Saturday, April 30, 2016

లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన అక్రమ కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల భవనాలను కూల్చడం న్యాయమా ( DISMANTLING OF NATIONAL ASSET IS JUSTIFIED) ?

ప్ర . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన అక్రమ  కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల  భ0వనాలను కూల్చడం  న్యాయమా  ( DISMANTLING   OF NATIONAL ASSET IS JUSTIFIED) ?


జ . లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలను , నివాస గృహాలను , పదుల అంతస్తుల  భవనాలను కూల్చడం  న్యాయం  కాదు . అవి అక్రమ  కట్టడాలైనా , సక్రమ  కట్టడాలైనా  అవి మన దేశ సంపద . సంపదను నాశనం చేసుకుంటే , మనదేశం  బికారి అవుతుంది . ఇతర దేశాల ముందు తల వంచాల్సి వస్తుంది . అభి వృద్ధి చెందిన దేశంగా  ఎప్పటికీ కాదు . 



యికపోతే,  లక్షలాది , కోట్లాది రూపాయలతో నిర్మించిన కట్టడాలు  , నివాస గృహాలు  , పదుల అంతస్తుల  భవనాలు  ప్రకృతి  సృష్టించినవి  కావు . వీటిని  మానవులు  లక్షలాది , కోట్లాది రూపాయల ఖర్చుతో  , ఎన్నో వ్యయప్రయాసలతో  , ఎన్నో  సంవత్సరాలు  , నిద్ర ఆహారాలు మాని  నిర్మించినవి . మేదావి ఇంజేనీర్ల , ఆర్కి టెక్టుల తెలివి తేటలకు  ప్రతీకలు  .  వీటిని  ప్రకృతి నాశనం చేస్తుంది కాని  ఇలాంటి కట్టడాలును , నివాస గృహాలను   , పదుల అంతస్తుల  భవనాలను ప్రకృతి  సృష్టించదు . నిర్మించదు .  



అయితే , ఈ నిర్మాణాల  వెనుక  అవినీతి (అవినీతి  పరులు ) ఉండవచ్చు . మోసం (మోస కారులు ) ఉండవచ్చు . అధికార దుర్వినియోగం (అధికార దుర్వినియోగ  పరులు ) ఉండవచ్చు. ఈ  నిర్మాణాలు అక్రమమే కావచ్చు . అన్యాయమే  కావచ్చు .  కాని ఇక్కడ తప్పు  కట్టడాలది కాదు  , నివాస గృహాలది కాదు  , పదుల అంతస్తుల  భవనాలది కాదు .  



ఆ  తప్పు  మనసున్న , ప్రాణమున్న  స్వ్వార్ధ పరులది . అవినీతి పరులది . అవినీతి కి తోడ్పడిన లేదా  అవకాశాలు కల్పించే చట్టాలది కావచ్చు . ఓటు బ్యాంకు కోసం  నడిపే రాజకీయాలది కావచ్చు . అందరికీ సమానమైన  న్యాయం కల్పించని  న్యాయ వ్యవస్థది   కావచ్చు . వేలాది కోట్ల బ్యాంకుల అప్పులు  ఎగ్గొట్టే  వారికి  జై కొట్టే  సమాజానిది కావచ్చు .  కాని  ప్రాణం లేని  కట్టడాలది కాదు . నివాస భవనాలది కాదు.   పదుల  అంతస్తుల భవనాలది  కాదు .  అవసరమైతే , దానికి సంభందించిన  మనుష్యులను శిక్షించాలి గాని  ప్రాణం లేని  దేశ  సంపదను కాదు . 

 ఒక చెట్టుకు చెదలు పడుతే , ఆ చెదలకు  మందులు వేసి నివారిస్తాం గాని , చెట్టును నరికి వేయం కదా . 

బిడ్డకు   జబ్బు చేస్తే , తల్లి దండ్రులు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లి మందులు  ఇప్పిస్తారు  గాని , బిడ్డను చంపుకోరు కదా .   

పంటకు తెగులు పడుతే  , మందులు పిచికారి కొడుతారు గాని , పంటను నాశనం చేసుకోరు కదా.

విద్యార్ధి తప్పు చేస్తే , గురువు  తల్లి దండ్రులను  పిలిపించి  కొన్సిల్లింగ్  చేస్తాడే  గాని ,  మంచి మాటలు చెబుతాడే  గాని ,  విద్యార్ధిని చంపడు కదా .   

ఏదేని  అక్రమ సంబందం  తో ఒక శిశువు  జన్మిస్తే ,  అలాంటి వారిని  రక్షిస్తారే  గాని  శిక్షించరు కదా  . అంతే కాదు  , వారికి హక్కులు  కల్పిస్తారు .  ఆ అక్రమ  సంభందం ఏర్పరుచుకున్న  వారికి శిక్షలు  వేస్తారు .  


అందుకని  అత్యవసర పరిస్థితులలో  తప్పా ,  లక్షలాది  కోట్ల ప్రజల  డబ్బుతో  , ఎన్నో వ్యయ ప్రయాసలకు  ఓర్చి , ఎన్నో ఏండ్లు కష్టపడి  ఇంజినీర్లు  , కూలీలు  నిర్మించిన  కట్టడాలను , నివాస భవనాలను , పదుల అంతస్తుల భవనాలను  కూల్చడం  న్యాయం  కాదు. ధర్మం కాదు.  అవసరమైతే  , న్యాయంగా  చెందాల్సిన  వారికి  కెటాయించడం  చేయాలి . లేదా  మరో విధంగా  వాటిని  సద్వినియోగం చేయాలి .  ఒక వేల కూల్చు కుంటూ పోతే,  ఎన్ని యేండ్ల నాటి  కైనా 'భారత దేశం'   అభివృద్ధికి నోచుకోని  దేశం గా  పిలువబడుతుంది  గాని , అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించ బడదు .   




Friday, April 29, 2016

ట్రాఫిక్ జామ్ ను (TRAFFIC JAM IN CITIES ) నియంత్రించడం సాధ్యమా?

ప్ర . ట్రాఫిక్ జామ్ ను  (TRAFFIC JAM IN CITIES )  నియంత్రించడం  సాధ్యమా ?
జ . "రాజు తలుచు కుంటే దెబ్బలకు కొదువా" అన్నట్లు, ప్రభుత్వాలు తలుచుకుంటే పట్టణాలలో ట్రాఫిక్ జాం నియంత్రించడం కొంచెం కష్టం కావచ్చు గాని అసాధ్యం మాత్రం కాదు.

"రెగ్యులర్ గా  బస్సులు , ఇతర  అన్ని రకాల  వెహికిల్స్   పోయే  రోడ్ల మీద ( రోడ్లకు  ఇరువైపులా ) , ఏ ఒక్క  వాహనాన్ని  నిలువ నీయ కుండా ,  తోపుడు బండ్లను నిలువ  నీయకుండా , చిన్న చిన్న దుకాణాలను  పెట్టుకో నీయ కుండా , పండ్లు ,కూరగాయల బండ్లను  పెట్టుకో నీయ కుండా , ఎలాంటి ఫక్షన్లకు , ప్రచారాలకు , ధర్నాలకు  అనుమతు లీయ కుండా  నియమ నిభందనలు  విధించి నట్లవుతే  50% ట్రాఫిక్ జామ్  కంట్రోల్ అవుతుంది ."

హైదరాబాద్ , సికింద్రాబాద్ లాంటి అత్యధిక జనాభా గల నగరాలలో, పది నిమిషాలు వర్షం పడిందంటే , కనీసం 5 లేదా 6 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయి , ప్రజలు నానా అవస్థలు పడు తుంటారు . ప్రమాదాలు జరుగు తుంటాయి. ఇక రాత్రి అయిందంటే , వారి బాధలు వర్ణ నాతీతం . సందెట్లో సడే మియా అన్నట్లు దొంగతనాలు జరుగు తుంటాయి .
హైదరాబాద్ , సికింద్రాబాద్ లాంటి అత్యధిక జనాభా గల నగరాలలో, ట్రాఫిక్ జామ్ ను దీర్ఘ కాలిక ప్రణాలికలతో, శాశ్వతంగా మరియు సంపూర్ణంగా నియంత్రించ డానికి " సూచనలు - సలహాలు".
                                                   " సూచనలు - సలహాలు"

01. నియోజక అభి వృద్ధికోసమని  కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే  ఎంపీ లాడ్స్ ( ప్రతి ఎంపీ కి ప్రతి సం. రం రూ . లు.  5 కోట్లు ) ను , ఎంపీ లకు కేటాయించ కుండా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుని, వాటిని  రోడ్ల  వెడల్పులకు , మరమ్మత్తులకు , పార్కుల నిర్మాణానికి , మూత్ర శాలల గదులకు  వినియోగించాలి . 

02. నిజాయితీ గా ,  నిష్పక్ష పాతంగా, పార దర్శకంగా , ఎవ్వరి కీ లాలూచి పడకుండా  ప్రభుత్వ సొమ్ములను కూడా రోడ్ల వెడల్పు , గుంతలు లేకుండా  మరమ్మత్తులు  ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి .   

