అందుకని ప్రతి చిన్న సమస్యకు డాక్టర్ అని కాకుండా , ప్రతి ఒక్కరూ ఒక డాక్టర్ కావాలి . అందుకు ప్రతి కుటుంభములో ఒకరు ఒక డైరీ ని మెయింటైన్ చేయాలి . అందులో వారు , వారి కుటుంభ సభ్యులకు వచ్చిన వ్యాధుల గురించి వివరాలు తేదీతో సహా పూర్తిగా వ్రాస్తూ ఉండాలి . ఎందువలన జబ్బు వచ్చింది , ఆ రోజు , నిన్న తిన్నాడు , ఏమి త్రాగాడు , ఎలాంటి వ్యాధి లక్షణాలు కనపడ్డాయి , ఏ మందులు వాడారు వివరంగా వ్రాయాలి . ఇలా ఒకటి , రెండు సంవత్సరాలు డైరీ వ్రాస్తూ పోతే , వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు . తక్కువ ఖర్చుతో వ్యాధులను నయం చేసుకోవచ్చు.
కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోపిడీ చేస్తున్నాయో మనందరికీ తెలిసిన విషయమే . ఈ మధ్య కాలంలో , ఒక అమ్మాయికి , అనీజీగా ఉందని , వామిటింగ్ సెన్సేషన్ ఉందని ఒక హాస్పిటల్ కి వెలితే , అక్షరాలా 8 లక్షల రూ లు ఖర్చు అయినాయి . అయినా ఆ అమ్మాయి చని పోయింది .
చిన్న చిన్న వాటిని రాకుండా చూసుకోవాలి , ఇంట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి . మేజర్ సమస్యలకు అనగా , ఆపరేషన్స్ , డెలివరీ , హార్ట్ అట్టాక్ , బ్రెయిన్ స్ట్రోక్ , సర్జరీ , క్యాన్సర్ లాంటి వాటికీ హాస్పిటల్స్ కు పోక తప్పదు . మిగిలినవన్నీ కంట్రోల్ చేసుకో గలిగేవే .
మనిషి తన బాధలను లేదా వ్యాధి సమస్యలను డాక్టర్ కి చెబితేనే లేదా డయాగ్నసిస్ చేస్తే నే , డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు . అప్పటి వరకు చేయలేడు.
4 నుండి 6 అడుగులు మానవ శరీరం . శరీరం పూర్తిగా మన కంట్రోల్ లోనే ఉంటుంది. మన శరీరం లో ఏమి జరుగుతుందో క్షణాల్లో మనకు తెలిసిపోతుంది . మనకు క్షణాల్లో తెలుపడానికి పంచేంద్రియాలు అను వాహకాలు ఉన్నాయి . కన్నులకు ఏ నొప్పి వచ్చిన , అది బ్రెయిన్ కు అందిస్తుంది . వాసనకు సంబంధించి ముక్కు ద్వారా బ్రెయిన్ కు అందుతుంది . శరీరం పైన దద్దులు , మచ్చలు , మరేదయినా వచ్చిన , చర్మం ద్వారా బ్రెయిన్ కు అందుతుంది . వినికిడి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే , చెవుల ద్వారా , బ్రెయిన్ కు అందుతుంది . రుచి కి సంబంధించి , నోటిలో ఏ సమస్యలున్నా , నాలుక బ్రెయిన్ కు అందిస్తుంది.
