Saturday, December 31, 2016

పైసా ఖర్చు లేకుండా , నల్ల ధనాన్ని ( BLACK MONEY), దొంగ నోట్లను (FAKE NOTES), బినామీ ఆస్తులను ( BENAMI ASSETS) , అవినీతిని ( CORRUPTION) , అరి కట్ట లేమా ?

ప్ర : పైసా  ఖర్చు లేకుండా ,  నల్ల ధనాన్ని  ( BLACK MONEY),  దొంగ నోట్లను  (FAKE NOTES),  బినామీ  ఆస్తులను ( BENAMI ASSETS) , అవినీతిని ( CORRUPTION) ,  అరి కట్ట  లేమా  ?

జ :" నొప్పివ్వక  తానొవ్వక  పన్నులు వసూలు చేయువారు  ధన్యులు  సుమతీ " అన్నట్లు  , పైసా  ఖర్చు లేకుండా ,  ప్రజలకు ఎలాంటి ఇబ్బంది  కలుగ కుండా , పారదర్శకత  గల  ప్రభత్వ విధానాలా  ద్వారానే ( SYSTEMS DEVELOPMENTS),   నల్ల ధనాన్ని  ( BLACK MONEY),  దొంగ నోట్లను  (FAKE NOTES),  బినామీ  ఆస్తులను ( BENAMI ASSETS), అవినీతిని ( CORRUPTION) ,    సునాయాసంగా  అరి కట్ట  వచ్చు .  అది ఎలాగంటే ,

01. భారత  దేశంలో  నివసించే ప్రతి ఒక్కరికీ ( ఆస్తులు కలిగి ఉన్న  ఒక నెల బిడ్డతో సహా ) , ఒకే ఒక  'ఆధార్ కార్డు'  ఉండాలనే  నిబంధన  ఉన్నట్లు గానే , ఒకే ఒక 'పాన్ కార్డు ' ఉండాలనే  నిబంధన ఉన్నట్లుగానే , ఒకే ఒక 'డ్రైవింగ్ లైసెన్స్' ఉండాలనే  నిబంధన ఉన్నట్లుగానే , ఒకే ఒక ' పాస్ పోర్ట్ ' ఉండాలనే  నిబంధనఉన్నట్లుగానే , ఒకే ఒక ' ఓటర్ కార్డు ' ఉండాలనే  నిబంధనఉన్నట్లు గానే , ఒకే ఒక ' బ్యాంకు  అకౌంట్ ' ఉండాలనే  నిభందనను ,  ఒకే ఒక ' సెల్ ఫోన్ నెంబరును '  కలిగి ఉండాలనే నిబంధనను  ప్రవేశ పెట్టి  తప్పని సరీగా   అమలు చేయాలి.   అలానే  ఒక బ్యాంకు నుండి మరో బ్యాంకు కు మారడానికి , ఒక  సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ నుండి  మరొక  సర్వీస్ ప్రొవైడర్ కు మారడానికి పోర్టబిలిటీ  ఫెసిలిటీ (PORTABILITY FACILITY)  కల్పించాలి  . 

02. ఇతర  ప్రభత్వ  శాఖల  రిజిస్ట్రేషన్  వ్యవహారాలన్నిటిని , పెట్టుబడులను , పొదుపు పథకాలను , జీవిత  భీమాలను ,  బ్యాంకు అప్పులను  ' పాన్ కార్డు ' కు, ' ఆధార్ కార్డు ' కు లింక్ చేయాలి  .

03. విదేశాలతో  " వ్యాపార  సమాచార మార్పిడికి " ఒప్పందాలు  చేసుకోవాలి  . మన దేశం నుండి  వెళ్లి , విదేశాల్లో గాని , చంద్ర మండలంలో గాని   ఏ వ్యాపారం చేసినా , ఎలాంటి ఆస్తులు కొన్నా , వాటి వివరాలు  తెలిపే విధంగా  ఒప్పందాలు  చేసుకోవాలి .    

04. దీనిని  ఏ  ప్రభుత్వం వచ్చినా , ఎలాంటి స్వార్ధం , పక్ష పాతం , తాత్కాలిక రాజకీయ లబ్దికి  ఆశించ కుండా  అమలు చేయాలి . అలానే  నిరంతరం  పర్యవేక్షించాలి  ,   అంతే .

దీని  వలన నల్ల ధనాన్ని  ( BLACK MONEY),  దొంగ నోట్లను  (FAKE NOTES),  బినామీ  ఆస్తులను ( BENAMI ASSETS), అవినీతిని ( CORRUPTION) ,  ఎలా   అరి కట్ట  వచ్చు ?

01.  'బ్యాంకు అకౌంట్' ద్వారా  ఒక వ్యక్తికి  అకౌంటులో   డబ్బు  ఎంత ఉందో  క్షణాల్లో  తెల్సి పోతుంది . అంతే కాకుండా , ఆ డబ్బు ఎక్కడినుండి  వస్తుంది, ఎక్కడికి  వెలుతుంది , ఎందుకు వెలుతుంది  మొదలైన సమాచారం   అధికారులు  తెలుసుకోవడం  వీలవుతుంది .  ఏమేమి  కొటున్నారో , ఏమేమి అమ్ముతున్నారో  తెల్సి పోతుంది .  ఇప్పటి వరకు  డబ్బు ఎలా సంపాదించారో  ,  ఆదాయ పన్నులు  ఎంత  ఎగ్గొట్టారో  తెల్సి పోతుంది . (ఐ . టి . రిటర్న్స్  తో పని లేదు). 

02. ' పాన్  నెంబర్ ' కు ఇతర ప్రభుత్వ రిజిస్ట్రార్  శాఖలను , 50 వేలకు మించి కొనుగోలు చేసే  బంగారానికి , వస్తువుల బిల్లులకు   లింక్ చేసి నట్లవుతే , వారి స్థిర , చర ఆస్తులు ఏమిటో  ,  బంగారం ఎంతో , వస్తువులు ఏమిటో , వాటిని కొన్న ధర ఏమిటో , మార్కెట్ ధర ఏమిటో, పొదుపు ఏమిటో , పెట్టుబడులు ఏమిటో , ఇన్సూరెన్స్ లు ఏమిటో   క్షణాల్లో తెల్సిపోతుంది . 

03. ' ఆధార్ కార్డు నెంబర్ ద్వారా , వారి వ్యక్తి గత , కుటుంభ వివరాలన్నీ మరియు వారి జీవనసరళి   తెలిసిపోతాయి. 

04.  ' సెల్ ఫోన్ నెంబర్ ' ద్వారా వారి  ఫోన్  లావా దేవీలు , ఎవరెవరితో సంభందాలు  ఉన్నాయి , ఎప్పడు మాట్లాడారు , ఏ సమయంలో మాట్లాడారు , వారు ఎక్కడెక్కడ సంచరించారు , ప్రతి ఒక్కటి తెల్సి పోతాయి . 

05. ' పాస్ పోర్ట్ ' ద్వారా  వారు  ఏ తేదీన  , ఏ  సమయాన విదేశాలకు  వెల్లారు , ఎన్ని సార్లు వెల్లారు . ఎందుకు వెల్లారు మొదలైన విషయాలు తెలిసి పోతాయి . 

అవినీతి  పరుల వ్యవహారాలన్నీ  ఒకే గూటికి చేరు తాయి కాబట్టి ,  దీని వలన అతను లేదా ఆమె  సంపదను  ఎలా కూడబెట్టారో  తెలుసుకోవచ్చు .  వారి  పూర్వీకుల  ఆదాయం ఏమిటి , వీరికి  ప్రస్తుత ఆదాయ వనరులు ఏమిటి , వీరి ఖర్చులు ఏమిటి , వీరికి అదనంగా వచ్చిన సంపద ఎక్కడిది మొదలైన అన్ని విషయాలు  సునాయాసంగా తెలుసుకోవచ్చు.

అంతే కాకుండా , వీరు పన్నులు చెల్లిస్తున్నారా  లేక తప్పించు కుంటున్నారా, వీరు  ఎక్కడెక్కడ అప్పులు  తీసుకున్నారు , ఎలా తీరుస్తున్నారు ,    వీరు  ప్రభుత్వం  అందించే  సంక్షేమ పథకాలకు  అర్హులా కాదా  మొదలైన ఎన్నో విషయాలను  సులువుగా  తెలుసుకోవచ్చు . 

అప్పుడు ఆదాయ పన్నుల అధికారులు, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు,సి.బి.ఐ.  అధికారులు  సునాయాసంగా  , తక్కువ సమయంలో  కేసులను  డీల్ చేసే  అవకాశం  కలుగుతుంది .  ఈ విధముగా అవినీతిని ( CORRUPTION) ,  నల్ల ధనాన్ని  ( BLACK MONEY),  దొంగ నోట్లను  (FAKE NOTES),   బినామీ  ఆస్తులను ( BENAMI ASSETS)  సునాయాసంగా  అరి కట్ట  వచ్చు .  ఒక వ్యక్తికి ఒకే అకౌంట్  ఉండటం వలన , బ్యాంకుల  అడ్మినిస్ట్రేషన్  వ్యయాలను  , సగానికి సగం  తగ్గించ వచ్చు . బ్యాంకుల ఆదాయాలు  యధావిధిగా  కొనసాగుతాయి . 

పన్నుల ద్వారా  ప్రభుత్వాలకు  విపరీతమైన  ఆదాయం లభిస్తుంది .  దానిని   కేవలం సంక్షేమ పథకాల కోసమనే   కెటాయించకుండా  ,  ప్రకృతి  వనరుల  అభివృద్ధికి ,  మానవ  వనరులను  అభివృద్ధికి ,   దేశ భద్రతకు ,  వాతా  వరణ పరి రక్షణకు,  మౌలిక వసతులకు , విద్య , ఆరోగ్యానికి   ఖర్చు చేయాలి . ఆ విధంగా  ఉపాధి అవకాశాలను పెంచి ,  దేశంలో పేద ధనిక అంతరాలను  తగ్గించాలి  .  అంతే గాని ప్రజలను  కేవలం బిక్ష గాండ్లుగా , ఓటు బ్యాంకుగా,    జీవిత కాలమంతా  ప్రభుత్వాలపై  ఆధార పడేట్లుగా  మార్చ కూడదు . ప్రజలు  వాల్ల  కాళ్లపై  వారు జీవించే విధంగా  తయారు చేయాలి .  

దీని వలన పెద్దగా డబ్బు ఖర్చు అవుతుందా చెప్పండి !.  ప్రజలు  ఇబ్బంది పడే అవకాశం ముందా చెప్పండి !. ఇది ఏమైనా అసాధ్యమా చెప్పండి !. 

కానీ ఇప్పుడు,  సడన్ గా  "పెద్ద నోట్ల రద్దు" నిర్ణయం   వలన ప్రజలలో  అనేకమైన  అపోహలున్నాయి . తమ తమ  నల్ల కుబేరుల కొమ్ము కాస్తున్నారని , పెద్ద పెద్ద  అప్పులు ఎగ్గొట్టిన వారి అప్పులను తీర్చి, వారిని  రక్షిస్తున్నారని, పేదల సొమ్మును  వారికే  దోచి పెడుతున్నారని , ఇది ఎంతో ఖర్చు తో కూడు కున్నదని, కాల యాపన అని,  డిజిటల్ విధానం వలన  హాకింగ్  విస్తరించి  ప్రజలు  తీవ్రంగా నష్ట పోతారని , అయినా ఇది అంత  సక్సెస్ కాదని  అనేకమైన రక రకాల  అపోహలు వెల్లు వెత్తు తున్నాయి .    లక్షల కోట్ల  డబ్బు ఖర్చు అయ్యింది . ప్రజలు  కొందరు  చని పోయారు.  కొందరు లాఠీల దెబ్బలు తిన్నారు . అనేక మైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు . ఉపాధి కోల్పోయారు . వ్యాపారాలు  దెబ్బ తిన్నాయి . ఇక మరి కొందరు  కొత్తగా  , వచ్చిన అవకాశాన్ని  పోనీయ కూడదని , అవినీతి  ఊబిలో ఇరుక్కొని  జైళ్ల పాలయ్యారు .  పరువు పోగొట్టుకున్నారు . ఉద్యోగాలు పోగొట్టుకున్నారు . నిజాయితీ పరులు   కోలుకోలేని విధంగా  పెట్టుబడులు నష్ట పోయారు . రియలెస్టేట్  తీవ్రంగా దెబ్బ తిన్నది .  వేచి చూడాలి  , ఏమి జరుగ బోతుందో . 

సరే ఈ రోజు కాక పోయినా  , ఎదో ఒక రోజు  నా సలహాలను   అమలు చేస్తారనే నమ్మకం  నాకు  ఉంది  . "సంభవామీ యుగే  యుగే ". 

www.sollutions2all.blogspot.com



   

జి . డి. పి (G. D. P.) అంటే ఏమిటి ? జి . డి. పి తగ్గుతుందని ప్రజల నెందుకు భయపెడుతున్నారు ?

ప్ర :  జి . డి. పి  (G. D. P.) అంటే ఏమిటి ? జి . డి. పి తగ్గుతుందని  ప్రజల నెందుకు భయపె డుతున్నారు ?

జ : ఈ మధ్య కాలంలో  జి . డి. పి  (G. D. P. ) గురించి  ప్రస్తావన  లేని రోజు అంటూ  లేదు . అసలు ఈ  జి . డి. పి  (G. D. P. ) అంటే ఏమిటి ? ఎందుకు  దీనికింత ప్రాధాన్యత ?. 

జి . డి. పి  (G. D. P. ) అంటే  "దేశ వస్తు ఉత్పత్తి  మరియు సేవల మొత్తం  ఆదాయం " . దీనినే  ఆంగ్లంలో   " GROSS DOMESTIC PRODUCT " అని అంటారు . ఇక  పెద్ద నోట్ల రద్దు తరువాత  వస్తు వుల ఉత్పత్తి తగ్గి  అలానే  సేవల ఆదాయం  తగ్గి , వ్యాపారాలు  తగ్గి , వినియోగం  తగ్గి  జి . డి. పి  (G. D. P. ) 1% తగ్గుతుంది అని 2% తగ్గుతుందని  అంచనాలను  వేస్తూ , దేశం ఎదో అయిపోతుందని   ప్రజలలో భయాందోనలను కలిగిస్తున్నారు . ప్రజలు ఏ మాత్రం భయపడనవసరం లేదు . ఇవి కేవలం  ఆర్ధిక వృద్ధి సూచీలు మాత్రమే .  అవినీతితో  కూడిన జి . డి. పి  (G. D. P.) 1% నుండి 2% వరకు తగ్గినా   ప్రజలకు  ప్రత్యక్షంగా  గాని పరోక్షంగా  గాని , వెంటనే  జరిగే  నష్టం కానీ  కష్టం కానీ   ఏమి  లేదు .

ఇక  అవి నీతి సొమ్ముతో , పేక్  మనీతో  పైకి  ఎగ  బాకు తున్న    జి . డి. పి  (G. D. P.) ని  చూసి  'వాపును, చీమును   చూసి బలుపు'  ( వృద్ధి ) అనుకున్నట్లుగా  ఉంది .   అవి నీతి సొమ్ములతో , పేక్  మనీతో ఎంత ఎత్తుగా  ఎగ  బాకినా , చిన్న చిన్న  సంఘటనలకే జి . డి. పి  (G. D. P.)  కుప్ప కూలే  ప్రమాద ముంది . గతములో  కూడా ఇలా  ఎన్నో మార్లు  జరిగిన  సంఘటనలు  లేక పోలేదు . 

అవినీతి తగ్గాక  , పేక్  నోట్లు  తగ్గాక , ప్రభుత్వ పాలనలో  నిజాయితీ  , పారదర్శకత  ఏర్పడిన తరువాత , వ్యాపారాలు పెరిగి , వినియోగం పెరిగి ,  దేశంలో వస్తు సేవల వృద్ధి ,  తదనుగుణంగా  వచ్చే ఆదాయం  అనేది  స్థిరంగా  పెరుగుతుంది .  ఎక్కడా  బబుల్స్ అనేవి ఉండవు  .  అప్పడు  ఆటోమాటిక్ గా  జి . డి. పి  (G. D. P.) కూడా  స్థిరంగా  పెరుగుతుంది .   ఆ తరువాత చిన్న  చిన్న  ప్రకృతి  వైపరీత్యాలు  జరిగినా  పెద్దగా  ప్రభావం ఉండదు .  అదే  నిజమైన  జి . డి. పి  (G. D. P ) . అదే మన దేశ  స్థిర ఆర్ధిక వ్యవస్థను  ప్రతిబింభిస్తుంది . 

www.sollutions2all.blogspot.com

Thursday, December 29, 2016

"ఆలోచన ఒకటి, ఆదాయాలు రెండు " ( ONE THOUGHT ,INCOMES TWO ) అంటే ఏమిటి ?

ప్ర : "ఆలోచన  ఒకటి,  ఆదాయాలు రెండు "  ( ONE THOUGHT , INCOMES TWO )  అంటే ఏమిటి ?

జ:"ఆలోచన  ఒకటి,  ఆదాయాలు రెండు "  (ONE  THOUGHT , INCOMES TWO)  అంటే, ఒకే విధానం  (నిబంధన)   లేదా ఒకే  చట్టం ద్వారా    ప్రభత్వం రెండు విధాలుగా  ఆదాయం పొంద వచ్చు .   అంటే  ఒక  వైపు పన్నుల రూపేణా  ఆదాయాన్ని సమకూర్చు కోవచ్చు  మరియు  ధన వంతులకు , నల్ల కుబేరులకు  సంక్షేమ పధకాలను , సబ్సీడీలను  రద్దు చేస్తూ  వ్యయాన్ని   అరికట్ట వచ్చు .  అలాగే   నల్లధనాన్ని  అరికట్ట వచ్చు .  పన్నులు ఎగ్గొట్టే  వారినుండి ఆదాయాన్ని  సునాయాసంగా  వసూలు  చేయ వచ్చు . ఒక సిస్టం ను డెవలప్ చేస్తే ఎవ్వరినీ బ్రతిమి లాడ  నవసరం లేదు .  వాలంటరీగా   సబ్సిడీ గ్యాస్  రద్దు చేసుకోండి అని   దేశ  ప్రధాని  స్థాయి లాంటి  వారు ,  ధన వంతులను  బుజ్జగించా  నవసరం అంతకూ  లేదు .   అయితే  ఇవన్నీ  వ్యవస్థలన్నీ ,  ప్రభుత్వాలన్నీ , ప్రభత్వ  అధికారులందరూ   నిజాయితీ గా , పారదర్శకంగా  ఉన్నపుడే  ప్రయోగించాలి . అప్పుడే  సక్సెస్  అవుతుంది . 


ఇప్పుడు  చూస్తున్నాం , పెద్ద నోట్ల రద్దు కారణంగా   ప్రతి రోజు ప్రజలు  లైన్లల్లో  నిలబడి  డబ్బులు డ్రా చేస్తున్నారు . అయితే  కొందరు  వారి కోసమే లైన్లల్లో  నిలబడుతున్నారా   లేక  వారి  బినామీల బలి  అవుతున్నారా  తెలియడం లేదు . సాధారణంగా  పేద వారు అన్నపుడు  వారికీ , కేవలం 4 వేల  నుండి  8 వేల రూపాయల వరకు  నెల మొత్తం సరిపోతాయి . అప్పుడే వారిని  పేద వారు అంటారు . లేదంటే వారిని  మధ్య తరగతి వారు  లేదా ధన వంతులు అని   అంటారు .  ఆ 4 వేల  నుండి  8 వేల రూపాయల ను   కేవలం   మొదటి రెండు రోజులలోనే  మార్చుకోవడమో , డ్రా చేయడమో  జరిగి  ఉంటుంది .  కానీ ఇంకా లైన్లల్లో  నిలబడి  ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు . సరే  కొందరికి ప్రత్యేక  అవసరాలు ఉండి  ఉంటాయి . అవి చాలా  అరుదు .  కానీ   ఇంత మంది ప్రజలు ప్రతి రోజు  లైన్లలో నిలబడుతున్నారంటే  దానికి  మరేవైన  కారణాలు ఉండి  ఉంటాయి . ఇక మరికొందరు నల్లకుబేరులు , మా డబ్బు మా డబ్బు  అని  అంటున్నారు . మా డబ్బును డ్రా చేయనీయడం లేదని అంటున్నారు . అయితే  కొద్దీ మంది దగ్గరికే  ఇంత  పెద్ద మొత్తం  డబ్బు  ఎలా  వస్తుంది ?  కొద్దీ కాలం  లోనే  కుబేరులుగా ఎలా  మారి  పోతున్నారు ?  వీరి వద్ద అలీ బాబా మంత్ర దండం ఏమైనా ఉందా ?   వీరికేమైనా   ప్రత్యేకంగా  4 చేతులు ఉన్నాయా ?   4 కాళ్ళు ఉన్నాయా ? వీరికి 48 గంటల సమయం ఉందా ? రెండు మెదడులు  ఉన్నాయా ? ఎలా  కను రెప్ప మరల్చే  సమయంలోనే  కోట్లు గడిస్తున్నారు . ఇది  అంతా  కేవలం   ప్రజల  నిరక్ష రాస్యత  , అమాయకత్వం , వ్యవస్థల లోని  అవకాశాలు , వ్యవస్థలలోని  లోపల వలననే .  అన్ని వ్యవస్థలను  గుప్పెట పట్టిన  రాజకీయ వ్యవస్థల వలననే . ఇక్కడే  అత్యధిక  స్వార్ధం  ఉండటం వలననే . దీనిని ప్రక్షాళన చేయడానికి  ఎవరో ఒకరు ముందుకు రావాలి . ' సంభ వామి  యుగే  యుగే' .  



సరే అసలు విషయానికి  వద్దాం .  ప్రభుత్వం  , పన్నులను  ఆదాయాన్ని బట్టి  మాత్రమే  కాకుండా , ఖర్చును బట్టి వారి ఆదాయాన్ని  అంచనా వేసి   ( ఏది ఎక్కువైతే   అది )  దాని మీద  ఆదాయపన్నులు వేయాలి . అలానే  వారి ఖర్చులను బట్టి  సంక్షేమ పధకాలు  వర్తింప చేయాలి . అంటే అధికంగా ఖర్చు బెట్టే సామర్ధ్యం ఉన్న వారు  ధన వంతుల క్రిందికే  వస్తారు . అప్పుడు వారికీ  సంక్షేమ పధకాలను  వర్తింప చేయ నవసరం లేదు  .   అప్పుడు ప్రభుత్వాలకు  పన్నుల రూపేణా ఆదాయం లభిస్తుంది . సంక్షేమ పధకాల ఖర్చు తగ్గుతుంది .   అంటే ఒకే దెబ్బకు రెండు    పిట్టలు  ( ONE SHOT FOR TWO BIRDS)  అన్నట్లు .  


అయితే  ఇవన్నీ  ప్రభుత్వాలు  నిజాయితీ గా , పారదర్శకంగా  ఉన్నపుడు  మాత్రమే   ఉపయోగించాలి . దీనిని ప్రయోగించే వారు ఎవరైనా సరే , ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి .  ఆ తరువాతనే  పేద మధ్య తరగతుల వారిపై  ఈ సూత్రాన్ని ప్రయోగించాలి .  ముందుగా  నల్ల ధన కుబేరుల నుండి  సామాన్యుల వద్దకు  ఈ  ప్రయోగం  రావాలి . బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి విదేశాలలో , స్వదేశాలలో విహరించే వారి  నుండి  ముందుగా  అప్పులు , వడ్డీలు , పన్నులు   వసూలు  చేయాలి .  స్వదేశం లో  నివసిస్తూ  విదేశాలలో  దాస్తున్న  సంపదలను  ముందుగా జప్తు చేయాలి . శిక్షలు అమలు చేయాలి .  ఆ తరువాతనే  సామాన్య , మధ్య తరగతి  ప్రజల వద్దకు  రావాలి .  నేను పదే  పదే  ఎందుకు చెబుతున్నానంటే , సులువుగా పని అయిపోతుందని , మొదట  సామాన్య , మధ్య తరగతి ప్రజలపైనే , ఈ  విధానాన్ని  ప్రయోగించి , వారిని  మరింత  పేదలను  చేయకూడదని  మనవి . 


www.sollutions2all.blogspot.com

Tuesday, December 27, 2016

పెద్ద నోట్ల రద్దుకు ( BAN OF HIGH VALUE NOTES) సంభందించి ప్రజల సందేహాలకు , సమాధానాలు :

 పెద్ద నోట్ల రద్దుకు  ( BAN OF  HIGH VALUE NOTES) సంభందించి  ప్రజల  సందేహాలకు , సమాధానాలు :

మనం  చూసే చూపును  బట్టి , యిష్టాన్ని  బట్టి   వస్తువు  గుణం , రంగు మారుతూ ఉంటుంది  . మనం ఆలోచించే  విధానాన్ని బట్టి  , మన ఆలోచనలుంటాయి . మనం  పాజిటివ్ గా  ఆలోచిస్తే , పాజిటివ్ ఆలోచనలే వస్తాయి . మనం  నెగెటివ్ గా  ఆలోచిస్తే  , నెగెటివ్  ఆలోచనలే  వస్తాయి .  పెద్ద నోట్లు రద్దయిన దగ్గరి నుండి  ప్రజలు  వివిధ  టి. వి. చానళ్లలో  వెలిబుచ్చే  సందేహాలకు , సమాధానాలు  ఇక్కడ పొందు పరుస్తున్నాను . 

ప్ర :01.  మోడీ  గారు మరియు  రిజర్వు బ్యాంక్   రూ . లు . 500/- , 1,000/- నోట్లను  రద్దు చేసి మరల అంతకంటే   పెద్ద నోట్లయిన  రూ . లు . 2,000/- ను  ఎందుకు  ముద్రించి నట్లు ?

జ .ఎ )  ఒకే సారి  పెద్ద నోట్లను  ఎక్కువ మొత్తములో   రద్దు చేయడం వలన , ప్రజలకు  కలిగే  ఇబ్బందిని  మరియు ఆర్ధిక వ్యవస్థ  చిన్నా  భిన్నం కౌకుండా  ఉండడానికి , తక్కువ సమయం లో , పెద్ద నోట్లతో  కాంపన్ షేట్  చేయడానికి  పెద్ద నోట్లను  ముద్రించడం  జరిగి యుండ వచ్చు.  

బి )  మరో కారణం కూడా ఉంది ఉండ వచ్చు . అది ఏమంటే , కొంత కాలం  తరువాత, ఎదో రకంగా  పెద్ద నోట్లన్నీ  నల్ల కుబేరుల , అవినీతి పరుల  వద్దకే చేరుతాయి . పేదలు , సామాన్యులు  పెద్ద నోట్లను  సాధారణంగా   ఎక్కువ కాలం నిలువ ఉంచు కోలేరు . కాబట్టి  కొంత కాలం తరువాత  మరల  వాటిని కూడా రద్దు చేస్తే , 100%  పెద్ద నోట్ల రద్దు విజయ వంతం అవుతుంది .  ఎందుకంటే  మరల వారు బ్యాంకుల లోనే డిపాజిట్ చేయాలి . ఇన్ని  రోజులు వారు  బ్యాంకులనుండి  ఎంత డ్రా చేశారో రికార్డులు బ్యాంకుల దగ్గర ఉంటాయి . అంత కంటే  ఎక్కువ డిపాజిట్ చేయడానికి వీలు  ఉండదు . ఇక  డైరెక్ట్ ఎక్చేంజ్ కు   బ్యాంకు లేదా  పోస్టాఫీసు  అకౌంట్లు లేని వారికి   మాత్రమే. అది కూడా కేవలం  కేవలం  రూ . లు . 10,000/- వరకు  పరిమితం  చేయాలి .  ఆ విధంగా  అవినీతి పరుల   కోట్లాది అక్రమ డబ్బు నిల్వలు  పనికి రాకుండా పోతాయి .  అందుకని ఇలాంటి ఆలోచన కూడా  మోడీ గారికి , రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కు ఉండ వచ్చు .  ఉంటే  మాత్రం  ఇది 100% విజయ వంతం అవుతుంది .     

ప్ర :02.  రిజర్వు బ్యాంక్  ఇప్పటి వరకు  , పెద్ద నోట్ల  రద్దు  చేసిన దగ్గరి నుండి   కనీసం  60 సార్లు  సవరణలు  చేశారు.  ఇంకా ఎన్ని సవరణలు  చేస్తారో   తెలియదు . ఇది ఎంత వరకు  సబబు ?

జ :   అవును . మొదట  నిర్ణయించిన  విధానాలకు అనేక మైన  సవరణలు చేశారు . ఇంకా చేయ వచ్చు కూడా .  అందుకు కారణం లేక పోలేదు . మనది  ప్రజా స్వామ్య దేశం . సుమారుగా 127 కోట్ల జనాభా  గల  దేశం . భిన్న  మతాలు , భిన్న కులాలు , భిన్న సంస్కృతి , భిన్న సాంప్ర దాయాలు , భిన్న ఆలోచనలు , భిన్న  ఆర్ధిక అవసరాలు  గల దేశం మనది .  ఇలాంటి దేశంలో , ముందు నిర్ణయించిన  విధానాలకే  కట్టుబడి ఉండి ,  ప్రజల అవసరాలకు  అనుకూలంగా , పరిస్థితులకు  అనుగుణంగా  సవరణలు  చేయక పోతే ,  అప్పుడు  ప్రజలే  వీరిని  నియంత , అని , హిట్లర్ అని , ముస్సోలిని  అని  అనవచ్చు  .  అలాంటి అపవాదు రాకుండా  ఉండ డానికి , ప్రజల అవసరాలకు  అనుకూలంగా , ప్రజల విన్నపాలను దృష్టిలో పెట్టుకుని , వారు పడే  బాధలను , కష్టాలను , అవసరాలను , సహకారాన్ని అందించే  రాజకీయ నాయకుల  వత్తిడులను  పరిగణలోకి  తీసుకుని , క్షణ క్షణానికి మారుతున్న పరిస్థితులను బట్టి , ప్రభుత్వం కొంత నష్ట పోయినా , ఒక మెట్టు దిగి వచ్చి , సామాన్య ప్రజలకు అనుకూలంగా  సవరణలు చేయడం జరుగుతున్నది .  ఇంత పెద్ద  కార్యక్రమానికి  99% ప్రజలు  సహనం తో , సపోర్ట్ చేస్తున్నారు .  కేవలం 1% మాత్రమే  వ్యతిరేకిస్తున్నారు . అలాంటి ప్రజానీకానికి  , వారికీ  అనుకూలంగా  , పెద్ద నోట్ల రద్దును విరమించుకోకుండా  , సవరణలు  చేయడంలో తప్పేముంది .  ప్రజల విన్నపాలను మన్నించ కుండా  , ఒక నియంతలా ప్రవర్తించడం మంచిదా ?  నల్ల కుబేరులను  అణిచి వేస్తూ ,  పేద మధ్య తరగతి ప్రజలకు  అనుకూలంగా  సవరణలు చేయడం మంచిదా ? మీరే  చెప్పండి . 
  
పెద్ద నోట్లు  రద్దు చేసే టప్పుడు  సమయం తక్కువ , కేవలం కొద్దిమంది మేధావులతోటే  సమాలోచనలు చేసి ఉండవచ్చు . రహస్యంగా  ప్రకటించాల్సిన పరిస్థితి . అప్పటి పరిస్థితులు వేరు . వారు దానికి అనుగుణంగానే  నిర్ణయాలు తీసుకుని  ఉండి ఉంటారు . మరల  ఇంత పెద్ద మొత్తంలో పెద్ద నోట్ల రద్దు అనేది , దేశంలోనే మొదటి సారి . ప్రపంచములోనే  రెండవ అతిపెద్ద  జనాభా గల దేశం మనది .  వీటికి తోడు   ఊహించని విధంగా  , కొన్ని బ్యాంకుల ద్వారా  పేక్  నోట్లను  గమనించడం  ,  ఆర్ . బి .ఐ .  బ్యాంకు , పోస్టాఫీస్ , సెక్యూరిటీ  ఉద్యోగులే  మోసాలకు  పాల్పడటం ,  కొందరు  కమీషన్లకు  కక్కుర్తి పడటం , ఒకే  వ్యక్తి  పది బ్యాంకులలో  డబ్బు  మార్చు కోవడం , ఒకే వ్యక్తి  10 ఏ . టి. ఎం . కార్డులను తీసుక వెళ్లి  డ్రా చేసుకోవడం , చేస్తులనుండి  పెద్ద మొత్తంలో కొత్త నోట్లు దరి మళ్లడం , అతి కొద్దీ సమయం  వెసులు బాటులోనే  వేల  కోట్ల రూపాయలతో  బంగారాన్ని కొనుగోలు చేయడం ,  మొదలైనవి  అనేకంగా  జిమ్మిక్కులు జరుగుతుండటం వలన , సవరణలు  చేయ వలసి  రావచ్చు .  ఇక ముందు  కూడా  చేయవలసి రావచ్చు . దీనిని మనం ( పేద మధ్య తరగతి ప్రజలు )  పాజిటివ్ గా అర్ధ చేసుకోవాలి .    

ప్ర :03.   రూ . లు . 2,000/- పెద్ద నోట్ల  వలన , మాకు చిల్లర దొరకక చాలా ఇబ్బంది అవుతుంది . దీనిని అధిగమించడమెలా ?

జ :  రూ . లు . 2,000/- పెద్ద నోట్ల  వలన ,  చిల్లర దొరకక  , ఒక వారం  పది రోజుల వరకు చాలా ఇబ్బంది అయ్యింది వాస్తవమే.  ఈ ఒక్క విషయంలో  ముందే  , రిజర్వ్ బ్యాంక్  చిన్న నోట్లయిన  రూ . లు . 100/-, 50/- , 20/-, 10/-, లను  ముద్రించి ఉంటే  బాగుండేది . దీని వలన ఎవరికీ , పెద్ద నోట్ల రద్దు గురించి అనుమానం వచ్చి ఉండేది  కాదు .  సమయం  తక్కువగా ఉండటం , అవి ఎన్ని ముద్రించినా  , పెద్దనోట్లకు  సరితూగవు అని అనుకుని  ఉండ వచ్చు . కానీ అవి పేదలకు ఎంతో ఉపయోగ  పడేవి.  అయితే అప్పటి వరకూ  పాత  నోట్లను , కొన్ని చోట్ల వాడ టానికి అనుమతి ఇచ్చారు .  ఆ తరువాత  డిజిటల్ విధానం  అందుబాటులోకి వచ్చింది . ఇవే కాకుండా , అప్పటికే   RTGS/NEFT/IMPS/ ATM CARDS/ DEBIT CARDS/ CREDIT CARDS/ SWIPING MACHINES/PAYTM  మొదలైనవి అందు బాటులో ఉన్నాయి . వాటిని ఉపయోగించుకుని  డబ్బును బదిలీ చేసుకోవచ్చు .  బిల్లులు చెల్లించ వచ్చు , వస్తువులు కొనుగోలు చేయ వచ్చు .  రైతు బజార్లలో  కూపన్స్ జారీ  చేయడం  ప్రారంభించారు .  ఆ తరువాత  మొబైల్ బ్యాంకింగ్ , కేవలం  ఆధార్ కార్డు నెంబరుతో  , బయో మెట్రిక్ విధానం ద్వారా   డబ్బు చెల్లించడం , వస్తువులు కొనుగోలు చేయడం  ప్రారంభించారు . రూ . లు . 500/- నోట్లు  కూడా  మెల్ల మెల్లగా  అందుబాటులోకి వస్తున్నాయి  .  అందుకని , రూ . లు . 2,000/- నోట్లను బ్యాంకుల లోనే  ఉంచి  నగదు రహిత విధానానికి  అలవాటు పడవచ్చు .  

మరో ముఖ్య విష్యం , ప్రస్తుత పరిస్థితులను  బట్టి  , ప్రతి ఒక్కరూ  రెండు బ్యాంకులలో  అకౌంట్  ఓపెన్ చేయాలి . లేదా ఒకటి  బ్యాంక్ లో  మరొకటి  పోస్టాఫీసులో  అకౌంటును  ఓపెన్ చేయాలి . ఒక అకౌంటుకు  ఆధార్  నెంబర్ లింక్ చేయాలి . దీనికి  డెబిట్ కార్డు  తీసుకోవాలి . ఈ అకౌంటు లో ఎప్పుడూ  కొంత మొత్తమే డబ్బు ఉంచి , బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్  చేయాలి . రెండవ అకౌంట్లో మిగిలిన పెద్ద మొత్తం ఉంచి , అవసరం ఉన్నపుడు , అవసరం మేరకు చిన్న మొత్తంలో , ఆధార్ లింకు చేసిన ( డెబిట్ కార్డు ఉన్న)  అకౌంట్ కు  ట్రాన్స్ఫర్ చేయాలి . రెండవ అకౌంట్ కు  చెక్ ఫెసిలిటీ గాని , విత్డ్రాయల్  ఫెసిలిటీ మాత్రమే ఉండాలి . దీని వలన  సైబర్  నేరాల నుండి  తప్పించుకునే  వీలు కలుగుతుంది .  

మొబైల్ ఫోన్ బ్యాంకింగ్  చేయాలనుకున్నప్పుడు , రెండు  ఫోన్లను ఉపయోగించాలి . ఒకటి కేవలం  ఫోన్  బ్యాంకింగ్ కొరకు , మరొకటి  పర్సనల్  యూస్  , డేటా సేవింగ్ కొరకు  ఉపయోగించాలి .   ఈ విధంగా చేయడం వలన  సైబర్ నేరాల వలన కలిగే  నష్టాన్ని మినిమైజ్  చేసు కోవచ్చు . 

అలానే  నెల  వారీ సరుకులను , మందులను , ఇతర వస్తువులను  పెద్ద నోట్లతో ఒక్క సారే తెచ్చు కోవచ్చు .   దీని వలన ఒక క్రమ శిక్షణ , పొదుపు , బ్యాంకింగ్ విధానం  అలవాటు అవుతుంది . ఒకో  సమయంలో   ఆర్ధిక కష్ట  నష్టాలను  ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో  అనుభవం వస్తుంది .  మరో విషయం ఏమంటే ,  మీరు డబ్బును బ్యాంకులోనే  ఉంచి  నట్లయితే , మీ ప్రతి రూపాయికి , ప్రతిరోజుకి  , సం . రానికి 4% చొప్పున  , బ్యాంకు వారు , ప్రతి 6 నెలలకు వడ్డీ జమ చేస్తారు .  మీరు పొదుపుగా డబ్బు వాడటం వలన ,  బ్యాంకులో  డబ్బు  పెరుగుతుంది  . అలానే దానిపైనా  వడ్డీ  లభిస్తుంది.  

ప్ర :04. రూ.లు. 500/- నోట్లనే  ముందుగా  ఎందుకు ముద్రించి  , బ్యాంకులకు సరఫరా చేయలేదు ? 

జ : రూ.లు. 500/- నోట్లనే  ముందుగా   ముద్రించి  , బ్యాంకులకు సరఫరా చేయక  పోవడానికి  కొన్ని కారణాలను  ఊహించ వచ్చు . అవి , మొదటిది . ముందుగా చెప్పుకున్నట్లు , ఈ నోట్లు , పెద్ద నోట్ల విలువను , అతి తక్కువ సమయంలో  కాంపన్షేట్  చేయలేక పోవచ్చని రిజర్వ్ బ్యాంక్  అనుకుని ఉండి  ఉండ వచ్చు . ఇక రెండో కారణం ,  డైరెక్టుగా డబ్బు మార్చే టప్పుడు  , బ్యాంకులో డిపాజిట్ చేసే టప్పుడు  , పాత 500/- నోట్లతో , కొత్త 500/- నోట్లు  మిస్యూస్ అయ్యే అవకాశముందని ఉహించి ఉండవచ్చు . బ్యాంకులో  అవసరాలకు డిపాజిట్ చేసే టప్పుడు  , డినామినేషన్స్  వేసే  అవసరం ఉంది .  అవి  పాత  నోట్లా  తెలియదు . అప్పుడు అవి మిస్యూస్ అయ్యే అవకాశముంటుంది .    

ప్ర : 05. ఈ పెద్ద నోట్ల రద్దు సమస్య  ఎప్పుడు తీరుతుంది ? ఇప్పటికీ  బ్యాంకుల ముందు , ఏ . టి . ఎం . ల ముందు  శాంతాడంత  బారులు కట్టి నిలబడుతున్నారు ?

జ :  పెద్ద నోట్ల రద్దు ప్రకటించి 46 రోజులు అయినా , ఈ నగదు సమస్య  తీరక పోవడానికి  అనేక కారణాలు ఉన్నాయి . అందులో  మొదటిది , నల్ల కుబేరుల  మనుష్యులే  బ్యాంకుల వద్ద  అధికంగా క్యూలు కడుతుండ   వచ్చు . దీని వలన  పేద , మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలుగుతుండ  వచ్చు .  రెండవది , ఆర్ . బి .ఐ .  బ్యాంకు , పోస్టాఫీస్ , సెక్యూరిటీ  ఉద్యోగులే  మోసాలకు  పాల్పడటం ,  కొందరు  కమీషన్లకు  కక్కుర్తి పడటం  వలన  నగదు ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోయింది . మూడోది , పెద్ద మొత్తాలలో , చెస్టులనుండే  డైరెక్టుగా , అవి నీతి పరుల , నల్ల కుబేరుల వద్దకు  చేరడం  వలన  , బ్యాంకులలో నగదు నిల్వలు తగ్గి పోయాయి . నాలుగవది , ఇలా పట్టు బడ్డ  డబ్బు , పంచనామా జర్గి , విచారణ పూర్తయి , నల్ల డబ్బు అని నిర్ధారణ అయి , కోర్టు తీర్పు వచ్చే వరకు , ఆ పట్టుబడ్డ డబ్బును ఎవ్వరు ముట్టుకోడానికి వీలు లేదు . ఐదవది , ప్రజలు  ఇప్పడు కొంత పానిక్ గా మారి పోయారు . భయాందోలనకు  గురి అయి , ఏ అవసరాలు ఎప్పుడు వస్తాయో అని , బ్యాంకులో ఉంటే ఏమి వస్తుందని , ప్రతి రోజూ  నిల బడి  కొంత డబ్బును  డ్రా చేసుకుంటున్నారు . ఈ విధంగా  ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా  ఓ పది  వేలో , పాతిక వేలో నగదు ఇంట్లో  ఉండేటట్లుగా  డ్రా చేసుకుని  పెట్టుకుంటున్నారు .  

వాస్తవానికి  , గతంలో ఉన్నంత రద్దీ  బ్యాంకుల వద్ద , ఏ . టి . ఎం . ల  వద్ద ఇప్పుడు లేదు . క్రమంగా తగ్గి పోతుంది . డిజిటల్ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే  మరియు  రిజర్వ్ బ్యాంక్  చిన్న నోట్లయిన  రూ . లు .500/- 100/-, 50/- , 20/-, 10/-, లను , అత్యిధికంగా  అందు బాటులోకి  తీసుక రాగలుగుతే  ఈ పెద్ద నోట్ల రద్దు సమస్య    తగ్గి పోతుంది .  ప్రజలు కూడా వాస్త వాలను అర్ధం చేసుకుని , భయపడకుండా , ప్యానిక్ గా మారకుండా , డిజిటల్ విధానాన్ని , పొదుపు విధానాన్ని ఆల వాటు  చేసుకున్నట్లయితే , ఈ సమస్య తీరడానికి   మరో 30 రోజులు పట్ట వచ్చు . 

www.sollutions2all.blogspot.com

Wednesday, December 21, 2016

దేశంలో గాని , రాష్ట్రాలలో గాని ప్రతి పక్ష పార్టీలు బలంగా (POWERFUL) ఉండాలా ?

 ప్ర: దేశంలో గాని, రాష్ట్రాలలో గాని ప్రతి పక్ష పార్టీలు  బలంగా  (POWERFUL)  ఉండాలా ?

జ : అవును . దేశంలో గాని  , రాష్ట్రాలలో గాని  పాలక పక్షం  ఎంత బలంగా  ఉంటే , ప్రతి పక్షాలు కూడా  అంతే బలంగా  ఉండాలి . అప్పుడే  కొంత వరకైనా  అవినీతికి అడ్డు కట్ట  పడుతుంది . లేదంటే ' మోనో పాలై యి ' పోయి , గుత్తాధి పత్యంతో  దొరికినంత  దోచుకునే అవకాశం ఉంటుంది . వారికీ  అనుకూలమైన  చట్టాలను మార్చుకునే అవకాశం చిక్కుతుంది .  అందుకే ప్రజలు  నిబ్బరంతో చూస్తూ  ఉండాలి కానీ , అటు పాలక పక్షాన్ని గాని , ఇటు ప్రతి పక్షాన్ని గాని  ఎవ్వరినీ విమర్శించ కూడదు .  యేది ఎవ్వరు చేసినా  , అది మెజారిటీ  పేద మధ్య తరగతి ప్రజలకు  మేలు  జరుగ పోతుందనుకుంటే  , అది సరియైనదే  అనుకోవాలి . 