03. రోడ్డు రవాణా నిభందనలు పాటిస్తూ , రోడ్ల మీద మట్టి కుప్పలు , ద్విచక్ర వాహనాలు , ఆటోలు , టాక్షీలు , కార్లు , బస్సులు  కూరగాయల మరియు పండ్ల బండ్లు ఆప కుండా చేస్తూ , వాటిని పార్కింగ్ చేయడానికి ప్రతి  కిలో మీటర్ దూరాన ఒకటి  మల్టీ పార్కింగ్  బిల్డింగ్ లను  నిర్మించాలి ,  

04. డ్రై నేజ్ సిష్టం ను అభి వృద్ధి చేయాలి . ఏదయినను  అన్ని శాఖల సమన్వయం తో  ( అనగా , జి . హెచ్ . ఎం . సి ., విద్యుత్  శాఖ , టెలిఫోన్  శాఖ , పోలీస్ శాఖ , రోడ్డు రవాణా శాఖ , జల మండలి  మరియు ప్రజా ప్రతినిధులు  )  జరిగి నట్లయితే , ఎక్కడా ఎలాంటి జాప్యం జరుగదు . 

05.. వర్షా కాలం రాక ముందే మోరీలను , కాలువలను  క్లీన్ చేస్తూ  వర్షపు నీటిని  సాఫీగా  పోయేటట్లు  చేయాలి , 

06. సభలు సమావేశాలకు, పండుగలకు పబ్భాలకు , ఫంక్షన్లకు  నడి  రోడ్ల పైనా  దేవుళ్లను  పెట్టుకోడానికి , పందిర్లు  వేయడానికి , షామియానాలు వేయడానికి ( 4,5 గంటలకు  మించి )  అనుమతులు ఇవ్వకుండా  కట్టడి చేయాలి .  

07. మరియు వి ఐ పీ లు వచ్చి నప్పుడు ఖచ్చి తంగా, ఫ్లై ఓవర్లను , మెట్రో ట్రైన్లను , హెలి కాఫ్టర్ల నే  ఉపయోగించాలి . 

08. గల్లీ గల్లీ నుండి  మెట్రో ట్రెయిన్ ల  వరకు  మినిబస్సులను అందుబాటులో ఉంచాలి  , 

09. కార్లకు అధిక రోడ్  టాక్ష్ లను  విధించాలి . అలానే  కార్లను , ఇతర టూ వీలర్సును  పార్కింగ్  చేసుకోడానికి    ప్రతి కిలో మీటర్ కొక  మల్టీ పార్కింగ్  కాంప్లెక్సులను  నిర్మించాలి . 

10. ప్రభుత్వ కార్యాలయాలను , ఆసుపత్రులను  వికేంద్రీకరించి నట్లవుతే  ట్రాఫిక్ తగ్గు మొఖం పట్టా గలదు , 

11. అప్పటికీ  ట్రాఫిక్ జామ్ తగ్గక పోతే , ఫ్లయ్ ఓవర్లను నిర్మించాలి . క్రొత్త  సందు  రోడ్లను  వెడల్పు చేసి ,  ట్రాఫిక్ ను  ఆ రోడ్ల పై నుండి  వెళ్లే విధంగా  శాశ్వతమైన  నిర్ణయాలు తీసుకోవాలి .  

12. అలానే చట్టం ముందు  అందరూ సమానులే  అనే నిభందనలను  నిష్పక్ష పాతంగా  అమలు చేసినట్లవుతే ,   ట్రాఫిక్ జామ్ పూర్తిగా తగ్గి పోతుంది .

బస్సుల్లో చిల్లర సమస్యను ( CHANGE PROBLEM IN BUSES) తగ్గించాలంటే ఏమి చేయాలి ?

ప్ర . బస్సుల్లో చిల్లర సమస్యను ( CHANGE PROBLEM IN BUSES) తగ్గించాలంటే ఏమి చేయాలి ?

జ . బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు , అధిక రద్దీ వలన , ప్రతి రోజూ ప్రయాణమే ఒక నరకం అవుతుంది . దానికి తోడూ , చిల్లర డబ్బుల గురించి , కండక్టర్ ప్యాసెంజెర్ల మధ్య ప్రతి నిమిషం వాదనలే . బస్సుల్లో , చిల్లర అనేదీ పెద్ద సమస్యగా మారింది. చిల్లర డబ్బులు లేని కారణంగా , అర్ధాంతరంగా , ప్యాసేన్జర్లను బస్సు నుండి దింపివేసిన సంఘటనలూ లేక పోలేదు . తిట్టు కున్న , కొట్టు కున్న సంఘటనలూ లేక పోలేదు .


ఇక పోతే , చిల్లర డబ్బుల సమస్య కారణంగా , కొందరు టికట్లు తీసు కోకుండా ప్రయాణిస్తూ ఉండ వచ్చు . అలానే , బ్యాలన్స్ డబ్బులు టిక్కట్ల మీద వ్రాయడం వలన , మరిచి పోయి నష్ట పోయిన ప్యాసేన్జర్లు కోకొల్లలు .

ఇలాంటి సమస్యలను , కొంత వరకయినా తగ్గించాలంటే , ఒకే ఒక చక్కని మార్గం , దూరాన్ని బట్టి ఫిక్స్ డు చార్జీలను నిర్ణయించడం.
1. ఆర్డినరీ బస్సు లకు, మొదటి ఒక స్టాపుకు 5 రూ .లు., 10 స్టాపుల వరకు 10 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 15 రూ .లు  గా నిర్ణయించాలి .
2. మెట్రో బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 5 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు గా నిర్ణయించాలి .
3. మెట్రో ఎక్ష్ ప్రెస్ బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు గా నిర్ణయించాలి .
4. డీలక్ష్ బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు గా నిర్ణయించాలి .
5. నాన్ ఎ . సి . బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు గా నిర్ణయించాలి .
6. ఎ . సి . బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 15 రూ .లు., 10 స్టాపుల వరకు 20 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 30 రూ .లు . గా నిర్ణయించాలి .
7. కాంబి నేషన్ టిక్కట్సు చార్జీలు ఎ .సి బస్సులకు 20 రూ లు. , మిగిలిన అన్ని బస్సులకు 10 రూ . లు . గా నిర్ణ యించాలి .
8. రోజు వారి పాసులు , ఆర్డినరీ 50 రూ లు. , మెట్రో 75 రూ . లు , మరియు ఎ . సి . బస్సులకు 100 రూ లు . గా నిర్ణయించాలి .
ఈ విధంగా చేయడం వలన ఆర్ . టి .సి . కి , తాత్కాలికంగా కొంత నష్టం జరుగ వచ్చు కాని , లాంగ్ రన్లో లాభాల బాట పడుతుంది . క్రొత్త విధానాలను ప్రజలు ఆద రించాలంటే , దీనికి ప్రజలు అలవాటు పడా లంటే , కొంత నష్ట పోక తప్పదు .
ఈ విధంగా చేయడం వలన , చిల్లర సమస్యను తగ్గించ వచ్చు . బస్సుల్ల్లో చిల్లరకు సంభందించి గొడవలు , కొట్లాటలు తగ్గించ వచ్చు . ఆటల్లో వెళ్ళే , వెహికిల్స్ పైన వెళ్ళే , కార్లల్లో వెళ్ళే ప్రయానికులను ఆకట్టు కుని , ఆక్యుపెన్సీ పెంచ వచ్చు. ప్రయానికులకు డిజిల్ , పెట్రోల్ ఖర్చులను ఆదా చేయ వచ్చు , దేశానికి డిజిల్ , పెట్రోల్ దిగుమతి వ్యయాన్ని తగ్గించ వచ్చు . వెహికిల్స్ ట్రాఫిక్ రద్దీని తగ్గించ వచ్చు . పొల్యూషన్ ను నివారించ వచ్చు .
ప్రయాణికులు కూడా బస్సు ప్రయాణమంటే , చాలా హాపీ ఫీలవుతారు .అవసరాలను బట్టి , పరిస్తితులను బట్టి మార్పులు చేర్పులు చేసు కోవచ్చు .

Thursday, April 28, 2016

ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ( INCREASE OF INCOME TAX LIMIT) 5 లక్షలకు పెంచడం అవసరమా ?

ప్ర .  ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ( INCREASE OF INCOME TAX LIMIT) 5 లక్షలకు పెంచడం  అవసరమా ?
జ . ప్రజల విన్నపాన్ని మన్నించి , 2016-17 బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలని గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారి సర్కారు ఆలోచించడం దేశానికి శుభ పరిణామం:
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలని, అధిక సంఖ్యాక ప్రజలు కోరడానికి ముఖ్య కారణాలను పరిగణలోకి తీసుకుంటే , ఖచ్చితంగా , పార్లమెంటులో బిల్లు పాస్స్ చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది అని అనిపిస్తుంది.
ముఖ్య కారణాలు:
***************
01. నేడు దేశం లోని సంపదంతా , 126 కోట్ల భారత జనాభాలో , కేవలం కోటి మంది చేతిల్లోనే కేంద్రీకృతమయింది . అంటే కేవలం కోటి మంది సకల సౌకర్యాలను అనుభవిస్తుంటే , 125 కోట్ల మంది ప్రజలు , సామాన్య జీవితాల నుండి , బిచ్చ మెత్టుకుని జీవించే స్థాయిల్లో ఉన్నారు.

