బాల గేయాలు


అంశం: బాల గేయాలు/పాటలు


శీర్షిక: మేమే మేమే బాలలం!

మేమే మేమే బాలలం,
భావి తరానికి వారసులం
దేశాభివృద్ధికి కారకులం ,
జగతికి మేమే దివ్వెలం!! "మేమే మేమే"

ప్రాతఃకాలాన లేచెదము
కూర్చుని శ్రద్ధగ చదివెదము
అమ్మ చెప్పిన పనులు చేసెదము
తల్లిదండ్రులకు సేవ చేసెదము!! "మేమే మేమే"

అందరం బడికి వెళ్ళెదము
పాఠాలు చక్కగా వినెదము
ఆటలు బాగా ఆడెదము
ప్రేమ దయతో ఉండెదము!!    "మేమే మేమే"

కుల మతాలు మాకూ లేవు
ఈర్ష్య అసూయలు లేనే లేవు
పేద ధనిక భేదాల్లెవు
ప్రాంతీయ విభేదాల్లేవు!!        "మేమే మేమే"

మూఢనమ్మకాలు వీడెదము
సత్యాలనే మేము నమ్మెదము
నీతి నిజాయితిగా ఉండెదము
గొప్ప నాయకుల మయ్యెదము !!  "మేమే మేమే"

No comments: