Tuesday, August 30, 2016

' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా నేమి ?

ప్ర . ' మ్యూచువల్  ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా  నేమి ?   ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) అనగా  నేమి ?  ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  చట్ట బద్ద మైనవేనా ? వీటిలో పెట్టుబడికి  భద్రత ఉంటుందా ?  వీటిలో ఎంత వరకు పెట్టుబడులు పెట్టవచ్చు ? ఇవి ఎందులో పెట్టుబడులు పెడుతాయి ?  వీటిల్లో పెట్టుబడులు  పెడితే  ఆదాయం ఉంటుందా ?

 ' మ్యూచువల్  ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా  నేమి ?  


జ :  ' మ్యూచువల్  ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా  ఒక క్రొత్త  పొదుపు విధానం .  సక్రమంగా  , సరియయిన సమయంలో , సమర్ధత  గల మ్యూచువల్  ఫండ్స్  సంస్థలలో  పొదుపు చేయ గలుగుతే  కొంత మేర ఎక్కువ రాబడి గల ఒక క్రొత్త  పొదుపు విధానం.  ఏదైనా పెట్టుబడి పెట్టి  లాభాలు  సాధించాలంటే  ముఖ్యంగా  కావాల్సింది , పెద్ద మొత్తం లో  డబ్బు , ఎక్కువ సమయం , పెట్టుబడుల  స్ట్రాటజీ , ఎందులోనైతే  పెట్టుబడులు  పెడుతారో , అవి బలంగా , సమర్ధవంతంగా  ఉండటం ,  సహనము , ధైర్యం  మొదలైనవన్నీ అవసరం .  ఇవన్నీ ఒక వ్యక్తిలో  ఉండక పోవచ్చు . అందుకని  కొంత మంది మిత్రులు కలిసి  పెట్టుబడులు పెట్టాలనుకునే  విన్నూతంగా   వచ్చిన  ఆలోచనే   ' మ్యూచువల్  ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) .  మొదట కొంత మంది  మిత్రుల  సహకారం తో  ఏర్పాటు  చేసుకున్న నిధులే  ' మ్యూచువల్  ఫండ్స్ ' ( MUTUAL FUNDS ).  వారు  ఆ నిధులను , వారి అందరి తెలివితేటలతో, ఒకరినొకరి  సహకారంతో కలిసి    సమర్ధవంతమైన   పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టి  అధిక లాభాలు ఆర్జించే వారు .

 ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) అనగా  నేమి ? 


మిత్రులకు  ఆ విధంగా వచ్చిన ఆలోచనే  ఆర్గనైజ్డ్  ' మ్యూచువల్  ఫండ్స్ సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) గా రూపాంతరం  చెందాయి . ఇవి మొదట  రూ .లు. 10/- ,          రూ .లు. 100/- ,రూ .లు. 1000/-  చొప్పున  ప్రజలనుండి , సంస్థల నుండి  నిధులను సేకరించి , పెద్ద పెద్ద , సమర్ధమైన  కంపెనీలలో  పెట్టుబడులు  పెడుతారు .   ప్రారంభంలో వీరికి   రూ .లు. 10/- ,          రూ .లు. 100/- ,రూ .లు. 1000/-  చొప్పున నే   యూనిట్లను కెటాయిస్తారు .  ఉదా :  ఒక వ్యక్తి  లేదా  సంస్థ  రూ  .లు . 10,000/-  పెట్టుబడి పెడితే , వారికీ  10/- చొప్పున  అయితే  1000 యూనిట్లను  కెటాయిస్తారు .  ఇవి ఎన్నడూ మారవు .  వీటిల్లో పెట్టుబడులు పెట్టిన వారిని  యూనిట్ దారులని (UNIT HOLDERS) , కెటాయించిన  భాగాలను  యూనిట్లు (UNITS) అని అంటారు .  దీర్ఘ కాలంలో లాభాలను ఆర్జిస్తారు . వాటిని  పెట్టుబడి దారులకు , ఖర్చులు మినహాయించుకుని , పంచు  తారు . ' మ్యూచువల్  ఫండ్స్ లలో ' స్కీమ్ లు ' అనేక రకాలు గా ఉంటాయి . సెక్టార్ ఫండ్స్ అని , బ్యాంకింగ్ ఫండ్స్ అని , ఐటీ ఫండ్స్ అనీ , ఈక్విటీ ఫండ్స్ అనీ , డెట్  ఫండ్స్ అనీ , బ్యాలెన్సుడ్ ఫండ్స్  అనీ , ఈ .ఎల్ .ఎస్.ఎస్.  ఫండ్స్ అనీ రక రకాలుగా ఉంటాయి . అలానే క్లోజ్  ఎండెడ్  ఫండ్స్ అనీ , ఓపెన్ ఫండ్స్ అనీ  ఉన్నాయి . డివిడెండ్  ఫండ్స్  అని , గ్రోత్ ఫండ్స్  అని  అనేక రకాలుగా  ఉన్నాయి .  ఓపెన్  ఎండెడ్   ' మ్యూచువల్  ఫండ్స్ లలో,  ఆ తరువాత  ఎప్పుడైనా పెట్టుబడులు పెట్ట వచ్చు , అమ్మ వచ్చు . కానీ  అప్పటి ఎన్  . ఏ . వి ( NAV)  ప్రకారం  అలాట్ అవుతాయి . అంటే  ప్రారంభంలో  ఉన్న 10/- ధరకు  దొరకవు . ఎన్  . ఏ . వి ( NAV) అంటే   నికర ఆస్తి  విలువ  (NET  ASSET VALUE) . 

 ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) చట్ట బద్ద మైనవేనా ? 


అవును.  నిస్సందేహంగా   ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  చట్ట బద్ద మైనవే . వీటిపైనా  RBI , SEBI, FEMA , MINISTRY OF FINANCE  మొదలగు ప్రభుత్వ సంస్థల , పూర్తి  కంట్రోలింగ్ అధికారుల ఆజమాయిషీ , నిఘా నిరంతరం  ఉంటుంది . చక్క బెట్టే అధికారం , అవసరమైతే  రద్దు చేసే అధికారం ఉంటుంది . యూనిట్ దారులకు ఎలాంటి  మోసాలు జరుగ కుండా చూస్తుంది . 

' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలలో   ( MUTUAL FUNDS  ORAGANISATIONS) పెట్టుబడికి  భద్రత ఉంటుందా ?  


' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలలో   ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  పెట్టిన పెట్టుబడులకు  పూర్తి భద్రత ఉంటుంది . మోసం అంటూ ఉండదు . రిటర్న్స్   ను బట్టి  రిస్క్ కూడా ఉంటుంది . 

' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలలో   ( MUTUAL FUNDS  ORAGANISATIONS) ఎంత వరకు పెట్టుబడులు పెట్టవచ్చు ?


' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలలో   ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  కొన్నింటిలో  కనీస మొత్తం  రూ . లు . 500/- , మరి కొన్నింటిలో   రూ . లు . 1000/- పెట్టుబడులు  పెట్టాలనే  నియమం ఉంది . అలానే   గరిష్టంగా  పెట్టుబడులు పెట్టడానికి  పరిమితి అంటూ ఏమి లేదు . ఎంత డబ్బైనా , ఎంత కాలమైనా  పెట్టుబడులు పెట్టుకోవచ్చు . 


' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) ఎందులో పెట్టుబడులు పెడుతాయి ?  

' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు  ( MUTUAL FUNDS  ORAGANISATIONS) , ప్రజల నుండి , సంస్థల నుండి , బ్యాంకుల నుండి  సేకరించిన పెట్టుబడులను , నేటి కాలపు  సాంకేతిక నైపుణ్యాలను  ఉపయోగించుకుని , పెద్ద పెద్ద  కంపెనీలలో , లాభదాయక కంపినీలలో  షేర్ల రూపేణా పెట్టుబడులు పెడుతాయి . కొంత మొత్తాన్ని  ప్రభత్వ సెక్యూరీటీలలో, కొంత మొత్తాన్ని  కాల్ మనీ రూపంలో  పెట్టుబడులు పెడుతాయి . మరి కొంత మొత్తాన్ని  నగదురూపంలో  ఉంచుకుంటాయి .  అవి పెట్టిన పెట్టుబడులపై  ఆర్జించిన ఆదాయాన్ని , ఖర్చులకు మినహాయించుకుని , కొంత మొత్తాన్ని  రిజర్వులకు మళ్లించి , మిగిలిన మొత్తాన్ని ప్రతి సంవత్సరం  లేదా  అవకాశాలను బట్టి   యూనిట్ దారులకు పంచుతారు . 


' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలలో   ( MUTUAL FUNDS  ORAGANISATIONS) పెట్టుబడులు  పెడితే  ఆదాయం ఉంటుందా ?  ఇంకను ఎలాంటి సదుపాయాలు ఉంటాయి ? 


' మ్యూచువల్  ఫండ్స్  '  లలో   పెట్టుబడులు  పెడితే   దీర్ఘకాలంలో   ఆదాయం   లభిస్తుంది . అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు  సరియయిన ' మ్యూచువల్  ఫండ్స్  ' లను , సరిఅయిన  సెక్టార్లను  , మన  అవసరాలను బట్టి  ఎంచు కోవాలి . వయస్సును బట్టి , ఆర్ధిక  పరిస్థితులను బట్టి , రిస్కును  బేర్ చేసే  కెపాసిటీని బట్టి  ఎంచు కోవాలి . ఇక్కడ పొరపాటు జరుగుతే  అసలు కూడా  నష్ట పోవాల్సిన  పరిస్థితులు   ఏర్పడవచ్చు .  మంచి వాటిని    ఎంచుకుని, సరిఅయిన సమయంలో , దీర్ఘ  కాలం  పెట్టుబడులు పెడితే   సుమారుగా  12 నుండి 14% వరకు ఆదాయం  పొందవచ్చు .  ప్రస్తుతం   ఇది   ఫిక్స్డ్   డిపాసిట్స్ కు  డబుల్.   పెట్టుబడికి   ఎలాంటి   నష్టం ఉండదు . పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది . లిక్విడిటీ ఉంటుంది . ఆదాయం  లభిస్తుంది .  ఇన్కమ్ టాక్స్   ఫండ్లల్లో    కనీసం  3  సంవత్సరాలు   పెట్టుబడులు  పెడితే , పన్ను  మినహా యింపులు  ఉన్నాయి .  ప్రయవసీ ఉంటుంది . రిస్క్ తక్కువ గా   ఉంటుంది .  టెన్షన్ ఫ్రీ   గా  జీవించ వచ్చు . ప్రతి సం . రం  రెస్యూల్  చేయించుకోవాల్సిన అవసరం ఉండదు . ఫారం జి / ఎచ్  సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు . పారదర్శకంగా  ఉంటుంది .  ప్రతి ట్రాన్సక్షన్ కు  ఎస్ ఎం ఎస్  ల రూపంలో  , మెయిల్స్ రూపంలో  తెలియ జేయడం జరుగు తుంది . 



' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలకు   ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  ఎక్కడి నుండి  ఆదాయం లభిస్తుంది  ? 


పెట్టుబడులు  పెట్టిన  షేర్ల  నుండి  ఆదాయాలు వస్తాయి . డివిడెండ్ల రూపేనా  , వడ్డీ ల  రూపేనా , కమీషన్ల రూపేనా , సర్వీస్  చార్జీల రూపేనా   ఆదాయం లభిస్తుంది .    


సమర్ధ వంతమైన , ప్రొఫెషినల్ ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు    ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  ఏవి   ? 


సమర్ధ వంతమైన , ప్రొఫెషినల్ ' మ్యూచువల్  ఫండ్స్  '  సంస్థలు    ( MUTUAL FUNDS  ORAGANISATIONS)  అనేకంగా ఉన్నాయి . అందులో  ముఖ్యమైనవి ,  ఫ్రాంక్లిన్  ' మ్యూచువల్  ఫండ్స్  ' ,  బిర్లా  ' మ్యూచువల్  ఫండ్స్  ' ,  ఎస్ బి ఐ  ' మ్యూచువల్  ఫండ్స్  ' , ఆక్సిస్ ' మ్యూచువల్  ఫండ్స్  ' , ఎల్ & టి  ' మ్యూచువల్  ఫండ్స్  ' , రిలియన్స్  ' మ్యూచువల్  ఫండ్స్  ' ,  టాటా ' మ్యూచువల్  ఫండ్స్  ' , ఎచ్ . డి . ఎఫ్ . సి . ' మ్యూచువల్  ఫండ్స్  ' , డి ఎస్ పి ' మ్యూచువల్  ఫండ్స్  ' , సుందరం  ' మ్యూచువల్  ఫండ్స్  ' , కెనరా ' మ్యూచువల్  ఫండ్స్  '  ఇలా అనేకంగా ఉన్నాయి . 


ప్ర . నా వయస్సు 80 సంవత్సరాలు . నేను ఎందులో  పెట్టుబడులు పెట్ట వచ్చు ?


జ.  మీరు 80 సంవత్సరాలు అంటున్నారు . 100 నుండి 80 తీసి వేయండి . 20 వస్తుంది . అంటే  మీరు 20 శాతం మాత్రమే రిస్క్ బేర్ చేయ గలరు . ఎందుకంటే అప్పటికే  మీరు  వయస్సు మీరు పోటీ ఉంటుంది . ఏమి చేత గాని పరిస్థితి . ఏమి సంపాదించలేరు . ఎవరి తోనూ  గట్టిగా వాధించి  వసూలు  చేసుకోలేరు . దానికి తోడూ  పుట్ట గొడుగుల్లా  రోగాలు చుట్టూ ముసురుతాయి . ఎందుకంటే రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది కాబట్టి .  అలానే నెలా , నెలా  డబ్బులు  ఈ  పెట్టుబడుల నుండే రావాలి అనుకుంటారు .  అందుకని  మీ పెట్టుబడులలో  20 శాతం మొత్తాన్ని  ఈక్విటీ ఫండ్లల్లో  ( డివిడెండ్  చెల్లించే  విధానంలో  లేదా నెల వారి డివిడెండ్ విధానంలో ), మిగిలిన  80 శాతం లో  70 శాతాన్ని  సెక్యూర్డ్  , డెట్  ఫండ్లల్లో , 10 శాతాన్ని  ఎస్ బి . అకౌంట్ లో  క్యాష్ రూపంలో  ఉంచండి . క్యాష్ రూపంలో ఎందుకంటే  నెల వారి  సరుకుల ఖర్చు , హాస్పిటల్ ఖర్చులు ,  , ప్రయాణ  ఖర్చులు  మొదలైన వాటికీ  ఉపయోగ బడటానికి . 