02. సంపదంతా కేవలం కోటి మంది చేతిల్లోనే కేంద్రీకృతమ వడానికి ముఖ్య కారణాలు , వ్యవస్థల్లో వెసులు బాట్లు , అవినీతి , ఆశ్రిత పక్ష పాతం, నిరక్ష రాశ్యత , ప్రజల వెనుక బాటు తనం , ప్రజలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన లేక పోవడం మొదలైనవి.
03. నిజాయితీగా జీవించే సామాన్య ప్రజలు , మధ్య తరగతి స్థాయికి ఎదగడానికి , నిజాయితీగా జీవించే మధ్య తరగతి ప్రజలు , ఎగువ మధ్య తరగతి స్థాయికి ఎదగడానికి, అవకాశం ఏర్పడు తుంది .
04. 5 లక్షల ఆదాయం గల వారి నుండి , ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఉండదు .
05. కాని దీని వలన , 5 లక్షల ఆదాయం లోపు గల వారికి , ఎంతో ఉపశమనం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది . కనీస సౌకర్యాలతో బ్రతుకడానికి, ఆరోగ్య అవసరాలకు పొదుపు చేసు కోవడానికి వీలు కలుగుతుంది .
06. అధిక పన్ను ఎగ్గొట్టే వారి పైనా , నల్ల ధన కుబేరులపయినా పూర్తీ దృష్టి పెట్టడానికి , ఇంటిలీ జెన్సుకు , ఆదాయ పన్ను అధి కారులకు అవకాశం కలుగు తుంది.
07. ద్రవ్యోల్భణం పెరిగింది . కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది.
08. ఇక ప్రైవేటు ఉద్యోగుల వెతలు చెప్ప నలవి కాదు. "ఎల్ . పి . జి" పుణ్యమా అని , చట్టా లన్నీ చూసి చూడ నట్లుగా నటిస్తున్నాయి . వేతనాలు, ఆదాయాలు, పెన్షన్లు ఉండవు కాని , పన్నులు ఉంటాయి .
09. సామాన్య ప్రజలకు ప్రభుత్వాలపై , రాజ్యాంగంపై , వ్యవస్థలపై విశ్వాసం , నమ్మకం ఏర్పడుతుంది .
10. ప్రజలకు , కనీస అవసరాలతో జీవించాలనే కోరికతో కావచ్చు , కుటుంభ బాధ్యతల నెరవేర్చడానికి కావచ్చు , మోసాలు చేయడానికి , దొంగ తనాలు చేయ డానికి, అడ్డదారులు తొక్కడానికి , అబద్దాలు ఆడటానికి , ఇతరులపై ఈర్ష్య / ద్వేషం పెంచు కోడానికి తావు ఉండదు. ఆలోచనలు రావు .
11. ప్రస్తుతమున్న విధానం వలన , కేవలం వేతన జీవులే అధికంగా నష్ట పోతున్నారు . ఎందుకంటే వారి వేతన లెక్కలు , యజమానుల దగ్గర సక్రమంగా అందు బాటులో ఉంటున్నాయి కాబట్టి . అదే కిరాన షాపుల లెక్కలు , బట్టల షాపుల వారి లెక్కలు , హోటల్స్ వారి లెక్కలు , మద్యం షాపుల వారి లెక్కలు , కాంట్రాక్ట్ వ్యాపారస్తుల లెక్కలు ఎవరి వద్దా ఉండవు . వారి వద్దనుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థలు లేవు . అందుకే సంవత్సరం తిరిగే లోగే అనేక బిల్డింగులు నిర్మిచుకుంటూ ఫ్లాట్స్ , భూములు కొంటూ , వ్యాపారాలు విస్త రించుకుంటూ , వడ్డీ వ్యాపారాలు చేస్తూ , ఫైనాన్సు వ్యాపారాలు చేస్తూ , పన్నులు ఎగ్గొడుతూ కోటీశ్వరులవుతున్నారు.
12. ప్రస్తుతమున్న విధానం వలన , పన్ను లేని ఆదాయాలు గల రాజకీయ నాయకులు , రాజకీయ కార్య కర్తలు , బడా వ్యాపారస్తులు అధికంగా లబ్ధి పొందుతున్నారు తప్పా పేద మధ్య తరగతి వారు ఎ మాత్రం ఎదగడం లేదు . అందు కోసం , ఆదాయ పన్ను మినహింపు పరిమితిని కనీసం 5 లక్షలకు పెంచాలి .
13. ప్రజలు పేద తనంతో , నిరక్ష రాస్యతతో , అనారోగ్యంతో ఉన్నంత కాలం , రాజకీయ నాయకులూ వీరిని , ఓటు బ్యాంక్ గానే గుర్తిస్తారు . స్వతంత్రంగా వోటు హక్కును వినియోగించు కునే ధైర్యం ప్రజలకు ఉండదు . ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశంలో , ఇది సరియైన విధానం కాదు . అందు కోసం , ఆదాయ పన్ను మినహింపు పరిమితిని కనీసం 5 లక్షలకు పెంచాలి .
14. సామాన్య ప్రజలకు , ఇంటి అద్దెలు కట్ట డానికి చాల కష్ట తరంగా ఉంటుంది . కాని అదే అధిక అద్దెలు వసూలు చేసే ఇంటి యజమానులకు , పన్నులు ఎగ్గొట్టడానికి వెసులు బాటు ఉంటుంది . అందు కోసం , ఆదాయ పన్ను మినహింపు పరిమితిని కనీసం 5 లక్షలకు పెంచాలి .
15. ఆదాయాలు సరీగా లేక , చదువు , ఆరోగ్యం , కూడు గూడు కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం అప్పులు చేస్తే , అధిక వడ్డీలు వసూలు చేస్తారు వడ్డీ వ్యాపారస్తులు . అధిక వడ్డీలు చెల్లించ లేని వారు , అప్పులు చెల్లించ లేని వారు ఎంతో మంది కుటుంభాలు , కుటుంభాలే ఆత్మ హత్యలు చేసు కుంటున్నారు . కాని అదే వడ్డీ వ్యాపారస్తులకు పన్నులు ఎగ్గొట్టడానికి వెసులు బాటు ఉంటుంది . వడ్డీ వ్యాపారస్తులను బ్యాన్ చేసే చట్టాలు లేవు .
16. పన్నులనేవి , 5 లక్షల పై , ఆదాయాన్ని బట్టే కాకుండా , వారి ఖర్చును బట్టి , ఏది ఎక్కువైతే దాని ప్రకారంగా , పన్నులు విధించాలి . అప్పుడే నల్ల ధనం పైనా , బినామి ఆస్తుల పైనా , పన్నులు వసూలు చేసి నట్లవుతుంది. ఆ విధంగా ఆదాయ పన్ను శాక , అధిక పన్నులు రాబట్ట వచ్చు .
17. మొన్న 2014 ఎన్నికల సమయాన , కేవలం ఆంద్ర ప్రదేశ్ లోనే , లెక్కలు లేని నల్లధనాన్ని సుమారుగా 134 కోట్ల రూపాయలు లెక్కలు లేని నల్లధనాన్ని ( నగదును ) పట్టుకుంది , ఎన్నికల కమీషన్ . అవసరమైతే రాజ్యాంగాన్ని , చట్టాలను సవరించయినా , 365 రోజులు , ఇలానే సాధారణ చెకింగులు చేసినా , వేల కోట్ల నల్లదనం బయటకు వస్తుంది . ఈ విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచు కోవచ్చు .
వీటినన్నిటిని అధిగ మించి , కొంత వరకైనా , సామాన్య వేతన పరులకు న్యాయం చేకూర్చాలంటే , కనీసం 5 లక్షల ఆదాయం లోపు గల వారికి , పన్ను మినహా యింపు ఇవ్వాలి . అలానే . ఎలాగో 5 లక్షల ఆదాయం వరకు పెంచుతున్నారు కాబట్టి , మగ , ఆడ , సీనియర్ సిటిజన్స్ కాటగారీస్ ఎత్తి వేయాలి . సెస్సు , సర్ చార్జి 10 లక్షల ఆదాయం లోపు గల వారికి ఎత్తి వేయాలి . అలానే , 80సి సి క్రింద 3 లక్షలకు పెంచాలి , 24 ఇ క్రింద 3 లక్షలకు పెంచాలి , రిటర్నులు వేయడం సులభతరం చేయాలి . 5 లక్షల ఆదాయం లోపు గల వారికి రిటర్నులు వేయాలనే నిర్భంధం ఉండకూడదు కాని రిటర్నులు వేయడానికి ఆప్సన్లు ఇవ్వాలి .
0- 5 లక్షలకు- 0 

5.01-8 లక్షలకు- 10%
8.01-10 లక్షలకు- 20%
10.01- ఆ పైన - 30%

మరియు , లెక్కలకు అందని దేశం లోని నల్లదనం , బినామి ఆస్తుల విలువలమీద 60% పన్ను ,

అలానే స్విస్ బ్యాంకు ల్లాంటి , విదేశాల్లో ని బ్యాంకుల్లో ఉన్నటు వంటి నల్లదనం , బినామి ఆస్తుల విలువలమీద 80% పన్ను విధించాలి .