ఇలా పంచేంద్రియాలు బ్రెయిన్ కు అందిస్తే , క్షణాల్లో మనకు తెలిసి పోతుంది . పుట్టుకతో వచ్చే మూల వ్యాధులు , సడెన్ గ జరిగే ప్రమాదాలను మినహాహిస్తే , ప్రతీ అనారోగ్య సమస్య మనకు తెలిసిపోతుంది . ఆ తరువాత తెలుసుకోవాల్సింది , ఆ సమస్యకు సంబంధించిన కారణాలను విశ్లేషించాలి . సమస్యకు కారణం తెలుసుకున్నామంటే 50% పరిష్కారమైనట్లే . ఎలా అంటారా ? ఉదా: మన శరీరం దద్దుర్లు ఏర్పడ్డాయి అనుకుందాం . దద్దుర్లకు కారణాలు అనేకం ఉండవచ్చు . కొన్ని కారణాలు మీకు తెలియక పోవచ్చు . కానీ మీకు వచ్చిన దద్దుర్ల గురించి , కనీసం 12 గంటలు వెనుకకు వెళ్లి , మీరు యేమి తిన్నారు , యేమి త్రాగారు (ఇంట్లో , బయట ), ఎక్కడ తిరిగారు , ఎవరెవరిని కలిశారు మొదలైన వాటిని క్షున్నంగా పరిశీలించండి . మీకు తప్పకుండా దద్దుర్ల గురించి కారణం ఏమిటో తెలిసిపోతుంది .
దద్దుర్లకు ముఖ్యమైన కారణాలు :
01. పరిశుభ్రముగా లేని ఆహరం గని నీరు గాని త్రాగడం వలన ,
02. కూల్ డ్రింక్స్ త్రాగి నప్పుడు ,
03. ప్లాస్టిక్ కప్పులలో టీ త్రాగి నపుడు , అలానే ప్లాస్టిక్ గ్లాస్ లాలో వాటర్ త్రాగినప్పుడు ,
04. ప్లాస్టిక్ కవర్లలో పెట్టియున్న, తునుబండారాలను , చిక్కీల లాంటివి తిన్నను
05 . ఏవైనా పచ్చి ధాన్యాలను తిన్నప్పుడు ,
06. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న స్వీట్స్ తిన్నపుడు ,
07 . రాతెండి గిన్నెలలో పల్లీలు లాంటివి ఏవైనా వేయించుకుని తిన్నను
08. పార్కులకు , అడవులకు పోయినప్పుడు , కొన్ని పడని మొక్కలను , చెట్లను తాకి నప్పుడు ,
09. అలర్జీ ఉన్నవాట్లతో కర చాలనం చేసినప్పుడు ,
10 . రెసిస్టెన్సీ పవర్ తక్కువగా ఉన్నపుడు ,
11 . వాతావరణంలో మార్పులు చేసుకున్నప్పుడు
ఇలాంటి కారణాల వలన , సాధారణంగా దద్దుర్లు ఏర్పడుతాయి .
మీ దద్దుర్ల కు పైవి ఏమైనా కారణాలు ఉన్నాయో చూడండి .
ఒక వేల ఉన్నట్లయితే , బయపడనవసరం లేదు . కేవలం వాటిని ఆపేయండి .
సాధారణంగా మనం యేమి చేస్తామంటే , దద్దుర్ల కు యేవో గోళీలు వేసుకుంటాం . మన లైఫ్ స్టైల్ మార్చమ్ . అందుకే అవి మనకు రిపీట్ అవుతాయి . కొంతకాలనికి అవి మందులకు కూడా తగ్గవు . అందుకని మీరు చేయాల్సింది కేవలం , దద్దుర్లకు కారణమైన వస్తువులను , తిను బండారాలను నిలిపివేయడం ఒకటే సులువైన మార్గం . మీరు అనవచ్చు , అందరు ప్లాస్టిక్ కప్పులలోనే టీ త్రాగారు , నా ఒక్కరికే ఎందుకు వస్తుంది అని . అవును కావచ్చు . కారణమేమంటే , వారికీ రెసిస్టెన్స్ పవర్ ఉంది , మీకు లేదు . అందుకని మీకు పడటం లేదు . కాబట్టి మీరు ఆపివేయాలి .
అర్ధమైంది కదా . ఇలానే మిగిలిన అనారోగ్య సమస్యల గురించి ఒక పది నిమిషాలు వెచ్చించండి . తెలుసుకోండి .పడని వాటిని ఆపి వేయండి . ప్రత్యామ్నాయం వెతకండి . వంద సంవత్సరాలు బ్రతకాలి కదా అని , కొన్నిటిని వదులుకోండి .
నోట్: ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే . ఎవరినీ హాస్పిటల్ కు పోవద్దని చెప్పడం లేదు . ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే .
No comments:
Post a Comment