ప్ర . నా వయస్సు 40 సంవత్సరాలు . నేను ఎందులో  పెట్టుబడులు పెట్ట వచ్చు ?


జ.  మీరు 40 సంవత్సరాలు అంటున్నారు . 100 నుండి 40 తీసి వేయండి . 60 వస్తుంది . అంటే  మీరు 60 శాతం వరకు  రిస్క్ బేర్ చేయ గలరు . అందుకని  మీ పెట్టుబడులలో  60 శాతం మొత్తాన్ని  ఈక్విటీ ఫండ్లల్లో ( ఇక్కడ రిస్క్ అధికంగా ఉంటుంది , అలానే రిటర్న్/ ఆదాయం   అధికంగా ఉంటుంది ) , మిగిలిన  40 శాతం లో  25 శాతాన్ని  సెక్యూర్డ్  , డెట్  ఫండ్లల్లో , 15 శాతాన్ని  ఎస్ బి . అకౌంట్ లో  క్యాష్ రూపంలో  ఉంచండి .  క్యాష్ రూపంలో ఎందుకంటే  నెల వారి  సరుకుల ఖర్చు , ఎంటర్ టైన్ మెంట్  ఖర్చు , హాస్పిటల్ ఖర్చులు , పిల్లల స్కూల్ ఫీజులు , ప్రయాణ, ఫంక్షన్ల ఖర్చులు  మొదలైన వాటికీ  ఉపయోగ బడటానికి . 


ప్ర . నాకు  కొద్దిగా ఆదాయం వచ్చిన పర్వా లేదు . కానీ అసలు మొత్తం  తగ్గ కూడదు. కానీ , కనీసం   బ్యాంక్ లలోని   'ఫిక్స్డ్ వడ్డీ'  రేట్  కంటే కొంచెం ఎక్కువ రావాలంటే , ఎలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి ?


జ . మీకు  కొద్దిగా ఆదాయం వచ్చిన పర్వా లేదు . కానీ అసలు మొత్తం  తగ్గ కూడదు. కానీ , కనీసం   బ్యాంక్ లలోని   'ఫిక్స్డ్ వడ్డీ'  రేట్  కంటే కొంచెం ఎక్కువ రావాలంటే , లార్జ్  క్యాప్ లలో గాని , బాలన్సుడ్ ఫండ్లల్లో , డెట్  ఫండ్లల్లో , సమర్ధ వంత మైన  ' మ్యూచువల్ '  ఫండ్లల్లో  పెట్టుబడులు పెట్టాలి.

ప్ర . నాకు  ' మ్యూచువల్  ఫండ్స్  ' అంటే  అస్సలే  తెలియదు. అలాంటి నేను పెట్టుబడులు పెడితే  నష్టపోకుండా ఉండగలనా ?, పెట్టుబడి పైనా  ఆదాయం  అందుకోగలనా ?  మోసాలు ఏమైనా ఉంటాయా ? 



ప్ర . పుట్టుకతోటి యే బిడ్డకు  ఏమి తెలియదు. ఏ బిడ్డ బంగారు చెమ్చాను  నోట్లో పెట్టుకుని పుట్టడు . ఏ  బిడ్డా  సరస్వతిని  చంకన  పెట్టుకుని పుట్టడు . ఆ తరువాతనే  మాటలు , నడక, విద్య , ప్రయాణం ,  లోక జ్ఞ్యానం , మంచి చెడు ,  సంపాదన  గురించి నేర్చుకుంటాడు .   కాబట్టి  దేనికి భయ పడా  నవసరం లేదు . వేప గింజలు అమ్ముకుని జీవించిన  అబ్దుల్ కలాం గారికి  ప్రసిడెంటుగా ఎలా  నడుచుకోవాలో అతనికి ముందే తెలుసు  అని అనుకొన గలమా ?   భారత దేశానికి ప్రసిడెంట్ అవుతాడని ఎవరైనా  ఊహించారా ?  టీ లు అమ్ముకుని జీవించిన  మోడీ  గారికి దేశాన్ని ఎలా పాలించాలో  ముందే తెలుసు అని  అనుకున్నాడా ?   125 కోట్ల జనాభా  గల , ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద  మన భారత దేశానికి ప్రధాన మంత్రి అవుతారని  ఎవరైనా  ఊహించారా ?  కేవలం విద్య వినయం తో పాటు , ధైర్యం  , పట్టుదల , అందివచ్చిన  అవకాశాలను , టర్నింగ్ పాయింట్స్ ను  అందిపుచ్చుకున్నారు . 

  కాబట్టి '' మ్యూచువల్  ఫండ్స్  '' అంటే  ఏమి తెలియనందుకు  ఫీలవ్వ నవసరం లేదు . ఏమి తెలియకున్నా  మీరు  దైర్యంగా   ' మ్యూచువల్  ఫండ్స్  '  లలో   దీర్ఘ కాలంగా , ఆర్ధిక సలహాదారుల  సలహాలతో  పెట్టుబడులు పెడితే  ఎలాంటి నష్టం ఉండదు . పెట్టుబడి పైనా  ఆదాయం  అందుకోగలరు  .   మోసాలు ఏమీ  ఉండవు . ప్రతి ట్రాన్సక్షన్  రిజిస్టరైన  బ్యాంకు అకౌంట్ ద్వారానే జరుగుతుంది . ప్రతి ట్రాన్సక్షన్ గురించి  మేయిల్స్  ద్వారా , ఎస్ . ఎమ్ . ఎస్ , ల  ద్వారా  ఎప్పటికప్పుడు  తెలియ జేస్తారు .  

ప్ర. '' మ్యూచువల్  ఫండ్స్  '' లలో  పెట్టుబడులు పెట్టాలంటే  ప్రొసీజర్ ఏమిటి ?

