Thursday, December 3, 2020

జి .హెచ్ .ఎం .సి ఎన్నికల(డిసెంబర్ ,2020)లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి?

;
ప్ర: జి .హెచ్ .ఎం .సి ఎన్నికల (డిసెంబర్,2020) లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS, DECEMBER,2020 ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి? 

జ:ఎన్నికల సందర్భంగా , ఎన్నికల కమీషన్ మరియు మీడియా అనేక రకాలుగా , అవగాహనా కల్పించినా , ప్రోత్స హించినా , బాధ్యతను గుర్తు చేసినా ,ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గడానికి " కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్లు ", అనేక కారణాలున్నాయి. డిసెంబర్ ,2020 లో జరిగిన జి .హెచ్ .ఎం .సి ఎన్నికలలో , స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చెప్పిన ప్రకారం , మొత్తం ఓటర్ల సంఖ్య , 74 లక్షల 67 వేల 256 . (ఇది కాన్స్టిట్యూఎన్సీ లిస్ట్ ) 43 శాతం పోలింగ్ జరిగిందని అంటున్నారు . అంటే ఓటర్ల సంఖ్య సుమారుగా 32 , 10 వేల 920 అన్నమాట . ఎన్నికల లిస్టులు చూస్తే , కనీసం 20 శాతం ఓటర్లు డిలీట్ అయినవి . 20 శాతం అంటే 14 లక్షల 93 వేల 451 ఓటర్లను డిలీట్ చేశారు. కరోనా వలన , సాఫ్ట్వేర్ ఇంజినీర్లు , ఇతరులు సుమారుగా 10 లక్షల మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. లేదా గ్రామాలకు వెళ్లి పోయారు. ఇక కనీసం 2 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ కార్పొరేషన్ లిస్ట్ ల లోకి వెళ్లి పోయారు . వీటిని తీసివేస్తే జి .హెచ్ .ఎం సి . ఓటర్ల సంఖ్య - 47 లక్షల 73 వేల 805 ఓటర్లు . ఇక పాలయిన ఓట్ల సంఖ్య - 32 లక్షల 10 వేల 920 . ఈ లెక్కన పోలింగ్ శాతం చూస్తే - 67 . 26 శాతం పోలైనట్లు లెక్క. 

  పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు
1. చాలా మంది పేర్లు , ఒకటి కంటే ఎక్కువగా నమోదు కావడం . ఆన్ లైన్ ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా . కరెక్క్షన్స్ కోసం అవకాశం కల్పించడం వలన , అన్ని రకాలుగా సబ్మిట్ చేసారు . తక్కువ సమయం , సిబ్బంది కొరత మొదలైన కారణాల వలన , పాతవి అలానే వుంచి క్రొత్తగా మరల రిజిస్టర్ చేయడం లాంటివి జరుగు చున్నవి. ఫోటోలు మారడము , పేర్లు , అడ్డ్రస్సులు తేడాగా వుండటం వలన , లిస్టులో నుండి రిమువ్ చేయలేక పోతున్నారు. 
2. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు వారి స్వస్థాలాలోనే కాకుండా , మరల ఇక్కడ కూడా నమోదు చేసుకుని ఉండి ఉండొచ్చు. రెండు సార్లు వేయకుండా , ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు చేపట్టక చేపట్టక పోవడం వలన , ఇక్కడి ఎన్నికలలో పాల్గొన కుండా ఉండటాన్ని కొట్టి పారేయ లేము. 
3. చాలా మంది అర్హత ఉన్న అనేక ఏండ్లు గా ఉంటున్న ఓటర్లను , అనేక కారణాల వలన ఓటర్ల లిస్టుల నుండి తొలగించడం జరిగింది . ఆ కారణంగా చాలా మంది ఓటర్లు, వారి ఓటు హక్కు వినియోగించు కోలేక పోయారు .
4. చాలా మంది ఓటర్లకు , ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్పులను ఇవ్వడం లేదు . అందు వలన మరియు పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలియక , ఓటు వేయలేక పోయారు .  
5. గ్రేటర్ హైదరాబాదు లో , వివిధ కారణాల వలన అడ్డ్రస్సులు మారే వారు అధికం . అడ్డ్రస్సులు మారిన వారు , పాత అడ్డ్రస్సుల్లో ఉండరు కాబట్టి , ఎన్నికల స్లిప్పులు ఇవ్వడానికి అవకాశమే లేదు . ఆ కారణంగా కూడా కూడా కొంత మంది ఓటర్లు వోటు వేయ లేక , ఓటు శాతం తగ్గింది . 
 6. చని పోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో నుండి తొలగించక పోవడం వలన , నమోదయిన ఓటర్ల సంఖ్యా పెరిగి నట్లైంది. ఓటింగ్ శాతం తగ్గి నట్లైంది . 
7. ఈ మద్య కాలంలో నూతనంగా వెరయిటీ ఓటర్ ఐ డి కార్డులు ఇష్యూ చేసారు . వాటి మీద ప్రజెంట్ పోలింగ్ బూతు నెం . పార్ట్ నెం . స్థలం అన్నీ ఉన్నాయి . సులువుగా వీరిని బూతు లోకి అనుమతించ వచ్చు . కాని స్లిప్పులు లేని కారణంగా వీరిని బూతు లోకి అనుమతించ లేదు . తెలియక కొందరు , వాదించడం ఇష్టం లేక కొందరు , లాఠీలకు బయ పడి కొందరు వెను తిరిగి పోయారు . ఓటరు కార్డుల పైననే ఇవన్నీ ఉన్నాయని , ఇలా కొత్తగా ఓటరు కార్డులు పొందిన వారికి మరియు ఎన్నికల సిబ్బంది కి , ఎన్నికల కమీషన్ అవగాహనా కల్పించ లేక పోయారు . 
8. కొందరు అని వార్య కారణాల వలన , ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వలన , ఓటు వేయలేక పోయారు . 
9. మరి కొందరు అనారోగ్య కారణాల వలన , ఓటు వేయలేక పోయారు . 
10. ఇంకొందరు , ఓటు వేసినా , వేయక పోయినా వీరాభి మానుల కారణంగా ఎవరో ఒకరు గెలుస్తారు , మరల యదా విదే , అని ఎన్నికలంటే నిరాసక్తత , నిర్లక్ష్యO , అయిష్టత తో ఓటు వేయ కుండా ఉండ వచ్చు . 
11. డబ్బు , మందు ప్రభావం కొందరిలో ఉత్సాహాన్ని నింపుతే , మరికొందరిలో నిరుత్సాహాన్ని , ఇంకొందరిలో పగలు , కక్షలు , కొట్లాటలు పెంచి ఓటు హక్కు లను దూరం చేసాయి . 
12. కొన్ని చోట్ల పోలింగు బూతులు దూరంగా ఉండటం వలన ఓటు హక్కు వినియోగించు కోలేదు . 13. ఒకే కుటుంభ సభ్యులకు , తల్లి దండ్రులకు పాత కార్డుల ప్రకారం ఒక అడ్డ్రస్సు బూతు , కొత్తగా అవకాశం వచ్చిన పిల్లలకు కొత్త కార్డుల ప్రకారం మరో పోలింగు బూతు పడటం వలన , ఎవరో ఒకరు , లేదా అందరూ ఓటు వేయడం మిస్ చేసు కుని ఉండాలి .వృద్ధులను పోలింగ్ భూత్ లకు తీసుకపోవడం వీలు కాక పోవడం వలన. 
14. ఎండ ప్రతాపం మరియు నీరు , నీడ లాంటి సౌకర్యాలు కొరవవడం కూడా , ఎన్నికల శాతం తగ్గడానికి కారణం అయి ఉండాలి . 
15. వేరే ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉండటం , పోస్టల్ బ్యాలెట్ వోటు హక్కును వినియోగించు కోవడం మరిచి పోవడం మొదలగునవి , ఎన్నో కారణాలు , గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగు శాతం తగ్గ డానికి కారణ మయ్యాయి. 

ఎన్నికల కమీషన్ , ఎంతో దూరదృష్టితో వోటర్ కార్డు ప్రాముఖ్యతను గుర్తించి , ఓటరు నమోదు ప్రక్రియ ను ప్రారంభించింది . వోటరు కార్డు అనేది ఇప్పుడు ఒక "బహులార్ధక సాధక సాధనం " . బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వోటరు కార్డు నే అడ్గు తున్నారు . రేషన్ కార్డు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డు నే అడుగు తున్నారు . టెలి ఫోనుకు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . పాస్ పోర్టు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . డ్రైవింగ్ లైసెన్సు కు అప్లై చేయాలన్నా వోటరు కార్డు కావాలి. చివరికి వోటు వేయాలన్నా వోటర్ కార్డు కావాలి . ఇంత ముఖ్యమైన వోటర్ కార్డు , అప్లై చేసిన ప్రతి చోటా ఉంటాయి . అలాంటిది , వోటర్ లిస్టులో పేరు లేక పోతే , వోటర్ కార్డు విలువ ఏమిటి ?. వోటరు , వోటు వేయడానికి వెళ్లి నప్పుడు వోటు వేసే అర్హత లేదన్నప్పుడు ఎంత క్షోభకు గురి అవుతాడు . బ్యాంకు , పాస్పోర్ట్ , టెలిఫోన్, డ్రైవింగ్ అధి కారులు , ఏదేని అవసరం వచ్చి వోటరును వేడుకుదామనుకుని , వోటర్ లిస్టు వేడుకుతే , అందులో వోటరు పేరు లేక పోతే , ఇక ఎలా ముందు కెలుతారు ?. ఇక ప్రజలకవ్యవస్థలపై విశ్వాసం ఎలా కలుగుతుంది ? 

పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి ? 
1. ప్రతి ఇంటి ఇంటికి ఎన్నికల కమీషన్ నియమించిన సిబ్భందే వెళ్లి , అర్హులైన వోటర్ల గురించి , అనర్హులైన వోటర్ల గురించి ఖచ్చితమైన విచారణ జరిపి , తప్పుడు వోటర్లను , ఓటర్ లిస్టు నుండి తొలగించాలి . అలానే ఓటరు లిస్టులో లేని పేర్లను అక్కడికక్కడే ఫోటోలు దింపి , అప్లికేషన్లను తీసుకోవాలి . ఆ తరు వాత ఓటరు లిస్టులో నమోదు చేయాలి . 
2. విచారణకు నియమించ బడే సిబ్భంది , ఏమి చదివారు అనేది కాకుండా , ప్రజల భాషలు అర్ధం చేసు కోగలరా , మాట్లాడ గలరా , చదువ గలరా , వ్రాయ గలరా , విచారణ భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ గలరా అనేది పరిశీలించి నియమించాలి . 
3. మరణ ధ్రువ పత్రాలు ఇష్యూ చేసే జి. ఎచ్. ఎం సి నుండి వివరాలు సేకరించి, మరణించిన వారి పేర్లను ఓటరు లిస్టు లో నుండి తొలగించాలి . 
4. ఏ రాజ కీయ నాయకులకు , కార్య కర్తలకు , ఓటరు లిస్టులో పేర్లను తొలగించ డానికి , అవకాశం ఇవ్వ కూడదు . 
5. కేవలం గత ఎన్నికలలో ( వివిధ కారణాల మూలంగా ) ఓటు వేయ లేక పోయి నంత మాత్రాన , వారి పేర్లను ఓటర్ లిస్టులో నుండి తొలగించ కూడదు . 
6.ఒకసారి కంటే ఎక్కువ సార్లు లిస్టయిన పేర్లను , ఫోటోలను , అడ్డ్రస్స్ లను గుర్తిచే , కనీసం రాష్ట్ర పరిధిలో నైనా , సాఫ్టవేర్ ను ఉపయోగించి , డూప్లికేట్ ఓటర్లను గుర్తించి , అనలైజ్ చేసి , నిర్ధారణ చేసు కుని , అలాంటి వాటిని తొలగించాలి . 
7.ఎన్నికల కమీషన్ , కేవలం ఎన్నికల సమయాన్నే మొక్కుబడి గా హడావుడి చేయ కుండా , పూర్తి కాలం వోటర్ల నమోదు , వోటర్ల తొలగింపు పై దృష్టి సారించాలి . 
8. నిస్వార్ధంగా ఎన్నికలను జరిపించాలి . ప్రభుత్వ ఒత్తిడులకు లొంగ కూడదు. 
9. ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో గాని , ఈవీఎం లలో గాని , వీరిపై ఇన్ని క్రిమినల్ కేసులు , లేదా ఇతర కేసులు ఉన్నాయి అని ప్రచురించాలి . 
10. రిగ్గింగ్ కు పాల్పడినా , డబ్బులు పంచినా , మద్యం పంపిణీ చేసిన రాజకీయ నేతలను , మరో 5 సంవత్సరాలవరకు ఎన్నికలలో పాల్గొనకుండా చట్టాన్ని తీసుకుని రావాలి . ఆ చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో వారి పేర్లను ప్రకటించాలి . 
11. ఓటర్ల ద్వారా ఎన్నికై , వేరే పార్టీ లోకి చేరే వారిని , వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి . మళ్ళీ ఎన్నికల వరకు , ఎన్నికలలో పాల్గొనకుండా చేయాలి . 
12. ఎవరైనా చనిపోతే , అర్హత లేని వారి కుటుంబ సభ్యులను పోటీ లేకుండా ఎనుకో కూడదు. ఇలాంటి వారి వలన ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా , ప్రజలకు ఎన్నికలంటే , ఎంతో విలువైనవి అనే విధంగా , ఎన్నికల విధానం ఉండాలి . ప్రజలకు ఎన్నికలంటే నమ్మకం , ఉత్సాహం కలిగించాలి.