ఇక  కేంద్ర ప్రభత్వం  8 నవంబర్ , 2016 న  సదుద్దేశ్యంతో  , సాహసోపేతంగా ప్రకటించిన  పెద్ద నోట్ల  రద్దును , పెద్దగా విమర్శించ నవసరం  లేదు . వారి  ప్రధాన ఉద్దేశ్యం డైరెక్టుగా నల్లధనాన్ని  అరికట్టడం , అవినీతిని  నిర్ములించడం  మరియి పేక్ నోట్లను  లేకుండా చేయడం .  ఇక ఇండైరెక్టుగా  ఉగ్ర వాదాన్ని అణిచి వేయడం , పేద ధనికుల  ఆర్ధిక  అంతరాలను  తగ్గించడం, ప్రజలలో పొదుపు తనాన్ని పెంచడం , బ్యాంకింగ్ అవేర్నెస్ పెంచడం   మరియు అవినీతి రహిత దేశంగా , ప్రజలు సుభిక్షముగా   జీవించే  విధంగా  వ్యవస్థను  తయారు చేయడం . 

కానీ తొందరపాటో లేక  ఉహించలేకనో  కొన్ని  నిర్ణయాలు  తీసుకోలేక  పోయారని సర్వత్రా వెల్లడవుతుంది . అవి ఏమంటే , ఎవ్వరికీ  అనుమానం కలుగ కుండానే ఎక్కువగా  చిన్న నోట్లను  ముద్రించి  బ్యాంకులకు పంపక పోవడం ,  ఆ రోజు మొత్తం బంగారు షాపులు మూసి వేయించ  లేక పోవడం , అప్పటికే  డిజిటల్ వ్యవస్థను పెంపొందించ లేక పోవడం  మొదలైనవి .  

ఇక అవకాశాలు , చట్టాల లోని లొసుగులు , తక్కువ సమయం మొదలైనవి  నల్ల కుబేరుల , అవినీతి పరుల  ఆలోచనలకు  పదును పెట్టినవి .  అవినీతి పరులకు మెదడు నిండా  వాటిని ఎలా పొందాలో  , అలానే ఎలా  కాపాడు కోవాలనే  ఆలోచనలు ఉంటాయి , వారికీ  ఐడియాలు  ఇచ్చే  మేధావులు  ఉంటారు . వెరసి , కోట్ల కొద్దీ కొత్త నోట్లు, కాలు బయట పెట్టకుండానే  వారి వారి  బంగ్లాలకు  సిరి పోయాయి . వీటికి తోడు క్రొత్తగా కొందరు ఆర్ . బి . ఐ . అధికారులకు , ఐ . టి . అధికారులకు ,  బ్యాంకు అధికారులకు , పోస్టల్ అధికారులకు , ప్రయివేటు కమీషన్ ముఠాలకు , మేమెందుకు సంపాదించుకోకూడదు అనుకున్నారో ఏమో , దురాశ పుట్టి  వారూ  అవినీతికి తెగబడ్డారు . మరో వైపు నోట్ల ప్రింటింగ్ , పంపిణీ ఆలస్యం  కావడం, ఇలా అనేకమైన ఇతర కారణాల వలన  ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు . ఎదుర్కుంటున్నారు . 

మనం ఒకటి గుర్తుంచు కోవాలి . మన ఇంట్లో  కేవలం నలుగురు కుటుంబ  సభ్యులు ఉంటేనే  , ఇంటి యజమాని  ఆ మిగిలిన ముగ్గురిని అదుపులో పెట్టలేని పరిస్థితి . నిజాయితీగా  ఒప్పుకోండి .  అలాంటిది 127 కోట్ల జనాభా ఉన్న  మన దేశంలో ,  ఒక ప్రధాన మంత్రో , ఆర్ధిక మంత్రో , ఆర్ . బి . ఐ . గవర్నరో  అదుపు చేయడం ఆశ మాషి కాదు . కేవలం  సిష్టం మీద , నమ్మకం మీద నడుస్తుంది . స్పాన్ ఆఫ్ కంట్రోల్ మీద నడుస్తుంది . ఇది  ఒక యజ్ఞము లాంటిది  . ఋషులు యజ్ఞము చేసే టప్పుడు , చెడ గొట్టాలన్న  దృక్పధంతో  మరికొందరు నీరు చల్లుతూనే ఉంటారు .  ఏది ఏమైనా , సంబంధిత అవినీతి  అధికారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారు . 

ఒక  వేల  మీరు ఈ యజ్ఞము  అసత్యం  అని  అనుకున్నట్లయితే , మీరు అనుకున్నట్లు , వారిలో  స్వార్ధం  ఉంది , అవినీతి  జరిగింది  అని మీరు అనుకున్నట్లయితే , మీ మీదనే  కక్ష  కడుతున్నారు అని అనుకుంటే ,  లేదా  చాలా మంది నల్ల కుబేరులను వదిలి పెట్టారని  మీరు  నమ్ముతే ,  ముందుగా  వారు చేసేది చేయ నీయండి . వాస్తవానికి  పెద్ద నోట్ల రద్దు వలన   పేద మధ్య తరగతి  ప్రజలకు మేలు జరుగుతుందని, నిజాయితీ ప్రజలకు  గౌరవం దక్కుతుందని   దేశంలోని  మెజారిటీ ప్రజలు చాలా ఓపికతో  ఇబ్బందులను  భరిస్తున్నారు . బ్యాంకర్లు కూడా ఓపికతో   వారి సేవలను అందిస్తున్నారు . ఎంతో మంది  మేధావులు , సీనియర్ సిటిజన్లు , అతి సామాన్యులు కూడా  దీనిని  బాహాటంగానే   సమర్థిస్తున్నారు .  ప్రజలు  నిజ జీవితంలో  ఇంత కంటే ఎక్కువ  క్యూలైన్లలో  నిల బడ్డ సందర్భాలు  లేక పోలేదు . ఎలక్షన్లలో , సినిమాహాళ్ళ దగ్గర , రేషన్ షాపులదగ్గర , హాస్పిటల్ ఓపిల దగ్గర , తిరునాళ్ల దగ్గర ,  ఉధ్యమాలలో , ఎమర్జెన్సీ కాలంలో , మరెన్నో చోట్ల  నిలబడ్డారు . అన్ని రకాలుగా కష్ట సుఖాలు అనుభవించారు . ఇక్కడా అంతే . ఒక 50 రోజులు, దేశాభి మానంతో. రేపు దేశం అభివృద్ధి  చెందుతుందనే  నమ్మకంతో  . 

ప్రజలు  ఎప్పుడూ  ఒక పార్టీనే  గెలిపించరు కదా . ఎప్పుడూ  మార్పునే  కోరుకుంటారు .  మీకు  నిజంగా  పేద మధ్య తరగతి ప్రజలపై , నిజాయితీ ప్రజలపై  ప్రేమ , గౌరవం , నమ్మకం  ఉన్నట్లయితే , రేపు మీరు గెలిచాక, మీరు  నమ్ముతున్న  నల్ల కుబేరుల , వారు వదిలి పెట్టిన  అవినీతి పరుల  నుండి నల్ల ధనాన్ని  వెలికి తీసే ప్రయత్నాలు  చేపట్టండి , బినామీ ఆస్తులను జప్తు చేయండి  . బంగారు కడ్డీలను బయటకు తీయండి , ఒకే రోజు లాకర్లను తెరిపించండి ,  ' లోక్ పాల్ ' బిల్లును ప్రవేశ పెట్టండి . సి . బి . ఐ  కి  స్వతంత్ర  అధికారాలకు  బిల్లు తెండి . అవినీతి  నాయకులను  కాల్ బ్యాక్ చేసే  అధికారాన్ని కల్పించండి . అప్పుడు మీకు కూడా  ప్రజలు మద్దతు పలుకుతారు .  అప్పుడు  దేశం లోని  నల్ల కుబేరులు , అవినీతి పరులు, బినామీ ఆస్తులు గల వారు  సంపూర్ణముగా  లేకుండా  పోతారు .  ఆ విధంగా  వెలికి తీసిన నల్ల డబ్బుతో   ఉత్పాదక  పరిశ్రమలను అభి వృద్ధి పరిచి  , ప్రతి ఒక్కరికి  ఉద్యోగాలు  కల్పించండి .దేశ మానవ  వనరులను అభి వృద్ధి పరచండి . దేశ ఆర్ధిక పరిస్థిని పఠిష్టపరచండి , దేశ భద్రతను పెంచండి . సైబర్ నేరాలను కట్టడి చేయండి . ఉగ్ర వాదాన్ని  నిర్ములించండి .  వృద్ధులందరికి  , అంగ వికలురందరికి మరిన్ని   సంక్షేమ  పధకాలు అంద  చేయండి . ఉచిత విద్యను , ఉచిత ఆరోగ్య సౌకర్యాలను   అంద  చేయండి . ప్రతి కుటుంబానికి  ఒక సొంత  ఇంటి కలను  సాకారం చేయండి . అడుక్కు తినే వ్యవస్థను రూపు మాపండి . అందరికి  సకాలంలో  న్యాయం జరిగే విధంగా  చూడండి . పేదలందరికీ ఉచితంగా  హెల్త్ కార్డులను  జారీ  చేయండి . రాజకీయ నాయకుల వేతనాలపై  కూడా పన్నులు వేసే బిల్లును పెట్టండి . సామాన్యులకు పన్నులు తగ్గించండి . రాజకీయ నాయకులకు ఇచ్చే అభివృద్ధి నిధులను ఎత్తి వేయండి . దేశంలోని ప్రజలను కేవలం  పేద ధనికులుగానే  గుర్తించి , ఆ విధంగా రిజర్వేషన్లను అమలు చేయండి . అప్పుడు  మీకు కూడా ప్రజలు మద్దతు పలుకుతారు . జే  జే లు కొడుతారు .    అప్పుడే   దేశంలో ఆర్ధిక అంతరాలు అంతరించి , దేశ  ప్రజలందరూ  ప్రశాంతంగా , సుఖ సంతోషాలతో , హాయిగా  జీవిస్తారు . 

అయితే , ఇప్పడు అవి నీతి పరులు , నల్ల ధన కుబేరులు మోసాలతో  పెద్ద నోట్లను కూడ బెట్టినా , దాచి పెట్టినా  వాటిని ఫిల్టర్ చేయడం , వాటికీ విలువ లేకుండా చేయడం పెద్ద కష్ట మేమి కాదు .  కొంత కాలం పోయాక పెద్ద నోట్లను రద్దు చేసి , బ్యాంకు అకౌంట్ల ద్వారానే డిపాజిటుకు  అనుమతించాలి .  అప్పుడు వారు కేవలం , పెద్ద నోట్లు రద్దయ్యేనాటికి  బ్యాంకు ద్వారా  డ్రా  చేసిన డబ్బును  మరియు  లెక్కల ప్రకారం ప్రజల నుండి వచ్చిన  డబ్బును మాత్రమే  డిపాజిట్ చేయ గలుగుతారు . మిగిలిన పెద్ద నోట్లన్నీ  నల్ల ధనమన్నట్లే కదా . అవినీతి సొమ్ము అన్నట్లే కదా . 

"125 కోట్ల ప్రజలకు  చెందాల్సిన దేశ  సంపద, కేవలం కొంత మంది అనుభవించడం  ధర్మం కాదు "  ( WHEN THE WEALTH OF 125 CRORE PEOPLE, ENJOYED BY FEW PEOPLE IS NOT JUSTIFUL"). 

