Tuesday, October 24, 2017

ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బింభిస్తున్నదా ?

ప్ర : ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతి బింభిస్తున్నదా ?


జ : ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన ' రాష్ట్ర పతి' ఎన్నిక ప్రతిబింభించడం లేదేమో నని    అనిపిస్తుంది . 

సాధారణ ఎన్నికల సమయాలలో , ప్రజలు గత పాలకుల వలన కలిగిన భాధలు , కష్టాలు గుర్తుకు తెచ్చుకొని లేదా నాయకుల వాగ్దానాలను నమ్మి , భావోద్వేగాలకు లోనయి , కొన్ని పార్టీలను తూడ్చి పెడుతారు , మరి  కొన్ని పార్టీలను అందల మెక్కిస్తారు . ఒక సంవత్సరమో , రెండు సంవత్సరాలో గడుస్తే గాని వారి నిజ స్వరూపం బయట పడదు . వారి నిజ స్వరూపం బయట పడేసరికి , వారు ప్రజల కంట్రోల్ లో  లేకుండా పోతున్నారు . ఎన్నికైన  ఏ పార్టీ అయినా  5 సంవత్సరాలు  పాలించాలి . అలాంటి  సమయాల్లో , రాష్ట్ర పతి ఎన్నికలు జరుగుతున్నాయి . అప్పుడు అధికార పార్టీలు       ' విప్పు'  జారీ చేయడం , రాష్ట్ర పతి ఎన్నిక పూర్తి అవడం మొదలైనవీ,  కొన్ని సార్లు , ప్రజల మనో భావాలకు అత్యున్నతమైన రాష్ట్ర పతి ఎన్నిక ప్రతిబింభించడం  లేదేమో నని అని పిస్తుంది .


www.sollutions2all.blogspot.com

Sunday, October 22, 2017

How to find the Diseases and how to control Diseases? జబ్బు లను కనుక్కోవడం ఎలా ? జబ్బు లను నివారించడం ఎలా ?

Q.How to find the Diseases and how to control Diseases?
ప్ర. జబ్బు లను కనుక్కోవడం ఎలా ? జబ్బు లను నివారించడం  ఎలా ?

జ . ఈ కాలం లో  , ఏ చిన్న  జబ్బు చేసినా  హాస్పిటల్స్ కు వెలుతాము .  పదుల సంఖ్య లో , అవసరం ఉన్నా , లేకున్నా   డాక్టర్లు  అనేకమైన టెస్టులు  వ్రాస్తారు . జబ్బులకు  మందులు  కొనక ముందే  , ఉన్న డబ్బులన్నీ  ఊడ్చేస్తారు .  పరీక్షలు వారి ల్యాబ్ ల్లోనే    చేయించు కోవాలి , మందులు  వారి  హాస్పిటల్  లోనే  కొనాలి .  కొందరు  హాస్పిటల్స్ వారు  ,  అవసర మున్నా , లేకున్నా    హాస్పిటల్  లోనే   జాయిన్  కావాలంటారు . మరి కొన్ని  హాస్పిటల్స్ వారు  , చని పోయిన  శవం  పైనా  బిల్లులు  దండు కుంటారు .  ఈ కారణంగా  అనేక మంది  నిరు పేద , సామాన్య , మధ్య తరగతి  ప్రజలు  ,  దొరికిన కాడల్లా  అప్పులు చేసి , ఆ అప్పులు తీర్చలేక , రోగాలు తగ్గక   ఆత్మ హత్యకు  పాల్పడుతున్న వారెందరినో  , మనం  రోజూ  చూస్తున్నాం . 

మరి దీనికి  పరిష్కారం  లేదా ?

ఎందుకు లేదు . ఉంది . మనసుంటే  మార్గముంటుంది . ఆలోచిస్తే  అవకాశాలుంటాయి . ప్రయత్నిస్తే  ఫలితాలుంటాయి . డబ్బులు  ఆదా చేసు కోవాలన్నా , ఆరోగ్యాన్ని  కాపాడుకోవాలన్నా , అంతా  మన చేతిలోనే  ఉంది . 

అందుకు  చేయవలసిందల్లా , వారి  జీవిత  కాలంలో, వారికీ, వారి కుటుంభం సభ్యులకు  ఎదురైనా  జబ్బులను , వాటి కొరకు  తీసుకున్న  జాగ్రత్తలను , పరీక్షలను , మందులను  ఒక డైరీ లో వ్రాసుకొంటూ  పోవాలి .  ఈ విధంగా  వ్రాసుకుంటూ  , మరల  చదువుకుంటూ  అనలైజ్  చేసుకుంటూ పోతే ,  ప్రతి ఒక్కరూ , తమ చిన్న చిన్న జబ్బులకు  పరిష్కారం చూప గలిగే  ఒక  చిన్న డాక్టర్  కాగలరు  .