జ . '' మ్యూచువల్  ఫండ్స్  '' లలో  పెట్టుబడులు పెట్టాలంటే  ముందు ' కె .వై . సి '.  ఫామ్  ను  సబ్మిట్ చేయాలి .  ఇది మ్యాండేటరీ . దీనికి  ' కె .వై . సి '.  ఫామ్ ను , (పేరు , అడ్రస్ , ఫోన్ నెంబర్ , మెయిల్ ఐ డి  మొదలయిన వివరాలు)   ఫిల్ చేసి  దాని పైన ఒక  ప్రస్తుత పాస్ ఫోటోను అతికించి  దాని పైన  క్రాస్ గా  సంతకం చేయాలి . అలానే  అందులోని వివరాలు కరెక్ట్ అని అదే ఫారమ్  క్రింద   సంతకం చేయాలి .  దీనితో పాటు  ఆధార్ కార్డు గాని , ఓటర్ కార్డు గాని  మరియు 'పాన్ ' కార్డును  జత చేసి  సంబంధిత  బ్రోకర్ ఆఫీస్ లలో గాని ,'' మ్యూచువల్  ఫండ్స్  '' లలో  గాని  సబ్మిట్  చేయాలి . వర్జినల్స్ వెరిఫై  చేస్తారు .  అన్నీ కరెక్ట్ అయితే రెండు మూడు రోజులలో  మీ ' కె .వై . సి ' వెరిఫై అయినట్లుగా మీకు ఇంటిమేషన్ వస్తుంది .  ఆ  తదుపరినుండి  మీరు   '' మ్యూచువల్  ఫండ్స్  '' లలో  పెట్టుబడులు  పెట్టవచ్చు . 

ప్ర . " ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టె టప్పుడు ' డీ మ్యాట్ అకౌంట్ ' ను 'టిక్ '(SELECT) చేయాలా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టె టప్పుడు  ' డీ మ్యాట్ అకౌంట్ ' ను 'టిక్ ' (SELECT) చేయాలంటే  మీకు అంతకు ముందే  ' డీ మ్యాట్ అకౌంట్ '  కలిగి  ఉండాలి .  ' డీ మ్యాట్ అకౌంట్ '  ఉంటేనే  సెలెక్ట్ చేయాలి . లేదంటే చేయ కూడదు. దీని వలన ఉపయోగం ఏమిటంటే , అన్ని '' మ్యూచువల్  ఫండ్స్  '' యూనిట్స్ అన్నీ ఒకే అకౌంట్ లో  చూసుకోవచ్చు . అయితే  తప్పని సరి ఏమీ కాదు . అదే  షేర్స్  కొనాలన్నా , అమ్మా లన్నా  ' డీ మ్యాట్ అకౌంట్ ' తప్పని సరీగా ఓపెన్ చేయాలి .

ప్ర . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చా ?

జ . ఆన్లైన్ లో  పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్  ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా  కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు  లేదా నష్టాలు  పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు .  డైరెక్టుగా  కొనేటప్పుడు  0.5% - 1%  కమీషన్స్  బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు  . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా  కొనుగోలు చేస్తే  0.5% - 1% , వీరికి  కమీషన్  మ్యూచ్యువల్  ఫండ్  సంస్థ  చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్  బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన  బ్రోకర్  సంస్థల ద్వారా  కొనడం వలన  అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి .  డైరెక్టుగా  కొనేటప్పుడు   సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) ,   ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది  డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే  పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు .  ఉదా : DSPBR TECHNOLOGIES FUND  కొన్నట్లయితే  ఈ రోజున  12.78% నష్టం వచ్చేది . అలానే  TATA DIGITAL INDIA FUND  కొన్నట్లయితే  ఈ రోజున  9.72% నష్టం వచ్చేది . అలానే  SBI PHARMA FUND కొన్నట్లయితే  ఈ రోజున  9.27 % నష్టం వచ్చేది . అలా  అనేక మైన  '' మ్యూచువల్  ఫండ్స్  '' స్కీమ్స్  నష్టాల లో  కూడా నడుస్తున్నాయి . 



గమనిక  :  '' మ్యూచువల్  ఫండ్స్  '' పెట్టుబడులు  మార్కెట్ ఒడుదొడు కు లకు  అనుగుణంగా నడుచుకుంటాయి , అదే  విధంగా  లాభ  నష్టాలను  అందిస్తాయి .   ఎవరి పెట్టుబడులకు  వారే బాధ్యులు . పెట్టుబడి పెట్టేముందు  దానికి సంభందించిన  డాక్యుమెంట్లను పూర్తిగా చదవండి , అలానే    మీ  ఆర్ధిక  సలహా దారులను సంప్రదించి  నిర్ణయాలు తీసుకోండి .  



Thursday, August 18, 2016

లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ కోట్లాది ప్రజలు నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో ఎందుకుంటున్నారు ? ఎక్కడుంది లోపం ? ఈ సమస్యకు పరిష్కారమేమిటి ?

ప్ర : లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ  కోట్లాది  ప్రజలు  నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో ఎందుకుంటున్నారు ? ఎక్కడుంది లోపం?  ఈ సమస్యకు పరిష్కారమేమిటి ?

జ :  లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ  కోట్లాది  ప్రజలు  నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో  ఉండడానికి ముఖ్య కారణం  "న్యాయ వ్యవస్థను  మించి , రాజకీయ  వ్యవస్థ  బలంగా  ఉండటం , మేధావులు , నిజాయితీ పరులు  రాజా కీయాలకు భయ పడటం , ప్రజలు కూడా  వారిని  గుర్తించక పోవడం , రాజకీయం లోకి వచ్చిన  కొద్ధి  మంది , తల పండిన  రాజకీయ నాయకుల  ధాటికి తట్టుకో లేక , వారి దారినే  నడవటం , పేద తనంలో మ్రగ్గు తున్న ప్రజలు  తాత్కాలిక  ప్రలోభాలకు , తాయిలాలకు  లొంగి పోవడం , వీటిని నియంత్రించే  పూర్తి  యంత్రాంగం  పత్రికలలో తప్పా , వాస్తవంగా  మన దేశంలో  లేక పోవడం. దానికి తోడు , చట్టాల లోని అవకాశాలను , మినహాయింపులను  చక్కగా సద్వినియోగం  చేసుకుంటున్నారు  " . 

భారత రాజ్యాంగ వ్యవస్థ  చాలా పెద్దది . ప్రపంచంలోనే  అతి  పెద్ద ప్రజా స్వామ్యం గల దేశం భారత దేశం . ఇలాంటి దేశంలో  సాధారణంగా  రాజకీయ వ్యవస్థకే అధిక ప్రాముఖ్యత ఉంటుంది . అందులో ఎలాంటి సందేహం లేదు . అయితే వచ్చిన చిక్కల్లా  , మెజారిటీ  నాయకులూ  ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నిక  కాగా పోవడమే . వాటికి సంబంధించిన  కేసులు  కోర్టుల్లో  యేండ్ల కొద్దీ  నానడమో , వీగి పోవడమో , సాక్షాలు ఆధారాలు లేక  కొట్టివేయడమో జరుగు చున్నది  . 

