Wednesday, April 22, 2020

"సెక్యూరిటీ కౌన్సిల్" ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

"ఐక్య రాజ్య సమితి" లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం *సెక్యూరిటీ కౌన్సిల్ ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

*నేడు సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏక ఛత్రాధిపత్యం వహించే దేశాలు / వీటో పవర్ (Veto Power) / పర్మనెంట్ మెంబర్ షిప్ గల దేశాలు 5 ఉన్నాయి. అవి , ఎ,బి ,సి ,ఎఫ్ & ఆర్. అందులో మన భారత దేశం లేదు.*
*ఐక్య రాజ్య సమితి [యునైటెడ్ నేషన్స్ అఫ్ ఆర్గనైజషన్ (UNO)] 24 , అక్టోబర్ 1945 లో ఏర్పడినది. ఇందులో సుమారుగా 193 దేశాలు ఉన్నాయి . ఐక్య రాజ్య సమితి లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం సెక్యూరిటీ కౌన్సిల్*. ఈ *సెక్యూరిటీ కౌన్సిల్* లో మొత్తం 15 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. అందులో 5 పెర్మనెంట్ సభ్యత్వ దేశాలు. 10 పర్మనెంట్ కాని దేశాలు .
*ఐక్య రాజ్య సమితి* చార్టర్ ,1945 ప్రకారం, 5 దేశాలకు *వీటో పవర్* అధికారం లభించింది . వీటినే పర్మినెంట్ దేశాలు అని , బిగ్ 5 అని లేదా పి-5 అని పిలుస్తారు . ఈ 5 దేశాలు మారవు.స్థిరంగా ఉంటాయి . మిగిలిన 10 దేశాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మారుతూ ఉంటాయి.
*ఈ వీటో పవర్ గల 5 దేశాలు ఏవంటే , అమెరికా , బ్రిటన్ , చైనా , ఫ్రెంచ్ మరియు రష్యా *. నేడున్న వీటో పవర్ గల 5 దేశాల దేశాధినేతలు: అమెరికా (డోనాల్డ్ ట్రంప్ ), బ్రిటన్ (బోరిస్ జాన్సన్ ) , చైనా (క్షి జిన్ పింగ్ ) , ఫ్రెంచ్ (ఎమాన్యూల్ మాక్రోన్) మరియు రష్యా (వ్లాడిమిర్ పుతిన్ ).
భారత దేశం, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ పి. వి . నరిసింహ రావు గారి కాలం కంటే ముందు నుండే , సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం గురించి , చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది . కాని ఇప్పటి వరకు సఫలం కాలేదు . అయితే చాలా కాలం క్రితం 4 దేశాలు అనగా బ్రెజిల్ , జెర్మనీ , భారత దేశం మరియు జపాన్ జి -4 కూటమిగా ఏర్పడి , పర్మనెంట్ సభ్యత్వాలకు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దేశానికి దక్కలేదు.
ఈ *ఐక్య రాజ్య సమితి* / *సెక్యూరిటీ కౌన్సిల్* యొక్క ప్రధాన బాధ్యత * ప్రపంచంలో శాంతి మరియు రక్షణ కల్పించడం*. ఏదేని సమస్య వచ్చినప్పుడు , దానికి ఒక రెసొల్యూషన్ ను , *సెక్యూరిటీ కౌన్సిల్* డ్రాఫ్ట్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ రెసొల్యూషన్ పాస్ కావాలంటే , ఈ 5 పర్మనెంట్ దేశాల ఓటింగే ( వీటో పవర్ ) అత్యంత కీలకం.
అంతటి కీలక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం మన భారత దేశానికి, స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు దాటినా , ఇప్పటికి లేక పోవడం 130 కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మన భారత దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది . ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టింది మన భారత దేశం. జనాభాలో రెండవ అతి పెద్ద జనాభా గల దేశం. ఆర్ధికంగా పరిపుష్టిగల దేశం భారత దేశం. శాంతి కాముక దేశం భారత దేశం. ఆచారాలు , సంప్రాదయాలు , ఆధ్యాత్మిక విషయాలలో ఉన్నతమైన భావాలూ గల దేశం భారత దేశం . ఎన్నో మతాలు , మరెన్నో కులాలతో కలిసి సంతోషంగా , ఆనందంగా జీవనం సాగిస్తున్న సెక్యూలర్ స్టేట్ మన భారత దేశం. రక్షణ విషయంలో అత్యంత శక్తి వంతమైనది మన భారత దేశం. ప్రపంచ దేశాలన్నిటిలో , మన భారతీయులు సేవలందిస్తున్నారు , కీలకమైన బాధ్యతలను చేపడుతున్నారు , చివరికి ఐక్య రాజ్య సమితిలో కూడా కీలకమైన బాధ్యతలను సునాయాసంగా చేపడుతున్నారు. రాజకీయంగా ఎంతో శక్తి వంతమైనది మన భారత దేశం . ఇన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న మన భారత దేశానికి *సెక్యూరిటీ కౌన్సిల్* లో *పర్మనెంట్ మెంబర్ షిప్* లేక పోవడం *వీటో పవర్* లేక పోవడం బాధాకరమైన విషయం . కనీసం ఇప్పుడైనా , మన ప్రధాన మంత్రి *శ్రీ నరేంద్ర మోడీ* గారి హయాంలోనైనా మనం సాధించి తీరాలి.

Tuesday, April 14, 2020

*కోవిద్ - 19 * (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?

*కోవిద్ - 19 *  (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?
*కోవిద్ - 19 * (Covid-19)  వలన దేశం మొత్తం దిగ్బంధం (లాక్ డౌన్) అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వేలాది కరోనా పాజిటివ్ కేసులు , వందలు దాటిన మరణాలు చూస్తున్నాం. ఉత్పత్తి , రవాణా , సేవలు అన్నీ స్తంభించి పోయాయి. ఇది కేవలం మన ఒక్క భారత దేశానికి సంబంధించిన విషయం కాదు . ప్రపంచం లోని 218 దేశాలకు ఈ కరోనా వైరస్ మహమ్మారి విస్తరించింది.
అయితే ఇక్కడ మన ప్రభుత్వాలకు మూడు సమస్యలు స్పష్టంగా కనబడుతున్నాయి .
01 . కరోనా వైరస్ ను ఎలా అరికట్టాలి?
02 . పేద మధ్య తరగతి లోని వివిధ వృత్తుల వారిని ఎలా ఆదుకోవాలి? ఉత్పత్తులను , సేవలను అందించే కంపెనీలను ఎలా ఆదుకోవాలి?
03 . ఇంతగా నష్ట పోతున్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం ఎలా?
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గొప్ప సారధ్యానికి , దేశ 130 కోట్ల ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి , మరో పదిహేను, ఇరువై రోజులలలో మొదటి రెండు సమస్యలు పూర్తిగా సమసి పోతాయి . అందులో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక మిగిలింది , కేవలం ఆర్ధిక వ్యవస్థను ఎలా పరుగు పెట్టించాలి? ఎలా పూర్వ వైభవం తీసుక రావాలి?
ఇది ఆశామాషి విషయం కాదు. అయినా అసాధ్యం మాత్రం కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లు , మన ప్రధాన మంత్రి గారు ,29 రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ఇప్పటి లాగానే ,వైద్య నిపుణుల సలహాలకు బదులు, ఆర్ధిక నిపుణుల సలహాలను తీసుకుని , చర్చించి , వారి సూచనల కనుగుణంగా , ఆర్ధిక కార్య క్రమాలను రూపొందిస్తూ , ఇప్పటి లాగానే ప్రజలలో ధృడ సంకల్పాన్ని కూడా గట్ట గలిగి , ప్రజలలో పట్టుదలను , మనో ధైర్యాన్ని , ఉత్సాహాన్ని నింప గలిగితే , ఈ ఆర్ధిక మాంద్యాన్ని , ఒకటి రెండు సంవత్సరాలలో అధిగ మించడం ఏమంత కష్టం మాత్రం కాక పోవచ్చని నేను భావిస్తున్నాను.
ధనికులపై ఈ ఆర్ధిక మాంధ్యం ప్రభావం ఏమి ఉండదు. వీరు హాయిగానే జీవించ గలరు. పేదలను ఎదో విధముగా ప్రభుత్వాలే ఆదుకుంటాయి. వచ్చిన సమస్యల్లా మధ్య తరగతి వారికే.
ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు జీవించడానికి చేయ వలసినదల్లా , వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచు కోవాలి. ఖర్చులు తగ్గించు కోవాలి. సరదాలు , జల్సాలు , వృధా ఖర్చులను తగ్గించు కోవాలి . ముందుగా సేవింగ్స్ ను కొంత ప్రక్కకు పెట్టాలి . మిగిలిన దానిని మాత్రమే ఖర్చు పెట్టాలి.
