షేర్ మార్కెట్ ( SHARE MARKET )
షేర్ మార్కెట్ అంటే ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి ? వాటి వలన ప్రయోజనాలు ఏమిటి ? ఎవరు అర్హులు అర్హులు ? ఎంత డబ్బు పెట్టాలి ? ఎప్పుడు పెట్టాలి ? ఎక్కడ పెట్టాలి ? రిస్క్ ఉందా ? లాంటి అనేక సందేహాలకు చక్కని వేదిక .
Disclaimer:
"MUTUAL FUNDS / SHAE MARKETS INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS. READ ALL THE RELATED DOCUMENTS CAREFULLY BEFORE INVESTING".
నోట్ : ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే . ఇన్వెస్టుమెంట్ చేసే , డాకుమెంట్స్ ను పూర్తిగా చదువగలరు మరియు మీకు దగ్గరలోని నమ్మకమైన , ఫైనాన్సియల్ కన్సల్టెంట్ సలహాలను , సూచనలను పాటిస్తూ నిర్ణయాలు తీసుకోగలరు .
షేర్ మార్కెట్ గురించి తెలుసుకునే ముందు , షేర్ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. షేర్ అనగా ఒక "భాగం" ( PART ). అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే "యూనిట్ " అంటారు .
ఇంకా బాగా అర్ధం కావాలంటే , ఏదైనా కంపెనీ , కంపెనీల చట్టం , సెబీ నిబంధనల ప్రకారం,
కంపెనీ వ్యాపార నిమిత్తం , ప్రజల నుండి , ఇతర సంస్థల నుండి డబ్బును సేకరిస్తుంది . నిభందనలు ప్రకారం , అట్టి డబ్బుకు బదులుగా , షేర్లను అలాట్ చేస్తుంది . గతం లో సరిఫికేట్స్ ఇష్యూ చేసే వారు . ఇప్పుడు అంతా డిజిటల్ అయ్యింది కాబట్టి , అట్టి షేర్లను సంఖ్యా రూపంలో షేర్ హోల్డర్ల డీమ్యాట్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు . ఆ తరువాత స్టాక్ ఎక్స్చేం(NSE ) జి లలో లిస్ట్ చేస్తారు . అట్టి షేర్లను , డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన స్టాక్ బ్రోకర్ దగ్గరే , ఒక ట్రేడింగ్ అకౌంట్ ను ఓపెన్ చేసి , అట్టి షేర్లను పెరిగి నప్పుడు అమ్మి లాభాలు గడిస్తారు .
షేర్ల ధరలు తగ్గుతే నష్టాలు భరిస్తారు . షేర్లు అలాట్ చేసిన తరువాత , షేర్ హోల్డర్ ఆ కంపెనీ లో ఒక వాటా దారు అవుతాడు . వీరికి కంపెనీలో ఓటింగ్ హక్కు ఉంటుంది . డివిడెండ్స్ పొందే
హక్కు ఉంటుంది , రైట్స్ , బోనస్ షేర్లు పొందే అవకాశం ఉంటుంది .
అలా అలాట్ అయిన షేర్లను , ఆన్లైన్ లో అమ్మడం , కొనడం చేసే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ను
షేర్ మార్కెట్ అంటారు . ఇక్కడ షేర్ మార్కెట్ ప్లాట్ ఫామ్ లు బి ఎస్సి ( BSE ) & ఎన్ ఎస్సి (NSE ) మరియు కమాడిటీ (COMMODITY ) మార్కెట్ లు అందుబాటులో ఉన్నాయి . షేర్
మార్కెట్ ను నియంత్రించడానికి సెబీ (SEBI ) (STOCK EXCHANGE BOARD OF INDIA ).
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి ? ప్రయోజనాలు ఏమిటి ?