"మనిషి  మర్మం  పరమాత్మకెరుక"  అన్నట్లు ,  మనిషి  అనారోగ్య రహస్యం  శరీరానికెరుక . అంతర్గత  జబ్బులకు   , ప్రతి బింభం  మన  బాహ్య శరీరం . మనిషి  లోపలి అనారోగ్య సమస్యలన్నీ , ఎప్పటికప్పుడు మనిషి శరీరం పైన కనిపిస్తాయి .  వాటిని విశ్లేషించుకుని , తగు చర్యలు  తీసుకుంటే  శరీరానికి  హాయి , డబ్బు ఆదా  మరియు సమయం ఆదా అవుతాయి .

తెలుగులో   ఒక సామెత , "ఆరోగ్యమే  మహా భాగ్యం " అన్నారు  పెద్దలు . మనం ఆరోగ్యాంగా ఉంటేనే మనకు  ఎంతో సంపద ఉన్నట్టు లెక్క .  అలానే  ఆంగ్లంలో  ఒక సామెత  ఉంది ,   " PREVENTION IS BETTER THAN CURE"  అని . జబ్బు  రాక  ముందే , మన బాహ్య శరీరం పై కనపడే   లక్షణాలను (SYMPTOMS)  బట్టి  , మన శరీరంలోపల  కలిగే  నొప్పులను , వాంతులను , మోషన్స్ ను  బట్టి  తగిన జాగ్రత్తలు , నివారణ చర్యలు  తీసుకోవడం మేలు  అనేది  దీని భావం . ఈ  రెండూ  మన ఆరోగ్యానికి  సంబంధించినవే . ప్రతి సామెతలో , ప్రతి నానుడిలో  ఎంతో అర్ధం ఉంటుంది .   అనేక మంది మానవుల   గొప్ప  అనుభవం నుండి  బయట పడిన  సత్యాలే , సామెతలు . ఆ విధంగా   మానవుల అనుభవాలతో   గొప్ప  డాక్టర్లు గా  ప్రధమ చికిత్సలను  అందించా వచ్చు  . అనారోగ్యానికి  గురి కాకుండా  చూడ వచ్చు .   ప్రతి ఒక్కరూ , తమ కుటుంభం వరకైనా  ఒక డాక్టర్ గా   మార  వచ్చు .  మాకు ఏమి తెలుసు అనుకుంటే , ఎప్పటికి మీరు ఏమి కాలేరు . 

మనుష్యులకు  సాధారణముగా  వచ్చే  జబ్బులు కొన్నిటిని గురించి ఇక్కడ  తెలుసుకుందాం:

డయాబేటిస్  (DIABETES):

దీనినే  షుగర్ వ్యాధి అని కూడా అంటారు . 

డయాబేటిస్  (DIABETES), రెండు రకాలుగా ఉంటుంది . మొదటిది  టైప్  -1 ,                రెండవది  టైప్ -2. 


టైప్  -1, డయాబేటిస్  (DIABETES)  వలన  మనకు  కనబడే / ఏర్పడే  లక్షణాలు :



అ ) . తరుచుగా  మూత్రానికి  వెళ్లడం జరుగుతుంది ,
ఆ ) . ఆకలిగా  ఉండడం, 
ఇ ) .  తొందరగా అలిసి పోవడం, 
ఈ ) . కండ్లు  మంట  మండటం , మసక బారడం ,
ఉ ) . గాయాలైతే  తొందరగా మానక పోవడం ,
ఊ ) . అరికాళ్ళల్లో  మంటలు  ఏర్పడటం ,
రు ) . శరీరం మీద పలు చోట్ల  గోకుడు / దురద పుట్టడం  మొదలైనవి . 


టైప్  -2, డయాబేటిస్  (DIABETES)  వలన  మనకు  కనబడే / ఏర్పడే  లక్షణాలు :



అ ) .  అధికంగా   మూత్రానికి  వెళ్లడం జరుగుతుంది , 
ఆ ) . అధికంగా ఆకలిగా  ఉండడం ,
ఇ ) .  అధికంగా  అలిసి పోవడం ,
ఈ ) . కండ్లు  మంట  మండటం ,మసక బారడం ,
ఉ ) . గాయాలైతే  అసలే  మానక పోవడం  మొదలైనవి . 
ఊ ) . అరికాళ్ళల్లో  మంటలు  బాగా  పొడిచినట్లుగా    ఏర్పడటం , 

రు ) . శరీరం మీద పలు చోట్ల  గోకుడు / దురద పుట్టడం , 
రూ) . ఇంకను  అధిక మైతే , సొమ్మసిల్లడం లేదా   క్రింద పడి  పోవడం జరుగ వచ్చు . 

