Saturday, February 27, 2016

' జి ఎస్. టి '. (GST) పన్ను విధానం ఎలా ఉండాలి ?

ప్ర . ' జి ఎస్. టి '. (GST)పన్ను విధానం  ఎలా   ఉండాలి ?

జ .  ' జి ఎస్. టి '.(GST) పన్ను విధానం  పేదలకు  ఉపయోగ కరంగా   ఉండాలి . 
 ఎన్నో సంవత్సరాల నుండి   ప్రవేశ పెట్టాలనుకుంటున్న  జి . ఎస్ . టి .(GST)  బిల్లును , మరల ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం  హర్షించ తగినదే . దీని వలన  గుర్తు పెట్టుకో లేనన్ని " పరోక్ష పన్నులు " రద్దయి  , ఒకే ఒక "జి. ఎస్. టి."  పన్ను అమలులో ఉంటుంది .  పారదర్శకత ఉంటుంది . అవినీతి తగ్గ వచ్చు .  వ్యాపారాలు  ఊపందు కుంటాయి . నల్ల ధన  వృత్తులు , వ్యాపారాలు  తగ్గు మొఖం పట్టి  ప్రభుత్వాలకు  పన్ను ఆదాయాలు  పెరుగుతాయి . ఉద్యోగావకాశాలు పెర్గుతాయి . 

అయితే  , ప్రపంచీకరణలో భాగంగా , విదేశీ  వ్యాపారస్తుల ను  ప్రసన్నం  చేయడానికని మాత్రం ఉండకూడదు . దేశ  ప్రజల  , వ్యాపారాల  మేలు కోసం , దేశ అభి వృద్ది కోసం  జరుగాలి .  అందుకని  ముందుగా  ప్రజలకు  , జి . ఎస్ . టి .(GST)  పన్ను విధానం ఎలా ఉపయోగ పడుతుందో  విస్తృతంగా  చర్చ జరుగాలి . ప్రజల , వ్యాపారస్తుల అను మానాలను  నివృత్తి చేయాలి . ప్రజల , వ్యాపారస్తుల  సూచనలను , సలహాలను పరిగణలోకి  తీసుకోవాలి .  జి ఎస్. టి . ని  16% నుండి  18% మద్యలో  ఉండేట్టు  చూడాలి .  అలానే  ప్రతి 0.5% పన్నును  పెంచాలన్నా  రాజ్యాంగ సవరణ  జరుగాలి .  లేదంటే  ప్రజలు , వ్యాపారస్తులు  ఈ విషయం మరిచి పోయాక  దొడ్డి దారిన  జి .ఓ . ల ద్వారా,  ఆర్డి  నెన్స్ ల ద్వారా  40% వరకు  పెంచు కుంటూ పోయే  ప్రమాద ముంది .  గత  ఏడాది బ్యారల్ కు 130 డాలర్లు  ఉన్న క్రూడ్ ఆయిల్ ,  నేడు 30 డాలర్లకు  దిగి వచ్చినా ( ఫిబ్రవరి ,2016) , మన పెట్రోల్ , డిజిల్  మరియు ఇంధన ధరలు  నాల్గో వంతుకు  తగ్గక పోవడమే కాకుండా , మరింత పెరుగుతుండటం  విడ్డూరంగా ఉంది . మనం  సుమారుగా  60 నుండి 70 శాతం  వరకు  క్రూడ్ ఆయిల్  దిగుమతుల మీదనే  ఆధార పడి  ఉన్నాము. మన విదేశీ నిల్వలు ఖర్చయ్యేదీ ఇక్కడే . క్రూడ్ ఆయిల్  రేటు తగ్గడం  మనకు వరంగా  భావించాలి . అలాంటిది  పెట్రోల్ , డిజిల్ మరియు  ఇంధన ధరలు  తగ్గక పోపోవడానికి  కారణాలు  సామాన్యులకు  అంతు చిక్కడం లేదు . ఎక్కడ  లోపముందో మేధావులు , ఆర్ధిక వేత్తలు  ప్రజలకు వివరించాలి .   
అలానే  పేద ప్రజలు వాడే  100 యూనిట్ల  లోపు  కరెంట్ , వాటటర్  బిల్లులపైనా , రూ . లు . 100/-  సెల్ రీచార్జీల బిల్లుల పైనా , కేబుల్ , నెట్  కనెక్షన్ల పైనా  జి ఎస్ . టి . విధించ కూడదు .
ఎదో  ఒక  రోజు నేను చెప్పినవే  అందరూ ఒప్పు కుంటారు . అమలు చేస్తారు .  

Friday, February 26, 2016

భారత దేశానికి గల గొప్ప వరం (GOOD LUCK)ఏమిటి ? శాపం (BAD LUCK) ఏమిటి ?

ప్ర . భారత దేశానికి  గల  గొప్ప వరం (GOOD LUCK)ఏమిటి ?  శాపం (BAD LUCK) ఏమిటి ?

జ . భారత దేశానికి  గల  గొప్ప వరం  ఏమంటే , సమృద్ధిగా  ప్రకృతి వనరులు , మానవ వనరులు  ఉండటమే కాకుండా  , ప్రతి 5 సంవత్సరాల కొక సారి  దేశ ప్రజల  ఓట్ల ద్వారానే  ఎన్నికై , ప్రభుత్వాలను  ఏర్పాటు చేసి , పరి పాలన సాగించడం . అంటే  పరోక్షంగా , 18 సంవత్సరాలు నిండిన  ప్రతి పౌరిడికి  దేశాన్ని పరిపాలించే  హక్కు కలిగి  ఉండటం  .  ఈ వరమే  లేనట్లవుతే  ఈ పాటికి  దేశాన్ని  ఓ 10 లేదా 15 మంది  మహాను బావులు   దేశాన్ని దోచేసే వారు. 

యిక  శాపం ఏమంటే , నిజాయితీ గల , భాద్యత  గల  , సమర్డులైన , మలిన రహిత ప్రజా ప్రతి నిధులను  నిలబెట్టలేక పోవడం , డబ్బు మూలంగానో , భయానక వాతావరణం  మూలంగానో  లేదా కళల  మూలంగానో  ప్రజలను ఓటు బ్యాంకు గా  తయారు చేసుకునే  అవకాశ ముండటం   మరియు  ఎన్నికయ్యాక  మలినం అంటిన  , అసమర్ధ  ప్రజా ప్రతినిధులను  వెనుకకు పిలిపించే  అధికారం  (5 సంవత్సరాల  వరకు ) ఎన్నుకున్న ఓటర్లకు  లేక పోవడం .     

Wednesday, February 24, 2016

HOW TO CONTROL CORRUPTION & BLACK MONEY ? / అవినీతిని నల్ల ధనాన్ని అరికట్టడం ఎలా ?

ప్ర . అవినీతిని (CORRUPTION), నల్ల ధనాన్ని(BLACK MONEY)  అరికట్టడం ఎలా ?
జ . అవినీతి ద్వారా గుట్టలు గుట్టలుగా ప్రోగయ్యే నల్ల ధనాన్ని , బినామి ఆస్తులను , పన్నులను ఎగ్గొట్టాడాన్ని , అరి కట్టాలంటే అనేకమయిన చక్కటి మార్గాలున్నాయి . చేతులు కాలాక ఆకులు పట్టు కోవడం కంటే , ముందు గానే కొన్ని జాగ్రత్తలు తీసు కుంటే నల్ల ధనాన్ని , బినామి ఆస్తులను , పన్నులను ఎగ్గొట్టాడాన్ని 90% వరకు అరి కట్ట వచ్చు . ప్రభుత్వ ఖజానాను నింప వచ్చు, ప్రభుత్వాలకు అప్పులు లేకుండా చేయవచ్చు. ఆ జాగ్రత్త లేమిటో , ఆ మార్గా లేమిటో చూద్దాం .
1. నల్లదనాన్ని నిజంగా అరికట్టాలనే చిత్త శుద్ధి , ప్రభుత్వాలకు , వ్యవస్థలకూ మరియు అధి కారులకూ ఉండాలనేది ముఖ్యమైన మొదటి అంశం . అలానే , ఎక్కడా పక్ష పాత దోరిని , లేకుండా ట్రాన్స్ప రెంటుగా ఉండాలి .
2. పన్నులను తగ్గించాలి. పన్ను చెల్లింపు విధానాలను సులభ తరం చేయాలి . పన్నులను వసూలు చేసే వ్యవస్థలు ప్రజలకు చేరువలో ఉండాలి. ఇన్కం టాక్స్ "ఎక్జ్స్ మ్షన్ లిమిట్ " ను , అందరికి వర్తించే విధంగా , రూ .లు .5 లక్షలకు పెంచాలి. అలానే సెక్షన్ 80 సి సి. క్రింద రూ .లు 3 లక్షలకు, సెక్షన్ 54 ఇ. క్రింద ఇంటి ఋణం పై వడ్డీ కి మినహాయింపు రూ.లు .2 లక్షలకు పెంచాలి. సర్చార్జ్ , ఎడ్యుకేషన్ సెస్స్ , రూ .లు 10 లక్షల ఆదాయం వరకు మినహాయించాలి . అప్పుడే ఈ నిభంధనలను వర్తింప చేయాలి .
3. ప్రజలకు, వ్యాపారులకు , ఉద్యోగులకు సంబంధించిన సేవలన్నీ ఆన్ లైన్ ద్వారానే జరిగి తీరాలి.
4. రాజకీయ నిధులన్నీ చెక్కులు , డ్రాఫ్టులు , బ్యాంకు ట్రాన్స్ఫర్ల ద్వారానే జరుగాలి. రాజకీయ నిధులకు ఖచ్చితంగా పన్నులను విధించే అధికారం బ్యాంకులకు ఇవ్వాలి .
5. వడ్డీ వ్యాపారాలను , ఫైనాన్సు , హవాలా వ్యాపారాలను , లాటరీలను , స్కీము లను , రిజిస్టరు గాని చిట్టీలను పూర్తీ గా నిషేదించాలి .
6. దేశం లోని అన్ని పోస్టాఫీసులను బ్యాంకులు గా మార్చి , పొదుపుకు , రుణాలు తీసు కోడానికి , సామాన్య ప్రజలకు చేరువ చేయాలి .
7. చదువు కున్న విద్యా వంతులకు , బ్యాంకు అకౌంట్ గల వారందరికీ "పాన్ (PAN) కార్డు " " వోటర్ (VOTER) కార్డు " ఆధార్ (ADHAAR) కార్డు " కంపల్సరీ చేయాలి . వీటన్నిటిని అనుసంధానించాలి .
8. 50 వేల రూ .లకు మించిన ప్రతి ఆర్ధిక లావా దేవీని ( నగదు ద్వారా చేసినా , బ్యాంక్ ద్వారా చేసిన , క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా చేసినా , షాప్ లో స్వయిప్ చేసినా, నెట్ ద్వారా చేసినా ) పాన్ ( PAN ) కార్డు కు లింకు చేయాలి .
9. భూములు , ఇండ్ల కొనుగోలు వ్యవహారాలూ 90 రోజులు మించితే ఖచ్చితంగా రిజిస్ట్రే షన్ చేయించాలి , బయట మార్కెట్ వాల్యు కు అనుగుణంగా , రిజిస్ట్రే షన్ వాల్యు ను సరి చేయాలి .
10. ఆడిటర్లను కంపనీలు ప్రయివేటు గా నియమించు కోకుండా , ఆడిటర్లను ప్రభుత్వమే నియమించి వేతనాలు చెల్లించాలి . కంపనీల నుండి , టర్నో వర్ ఆధారంగా , ఫీజులు వసూలు చేయాలి .
11. ఆదాయాన్ని , ఖర్చును బేరీజు వేసి , ఏది ఎక్కువగా ఉంటే , దాని ఆధారంగా పన్ను విధించాలి .
12. ప్రతి అద్దె ఒప్పందాన్ని అదే విలువకు , బాండ్ పేపర్ వ్రాయించి , నోటరీ చేయించాలి . నోటరీ అధికారి దానిని పూర్తీ వివరాలతో , ఆన్ లైన్ లో నమోదు చేయాలి . దీనిని "పాన్" కు లింకు చేయాలి .
13. గడుప గడుపకు , ఇంటింటికి , ప్రతి స్థలానికి , ప్రతి ఫ్లాటుకు వెల్లి , ఇండ్ల యజమానుల వివరాలు సేకరించాలి . యజమాని పూర్తీ పేరు , భార్యా , పిల్లలు , పాన్ నెంబర్ , వోటర్ కార్డు , ఆదార్ కార్డు, బ్యాంకు అకౌంట్ల వివరాలు మొదలగునవి . ఆ తరువాత వెంటనే డాటా ను కంప్యూటర్ లో నిక్షిప్తమ్ చేయాలి .
14. యజమాని వివరాలను తెలుపడానికి ఇష్ట పడని భూములను , ఇండ్లను , ఫ్లాట్లను పూర్తి విచారణ జరిపించి, ప్రభుత్వం జప్తు చేసుకుని , గృహాలు లేని అర్హు లైన పేద పజలకు , రిజిస్టర్ చేయించాలి . వివరాల సేకరణకు , అన్ని భాషలు వచ్చిన , సమర్దులయిన విద్యవంతులనే నియమించాలి.
15. లెక్కలకు తేలని డబ్బు పట్టు బడినప్పుడు , ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 90 రోజుల లోనే కేసులను ముగించే విధంగా ఏర్పాటు చేయాలి. నల్లధనం గాని , బినామి ధనం గాని పట్టుబడి నప్పుడు , వసూలు చేయవలిసింది 30% పన్ను కాదు . 100% పట్టుబడిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలించాలి .
16. నల్లదనం రాబట్ట డానికి, అనేక అవకాశాలు , ఎన్నికల కమీషన్ ఇప్పటికే ఇచ్చారు కాబట్టి , రాజకీయ నాయకులు ఇచ్చిన అఫిడ విట్లన్నీ ఎన్నికల కమీషన్ వద్దనే ఉన్నాయి కాబట్టి , ఇక బుజ్జగింపుల విధానం తగదు . పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉండ కూడదు . ఎన్నికల అఫిడవిట్లల్లొ , విదేశాల్లో నల్ల ధనం వున్నట్లు ఎవ్వరూ పేర్కొనలేదు కాబట్టి , అది అంతా నల్లధనమే. 100% ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిందే . అంతే కాకుండా , గత 15 సం. రాల వ్యవహారాలను కూడా విచారణ జరిపించాలి .
17. మొదటగా అత్యంత అవినీతి పరుల , నల్లధన విరాటుల పై అనుసరించే విధానం , ప్రభుత్వ , వ్యవస్థల వైఖరి ద్వారా, నిజాయితీ పరుల్లో , సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించాలి . నమ్మకాన్ని కలిగించాలి . ధైర్యాన్ని నింపాలి . 
ఇప్పటి వరకు అది జరుగలేదు . పొట్ట కూటి కోసం పాట్లు పడే, సామాన్య ప్రజలకే అనేక తిప్పల్లు , ఇక్కట్లు .