ప్రతి ఒక్కరూ పరిసరాలను , వ్యక్తిగత శుభ్రతను విధిగా పాటించాలి.
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టు కోవాలి. గత 40 , 50 సంవత్సరాలనుండి చూస్తే , ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి . ఆ కారణంగా నేడు , దేశ సంపద అంతా , కేవలం 10 % ప్రజల మధ్యనే ఉంది . మిగిలిన 90 % ప్రజలలో 50 % ప్రజలు మధ్య తరగతి వారు , 40 % మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు.
*కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా చేపట్టవలసిన చర్యలు*:
01 . దేశ సంపద అంతా 10 % ప్రజల చేతిలో నే ఉందని చెప్పుకున్నాం . ప్రభుత్వాలు , నాయకులు ఆ 10 % ప్రజలలో మనసు మారేటట్లుగా , దేశ భక్తిని , దేశ పరిస్థితులపై సానుభూతి పెంచాలి . వారి వద్ద ఉన్న నల్ల ధనం లో కనీసం 25 % ప్రభుత్వాలకు ఇచ్చేటట్లుగా ఒప్పించాలి . ఇక వారిని , ఈ నల్ల ధనం ఎక్కడిదని అడుగుమని అభయ మివ్వాలి . ఆ తరువాత కూడా , విచారణ చేయ కూడదు.
02 . ఒక రోజు ముఖ్య మంత్రి శ్రీ కె . సి . ఆర్ గారు చికెన్ , మటన్ తినడం వలన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది , తినవచ్చు అని అన గానే , తెల్లవారే అక్కడ ప్రజలు బారులు తీరారు . రియాక్షన్ అలా ఉంటుంది .అంతకు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందని భయ పడి తినడమే మానేశారు . ఉచితంగా వండి వడ్డించారు . అలానే ప్రధానమంత్రి , ముఖ్య మంత్రులు , విదేశీ వస్తువులను వాడ కూడదు , స్వదేశీ వస్తువులనే వాడటం వలన మన దేశం అభివృద్ధి చెందు తుంది , మనం ఆరోగ్యంగా జీవించ గలుగుతాం అని , ప్రజల మనుషుల్లో నాటుకునే వరకు చెబుతూ ఉంటే , ప్రజలు స్వదేశీ వస్తువులు అధికంగా వినియోగిస్తారు . అప్పుడు మనం దేశ జి . డి .పి. పెరుగుతుంది . అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది.
03. కోవిద్ -19 మహమ్మారి కి సంబంధించి , "వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ " జాతీయ విపత్తు కారణంగా భారత దేశానికి రావాల్సిన నిధులపై వత్తిడి తేవాలి.
04 . మరో 5 లక్షల కోట్లను ప్రజల సంక్షేమ పథకాలకు విడుదల చేయాలి.
05 . ఉత్పాదక సంస్థలకు , సేవా సంస్థలకు , రవాణా సంస్థలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించ కుండా , వాటి యధావిధి ఉత్పత్తులను, సేవలను కొనసాగించే విధంగా వెసులుబాటు కలిగించాలి.
06 . అసంఘటిత వ్యవసాయ కార్మికులను , పట్టణాల వైపు చూడకుండా , గ్రామాల లోనే ఉపాధి కల్పించాలి .కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి . చేతి వృత్తులను పెంచాలి.
07 . ప్రతి భారతీయుడు తినే ఆహారాన్ని , మన రైతులే పండించే విధంగా , రైతులకు , సబ్సీడీలు ,ప్రోత్సహకాలు యధావిధిగా కొనసాగించాలి .వ్యవసాయానికి సంబంధించిన సలహాలు , సహకారాలను అందించాలి. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కలిగించాలి. మధ్య దళారులను తొలగించాలి . ధాన్యాన్ని కొంత కాలం నిల్వ చేసుకోడానికి , కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ లను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి . రైతులే వారి కూరగాయ పంటలను, వారే మార్కెట్లో అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలి. రైతులకు భీమా , పంటలకు భీమాలను ఖచ్చితంగా అమలు చేయాలి.