ప్రతి ఒక్కరికీ  రెండే చేతులుంటాయి , రెండే కాళ్ళుంటాయి . రెండే చెవులు , రెండే కళ్ళు , ఒకటే ముక్కు , ఒకటే నోరు , ఒకటే మెదడు  ఉంటాయి . అందరూ  వచ్చింది ఒక దగ్గరినుండే , పోయిది ఒక దగ్గరికే . వచ్చే టపుడు  ఏమి తీసుక రారు , పోయేటప్పుడు ఏమీ తీసుక పోరు . అందరూ  రోజుకు 8 నుండి 12 గంటలే పని చేస్తారు .  అలాంటప్పుడు , కొందరికే ఇంత డబ్బు ఎలా సమకూరుతున్నది .  వ్యవస్థల్లో ఎక్కడో బ్లాక్ హోల్స్  ఉన్నయి . వాటిని మూసి వేయాలి . 

" నీరు  శంకు  నుండి వస్తేనే  తీర్థం  అవుతుంది" . సామాన్యులనుండి  ఏది వచ్చినా  దానికి విలువ ఉండదు .
  
www.sollutions2all.blogspot.com
   

Saturday, December 17, 2016

ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించే అధికారాన్ని ( POWER TO CALL BACK MEMBERS, MLA's ,MLC's & MP's) , హక్కులను కల్పించాలా ?

ప్ర :  ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించే   అధికారాన్ని                         ( POWER TO CALL BACK MEMBERS) , హక్కులను కల్పించాలా ?
జ : ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించే   అధికారాన్ని( POWER TO CALL BACK MEMBERS) , హక్కులను కల్పించాలి. 
సభ్యుడు సమర్ధుడని , వ్యక్తిత్వం మంచిదని, అవినీతి పరుడు కాదని , గూండా కాదని , విద్యా వంతుడని అన్ని రకాలుగా పరిశీలించి , పరిశోధించి , తెలివిగా ప్రజలు వోట్లు వేస్తారు. కానీ రోజులు , నెలలు , యేండ్లు గడిచినా ,M.L.A.లు M.P. లు ( కొందరు )తమ ఇష్టం ప్రకారమో లేక తమ పార్టీ అధ్యక్షుడి మాట ప్రకారమో హైదరాబాద్ లోనో లేదా ఢిల్లీ ఏసీ గదుల్లో నో లేదా మరో పట్టణం లోనో దేశం లోనో హాయిగా తినుకుంటూ కూర్చొని , నిధులు సంపా దించు కుంటూ భూములు ( ముఖ్యంగా వ్యవసాయ భూములు ) , బంగారం కొనుక్కుంటూ ,  స్విస్ బ్యాంకులో దాచు కుంటూ , విదేశాలు చుట్టి వస్తూ, వారిని గెలిపించిన నియోజ వర్గం ప్రజల మొఖం చూడక పోతే , వారి భాదలను పట్టించు కోక పోతే , వారి ప్రాంతాన్ని అభి వృద్ది చేయక పోతే , ఇక ఆ  '5'  సం. రాలు ప్రజలు బాధలు పడాల్సిందేనా ?, గమ్మున చూస్తూ కూర్చోవలిసిందేనా? . అలాంటి వారిపై చర్య లేమిటి ? నేడు  ఒక్కో మెంబరు సాలుకు 5 కోట్లు  నియోజక వర్గ అభివృద్ధి కొరకు నిధులు  తీసుకుంటూ 25% కూడా  సద్వినియోగం చేయని వారున్నారని విన్నాం . సభలల్లో మాట్లాడని వారున్నారని తెలుసు కున్నాం . ప్రశ్నలడగ డానికి డబ్బులు తీసుకున్న వారున్నారని చూశాం . సభల్లో కొట్టు కునే వారిని టి .వి . చానాళ్ళ ద్వారా చూస్తున్నాం . 

అందుకని, 





01.  గెలిచిన సభ్యులు , ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో వారి హామీలను 

51% అయినా మొదలు పెట్టక పోయినా , మిగిలిన 49% హామీలు ఆ తరువాయి  కాలం లో పూర్తి చేయక పోయినా , అలానే ప్రజల ఓట్ల చేత
గెలిచిన ప్రతి పక్ష పార్టీల

సభ్యులు ప్రశ్నించక పోయినా , నైతిక బాధ్యత వహించి సభ్యత్యానికి రాజీనామా చేయాలి 


02.  లేదా అలాంటి సభ్యులను వెనుకకు రప్పించే అవకాశం , అధికారం ఎన్నుకున్న ప్రజలకు వుండాలి. అలాంటప్పుడే , నాయకులు సాధ్య మయ్యే పనులకే హామీలు ఇస్తారు . అబద్ధాలు చెప్పరు. 

అద్దం లో చంద మామను చూపించరు. ప్రజలను మోసం చేయరు , మోస కారులు ఎన్నికలకు పోటీ పడరు . చేత కాని వారు , పండు ముసలులు , మసి బోసి మారేడు కాయను చేసే వారు, వాక్చాతూర్యం లేని వారు ఎన్నికలకు దూరంగా వుంటారు . సీట్ల కోసం లక్షలు , కోట్లు కుమ్మరించరు. ఈ రకంగా నైనా ,అవినీతి కొంత వరకు తగ్గుతుంది. 

03.  అలానే  ప్రభుత్వ  సొమ్ములను దుర్వినియోగం చేసినా , కోట్లను కూడబెట్టినా , ప్రజలను  పట్టించుకోక పోయినా , దేశ భద్రతకు , శాంతికి భంగం కలిగించినా , అవినీతికి పాల్పడినా , ఆశ్రీత పక్ష పాతం  చూపినా , మెంబర్లను  వెనుకకు పిలిపించి అధికారం ప్రజలకే ఉండాలి కాని , పార్టీ నాయకుడికి కాదు . 


ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు , ఇలాంటి వాటికి రాజ్యాంగ సవరణలు చేయ లేవు . అందు కని , ప్రజల అభ్యర్ధనను మన్నించి ఎన్నికల కమీషన్ , లా కమీషన్ , జుడిస్యరీ వ్యవస్థ లేదా ప్రసి డెంటు గారు వారి వారి విశేసాధి కారాలను ఉపయోగించి , 



"ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించి , పదవి రద్దు చేసే అధికారాన్ని , హక్కులను కల్పించాలి"


అప్పుడే మంచి అభ్యర్ధులను ఎన్నుకున్నామన్న సంతోషం ఓటర్లకు ఉంటుంది . ఓ రోజంతా శ్రమించి వేసిన ఓటుకు విలువ ఉంటుంది. రాష్ట్రాలు , దేశం అభి వృద్ధి చెందుతుంది , ప్రజలు సుఖంగా జీవిస్తారు .

www.sollutions2all.blogspot.com

Tuesday, December 13, 2016

వ్యవసాయం (AGRICULTURE) ఎవరికి శాపం ? ఎవరికి స్వర్గధామం ?

ప్ర : వ్యవసాయం  (AGRICULTURE) ఎవరికి  శాపం ? ఎవరికి  స్వర్గధామం ?

జ : వ్యవసాయం (AGRICULTURE)  రైతులకు  శాపం . అవినీతి పరులకు , నల్లకుబేరులకు  స్వర్గధామం .

అవును , వ్యవసాయం (AGRICULTURE)  రైతులకు  శాపం .  ఎందుకని  మీరనవచ్చు . చూడండి సాలు గాలం , రాత్రి అనకా , పగలు అనకా  వ్యవసాయం  పనులూ  చేస్తే  వారికి చివరికీ మిగిలేది  శూన్యం. ఎండు డొక్కలు ,అప్పులే కదా మిగిలేది . సన్న కారు రైతులనే  తీసుకుందాం . వారు  1 నుండి  5 ఎకరాల  భూములను  కొనుగోలు చేయాలంటే  కొన్ని లక్షల  మొత్తం పెట్టుబడి పెట్టాలి . ఆ తరువాత , కాలాన్ని బట్టి  దున్ని , గొర్రు గొట్టి , విత్తనాలు  చల్లి , పసి పిల్లలను  పెంచినట్టు  మొక్కలను పెంచి , నాటు వేయాలి లేదా మొక్కలను నాటాలి . వీటికి  నీరు కావలి . సన్నటి  ఎండా కావలి . గాలి కావలి .  సరియయిన సమయంలో ఎరువులు  కావాలి . నిరంతరం  కరెంటు  కావాలి .  సరియయిన సమయంలో వర్షాలు పడాలి . వర్షాలు  లేక పోతే  చెరువులు నిండవు , బావులలో నీరు  ఉండదు .  ఆ తరువాత మొక్కలపైన లేదా చెట్ల పైన  లేదా  వరి  పైన పురుగు వాలకుండా , దోమలు వాల కుండా  రసాయన ఎరువులు పిచుకారి  చేయాలి . ఎప్పటికప్పుడు  , వీటన్నిటికీ  కూలీలు కావాలి .  వీటన్నిటికీ  మరల సాలుసరి పెట్టు బడులు  , పంట తీరును బట్టి  వేల  నుండి లక్షల్లో ఉంటుంది .  ఈ  విధంగా తీసుకు వచ్చిన  పెట్టుబడి డబ్బుకు , వేలల్లో  వడ్డీలు కట్టాలి .  పెట్టు బడి పెట్టిన సావుకారికి  గులాముగా తిరుగాలి . ఇంతా చేసినా  , చివరికి  ఆ పంట పండుతుందో  లేదో తెలియదు . చేతికి వస్తుందో లేదో తెలియదు .  పంట చేతికి వచ్చే సమయాన  ఒక్క తుఫాన్ వచ్చిందనుకోండి , ఇంత కాలం చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది .  విత్తనాలు వేసే  ముందర సరైన వర్షాలు లేక పోయినా , పంటలు చేతికి వచ్చే ముందు జోరుగా వర్షాలు కురిసినా , నాసిరకం విత్తనాలు అయినా , కల్తీ ఎరువులైనా ,  కనీసం రోజుకు 8 గంటలు కరెంటు లేక పోయినా  దిగుబడి తగ్గి పోతుంది . తీరా పంట చేతికి వచ్చాక  , మార్కెట్ లో   కొనే వారు లేక  పోతే , ధరలు లేక పోతే  , ఇక  రైతుల బాధలు  వర్ణనానీతం .  రైతులు వరుణ దేవుళ్ళ పైనా , ప్రభుత్వాల పైనా  , కమీషన్ ఏజెంట్ల పైనా భారం వేసి జీవితాలు గడపాలి .   మెజారిటీ రైతులకు టెక్నాలిజీ  తెలియక పోవ డం , దిగుబడి పెంచుకునే విధానం తెలియక పోవడం  , ఖర్చులను తగ్గించుకునే విధానాలు తెలియక పోవడం  మొదలైన కారణాల వలన , రైతులు నష్టాల పాలవుతున్నారు , అప్పుల పాలవుతున్నారు . వీటికి తోడు పన్నులు .  ఒక వైపు శ్రమ , మరో వైపు అప్పులు .  ఈ విధంగా వ్యవసాయం రైతులకు శాపమే కదా .  ఇక కౌలు దారుల  జీవితాలు మరింత దారుణం .  వీరికి రుణ మాఫీలు అందవు . ప్రభుత్వ సబ్సీడీలు అందవు . 

అయితే , వ్యవసాయం  (AGRICULTURE) మరి ఎవరికి  లాభం ?. ఎవరికి  స్వర్గధామం ? 