వీటి కారణంగా  నాయకుల బిడ్డలే నాయకులవ్వడమో , నాయకుల  కార్యకర్తలే నాయకులవ్వడమో  జరుగు చున్నది . కేవలం కళాభి మానంతో  సెలబ్రిటీలు నాయకులవ్వడమో జరుగుచున్నది . ఆ విధంగా  ధన వంతులే  ధన వంతులవుతున్నారు, పేద వారు మరింత పేద వారవుతున్నారు . కేవలం ఓటు బ్యాంక్  గా  మారు తున్నారు . వాళ్లు  విద్యా వంతులు  కావడం లేదు . వాళ్ళ హక్కులు వాళ్లకు తెలియడం లేదు .ఒక వైపు  విద్య లేదు , మరో వైపు పేద తనం . పేదలకు చట్టాల గురించి  ఏమాత్రం తెలియదు . రాజ్యాంగం గురించి అసలే తెలియదు .  ఇక వారికి  లక్షల కోట్ల  ప్రభత్వ సంక్షేమ పధకాల గురించి  అడిగే ధైర్యం ఎలా వస్తుంది . దానికి తోడు రోగాలు , నొప్పులు . దానికోసం మరిన్ని అప్పులు , దానికి తోడు వడ్డీలు . ఈ కారణంగా  కోట్లాది  ప్రజలు నీరు పేదలుగానే , అడుక్కుతినే వారు గానో  కాలం ఎల్ల దీస్తున్నారు , కాటికి దగ్గరవుతున్నారు .  

ఈ సమస్యకు చక్కెటి పరిష్కారం ప్రజా స్వామ్య ఎన్నికల  సంస్కరణే  ,

01. ఓట్లకోసం  మరియు  ఎలాగో  నయాన్నో భయాన్నో  అధికారాన్ని సాధించడం కోసం ,  ప్రజలను , ఓటర్లను  ప్రలోభ పెట్టే  బహుమతులు , తాయిలాలు  ఇవ్వడం , బ్యాంకు అకౌంట్లకు  నగదు   జమ చేస్తామని వాగ్దానాలు  చేయడం , ఉద్యోగాలు  ఇప్పిస్తామని ఆశ చూపడం  మొదలైన వాటి మీద   కేంద్ర  ఎలెక్షన్  కమీషన్  మరియు అన్ని రాజ్యాంగ  వ్యవస్థలు  ద్రుష్టి పెట్టాలి . దృష్టి పెట్టడం కాదు  పూర్తిగా నిషేధించాలి .     

02. ప్రజలకిచ్చిన  వాగ్ధానాలకనుగుణంగా  నడుచుకోని  నాయకులను , 6 నెలల తరువాత  ఎప్పుడైనా కాల్ బ్యాక్ చేసే అది కారం  ప్రజలకు  చట్ట బద్ధంగా  కల్పించాలి .

03. అవినీతి పరంగా ఎన్నికైన  నాయకులను  కనీసం  5 సంవత్సరాలైనా   ఎన్నికలకు దూరం పెట్టాలి .  

04. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా  రాజకీయ నాయకుల కేసులను , 1 నుండి 3 సంవత్సరాల లోపే  తీర్పులు వెలుబడాలి . 

05. ప్రతి 6 వ  సంవత్సరం  రాష్ట్రపతి పాలన  ఉండే విధంగా  రాజ్యాంగాన్ని సవరించాలి . 

06. రూ . లు . 1000/- కోట్ల రూపాయల నిధితో  ప్రత్యేకమైన  ఇంటిలీజెన్స్  ను ఏర్పాటు చేయాలి . దీని లోనే సి బి ఐ , ఏ సి బి , ఎన్ఫోర్స్  మెంట్ , ఇంటిలీజెన్స్  కల్సి పోవాలి . వీరికి  పూర్తి  అద్దికారాలు ఉండాలి . ఏ కేసును డీల్ చేసినా , డైరెక్టుగా  కోర్టులోనే వేయాలి  గాని , రాజకీయ నాయకుల చేతిలో పెట్టకూడదు . ( ప్రస్తుతం ఎలా జరుగుందంటే  కేసులను  పీక్ లెవల్  కు తీసుకు వచ్చి , కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఛేదించి , మీడియాను , ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి , కాల గర్భము న  కలిపేస్తున్నారు . ఇది  ప్రజలకు  మరో రకమైన సందేశాన్ని పంపిస్తుంది . ఆపై  షరా మామూలే ). 

07. సెలబ్రిటీలకు  ఎన్నికలకు రావడానికి  కనీసం 5 సంవత్సరాలముందు  వారి వారి కళలకు  దూరంగా  ఉండాలి . 

08. చట్టం  ముందు అందరూ సమానులే  అనే భావం ప్రజలలో కల్పించాలి . 

09. ప్రస్తుత  పరిస్థితులకు  అనుగుణంగా  80 సం . రాలు నిండిన  రాజకీయ  నాయకులను  ఎన్నికలకు  అనర్హులుగా  ప్రకటించాలి . 

10. ఎం.ఎల్ .ఏ  లకు , ఎం . పి  లకు  ప్రతి  సం . రం . ఇచ్చే నిధులకు  ప్రతి రూపాయికి  లెక్క పారదర్శకంగా  ఉండాలి .  ప్రతి ఓటరు కు అడిగే హక్కు ఉండాలి .   

11. నల్ల ధనాన్ని  వెలికి తీసి  కొంత  అభివృద్ధికి , ఉపాధి కల్పన కు , మరికొంత  పేద ప్రజలకు ఇచ్చిన  వాగ్ధానం  ప్రకారం  పంచాలి . 

12. ప్రతి ఒక్కరికీ , ఓకే ఆధార్ కార్డు , ఒకే ఓటర్ కార్డు , ఒకే పాన్ కార్డు, ఒకే  బ్యాంక్  అకౌంట్ , ఒకే సెల్ నెంబర్ , ఒకే డ్రైవింగ్ లైసెన్స్ , ఒకే పాస్ పోర్ట్ , ఒకే టిన్ నెంబర్ , ఒకే  'టాన్' నెంబర్ , ఒకే  సర్వీస్ టాక్స్  నెంబర్  ఉండే విధంగా కట్టడి ( నిర్బంధం )  చేయాలి . అప్పుడే నల్ల ధనం  అరికట్ట బడుతుంది .  అప్పుడే  పన్నులు ఎగ్గొట్టడం  ఆగి పోతుంది .  అప్పుడే అవినీతి తగ్గు తుంది . ( ఒకే బ్యాంక్  నెంబరుతో  ఏ  బ్యాంకు సేవలకైనా  మారే  విధంగా , ఒకే  సెల్ నెంబర్ తో  యే  సర్వీస్ ప్రొవైడర్ కైనా  మారే  విధంగా  వెసులుబాటు కల్పించాలి) .

13. స్వాతంత్ర్యం  మనకు సిద్ధించి  70 సం . రాలు కావస్తున్నది . ఇక నైనా  రాజ్యాంగాన్ని  సవరించి , దేశం లోని ప్రజలను  కేవలం  " పేదలు - ధనికులు "  అను రెండు భాగాలుగా మాత్రమే విభజించి , పేదలను  అన్ని రకాలుగా   అభి వృద్ధి చేయాలి .  ఇక్కడ    " పేదలు - ధనికులు " అంటే  అన్ని కులాల వారు  , అన్ని వృత్తుల పేద ప్రజలు ఉంటారు . ధన వంతుల  కులాల్లో  పుట్టడమే  వారికి  జీవితాంత పాపమో , శాపమో  కారాదు . పేదలు  ఆ విధంగా పుట్టడం నేరం కాకూడదు .  

నేను  సూచించినవి  అమలు చేస్తే  తప్పకుండా  ఆర్ధిక సమానత్వం ఏర్పడుతుంది . అవినీతి తగ్గుతుంది . నల్లధనం తగ్గు తుంది . నల్ల దనం బయటకు వస్తుంది . పెదాలు , అడుక్కు తినేవారు  మన దేశంలో కనుమరుగవుతారు . 



Monday, August 15, 2016

సాడే సాత్ శని ( SADE SATH SHANI) అంటే ఏమిటి ? దీని వలన సమస్యలు ఏమిటి ? నివారణ చర్యలు ఏమిటి ?

ప్ర . సాడే సాత్  శని ( SADE SATH SHANI)  అంటే  ఏమిటి ? దీని వలన  సమస్యలు  ఏమిటి ? నివారణ  చర్యలు  ఏమిటి ?


జ. నవ  గ్రహాలలో  ' శని గ్రహం  ' ఒకటి . శని  సూర్యుని  పుత్రుడు . అయినా  జ్యోతిష్యంలో   శని  సూర్యుడి కి శత్రువనే   చెబుతారు . సాడే సాత్  శని ( SADE SATH SHANI)  అంటే  "ఏడున్నర  సంవత్సరాల  కాలం  శని "  అని అర్ధం .  దీనినే  ఏల్నాటి  శని  అని కూడా అంటారు .  ప్రతి జాతకుడికి  ఇది అత్యంత కష్ట కాలం  అని  చెబుతారు . దీనిని  ఎవరూ  తప్పించుకోలేరు . ప్రతి  జాతకుడి  జీవిత కాలంలో శని సంచారం అనేది  కనీసం  2 సార్లయినా  వస్తుంది . సాధారణంగా  ప్రతి రాశి లో  రెండున్నర  సంవత్సరాలు  శని  ఉంటుంది .  ఆ విధంగా  12 రాశులు  తిరిగి రావడానికి  శని కి 30 సంవత్సరాలు  పడుతుంది .    అయినా సరే  జాతకులెవ్వరూ  ( ప్రజలెవ్వరూ )  ఏల్నాటి  శనికి  భయ పడ  నవసరం లేదు . ఇది సహజంగా  ప్రతి  ఒక్కరికీ  అనుభవం లోకి  వచ్చేదే .  ఎవరూ దీని నుండి  తప్పించు కోలేరు . శని అన్ని సార్లు  , అందరికి చెడు  మాత్రమే చేస్తాడనుకోనవసరం  లేదు . మంచి కూడా చేస్తాడు . శని కష్ట జీవి . శ్రామికుడు.   మన చేత కష్టాలను చూపిస్తాడు . కష్టానికి తగ్గ ఫలితాలను  చూపిస్తాడు . అందుకని  శని దశాలకైనా , ఏల్నాటి శని కైనా , అర్దాష్టమ , అష్టమ శనికైనా  పని గట్టుకుని  భయ పడ  కూడదు . ఏ గ్రహ సంచారం ఆ గ్రహం  చేసుకుంటూనే  పోతుంది . మండే ఎండను ఎవరు ఆప గలరు  చెప్పండి . కుంభ వృష్టిని ఎవరు ఆపగలరు  చెప్పండి . చల్లని వెన్నలను ఎవరు ఆప గలరు చెప్పండి , భూ కంపాలను ఎవరు ఆపగలరు చెప్పండి . మనం చూస్తూ అనుభ వించాలి , ఆస్వాదించాలి తప్పా భీతి చెంద కూడదు . దేన్ని  నమ్మినా  నమ్మక పోయినా  గ్రహాల శక్తిని అందరూ ఒప్పకుంటారు . ఎందుకంటే  మనకు ప్రతి రోజూ  గ్రహాల శక్తి గురించి కళ్లారా చూస్తున్నాం . అనుభవిస్తున్నాం . ప్రతి రోజూ  సూర్యుడు , తూర్పు దశనే , కరెక్ట్ సమయానికి ఉదయిస్తాడు . మనమూ లేస్తాం . సాయంత్రం  కరెక్ట్  సమయానికి  హస్త మిస్తాడు .  మనమూ పడుకుంటాం . అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి  మనం  విడియా సమయాలలో పనులు చేసు కుంటాం . సూర్యుడు ఎండను ఇస్తాడు . వర్షాన్ని  కురిపిస్తాడు . రోగాలను పుట్టిస్తాడు . రోగాలను నయం చేస్తాడు . అలానే  చంద్రుడు వెన్నెలను , చల్ల దనాన్ని  కల్పిస్తాడు . అలానే భూమి పుత్రుడు కుజుడు ( అంగారకుడు ), బుధుడు , శుక్రుడు , గురుడు , శని  మరియు  రాహు కేతువులు . 

అందుకని  శని దోష నివారణ కని , శాంతి కని  వేలు , లక్షల రూపాయలను  మరెవ్వరికో దోచి పెట్ట నవసరం లేదు . "ఏల్నాటి శని " వచ్చిందని ఏవో కొంపలు మునిగి పోతాయని వైరాగ్యానికి , నిరాశకు  గురి కా నవసరం లేదు . భయ పడవలసిన  అవసరం అంతకూ  లేదు .  కొన్ని  ఇబ్బందులకు  గురి చేస్తుందని ముందుగానే  కొంత  అవగాహన  తెచ్చుకుని , ఎవరికీ వారే కొన్ని  జాగ్రత్తలు తీసుకుంటే  చాలు .  గతంలో ఒక రాజు  నాకు శని ఎలా పడుతుందో చూస్తా  అని  పోయి  చెట్టు  తొర్ర లో  దాక్కున్నాడట . ఆ తొర్రలో దాక్కుండటమే  శని పట్టడమని తరువాత గాని తెలుసుకోలేక పోయాడు . జ్యోతిష్య శాస్త్ర ప్రకారం  ఒక సిద్ధాంతాన్ని  గురించి  చెబుతారు  మన  జ్యోతిష్య  పండితులు , అనుభవజ్ణ్యులు . అదేమంటే  " ప్రారబ్ధ కర్మల ''  నుంచి ఎవ్వరూ  తప్పించు  కోలేరు . ఇంకా చెబుతారంటే   " ప్రారబ్ధ  కర్మలు  విడిచిన  బాణం  లాంటివి " అని . వీటి   అర్ధం  ఏమిటంటే ,' ఎన్ని వేలు , లక్షలు  ఖర్చు పెట్టినా ,  వచ్చే  సమస్యలను  ఎవరూ  తప్పించ లేరు'  అని అర్ధం .  ప్రతి జాతకుడి  జీవితంలో  కనీసం  2 సార్లు  సాడే  సాత్ శని   వస్తుందనేది కూడా  మనం తెలుసుకున్నాం.  అలాంటప్పుడు  జాతకులు భయ పడాల్సిన అవసర మేమిటి ?   వేలు  , లక్షలు  ఇతరులకు  దోచి పెట్టడం దేనికి ? .   కొన్నింటిని  మాత్రం గుర్తుంచుకోవాలి . అవి మన పురాణ  కాలం నాటి సామెతలు . ఒక సామెత  కోట్లాది జనుల అనుభవ సారమని చెప్పుకోవచ్చు . అవి ఏమంటే  " ధనమ్ మూలం మిదం జగత్ " " ధనమేరా అన్నిటికి మూలం " " డబ్బుకు లోకం దాసోహం " .వీటి అర్ధం ఏమంటే డబ్బును దండిగా పొదుపు చేసుకుని  పెట్టుకోవాలి . ఏ  అవసరాలకయినా , ఆపదలకైనా డబ్బే కావాలి .  నిజాయితీగా   డబ్బు  సంపాదించి  పొదుపు , క్రమశిక్షణ  గల   వారికి  గర్వం ఉండదు . వినయ విధేయతలు కలిగి ఉంటారు . దాన గుణం ఉంటుంది . ప్రేమాభి మానాలు ఉంటాయి . నలుగురితో  అనుబంధాలుంటాయి , సత్సంభందాలుంటాయి . భక్తి భావాలు ఉంటాయి . అన్నిటికి మించి  మంచి ఏదో  చెడు  ఏదో   వీరికి  బాగా  తెలిసి  ఉంటుంది . ఆరోగ్యం పై  మంచి శ్రద్ద ఉంటుంది . అన్నిటి కి కావాల్సింది  డబ్బు . సరి పడా డబ్బు కూడా  పొదుపు చేసుకునే ఉంటారు .    ఇన్ని సుగుణాలు ఉన్న వీరికి  శని ఏమి చేస్తుంది చెప్పండి  . శని ప్రభావం వీరికి ఎంత మాత్రం కన పడదు . 