ఇలాంటి లక్షణాలు  (SYMPTOMS) , ఏ  ఒకటో రెండో కాకుండా   కనీసం  3 - 4  ఏర్పడి నప్పుడు  లేదా  కనబడినప్పుడు , ఈ క్రింది  నివారణ చర్యలు  తీసుకోవాలి . 
అ ) . తీపి  పదార్ధాలు , మిఠాయిలు  తినడం  మాని వేయాలి ,
ఆ ) . టీ , కాఫీ లలో  చక్కర మాని వేసి , షుగర్  బిళ్ళలు  గాని , పౌడర్  గాని టీలో  వాడాలి ,
ఇ ) .  పిండి పదార్ధాలు  తినడం తగ్గించాలి ,
ఈ ) . రోజుకు ఒక పూట అన్నం తిని ,మరొక పూట గోధుమ లేదా జొన్న  రొట్టెలను  తినడం  అలవాటు చేసు కోవాలి.  
ఉ ) . రోజు పరి గడుపున , రాత్రి పూట  కొన్ని మెంతులు  నాన బెట్టి .  ఆ నీటిని  త్రాగాలి . 
ఊ ) . లేదా  రోజూ  పరి గడుపున  మెంతి పౌడర్ ను  పావు  గ్లాస్ నీటిలో కలుపుకుని త్రాగాలి.
రు ) . వారానికి ఒక సారి  మెంతి ఆకు పచ్చడిని , పూదీన  ఆకు పచ్చడిని , కాకర కాయ  కూరను  వండుకుని తినాలి . 
రూ ) . ప్రతి రోజు కొంత టైం ,  వారికీ  సాధ్యమైన / అనుకూలమైన రీతిలో   వ్యాయాయం  చేయాలి,
రు ) . ఒంటరిగా ఉండకుండా  అందరితో  కలిమిడిగా ఉండటం అలవాటు చేసుకోవాలి . 

ఈ విధంగా  చేయడం వలన , ప్రాధమిక దశలో  ఉన్న వారికీ  పూర్తిగా కంట్రోల్ అవుతుంది . ఇక అప్పటికే  టైప్ 2 లోకి  వెళ్లిన వారికీ  , కంట్రోల్ కావడం  కొంచం కష్టం కావచ్చు . అలాంటి వారికీ , అవే  లక్షణాలు కనబడుతున్నట్లయితే ,  ఒక సారి  సరియైన  డాక్టర్ కు   చూపించుకుని  ' బ్లడ్ షుగర్ ' పరీక్షలు  చేయించుకోవాలి. దీని కొరకు  2 సార్లు  రక్త పరీక్ష లు చేస్త్తారు . ఉదయం లేవగానే  పరిగడుపున  ఒకసారి  బ్లడ్ తీసుకుని  మరియు  భోజనం చేశాక  2 గంటల తరువాత  మరల బ్లడ్ తీసుకుని ,  ' బ్లడ్ షుగర్ ' టెస్ట్ చేస్తారు . 
పరిగడుపున   టెస్టులో  రీడింగ్  70-100 mg/dl ఉన్నా మరియు  అన్నం తిన్న తరువాత టెస్ట్ లో  101  -140 mg/dl  వరకు  ఉన్నా  నార్మల్  గానే భావించాలి .  అంత కంటే  ఎక్కువ గా ఉంటే  మాత్రం , డాక్టర్   సూచించిన  మందులను  క్రమంగా  వాడాలి . అలానే , పైన  సూచించిన నివారణ చర్యలు  కంటిన్యూ చేయాలి . 

జ్వరం  ( FEVER):

జ్వరం (FEVER) అనేది సర్వ సాధారణం . జ్వరం (FEVER) అనుభవం  లేని వారు  ఈ ప్రపంచంలో  ఏ ఒక్కరూ  లేరు . అందుకని కేవలం  జ్వరం (FEVER) వచ్చిందని  ఏ  ఒక్కరూ  భయపడ నవసరం లేదు . 

జ్వరాలలో  కూడా అనేక రకాలు ఉంటాయి . సాధారణ జ్వరం , వైరల్  జ్వరం , మలేరియా జ్వరం , టైఫాడ్ జ్వరం , ఎల్లో జ్వరం ,  డెంగ్యూ  జ్వరం , చికెన్  గున్యా జ్వరం  మొదలైన వాటిని ముఖ్యంగా  చెప్పుకోవచ్చు . 