ఈ విధంగా పన్నులు విధిస్తూ , మిగిలిన మినహాయిమ్పులన్ని ఎత్తి వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు .

Wednesday, April 27, 2016

మ్యూచ్యువల్ ఫండ్స్ ( MUTUAL FUNDS) అనగా నేమి ?


ప్ర .  మ్యూచ్యువల్ ఫండ్స్ ( MUTUAL FUNDS)  అనగా నేమి ?
                                 
జ . చిన్న వయస్సులోనే , సంపాదించే సమయం లోనే , క్రమ బద్దంగా పొదుపు చేసు కుంటూ పోతే , ఆ డబ్బే మరల మనకు డబ్బును సంపాదించి పెడుతుంది (Money creates money from break even point).
డబ్బులు పొదుపుతో పాటు , వృద్ధి చేసుకోడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో రిస్కు తో కూడినవి , రిస్క్ లేనివి అని రెండు రకాలుగా చెప్పు కోవచ్చు . మరల వీటిలోనే పన్ను భారం గలవి (డె ట్ ఫండ్స్ ) , పన్నుల భారం లేనివి (టాక్స్  సేవింగ్  ఈక్విటీ ఫండ్స్ )  అని కూడా చెప్పు కోవచ్చు .

1. రిస్కుతో కూడు కున్న పెట్టుబడులంటే, ఆదాయం ఎక్కువగా ఉండి, రిస్కు ఎక్కువ గా ఉంటుంది . కాని పెట్టిన పెట్టుబడులకు భద్రత తక్కువగా ఉంటుంది .

ఉదా : బయట వ్యక్తులకు అధిక వడ్డీలకు ఆశ పడి అప్పులు ఇవ్వడం , ప్రైవేటు
చీటీలు వేయడం , అవగాహన లేకుండా శేర్లల్లో పెట్టుబడులు పెట్టడం , అనుభవం లేకుండా , యిష్టత , స్పష్టత లేని వ్యాపారాలు చేయడం మొదలైనవి.

2. రిస్కు తక్కువగా ఉండే పెట్టుబడులంటే , ఆదాయం తక్కువగా ఉండి, రిస్కు కూడా తక్కువగా నే ఉంటుంది. అంటే భద్రత ఎక్కువ గా ఉంటుంది .

ఉదా : పోస్టాఫీస్ లలో , బ్యాంకులలో - సేవింగ్ (4%) , ఫిక్సుడు డిపాజిట్స్ (7%-9%), రికరింగ్(8%) డిపాజిట్లల్లో , ఎన్ .ఎస్ .సి (8%) లలో పొదుపు చేయడం. ప్రభుత్వ పధకాలలో(6%) , డిబెంచర్స్ (10%) , డెట్ ఫండ్స్, మ్యూచ్యువల్ ఫండ్స్ లలో ( దీర్ఘ కాలంలో 12% నుండి 15%) పొదుపు చేయడం మొదలైనవి .

మ్యూచ్యువల్ ఫండ్స్ (  MUTUAL FUNDS):



కేంద్ర అనుమతి , ఆర్ బి ఐ , సెబీ ఆమోదం పొందిన కంపనీలు , ప్రజలనుండి చిన్న చిన్న మొత్తాలు , ఇతర కంపనీలనుండి పెద్ద పెద్ద మొత్తాలను సేకరించి , అవి తిరిగి రాబడి ఎక్కువగా ఉండే షేర్లల్లో , రిస్కు తక్కువ గా ఉండే ప్రభుత్వ పధకాలలో మరియు కొంత క్యాష్ రూపకం లో ఉంచుకొని కాల్ మనీ వ్యాపారం ద్వారా డబ్బును వృద్ధి చేస్తారు . అలా వృద్ధి చేసిన డబ్బునే , వారి ఖర్చులు , జీతాలు , కమీసన్లు మినహా యించి , మిగిలిన డబ్బును యూనిట్ హోల్డర్లకు పంచుతారు . అంటే యూనిట్ విలవ పెంచు తారు . దీనినే ఎన్ ఎ వి (N.A.V) అంటారు . 

ప్రజల దగ్గర సేకరించిన డబ్బుకు , ప్రారంభం లోనైతే ఒక యూనిట్ 10 రూ ల . చొప్పున కేటాయిస్తారు . ఆ తరువాత ఎన్. ఎ. వి (N.A.V) ఆధారంగా కేటాయిస్తారు . ఇలా కేటాయించిన వాటినే మ్యూచ్యువల్ ఫండ్స్ (  MUTUAL FUNDS UNITS) యూనిట్స్ అనీ , ఇలా నడిపే కంపనీలను మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) కంపనీస్ అని అంటారు . 

కొత్తగా  షేర్ మార్కెట్ లోకి వచ్చే మదుపరులు ,  మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) లలో పెట్టుబడులు పెట్టడమే  మంచిది . ఎందుకంటే  పెట్టిన పెట్టుబడికి  రిస్క్ తక్కువగా ఉంటుంది . ఫండ్ మేనేజర్ల తెలివితేటలతో, అందుబాటులోని సాంకేతిక నైపుణ్యాలతో , త్వర త్వరగా నిర్ణయాలు తీసుకునే శక్తి , చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు  అందుబాటులో ఉండటం మూలంగా ,  దీర్ఘ కాలిక పెట్టుబడిలో  మాడు పరులు 12 నుంచి  16% వరకు లాభాలు రావచ్చు . మదుపరులకు రోజు వారీ టెన్షన్  అవసరం ఉండదు . రాజకీయాల మార్పులకు , ప్రకృతి వైపరీత్యాలకు భీతిల్లాల్సిన  అవసరం  పెద్దగా ఉండదు . అయితే పెట్టుబడులు పెట్టే  స్కీముల గురించి అనుభవజ్ఞ్యుల , ఫైనాన్స్ అడ్వైజర్ల సలహాలను తీసుకోవాలి .కనీసం  ప్రతి 3 నెలల కొక సారి  పెట్టుబడులను సమీక్షించు కోవాలి . 

అదే  కొత్తగా వచ్చే మదుపరులు, యే మాత్రం అనుభవం లేకుండా , కేవలం డబ్బు సంపాదించాలన్న ఆశతో   షేర్  మార్కెట్ లో  పెట్టుబడులు పెట్టినా , రోజు వారీ  ఆన్ లైన్ లావా దేవీలు జరిపినా , చేతులు కాలడం ఖాయం . 

ఉదా . కు  కొన్ని  మ్యూచ్యువల్ ఫండ్స్ (MUTUAL FUNDS) :. Reliance Mutual Fund, Birla Mutual Fund, SBI mutual fund, Sundaram Mutual Fund, TATA Mutal Fund, ICICI , Frankilin, HDFC Mutual funds etc.,

ప్ర . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా  కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు  లేదా నష్టాలు  పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు .  డైరెక్టుగా  కొనేటప్పుడు  0.5% - 1%  కమీషన్స్  బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు  . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా  కొనుగోలు చేస్తే  0.5% - 1% , వీరికి  కమీషన్  మ్యూచ్యువల్  ఫండ్  సంస్థ  చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్  బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన  బ్రోకర్  సంస్థల ద్వారా  కొనడం వలన  అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి .  డైరెక్టుగా  కొనేటప్పుడు   సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) ,   ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది  డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే  పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు .  ఉదా : DSPBR TECHNOLOGIES FUND  కొన్నట్లయితే  ఈ రోజున  12.78% నష్టం వచ్చేది . అలానే  TATA DIGITAL INDIA FUND  కొన్నట్లయితే  ఈ రోజున  9.72% నష్టం వచ్చేది . అలానే  SBI PHARMA FUND కొన్నట్లయితే  ఈ రోజున  9.27 % నష్టం వచ్చేది . అలా  అనేక మైన  '' మ్యూచువల్  ఫండ్స్  '' స్కీమ్స్  నష్టాల లో  కూడా నడుస్తున్నాయి . 




వృద్ధులకు , వితంతువులకు మరియు వికలాంగులకు పెన్షన్లను వారి వారి ఇంటి వద్ద చెల్లించడం వలన ఉపయోగ మేమి ?

ప్ర . వృద్ధులకు , వితంతువులకు మరియు వికలాంగులకు పెన్షన్లను  వారి వారి ఇంటి వద్ద చెల్లించడం వలన ఉపయోగ మేమి ?

