సామాజిక సమస్యలు & పరిస్కారాలు (SOCIAL PROBLOMS & SOLUTIONS)


సామాజిక సమస్యలు & పరిస్కారాలు 



ప్ర . '' 'వార్ధక్యం ', (OLD AGE) ' ఒంటరి తనం '( LONELY NESS ) ఆత్మ హత్యలకు దారి తీస్తుందా ? ".
        
జ . యే మనిషికైనా తన జీవిత కాలంలో ముఖ్యమైన నాలుగు దశలు ఉంటాయి . అవి , 'బాల్యం', 'కౌమార్యం ', 'యవ్వనం ', మరియు 'వార్ధక్యం' .

01. మొదటి దశ ' బాల్యం ': ఇది పుట్టిన రోజు నుండి 7 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' బాల్యం ' గా చెప్పు కోవచ్చు . ఈ దశలో పిల్లలను , తల్లి దండ్రులు , అమ్మమ్మలు , తాతయ్యలు మరియు ఇతరులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు , కంటికి రెప్పలా చూస్తారు . మరెంతో ప్రేమను కనబరుస్తారు . అమ్మ నాన్నలు , అమ్మమ్మ , నానమ్మ తాతయ్యలు చెప్పే మంచి మాటలు , చిట్టి చిట్టి కథలు చెబుతుంటే వింటూ హాయిగా బజ్జుంటారు .
02. రెండవ దశ ' కౌమార్యం ' : ఇది సుమారుగా 7 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' కౌమార్యం ' అని చెప్ప వచ్చు . ఈ దశలో పిల్లలు ఆడుతూ , పాడుతూ , చదువుతూ , ఎగిరి గంతులు వేస్తూ సమాజాన్ని , లోకాన్ని అవగాహన చేసుకుంటూ తల్లి దండ్రుల , పెద్ద వారి అండతో , సహకారంతో ఇంటర్ చదువులు పూర్తి చేసి డిగ్రీ , ఇంజినీరింగ్ , డాక్టర్ కోర్సులలో అడుగు పెడుతారు . మంచిని చెడును అర్ధం చేసుకుంటారు . కొందరు , వారు పుట్టిన , పెరిగిన నేపధ్యాన్ని బట్టి , సమాజాన్ని బట్టి , వ్యవస్థను బట్టి , సినిమాలను , టి వి . ప్రసారాలను , ఇంటర్నెట్ ను బట్టి , జీవన స్థితి గతులను అనుసరించి మారు తుంటారు .
03. మూడవ దశ ' యవ్వనం ' : ఇది సుమారుగా 19 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' యవ్వనం ' అని చెప్ప వచ్చు . ఈ దశలో తల్లి దండ్రుల , పెద్ద వారి అండతో , సహకారంతో డిగ్రీ , ఇంజినీరింగ్ , డాక్టర్ కోర్సు లు పూర్తి చేసి , ఉద్యోగం లోనో , వ్యాపారం లోనో లేదా మరో వృత్తి లోనో స్థిర పడుతారు . డబ్బు సంపాదిస్తూ , తమ కాళ్ళ మీద తాము నిలబడుతారు . ఆ తరువాత పెండ్లిళ్ళు , పిల్లలు , బాధ్యతలు పెరుగుతాయి . గృహాలు , ఆస్తులు కొంటారు . ఇక వీరి తల్లి దండ్రులు వృద్ధాప్య దశకు చేరువలో ఉంటారు . అప్పుడు వీరికి , కొడుకులు ,బిడ్డలు అండగా వుంటారు . ఆ విధంగా కుటుంభం గా ఏర్పడి , సమాజం లో ఒక భాగంగా గుర్తించ బడుతారు .
04. నాల్గవ దశ ' వార్ధక్యం ' : ఇది సుమారుగా 61 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు గల కాలాన్ని ' వార్ధక్యం ' అని చెప్ప వచ్చు . ' వార్ధక్యం ' ( వృద్ధాప్యం ) దశలో వీరికి శక్తి సామర్ధ్యాలు తగ్గి పోతాయి . సంపాదించుకునే శక్తి తగ్గి పోతుంది . ఆదాయం తగ్గుతుంది . వీటికి తోడు రోగ నిరోధక శక్తి తగ్గి , అనా రోగ్యాలు వెంటాడు తాయి . ఉద్యోగ కారణాల వలన లేదా డబ్బు అధికంగా సంపాదించా లనే ఆరాటం వలన , ఆర్ధిక పరిస్థితుల కారణంగా , పిల్లల చదువుల వలన , కుటుంభ సమస్యల వలన లేదా ఇతర కారణాల వలన , జీవితాలు యాంత్రికంగా మారి కొడుకులు , బిడ్డలు , పిల్లలు ఒక్కొక్కరు , ఒక్కో చోట లేదా కొన్ని చోట్ల నివశించ వలసి రావచ్చు . అలాంటప్పుడు వృద్ధాప్యం లోని తల్లి దండ్రులు గ్రామాలలోనో , పట్టణాల లోనో ఒంటరిగా జీవించ వలసిన పరిస్థితి ఏర్పడు తున్నది .

