రోజులకోసారి  'పాస్వర్డ్ ' మార్చు కోవాలి . అలానే  స్వంత 'లాప్ టాప్ ' లేదా ' కంప్యూటర్ ' లోనే  ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేయాలి . 



04. సాధ్యమైనంత వరకు  హోమ్ బ్రాంచిలోనే  నగదు డిపాజిట్ చేయాలి .  విత్ డ్రా చేయాలి . దీని వలన  బ్యాంక్  చార్జీలు  తగ్గించు కోవచ్చు . SBI బ్యాంకులో , ఇతర బ్రాంచులలో  డబ్బులు  వేసినా , తీసినా, ఒక్కో ట్రాన్సక్షన్ కు   50/- రూ . లు .  డిపాజిట్ అయినా అకౌంట్లో  కట్ అయి పోతాయి . 



05. ఎక్కువ సార్లు  ATM లకు వెళ్లకుండా  ప్లాన్  చేసుకోవాలి . ప్రతి నెలా  కొంత మొత్తాన్ని , అవసరాన్ని బట్టి , పిల్లల  లేదా  ఫ్యామిలీ బేసిక్  అకౌంట్లకు  ఆన్ లైన్  ద్వారా  ట్రాన్స్ఫర్ చేసుకోవాలి . అక్కడి నుండి  డబ్బులు  డ్రా చేసినా . వేసినా , ATM , DEBIT , కార్డులను వదినా చార్జీలు , ఏ  బ్యాంక్ అకౌంట్  లోనూ  పడవు . అయితే  కొన్ని  నిభందనలు  ఉన్నాయి . అవి ఏమంటే , నెలలో  4 ట్రాన్సాక్ష న్స్  కంటే  ఎక్కువ చేయ నీయరు . పది వేల  కంటే ఎక్కువ తీయ లేము . లక్ష  కంటే  ఎక్కువ  నిలువ ఉండరాదు . యాభై  వేళా కంటే ఎక్కువ ఒకే సారి  డిపాజిట్ చేయ వీలు లేదు . కనీస నిల్వ  నిబంధన లేదు . 



06. అన్ని  ఖాతాలు ఉంచాలనుకుంటే , మినిమమ్ బ్యాలన్స్ ఉన్న అకౌంట్లకు , SMS  అలర్టులు , ATM , DEBIT ,CREDIT కార్డులను క్యాన్సిల్ చేయాలి . దీని వలన బ్యాంక్  చార్జీలు  తగ్గి పోతాయి . నెల కోసారి  పాస్ బుక్ ఎంట్రీ చేయించుకుంటే  సరి పోతుంది .



07. గ్యాస్  కనెక్షన్ ను  మినిమమ్ బ్యాలన్స్  ఉన్న అకౌంట్  కు లింక్ చేయాలి .  ఇందులో సబ్సిడీ అమౌంట్  క్రెడిట్  అవుతూ ఉంటుంది . దానిని అలానే ఉంచండి . 



08. నగదు రహిత లావాదేవీలను  పెంచు కోవాలి .



09.  ఇన్సూరెన్స్  అకౌంట్ ను , మెయిన్ అకౌంటుకు  లింక్ చేయాలి .




10. బ్యాంక్ అకౌంటులో  ఎక్కువ  మొత్తము  ఉన్నట్లయితే , ఎప్పటి కప్పుడు  F.D. లు గాను  ,  R.D లు గాను  మార్చు కోవాలి . దీని వలన  సేవింగ్ అకౌంట్ కంటే  కాస్త ఎక్కువ వడ్డీ  వస్తుంది .  15 రోజుల  నుండి ఎంత కాలానికైనా  F.D. లు చేసు కోవచ్చు . మరల  అర గంటలో , కావాలనుకున్నప్పుడు  , F.D లను  క్యాన్సిల్ చేసి  సేవింగ్ అకౌంట్ కు మార్చు కోవచ్చు .