08. వ్యవసాయ భూములకు ఇచ్చే , ఎకరానికి 8 వేల రూపాయలను , నిజమైన వ్యవసాయదారులకు (రైతులు కావచ్చు , కౌలు దారులు కావచ్చు) ఇవ్వాలి గాని , భూస్వాములకు ఇవ్వకూడదు . 10 ఎకరాల భూమి ఉన్న వారినందరిని భూస్వాములుగా గుర్తించాలి . నాగలి పట్టో , మెషెన్ ను పట్టో దున్నే వాడే రైతు . భూస్వాములకు కౌలు డబ్బు వస్తుంది , భూముల ధరలు పెరుగుతే , ఆ డబ్బు వారికే చెందుతాయి. అలానే మైనింగ్ చేసే వారు , ఒక్క పంట కూడా పండించరు . వారిని రైతులు అనడం , వారికీ ఎకరానికి 8 వేలు ఇవ్వడం తక్షణమే నిలిపి వేయాలి.
09 . భారత దేశంలో దొరకని ముడి సరుకులు, మెషినరీ తప్పా , ఎలాంటి ఆహార పదార్ధాలను, డ్రింక్స్ ను , మందులను రెండు మూడు సంవత్సరాలు దిగుమతి చేయ కుండా నిషేధించాలి . మన ఆరోగ్యాలను పాడు చేసేవే విదేశీ ఆహార పదార్ధాలు.
10 . వ్యక్తి గత ఆదాయ పన్నుల మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలి . నికర ఆదాయం 5 లక్షలు మించుతేనే రిటర్న్ ఫైల్ చేసే విధంగా మార్పులు చేయాలి. ఇవి అన్ని వయస్సుల వారికీ సమానంగా ఉండాలి. మిగిలిన మినహాయింపులు యధావిధిగా కోన సాగించాలి.
11 . కట్టు దిట్టమైన నిభంధనలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలి.
12 . విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విధంగా , నిభందనలను సడలించాలి.
13. ప్రజలకు బ్యాంకులపై నమ్మకాన్ని కలిగించాలి .ప్రజలకు మరియు బ్యాంకులకు లాభదాయకతను పెంచాలి. బ్యాంకులపై రాజకీయ నాయకుల వత్తిడి తగ్గించాలి. బ్యాంకులు ఇచ్చే లోన్లపై , ఎదుటి వారి వ్యాపారాల లాభదాయకతను, సెక్యూరిటీలను అస్సెస్స్ చేసే నిపుణులను బ్యాంకులలో నియమించాలి . సేవింగ్ అక్కౌంట్లపై వడ్డీ రేటును పెంచాలి . కోటి రూ . లు దాటిన ఎఫ్ . డి . లపై వడ్డీ రేట్లను తగ్గించాలి.
14 . విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని , విద్యార్థులను విదేశాలకు పంపించి వేయాలి . వారికి అన్ని విధాలుగా సహకారాలు అందించాలి.
15 . చదువుకుని ఖాళీగా ఉన్న విద్యార్థులకు, వారి స్వభావానికి అనుకూలమైన 
ఎదో ఒక రకమైన ఉపాధిని కల్పించాలి . కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి.
16 . పెట్రోల్ , డీజిల్ ఉత్పత్తుల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇక్కడే సుమారుగా 70 % మొత్తం మనం డబ్బు విదేశాలకు వెళుతుంది . దీనికి ఆల్టర్ నేటివ్ గా విద్యుత్ ను లేదా సోలార్ శక్తిని అభి వృద్ధి పరచాలి.
17 . భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మేధావే . ప్రతి ఒక్కరిలో తెలివి తేటలు ఉన్నాయి  . తన దేశం లేదా తన రాష్ట్రం లేదా తన జిల్లా లేదా తన గ్రామం అభి 
వృద్ధి గురించి చెప్పే సూచనలను , సలహాలను పరిగణలోకి తీసుకుని , ఒక నిపుణుల కమిటీలో చర్చించాలి. ఉపయోగం అనిపించిన వాటిని , అమలు చేయాలి.
ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టినట్లవుతే , దేశ ప్రజలు ఇప్పటి లాగానే ప్రభుత్వాలకు సహక రించినట్లయితే , భారత దేశం కేవలం రెండు మూడు సంవత్సరాలలోనే , నేటి కరోనా వైరస్ సమస్యలవలన ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను ,ఆర్ధిక మాంధ్యం నుండి తప్పకుండా గట్టెక్క గలదు.
*మార్గం కృష్ణ మూర్తి*
www.sollutions2all.blogspot.com