వ్యవసాయం (AGRICULTURE)  అవినీతి పరులకు , అక్రమ సంపాదకులకు , నల్లకుబేరులకు  లాభము . అలానే స్వర్గ ధామం  కూడాను . వీరికి  వ్యవసాయం అనేది అక్రమ సొమ్ములను దాచుకోడానికి , పన్నులు ఎగ్గొట్ట దానికి  , ఒక చక్కటి  మరుగు ( HIDDEN PLACE) , ఒక చక్కని ముసుగు ( MASK) లాంటిది .   ఇప్పటి వరకు  మన వ్యవస్థలో , ఎవరికీ ఎక్కడినుండి డబ్బు వస్తుందో , ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో కనిపెట్టే  యంత్రాగము  లేదు, ఆ ఆలోచనా లేదు . ఎవరైనా సరే , కనీసం ఒక సం .రం లోపల తప్పనిసరీగా రిజిస్ట్రేషన్ చేయించాలి, దానికి ఖచ్చితంగా 'పాన్ ' నెంబరును , ' ఆధార్ ' నెంబరును , 'సెల్ ' నెంబరును , 'బ్యాంక్ అకౌంట్ ' నెంబరును లింక్ చేయించాలని లేదు .   ఎందుకంటే ఆ నల్లకుబేరులు , కీలకమైన  వారు రెండూ  వారే కాబట్టి . వీరికి వ్యవసాయ పంటలపై  అంతగా రాబడి అవసరం లేదు . 

ఎందు కంటే  వీరిపైనా , వీరి బినామీ పేర్లపైనా  భూములు  రిజిష్టర్ అవుతాయి  , పాసుబుక్కులు వస్తాయి కాబట్టి , రుణ మాఫీలు వీరికే అందుతాయి , ప్రభత్వ సబ్సీడీలు వీరికే అందుతాయి .  నల్లధనం  , అక్రమ సొమ్ము సేఫ్ గా ఉంటుంది . భూముల ధరలు పెరుగుతుంటాయి . భూములు  ఎప్పుడు కొనాలి  , ఎక్కడ కొనాలి , ఏది కొంటె వ్యవసాయ భూమి అవుతుంది , పట్టణానికి ఎన్ని కిలో మీటర్ల దూరంలో కొనాలి , ఎందువలన భవిష్యత్తులో భూముల ధరలు పెరుగుతాయి , ఎక్కడి సైడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి ? ఎవరిని  బినామీగా పెట్టుకోవాలి ? తేడా రాకుండా ముందే ఏమి చేయాలి ? మొదలైన  విషయాలలో  కరెక్టుగా స్కెచ్ వేసుకుంటారు .  ఇక వ్యవసాయ (AGRICULTURE)  భూములు కొన్నా , అమ్మినా ,   లక్షల్లో , కొట్లల్లో ఆదాయం వచ్చినా    రూపాయి ఆదాయ పన్ను కట్టేది  లేదు . అలానే పంటల ఆదాయం పై రూపాయి  పన్ను కట్టవల్సిన అవసరం లేదు . అసలు  ఇలాంటి  బిల్లులు  పాస్ చేసుకునేది ఎవరు ?  వారే కదా .  అదే బ్యాంకుల్లో  పొదుపు  చేసుకుంటే  ,  పెట్టు బడులు పెడితే ,  సాలుకు         వడ్డీ 10, 000/- దాటినా  ముందుగానే, మూలం లోనే  పన్ను (టి . డి . ఎస్ ) వసూలు  చేస్తారు . అదే వ్యవసాయ (AGRICULTURE) భూములపై  పన్ను వసూలు చేయ డానికి,    అసలు వీరికి భూమి ఉన్నట్లు  ఏ వ్యవస్థ కని పెట్ట గలదు?  ఉంటె  బినామీ పేర్ల మీద  లేక పోతే కేవలం  బాండు  పేపర్లమీదనే కదా . ఇక వీరు  నివసించేది పట్టణాలలో , భూములు కొనేది  గ్రామాలలో . వీరి కాలుకు  ఒక ముల్లు కుచ్చదు, ఒక తేలు  పాము దరి చేరదు . ఆ బాధలన్నీ అనుభవించేది కౌలు దారులు  లేదా బినామీ దారులు లేదా నమ్మిన బంట్లు .    అలాంటప్పుడు వ్యవసాయం (AGRICULTURE)  , అవినీతి పరులకు  , అక్రమ సంపాదకులకు  , నల్ల కుబేరులకు  , స్వర్గ ధామమే కదా ! భూతల  స్వర్గమే కదా ! ఒప్పుకుంటారుకదూ!
అందుకనే  వ్యవసాయ  భూములపైనా , బినామీ భూములపైనా  సర్జికల్ స్ట్రైక్ జరగాలి . దానిని ప్రభుత్వాలు జప్తు చేసుకుని , ముందుగా  దేశం లోని పేదలందరి  నివాస  గృహాలకు  ఉచితంగా  కెటాయించాలి . ఆ తరువాత  వ్యవసాయ  కౌలు దారులకు  , పేద రైతులకు  పంచి వేయాలి . 
నా ఆలోచనలు  ఎప్పుడో ఒకప్పుడు , ఎదో ఒక రోజు  వాస్తవ రూపం  దాల్చక తప్పదు . సమయం కోసం వేచి చూద్దాం . 
  



Friday, December 9, 2016

WHAT ARE THE BENEFITS TO THE PEOPLE BY PREPAID ELECTRICITY CHARGES ?/ 'ముందు చెల్లింపు' విద్యుత్తు విధానం వలన ప్రజలకు లాభాలేమిటి ?


ప్ర : 'ముందు చెల్లింపు' (Prepaid) విద్యుత్తు (Electricity/Current/Power) విధానం వలన ప్రజలకు లాభాలేమిటి ?

జ :'ముందు చెల్లింపు' (Prepaid) విద్యుత్తు (Electricity/Current/Power) విధానం వలన ప్రజలకు లాభాలు :


అసలు 'ముందు చెల్లింపు' (Prepaid) అంటే ఏమిటి ?

'ముందు చెల్లింపు' (Prepaid) అంటే , సామాన్యులకు కూడా  భాషలో  చెప్పాలంటే " సెల్లును " ముందుగానే రీచార్జ్  చేసుకుని వాడుకోవడం  లాగా అన్న మాట.  గ్యాసుకు ముందుగా డబ్బులు కట్టి వాడుకోవడం అన్న మాట . టి . వి . కనెక్షన్ కు ముందుగా డబ్బుకట్టి వాడు కోవడం అన్న మాట .  ఈ విధంగా విద్యుత్తుకు ముందుగానే  డబ్బు చెల్లించి  వాడుకోవడం వలన  అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి . అవి ,
1. విద్యుత్తు(Electricity/Current/Power) అవసరం లేని పేద మధ్య తరగతి పేద ప్రజలు పొదుపుగా వాడు కోవచ్చు . నెలా రెండు నెలలు , ఏదేని ఇతర ప్రాంతాలకు వెళ్లి నప్పుడు , కరెంట్ రీ చార్జ్ చేయించు కోవాల్సిన అవసరం లేదు .



2. విద్యుత్తు ఎక్కువగా అవసరం ఉన్న వారు , ఇతరుల పొదుపు వలన , ఎక్కువగా వాడు కోవచ్చు .

3. ప్రజలకు ఎంత విద్యుత్తు అవసరమో , అంతే రీ చార్జ్ చేయించు కుంటారు కాబట్టి , రూ .లు. 100/- బిల్లు , సడన్ గా రూ .లు.10,000/- , రూ .లు.1,00,000/- వచ్చే సమస్యే ఉత్పన్నం కాదు .

4. బిల్లులు ఎక్కువగా వచ్చాయని , కోర్టుల చుట్టూ తిరుగాల్సినా అవసరం ఉండదు .

5. బిల్లుల చెల్లింపులకు , లైన్లల్లో గంటల కొద్దీ నిల బడాల్సిన అవసరం ఉండదు .

6. కష్టమర్ చార్జీలు , మీ సేవ చార్జీలు , వడ్డీలు ఉండవు .

7. హిడెన్ చార్జీలు , పెనాలిటీలు , సెక్యూరిటీ డిపాజిట్లు ఉండవు .

8. పెరిగిన రెట్లు తెలియ జేస్తారు . దాని ప్రకారమే రీ చార్జ్ లో కట్ ఆవు తుంది .

9. మినిమమ్ బిల్లు అని గాని , ఎఫ్ ఎస్ ఎ (F.S.A . means Fuel surcharge adjustment ) చార్జీలు అంటూ ఏమీ ఉండవు .

10. ఒక వేల బ్యాలన్స్ మిగులుతే , 30 రోజుల లోపల రీ చార్జ్ చేపిస్తే , బ్యాలన్స్ కంటిన్యూ అవుతుంది .

11. మరో పెద్ద సమస్య కొత్తగా అద్దెలకు దిగేవారిది . ఇండ్లను , ఫ్లాట్లను అద్దెలకు తీసు కునే వారు , ఎవరో వాడిన విద్యుత్తు (current) కు , ఇప్పుడు కొత్తగా అద్దెలకు దిగే వారు ఎఫ్. ఎస్. ఎ. (F.S.A.) చార్జీలను చెల్లించాల్సిన భారం తప్పుతుంది .


ప్ర : విద్యుత్తు (Electricity/Current/Power) ' వినియోగాన్ని 'ముందు చెల్లింపు' (Prepaid) విధానం చేయడం అవసరమా ?



ప్ర :  విద్యుత్తు (Electricity/Current/Power) ' వినియోగాన్ని  'ముందు చెల్లింపు' (Prepaid) విధానం   చేయడం  అవసరమా ?

జ :  విద్యుత్తు (Electricity/Current/Power) వినియోగాన్ని  'ముందు చెల్లింపు' (Prepaid) విధానముగా మార్చాలి .    


'ప్రీపేయిడ్ ' విధానం వలన విద్యుత్తు (Electricity/Current/Power) అవసరం లేని పేద, మద్య తరగతి వర్గాల ద్వారా విద్యుత్తు ఆదా అవుతుంది . అలానే విద్యుత్తు ఎక్కువగా అవసర మున్న వారికి , అందు బాటులో ఉంటుంది .

గుజరాత్ , ముంబాయి మినహా దేశ మంతా విద్యుత్తు కొరత అనేది జగమెరిగిన సత్యం . మనకు ముఖ్యంగా ఐదు మార్గాల్లో అనగా థర్మల్ పవర్ ( బొగ్గు ద్వారా ), హైడ్రల్ పవర్ ( నీటి ద్వారా ) , విండ్ పవర్ ( గాలి ద్వారా ), అటామిక్ పవర్ (ఆటమ్స్ ద్వారా ), సోలార్ పవర్ ( సూర్య శక్తి ద్వారా ) విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. నాచురల్ గ్యాస్ , ఆయిల్   మరియు బయోగ్యాస్ ద్వారా కూడా కొంత వరకు విద్యుత్తు ఉత్పత్తి జరుగు తుంది . ఒక్కో పవర్ ది ఒక్కో సమస్య . అందువలననే , విద్యుత్తు (Electricity/Current/Power) ఉత్పత్తి ఎక్కువ గా లేక పోవడం , అదే సమయంలో విని యోగం అధికంగా ఉండటం వలన పరిశ్రమలకు విద్యుత్తు అందక , అనేకంగా మూత బడి పోతున్నాయి . ఉత్పత్తులు తగ్గి పోతున్నాయి . నిరుద్యోగ సమస్య జఠిల మయి పోతున్నది . వ్యవసాయానికి విద్యుత్తు అందక పంటలు ఎండి పోతున్నాయి . గతంలో గృహ అవసరాలకు కూడా సరిపోక , రోజూ 2 నుండి 4 గంటలు విద్యుత్తు నిలిపివేయడం జరుగు తుంది . ప్రజలు విసిగి వేసారి పోతున్నారు . భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలు , ఇంకా పెరుగుతాయి గాని తగ్గవు . 