జ . వృద్ధులకు , వితంతువులకు మరియు వికలాంగులకు , ప్రభుత్వాలు చెల్లించే పెన్షన్లను, ప్రభుత్వ అధికారులు, వారి వారి ఇంటికి వెళ్లి చెల్లించే ఏర్పాటు చేయాలి.
దీని వలన వృద్ధులకు , వితంతువులకు మరియు వికలాంగులకు , ఎంతో మేలు జరుగు తుంది . సమయం ఆదా అవుతుంది . ఆయాసం తగ్గుతుంది . రవాణా ఖర్చులు తగ్గుతాయి . సంతోషాన్ని వ్యక్త పరుస్తారు. మరి కొంత కాలం జీవించాలనే ఆశ చిగురిస్తుంది .
అలానే , ప్రభుత్వాలకు కూడా మేలు జరుగు తుంది . అక్రమ పెన్షన్ దారులను అరికట్ట వచ్చు . బినామి పెన్షన్ దారులను అరికట్ట వచ్చు . లేని వారిని , చని పోయిన వారిని గుర్తించ వచ్చు . ప్రభుత్వాలకు , ప్రజల్లో మంచి పేరు దక్కు తుంది. ప్రజలకు , ప్రభుత్వాలపై విశ్వాసం ఏర్పడుతుంది .

అవినీతిని నిర్మూలించడం సాధ్యమా ? (Is it possible to remove corruption ?)

ప్ర . అవినీతిని   నిర్మూలించడం సాధ్యమా ? (Is it possible to remove corruption ?).
జ . అవినీతి ద్వారా గుట్టలు గుట్టలుగా ప్రోగయ్యే నల్ల ధనాన్ని , బినామి ఆస్తులను , పన్నులను ఎగ్గొట్టాడాన్ని , అరి కట్టాలంటే అనేకమయిన చక్కటి మార్గాలున్నాయి . చేతులు కాలాక ఆకులు పట్టు కోవడం కంటే , ముందు గానే కొన్ని జాగ్రత్తలు తీసు కుంటే నల్ల ధనాన్ని , బినామి ఆస్తులను , పన్నులను ఎగ్గొట్టాడాన్ని 90% వరకు అరి కట్ట వచ్చు . ప్రభుత్వ ఖజానాను నింప వచ్చు, ప్రభుత్వాలకు అప్పులు లేకుండా చేయవచ్చు. ఆ జాగ్రత్త లేమిటో , ఆ మార్గా లేమిటో చూద్దాం .
1. నల్లదనాన్ని నిజంగా అరికట్టాలనే చిత్త శుద్ధి , ప్రభుత్వాలకు , వ్యవస్థలకూ మరియు అధి కారులకూ ఉండాలనేది ముఖ్యమైన మొదటి అంశం . అలానే , ఎక్కడా పక్ష పాత దోరిని , లేకుండా ట్రాన్స్ప రెంటుగా ఉండాలి .
2. పన్నులను తగ్గించాలి. పన్ను చెల్లింపు విధానాలను సులభ తరం చేయాలి . పన్నులను వసూలు చేసే వ్యవస్థలు ప్రజలకు చేరువలో ఉండాలి. ఇన్కం టాక్స్ "ఎక్జ్స్ మ్షన్ లిమిట్ " ను , అందరికి వర్తించే విధంగా , రూ .లు .5 లక్షలకు పెంచాలి. అలానే సెక్షన్ 80 సి సి. క్రింద రూ .లు 3 లక్షలకు, సెక్షన్ 54 ఇ. క్రింద ఇంటి ఋణం పై వడ్డీ కి మినహాయింపు రూ.లు .2 లక్షలకు పెంచాలి. సర్చార్జ్ , ఎడ్యుకేషన్ సెస్స్ , రూ .లు 10 లక్షల ఆదాయం వరకు మినహాయించాలి . అప్పుడే ఈ నిభంధనలను వర్తింప చేయాలి .
3. ప్రజలకు, వ్యాపారులకు , ఉద్యోగులకు సంబంధించిన సేవలన్నీ ఆన్ లైన్ ద్వారానే జరిగి తీరాలి.
4. రాజకీయ నిధులన్నీ చెక్కులు , డ్రాఫ్టులు , బ్యాంకు ట్రాన్స్ఫర్ల ద్వారానే జరుగాలి. రాజకీయ నిధులకు ఖచ్చితంగా పన్నులను విధించే అధికారం బ్యాంకులకు ఇవ్వాలి .
5. వడ్డీ వ్యాపారాలను , ఫైనాన్సు , హవాలా వ్యాపారాలను , లాటరీలను , స్కీము లను , రిజిస్టరు గాని చిట్టీలను పూర్తీ గా నిషేదించాలి .
6. దేశం లోని అన్ని పోస్టాఫీసులను బ్యాంకులు గా మార్చి , పొదుపుకు , రుణాలు తీసు కోడానికి , సామాన్య ప్రజలకు చేరువ చేయాలి .
7. చదువు కున్న విద్యా వంతులకు , బ్యాంకు అకౌంట్ గల వారందరికీ "పాన్ (PAN) కార్డు " " వోటర్ (VOTER) కార్డు " ఆధార్ (ADHAAR) కార్డు " కంపల్సరీ చేయాలి . వీటన్నిటిని అనుసంధానించాలి .
8. 50 వేల రూ .లకు మించిన ప్రతి ఆర్ధిక లావా దేవీని ( నగదు ద్వారా చేసినా , బ్యాంక్ ద్వారా చేసిన , క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా చేసినా , షాప్ లో స్వయిప్ చేసినా, నెట్ ద్వారా చేసినా ) పాన్ ( PAN ) కార్డు కు లింకు చేయాలి .
9. భూములు , ఇండ్ల కొనుగోలు వ్యవహారాలూ 90 రోజులు మించితే ఖచ్చితంగా రిజిస్ట్రే షన్ చేయించాలి , బయట మార్కెట్ వాల్యు కు అనుగుణంగా , రిజిస్ట్రే షన్ వాల్యు ను సరి చేయాలి .
10. ఆడిటర్లను కంపనీలు ప్రయివేటు గా నియమించు కోకుండా , ఆడిటర్లను ప్రభుత్వమే నియమించి వేతనాలు చెల్లించాలి . కంపనీల నుండి , టర్నో వర్ ఆధారంగా , ఫీజులు వసూలు చేయాలి .
11. ఆదాయాన్ని , ఖర్చును బేరీజు వేసి , ఏది ఎక్కువగా ఉంటే , దాని ఆధారంగా పన్ను విధించాలి .
12. ప్రతి అద్దె ఒప్పందాన్ని అదే విలువకు , బాండ్ పేపర్ వ్రాయించి , నోటరీ చేయించాలి . నోటరీ అధికారి దానిని పూర్తీ వివరాలతో , ఆన్ లైన్ లో నమోదు చేయాలి . దీనిని "పాన్" కు లింకు చేయాలి .
13. గడుప గడుపకు , ఇంటింటికి , ప్రతి స్థలానికి , ప్రతి ఫ్లాటుకు వెల్లి , ఇండ్ల యజమానుల వివరాలు సేకరించాలి . యజమాని పూర్తీ పేరు , భార్యా , పిల్లలు , పాన్ నెంబర్ , వోటర్ కార్డు , ఆదార్ కార్డు, బ్యాంకు అకౌంట్ల వివరాలు మొదలగునవి . ఆ తరువాత వెంటనే డాటా ను కంప్యూటర్ లో నిక్షిప్తమ్ చేయాలి .
14. యజమాని వివరాలను తెలుపడానికి ఇష్ట పడని భూములను , ఇండ్లను , ఫ్లాట్లను పూర్తి విచారణ జరిపించి, ప్రభుత్వం జప్తు చేసుకుని , గృహాలు లేని అర్హు లైన పేద పజలకు , రిజిస్టర్ చేయించాలి . వివరాల సేకరణకు , అన్ని భాషలు వచ్చిన , సమర్దులయిన విద్యవంతులనే నియమించాలి.
15. లెక్కలకు తేలని డబ్బు పట్టు బడినప్పుడు , ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 90 రోజుల లోనే కేసులను ముగించే విధంగా ఏర్పాటు చేయాలి. నల్లధనం గాని , బినామి ధనం గాని పట్టుబడి నప్పుడు , వసూలు చేయవలిసింది 30% పన్ను కాదు . 100% పట్టుబడిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలించాలి .
16. నల్లదనం రాబట్ట డానికి, అనేక అవకాశాలు , ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఇచ్చారు కాబట్టి , రాజకీయ నాయకులు ఇచ్చిన అఫిడ విట్లన్నీ ఎన్నికల కమీషన్ వద్దనే ఉన్నాయి కాబట్టి , ఇక బుజ్జగింపుల విధానం తగదు . పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉండ కూడదు . ఎన్నికల అఫిడవిట్లల్లొ , విదేశాల్లో నల్ల ధనం వున్నట్లు ఎవ్వరూ పేర్కొనలేదు కాబట్టి , అది అంతా నల్లధనమే. 100% ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిందే . అంతే కాకుండా , గత 15 సం. రాల వ్యవహారాలను కూడా విచారణ జరిపించాలి .