సాధారణంగా  ఒక మనిషి   'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE) 98.4 P/H డిగ్రీలు  ఉంటే  నార్మల్ అని చెబుతారు . ఒకవేల  'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE)  100.4 P/H డిగ్రీలు  ఉన్నా పెద్ద సమస్యగా భయపడనవసరం లేదు . అయితే 100.4 P/H డిగ్రీలు  దాటి అది కంటిన్యూగా ఉన్నా , తగ్గుతూ పెరుగుతూ ఉన్నా , వెంటనే  హాస్పిటల్ కు  తీసుకుని వెళ్లి  " బ్లడ్  టెస్ట్ " లను చేపించి దానికి  అనుగుణంగా  డాక్టర్ సూచించిన మందులు  వాడల్సి ఉంటుంది . జ్వరం (FEVER) రక ముందే  లేదా  కాస్త  జ్వరం (FEVER) అనేది  కనబడి నప్పుడే తగిన చర్యలు  తీసుకున్నట్లయితే , జ్వరం(FEVER) 100.4 P/H డిగ్రీలు దాటదు. 


జ్వరం (FEVER) రావడానికి  అనేక కారణాలు  ఉంటాయి . ఒక్కో రకం జ్వరాని కి  (FEVER), ఒక్కో రకం కారణం (REASON) ఉంటుంది . 

జ్వరం (FEVER) రావడానికి కారణాలు (REASONS) :

01. అధిక పనుల కారణంగా  అలసి పోవడం వలన ,
02. ఎండలో తిరగడం వలన ,
03. వాతావరణంలో మార్పులు కలగడం ,
04. కాలుష్యమైన  ఆహారాన్ని భుజించడం ,
05. కాలుష్యముతో కూడిన  గాలిని, విష వాయువులను  పీల్చడం వలన ,
06. కాలుష్యముతో కూడిన నీటిని త్రాగి నప్పుడు ,
07. భయం వలన 
08. దోమలు కుట్టడం వలన 
09. జంతువులు ( కుక్కలు , పందులు )  కరువడం  వలన , పక్షులు  , క్రిమి కీటకాలు  కుట్టి నపుడు ,
10. గాయాలు తగిలినప్పుడు ,
11. కాలినపుడు , కరెంట్ షాకు తగిలినప్పుడు ,
12. ఆపరేషన్  చేసి నప్పడు ,
13. ప్లాసిటిక్  కప్పులలో  టీ  లు త్రాగి నప్పుడు , ప్లాస్టిక్ ప్లేట్లల్లో  టిఫిన్ , భోజనం  చేసినప్పుడు , ప్లాస్టిక్ కవర్లలో పానీయాలు త్రాగి నపుడు , ఇలా అనేక కారణాల వలన , టెంపరేచర్ పెరుగడం , జ్వరం కలుగుతూ ఉంటుంది . 


సాధారణ జ్వరం (FEVER):  

సాధారణ జ్వరం (FEVER)  అలసి పోవడం వలన , ఎండలో  తిరగడం  వలన  వాస్తు ఉంటుంది , పోతూ  ఉంటుంది .  ఇలాంటి జ్వరం అయినట్లవుతే  ప్యారాసిటమాల్  మందులతో  తగ్గి పోతుంది . 

వైరల్  జ్వరం (VIRAL FEVER):

వైరల్  జ్వరం (VIRAL FEVER) , ఇది  ఇన్ఫెక్షన్  వలన వస్తుంది . అంటే కలుషితమైన  ఆహారాన్ని గాని , పదార్ధాలను తిన్నపుడు  , పానీయాలను  గాని  నీటిని గాని  త్రాగి నప్పుడు , కలుషితమైన గాలిని  పీల్చినపుడు , శరీరం లో , బ్లడ్ లో ఇన్ఫెక్షన్  ఫామ్  అవుతుంది . ఆ కారణంగా వైరల్  జ్వరం (VIRAL FEVER)  వస్తుంది . అప్పుడు  డాక్టర్ సూచించిన  పారాసిటమాల్ మరియు  అంటి బయాటిక్  కలిపి  తీసుకున్నట్లయితే వైరల్  జ్వరం (VIRAL FEVER)  రెండు మూడు రోజులలో తగ్గి పోతుంది .  జ్వరం తీవ్రతను బట్టి  డాక్టర్లు సెలైన్ ఎక్కిస్తారు . 



TO BE CONTINUED........

నోట్ : ఇది  కేవలం  ప్రజల  అవగాహన  కొరకు మాత్రమే  సూచించడం  జరిగింది .  ఎవరి నిర్ణయాలకు , ఎవరి ఖర్చులకు , ఎవరి ఆరోగ్యాలకు  వారే బాధ్యులు . అవసరం అనుకున్న వారు , వారి జబ్బులను బట్టి , సరియయిన డాక్టర్లను  సంప్రదించి  పరీక్షలు చేయించుకోవాలి , మందులు వాడాలి . వెళ్లిన ప్రతి సారీ  ఉచితంగా చేసే టెస్ట్ లు 'టెంప రేచర్' , 'బి . పి 'ని  అడిగి ప్రిస్క్రి ప్సన్  మీద వ్రాయ మని చెప్పాలి .  