ఇన్ని సమస్యలను అధిగ మించా లంటే , మన ముందున్న మార్గాలు రెండే రెండు . అవి ఒకటి అన్ని రకాలుగా విద్యుత్తు ఉత్పత్తి పెంచడం. ముఖ్యంగా పుష్కలంగా లభించే సోలార్ పవర్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం . రెండవది ప్రజలందరూ పొదుపు పాటించడం . ఖచ్చితంగా పొదుపు పాటించాలంటే " విద్యుత్తు వినియోగాన్ని 'ప్రీ పేయిడ్' చేయడమే ఉత్తమమైన మార్గం " .

Wednesday, December 7, 2016

"జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు మొదలగు విజ్ఞ్యలు ఆదాయ ఆపేక్షే కాకుండా , ఇంకేమి చేస్తే బాగుంటుందని ప్రజలు కోరు కుంటున్నారు ?

ప్ర : "జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు ఆదాయ ఆపేక్షే కాకుండా , ఇంకేమి  చేస్తే  బాగుంటుందని  ప్రజలు  కోరు కుంటున్నారు ?


జ : "జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు ఆదాయ ఆపేక్షే కాకుండా , గౌరవించే , నమ్మే అమాయక ప్రజలచే  పెట్టించే ఖర్చు నలుగురు పేద వారికి , మూగ జీవులకు , పర్యావరణానికి  ఉపయోగే పడే విధంగా చూడాలి . " 


నేడు కొందరు జ్యోతిష్య , వాస్తు , రుద్రాక్ష , సంఖ్యా శాస్త్ర పండితులు , స్వాములు , బాబాలు మొదలగు  విజ్ఞ్యలు  ప్రజలను విపరీతంగా నమ్మించ గలుగుతున్నారు . విశ్వాసం పొంద గలుగు తున్నారు . ఉదయం లేవగానే  ఆ ఛానల్ చూడకుండా , వినకుండా జీవించలేమన్న స్థాయికి  దిగజారి పోతున్నారు అమాయక ప్రజలు .  ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు టి . వి . చానల్లల్లో , రేడియోలల్లో దాదాపుగా వీటి గురించే ప్రసార మవుతున్నాయి . పుట్టిన వారు గిట్టక మానరు . గిట్టిన వారు పుడుతారనడానికి ఆధారాలు లేవు . ప్రారబ్ధ ఖర్మలు తప్పవని  వీరే చెబుతారు .  గత కాలం మనం చూడ లేదు. భవిష్యత్తు మనం చూడ బోము . వర్త మానమే మనది . ఏదైనా పరిమితంగా ఉంటేనే సహజంగా ఉంటుంది . లేదంటే మొఖానికి మేకప్ వేసుకున్నట్లుగా ఉంటుంది .

ఈ  కాలంలో ఎన్ని వాస్తులు , జ్యోతిష్యాలు , సంఖ్యా  శాస్త్రాలు చూసుకుని పెండ్లిళ్లు చేసినా , ఎన్ని రుద్రాక్షలు ధరించినా భార్యా భర్తల   కొట్లాటలు , విడాకులు , ఆత్మ హత్యలు , హత్యలే అధికంగా కనబడు తున్నాయి. అలానే  ఎన్ని వాస్తులు , జ్యోతిష్యాలు , సంఖ్యా  శాస్త్రాలు చూసుకుని అక్రమంగా  సంపాదించినా , మోసాలు చేసి సంపాదించినా , అవి నీతితో సంపాదించినా , ప్రజల అమాయకతను , నిజాయితీని  ఆసరా చేసుకుని  కోట్లు కూడా బెట్టినా , అందరూ  అనుభవించాల్సిన  సంపదను , ఒక్కరే స్వంతం చేసుకోవాలని అనుకున్నా , ఎన్ని రుద్రాక్షలు ధరించినా , ఎన్ని ఎత్తుగడలు  వేసినా , దేవుడిని అడ్డం పెట్టుకుని కోట్లు గడించినా ( 24 గంటలూ దేవుండ్లను  పూజిస్తూ ) ఉదా : 90 కోట్లు  నగదు , (అందులో 70 కోట్లు 2,000/- కొత్త నోట్లు , 20 కోట్లు పాత  నోట్లు ) 100 కిలోల బంగారం కూడా బెట్టిన  గొప్ప  దేవుడి భక్తులైనా , పలుకుబడి గల వారైనా , మరెలాంటి  వారైనా ,   ఎదో ఒకరోజు , వాటిని ఏమీ అనుభవించ కుండానే  నరకం వెల్లాల్సి రావచ్చు. కొన్ని సందర్భాలలో  వాటిని అనుభవించాల్సిన వారు కూడా లేకుండా పోవచ్చు .  లేదా  "మోడీ " గారి లాంటి  డైనమిక్ ప్రధాన మంత్రులు, నాయకులు , అది కారులు  ఒక్క సారి  ద్రుష్టి  సారించినా , ఇప్పటి వరకు  అవినీతితో  కూడ బెట్టినదంతా  ప్రభుత్వ పరం కాక  తప్పదు . అప్పడు గాని  అవినీతి పరులకు అన్నింటిపైనా జ్ఞానోదయం  కలుగక తప్పదు .  స్వాతంత్య్రం  వచ్చిన 67 సం . రాల  తరువాత , అవినీతి నిర్ములకు  నడుం  బిగించిన  ఏకైక   ప్రధానమంత్రి  " మోడీ " గారికి  సహకరిద్దాం . ( అవినీతి నిర్మూలనకు  చిత్త శుద్దితో ముందుకు వచ్చే  ఏ  పార్టీ నాయకుడికైననూ  సహకరిద్దాం ). భావి తరాల కొరకు  అత్యుత్తమ దేశంగా  ఆవిష్కరిద్దాం . 


జ్యోతిష్య ,  వాస్తు ,  రుద్రాక్ష ,  సంఖ్యా శాస్త్ర  పండితులు ,  స్వాములు ,  బాబాలు  మొదలగు  విజ్ఞ్యలు టి . వి . చానల్లల్లో , రేడియోలల్లో ప్రజలకు వివరించేటప్పుడు , ( ఇప్పటికీ కొందరు కొన్ని మంచి విషయాలు  చెబుతూనే ఉన్నారు ) ప్రజల హితాన్ని కోరి , నమ్మే వారిచే  పెట్టించే  ఖర్చు నలుగురు పేద వారికి , మూగ జీవులకు ఉపయోగే పడే విధంగా , ప్రజలలో నైతికత ,  నిజాయితీ పెరిగే విధంగా ,  కుటుంభ  సభ్యులందరూ  కలిసి   మెలిసి   గౌరవ   ప్రదంగా   జీవించే   విధంగా , ఆరోగ్యంగా ఉండే విధంగా ,   స్వచ్ఛతను , పరిశుబ్రతను పెంచే విధంగా , సమస్యలలొ  చిక్కు కోకుండా , సంస్కృతిని , సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా, జంకు ఫుడ్స్ , మత్తు మందులు , విషపు శీతల పానీయాలు , ధూమ పానాలు , పర్యావరణానికి , జీవకోటికి హాని కలిగించే, క్యన్సర్ ను తెప్పించే   ప్లాస్టిక్  పేపర్లు ,  ప్లాస్టిక్  కవర్లు ,   ప్లాస్టిక్ టీ   కప్పులు  వాడ  కుండా  ఉండే  విధంగా , పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా , సందర్భాలను బట్టి వివరిస్తే ఎంతో బాగుంటుందని  ప్రజలు కోరుకుంటున్నారు .  పుణ్యం పురుషార్ధం దక్కు తాయి. 




www.sollutions2all.blogspot.com

Sunday, December 4, 2016

Etu Pothundira Desham ఎటు పోతుందిరా ...... దే శం

Etu Pothundira Desham ఎటు పోతుందిరా ...... దే శం 



ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"


స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2" 


అవినీతి , అవినీతి అనీ  ........"2"

అంగ లాడ్చిరీ  ....."2" " అవినీతి "

పెద్ద నోట్లు  రద్దవగానే  ......"2" 

ఢిల్లీ అంతా  దద్దరిల్లే ....  కృష్ణా !......."2" "పెద్ద నోట్లు"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 



ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2" 

చురుకయిన నైజీరియన్లు ........"2"

ఆన్లయిన్లో దోచిరీ ....."2" " చురుకయిన "

తెలివయిన నేతలు ......"2" 

ఆఫ్ లైన్లో దోచిరీ ....  కృష్ణా !......."2" "తెలివయిన"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 


ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

బంగారం నాదీ ,నా అబ్బదనీ   ........"2"

గింజుకొనిరీ , నల్ల కుభేరులు   ....."2" " బంగారం నాది "

అది నీదీ కాదు , నాదీ  కాదు  ......"2" 

 దేశ , నరులందరిదీ ...  కృష్ణా !......."2" "అది నీదీ కాదు"

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 


(వివాహిత మహిళలకు 500 గ్రాములకు ( 50 తులాలకు) మించి, వివాహిత కాని  మహిళకు  250 గ్రాములకు ( 25 తులాలకు) మించి . పురుషులకు  100 గ్రాములకు ( 10 తులాలకు)  మించి  ఉన్నవారి  విషయంలో మాత్రమే )

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

బ్రిటిష్ పాలకులా   . ..."2"
తరిమి కొట్టీ  .... "2" "బ్రిటిష్ "
విదేశీ  వ్యాపారాలకూ   ...."2"
ఎర్ర  తివాచీలా  ...కృష్ణా !......"2" "విదేశీ"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 


ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

గ్రామాలు  అభివృద్ధీ . ..."2"
చెంద  కుండా .... "2" "గ్రామాలు "
గరీబులూ   అభివృద్ధీ . ...."2"
చెందు దురా ...కృష్ణా !......"2" "గరీబులూ"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 



ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

అవినీతీ  బండారాన్నీ ....."2"
అక్రమాస్తుల గుట్టునూ ......"2"  ''అవినీతీ"
నిగ్గు తేల్చీ , శిక్షలు  వేస్తే ....."2"
తెలంగాణా  విభజనా  చిటికెలోపనిరా   కృష్ణా !...."2" "నిగ్గు తేల్చీ"

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 


ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

బినామీ  ఆస్తులా . ..."2"
బట్ట బయలూ చేసీ  .... "2" "బినామీ "
అభివృద్ధి  సాధిస్తే   . ...."2"
పేద రికమే కాన రాదూ ...కృష్ణా !......"2" "అభివృద్ధి "

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 

*****************

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

ఉత్పాదకా  శక్తినీ  ..."2"
నిలిపి వేసీ  .... "2" "ఉత్పాదకా"
ఉత్తుత్తీ   సేవలతో ...."2"
అభి వృద్దీ  సాధ్యమా ...కృష్ణా !......"2" "ఉత్తుత్తీ "

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 

*****************

ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"

స్వాతంత్య్రం వచ్చి , ఆరు పదులు దాటినా ..... "ఎటు పోతుందిరా . " "2"

అద్దెల కిచ్చే  వారినీ   ..."2"
వదిలీ  పెట్టీ ... "2" "అద్దెల"
అద్దెల కుండే వారీ పై ..."2"
పన్నులా  భారమా  ...కృష్ణా !......"2" "అద్దెల "

మా దేశ నేతా ...మా జాతి పితా .... మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా" 



నోటు : మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మరియు కాలాను గుణంగా ఈ వ్యవస్థను ప్రతిబింభించే  అవి నీతి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , రాజకీయ సమస్యలకు సంబంధించిన కవితలను సరదాగానే తీసుకోవాలని మనవి . వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుందాం .

www.sollutions2all.blogspot.com