17. మొదటగా అత్యంత అవినీతి పరుల , నల్లధన విరాటుల పై అనుసరించే విధానం , ప్రభుత్వ , వ్యవస్థల వైఖరి ద్వారా, నిజాయితీ పరుల్లో , సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి . నమ్మకాన్ని కలిగించాలి . ధైర్యాన్ని నింపాలి .
ఇప్పటి వరకు అది జరుగలేదు . పొట్ట కూటి కోసం పాట్లు పడే, సామాన్య ప్రజలకే అనేక తిప్పల్లు , ఇక్కట్లు .
18. ట్రస్ట్ లు , స్వచ్చంధ సంస్థ ల పై , పూర్తీ నియంత్రణ ను ఏర్పాటు చేయాలి .
19. వడ్డీ ల పై పన్ను మినహాహింపు కొరకు , 60 సం. రాల లోపు వారు ''15జి '' ని 60 సం. రాల పై బడిన వారు "15 హెచ్ " బ్యాంకులలో గాని , కంపనీల లో గాని ఇస్తుంటారు . వాటిని ' అఫిడవిట్ ' లా చట్ట బద్ధత చేయాలి .
20. ఏ విషయం లో నైనా , పెద్ద తలకాయలపై ప్రభుత్వ మరియు చట్ట భద్ద మైన వ్యవస్థల అధి కారుల వైఖరితో , చిన్న తలకాయాల్లో అవగాహన పెంచాలి , భయాన్ని పెంచాలి , మార్పు తీసుకుని రావాలి గానీ, ఎలుకలపై భ్రమ్హాస్త్రాన్ని వేసి , ఏనుగుల కుంభ స్థలాన్ని కొట్టి విజయాన్ని సాధిస్తామనుకోవడం అసంభవం . ఇలా చేస్తే , మరో 100 సo. రాలు పోయిన వ్యవస్థలు ఇలానే ఉంటాయి . అలానే , మన దేశంపై ఇతర దేశాలు పట్టు సాధిస్తాయి .
21. నల్ల ధనం , బినామి ఆస్తుల రాబ్ట్టుటకు , పన్నులను ఎగ్గొట్టకుండా ఉండ టానికి , సూచనలు చేసే వారిని , సలహాలు ఇచ్చే వారిని , వాస్తవ సంఘటనలను తెలియ జేసే వారిని , ప్రోత్శాహించాలి . గౌర వించాలి . పారి తోషికాలు ప్రకటించాలి . ప్రజల లో అవగాహన కలిపించాలి

అఫిడవిట్స్ ( AFFIDAVITS) ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి ?

ప్ర . అఫిడవిట్స్ ( AFFIDAVITS) ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి ?

జ . సామాన్య    పౌర సేవలకు ,  అనగా  ఇన్కం  సర్టిఫికెట్స్ కు,  బర్త్  సర్టిఫికెట్స్ కు , డెత్ సర్టిఫికెట్స్ కు, పెన్సన్  సర్టిఫికెట్స్ కు , అనేకరకాల  అనుమతులకు , లైసెన్సులకు , అధికారులు  అఫిడవిట్లను ప్రజల నుండి  కోరు  తుంటారు. దానికి  తోడూ  నోటరీ  చేయించ మంటారు . ఇవి ఎంత  వరకు ఉపయోగ పడుతున్నాయో  అధికారులు , ప్రభుత్వాలు   ఆలోచించాలి. వీటి వలన  ప్రజలకు  సమయం  వృధా అవుతుంది .  రవాణా  ఖర్చులు వృధా  అవుతున్నాయి . డబ్బు  వృధా అవుతుంది . బాండు  పేపర్లు  దొరుకక  నకిలీవి  తయారవు తున్నవి , మరి కొందరు అక్కడ  తెచ్చాము , ఇక్కడ తెచ్చామని  ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు . ఒక  నిర్ణీత ధర అంటూ లేదు . మరియు  అవసరానికి అందు బాటులో ఉండవు . ఈ మధ్యనే  పోస్టాఫీసులలో  అమ్ముతున్నారు . కాని ప్రజలందరికి పూర్తి అవగాహన లేదు . బాండు   పేపర్ల కొరకు  చెట్లను నరుకుతున్నారు . అఫిడవిట్లను  కాపాడ డానికి , సిబ్బందికి  ఇబ్భందిగా  మారింది . వీటి  వలన కేవలం  దళారులు , బ్రోకర్లు  లబ్ధి పొందు తున్నారు .        ప్రజలకు  కష్టాలు , నష్టాలు  మిగులుతున్నాయి.
అందుకని ,  అఫిడవిట్ల  రద్దు గురించి  అధికారులు ఆలోచించాలి. ప్రజలకు  విముక్తి కలిగించాలి.  అతి పెద్ద  ప్రజా స్వామ్య  భారత దేశంలో , దేశాన్ని  పరి పాలించే , లక్షల కోట్ల  రూపాయలతో  వ్యవహారాల  నడిపించే ,  అతి ముఖ్యమైన  సార్వత్రిక  ఎన్నికల  సందర్భంగా , పోటీలో  నిలిచిన  అభ్యర్ధులు  సబ్మిట్ చేసిన  అఫిడవిట్లకు  ఎన్నికల  కమీషన్ , విలువను పెంచాలి. 'మమ' అనిపిస్తే   ప్రజలకు  యములై  కూర్చుంటారు . ఇంకను  ముఖ్యమైన  వాటికి  సంభందించి  సబ్మిట్ చేసే  అఫిడవిట్లకు  విలువను పెంచాలి . ఉపయోగం లేని చోట  రద్దు చేసే విధంగా ఆలోచించాలి .  

Friday, April 15, 2016

కోర్టులలో కొండల్లా , గుట్టల్లా కేసులు(Increase of cases in courts) పెరిగి పోవడానికి గల కారణాలు ఏమిటి?

ప్ర . కోర్టులలో  కొండల్లా, గుట్టల్లా  కేసులు ( Increase of cases in courts) పెరిగి పోవడానికి గల కారణాలు ఏమిటి?


జ . కోర్టులలో  కొండల్లా , గుట్టల్లా  కేసులు  పెరిగి పోవడానికి గల  ముఖ్య  కారణాలు  " ప్రజలకు  అధి కారులకు     న్యాయ  అవగాహనా  లోపం +  చట్టాలలో  లొసుగులు , మినహాయింపుల పాపం  +  అవినీతి శాపం "  మొదలయిన వాటిని  ముందుగా చెప్పు కోవాలి .   ప్రజలకు  అధి కారులకు     న్యాయ  అవగాహన  ఎలా ఉండాలి  అంటే ' చిన్న పిల్లలకు  వ్యాక్జిన్  వేయించు  కోవాలని  ప్రజలకు ,  వేయాలని అధికారులకు  ఎలా గుర్తుంటుందో  అలా 'చట్టాల గురించి , న్యాయం గురించి  అవగాహన  కల్పించాలి . ఏది మంచి ఏది చెడు , ఏది  ధర్మం , ఏది అధర్మం  అనేది  ప్రతి ఒక్కరికీ  అవగాహన  కల్పించాలి . దీనికి  న్యాయ వాదులు , న్యాయ మూర్తులు , విశ్రాంత న్యాయ వాదులు , విశ్రాంత న్యాయ మూర్తులు  తరుచుగా  గ్రామ  గ్రామాన  సభలు నిర్వహించాలి . దీనికి  ప్రభుత్వం నిధులు కేటాయించాలి .  ఆ విధంగా  ప్రజలలో న్యాయ అవగాహనను ,  నై తికతను   పెంపొందించాలి . ప్రతి ఒక్కరినీ  అక్షరాస్యుల్ని   చేయాలి . ప్రతి ఒక్కరిని ఒక  న్యాయ  సైనికుడిలా  తయారు  చేయాలి .  చట్టం ముందు అందరూ సమానులే అనే  భావనను  ప్రజలలో కల్గించాలి . స్వాతంత్ర్యం  వచ్చిన  68 సంవత్సరాలు  దాటినా  ఇంకనూ నిరక్ష రాస్యులున్నారంటే , ఇంకనూ అత్యంత పేద వారు , బిక్ష గాండ్లు  ఉన్నారంటే  దానికి కారణం , చట్టాలు  రాజకీయ నాయకులకు , బడా మోస గాండ్లకు , వర్తింప చేయడం , ఓటు బ్యాంకు కోసం  కొంత మందికి  జీవిత పర్యంతం రిజర్వేషన్లు  కల్పించడమే . పేద వారు , మధ్య తరగతి వారు , నిజాయితీ పరులు , రైతులు  అప్పులు తీసుకోవాలంటే , సవా లక్ష ప్రశ్నలు  ఎదురౌతాయి . అప్పులు చెల్లించక పోతే  నానా  హైరానా  చేస్తారు. ఆత్మ  హత్యలకు  గురి చేస్తారు . ఆదే  వైట్  కాలర్  మోసగాండ్లకు , కమీషన్లకు  కక్కుర్తి పడో . ఆబ్లిగేషన్స్ వలననో , బ్యాంకర్లు   వేల కోట్ల అప్పులు ఇచ్చి  , వారి ఇంటి ముందు ' ప్లే కార్డ్స్ ను ' పట్టుకుని  నిలబడుతారు . మరి కొంత మంది అప్పుల ఎగవేత దారులు  విదేశాలకు  పోవ డానికి రాచ బాటను ఏర్పాటు చేస్తారు .   పలుకుబడి గల   ధనవంతుడికి న్యాయం దక్కుతుండే , పేద వాడికి  దక్క కుండా  పోతుండే . ధన వంతుడికి  బెయిలు దొరుకుతుండే , పేద వాడికి  దొరకడం లేదాయే . బెయిల్  దొరక  ఆత్మ హత్యలు  చేసుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం . రూ.లు. 25/- చీపురు కట్ట కోసం తీసుకున్న  లంచం కేసు తేల డానికి  40 సంవత్సరాలు  పట్టిన ఉదంతాలు  పేపర్లలో చూస్తున్నాం .   కేసులు అధికంగా వాయిదాలు పడటం , ఒక కేసు  తీర్పు రావడానికి  ఒక్కో సారి  దశాబ్దాలు  దాటడం . సుదీర్ఘ కాలం కొన సాగడం వలన  సాక్షులు  అందు బాటులో  లేక పోవడమో , చని పోవడమో . తారు మారు  చేయడమో జరుగు చున్నది. తీర్పులు  సాక్షులపైననే  ఆధార పడటం  మొదలయిన వన్నింటిని  చట్టాలలో  లొసుగులుగా చెప్ప వచ్చు .   అధికారులలో  అవినీతి  ఆలోచనను రానివ్వకూడదు .  వీటిని  అధిగ  మించుతే  కోర్టులలో కేసులు  తగ్గు మొఖం పడుతాయి . " పుండు ఒక కాడ  ఉంటే మందు ఒక కాడ పెట్టిన  చందం " లా  నడుచు కుంటే   ఉపయోగం  ఉండక పోవచ్చు . 


Tuesday, April 12, 2016

JATHASYA MARANAM DHRUVAM MEANS ? / "జాతస్య మరణం ధృవం "అంటే ఏమిటి ?

ప్ర . "జాతస్య మరణం DEATH)  ధృవం "అంటే ఏమిటి ?
జ . "జాతస్య మరణం  ధృవం" అనగా  "పుట్టిన  ప్రతి  జీవి చావక మానదు" అని దీని అర్ధం . " పుట్టిన  ప్రతి  ఒక్కరు  చావక మానరు "  అని దీని అర్ధం . ఇది  సత్యం . మనిషి   పుట్టే  టపుడు  నూలు పోగు లేకుండా , తల్లి  పేగును  కోసుకుని  ఏడ్చు కుంటూనే   భూమి మీదికి  వస్తాడు   లేదా  వస్తుంది . కాని మరే ఇతర ఆస్తులను , సంపదను  వెంట తీసుకుని రారు . అలానే  మనిషి  చని పోయే టప్పుడు కూడా  కనీసం  పార్ధీవ  శరీరం పై  ఉన్న తెల్లటి బట్టను కూడా  తీసుకుని పోకుండా ,  ఆత్మీయుల  భందాన్ని  తెంపుకుని ఏదో ఒక రోజు  మల్లీ ఏడ్చుకుంటూనో  లేదా  ఏదో రకమైన భాధతోనో  మరని స్తాడు లేదా మరనిస్తుంది . కాలి బూడిదై  పోతాడు లేదా పోతుంది .  కాని  తమ   వెంట  యే   భూములను , యే  డబ్బులను , యే  ఆస్తులను , యే  నల్లదనాన్ని  తీసుకుని పోరు . అంటే  కష్ట పడో  , మోసాలు  చేసో  సంపాదించిన వన్నీ, ఇక్కడే ,  అంటే  భూమి మీదనే వదిలి పెట్టి పోతారు .   ఇంతటి  నగ్న సత్యం తెలిసి కూడా  మనుష్యులు దేనికోసమో ఆరాట పడుతుంటారు . దేని కోసమో  ఇతరులను  నిందిస్తుంటారు , దేని కోసమో ఇతరులను  కించ పరుస్తుంటారు .దేని కోసమో చిన్న చూపు చూస్తుంటారు  .  దేని కోసమో  కొట్లాటలు పెట్టు  కుంటారు . దేని కోసమో  పోట్లాడు తుంటారు . దేని కోసమో  పోరాడుతుంటారు . దేని కోసమో  హైరానా  పడుతుంటారు .  ఎందు కోసమో  మోసాలు చేస్తుంటారు . మరి దేనికోసమో  స్విస్ బ్యాంకులలో లేదా ఇతర బ్యాంకులలో లేదా బినామి పేర్లతో  నల్ల ధనంగా  దాచి పెడుతుంటారు.  హత్యలు చేస్తారు . ఆత్మ హత్యలు  చేసు కుంటారు .

అలానే , ప్రతి జీవికి  జీవిత కాలంలో  4  దశలు ఉంటాయని  మనకు తెలుసు  . అవి , బాల్యం , కౌమార్యం , యవ్వనం  మరియు వృద్ధాప్యం . మనిషికి బాల్యంలో ఉన్నపుడు ఏమి తెలియదనే చెప్పాలి .  కౌమార్యం లో  విద్యా , ఆటలు పాటల తోనే  కాలం గడిచి పోతుంది . ఇక మిగిలింది  యవ్వనం , వ్రుదాప్యం . యవ్వనం లోనే మనిషికి అహం అధికంగా ఉంటుంది . నాకే ఇన్ని ఆస్తులున్నాయనో , నేనే అధికంగా చదివాననో , నేనే పెద్ద హోదాలో ఉన్నాననో , నేనే అధికారంలో  ఉన్నాననో  గర్వం , పొగరు ఉంటుంది . నా అంతటి వారే లేరని  విర్ర వీగు తుంటారు . కసురుకుంటారు . గొడవ పెట్టుకుంటారు . ఎదుటి వారిని  హీనంగా చూస్తారు . ఎదుటి వారిని లెక్క చేయరు .  అయితే  ఎలా  సంపద వారికి  వచ్చింది , ఎలా మోసం చేస్తే   వచ్చింది . యే  ప్రభుత్వ  దయా దాక్షన్యాల వలన వచ్చింది . యే రిజర్వేషన్ల  అవకాశాల ద్వారా వచ్చింది  గుర్తు చేసుకోరు .  అంతే కాకుండా , వారే  ఏదో ఒక రోజు  వృద్ధాప్య దశకు  వస్తామన్న విషయం మరిచి పోతారు . లేదా వారే ఏదో ఒక రోజు అనారోగ్యం పాలు కావచ్చని  గాని , ప్రమాదాలకు గురి కావచ్చని గాని  గుర్తుకు రాదు .  ఒక్కో సారి  యే  అస్స్తులున్నా , ఎంత డబ్బు ఉన్నా  పనికి రాదనీ గ్రహించరు . మనిషి కి  కావాల్సింది  తోటి  వారి  ప్రేమ , ఆప్యాయత , కరుణ అని  గుర్తించరు . 

డబ్బు సంపాదించడంలో  ఒక్కొక్కరిది  ఒక్కో పంధా . ఒకరు తనకు తన కుటుంభ సభ్యుల  జీవనం కొరకు  కష్టపడి డబ్బు సంపాదిస్తే , అదే  అవసరానికి మరికొందరు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటారు  . ఒకరు భవిష్యత్  అవసరాల కొరకు  నిజాయితీగా  సంపాదిస్తే , మరొకరు  తరతరాల  వారసుల అవసరాలకొరకు  మోసాలు  చేసి , కుంభ కోణాలు చేసి , డబ్బు సంపాదించి  నల్ల ధనంగా  స్విస్ బ్యాంకులలో  దాచి పెడుతుంటారు . విదేశాలలో  దాక్కుంటారు .  కష్ట పడండి . నిజాయితీగా సంపాదించండి . ప్లాన్డ్ గా  మదుపు చేయండి . అనుకోకుండా వచ్చే ఖర్చులకు , ఆరోగ్య ఖర్చులకు , వృద్ధా ప్య  జీవనం గడవడానికి  పొదుపు  చేయండి . కాని మోసాలు చేసి  నల్ల ధనం  కూడ పెట్టకండి .  ఏమి సంపాదించినా  , ఎంత కూడా బెట్టినా  పోయే టప్పుడు ఏమి  వెంట తీసుక పోము  అని  గుర్తుంచుకోవడం వలన  ఎక్కడా మోసాలు జరుగవు . ఎక్కడా అవినీతి జరుగదు .  ఎక్కడా కొట్టుకోవడం , తిట్టుకోవడం జరుగదు .  ఎక్కడా కుంభ కోణాలు జరుగవు . ఎక్కడా యుద్దాలు జరుగవు . అలానే  మనిషికి త్రుప్తి సుఖం , ఆనందం  దక్కు తుంది . సర్వే  నిజాయితీ  జన : సుఖినో భవంతు .   