ఇప్పడు ఒంటరి తనం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది . అసలే వృద్ధాప్యం . ఆ వయస్సులో సాధారణంగా అనేక మైన రోగాలు వెంటాడుతాయి .కాళ్ళ నొప్పులు . నడవలేని , ఏ పని చేసుకోలేని పరిస్థితి . కొందరికి కండ్లు కన పడక పోవచ్చు . బి పి . షుగర్ ఉండ వచ్చు . వీరికి ఆక్షీజన్లా టైం ప్రకారం మందులు వాడాలి . కొందరు మూగ , చెవుడు ,వికలాంగులు కావచ్చు . ఇక వీరి ఆలోచనలు , రోధనలు ఎలా ఉంటాయంటే , నవ మాసాలు మోసి , కని , పెంచి పెద్ద చేసి , చదివించి , ప్రయోజకులను చేస్తే కాన రాకుండా పోయిరి అనే బాధ కడుపులో రగిలి పోతుంది . ఆస్తులు పంచిస్తే హాయిగా అనుభవిస్తూ అందనంత దూరంలో ఉండిరి గదా అన్న దిగులు కలుగుతుంది . గంపెడు బలగంలో పుడితిమి , చుట్టూ అందరు వున్నా , ఎవ్వరూ లేనట్లాయే నన్న బాధ . పిడికెడు అన్నం కంచంలో పెట్టె వారు లేక పాయె ననే వేదన . గ్లాసెడు నీరు అందించే వారు లేక పాయె ననే దిగులు . మందు గోలయినా అందించే వారు లేక పాయె ననే రంది . కనీసం ఆత్మీయంగా మాట్లాడే వారు లేక పాయె ననే కుంగు బాటు . సాటి వారు ఏమనుకుంటారో నని మరో రకమైన బాధ . ఇలాంటి ఆలోచనలు , రందులు , బాధలు , దిగులు వెరసి శారీరక క్రుంగు బాటుకు దారి తీసి , మరింత అనా రోగ్యానికి , పక్ష వాతానికి , హార్ట్ అటాక్ కు దారి తీయ వచ్చు . ఇవే చివరకు ఆత్మ హత్యలకు పురి కొల్ప వచ్చు .

కటిక పేద వారైనా , అపర కుబేరులైనా ( 60 సంవత్సరాల పై బడి జీవిస్తా రను కుంటే ) ఈ నాలుగు దశలను ఎవ్వరూ తప్పించు కోలేరు . అనా రోగ్యాలను తప్పించు కోలేరు . కాని రందులను , దిగులును , మానసిక అశాంతిని , ఆత్మ హత్యలను తగ్గించు కోవచ్చు . ఆత్మీయతను పొంద వచ్చు .