11. అత్యవసర మైనప్పుడు , బ్యాంక్ చార్జీల కంటే  ఎక్కువ  ఆదాయం  వస్తుందనుకున్నపుడు , ఇంట్లో  ధైర్యానికి ఉండాలనుకున్నపుడు , బ్యాంక్ చార్జీలు పడినా  పెద్ద సమస్య  కాదు . అప్పుడు  నిరభ్యరంతంగా  , బ్యాంకులో కనీస  నిల్వ మైంటైన్ చేయ నవసరం  లేదు . భయ పడ  నవసరం లేదు . 




12. ప్రతి ఒక్కరికి  పోస్టాఫీస్ లో గాని , పోస్ట్  పేమెంట్  బ్యాంకులో  గాని  , ఒక అకౌంట్  ఉండటం , అన్నివిధాల  శ్రేయస్కరం . చిన్న బ్యాంక్ అకౌంట్ల లాగానే , కనీస నిల్వ నిభందనలు లేవు , పోస్టల్ చార్జీలు ఉండవు . ఒక్కో  సారి  బ్యాంకులు  పని చేయ నప్పుడు , దూర భారమైనప్పుడు , వీటిని  ఉపయోగించు కోవచ్చు . 



13. అయితే పోస్టాఫీసులు , బ్యాంకులు  డబ్బుకు  పూర్తిగా  భరోసా నిస్తాయి , నమ్మకాన్ని  కలిగిస్తాయి , అందులో  ఉంచిన  డబ్బులు ఎక్కడికి పోవు  అని  గ్రుడ్డిగా  ఎప్పుడూ  నమ్మ కూడదు . ' గ్రహ చారం  బాగా లేక పోతే , తాడే  పామై కరుస్తుంది అన్నట్లు ' , అకౌంటులో  ఉన్న డబ్బులు  మాయ మయ్యే అవకాశాలు  లేకపోలేదు . గతంలో  ఒక వ్యక్తి , బ్యాంకులో  డబ్బు భద్రంగా  ఉంటుందని  రూ . లు . 25,000/- , వడ్డీ కూడా కల్సి వస్తుందని  హాయిగా  కాలం  గడుపుతున్నాడు . ఒక విధంగా  , బ్యాంకుపై  నమ్మకంతో  మరిచి పోయాడు  కూడా .  అకౌంట్ ను రెగ్యులర్  గా  ఉపయోగించక పోవడం వలన అది కాస్తా , ఇన్ ఆపరేటివ్  అకౌంట్ గా  మారి పోయింది .  యేండ్లు  గడిచాయి . ఎవరూ  అకౌంట్  హోల్డర్  లేడని , ఆ డబ్బులకు  కాస్తా  రెక్కలు  వచ్చి  ఎగిరి పోయాయి . అంటే  ఎవరో  ఒకరిద్దరు కల్సి ,  ఆ డబ్బులను  కాజేశారు . కొన్ని యేండ్ల  తరువాత ,  అసలు  అకౌంట్  హోల్డర్ కు  అవసరం  ఏర్పడి ,  ఆ డబ్బుల గురించి గుర్తుకు వచ్చి ,  బ్యాంకులో  వాకబు చేశాడు . అప్పుడు బ్యాంక్ వారు  అతనికి తెలిపిన విషయం మేమంటే ,  నీ  అకౌంట్  ఎప్పుడో  క్లోజయింది . డబ్బులు  ఎప్పుడో నీవే  డ్రా చేసి ఉంటావు . ఇప్పడు  ఆ రికార్డ్స్ కూడా  వెంటనే అందుబాటులో లేవు  అన్నారు . అప్పుడు  అతనికి  ఏమి చేయాలో  పాలు  పోలేదు.  ఆ విషయం ఆ  నోటా , ఈ నోటా  పడి  ప్రధానమంత్రి  ఆఫీసు వరకు  వెళ్ళింది . అక్కడి నుండి  ఫోన్ రాగానే , ఆగ మేఘాలమీద ,  ఆ బ్యాంకు వారు  , అతని అకౌంటులో   గప్  చుప్ గా , వడ్డీతో సహా మొత్తం డబ్బును జమ చేశారు . ఈ  స్టోరీ  అంత చదివాక  చాలా మందికి  ఆ అకౌంట్  హోల్డర్ ఎవరో  గుర్తుకు వచ్చే ఉంటుంది ...  

ఆ అకౌంట్  హోల్డర్ ఎవరో కాదు  మన మాజీ రాష్ట్రపతి  డాక్టర్ . అబ్దుల్ కలాం గారు . 


ఇక బ్యాంకుల్లో  సైబర్ నేరాలు  మనకు తెలియనివి కావు . ఈ విధంగా  డబ్బు పొదుపు చేసుకుని  నష్ట పోయిన  ప్రజలు  వెలది మంది ఉన్నారు .  అందు కనీ ఎప్పుడూ  అప్రమత్తంగానే  ఉండాలి . ' అవసరానికి  ఉపయోగ పడని  పొదుపు, తనకు మాలిన  ధర్మం  ఎప్పుడూ  పనికి రాదు '.  


www.sollutions2all.blogspot.in

Sunday, June 11, 2017

SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్ SB A/C లో కనీస నిల్వ ఎంత ఉండాలి ? బ్యాంక్ చార్జెస్ ( Minimum balance Bank charges) పడకూడదంటే , కనీస నిల్వను (Minimum balance) ఎంత మెయింటైన్ చేయాలి ? నెల వారి సరా సరి నిల్వ ( Monthly Average Balance) అంటే ఏమిటి ?

ప్ర . SBI (ఎస్ . బి . ఐ)బ్యాంక్   SB  A/C  లో  కనీస నిల్వ  ఎంత ఉండాలి ?  బ్యాంక్ చార్జెస్ ( Minimum balance Bank charges)  పడకూడదంటే  , కనీస నిల్వను  (Minimum balance) ఎంత  మెయింటైన్  చేయాలి ? నెల వారి సరా సరి  నిల్వ  ( Monthly Average Balance) అంటే ఏమిటి ?  



జ.  SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్ SB  A/C  లో  కనీసనిల్వ  బ్యాంక్ చార్జీలు  ( Minimum balance Bank charges)  పడకూడదంటే  , కనీస నిల్వను  (Minimum balance)   ది . 01.04.2017  నుండి  ఈ  క్రింది విధంగా   మెయింటైన్  చేయాలి. లేదంటే   కనీస నిల్వ బ్యాంక్ చార్జీలను ,  SBI (ఎస్.బి.ఐ),  బ్యాంక్,   మరుసటి నెల నుండి  డెబిట్  చేస్తాయి . అయితే ఈ  కనీస నిల్వలు  ప్రాంతాలను బట్టి మారుతుంటాయి . మరియు ఈ  కనీస నిల్వ చార్జీలు  సేవింగ్స్ అకౌంట్స్  మరియు  సురభి  సేవింగ్స్  అకౌంట్స్  మాత్రమే  వర్తిస్తాయి .  CSP , Basic Saving  Bank Small Accounts కు మరియు PMJDY A/Cs  కు వర్తించవు . 

బ్యాంక్  సేవింగ్ అకౌంట్స్  కనీస  నిల్వలు  మరియు  చార్జీల విధింపు  ఈ క్రింది విధంగా  ఉంటాయి :

01.Metro ప్రాంతాల బ్యాంకులలో  మైంటైన్  చేయాల్సిన  కనీస  నిల్వ  Rs.5,000/-.
a)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% తక్కువగా ఉంటే  Rs.50/-+ S.T. 
b)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% నుండి 75%  వరకు ఉంటే Rs.75/-+ S.T. 
c)  సరాసరి కనీస నిల్వ  (MAB) 75%  కంటే తక్కువగా   ఉంటే  Rs.100/-+ S.T. 

02.Urban   ప్రాంతాల బ్యాంకులలో  మైంటైన్  చేయాల్సిన  కనీస  నిల్వ  Rs.3,000/-.
a)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% తక్కువగా ఉంటే  Rs.40/-+S.T. 
b)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% నుండి 75%  వరకు ఉంటే Rs.60/-+ S.T. 
c)  సరాసరి కనీస నిల్వ  (MAB) 75% కంటే తక్కువగా     ఉంటే  Rs.80/-+ S.T. 