Friday, April 8, 2016

REPO RATE & REVERSE REPO RATE MEANS ?/ "రేపో రేట్ " అనగా నేమి ?

ప్ర . "రేపో రేట్ " (Repo Rate) అనగా  నేమి ?
జ.  ప్రజలు , వ్యాపారస్తులు  వారి వారి అవసరాలకనుగుణంగా    బ్యాంకుల  వద్ద  అప్పులు  తీసుకుంటాయి . అలానే  బ్యాంకులు  వాటి అవసరాల కొరకు , అనగా  తిరిగి  అప్పులు ఇవ్వడానికి  రిజర్వ్ బ్యాంకు (RBI)వద్ద  అప్పులు తీసుకుంటాయి . అప్పులు ఇచ్చినప్పుడు  రిజర్వ్ బ్యాంకు వడ్డీ (Interest) వసూలు  చేస్తాయి . ఆ విధంగా  వసూలు చేసే వడ్డీ రేటునే   "రేపో రేట్ " (Repo Rate)  అని అంటారు . అలానే  బ్యాంకుల వద్ద  మిగులు ఉన్నట్లయితే , వాటిని  రిజర్వ్ బ్యాంకు వద్ద పొదుపు చేస్తాయి . అలా  పొదుపు చేయడం వలన రిజర్వ్ బ్యాంకు  వడ్డీ చెల్లిస్తుంది . అలా చెల్లించే వడ్డీని  " రివర్స్ రేపో  రేట్ " (Reverse Repo Rate ) అంటారు . అయితే  ఈ వడ్డీ  రిజర్వ్ బ్యాంకు వసూలు చేసే  వడ్డీ కంటే  0.50% నుండి  1%  వరకు తక్కువగా ఉంటుంది .  ది . 16.04.2016 నుండి   "రేపో రేట్ " (Repo Rate)  6. 50 %   మరియు   " రివర్స్ రేపో  రేట్ " (Reverse Repo Rate )  6% గా అర్ . బి. ఐ . నిర్ణయించడం జరిగింది  . అలానే  నగదు  రిజర్వ్ రేషియో  ( C.R.R ) 4%. యదా  విదిగా  ఉంచారు .               ( బ్యాంకులు  తమ వద్ద తప్ప కుండా  ఉంచుకోవల్సిన్ నగదు  నిష్పత్తి ని  నగదు  రిజర్వ్ రేషియో  ( C.R.R ) అంటారు ) . 

Wednesday, April 6, 2016

మొదటి భార్య నుండి విడాకులు తీసు కోకుండా రెండవ వివాహం (2nd marriage without taking divorce) చేసుకోవచ్చా ?

ప్ర . మొదటి భార్య నుండి విడాకులు తీసు కోకుండా  రెండవ వివాహం  (2nd marriage without divorce) చేసుకోవచ్చా ?
జ .  మొదటి భార్య నుండి విడాకులు తీసు కోకుండా  ( పిల్లలు ఉన్నా , లేకున్నా, రోగి అయినా ,భోగి అయినా ) రెండవ వివాహం (2nd marriage without taking divorce) చేసు కోవడం  ప్రాధమికంగానే  శూన్యం  మరియు చెల్లదు (NULL & VOID ABINITIO). మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా  రెండవ వివాహం చేసుకోవడం నేరం . మొదటి  భార్యతో  విడాకులు  తీసుకోవడం కూడా అంతా సులువు కాదు. ఎందుకనగా , 
01. మొదటి భార్య రోగి అని  మొదటి రోజే తెల్సినా , ఒంటరిగా , లేదా పిల్లలతో  సహా వేరే వారితో  లేచిపోయినా  కోర్టులో  ప్రూవ్  చేయడం కష్టం .  దీర్ఘ కాలపు  రోగులైనచో , కోర్టు  మరల వేరే  మెడికల్ పానెల్ తో పరీక్షలు  చేయించ వచ్చు . ఒక వేల లేచి పోయినట్లయితే , ఇంటిలీ జెన్స్ అధికారులతో , పరిశోధన చేయించ వచ్చు . అయితే  ఒక కుటుంభాన్ని నిల బెట్టాలనే  మానవత్వంతో, డాక్టర్లయినా , అధికారులయినా  పునరాలోచించ వచ్చు . 
02. ఒక వేల  విడాకుల (divorce) కోసం  లేదా  పెండ్లి  శూన్యం , చెల్లదు(NULL & VOID ABINITIO) అని  కోర్టులో పిటిషన్ వేసినా , కేసును కొట్టి వేయడానికో  లేదా  కేసు గెలవ డానికో , వారి లాయర్  తప్పుడు ఆరోపనలతో  u/s 498/a క్రింద  మరియు ఇతర సెక్షన్ల  క్రింద కేసులు  పెట్ట  వచ్చు.  ఇలాంటివి మరిన్ని తల నొప్పులు  పెట్టవచ్చు .   
03. డైవర్స్ (divorce) కేసు వేసినా అనేక వాయిదాలతో, తీర్పు రావడానికి   కనీసం  6 నుండి 7 సంవత్సరాలు పట్టవచ్చు . ఎందుకంటే , ఏదో ఒక రోజు  వారి మనసు మారి ఒకటి  కావాలనే , కల్సి జీవించాలనే  ఆలోచన  కోర్టులకు ఉండవచ్చు . లేదా  ఫీజులు అధికంగా  లాగ వచ్చనో , ఇతర కోర్టు కేసుల  వలననో  , లాయిర్లు  వాయిదాలు కోరవచ్చు . ఏది ఏమైనా నల్గేది  భార్య భర్త లు పిల్లలు , తల్లి దండ్రులు మరియు అత్తా మామలే . పెర్గేది  కోర్టుల్లో కేసులే . ఒక వేల ఆ పిటిషన్లు వాస్తవాలే అయితే , అవి వారి పూర్వ జన్మ శాపాలే అనుకోవాలి . 
04. ఇంత కష్ట పడ్డా , వేలు లక్షలు ఖర్చు అయినా కేసు గెలుస్తామన్న నమ్మకం లేదు . ఎందుకంటే చట్టాలలో  ఎన్నో మినహా యింపులు , వకీళ్ళ వాక్ చాతుర్యం , కాల పరిస్థితులు , సాంకేతిక  అవకాశాలు , లోపాలు  మరియు  న్యాయ మూర్తుల తీర్పుల పై ఆధార పడి  ఉంటుంది . 
05. మరో విషయం మరవ కూడదు . " ఓడిన వారు  కోర్టులో ఏడిస్తే ,  గెలిచినా వారు  ఇంటికి వచ్చాక ఏడుస్తారు " . ఎందుకంటే  కోర్టుల నుండి తీర్పు వచ్చే వరకు  ఇరు కుటుంభాల ఇండ్లు గుల్ల అవుతాయి . అప్పటికి  వయస్సు కాస్తా మీరి పోతుంది .  

యిక పోతే , ముదటి  వివాహాన్ని  నిలువరించో , దాచిపెట్టో , చట్టబద్దంగా  కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా , రెండవ వివాహం చేసుకోవడం వలన ( ఏవైనా  కుటుంభ తగాదాలు వచ్చి నప్పుడు) రెండవ  భార్య  దురాశతో డబ్బులు , ఆస్తులు  రాబట్ట డానికో    లేదా దెబ్బ తీయ డానికో  u/s 420 ప్రకారం  మోసం చేశాడని   మరియు   IPC చట్టం u/s 495  ప్రకారం  మొదటి వివాహన్ని  దాచి పెట్టాడని  , బ్లాక్ మెయిల్  చేయ వచ్చు . ఇలాంటివన్నీ   మరిన్ని  న్యాయ సమస్యలకు, మానసిక సమస్యలకు , శారీరక సమస్యలకు , కుటుంభ సమస్యలకు  దారి తీస్తుంది . అందుకని మొదటి భార్యకు విడాకులు కోర్టు ద్వారా  తీసుకోకుండా ( కారణాలు ఏవైనా కావచ్చు )  రెండవ వివాహం చేసుకోవడం సురక్షితం కాదు . 

అంతే కాదు , భర్త , అతని తల్లి దండ్రుల యావదాస్తులపై  మొదటి భార్యకు మరియు వారి పిల్లలకు  మాత్రమే  సంపూర్ణ హక్కులుంటాయి . అందుకనే  రెండవ భార్యగా వచ్చే వారు సాధారణంగా , వీరి కొన్ని ఆస్తులను ముందుగానే వ్రాయించు కుంటారు . అప్పుడు " ఉన్నది పోయే  , ఉంచుకున్నది  పోయే  " అన్న చందంగా తయారవుతుంది .  సమాజంలో  చిన్న చూపు  ఏర్పడుతుంది . ఆ కారణంగా  మానసికంగా  , శారీరకంగా  , ఆర్ధికంగా  క్రుంగి పొవచ్చు .