18. ట్రస్ట్ లు , స్వచ్చంధ సంస్థ ల పై , పూర్తీ నియంత్రణ ను ఏర్పాటు చేయాలి .
19. వడ్డీ ల పై పన్ను మినహాహింపు కొరకు , 60 సం. రాల లోపు వారు ''15జి '' ని 60 సం. రాల పై బడిన వారు "15 హెచ్ " బ్యాంకులలో గాని , కంపనీల లో గాని ఇస్తుంటారు . వాటిని ' అఫిడవిట్ ' లా చట్ట బద్ధత చేయాలి .
20. ఏ విషయం లో నైనా , పెద్ద తలకాయలపై ప్రభుత్వ మరియు చట్ట భద్ద మైన వ్యవస్థల అధి కారుల వైఖరితో , చిన్న తలకాయాల్లో అవగాహన పెంచాలి , భయాన్ని పెంచాలి , మార్పు తీసుకుని రావాలి గానీ, ఎలుకలపై భ్రమ్హాస్త్రాన్ని వేసి , ఏనుగుల కుంభ స్థలాన్ని కొట్టి విజయాన్ని సాధిస్తామనుకోవడం అసంభవం . ఇలా చేస్తే , మరో 100 సo. రాలు పోయిన వ్యవస్థలు ఇలానే ఉంటాయి . అలానే , మన దేశంపై ఇతర దేశాలు పట్టు సాధిస్తాయి .
21. నల్ల ధనం , బినామి ఆస్తుల రాబ్ట్టుటకు , పన్నులను ఎగ్గొట్టకుండా ఉండ టానికి , సూచనలు చేసే వారిని , సలహాలు ఇచ్చే వారిని , వాస్తవ సంఘటనలను తెలియ జేసే వారిని , ప్రోత్శాహించాలి . గౌర వించాలి . పారి తోషికాలు ప్రకటించాలి . ప్రజల లో అవగాహన కలిపించాలి .

WHAT ARE THE REASONS FOR RESERVATION REVOLUTIONS ? / "రిజర్వేషన్ల " ఉద్యమాలకు కారణాలు ఏమిటి ?

ప్ర . "రిజర్వేషన్ల " (RESERVATIONS) ఉద్యమాలకు  కారణాలు ఏమిటి ?

జ . గత కొంత కాలం నుండి  చూస్తుంటే  రోజు రోజుకు "రిజర్వేషన్ల " ఉద్యమాలు  ఉధృత మవుతున్నాయి .  నాడు  రాజస్థాన్లో ' గుజ్జర్లు ' , గుజరాత్ లో ' పాటి దార్లు ' , ఆంద్ర ప్రదేశ్ లో  ' కాపులు ' , నేడు హరియానాలో  ' జాట్లు '  మరియు  నిరంతరం 'బి సి ' లు "రిజర్వేషన్ల " కొరకు   ప్రాణాలకు  తెగిస్తూ  , ప్రయివేటు  ఆస్తులకు  , ప్రభుత్వ ఆస్తులకు  నష్టం కలిగిస్తూ , కొన్ని చోట్ల  హింసాత్మకంగా ఉద్యమాలు  చేస్తూ ఉన్నారు . 



అసలు "రిజర్వేషన్ల " అంటే ఏమిటి ?
ప్రభుత్వాలు  రాజ్యాంగ పరంగా , చట్ట బద్దంగా దుర్భర జీవితం  గడుపుతున్న  కొన్ని కులాల వారికి , మతాల వారికి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , ఉద్యోగ  భద్రతను  నిర్ణీత శాతంలో  కల్పించ డాన్ని "రిజర్వేషన్లు  " గా చెప్పు కోవచ్చు . 

రిజర్వేషన్లు కల్పించడానికి గల ముఖ్య కారణాలు ?

దూర దృష్టి గల  నాటి  మన  రాజ్యాంగ  రూపకర్తల , నిర్మాతలయిన  మహాత్మా గాంధీ , జవహార్ లాల్ నెహ్రు , డా: రాజేంద్ర ప్రసాద్ , డా : రాధా కృష్ణన్ , సర్దార్ వల్లభాయి  పటేల్  , డా : అంబేద్కర్  మొదలయిన  అనేక మంది  గొప్ప నాయకుల ప్రకారం  "రిజర్వేషన్ల " ముఖ్య ఉద్దెశ్యమేమంటే  , దేశంలో  కుల వివక్షకు  , మత వివక్షకు  గురి అవుతూ  పెదతనంలో   దుర్భర జీవితం  గడుపుతున్న  కొన్ని కులాల వారికి , మతాల వారికి , సామాజిక , సాంఘీక , ఆర్ధిక , ఉద్యోగ  భద్రతను , రాజ్యాంగ పరంగా , చట్ట బద్దంగా   న్యాయం  చేకూర్చి , వారిని కూడా  మిగిలిన  వారి అందరితో  సమానం చేయాలనేదే  వారి ఆశయం . 


వాస్త  వానికి  ఏమి జరుగుతుంది ?
కాని వాస్తవానికి  గత  68 సంవత్సరాల చరిత్ర చూస్తే , మొదటి 10 సంవత్సరాలు  మినహాయిస్తే  , రాజకీయ లబ్ధి కోసమే  , ఎదిగినవారు - ఒదిగున్న వారిని  , పేద వారిని  ఓటు బ్యాంకుగా  వాడుకున్నారు  తప్పా , మెజారిటీ  అనగారిన  ప్రజలను , పేద తనంలో  మ్రగ్గు తున్న ప్రజలను  పైకి  రానివ్వడం లేదు . గ్రామాలలో   నేటికి , కొన్ని వర్గాలకు  రిజర్వేషన్లు  కల్పించి కూడా , పరోక్షంగా  ఉన్నత వర్గాల వారే  పాలన సాగిస్తున్న  దాఖలాలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి . పేరు వారిది . ఊరు వీరిది . 

మనకు  స్వాతంత్ర్యం వచ్చిన  రోజు పుట్టిన వారికి  నేడు  68 సం . రాల  వయస్సు .  "68 సం . రాల  వయస్సు  వచ్చాక కూడా   మాకు  ఎదుగూ బొదుగూ  లేని  జీవితమేనా ? ఆడుక్కు తినడమేనా?  చకోర పక్షుల్లా   ఆసరా పెన్షన్ల  కోసం ఎదిరి చూడటమేనా ?   అందరిలా మా కాళ్ళ మీద మేము నిలబడి , తలెత్తుకుని  బ్రతికే రోజులు  ఎప్పుడు వస్తాయి ? ధన ధన వంతులు   మరింత ధన వంతులవుతున్నారు , పేద వారు  మరింత  పేద వారు అవుతున్నారు , కేవలం  రాజకీయ నాయకులు , వారి కార్య కర్తలు  , అధికారులు మాత్రమే  దేశ సంపదనంతా  అనుభవిస్తున్నారు " అనే  ఆలోచనలతో , అసహనంతో  పెల్లుభికినవే   ఈ  ' రిజర్వేషన్ల ' ఉద్యమాలు .

ఏమి చేస్తే బాగుండేది ?
మనకు స్వాతంత్ర్యం వచ్చిన  10 లేదా  20  సంవత్సరాల తరువాత నైనా , అన్ని కులాల లోని , మతాల లోని  పేద ప్రజలను  ఒక వర్గంగా  గుర్తించి  లేదా విభజించి  , వారికి విద్యా పరంగా , సాంఘీక పరంగా , ఆరోగ్య పరంగా  , ఆర్ధిక పరంగా  రిజర్వేషన్లు కల్పించి ఉన్నత స్థితికి  తీసుక రాగలిగి ఉంటే  బాగుండేది . కాని  దురదృస్టా వశాత్తు , నేటికి  కూడా  అలాంటి ఆలోచన  ప్రభుత్వాలకు లేదు . ఎందుకంటే ఎక్కడ ఓటు బ్యాంక్  గల్లవుతుందో , ఎక్కడ అధికారం కోల్పోతామో అన్న భయం . ఆ  కారణంగానే  రోజు రోజుకు  ధన వంతులు  మరింత ధన వంతులవుతున్నారు . పేద వారు  మరింత పేద వారు ఆవు తున్నారు . మెజారిటీ  నాయకులూ , వారి కార్య కర్తలు , అధికారులు  మరియు  పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రమే  అత్యంత ధనికులవుతున్నారు . మిగిలిన వారందరూ  పేద ,నిరుపేద , మద్య తరగతులలో ( ఓటు బ్యాంక్ గా )   జీవిస్తున్నారు .  
కులాలు అనేవి , మతాలు అనేవి  నాటి వారి వారి  వృత్తులను బట్టి ,  వారు నమ్ముకున్న ఆద్యాత్మిక  గురువులను  బట్టి ఏర్పడినవి .  అన్ని కులాల లోనూ  ధనవంతులున్నారు . అలానే అన్ని కులాల లోనూ  పేదలున్నారు . 
ఒక కులంలో  రిజర్వేషన్ ద్వారా  తండ్రికి  లేదా తల్లికి  లేదా ఇద్దరికీ  ఉద్యాగాలు లభించాయంటే , తరువాత  వారి  పిల్లలను  జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి , చదివించి  , తమ కాల్ల  మీద తాము నిలబడే విధంగా  తీర్చి దిద్దాలి . అంతే గాని  స్వాతంత్ర్యం వచ్చి  68 సంవత్సరాలు  దాటినా  అన్ని రంగాలలో ,  కొన్ని కులాల వారి  తల్లి దండ్రులకు , వారి కొడుకులకు  , కోడన్డ్లకు , మనుమలకు , మనుమా రాన్డ్లకు , మునిమనుమలకు , ముని మనుమా రాన్డ్లకు   .... ......  రిజర్వేషన్లు కల్పించుకుంటూ  పోతే  , ఇతర  ఉన్నత కులాల లోని  పేదలకు  స్వాతంత్ర ఫలాలు , రిజర్వేషన్లు  అందే  దెన్నడు ?