Thursday, September 14, 2017

WHAT ARE THE PROBLEMS IN OLD AGE AND HOW TO OVER COME THEM?వృద్ధాప్య దశలో లేదా ఒంటరి తనంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ?వీటిని అధిగమించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏమి చేయాలి ? చివరి దశ వరకు సుఖ మయ జీవనం గడపాలంటే ఏమి చేయాలి ?

ప్ర : వృద్ధాప్య దశలో లేదా ఒంటరి  తనంలో  ఎలాంటి  ఇబ్బందులు  ఎదురవుతాయి ? వీటిని  అధిగమించడం  ఎలా ? ఎక్కువ కాలం  జీవించాలంటే ఏమి చేయాలి ?  చివరి దశ వరకు  సుఖ మయ జీవనం  గడపాలంటే ఏమి చేయాలి ?
జ : ఏ ఉద్యోగం లేని వారికీ వృద్ధాప్య దశ అనగానే కొందరికి భయం మొదలవుతుంది . ఇక ఉద్యోగం చేసే వారికీ రిటైర్మెంట్ దగ్గర పడుతుందంటే భయం మొదలవుతుంది . ఈ భయానికి అనేక మైన కారణాలు ఉన్నాయి . అవి ,
01. అసలు భయానికి ముఖ్య కారణం ఏమంటే " ప్రాణం మీద తీపి " . ఇంకా నేను చాలా కాలం హాయిగా బ్రతకాలి , సంపాదించాలి , సుఖాలు అనుభవించాలి అని అనుకునే " కోరిక". అంతే కాకుండా కొందరికి , నేను సంపాదించిన ఆస్తులు , బంగళాలు , బంగారాలు ఇక్కడే వదిలి పెట్టి పోవాల్సివస్తుంది గదా అనే భయం పట్టుకుంటుంది. మరి కొందరికి , తమ కుటుంబ సభ్యులను వదిలి పెట్టి పోవాల్సి వస్తుందిగదా అన్న భయం ఉంటుంది . ఇంకొందరికి వారి వారి కర్మలను బట్టి స్వర్గానికి పోతానో , నరకానికి పోతానో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో నాన్న భయం ఉంటుంది.
02. సహజంగానే వయసు మీద పడటం వలన , ఏ పనులు చేసుకోడానికి కూడా శరీరం సహకరించక పోవచ్చు ,
03. వృద్ధాప్య దశలో సంపాదన తగ్గి పోతుంది . ఏ పనీ లేని వారికీ అసలు సంపాదనే ఉండదు ,చేతిలో పని లేక పోవడం , ఇంట్లో ఖాళీగా ఉండటం , డబ్బు సంపాదించ లేక పోవడం వలన , ఇంట్లో వారికీ వీరిపై చులకన భావం ఏర్పడుతుంది. లెక్క చేయరు . తీసి పారేసినట్లుగా మాట్లాడుతారు. ఆ కారణంగా ఆరోగ్యం క్షీణించి పోవచ్చు. అయితే ఇదే విధానం అందరి ఇందులో ఉంటుందని నేను చెప్పలేను. ఉదా: మదర్ థెరిస్సాను , అక్కినేని నాగేశ్వర్ రావు గారిని , ఇంకా బ్రతుకాలనే కోరుకున్నారు. అమితా బచన్ గారిని , వారి కుటుంబ సభ్యులు ఇంకా బ్రతుకాలనే కోరుకుంటారు.
04. ఒంటరి తనం కావచ్చు . భార్య ఉండి , భర్త లేక పోవడం , భర్త ఉండి భార్య లేక పోవడం , పిల్లలు లేక పోవడం లేదా దూర దేశాలలో ఉండటం , అందరు వున్నా లేమి వలన , బంధు మిత్రులు దగ్గరికి రానివ్వక పోవడం వలన ఒంటరిగా ఫీల్ కావాల్సి రావచ్చు ,
05. వయసు మీద పడుతున్న కొలది , శరీరంలో రోగ నిరోధక శక్తి (RESISTANCE POWER) తగ్గి పోయి , రోగాలు , జబ్బులు బయట పడుతుంటాయి . బావిలో నీరు తగ్గి పోయినపుడు , రాళ్లు , రప్పలు , పెంకాసులు , సీసపు ముక్కలు , మట్టి కనపడ్డట్లు , అప్పటి వరకు దాగి ఉన్న , జబ్బులన్నీ , ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి ,
06. అప్పుల భాదలు , భాద్యతలు , సంపాదన తక్కువ అవడం , అయినా వారు ఒక్కొక్కరు దూరమవడం వలన ( బెల్లం ఉన్నంత కాలమే ఈగలు చుట్టుముడుతాయి) , మానసిక రందులు పెరుగుతాయి ,
07. వీటికి తోడు , పిల్లలు చేసిన తప్పుడు పనుల వలననో, స్వ కార్యాల వలన నో, ఆస్తుల తగాదాల వలననో లేదా మరే ఇతర కారణాల వలననో , కోర్టు కేసులలో ఇరుక్కోవడం జరుగుతుంటాయి ,
08. మరి కొందరు పుట్టుక నుండే అంగ వైకల్యులుగానో , పేద తనం లోనో జీవించవల్సి రావడం
పైన చెప్పిన విధంగా , వృద్ధాప్య దశలో ఆర్ధిక ఇబ్బందులు , శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు , ఒంటరి తనం ఇబ్బందులు , అనారోగ్య పర మైన ఇబ్బందులు కలుగుతుంటాయి. వీటిలో కొన్నిటిని తప్పించు కోవచ్చు , మరి కొన్నిటిని తప్పించు కోలేం .
వృద్ధాప్య దశ ను అధిగ మించాలన్నా , ఎక్కువ కాలం జీవించాలన్నా , చివరి దశ వరకు సుఖ మయంగా జీవించాలన్నా , ఎవరికి వారే , వారికీ సాధ్యమైన అవకాశాలను వినియోగించుకుని సుఖమయ జీవితం గడపాలి.
01. వృద్ధ దశకు వచ్చిన వారు గాని లేదా ఇక ఏమి సంపాదించే శక్తి లేని దశకు వచ్చిన వారు గాని ముఖ్యంగా గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమంటే , మేము ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులు (అవి అక్రమమో , సక్రమమో, భూములు , భవనాలు , వ్యాపారాలు , డబ్బు , బంగారు నగలు , వజ్ర వైఢూర్యాలు ,డాలర్లు , ధాన్యం మరియు ఇతరములు) అన్నియు మా పిల్లలవే . మా తరాలవే . మేము పోయే టప్పుడు ఏ ఒక్కటి వెంట తీసుకుని పోము . అన్నిటినీ ఇక్కడనే వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది అనే పచ్చి నిజాన్ని , స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. అప్పుడు మీరు పూర్తిగా ఫ్రీ అయి పోతారు.
02. మన మానసిక , శారీరక శక్తి సామర్ధ్యాలను , ఆరోగ్య పరిస్థితులను , కుటుంభం విలువలను , ఆర్ధిక పరిస్థితులను , తరాల మార్పులను అర్ధం చేసుకోవాలి , వాటికనుగుణంగా నడుచు కోవాలి.
03. సాధ్యమైనంత వరకు , పాజిటివ్ గా ఆలోచించాలి . జీవితానుభవాలను గుర్తు కు తెచ్చుకుని కోపాన్ని తగ్గించు కోవాలి . బేసీజలకు పోకూడదు . క్రమ శిక్షణ వలన , ధ్యానం వలన సహనం లభిస్తుంది . కోపం తగ్గుతుంది .ఆ విధంగా గౌరవం పెరుగుతుంది .
04. ప్రతిరోజు తమ స్వభావానికి , అభిరుచులకు తగిన, తమ వృత్తులకు సంభందించిన ఎదో ఒక వ్యాపకాన్ని తప్పనిసరీగా ఎంచుకోవాలి . అది నాలుగు డబ్బులు సంపాదించి పెట్టేదే కావచ్చు లేదా సమాజ / సంఘ సేవా కావచ్చు .
ఉదా : 
1. పుస్తక పఠనం కావచ్చు ,
2. రచనలు కావచ్చు ,
3. ఫ్రీ లాన్సర్ కావచ్చు ,
4. ఫొటోగ్రఫీ కావచ్చు ,
05. వాస్తు , జ్యోతిష్యం , సంఖ్యా శాస్త్రం కావచ్చు ,
06. పూజారి తనం కావచ్చు,
07. కిరాణా, బట్టల , హోటల్ , పాన్ షాప్ , మరేదైనా వ్యాపారం కావచ్చు ,
08. అనుభవానికి సంబందించిన అకౌంటింగ్ , మార్కెటింగ్ , కన్సల్టింగ్ , మరేదైనా కావచ్చు ,
09. ఆన్ లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు ,
10. ఎల్ ఐ సి లాంటి వాటికీ ఏజెన్సీ గా వర్క్ చేసి కమీషన్ సంపాదించ వచ్చు ,
11. షేర్స్ , మ్యూచువల్ ఫండ్స్ , ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు ,
12. నటన , మేకప్ మరేదైనా ట్రైనింగ్ కావచ్చు ,