మ్యూచువల్ ఫండ్స్ అంటే , ఒక రకంగా చెప్పాలంటే , RBI , SEBI , AMFI నిబంధనల ప్రకారం
ఏర్పడిన పొదుపు సంస్థలు . వీటిల్లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా పొదుపు చేసుకోవచ్చు , డబ్బు తీసుకోవచ్చు . వీటిల్లో పొదుపు చేసిన వారిని యూనిట్ హోల్డర్స్ అంటారు . పొదుపు డబ్బుకు బదులుగా యూనిట్స్ ను అలాట్ చేస్తారు . ప్రైమరీ గా అయితే ఒక్కో యూనిట్ విలువ 10 రూ .లు . కొంత కలం అయిన మ్యూచువల్ ఫండ్స్ లలో , యూనిట్స్ కొనాలంటే , యూనిట్ ధరలు మారుతాయి . వీటి రేట్లను ఏ రోజుకారోజు తెలుసుకోవచ్చు . మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు , ప్రజలు మరియు ఇతర ఆర్ధిక సంస్థలు పొదుపు చేసిన మొత్తాన్ని , షేర్లలో , సెక్యూరిటీలలో , బాండ్స్ లలో , గోల్డ్ లో , కమాడిటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు . మ్యూచువల్ ఫండ్స్ సంస్థలలో అత్యంత నిపుణులైన మేనేజర్లు ఉంటారు . జాగ్రత్త గా ఇన్వెస్ట్ చేస్తారు . మ్యూచువల్ ఫండ్స్ లలో వందల రకాల స్కీం లు ఉన్నాయి . ఇన్వెస్టర్స్ ఎంచుకున్న విధంగా, కాలాన్ని బట్టి ఆదాయాలు , డివిడెండ్లు , టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి . వీటిల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే , బ్యాంకులలో వచ్చే వడ్డీ కన్నా అధికంగా రావచ్చు . అయితే వీటికి వచ్చే లాభాలు లేదా ఆదాయాలు షేర్ మార్కెట్ పైనే ఆధార పడి ఉంటుంది . ఒక్కో సారి పొదుపు కూడా నష్ట పోవచ్చు . మంచి ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్స్ లలో పొదుపు చేసి , 8 నుండి 10 సంవత్సరాలు ఉంచగలుగుతే , అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది .
నిబంధనల ప్రకారం , KYC ఉన్న ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు . మైనర్ల నుండి వృద్ధుల వరకు ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చు . మైనర్లు బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి . గార్డియన్ తండ్రి గాని తల్లి గాని , మరొకరు గానీ ఉండాలి .
100 రూ . ల నుండి ఎంతనైనా పొదుపు చేయవచ్చు . నెల నెలా సిస్టమాటిక్ పద్ధతి ద్వారా కూడా పొదుపు చేయ వచ్చు .
అన్ని పని దినాలలో , మ్యూచువల్ ఫండ్స్ నియమాల ప్రకారం ఎప్పుడైనా పొదుపు చేయవచ్చు .
మరిన్ని వివరాలకు మీకు దగ్గరలోని , ఫైనాన్సియల్ అడ్వైజర్ ను కలువగలరు . కామెంట్స్ లో అడుగ గలరు .
షేర్ మార్కెట్ లో ఉన్న 7 ముఖ్యమైన అపోహలు ( 7. MYTHS IN SHARE MARKET ) :
వీటి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది .
01. రిస్క్ బాగా ఉంటుంది . (HEAVY RISK )
రిస్క్ బాగా ఉంటుంది అనేది ఒక అపోహ . రిస్క్ ఉన్న చోటే రిటర్న్స్ ఉంటాయి . స్వతహాగా అవగాహన పెంచుకుని గానీ , బుక్స్ చదివి గానీ , పేపర్ వర్క్ చేసి గానీ లేదా ఒక మంచి ఫైనాన్సియల్ అడ్వైజర్ వద్ద ట్రైన్ అయి గానీ ట్రేడింగ్ చేస్తే , షేర్ మార్కెట్ లో , రిస్క్ మినిమైజ్ చేయవచ్చు . అధిక లాభాలు సంపాదించ వచ్చు .
02. షేర్ మార్కెట్ లో పెట్టుబడి అనేది ఒక జూదం (INVESTMENT IN SHARE MARKET IS A GAMBILING )
షేర్ మార్కెట్ లో పెట్టుబడి అనేది ఒక జూదం అనేది ఒక అపోహ . అవగాహన లేకుండా , అత్యాశ తో ట్రేడింగ్ చేస్తే ఏదైనా జూదమే అవుతుంది . వాస్తవానికి షేర్ మార్కెట్ జూదం కాదు . లక్ కాదు . గ్యాంబిలింగ్ కాదు . లాటరీ కాదు . షేర్ మార్కెట్ తెలివితో కూడినది . సహనంకావాలి. ఎమోషన్స్ ఉండ కూడదు . నిర్ణయాలు సత్వరం తీసుకోగల శక్తి ఉండాలి . ధైర్యం ఉండాలి . దీర్ఘ కాలం వేచి ఉండాలి . ర్యూమర్స్ నమ్మ కూడదు . సరియైన సమయంలో పెట్టుబడులు పెట్టగలగాలి . సరియైన సమయంలో పెట్టుబడులు తీయాలి . ఈ విధంగా చేస్తే అధిక లాభాలు సంపాదించవచ్చు . అప్పుడు షేర్ మార్కెట్ లో పెట్టుబడి అనేది ఒక జూదం కాదు .
3. నేను ధనవంతుడిని కాను . షేర్ మార్కెట్ , నాకు కాదు (I AM NOT A RICH . SHARE MARKET IS NOT FOR ME )
నేను ధనవంతుడిని కాను . షేర్ మార్కెట్ , నాకు కాదు అనేది కూడా ఒక అపోహ మాత్రమే . షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి నీవు ఒక ధనవంతుడివో , కోటీశ్వరుడివో కానవసరం లేదు . రియలెస్టేట్ లో ఒక 100 గజాలు కొనాలన్నా , ఒక ఫ్లాట్ కొనాలన్నా , ఒక ఎకరం భూమి కొనాలన్నా , కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి కావాలి . షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి లక్షల రూపాయలు అవసరం లేదు . కొన్ని వేలు ఉన్నా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చు . కొద్ది కొద్ది గా లాభాలు సంపాదిస్తూ సంపద సృష్టించ వచ్చు .
4. నీవు యువకుడి వైతే అధిక రిస్క్ తీసుకోవచ్చు ( IF YOU ARE YOUNGER , YOU CAN TAKE MORE RISK )
చిన్న వయసులో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే నష్ట పోతారు అనేది ఒక అపోహ . వాస్తవానికి చిన్న వయసులో ఎంటర్ అవుతే , రిస్క్ తీసుకోడానికి , మళ్ళీ దానిని రికవర్ చేయడానికి , మెళుకువలు నేర్చుకోడానికి , దాని ద్వారా దీర్ఘ కాలంలో , అధిక సంపద సృష్టించడానికి చక్కని అవకాశం .
వారెన్ బఫెట్ 2 రూల్స్ చెప్పాడు : 1. డబ్బును పోగొట్టుకోకు (NEVER LOOSE MONEY )
2. మొదటి రూల్ ను మరిచి పోకు (NEVER FORGET RULE NO. 1.
5. షేర్ ప్రైస్ తక్కువగా ఉన్నపుడు కొనాలి . పెరిగినపుడు అమ్మాలి ( INVESTING IS STRAIGHT FORWARD , BUY AT LOW AND SELL AT HIGH PRICE )
షేర్ ప్రైస్ తక్కువగా ఉన్నపుడు కొనాలి . పెరిగినపుడు అమ్మాలి లాభాలు గడించాలి అనేది సామాన్య ప్రజల అపోహ మాత్రమే . నిజానికి ఇది అంతగా పని చేయదు . దీనికి జీవిత మొత్తం సరిపోదు . ఎప్పుడు ఫాల్ అవుతుంది , ఎప్పుడు పెరుగుతుంది , ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది కనిపెట్టడం చాలా కష్టముగా మారుతుంది . లో అనుకున్నది ఇంకా తగ్గ వచ్చు . అప్పడు ఆవిరేజ్ చేయాలనిపిస్తుంది . అది ఇంకా తగ్గుతుంది . జీరో అయిన షేర్ షేర్స్ కూడా ఉన్నాయి . అప్పుడు అధిక నష్ఠాలు మూటగట్టుకోవాల్సి రావచ్చు . కొద్ది మార్జిన్ తో ఎగ్జిట్ అయిన షేర్స్ , రాకెట్ లా దూసుకు పోవచ్చు . అప్పుడు బాధ పడాల్సి రావచ్చు . సంపద మాత్రం సృష్టించ లేరు . సంపద సృష్టించాలంటే మంచి షేర్స్ లలో పెట్టుబడి పెట్టి లాంగ్ టైం వెయిట్ చేయాలి . ఇక్కడ కాంపౌండ్ వర్క్ అవుట్ అయి అధిక సంపదను సృష్టించ గలరు .
6. హై రిస్క్ = హై రివార్డ్స్ ( HIGH RISK = HIGH REWARDS ):
హై రిస్క్ = హై రివార్డ్స్ అనేది ఒక అపోహ మాత్రమే . హై రిస్క్ ఉన్న చోట పెట్టుబడులు పెడితే , హై రివార్డ్స్ వస్తాయనేది అపోహ మాత్రమే . ఒక్కో సారి హై రివార్డ్స్ రావచ్చు . రాక పోవచ్చు .
లో రిస్క్ ఉన్న చోట పెట్టుబడులు పెట్టినా హై రివార్డ్స్ రావచ్చు .
7. ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడే పెట్టుబడి పెట్టాలి (FII,s INVESTING IN THIS STOCK , I SHOULD BUY THIS STOCK )
ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడే పెట్టుబడి పెడుతాను, లాభాలు సంపాదిస్తాను అనేది ఒక అపోహ మాత్రమే . ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుబడులు పెద్ద మొత్తం లో ఉంటాయి . అనేక రకాల థీమ్స్ తో ఉంటాయి . అందుకని వారు వివిధ షేర్స్ లలో డైవర్సిఫై చేయాలి . వారి నిబంధనలు వారికి ఉంటాయి . హై స్కిల్ల్డ్ మేనేజర్స్ ఉంటారు . హై ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది . క్షణాల్లో కొంటారు . క్షణాల్లో అమ్ముతారు . వారితో పోటీ పడటం అత్యంత రిస్క్ తో కూడుకున్న విషయం . కాబట్టి ఆ అపోహ నుండి దూరంగా ఉండాలి .
PLease watch my YOUTUBE Channel, for more Videos :
No comments:
Post a Comment