మనకు తెలుసు , ఇంట్లో కుంచెడు బియ్యం ఉన్నాయంటే మనకు ఆకలి వేయదు . బిందె నిండా మంచినీళ్ళు ఉన్నాయంటే మనకు పెద్దగా దూప వేయదు . కాని అవే లేవని మన మనసుకు తెలిస్తే విపరీతమైన ఆకలి , దూప వేస్తుంది . కారణం మన మనసుకు లేవని తెలియ గానే , అది మన అవయవాల నన్నింటిని అలర్ట్ చేస్తుంది . ఆ అవయవాలన్నింటి వత్తిడి వలన మరింత ఆకలి , దూప వేస్తుంది .
అలానే వృద్ధాప్యం లో ఉన్న వారికి , తమ చుట్టూ తమ వారు కనబడినా , ఆత్మీయంగా మాట్లాడినా , ఆర్ధికంగా ఎలాంటి లోటు లేనట్లవుతే , సమయానికి కావలసినంత ఆహారం దొరికి నట్లవుతే , సరిపడా మందులు అందుబాటులో ఉన్నట్లవుతే , నా అనే వారు ఎలాంటి తప్పుడు నడకలు నడవక పోతే , ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా , దిగులు , రంది లేకుండా హాయిగా జీవిస్తారు . వీరు ఆత్మ హత్యల జోలికే పోరు . వీరికి ఆ అవసరం కూడా లేదు . కాని ఎప్పుడయితే పై వన్నీ లేదా కొన్ని లోపించినా , వాటికి తోడు చీద రింపులూ , చీత్కారాలు , వేదింపులు ఉన్నట్లయితే , రోజూ అవే ఆలోచనలతో , బాధలూ , రందులూ వెంటాడుతాయి . ఆ మానసిక వేదన తీవ్రమయితే , అనారోగ్యం ఇంకా పెరుగ వచ్చు , పక్ష వాతం , హార్ట్ అటాక్ కు గురి కావచ్చు , ఆత్మ హత్యకు దారి తీయ వచ్చు .
వృద్ధ భార్యా భర్తలు ఇద్దరూ జీవించి నంత కాలం , కొంత వరకు , ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారు . ఒకరికి మరొకరు కొండంత ధైర్యంగా ఉంటారు . కాని వారిలో ఒకరు దురదృష్టవశాత్తు కాలం చేస్తే , మిగిలిన వారికి ఒంటరి తనం బెంగ పట్టు కుంటుంది . అభద్రతా భావం పెరిగిపోతుంది . కనీసం అప్పుడైనా కొడుకుల కోడండ్ల , బిడ్డల అల్లుండ్ల , మనుమల మనుమ రాండ్ల ద్వారా ప్రేమ , ఆలనా పాలనా , పలకరింపు , తలపైనా చేతి స్పర్శ కూడా కరువయితే వారి మనో వేదన , దిగులు , క్రుంగుబాటు తీవ్ర తరమవుతుంది . వీటికి తోడు చీదరింపులు , వేదింపులు తోడయితే వారి జీవితం ఒక నరకంగా మారుతుంది . ఇక ఆ మానసిక ఆలోచనలతో రక్త ప్రసరణ తగ్గి పోయి పక్ష వాతానికి , హార్ట్ అటాక్ కు దారి తీస్తుంది . లేదా కొంత కాలానికి చుట్టూ చీకట్లు కమ్ముక పోయి , ఆలోచన శక్తి నశించి , అభద్రతా బావానికి లోనై , ఆత్మ హత్యకు పాల్పడుతారు . ఇటీవలి కాలంలో చుట్టూ అందరు ఉండి కూడా , ఒంటరి తనంతో , ఆత్మ హత్యకు పాల్పడిన సినీ ప్రముఖుడు శ్రీ రంగ నాథ్ గారిని , ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు .

www.sollutions2all.blogspot.com



For more Videos , Please watch my Youtube channel :

No comments: