Saturday, May 11, 2024

భారత దేశ ఆశా జ్యోతి శ్రీ నరేంద్ర మోడీ

 లఘు కవిత


శీర్షిక: భారత దేశ ఆశా జ్యోతి
శ్రీ నరేంద్ర మోడీ
(ప్రక్రియ: మణి పూసలు
రూపకర్త: శ్రీ వడిచర్ల సత్యం గారు)
01.
పేద తనమున పుట్టాడు
టీ అమ్మి జీవించాడు
దామోదర్ దాస్ మోడి
హీరాబెన్ లా తనయుడు
02.
కార్యదక్షత గలవాడు
గొప్పా త్యాగ శీలుడు
మానవతా వాదియు
అద్వితీయ దార్శనికుడు
03.
దేశభక్తిగల ధీరుడు
పోరాటాలా యోధుడు
ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త
నిత్యా చైతన్య పరుడు
04. 
మహా జ్ఞానవంతుడు
అతి నిరాడంబరుడు
నిస్వార్ధ పరుడేకాదు
నిజాయీతీ పరుడు
05.
బహుభాషా కోవిదుడు
కవి రచయిత ,పండితుడు
విశ్వ జనుల ఆలంబన
గొప్ప ఉపాన్యాసకుడు
06.
గొప్ప సంస్కరణవాది
మహా వేదాంత వాది
నివురుగప్పిన నిప్పు
మంచి మానవతవాది 
07.
చేయును నిత్యం ధ్యానం
అమ్మంటె పంచ ప్రాణం
విదేశాల్లో ముఖ్యులకు
యిచ్చు గీత బహుమానం
08.
గుజరాత్ లో ముఖ్యమంత్రి
దేశ విదేశాన మైత్రి
మౌన మునిగా నేడు
భారతప్రధానమంత్రి
09.
తలాక్ ను రద్దుచేసాడు
కశ్మీరు కలిపేశాడు
ఆర్ధిక పరిస్థితులనూ
గాడిలోనా పెట్టాడు
10.
నల్లధనం అరికట్టను
అవినీతిని తగ్గించను
పెద్దనోట్ల రద్దుచేసి
కొత్తవి, ప్రవేషపెట్టెను
11.
కరోనాను అరికట్టిరి
ప్రజలనెల్ల ఆదుకునిరి
అందరినీ ఒప్పించి
అయోధ్యనూ నిర్మించిరి
12.
పెంచె జగతిలో ఖ్యాతి
పెట్టె శత్రువుకు భీతి
దేశ జనుల రక్షకుడు
భారత ఆశా జ్యోతి

Wednesday, May 8, 2024

దిక్కు లేని పక్షులు

 లఘు కవిత

శీర్షిక: *దిక్కు లేని పక్షులు*
ప్రక్రియ: మణిపూసలు
(రూప కర్త: శ్రీ వడిచర్ల సత్యం )

పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
చిన్న మనస్పర్ధలొచ్చె
విడిపోయె కుటుంబం!

సంపాదనకనీ పోయె
అవకాషముందని పోయె
నీవెంతని అహము తోటి
భర్త భార్య నొదిలి పోయె!

సంపాదనలొ పడిపోయె
త్రాగుడుకు బానీసాయె
కుటుంబాన్ని మరవడంతొ
అనుబంధం దూరమాయె!
అందముందని పోయే
వయసుఉందని పోయే
భార్య భర్తపై అహముతొ
పక్కోడితొ లేచిపోయె !

మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
తరిమి తరిమి కొట్టెనే!

సమస్యలూ సహజము
అందరికవి నిత్యము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండేడిది ఫలితము !

ఉభయులకూ అర్ధమాయె
కాలమంత గడిచిపోయె
కోర్టుల చుట్టూ తిరుగుతు
దిక్కు లేని పక్షులాయె !

మానవ నైజం

 వచన కవిత

శీర్షిక: మానవ నైజం

మనిషీ తినేది ఒక మెతుకు
దాని కొరకు నిత్యం వెతుకు
ఆపై  చేస్తాడొక సొతుకు
పరువు పోయాక ఎందుకు ఆ బతుకు !

పొగిడించుకోవాలని ఆశ
పొగడక పోతే నిరాశ
లేదంటే రోజంతా దుర్భాష
అసహనంతో వెళ్ళగక్కుతారు గోస!

తాను చేస్తే సంసారం
అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం
మనిషికి మనిషిపై ఎందుకో అసహనం
తోటి వారిపై ఎందుకో కోపం
ఇదే మానవ నైజం!

నీచులకుండదు ఏ ఆశయం
ప్రతి దానికీ ఏదో ఒక సంశయం
రోజంతా త్రాగుతారు కషాయం
తోటి వారిపై కప్పుతారు విషవలయం!

తుమ్మ చెట్టైనా ఇచ్చు మేత మేకకు
మర్రిచెట్టైనా ఇచ్చు నీడ మనిషికి
తులసి మొక్కైనా పోయు ప్రాణం, పోయే జీవికి
కానీ కుటిలుడు,
క్షణం క్షణం లాగుతుండు ఎదిగే వారిని!

పాముకు కోరల్లోనే విషం
తేలుకు కొండిలోనే విషం
కుక్కకు పండ్లలోనే విషం
కానీ , మనిషికి నిలువెల్లా విషం

ప్రకృతి అనేది ఒక శక్తి
దాని ముందర మనిషి ఒక వ్యక్తి
పెంచుకోకూడదు ప్రతి దానిపై ఆసక్తి
సద్వినియోగపరుచు కోవాలి యుక్తి
పరమాత్మ పై పెంచాలి భక్తి
దొరుకుతుంది రేపు  ముక్తి !