'సాడే  సాత్  శని '  ప్రభావం  ప్రతీ సారి, ఒకే సారీ   3 రాశుల జాతకులపై  ఉంటుంది .  ఒక రాశిలోకి   శని  ప్రవేశించిందంటే  దాని ప్రభావం  దాని ముందు రాశిపై  మరియు దాని  వెనుక రాశిపై  ఉంటుంది . సామాన్యులకు  కూడా అర్ధ మయ్యే విధంగా  చెప్పాలంటే , శని  ఒక రాశిలోకి  వచ్చి మండుతుందంటే , దాని మంట  సెగ దాని ముందు రాశికి  తగులుంది . అలానే దాని వెనుక రాశిలో మండి  మండి  వచ్చింది కాబట్టి , దానిలోని  బొగ్గుల వేడి  అలానే  ఉంటుంది కదా .  ఆ విధంగా  ప్రతి సారి  ' సాడే  సాత్  శని '  ప్రభావం  3 రాశులపై ఉంటుంది . అలా  3 x 2 1/2 = 7 1/2 సంవత్సరాలు  ఏల్నాటి  శని  అంటారు . ప్రస్తుతం  వృచ్చిక రాశిలో  శని ఉంది  (27 జనవరి 2017 వరకు ) . దాని ప్రభావం , దాని ముందు రాశి అయిన  ధనుస్సు లోను , అలానే  దాని వెనుక  రాశి అయిన  తులా రాశి లో , సాడే సాత్  శని  ఉంది అని చెబుతారు . మరో విధంగా  చెప్పాలంటే  జాతకుడి  రాశి నుండి  లెక్క బెడితే  12,1,2,4 మరియు 8 వ  స్థానాలను  సాడే  సాత్  శని గా  చెప్పుకోవచ్చు .  12, 1, మరియు  2 ను సాడే  సాత్  గా , 4 ను  అర్దాష్టమ   శనిగా  మరియు 8 వ స్థానాన్ని  అష్టమ శనిగా  చెబుతారు . 

తరువాత  అనగా  27 జనవరి ,2017  శని  ధనుస్సు రాశి లోకి ప్రవేశిస్తుంది . అప్పుడు  సాడే  సాత్  శని  ప్రభావం  ధనుస్సు రాశి లోను , దాని ముందు రాశి అయిన మకర రాశి లోను (27 జనవరి , 2017 నుండి )   మరియు దాని వెనుక రాశి అయిన వృచ్చిక రాశి పైనా  ( మిగిలిన కాలం )  శని ప్రభావం ఉంటుంది .  

అలానే  మేష రాశి జాతకులకు , మేష రాశికి 8 వ  రాశి  వృచ్చిక రాశి  ' అష్టమ శని ' అవుతుంది .  మనకు తెలుసు , శని అనేది  ఒక  అశుభ గ్రహం . శక్తి వంతమైనది . ఒక్కో స్థానంలో ఉన్నపుడు  ఒక్కో ప్రభావాన్ని చూపెడుతుంది . కొన్ని గ్రహాలతో కల్సి ,  ఒకే  రాశిలో  ఉన్నపుడు    దాని ప్రభావం  ఎన్నో రెట్లు  పెరుగుతుంది . ఉదా : కుజ శని  కల్సి ఉండటం , రాహు  శని కల్సి ఉండటం , రవి శని ,  శని కేతు  కల్సి ఉండటం  మొదలైనవి .  అలానే  శని , రాహు , కుజ , రవి  వరుసగా ఉండటం  మొదలైనవి .  ముఖ్యంగా  శని ఏ రాశిలోనైతే  సంచరిస్తుందో ఆ రాశి జాతకులపై , అధిక  శని ప్రభావం ఉంటుంది  .  ప్రస్తుతం  శని వృచ్చిక రాశిలో  సంచరిస్తుంది.

చంద్ర స్థానం నుండి  ( రాశి నుండి ) లెక్కించి నపుడు  12, 1, 2, 4 మరియు  8 వ స్థానం , జాతకుడికి  అత్యంత  ప్రమాద  కరమైన టు వంటి గ్రహం శని గ్రహం .

' సాడే  సాత్ శని '  వలన సమస్యలు ఎలా ఉంటాయి ?

01. శని  12 వ ఇంటిలో ఉన్నపుడు ( మీ రాశి నుండి ) , వృధాగా డబ్బు ఖర్చు అవడం , ఖర్చులు పెరగడం , ఉద్యోగాలు పోవడం  లేదా ఆటంకాలు  కలగడం . 

02. శత్రువులు  పెరగడం . 

03. జైలు పాలు  అవ్వడం , పోలీస్టేషనులకు వెళ్లడం , కోర్టుల చుట్టూ  తిరగడం . 

04. బంధువులు మిత్రుల నుండి  ఆపదలు  పొంచి ఉండ వచ్చు . అనారోగ్యం  పాలు కావచ్చు  లేదా  ప్రాణి హాని ఉండ వచ్చు .  