03.Semi Urban ప్రాంతాల బ్యాంకులలో  మైంటైన్  చేయాల్సిన  కనీస  నిల్వ  Rs.2,000/-.
a)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% తక్కువగా ఉంటే  Rs.25/-+.S.T. 
b)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% నుండి 75%  వరకు ఉంటే Rs.50/-+ S.T. 
c)  సరాసరి కనీస నిల్వ  (MAB) 75%  కంటే తక్కువగా   ఉంటే  Rs.75/-+ S.T. 

04. Rural  ప్రాంతాల బ్యాంకులలో  మైంటైన్  చేయాల్సిన  కనీస  నిల్వ  Rs.1,000/-.
a)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% తక్కువగా ఉంటే  Rs.20/-+ S.T. 
b)  సరాసరి కనీస నిల్వ  (MAB) 50% నుండి 75%  వరకు ఉంటే Rs.30/-+ S.T. 
c)  సరాసరి కనీస నిల్వ  (MAB) 75%  కంటే తక్కువగా     ఉంటే  Rs.50/-+ S.T. 

అలానే  ఇతర  ప్రయివేటు  బ్యాంకుల ( Ex. ICICI, HDFC, AXIS, KOTAK, YES Bank etc., )కనీస నిల్వలు  (Minimum Balance) రూ . లు . 10,000/-   బ్యాంక్ చార్జీలు     రూ .లు .150/- నుండి  రూ . లు . 350/-.  వరకు  డెబిట్ చేస్తారు .
ఇక విదేశీ  బ్యాంకుల  కనీస నిల్వలు  (Minimum Balance) రూ . లు . 1,00,000/- , స్విస్  బ్యాంక్ అకౌంట్  కనీస నిల్వ  రూ .లు . 100 కోట్లు.    

N.B: ప్రస్తుతం S.T. 15% ఛార్జ్ చేస్తున్నారు . ది . 01. 07. 2017 నుండి  ( GST అమలు లోకి వస్తుంది )  GST 18% ఛార్జ్ చేస్తారు .

MAB అనగా  ఏమిటి ?


MAB  అనగా - (Monthly Average Balance)  నెలసరి  సరాసరి నిల్వ . ఒక వేల  కంటిన్యూ గా  కనీస నిల్వలను ( ఉదా : 10,000/-,5,000/- 3,000/- , 2,000/-, 1,000/-)  మైంటైన్  చేయలేక పోతే  దీనిని  చూస్తారు . అంటే   ఒక వేల  పెద్ద మొత్తం , బ్యాంక్ అకౌంట్ లో  కొన్ని రోజులు  ఉన్నట్లయితే , మిగిలిన రోజులు  జీరో (0) బ్యాలన్స్ ఉన్నా బ్యాంక్ చార్జీలు  పడవు . MAB  (Monthly Average Balance)  నెలసరి  సరాసరి నిల్వ ను ఎలా లెక్క  కడుతారు?.  ఉదా :  X  అనే  వ్యక్తి  తన సేవింగ్  అకౌంట్ లో , నెలలో  ఎదో  ఒక రోజు      Rs. 1,50,000/- ఉంచాడు అనుకుందాం .  అప్పుడు  ఇతని  MAB = Rs.5,000/-.            ( Rs.1,50,000*1(Day)/30 (Days). అప్పుడు  ఆ నెలలోని  మిగిలిన రోజులలో  కనీస నిల్వ లేక పోయినా చార్జీలు  పడవు . ఒక వేల  ఒక నెలలో 31 రోజులు వచ్చాయి అనుకోండి . అప్పుడు రూ . లు .  1,55,000/-  ఉంచాల్సి వస్తుంది . లేదా 2 రోజులైతే  రూ  . లు . 72,500/- నివ ఉంచినా  , మిగిలిన రోజులలో బ్యాలెన్స్ లేక పోయినా , బ్యాంక్ చార్జీలు దీనికి సంభందించి పడవు . కనీస నిల్వ బ్యాలన్సులను , ఒక్కో బ్యాంక్  ఒక్కోరకంగా , ఆవిరేజ్ లెక్క గడుతాయి . SBI  అవుతే నెల వారిగాను , ANDHARABANK మరియు కొన్ని ప్రయివేటు బ్యాంకులు అయితే  3 నెలల లోక సారి  లెక్క గడుతాయి . 

'SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్' ఇతర  సర్వీస్ చార్జీలు :
01. హోమ్  బ్రాంచ్ లో కాకుండా  ఇతర  బ్రాంచ్ లలో  నగదు  డిపా జిట్  చేస్తే   రూ . లు . 50/-  , డబ్బు  ఎవరి  అకౌంట్లో డిపాజిట్ అవుతుందో  వారికీ  డెబిట్  చేస్తారు . 
02. NEFT / RTGS / IMPS  ద్వారా  ఇతరుల అకౌంట్లకు  డబ్బు  పమిస్తే (Money transfer to other Accounts) చార్జీలు ఇలా ఉంటాయి . 
అ) NEFT  ( National Electronic Funds Transfer ) ద్వారా  అయితే ,
      రూ . 1 నుండి  రూ .లు . 10,000/- వరకు  రూ . లు . 2/- + S.T.
      రూ . లు .10,001/-  నుండి  రూ .లు . 1,00,000/- వరకు  రూ . లు . 5/- + S.T
      రూ . లు .1,00,001/-  నుండి  రూ .లు . 2,00,000/- వరకు  రూ . లు . 15/- + S.T     
ఆ) .RTGS  ( Real Time Gross Settlement ) ద్వారా  అయితే ,
      రూ . లు .2,00,001/-  నుండి  రూ .లు . 5,00,000/- వరకు  రూ . లు . 25/- + S.T
      రూ . లు .5,00,001/-  నుండి   ఆ పై ఎంత వరకైనా   రూ . లు . 50/- + S.T
ఇ )  IMPS ( Immediate Payment Service) ద్వారా అయితే ,
      NEFT / RTGS  కంటే  కాస్త  అధికంగా  ఉంటాయి . IMPS  అనగా  ఎవరికీ వారే  వారి వారి 
      ఇంటర్నెట్ బ్యాంకింగ్  ద్వారా  తక్షణమే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం. 

03. SMS   సర్వీస్ చార్జీలు :  
      ప్రతి 3 నెలల  కొక సారి  రూ . లు . 15/-  + S.T. డెబిట్ చేస్తారు . 
04. Cheque Book  ఇష్యూ  చార్జీలు :
      10  చెక్కుల  బుక్  కు  రూ . లు . 30/-  + S.T. డెబిట్ చేస్తారు .
      25 చెక్కుల  బుక్  కు రూ . లు .  75/-  + S.T. డెబిట్ చేస్తారు .
      50 చెక్కుల బుక్  కు  రూ . లు . 150/- + S.T. డెబిట్ చేస్తారు .
05. Signature attestation చార్జీలు :
      Signature attestation చార్జీలు  రూ .లు . 50/- నుండి 150/- + S.T. డెబిట్  చేస్తారు . 
అలానే  ATM  విత్ డ్రాయల్ / డిపాజిట్  చార్జీలు ,  ATM/DEBIT CARD/CREDIT CARD  ఇస్యూ  చార్జీలు , అకౌంట్  మైంటైన్ చార్జీలు , బ్యాంక్ స్టేట్ మెంట్  చార్జీలు, చిరిగిన  నోట్ల  మార్చడానికి  చార్జీలు , ఇలా   అనేకంగా  డెబిట్ చేస్తారు . 
       

N.B: 01. పూర్తి  వివరాలకు  బ్యాంక్ వెబ్ సైట్ ను  చుడండి . లేదా  బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించండి  . 

02. కనీస నిల్వలు , బ్యాంక్ చార్జీలు  బ్యాంక్  బ్యాంక్ కు  మరియు , ప్రభుత్వ రంగ , ప్రయివేట్  రంగ బ్యాంకులకు  తేడాలున్నాయి . 
03. June '17 లో   కనీస నిల్వలను  మైంటైన్  చేయాలి .  July'17 నుండి  కనీస నిల్వల  చార్జీలు పడుతాయని బ్యాంకులు  మెసేజ్ లు పంపిస్తున్నాయి . 


www.sollutions2all.blogspot.in