ఏమి చేస్తే బాగుంటది  ? సాధ్యమవుతుందా ?
"రాజు తలుచుకుంటే  దెబ్బలకు కొదువా  అన్నట్లు " , సభ్యులు  తలుచు కుంటే  అసాధ్యమేమీ  కాదు .  అన్ని కులాల లోని  పేదలను  విద్యా , ఆరోగ్య , సాంఘీక , సామాజిక  పరంగా  రిజర్వేషన్ల  ద్వారా  ఎదుగానివ్వాలి  అనే ఆలోచన , తపన  పాలకులలో  ఉండాలి .  ఆ విధంగా  మానవ వనరులను  అభి వృద్ది చేయాలి . ప్రకృతి వనరులను  సద్వినియోగం  చేసుకో గలగాలి . వారి కాళ్ళ మీద  వారు  నిలబడి  జీవించే విధంగా  తీర్చి దిద్దాలి . అంతే గాని , చకోర పక్షుల్లా  , నెల వారి పెన్షన్ల కోసం ఎదిరి చూసే  వారిగా  , రోజూ  అడుక్కు తినే బిక్ష గాండ్లు గా  మార్చ కూడదు.
దేశాభి వృద్ధిని  దృష్టిలో  పెట్టుకుని , మా అధికారం  ఎక్కడ పోతుందో నని గాని  , మా అవి నీతి , మా నల్ల ధనం , మా బినామి  ఆస్తులు  ఎక్కడ బయట పడుతాయో నని  భయ పడ  కూడదు.   అదికారం  ఒక సారి పోతుంది కావచ్చు .  కాని  రెండో సారి మీదే కావచ్చు .  
రిజర్వేషన్ల  ఉద్యమాలకు గల  ముఖ్య కారణాలు ?
01. 
02. 
03. 
04. 
05. 

రిజర్వేషన్ల  ఉద్యమాలను  ఎలా అదుపు చేయాలి ?
01. 
02. 
03. 
04. 
05. 


    



   

'వార సత్వం ' (JEENS RELATED)అనగా నేమి ?

ప్ర . 'వార సత్వం ం' (JEENS RELATED)అనగా  నేమి ?
జ . సాధారణంగా  వివాహాలు  జరిపించునపుడు , అబ్బాయి వారయితే  అమ్మాయి వారి  'వార సత్వం' , అమ్మాయి  వారయితే  అబ్బాయి వారి  'ఇంటితనం'  చూసి  పెండ్లి జరిపించాలంటారు . ఇవార సత్వం ం అంటే , ఆ  కుటుంభం ఎలాంటిది ?  ఆ కుటుంభం  లోని సభ్యులు ఎలా ఉంటారు ?  ఆ కుటుంభం  లోని సభ్యులు  వారిలో వారు  మరియు ఇతరులతో ఎలా మెలుగుతుంటారు?  వారి మద్య  ప్రేమలు , ఆప్యాతలు , కలుపుగోలు తనం ఎలా ఉంటుంది ?  వారి  ఆరోగ్య మరియు ఆర్ధిక  పరమైన విషయాలు  ఎలా  ఉన్నాయి ?  మొదలగు  అనేక మైన  విషయాల గురించి తెలుసుకోవడాన్ని ' వార సత్వం ' అంటారు .  

Sunday, February 21, 2016

దేశంలో " రాజకీయ వ్యవస్థ " ప్రక్షాళన తక్షణం అవసరమా ? /IS IT NECESSARY IMMEDIATE REFORMS IN POLITICAL SYSTEM ?


ప్ర . దేశంలో " రాజకీయ వ్యవస్థ " ప్రక్షాళన తక్షణం అవసరమా ?

జ . దేశంలో " రాజకీయ వ్యవస్థ " ప్రక్షాళన తక్షణం అవసరం  ఉంది . 

మనకు అనేక వ్యవస్థలున్నాయి . అందులో ముఖ్యమైనవి , కుటుంభ వ్యవస్థ , సామాజిక వ్యవస్థ , రాజకీయ వ్యవస్థ , ఆర్ధిక వ్యవస్థ , పరి పాలనా వ్యవస్థ , న్యాయ వ్యవస్థ , ఎన్నికల వ్యవస్థ, పన్నుల వ్యవస్థ, మీడియా వ్యవస్థ , రాజ్యంగా వ్యవస్థ , ఇలా అనేకంగా ఉన్నాయి . వీటిలో , అన్ని వ్యవస్థలను శాషించేది కేవలం రాజకీయ వ్యవస్థ ఒక్కటే . యింతటి అధికారాలు గల రాజకీయ వ్యవస్థ , స్వాతంత్ర్యం వచ్చిన 10 సంవత్సరాలు మినహా , నాటి నుండి నేటి వరకు , అవినీతి కూపంలో కూరుకు పోయిందనడానికి అనేక సాక్షాలున్నాయి . తమ అధికారాలను దక్కించు కోడానికి , సంపద పెంచుకోడానికి , గత అవినీతి నాయకులను  క్షమించడం మినహా ప్రజలకు చేసిన మేలు అల్పం . ప్రజలను నిర్లక్షమ్ చేయడానికి , ప్రజలు అనారోగ్యానికి గురి కావడానికి , సంపూర్ణ విద్య , ఇతర వసతులు లేక పోవడానికి , ఆర్ధిక అసమానతులు ఏర్పడడానికి , కూడు గుడ్డా లేక పోవడానికి , నేటికి ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పధకాలకు , సబ్సిడీలకు , ఆసరా పించన్లకు ప్రతి నెలా చకోర పక్షుల్లా ఎదిరి చూడ టానికి మరియు భారత దేశం అభి వృద్ధి చెందిన దేశాల సరసన చెరక పోవడానికి ముఖ్య కారణం , ఈ అవినీతి కూపంలో మునిగి పోయిన రాజకీయ వ్యవస్థే . కనీసం ఈనాడైనా రాజకీయ వ్యవస్థ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది . చట్టాల లోని లొసుగులను నల్ల ధనం తో , బినామి ఆస్తులతో వినియోగించు కోకుండా చూడ వలసిన అవసరం ఎంతయినా ఉంది .

చట్టాల (LAWS) గురించి , రాజ్యాంగం (CONSTITUTION)గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలా ?


ప్ర . చట్టాల (LAWS) గురించి , రాజ్యాంగం (CONSTITUTION)గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలా ?

జ . చట్టాల గురించి , రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలి

దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి విద్యతో పాటు , చట్టాల గురించి , రాజ్యాంగం గురించి , ప్రజల హక్కులు , బాధ్యతల గురించి సంపూర్ణ అవగాహన కలిగించాలి . అప్పుడే వారికి నాయకులను ప్రశ్నించే శక్తి , ధైర్యం వస్తుంది . నేడు ప్రతి ఒక్కరికి టి .వి . లు ,ఎఫ్ .ఎమ్ . రేడియోలు ,ఇంటర్ నెట్స్ అందు బాటులో ఉన్నాయి . ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారో , అప్పుడే నాయకుల్లో భయం ఏర్పడి రాజకీయ అవినీతి , నల్లదనం మటు మాయం అవుతాయి . సాధ్యమయ్యే వాగ్దానాలనే ప్రజలకు యిస్తారు . ప్రజలకు చక్కటి పరిపాలనను అందిస్తారు . అలానే ప్రజలను కేవలం "ఓటు బ్యాంక్" గా మార్చే విధానం కను మరుగవుతుంది .

అవినీతి సొమ్ముతో (CORRUPTED MONEY) ఎలాంటి తాత్కాలికమైన సుఖాలను అనుభవించ వచ్చు ?

ప్ర .  అవినీతి సొమ్ముతో  (CORRUPTED MONEY) ఎలాంటి సుఖాలను అనుభవించ వచ్చు ?

జ .  అవినీతితో , అక్రమంగా సంపాదించిన ఆస్తులతో ,డబ్బుతో, నల్ల ధనం తో , బినామి ఆస్తులతో తాత్కాలికమైన సుఖం , సౌఖ్యం లభించ వచ్చు . మినరల్ వాటర్ తో స్నానం చేయ వచ్చు . ఎ .సి . కార్లల్లో తిరగ వచ్చు . టూర్లు వేయ వచ్చు . షికార్లు కొట్ట వచ్చు . రాజ భోగాలు , అధికారం, హోదా లభించ వచ్చు . అయినా అది దీర్ఘ కాలం నిలువదు . కాని ఆ అవినీతి మచ్చ మాత్రం వారి తర తరాలను వెంటాడుతేనే ఉంటుంది . పైకి గాంభీరంగా కనిపించినా , అంతరాత్మ నీడలా వెంటాడుతేనే ఉంటుంది . అంతే కాకుండా దిన దినం ప్రాణ గండంలా భయం , భయంగా జీవించాల్సి వస్తుంది . ఏ మనిషి అయినా ఎవరికీ భయపడక పోయినా , ఎవరు చెప్పినా వినక పోయినా - తన అంత రాత్మకు భయపడుతాడు , తల వంచు తాడు . తన అంత రాత్మ సూచించి నట్లుగా నడుచుకుంటాడు . అవినీతి పరులు , నల్ల ధన కుభేరులు కోర్టులకు తల నొప్పిగా మార వచ్చు. సమాజంలో చెడ్డ వారిగా , చరిత్ర హీనులుగా మిగిలిపోవాల్సి రావచ్చు .

 అదే నీతి మంతంగా , నిజాయితితో , క్రమ శిక్షణ జీవితంతో , సక్రమంగా సంపాదించిన ఆస్తులతో ,డబ్బుతో (అవి కొన్నే కావచ్చు ), నిజాయితీగా జీవించే వారికి దీర్ఘ కాలం ఆనందం , త్రుప్తి , సంతోషం , ఆనందం , ప్రశాంతత లభిస్తుంది . నిజాయితీగా ఉంటె ఎంతో హాయిగా ఉంటుంది .యే టెన్సన్స్ ఉండవు . యే చికాకులు ఉండవు . అంతే కాకుండా నిర్భయంగా జీవించ వచ్చు . ఆదర్శంగా నిలువ వచ్చు . సమాజంలో మంచి పేరు , ప్రతిష్ట , కీర్తి , గౌరవం , గుర్తింపు లభించ వచ్చు. ప్రయత్నించి చూడండి .

60 వ యేడు తరువాత ప్రతి నెలా ఫిక్స్ డ్ పెన్షన్ ( EVERY MONTH FIXED PENSION) రావాలంటే ఏమి చేయాలి ?

ప్ర . 60 వ యేడు తరువాత ప్రతి నెలా ఫిక్స్ డ్ పెన్షన్  ( EVERY MONTH FIXED PENSION) రావాలంటే  ఏమి చేయాలి ? 

జ . 20 వ యేట నుండి 60 వ యేటి వరకు , అనగా 40 సంవత్సరా.లు, ప్రతి సంవత్సరం రూ .లు .2,520/- చొప్పున ( నెలకు రూ .లు 210/-చొప్పున) టాక్ష్ సేవింగ్ మ్యూ చ్యువల్ ఫండుల్లో ( Example- Reliance Tax saver (ELSS) fund (G), HDFC Tax saver (G) , Franklin India Tax Shield (G) etc.,) పెట్టుబడి పెట్టి నట్లవుతే , కనీసం 10% చక్ర వడ్డీతో లెక్క వేసినా మొత్తం రూ .లు 13,06,053/- కాగలదు . దీనిని కనీసం 9.3% వడ్డీతో పోస్టాఫీసులో ( సీనియర్ సిటిజెన్స్ ) ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి నట్లవుతే నెలకు రూ లు . 10,121/- పెన్షన్ లాగ (వడ్డీ) పొంద వచ్చు . మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రూ లు . 13,06,053 /- వెనక్కి తీసు కోవచ్చు . లేదా నామినీ తీసుకోవచ్చు . ప్రయత్నించి చూడండి .

Calculation source: www.allbankingsolutions.com. RD A/c calculator. &

అధిక సమస్యలకు ప్రధాన కారణం (WHAT ARE THE MAIN REASONS FOR MORE PROBLEMS ?) ఏమిటి ?

ప్ర .  అధిక సమస్యలకు ప్రధాన కారణం (MAIN REASON FOR MORE PROBLEMS)  ఏమిటి ?
జ .  అధి సమస్యలకు ప్రధాన కారణం డబ్బే . 
" డబ్బు ఒక మబ్బు లాంటిది. డబ్బు ఒక సబ్బు లాంటిది. డబ్బు ఒక జబ్బు లాంటిది . డబ్బు ఒక గబ్బు లాంటిది . " 
సమస్యలు లేని జీవి ఈ సృష్టి లోనే లేదు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు . రాముడికైనా సమస్యలు తప్ప లేదు . క్రుష్ణుడికైనా తప్పలేదు . సత్య హరిశ్చ్సంద్రుడికి , నలమహారాజుకు సమస్యలు తప్పలేదు . ఎవ్వరునూ బంగారు స్పూన్ ను నోట్లో పెట్టుకుని పుట్టరు . సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి . చిన్న నాటి నుండే ఎన్ని సమస్యలు ఎదుర్కోగలిగితే అంత అనుభవమొస్తుంది. సమస్యల వలననే , ఖష్టాల వలననే మనిషిలో , ఏదో ఒకటి సాధించాలనే కసి , తపన పెరుగు తుంది . పట్టుదల పెరుగుతుంది . ఆలోచనలతో మెదడు పదను తేరుతుంది . ఒక్కొక్కటి సాధించు కుంటూ పోతుంటే వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది . మనిషిలో క్రమశిక్షన పెరుగు తుంది . జీవితంపై నమ్మకం కలుగుతుంది . ధైర్యం ఏర్పడుతుంది . కష్ట పడి సంపాదిచిన దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చూస్తారు . సమాజంలో గౌరవంగా జీవిస్తారు . నలుగురికి జీవనోపాది కలిగిస్తారు . ఇలాంటి వారే ఇతరులకు ఆదర్శంగా నిలబడుతారు . ' సంపాదించడమంటే ' , కేవలం డబ్బు సంపాదించడం మాత్రమె కాదు . సంతోషంగా జీవించడం కావచ్చు , స్నేహితులను సంపాదించడం కావచ్చు , రాజ కీయంగా లేదా వృత్తి పరంగా ప్రజల అభిమానం , గౌరం పొందడం కావచ్చు .నేడు పెద్ద పెద్ద పరిశ్రమల వ్యవస్తాపకులందరూ , పెద్ద పెద్ద పదవులలో ఉన్న వారెందరో ఎన్నో సమస్యలు ఎదోర్కుని , ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారే .
సమస్యలను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించ వచ్చు . అవి ఒకటి అంతర్లీన మైనవి (బయటకు కనబడనివి . చెప్పుకోడానికి వీలు కానటు వంటివి ). రెండవది భాహ్య మైనవి ( బయటకు కనబడేవి . చెప్పుకోడానికి వీలయ్యేవి ).
సమస్యలను మరల ఆరు రకాలు గా చెప్పుకోవచ్చు . అవి , మొదటిది, ముఖ్యమైనది ఆర్ధిక సమస్యలు . రెండవది ఆరోగ్య సమస్యలు . మూడోవది మానసిక సమస్యలు . నాల్గవది సామాజిక / సాంఘీక సమస్యలు . ఐదవది కుటుంభ సమస్యలు . ఇక ఆరవది పై ఐదింటిలో లేనటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు . అలానే ఒక్కోక్క సమస్యలో నియంత్రించ గలిగేవి . నియంత్రించ డానికి వీలు లేనివి అనే రెండు విభాగాలు ఉంటాయి . నిజానికి మనుష్యులకు సహజంగా వచ్చే సమస్యలకంటే , వారు సృష్టించు కునేవే అధికంగా ఉంటాయి .
చిన్న చిన్న సమస్యలు రాగానే భయ పడ కూడదు , బెంబేలెత్తి పోకూడదు . సమస్యలు ఎవ్వరికైనను సహజమని గుర్తు పెట్టుకోవాలి . సమస్యలకు భయ పడుతూ పోతే ఈగ , దోమ కూడా మనపై సవారి చేస్తాయి . సమస్యలు తాత్కాలిక మైనవి కావచ్చు . దీర్ఘ కాలానికి సంభంధించినవి కావచ్చు .
మెజారిటి సమస్యలకు మూల కారణం డబ్బే . డబ్బు కష్టపడి నిజాయితీగా , సక్రమమైన పద్ధతిలో సంపాదిస్తూ పొదుపు చేసుకుంటూ , సక్రమంగా అవసరాలకే ఖర్చు పెట్టుకుంటూ పోతే , చాలా వరకు సమస్యలు దరిచేరవు.
అంతే కాకుండా మనిషి సంఘ జీవి . మనిషి జీవించడానికి సమాజంలోని బంధు మిత్రుల , కుటుంభ సభ్యుల అందరి సహకారం , ప్రభుత్వ సహకారాలు అవసరం ఉంటాయి .వాటిని కాదని కేవలం తన శక్తిమీదనో లేదా ఏ ఒక్కరి మీదనో లేదా ఏదో ఒక వర్గపు కుటుంభం మీదనో లేదా మరో ఒకే శక్తి మీదనో భారం వేసి జీవిస్తే , సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది . అది తెలుసుకుని మనిషి లోని అరిషడ్ వర్గాలనే ఆరు శత్రువులను , అనగా కామ , క్రోధ , లోభ , మోహ , మధ , మాత్సర్యాలను విడ నాడ గలుగుతే సమస్యలన్నీ దూది పింజాల్లా తేలి పోతాయి .సమస్యలను మరిచిపోవడం ఒక కళే . సమస్యలను మరిచి పోవడానికి , ఉపయోగ పడే మరో వ్యాపకాన్ని అలవర్చు కోవడం వలన కూడా కొన్ని రకాల సమస్యలనుండి బయట పద వచ్చు .

తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లను బట్టి పిల్లల బ్లడ్ గ్రూప్ లను తెలుసుకోవచ్చా ?/ CAN WE FIND THE CHILDREN, BASED ON BLOOD GROUPS OF PARENTS ?

ప్ర .  తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లను బట్టి పిల్లల బ్లడ్ గ్రూప్ లను తెలుసుకోవచ్చా ?

జ . తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లను బట్టి పిల్లల బ్లడ్ గ్రూప్ లను తెలుసుకోవచ్చు . 
అలానే పిల్లల బ్లడ్ గ్రూప్ లను బట్టి తల్లి దండ్రుల బ్లడ్ గ్రూప్ లను తెలుసుకోవచ్చు. 


సాధారణంగా బ్లడ్ గ్రూప్ లు ( 4) నాలుగు రకాలు . అవి ,
1. 'A ' గ్రూప్ , 2. 'B ' గ్రూప్ , 3. 'AB ' గ్రూప్,4. 'O ' గ్రూప్ .
మరల వీటిని 8 రకాలు గా విభజించ వచ్చు . అవి ,
1. 'A ' (Rh+) పాజిటివ్ , 2. 'A ' (Rh-) నెగెటివ్ 3. 'B ' (Rh+) పాజిటివ్ , 4. 'B ' (Rh-) నెగెటివ్ , 5. 'AB ' (Rh+) పాజిటివ్ , 6. 'AB ' (Rh-) నెగెటివ్ ,7. 'O ' (Rh+) పాజిటివ్ , 8. 'O ' (Rh-) నెగెటివ్ .

" తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లను బట్టి పిల్లల బ్లడ్ గ్రూప్ లను తెలుసుకోవడం ".
***************************************************************************
01. తల్లి బ్లడ్ గ్రూప్ 'A ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' A ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ' లేదా 'O ' అవుతుంది . 
02. తల్లి బ్లడ్ గ్రూప్ 'A ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' B ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ', 'B ' ,'AB' లేదా 'O ' అవుతుంది . 
03. తల్లి బ్లడ్ గ్రూప్ 'A ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' AB ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ','B', లేదా 'AB ' అవుతుంది . 
04. తల్లి బ్లడ్ గ్రూప్ 'A ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' O ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ' లేదా 'O ' అవుతుంది . 
_____________________________________________________
01. తల్లి బ్లడ్ గ్రూప్ 'B ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' A ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ','B','AB' లేదా 'O ' అవుతుంది . 
02. తల్లి బ్లడ్ గ్రూప్ 'B ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' B ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'B ', లేదా 'O ' అవుతుంది . 
03. తల్లి బ్లడ్ గ్రూప్ 'B ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' AB ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ','B', లేదా 'AB ' అవుతుంది . 
04. తల్లి బ్లడ్ గ్రూప్ 'B ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' O ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'B ' లేదా 'O ' అవుతుంది .
______________________________________________________
01. తల్లి బ్లడ్ గ్రూప్ 'AB ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' A ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ','B' లేదా 'AB ' అవుతుంది . 
02. తల్లి బ్లడ్ గ్రూప్ 'AB ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' B ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A', 'B ', లేదా 'AB' అవుతుంది . 
03. తల్లి బ్లడ్ గ్రూప్ 'AB ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' AB ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ','B', లేదా 'AB ' అవుతుంది . 
04. తల్లి బ్లడ్ గ్రూప్ 'AB ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' O ' అయితే , బిడ్డ గ్రూప్ తప్పకుండా 'A', లేదా 'B' అవుతుంది .
______________________________________________________ 
01. తల్లి బ్లడ్ గ్రూప్ 'O ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' A ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ', లేదా 'O ' అవుతుంది . 
02. తల్లి బ్లడ్ గ్రూప్ 'O ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' B ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'B ', లేదా 'O' అవుతుంది . 
03. తల్లి బ్లడ్ గ్రూప్ 'O ' , తండ్రి బ్లడ్ గ్రూప్ ' AB ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'A ', లేదా 'B ' అవుతుంది . 
04. తల్లి బ్లడ్ గ్రూప్ 'O ', తండ్రి బ్లడ్ గ్రూప్ 'O ' అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా 'O', అవుతుంది .
_______________________________________________________
(Rh+) పాజిటివ్ (Rh-) నెగెటివ్ ల గుర్తింపు "
*********************************
01. తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లో ఒకరిది (Rh+) పాజిటివ్ మరొకరిది (Rh-) నెగెటివ్ అయితే బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా (Rh+) పాజిటివ్ కావచ్చు లేదా (Rh-) నెగెటివ్ కావచ్చు . 
02. ఇరువురివీ (Rh+) పాజిటివ్ అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా (Rh+) పాజిటివ్ అవుతుంది .
03. అలానే , తల్లి తండ్రుల బ్లడ్ గ్రూప్ లో ఇరువురివీ (Rh-) నెగెటివ్ అయితే , బిడ్డ బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా (Rh-) నెగెటివ్ అవుతుంది .

WHO WILL BE THERE IN COLLEGIUM ? / కొలీజియంలో ఎవరెవరు ఉంటారు ?

ప్ర . కొలీజియంలో  ఎవరెవరు ఉంటారు ?

అసలు " కొలీజియం" అంటే ఏమిటి ? నలుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తుల ధర్మాసనం సూచనతో , సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి , న్యాయ వ్యవస్థ లోని వారినే సుప్రీం కోర్ట్ , రాష్ట్ర హై కోర్టుల న్యాయ మూర్తులుగా నియమిస్తారు . న్యాయ మూర్తుల నియామకాలనే కాకుండా , ట్రాన్స్ఫర్ ల ను మరియు ప్రమోషన్లను చేపడుతారు . దీనికి గవర్నరు , రాష్ట్ర పతి ఆమోద ముద్ర తప్పని సరి. ఈ నలుగురు సభ్యులలో అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు తప్పా ఇతర వ్యవస్థ ల లోని సభ్యులు ఎవ్వరూ ఉండరు .
అయితే ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా తీసు కొచ్చిన కొత్త విధానం ఏమంటే , న్యాయ మూర్తుల నియామకాలను పార దర్శకంగా , విశాల ప్రాతి పదికన చేపట్టడానికంటూ " జాతీయ న్యాయ నియామకాల కమీషన్ " (ఎన్. జె . ఎ . సి . ) ని ఏర్పాటు చేశారు . న్యాయ శాసన వ్యవస్థల నుండే కాకుండా , పౌర సమాజం నుంచి , పార్ల మెంటరీ వ్యవస్థ నుండీ ప్రజా ప్రతినిధులు ఉంటారు . అనగా ఇందులో , సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి , ఇరువురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు , న్యాయ శాక మంత్రి మరియు ఇరువురు ఉన్నత మైన మేధావులు ( వీరిని సూచించే వారిలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి కూడా ఉంటాడు .)
దీనిని సుప్రీం కోర్ట్ 16.10.2015 న కొట్టివేసింది .

సుమారుగా 70% అనేక కులాల , మతాల , ప్రాంతాల , దేశాల సామాన్య ప్రజలున్న భారత దేశంలో , వారు కొంత వరకైనా ధైర్యంగా, ప్రశాంతంగా , ఆత్మాభిమానంతో జీవించాలంటే , న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం ఉండ కూడదు . కొందరంటారు , రాజకీయ నాయక సభ్యులు కేవలం సూచనలు చేస్తారు , మిగిలిన సభ్యులు నచ్చక పోతే వ్యతిరేకించ వచ్చు,అని . ఇక్కడే ఒక గొప్ప తిరకాసు ఉంది . ఆ రాజకీయ నాయకుడి సభ్యుడి వెనుకాల , మొత్తం కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాల పాలకులు ఉంటారు . వారి వద్ద ఎంతటి అధికారం , డబ్బు బలం ,కార్య కర్తల బలం ఉంటుందో అందరికి తెల్సిన విషయమే . అలాంటప్పుడు , ఆ రాజకీయ సభ్యుడి సూచనను వ్యతిరేకించే దమ్ము , ధైర్యం ఎవరికీ ఉంటుంది చెప్పండి . కనీసం ఇప్పుడు కోర్టు తీర్పులను గౌరవిస్తున్నారు , పాటిస్తున్నారు . విమర్శించే సాహాసం కూడా ఎవ్వరూ చేయడం లేదు
కాని రేపు అలా ఉండదు . ప్రతి తీర్పు విమర్శకు తావు ఉంటుంది . రాజకీయ సభ్యుల సూచనలను వ్యతిరేకించే ఇతర సభ్యులు బిక్కు బిక్కున బ్రతుకాల్సి ఉంటుంది . న్యాయ మూర్తులకు తీర్పులు నచ్చక స్వచ్చంద విరమణ చేయ వచ్చు . అప్పుడు వ్యవస్థ మరల తిరోగమన దశలో నడువ వచ్చు ." కొలీజియం " విధానంలో ఏమైనా లోపాలు ఉంటే సూచనలు చేయ వచ్చు . సవరణలు చేయ వచ్చు . న్యాయ మూర్తులను నియామకం చేసే అత్యంత సీనియర్ న్యాయ మూర్తులను ప్రభుత్వాలు సిఫారస్ చేయ వచ్చు . కాని ఎట్టి పరిస్థితులలోనూ న్యాయ వ్యవస్థలో , ఎన్నికల సంఘంలో , రిజర్వు బ్యాంకులో మరియు అన్ని నియంత్రణ సంస్థలలో రాజకీయ నాయకులకు సభ్యత్వం ఉండ కూడదు . వీటికి స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలి . అలా అని , ఏ వ్యవస్థను , ఏ సార్వ భౌమాదికారాన్ని కించ పరిచినట్లు కాదు . వేటి పరిధి వాటివే . వేటి అధికారాలు వాటివే .వేటి భాధ్యతలు వాటివే . వేటి గౌరవాలు వాటివే .
1000 కోట్ల కుంభ కోన దారులకు అత్యధికంగా 7 సంవత్సరాలు శిక్ష విధిస్తే ,100 రూపాయల దొంగలకు ఎన్నోరెట్లు మానసిక , శారీరక శిక్షలుంటున్నాయి . 1000 కోట్ల నల్ల ధన కుభేరులను ఏ . సి .లో , విచారిస్తే , 100 రూపాయల దొంగలను థర్డ్ డిగ్రీతో విచారిస్తున్నారు . పొట్ట కూటి కోసం చేసే 100 రూపాయల దొంగలకు వెంటనే శిక్షలు పడుతే , తర తరాల కోసం దాచిపెట్టే 1000 కోట్ల అవినీతి పరులకు యేండ్ల తరబడి శిక్షలుండవు . ఈ లోగా మల్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు . గెలుస్తారు .
ఎవ్వరైనా పనిచేసేది 12 గంటలే . ఎవ్వరైనా తీసుకునేది ఆహారమే . ఎవ్వరికైనా ఉన్నవి రెండే చేతులు , రెండే కాళ్ళు , ఒకటే శిరస్సు , ఒకటే మొండెం . కాని కొందరే కొద్ది కాలం లోనే కోట్లకు పడగలెత్తు తున్నారు . మరికొందరు జీవితాంతం పేద రికంలోనే మ్రగ్గు తున్నారు , బిక్షాటనే చేస్తున్నారు . అదే అక్రమంగా సంపాదించే వారు కోట్లల్లో సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు . నిజాయితీ పరులు దినమొక గండంగా కాలం వెల్లదీస్తున్నారు . ఎక్కడుంది లోపం ? కనిపెట్టడం ఎలా ? అరికట్టడం ఎలా ? నల్ల ధనం దేశంలో , విదేశాలల్లో లక్షల కోట్లు అనుత్పాదక శక్తి గా మ్రగ్గు తుంది . ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థకు , స్వతంత్రత లేకుండా చేయడ మంటే ప్రజా స్వామ్యాన్ని బలహీన పరచడమే అవుతుంది .
అందరికి సమాన న్యాయం అందాలంటే , ఇప్పుడున్న " కొలీజియం " విధానం లో నేటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని వ్యవస్థల , ప్రజల సూచనలు , సలహాలతో మరిన్ని మార్పులు చేయ డానికి అవకాశం ఉండాలి . మరిన్ని మార్పులు చేయాలి . సామాన్య పేద ప్రజలకు రక్షణ కల్పించాలన్నా , అవినీతి పరుల , నల్ల ధన కుబేరుల ను శిక్షించాలన్నా , న్యాయ వ్యవస్థలో , రాజ కీయ నాయకుల ప్రవేశం ఉండ కూడదు . ప్రస్తుతం అనేకమైన అసాంఘీక శక్తులకు , అవినీతి పరులకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తుంది . ఎలాగో అలాగా డబ్బు ఎగజల్లి గెలుస్తున్నారు . ఎన్నికల సమయంలో డబ్బు దొరికినా ఎవరికీ శిక్షలు పడిన దాఖలాలు లేవు . డబ్బు ఎగజల్లిన వారు , దానిని వడ్డీతో సహా పది రెట్లు అధికంగా సంపాదించు కోవాలని చూస్తున్నారు . ఏదో విధంగా గెలిచినా వారు , ప్రజలకు తెలియ కుండానే శాషనాలు చేస్తున్నారు . దానిని ప్రజలపై రుద్దు తున్నారు . రాష్ట్ర పతి ఎన్నికలకు విప్ లు జారి చేస్తున్నారు . ఇలాంటి కాలంలో , సామాన్య పేద ప్రజలకు , ఒకే ఒక దిక్కుగా ఉన్న , జుడీష్యరీ వ్యవస్థలో కూడా , రాజకీయ నాయకులు ప్రవేశిస్తే , సామాన్య పేద ప్రజల భవష్యత్ ఏమౌతుందో మేధావులు ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి . సుప్రీం కోర్ట్ తీర్పును వ్యతిరేకించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో , సమర్ధించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో క్షున్నంగా పరిశీలించాలి . అప్పుడు విషయం భోధ పడుతుంది . కేవలం ఒకే ఒక పాయింట్ , రాజ్యాంగ బద్ధమైన కమీషన్ అని కాకుండా , మెజార్టీ ప్రజల భవిష్యత్ , ఆర్ధిక అసమానతలు , అవినీతిని , నల్లదనాన్ని అరి కట్టే మార్గాలు అదో గతి పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది . అధికారం చేతికి రాగానే దేశం లోని , రాష్ట్రాల లోని సంపద అంతా పాలకులది గానే భావించే రోజులు పోవాలి . ప్రభుత్వ ఉద్యోగం రాగానే మాదే అధికారం అనుకునే కాలం మారాలి . ఇలాంటి విషయాలలో కట్టడికి న్యాయ వ్యవస్థ లో మార్పులు తీసుకుని రావాలి . సాధారణంగా , సామాన్యులకు , పేదలకు శిక్షలుండ కూడదు . కుంభ కోన దారుల , నల్ల ధన కుభేరుల , అవినీతి పరులకు సత్వర ఖటిన పారదర్శకమైన శిక్షలు విదిస్తూ , సామాన్యుల , పేద వారిలో ఒక భయానక వాతా వరణాన్ని క్రియేట్ చేయాలి . అప్పుడు అందరూ భయ పడుతారు . ఎవ్వరూ తప్పులు చేయరు . దేశ మంతటా విశ్రాంత న్యాయ మూర్తులచే న్యాయ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి . ఈ విధంగా చేయడం వలన కోర్టుల్లో కేసులు కూడా తగ్గుమొఖం పడుతాయి . న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే , అంత పేద , సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది . భద్రత లభిస్తుంది . సుఖ సంతోషాలు లభిస్తాయి . ధైర్యముంటుంది . లేదంటే రాజకీయ నాయకులదే , వారి కార్య కర్తలదే , బలమున్న వారిదే, అవి నీతి పరులదే , బడా అక్రమ వ్యాపార వేత్తలదే ,మోస కారులదే రాజ్య మవుతుంది .

" జన్ ధన్ యోజన పథకం" (JANDHAN YOJANA SCHEME) సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?

ప్ర : " జన్ ధన్ యోజన పథకం  (JANDHAN YOJANA SCHEME) సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే ఏమి చేయాలి?

జ : " జన్ ధన్ యోజన పథకం  (JANDHAN YOJANA SCHEME) సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే, ఈ క్రింద సూచించినవి  అమలు జరగాలి . 

1. రాజ్యాంగ పరమైన " విద్యా హక్కును " , సంపూర్ణంగా , మనః స్పూర్తిగా అమలు చేయాలి .
2. బ్యాంకు వ్యవహారాలపై , ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి .

3. కొన్ని బ్యాంకులను కలిపేయాలి . మరియు బ్యాంకుల బ్రాంచులను ప్రతి గ్రామం లో ఉండేటట్లు చోరువ తీసుకోవాలి .

4. బ్యాంకు ఆఫీసర్లు , సిబ్బంది ' కస్టమర్ ఫ్రెండ్లీ " గా వ్యవహ రించాలి .

5. ప్రజలకనుగునంగా , బ్యాంకుల సమయాలను మార్చాలి .

6. ప్రతి అకౌంట్ కు , నామినీని మ్యాన్డేటరీ చేయాలి . వారి పూర్తి అడ్రస్ లు , సెల్ నెంబర్లు రిజిస్టర్ చేయాలి . అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు , ఎలాంటి కొర్రీలు లేకుండా , అకౌంట్ లోని బ్యాలన్స్ అమౌంట్ , నామినీకి  చెల్లించే ఏర్పాటు చేయాలి .

7. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలి .




8. సర్వీస్ చార్జీలను తగ్గించాలి . సర్వీస్ పన్నును పూర్తి గా ఎత్తి వేయాలి 

ప్ర . బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (N.P.A ) జీరో శాతాని కి తగ్గించ వచ్చా ? CAN WE REDUCE NON PERFORMING ASSETS TO ZERO ?

ప్ర . బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (N.P.A .ల ను ) జీరో శాతాని కి తగ్గించ వచ్చా ?
జ .బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (N.P.A .ల ను ) జీరో శాతాని కి తగ్గించ వచ్చు . అయితే , అంత కంటే ముందుగా  ఎన్ .పి . ఎ  (NPA)  అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం . 
 బ్యాంకులు , ప్రజలకు , కంపనీలకు ఇచ్చిన అప్పులకు సంభందించిన వడ్డీలు , నెల సరి వాయిదాలను 60 నుండి 90 రోజులకు మించి బాకీ పడి ఉన్నట్లయితే , ఆ అప్పుల తాలూకు మొత్తాన్ని , నిరర్ధక ఆస్తులు ( N.P.A.s- Non performing Assets) గా భావిస్తారు . బ్యాంకుల వద్ద ఇప్పుడు సుమారుగా 0.1% నుండి 5% వరకు నిరర్ధక ఆస్తులు ఉన్నాయి . దీనిని బట్టి నిరర్ధక ఆస్తులు , బ్యాంకుల పై , దేశం ఫై ఎంతటి వత్తిడి పెంచు తున్నాయో అర్ధం చేసుకోవచ్చు . వీటి వలన బ్యాంకులకు నష్టమే కాని లాభం ఉండదు . ఇవి కేవలం ఉనుత్పాధక ఆస్తులుగా మిగిలి పోతున్నాయి . ఆ అప్పులు తిరిగి వస్తాయో లేదో తెలియదు . బ్యాంకుల వద్ద పెట్టిన సెక్యూరిటీ లు , వారి అప్పులకు వడ్డీకి సరి పోతాయో లేదో తెలియదు . ఆ సెక్యూరిటీ లను మరెన్ని ఇతర బ్యాంకు ల వద్ద పెట్టారో తెలియదు . తీసు కున్న అప్పులను , సరియయిన వ్యాపారాలకే ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు . ఆ అప్పులకు యే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందో తెలియదు . ఇలా , బ్యాంకులిచ్చే అప్పులు నిరర్ధక ఆస్తులుగా మార డానికి అనేక కారణాలున్నాయి . F/Y 2013 లో ,అన్ని బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 1.5 లక్షల కోట్లు ఉంటే , అవి F/Y 2015 లో 3.1 లక్షల కోట్లకు పెరిగాయి . దీనిని బట్టి నిరర్ధక ఆస్తులు , బ్యాంకుల పై , దేశం ఫై ఎంతటి వత్తిడి పెంచు తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
బ్యాంకులు , ఇక నుండయినా బ్యాంకులిచ్చే అప్పులు , నిరర్ధక ఆస్తులుగా మార కుండా జాగ్రత్త పడుతూనే , ఇప్పుడున్న నిరర్ధక ఆస్తులను 0% వరకు తగ్గించ వచ్చు . ఎలాగంటే ,
01. అప్పులు  ఇచ్చే టప్పుడు  బ్యాంకు అధికారులు రిజర్వ్  బ్యాంక్ మరియు  ప్రభుత్వ  నిభందనలు పాటిస్తూ , నిజాయితీగా వ్యావహ రించాలి . 
02. కనీసం 3 రెట్ల సెక్యూరిటీని  పెట్టు కోవాలి . 
03. అప్పులు ఇచ్చే టప్పుడు  రాజకీయ జోక్యం ఉండ కూడదు . 
04. కమీషన్లకు  కక్కుర్తి  పడే ఇంటి దొంగల వలననే , అప్పులు  ఎక్కువగా  నిరర్ధక ఆస్తులు  (N.P.A ) గా మారుతున్నాయనే  విషయాన్ని పై అది కారులు   సీరియస్ గా  తీసుకోవాలి . 
05. ప్రభుత్వ మరియు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో , ఎన్ . పి. ఎ . లను కఠిన మయన నిభంధనలతో , చట్ట బద్దమయిన కమీషన్ ఏజెంట్లకు , అప్ప గించాలి . వారు అప్పులను వసూలు చేసినందుకు , కొంత కమీషన్ చెల్లించాలి . 
06. అప్పులు వసూలు చేయడంలో ఎక్కడా లాలూచి పడ  కూడదు .రాజకీయ నాయకుల వత్తిడి ఉండ కూడదు . 
07. ప్రత్యేక కోర్టులలో విచారించే విధంగా చట్టాలను సవరించాలి .
08.  కేసుల సెటిల్ మెంట్స్ కు పరిమితి ఉండాలి . సాద్యమైనంత వరకు , ఏజెంట్స్ కౌన్సిలింగ్ ద్వారానే అప్పులను వసూలు చేయ గల్గాలి .
09. అలానే , ప్రభుత్వ మరియు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో , ఎన్ . పి. ఎ . లను కఠిన మయన నిభంధనలతో , చట్ట బద్దమయిన " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " , నిరర్ధక ఆస్తులను , రావాల్సిన అసలును మరియు మినిమం వడ్డీ మొదటి నుండి లెక్కలు వేసి అమ్మి వేయాలి . కస్టమర్ల అనుమతి తో , " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " అగ్రిమెంట్ చేయించాలి . వరిజినల్ డాక్యుమెంట్స్ ను " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " కస్టమర్ల అనుమతి తో , అప్పగించాలి . ఒక సారి అప్పు వసూలయి , డాక్యు మెంట్స్ అప్పగించారంటే , ఇక ఆ కష్టమర్ తో బ్యాంకు కు సంభందముండదు .  
10. సాద్యమైనంత వరకు , " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లు " కౌన్సిలింగ్ ద్వారానే అప్పులను వసూలు చేయ గల్గాలి .

Saturday, February 20, 2016

లోకంలో గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి ?

ప్ర . లోకంలో గొప్ప  ఆశ్చర్యకరమైన  విషయాలు  ఏమిటి ?
జ. 01.  లోకంలో  తాను చని పోయే వరకు ఎంతో మంది  మనుష్యుల  పుట్టుకలను , చావులను  చూస్తూనే  ఉంటాడు . పుట్టిన వాడు గిట్టక తప్పదు . పుట్టే టప్పుడు  ఏమి తీసుకుని రారు .  గిట్టే టప్పుడు ఏమి తీసుకుని పోరు . ఈ మద్య కాలం లోనే  అనేక మైన  కోపాలు , తాపాలు  , అహాలు ,  కక్షలు , కార్పణ్యాలు  , ఈర్ష్యలు , అసూయలు  అలానే  ప్రేమలు , ఆప్యాతలు , మమతలు , అను రాగాలు  , భావోధ్వేగాలు , ధన దాహార్తులు  ఎన్నో , ఎన్నెన్నో . ఈ విషయాలన్నీ  పూర్తిగా తెలుసు . ఐనను  తాను  చని పోతానేమో నని  భయ పడుతుంటాడు , బాధ పడు తుంటాడు , ఏడుస్తుంటాడు . ఇదే  లోకంలో గొప్ప  ఆశ్చర్యకరమైన  విషయం . 
02. 

2016 -2017 కేంద్ర ఆర్ధిక బడ్జెట్ (BUDGET) లో ఎలాంటి మార్పులు చేస్తే ఆర్ధిక అసమానతలు తగ్గుమొఖం పడుతాయి ?

 ప్ర . 2016 -2017 కేంద్ర ఆర్ధిక  బడ్జెట్ (BUDGET) లో   ఎలాంటి మార్పులు చేస్తే  ఆర్ధిక అసమానతలు  తగ్గుమొఖం పడుతాయి  ?
జ . 01.  ఆదాయాన్ని బట్టి మాత్రమే  కాకుండా , వారి వార్షిక ఖర్చును  బట్టి    ఆదాయపు పన్నును విధించాలి . 
(ఐ . టి .  రిటర్నలలో 5 లక్షలు  చూపిస్తున్నారు , ఎన్నికలలో , ఫంక్షన్లలో  5 కోట్లు ఖర్చు పెడుతున్నారు )
02. ఆదాయ పరిమితి  స్లాబులను ( ఆడ , మగ , చిన్న , పెద్ద తార తమ్యం  లేకుండా  , పన్నుల మదింపు విధానాలను  సులభ తరం చేయ డానికి , రిటర్న్లను  సులువుగా  ఫైల్  చేయడానికి ),  ఈ క్రింది విధంగా  సవరించాలి . 
 నికరాదాయం ( రూ  .లు). 
0,00,001 నుండి  5,00,000 వరకు  - నిల్
5,00,001 నుండి  8,00,000 వరకు  - 10%
8,00,001 నుండి 10,00,000 వరకు  - 20%
10,00,001 నుండి  ఆ పైన               - 30%
03. అన్ని ఇతర  మినహాయింపులను  రద్దు చేయాలి . 
04.   ఎడ్యు కేషన్ సెస్స్  ను యదా విధిగా కొన సాగించాలి . 
05. సె . 80 సి  క్రింద  మినహాయింపును  3 లక్షలకు పెంచాలి . 
06. వడ్డీ మినహాయింపును  2 లక్షలకు  పెంచాలి .
07. టి.  డి.  ఎస్.  పరిమితిని  రూ . లు . 10 వేల నుండి  30 వేలకు పెంచాలి . 
08. సంపద పన్నును 50 లక్షల పై  ఆదాయానికి  1% విధించాలి . 
09.  బ్యాంక్ ఫిక్సెడ్ డిపాజిట్లను , పోస్టాఫీస్   ఫిక్సెడ్ డిపాజిట్లను  పన్ను మినహాయింపుకు  3 సంవత్సరాలకు  కుదించాలి . 
10. రాజకీయ  నిధుల పైన ఆదాయ పన్నును  విధించాలి . 
11. పెద్ద పెద్ద కిరాణ షాపులను , బట్టల షాపులను , హోటళ్ళను , మాల్స్ ను పన్నుల పరిధిలోకి  తీసుకుని రావాలి. 12. 1 లక్షా 45 వేల కోట్ల నల్ల ధనాన్ని  వెలికి తీసి , ప్రతి ఒక్క పేద  వారి  అక్కౌంట్లో  15 లక్షలు  వేయాలన్న లక్ష్యాన్ని  వేగతరం చేయాలి .   

నికరాదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేయాలా ?

ప్ర . నికరాదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేయాలా  ?
జ . సామాన్య ప్రజానీకం ఎప్పటి నుండో కోరుకుంటున్న విషయం ఇది . " సంవత్సర కాలంలో అన్ని రకాలుగా సంపాదించిన కుటుంభ మొత్తం నికర ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సిలెండర్ల సబ్సిడీని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం " సాహసో పేతం . ఒక్క గొప్ప ఆలోచన . ఇక నుండి ఎం .పి . లను , ఎం . ఎల్ . ఎ లను , పెద్ద వ్యాపారస్తులను , సినీ ఫీల్డ్ వారిని , పెద్ద పెద్ద క్రీడా కారులను , అధి కారులను , పెద్ద పెద్ద కళా కారులను , జ్యోతిష్యులను , అనేక మైన వృత్తుల వారిని , భూ స్వాములను గ్యాస్ సబ్సిడీని వదులు కోండని బుజ్జ గించ నవసరం లేదు .నికర ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేయాలి . ఇలానే అనేక మైన ఇతర సంక్షేమ పధకాలలో కూడా అమలు పరుస్తే , వేలాది కోట్ల ఆదాయం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదా కాగలదు . ఐతే దీనిని నల్ల ధనంగా మార్చ కుండా , వినియోగ వస్తువుల ధరలు , సేవల ధరలు తగ్గే విధంగా , పన్నులను తగ్గించడం , ఆరోగ్యానానికి , విద్య కు , సాంకేతికాభి వృద్ధికి ఉపయోగించే టట్లు శ్రద్ధ చూపాలి . అలానే ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేసే టప్పుడు , స్వచ్చందంగా వదులుకునే వారు '0' నొక్కండి అనే వాయిస్ రికార్డింగ్ ను ఎత్తి వేయాలి . దీని వలన , పేద వారు తెలిసీ తెలియక '0' నొక్కినా సబ్సిడీ క్యాన్సిల్ అవుతుంది . 

కాని వీటిని ఎంత వరకు పార దర్శకంగా , నిస్వార్ధంగా అమలు పరుస్తారనేదే , లక్ష డాలర్ల ప్రశ్న .

Friday, February 19, 2016

బస్సుల్లో చిల్లర సమస్యను తగ్గించాలంటే ?

ప్ర. బస్సుల్లో చిల్లర సమస్యను తగ్గించాలంటే ?

జ. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు , అధిక రద్దీ వలన , ప్రతి రోజూ ప్రయాణమే ఒక నరకం అవుతుంది . దానికి తోడూ , చిల్లర డబ్బుల గురించి , కండక్టర్ ప్యాసెంజెర్ల మధ్య ప్రతి నిమిషం వాదనలే . బస్సుల్లో , చిల్లర అనేదీ పెద్ద సమస్యగా మారింది. చిల్లర డబ్బులు లేని కారణంగా , అర్ధాంతరంగా , ప్యాసేన్జర్లను బస్సు నుండి దింపివేసిన సంఘటనలూ లేక పోలేదు . తిట్టు కున్న , కొట్టు కున్న సంఘటనలూ లేక పోలేదు .

ఇక పోతే , చిల్లర డబ్బుల సమస్య కారణంగా , కొందరు టికట్లు తీసు కోకుండా ప్రయాణిస్తూ ఉండ వచ్చు . అలానే , బ్యాలన్స్ డబ్బులు టిక్కట్ల మీద వ్రాయడం వలన , మరిచి పోయి నష్ట పోయిన ప్యాసేన్జర్లు కోకొల్లలు .

ఇలాంటి సమస్యలను , కొంత వరకయినా తగ్గించాలంటే , ఒకే ఒక చక్కని మార్గం , దూరాన్ని బట్టి ఫిక్స్ డు చార్జీలను నిర్ణయించడం.

1. ఆర్డినరీ బస్సు లకు, మొదటి ఒక స్టాపుకు 5 రూ .లు., 10 స్టాపుల వరకు 10 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 15 రూ .లు .

2. మెట్రో బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 5 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు .

3. మెట్రో ఎక్ష్ ప్రెస్ బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు .

4. డీలక్ష్ బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు .

5. నాన్ ఎ . సి . బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 10 రూ .లు., 10 స్టాపుల వరకు 15 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 20 రూ .లు .

6. ఎ . సి . బస్సులకు , మొదటి ఒక స్టాపుకు 15 రూ .లు., 10 స్టాపుల వరకు 20 రూ . లు ., ఆ పై న ఎన్ని స్టాపులకైనా 30 రూ .లు . నిర్ణయించాలి.

కాంబి నేషన్ టిక్కట్సు చార్జీలు ఎ .సి బస్సులకు 20 రూ లు. , మిగిలిన అన్ని బస్సులకు 10 రూ . లు . గా నిర్ణ యించాలి .

రోజు వారి పాసులు , ఆర్డినరీ 50 రూ లు. , మెట్రో 75 రూ . లు , మరియు ఎ . సి . బస్సులకు 100 రూ లు . గా నిర్ణయించాలి .

ఈ విధంగా చేయడం వలన ఆర్ . టి .సి . కి , తాత్కాలికంగా కొంత నష్టం జరుగ వచ్చు కాని , లాంగ్ రన్లో లాభాల బాట పడుతుంది . క్రొత్త విధానాలను ప్రజలు ఆద రించాలంటే , దీనికి ప్రజలు అలవాటు పడా లంటే , కొంత నష్ట పోక తప్పదు .

ఈ విధంగా చేయడం వలన , చిల్లర సమస్యను తగ్గించ వచ్చు . బస్సుల్ల్లో చిల్లరకు సంభందించి గొడవలు , కొట్లాటలు తగ్గించ వచ్చు . ఆటల్లో వెళ్ళే , వెహికిల్స్ పైన వెళ్ళే , కార్లల్లో వెళ్ళే ప్రయానికులను ఆకట్టు కుని , ఆక్యుపెన్సీ పెంచ వచ్చు. ప్రయానికులకు డిజిల్ , పెట్రోల్ ఖర్చులను ఆదా చేయ వచ్చు , దేశానికి డిజిల్ , పెట్రోల్ దిగుమతి వ్యయాన్ని తగ్గించ వచ్చు . వెహికిల్స్ ట్రాఫిక్ రద్దీని తగ్గించ వచ్చు . పొల్యూషన్ ను నివారించ వచ్చు .

ప్రయాణికులు కూడా బస్సు ప్రయాణమంటే , చాలా హాపీ ఫీలవుతారు .అవసరాలను బట్టి , పరిస్తితులను బట్టి మార్పులు చేర్పులు చేసు కోవచ్చు .


రైలు టిక్కెట్ వలన ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి ?

ప్ర . రైలు  టిక్కెట్ వలన  ఏమేమి  ప్రయోజనాలు  ఉంటాయి ?

జ. " కాదేది  కవితకు  అనర్హం - అగ్గి పుల్ల , సబ్బు బిళ్ళ , కుక్క పిల్ల " అని  ప్రముఖ కవి  శ్రీ . శ్రీ  గారు  అన్నట్లు , " కాదేది  విజ్ఞ్యానానికి  అనర్హం - బస్సు టికెట్  , రైలు టికెట్  , విమాన టికెట్  ". 
రైలు  టికెట్  తీసుకోవడం వలన  , నిర్ణీత  కాల  సమయంలో , నిర్ణీత స్థలానికి  ప్రయాణం చేయ డానికి  అనుమతే  కాకుండా , అనేకమైన  ఇతర  ప్రయోజనాలు కుడా  ఉన్నాయి . 
 ఉదా : నెక్కొండ నుండి  సికింద్రాబాద్  వరకు ప్రయాణం  చేయాలని జనరల్  రైల్  టికెట్ తీసుకున్నామనుకుందాం .  అప్పుడు మనకు  కలిగే ప్రయోజనాలు :
01. దర్జాగా  సీటులో  కూర్చొని  ( రద్దీ  ఎక్కువగా  ఉన్నపుడు అడ్జస్ట్  కావాలి ) నిర్ణీత  ప్రాంతమైన సికింద్రాబాద్ కు , ఎవ్వరికీ  భయపడకుండా , హాయిగా  ప్రయాణం చేయ వచ్చు . 
02. రైల్ టికెట్  ఏ  క్లాసు , ఎక్ష్ప్ ప్రెస్సా  , ప్యాసింజరా  తెల్సు కోవచ్చు . 
03. టికెట్ పైన  నెక్కొండ నుండి  సికింద్రాబాద్  వరకు ఎంత  చార్జో  తెలుసుకోవచ్చు . ఉదా : సెకండ్ క్లాసు / ఎక్ష్ప్ ప్రెస్  రూ  .లు . 70/- . 
04. నెక్కొండ నుండి  సికింద్రాబాద్  వరకు ఎన్ని  కిలో మీటర్ల దూరమో  తెలుసు కోవచ్చు . ఉదా : 172 కి . మీ . 
05. ఏ  తేదీన ప్రయాణం  చేశామో  తెలుసు కోవచ్చు .( దాని మీదనే  ముద్రించ బడు తుంది ) ఉదా : 18.02.16.
06. అంతే కాకుండా  ఏ సమయాన టికెట్ తీసుకున్నామో ముద్రించ బడు తుంది. ఉదా : 15. 59.  (18.02.16.). 
07. ఏదేని  సమస్య ఎదురైనప్పుడు  రైల్వే  డిపార్ట్ మెంట్  కు తెలియ జేయ డానికి, హెల్ప్ లైన్  నెంబర్  ముద్రించబడి ఉంటుంది . ఉదా : 138.  
08. రైలు  వయా  ఎ మార్గాన పోతుందో  తెలుసు కోవచ్చు .(ముద్రించ  బడి ఉంటుంది)  ఉదా : ఖాజీపేట్ . 
09.  ఆ రైల్ టికెట్  పైన  ఎంత మంది ప్రయాణం చేశారో  తెలుసుకోవచ్చు . 
10.  ఆ టికెట్ పైన  పిల్లలు  ప్రయానించార , పెద్దలు ప్రయానించారా , సీనియర్  సిటిజన్స్ ప్రయానించారా   తెలుసుకోవచ్చు . 
11.ఆ రైల్  టికెట్ నెంబర్  తెలుసుకోవచ్చు .ఉదా : B 24311383. 
12. అది ఏ  రైల్ వే నో  తెలుసుకోవచ్చు . ఉదా : SOUTH CENTRAL RAIL WAY.
13. ఆ  టికెట్  ఎంత మందమో  తెలుసుకోవచ్చు . ఉదా : 130 GSM.
14. రైల్  ఎక్కే స్టేషన్  మరియు  దిగే స్టేషన్  రెండూను  , ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో  ముద్రించ బడి ఉంటుంది. అందుకని  దీనిని కూడా  మనం తెలుసుకోవచ్చు .  

Saturday, February 13, 2016

మనిషి " కంఫర్ట్ జోన్ " లో నివశిస్తే ప్రయోజనం ఏమిటి ? / WHAT ARE THE BENEFITS IF ONE WHO LIVE IN COMFORT ZONE ?

ప్ర . మనిషి " కంఫర్ట్ జోన్ " లో     నివశిస్తే ప్రయోజనం ఏమిటి ?
జ . యే  మనిషైనా  " కంఫర్ట్ జోన్ " లో    నివశిస్తుంటే  అధ్బుతాలు  సృష్టించ గలడు . అతడు లేదా ఆమె  పేదలు  కావచ్చు . ధనికులు కావచ్చు . అక్షరాస్యులు కావచ్చు  లేదా నిరక్ష రాస్యులు కావచ్చు . శరీరం పైనా  , మనసుపైనా  ఎలాంటి ఉందని  కారణంగా  వారి మనసు ప్రశాంతంగా  ఉంటుంది .  అలాంటి వారి నుండి వచ్చే  ఆలోచనలు , ఐడియాలు  , సూచనలు , నూతన ఆవిష్కరణలకు  మూలమవుతాయి .  ఎన్నో సమస్యలకు  పరిష్కార మార్గాలవుతాయి . మరెందరికో ఆదర్శ మవుతాయి . 

అసలు ఈ  " కంఫర్ట్ జోన్ " లో   నివశించడమంటే ఏమిటి ?
" మనిషి  ఆరోగ్యంగా  , ఆహ్లాదకర  వాతావరణంలో  , ఎలాంటి  సామాజిక  , ఆర్ధిక , కుటుంభ , మానసిక    సమస్యలు  లేకుండా  , కనీస వసతులైన  కూడు , గూడు , గుడ్డ  , విద్య  కలిగి ఉండటాన్ని  " కంఫర్ట్ జోన్ " లో   నివశించడం గా  చెప్ప వచ్చు " . 

 ఈ  " కంఫర్ట్ జోన్ " ను  ప్రభుత్వాలు గనుక  యుద్ద ప్రాతి పదికన  , ప్రజలకు  అందించ గలుగుతే , ప్రజలను  " కంఫర్ట్ జోన్ " లో కి  గనుక తీసుక రాగలుగుతే , ఆ తరువాత  ప్రజలే  ప్రభుత్వాలకు  వెన్ను దన్నుగా ఉండి ,  ఎన్నో గొప్ప  సూచనలను  చేస్తారు  . ఎన్నో  సలహాలను  ఇస్తారు . మరెన్నో  ఐడియాలను  అందిస్తారు . అభి వృద్దిలో బాగా స్వాములవుతారు . ఎన్నో వృధా వ్యయాలను  తగ్గిస్తారు . ప్రభుత్వ ఆదాయాలను పెంచ డానికి కృషి  చేస్తారు . ప్రజలపై  తరుచూ  వెచ్చించే  ఖర్చును  తగ్గిస్తారు . సమాజంలో  కొట్లాటలు  , గొడవలు  , దొంగ తనాలు , దోపిడీలు , హత్యలు ,  కోర్టు కేసులు తగ్గి పోతాయి . వారి  శరీరం పైనా  , మనసుపైనా  ఎలాంటి ఉండని  కారణంగా  వారి మనసు ప్రశాంతంగా  ఉంటుంది .  అలాంటి వారి నుండి వచ్చే  ఆలోచనలు , ఐడియాలు  , సూచనలు  కోట్ల విలువ చేస్తాయి . అంతే కాదు , కొందరి మనష్యుల కలయికే  కుటుంభం . కొన్ని కుటుంభాల కలయికే  సమాజం . సమాజమంతా  కలిస్తేనే  రాష్ట్రం , దేశం  మరియు ప్రపంచం .  అందుకని  మనుష్యులు  " కంఫర్ట్ జోన్ " లో  జీవించ గలుగుతే రాష్ట్రంలో , దేశంలో  మరియు ప్రపంచంలో  ఎక్కడా  ఎలాంటి  సమస్యలు  ఉత్పన్నం  కావు . 
  
ప్రజలను  " కంఫర్ట్ జోన్ " లో కి  తీసుక రావడానికి  మొదట  ఖర్చు ఎక్కువకావచ్చు . కాని  భవిష్యత్తులో  ఖర్చు తగ్గి పోతుంది . ఉదా : సోలార్  ఇన్ స్టాలేషన్ కు మొదట  ఖర్చు బాగానే  అవచ్చు . కాని  దీర్ఘ కాలంలో  మల్లీ  ఖర్చు ఉండదు . అలాంటిదే  ఈ " కంఫర్ట్ జోన్ " ఖర్చు కుడా . 
అలా  కాకుండా , ప్రజలను  కేవలం ఓటు  బ్యాంక్ గా  చూస్తూ , పేదలను  మాడ్చుతూ , ప్రజలలో  కుల , జాతి , మత మరియు ప్రాంతీయ  వైషమ్యాలను  సృష్టిస్తూ , విభేదాలను  పెంచుతూ , స్వార్ధం తో  , అత్యాశతో  అవినీతి సొమ్మును  , నల్ల ధనాన్ని  విదేశీ  బ్యాంకులలో ,  ట్రస్ట్ లలో , పరోక్షంగా  ఎఫ్ . డి . ఐ  లలో  , చంద్ర మండలం  భూములపై  మరియు  ఆస్తులను బినామి పేర్ల మీద  పెట్టుకుంటూ  పోతే , భారత దేశం  ఎప్పటికీ  అభివృద్ధి చెందిన దేశంగా  గుర్తించ బడదు . అభి వృద్ధి చెందు తున్న దేశంగానే  గుర్తించ బడుతుంది .   
    

Thursday, February 11, 2016

అనుమానం అంటే ఏమిటి ? మనిషికి అనుమానం ఎందుకు కలుగుతుంది ? నమ్మకం అంటే ఏమిటి ? నమ్మకం ఎలా ఏర్పడుతుంది ?

ప్ర . అనుమానం అంటే ఏమిటి ?  మనిషికి  అనుమానం  ఎందుకు కలుగుతుంది ? నమ్మకం అంటే ఏమిటి ? నమ్మకం ఎలా ఏర్పడుతుంది ?
జ .సాధారణంగా  ప్రతి నిత్యం  ఏదో ఒక చోట  లేదా  ఏదో ఒక వ్యవస్థలో  లేదా ఒక  సంస్థలో  లేదా ఏదో ఒక కుటుంభంలో   వినే  పదాలలో   " అనుమానం "  కుడా  ఒకటి . ఈ " అనుమానం " అనే భావనల వలన , ఆలోచనల వలన  ,  అనేకమైన  సంఘటనలతో  ఎన్నో కుటుంభాలు  , మరెన్నో వ్యవస్థలు  కుప్ప కూలి పోతున్నాయి .  అందుకే  నాలుగు అక్షరాల పదమైన  " అనుమానం "  బీజాక్షరాల్లా  అందరి నోల్లల్లో  శ్వాస ఉన్నంత వరకూ  ఉచ్చరింప బడుతూ నే  ఉంటున్నది   .   అయితే  ఈ  " అనుమానం "  అనేదే  లేక పోతే   వీటికి రెట్టింపు కుటుంభాలు , వీటికి రెట్టింపు  వ్యవస్థలు  కుప్ప కూలి పోతాయి . " నమ్మి నాన  బోస్తే  పుచ్చి  బూడిద అయినట్లు " , అన్నిటిని , అందరిని నమ్ముకుంటూ  పోతే  చివరికి ఏమి మిగలదు . గొర్రె కసాయి వాన్ని  నమ్ముతుంది . కాని కసాయి దాని ప్రాణాలు తీస్తాడు . వ్యవసాయ దారుడు , నాణ్యమైన విత్తనాలనే  నమ్మి , ఎక్కువ ధర పెట్టి కొని తెచ్చి చెలుక దున్ని వేస్తాడు . అవి మొలకెత్తనపుడు  తెలుసుకుంటాడు , నేను నమ్మి  మోసాపోయానని .  నిరుద్యోగి  నమ్మి  ఏజెంట్ కు  లక్షలు కుమ్మరిస్తాడు . ఉద్యోగ రానప్పుడు  తెలుసుకుంటాడు , నేను మోస పోయానని .  సామాన్య ప్రజలు  చిట్టీలు వేస్తారు .  వారు బిస్తరు చదురుకున్న రోజు , ఇంటికి తాళం వేసిన రోజు తెలుసుకుంటాడు , నేను మోస పోయానని .   రాజకీయ నాయకుల వాగ్దానాలు , మాటలు  నమ్మి  , ఓటర్లు  ఓట్లు  వేసి అత్యధిక  మెజారిటీతో  గెలిపిస్తారు . కాని  వారు పరి పాలించే టపుడు  తెలుస్తుంది  ఓటర్లకు , మేము  నమ్మి  ఓట్లు వేసి  మోసాపోయామని .  అదియును గాక , ఒక వేల అందరూ  నమ్మకాల మీదనే  జీవిస్తుంటే  ,  అపుడు  ఈ చట్టాలు , పోలీసు  వ్యవస్థ  , న్యాయ వ్యవస్థ  , ప్రభుత్వాలు  ఏవీ అవసరం ఉండదు . బలమైన వారే  , తెలివైన వారే  , హుషారు గల వారే ,  అందమైన వారే  , ఎదుటి వారిని మోసం చేసుకుంటూ  కొంత కాలం  హాయిగా  జీవించ వచ్చు .  కొంత కాలం ఎందుకన్నానంటే  ,  కొంత కాలం తరువాత  ,  మోస పోయే వారు  పని చేయరు . సంపాదించరు . ఎలాగో నమ్మి మోసపోతున్నాం  కదా , ఎందుకు  కష్ట పడాలి  , ఎవరికోసం సంపాదించాలి , ఎవరికోసం బ్రతుకాలి  అని అనుకుంటారు .  అడ్డ చాకిరి చేసి  , " కాకుల కొట్టి  గద్దలకు  వేయాలా " అని పనులు మానేస్తారు . ఈ విధంగా  శ్రమ శక్తి ఆగి పోతుంది , ఉత్పత్తి  ఆగి పోతుంది . దేశ అభి వృద్ది ఆగి పోతుంది .  అందు కని  " అనుమానం "  మరియు     " నమ్మకం "  రెండూ  ఉండాలి . రెండూ  బ్యాలెన్సింగ్ గా  ఉండాలి . ప్రతి నాణానికి , ప్రతి నోటుకు   బొమ్మ , బొరుసూ  రెండూ  ఉండాలి . అలా ఉంటేనే నాణానికి  గాని  రూపాయి ప్రతి నోటు కుగాని విలువ ఉంటుంది . చెల్లు బాటు   అవుతుంది .  అందుకని  అను మానించే  వారిని  చులకనగా చూడకూడదు . అనుమానించే  వారిని  నేరస్తులుగా  భావించ కూడదు .  సి . ఐ . డీ . లకు  , ఎ . సి బి . వారికి  ,  ఇన్వెస్ట్ గేషన్  వ్యవస్థలకు ,  ప్రభుత్వాలకు , యజమానులకు ,  తల్లి దండ్రులకు , బార్యలకు , భర్తలకు      " అనుమానం "  అనేది  ఒక   ' ఆయుధం ' లాంటిది . అంతే  కాదు    " అనుమానం " అనేది  రెండు వైపులా పదునున్న కత్తి  లాంటిది  కుడా .     " అనుమానం "  ద్వారా  సత్యాన్ని  బయటకు తీయ వచ్చు , అలానే  అనుమానించే వారి  మీద  నిందలు , అబాండాలు వేసి , తమ తమ కార్య కలాపాలాను  నిర్విగ్నంగా  కొన సాగించుకోవచ్చు .   
అసలు  ఈ   " అనుమానం " అంటే ఏమిటి ?
బాధ్యత  గల  వ్యక్తులు , తాము ఇచ్చిన పనిని  సక్రమంగా నిర్వర్తిస్తున్నారా  లేదా  అని గాని  , తాము  చేసిన తప్పును  కప్పిపుచ్చుకోడానికి  ప్రయత్నిస్తున్నారా లేదా అని గాని , తమ  బిడ్డలు  దారి తప్పుతున్నారా  లేదా అని గాని ,  రహస్యంగా  తెలుసు కోవడానికి  ప్రయత్నించ డాన్నే   " అనుమానం " గా  చెప్పుకోవచ్చు .   
 మనిషికి ,  ఎదుటి వారి పైనా   ఎందుకు  అనుమానం   కలుగుతుంది ?
ఎదుటి మనిషి ,( ఆడ కావచ్చు  లేదా మగ కావచ్చు)  వారి  మాటల  తీరులో , నడవడికలో , ఆలోచనలలో , చేష్టలలో , సగటు  వ్యక్తులకు  భిన్నంగా , అసాదారణ రీతిలో ,  కోరికలలో , వేష భాషలలో , దుస్తులలో ,  చూపులలో  ,  సైగలలలో  ,  వ్యవహార శైలిలో   తేడాలు , మార్పులు  , కనబడి నప్పుడు ,  స్వేచ్చగా  ఉండాలనుకున్నపుడు , స్వేచ్చగా  తిరుగాలనుకున్నపుడు , ఒంటరి తనాన్ని ఇస్టపడినపుడు , వద్దన్న పనిని వాలాంచి  చేసినపుడు ,  ఎదురుగా  ఒక తీరుగా   మరియు చాటుగా  మరొక తీరుగా  నడుచుకున్నపుడు ,  అతి భయంగా  అతి  అమాయకంగా  నటించి నపుడు , అనుబంధం గల వారికి ఎదురు తిరిగినపుడు , కేర్లేస్స్  చేసినపుడు , బెదిరించి నపుడు , దబాయించి నపుడు , గదరాయించి నపుడు , చీదరించుకున్నపుడు , అసహ్యించు కున్నపుడు , కించ పరిచినట్లుగా  మాట్లాడినపుడు  ,  ఇతరులముందు  డామినేషన్  కనబరచినపుడు ,  కోట్లాడి  నపుడు , తిట్టి నపుడు , కొట్టినపుడు ,  ఏదో  సాధించు కోవాలని  బయట ప్రజలు  వినేటట్లుగా  అరిచినపుడు , రేడియో టైపులో  మాట్లాడి నపుడు - వారితో సంభందం, అనుభందం గల వారికి  గల వారికి  , వారిపై అధికారం గల  ప్రతి ఒక్క  వ్యవస్థకు  , ప్రతి ఒక్క  సంస్థకు  , ప్రతి ఒక్కరికి , అలాంటి వారిపై  " అనుమానం " కలుగుతుంది  .  అయితే , ఈ విధంగా నడుచుకున్న వారంతా  పొరపాటు చేసినట్లు  కాదు . తప్పు చేసి నట్లు కాదు . నేరం చేసినట్లు కాదు , మోసం చేసినట్లుకాదు .  కాని అనుమానాన్ని కలిగింప చేస్తారు . అనుమానాన్ని రేకెత్తింప  చేస్తారు. 
" అనుమానం  పెను భూతం " కాదన లేము . కాని  "నిప్పులేనిదే  పొగరాదు "  అనే సామెత కూడా  వాడుకలోనుండి  వచ్చినదే .  
భారత  దేశం   విలువలకు , సంస్క్రతికి , సాంప్రదాయాలకు , కట్టుబాట్లకు  పుట్టినిల్లు . సమాజంలో  బ్రతుకు తున్నపుడు  మనుష్యులు   విలువలకు , సంస్క్రతికి , సాంప్రదాయాలకు , కట్టుబాట్లకు  అనుగుణంగా నడుచుకోవాలి . భావి తరాలకు  ఆదర్శం కావాలి .  అలా కాకుండా  నా డబ్బు నా యిష్టం  , నా శరీరం  నా యిష్టం , నా సంపద  నా యిష్టం ,  నా పిల్లలు  నా యిష్టం  అంటే  రోడ్డుకు  అడ్డంగా నడుస్తే ఏమవుతుందో అదే జరుగు తుంది.  ఆ కారణంగానే   వ్యవస్థలు , సంస్థలు, కుటుంభాలు   కుప్ప కూలి  పోతాయి . సంసారాలు కుక్కలు  చింపిన  విస్తరులవుతాయి . 
నమ్మకం అంటే ఏమిటి ? 
అనుమానానికి , ఆవ నమ్మకానికి  పూర్తి వ్యతిరేక పదం  " నమ్మకం " .  బాధ్యత  గల  వ్యక్తులు , తాము ఇచ్చిన పనిని  సక్రమంగా నిర్వర్తిస్తున్నారా  లేదా  అని గాని  , తాము  చేసిన తప్పును  కప్పిపుచ్చుకోడానికి  ప్రయత్నిస్తున్నారా లేదా అని గాని , తమ  బిడ్డలు  దారి తప్పుతున్నారా  లేదా అని గాని ,  రహస్యంగా  తెలుసు కోవడానికి  ప్రయత్నించ కుండా  , పరిశీలించ కుండా  ఉండడాన్నే  " నమ్మకం " గా  చెప్పుకోవచ్చు . 
నమ్మకం ఎలా ఏర్పడుతుంది ?
వ్యవస్థల మద్య , సంస్థల మద్య , మనుష్యుల మద్య , కుటుంభ సబ్యుల మద్య , భార్యా భర్తల  మద్య   అలానే  వ్యవస్థలకు ప్రజలకు మద్య  , సంస్థలకు  ప్రజలకు  మద్య  ఎలాంటి  దాప రికాలు లేకుండా , మనస్పర్ధలు లేకుండా , అబద్దాలు, మోసాలు లేకుండా, స్వార్ధం  లేకుండా, ఇంకా చెప్పాలంటే  కామ క్రోధ ,మోహ , లోభ మధ మాత్సర్యాలు  లేకుండా  సామాజిక , ఆర్ధిక  , కుటుంభ  వ్యవహారాలూ  నడుస్తూ ఉంటే , అప్పుడు,   ఒక దానిపై   మరొక దానికి , ఒకరిపై  మరొకరికి  నమ్మకం ఏర్పడుతుంది .