05. శని 1 వ ఇంటిలో ఉన్నపుడు ,  మానశిక ఆందోలన , వైరాగ్యం  ఏర్పడ వచ్చు . మనిషి పిచ్చి పిచ్చి అయి పోవచ్చు . జ్ఞ్యాపక  శక్తి  తగ్గి పోతుంది. తప్పుడు తీర్పులను  ఇస్తారు . వైవాహిక  జీవితంలో  అసంతృప్తి  ఉంటుంది . భార్యా  భర్తల  కొట్లాటలు , దూరం దూరం  ఉండటం ,  విడాకుల వరకూ వెల్ల  వచ్చు అని అంటారు. అయితే  అన్నింటికి  ' సాడే  సాత్  శనే ' కారణం అనుకోవడం పొరపాటు . భార్యా  భర్తల మన: స్పర్ధలు ఎప్పటినుండో ఉండవచ్చు . కారణాలు మరెన్నో ఉండ వచ్చు . నేడు  ఎలాంటి   ' సాడే  సాత్  శని  ' లేకుండానే  వందలాది కుటుంబాలు  కుప్ప కూలి పోతున్నాయి . దానికి కారణం  నేటి  సాంకేతిక అభి వృద్ధి , గ్లోబలైజేషన్ , పాశ్చ్యాత్య  పోకడలు , టీ  వీ  లు , సినిమాలు , ఇంటర్ నెట్ , సెల్ లు ,  అందరూ విద్యావంతులు కావడం , ఉద్యోగాలు చేయడం , డబ్బు సంపాదించు కోవడం , ఎవరి వారు కోరుకున్న విధంగా జీవితాన్ని ఎంజాయ్  చేయాలనుకోవడం , అలాంటి అవకాశాలు సమాజంలో  ఉండటం , ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు . 

06. శని 2 వ ఇంటిలో ఉన్నప్పుడు ,  ఆర్ధిక ఇబ్బందులు  కలుగు తాయి . వ్యాపారంలో నష్టాలు  రావచ్చు .  సరియయిన  సమాచారం లేక మన స్పర్ధలు  రావచ్చు . 

07. శని  4 వ ఇంటిలో ఉన్నపుడు , కుటుంభం సమస్యలు  ఉంటాయి . తల్లి దండ్రులకు  అనారోగ్యం కలుగ వచ్చు . మరియు  స్త్రీ ల  వలన సమస్యలు ఏర్పడ వచ్చు .  

08. శని  8 వ  ఇంటిలో  ఉన్నపుడు , ఆర్ధిక సమస్యలు , లీగల్  సమస్యలు , దీర్ఘ రోగ సమస్యలు  లేదా ప్రాణ హాని ఉండవచ్చు అని  జ్యోతిష్యం చెబుతుంది . 

'సాడే  సాత్  శని' కి  దోష నివారణ చర్యలు  ( REMEDIES) :

01. ముందుగా 'సాడే  సాత్  శని'  గురించి పూర్తిగా అవగాహన పెంచు కోవాలి .  ప్రస్తుతం  తులా , వృచ్చిక , ధనస్సు  రాశులలో  ' సాడే  సాత్  శని ' నడుస్తుంది .  జాతకుల రాశి నుండే  ఎవరికీ వారే   12, 1,2, 4, 8 వ రాశులను లెక్క పెట్టు కోవచ్చు . నివారణ చర్యలను  చేపట్ట వచ్చు .  ఆర్ధికంగా బలంగా  ఉంటే  ' సాడే  సాత్  శని ' ప్రభావం  పెద్దగా   మన మీద కన బడదు  . ఎప్పటి నుండో  ఉన్న దీర్ఘ రోగాలకు  , సమస్యలకు  ' సాడే సాత్  శనే ' కారణం అని భయ పడ నవసరం లేదు .   

02. ఆయా జాతకులు ఓపికను పెంచు కోవాలి . కోపాన్ని తగ్గించు కోవాలి . పూర్తి సమా చారం  వచ్చిన తరువాతనే జాగ్రత్త గా మాట్లాడాలి . ప్రశాంతంగా ఉండటం  మెల్ల మెల్లగా  అలవరచు కోవాలి . వత్తిడిని  , అధిక పని భారాన్ని తగ్గించు కోవాలి . తొందర పాటు  తనాన్ని ధరి చేయ నీయ రాదు . 

03. మెడిటేషన్  అలవరచు కోవాలి , వ్యాయామం  అలవర్చుకోవాలి . సరి పడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి . వీటికేమి డబ్బులు  ఖర్చు  కావు కదా . 

04. కుటుంబంలో  అన్ని విషయాలలో  అడ్జస్ట్ బుల్  తనాన్ని పెంచు కోవాలి . నా మాటే చెల్లా లని ఘర్షణకు  దిగ రాదు . 

05. ఇంకా సమస్య అధికంగా కన బడితే , సాడే  సాత్  శని కాలంలో , శని గ్రహ పూజను  ప్రతి శని వారం చేయడం గొప్ప నివారణ చర్య అవుతుంది . పూజ  చేయు నపుడు  శని గ్రహం మీద  ఒక నల్లని  కొత్త బట్టను కప్పి , దానిపై  మెల్లగా ఒక లీటర్ నువ్వుల నూనెను   పోయాలి . నల్లటి నువ్వుల గింజలను  100  గ్రాములు తీసుకుని  మెల్లగా శని గ్రహం  పై జార విడువాలి .  ఆ తరువాత శని గ్రహం చుట్టూ  8 ప్రదక్షణలు చేయాలి . 

06.  కిలోమ్బావు నల్ల నువ్వులను  తీసుకుని , మీటరుంబావు నల్లగుడ్డను , ఒక ముక్క నల్ల బెల్లం , ఒక ఇనుప  మొలను  మరియు ఒక స్టీల్ కాయిన్ ( రూపాయి లేదా రెండు రూపాయల బిల్ల)  కల్పి ఏదయినా  గుడిలో ఒక  నల్ల పూజారికి  శని వారం దానం  చేయాలి . అయితే ఎంతో కొంత  సంభావన  లేకుండా  పూజారి  శని దానం తీసుకోడు . 

07. శని గ్రహ మంత్రాన్ని  ఈ  ' సాడే  సాత్  శని ' కాలంలో  80 వేళా సార్లు పఠించాలి . 

08. శివ పంచాక్షరీ మంత్రాన్ని మరియు ' మహా మృత్యుంజయ ' మంత్రాలను పఠిస్తూ  శివుడిని  పూజించాలి . 

09. పక్షులకు  ముఖ్యంగా  కాకులకు  ధాన్యాలను  వేయాలి . 

10. నల్ల చీమలకు  చక్కెరను గాని , తేనె ను గాని  తినిపించాలి . 

11. ప్రతినిత్యం  శని కవచం  పఠించాలి . 

12. రామాయణ కాలంలో  దశరథుడు  పఠించిన  '; శని  స్త్రోత్రాన్ని  ' పఠించాలి . 

13. హనుమాన్  చాలీసాను  ప్రతి రోజు పఠించాలి . 

14. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే విధంగా  చూసు కోవాలి .  ఎదో ఒక వ్యాపకం లో  నిమగ్న మవ్వాలి .  కళలను  అభివృద్ధి చేసు కోవాలి . 

15. ప్రతి రోజు  కనీసం 3 సార్లు  " నీలాంజనం  సమా భాసం , రవి పుత్రం  యమా గ్రజం , 
ఛాయా మార్తాన్ద సంభూతం , తం నమామి శనైశ్చరం "  అని  పఠించడం వలన  శని గ్రహన్ని   శాంతింప   చేయ వచ్చు . 

వీటిలో ఏవో కొన్ని చేసినా  ఫలితం ఉంటుంది . 

" సర్వే  జన : సుఖినో భవంతు "