13. సెక్యూరిటీ , వాచ్ మన్ లాంటి మరియు తోటమాలి ఉద్యొగాలు కావచ్చు .
14. మీకు ఇష్టమైన మరేదైనా వ్యాపారం కావచ్చు.
05. సాధ్యమైనంత వరకు ఒంటరిగా జీవించ కుండా చూసుకోవాలి . కుటుంభ సభ్యులతో గాని , మనుమలు మనుమరాండ్లతో గాని , ఎప్పుడూ వారితో సరదాగా , సంతోషంగా కాలం గడుపుతూ ఉండాలి . వారి పుట్టిన రోజులకు , పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలుపుతూ , వారికీ దగ్గరవ్వాలి . శుభకార్యాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి . భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి . మీ అనుభవాలను సద్వినియోగం చేయాలి.
06. బంధువులతో , స్నేహితులతో మంచి స్వభావంతో మాట్లాడుతూ ఉండాలి . సలహాలు ఇవ్వాలి , సలహాలు తీసుకోవాలి. ఎవ్వరు లేక పోతే దేశం లో 130 కోట్ల జనాభా ఉంది . ప్రపంచం మొత్తంలో సుమారుగా 740 కోట్ల జనాభా ఉంది మీరు పరిచయాలు పెంచుకోడానికి . విశాలమైన భూమి ఉంది . మనసుంటే మార్గం ఉంటుంది .
07. ఇంకా ఎదో సాధించాలనే ఆలోచన ( ఇతరులకు , తమకు నష్టం వాటిల్లకుండా ఉంటే పర్వాలేదు) , నా మాటే చెల్లాలనే మొండి పట్టు , నేను చెప్పినట్లే అందరూ వినాలి అనే భావన మనసులోకి రానీయ కూడదు . దీని వలన కుటుంభం సభ్యుల మధ్య ఘర్షణలు పెరిగి వివాదాలు, గొడవలు పెరుగుతాయి. ఈ గొడవలు మానసిక రందులకు దారి తీస్తాయి. ఆ వెంటనే రోగాలకు దారితీస్తాయి . ఆ గొడవలు , రందులు , రోగాలు ఆర్ధిక పరిస్థితులను దిగదారుస్తాయి . ఇవన్నీ మనిషికి సుఖ శాంతులు లేకుండా చేస్తాయి .
08. ఇతరులను మోసం చేయాలని గాని , హింసించాలని గాని , ఎదుటి వారు చెడి పోయేటట్లు చేయాలనే భావన మనసులోకి రాకూడదు . అందరు బాగుండాలి అనే ఆలోచనే మనసులో మెదలాలి .
09. ప్రతి రోజు కొంత దూరం నడుస్తూ ఉండటం , వ్యాయాయం , ధ్యానం చేస్తూ ఉండాలి .
10. ఏ విషయం లోనూ ఎదుటివారిని / ఇతరులను విమర్శించడం అనే దానిని ఒక వ్యాపకంగా పెట్టుకోకూడదు . విమర్శల వలన , ఈ వయస్సులో మీకు లాభం కన్నా , నష్టమే ఎక్కువగా జరుగుతుంది.
11. సరియైన పద్దతిలో ఆహరం తీసుకోవడం , క్రమంగా డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఉండాలి. చిన్న నాటి నుండి మీరు , మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న జబ్బులను , అవి రావడానికి గల కారణాలను , వాటికీ వాడిన మందులను , ఒక క్రమ బద్దంగా డైరీ లో వ్రాసుకుంటూ , వాటినీ రెగ్యులర్ గా అనుసరిస్తున్నట్లయితే , మీ ఇంటికి మీరే ఒక డాక్టర్ .
12. తమ కంటే పెద్ద వారి యొక్క , గొప్పగా జీవించిన వారి యొక్క అనుభవాలను , ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలి.
ఉదా : మహాత్మా గాంధీ , మధర్ థెరిస్సా , డాక్టర్ . అబ్దుల్ కలాం , డాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు మొదలయిన వారి జీవితాలను చదువాలి . అర్ధం చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకోవాలి .
ఈ విధంగా నడుచుకున్నట్లయితే , చివరి దశ వరకూ  సంతోషంగా , ఆనందంగా  సుఖ మయ జీవనం గడపవచ్చు . జీవితానికి  సార్ధకత  చేకూర్చవచ్చు.
మార్గం కృష్ణ మూర్తి.

Tuesday, September 5, 2017

What are the benefits to make the 'Aadhaar Card Number' as a 'Cell Number'?


Q: What are the benefits to make the 'Aadhaar Card Number' as a 'Cell Number'? 


A: "One INDIA, One MAN/WOMAN, One Aadhaar Number and One Cell Number". Service provider may be any. There must be portable facility.


Benefits to make  the 'Aadhaar Number' as a 'Cell Number': 


01.Black Money will be identified and controlled, since all the bank accounts and other all investments are going to link with the 'Aadhar'.

02. Corruption will be reduced, 

03.Un social elements will be controlled, 

04.People's additional Cells cost will be reduced. And we can also avoid foreign 'Cells'.

05.Phone Bills cost and GST burden will be come down. 

06.For the Police dept & Courts, 'Time & Cost' will be saved to settle the cases easily & quickly, 

07.India will become fair & transparent and hence increase the credibility in the world. 

08. Once the Aadhaar Number become as a Cell Number, people need not submit KYC with the any authorities in life time. KYC is nothing but Identity of a Customer. So, so much duplicating work can be eliminated and time & cost will be saved to people.

09. Once you link the Aadhaar Number as well as Cell Number to Voter card, Crores of Duplicate Voters Cards will be eliminated and the honest and the capable Leaders will be elected to run the Govt smoothly and transparently and efficiently, subject to thorough scrutinise of nominated candidates .

10. Once you link the 'Aadhaar Number' as well as 'Cell Number' to the 'Social welfare Schemes', the Govt may save Crores of rupees. Now the some people are earning money in all the schemes by putting dummy names as we have seen in the news papers.

"Every Indian must propose to give 'Bharat Rathna Award' to Mr. Nandan Nilekani, who saved crores of rupees to India by creating Aadhar Number to every one and updating time to time".


www.sollutions2all.blogspot.com

Saturday, September 2, 2017

ప్ర : IS DEMONETISATION GOT SUCCESS? డీమానిటైజేషన్ (DEMONETISATION) ( పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ) విజయ వంతం (SUCCESS) అయ్యిందా?

 :  డీమానిటైజేషన్  (DEMONETISATION) ( పెద్ద నోట్ల  రద్దు ప్రక్రియ )  విజయ వంతం (SUCCESS) అయ్యిందా?

జ :  డీమానిటైజేషన్  (DEMONETISATION) ( పెద్ద నోట్ల  రద్దు ప్రక్రియ )   విజయ వంతం (GRAND SUCCESS) అయ్యిందనే  చెప్పాలి .  ఇక  దాని తరువాత  జరుగ వలిసిన  ఆపరేషనే  మిగిలి ఉంది . 

కొందరు  అనుకుంటున్నట్లుగా  'డీమానిటైజేషన్'  (DEMONETISATION) ( పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ )   ఫేల్ల్యూర్  కాలేదు . అపజయం పాలు  కాలేదు. అపహాస్యం కాలేదు. దీని వలన   సామాన్య  మధ్య తరగతి  ప్రజలలో , నల్ల ధనం  పై ఎంతటి  వ్యతిరేకత  ఉందో  తెలిసింది . నల్లధనం  ఏ రూపం లో ఉంటే , దానిని  మార్చు కోలేక పోతారో  తెలిసింది . ఏ రూట్లో  పోతే  నల్లధనాన్ని  అరికట్టవచ్చో  ప్రభత్వానికి తెలిసింది .  దాని పరిణామమే  'ఆధార్ ' లింక్ .  నల్లధనాన్ని  దక్కించు కోవాలని , ఎలా ప్రయత్నాలు  చేస్తారో  తెలిసింది .  అందుకే మొత్తం  బ్యాంకింగ్ వ్యవస్థలో  వేశారు . అవినీతి (CORRUPTION)  లేదని గాని , నల్ల ధనం (BLACK MONEY) లేదని గాని , దేశం లో మోసాలు  జరగటం లేదని గాని  ఎవ్వరూ  ఒప్పు కోరు . ఇది అక్షర సత్యం .  డీమానిటైజేషన్  (DEMONETISATION) కు సంభందించిన  ఫలితాలు రావడానికి  కొంత సమయం  పట్టవచ్చు .  బ్యాంకింగ్ వ్యవస్థలో వేసిన  డబ్బుకు  సరియైన  లెక్కలు  చూపని  ఖాతాలను , నిస్వార్ధంగా , నిజాయితీగా, తక్షణమే  100% జప్తు  చేసి  పెనాలిటీలు  వేసి , నిత్యావసర వస్తువుల  ధరలు , పన్నుల భారం తగ్గించగలుతే ,  'డీమానిటైజేషన్' 100% విజయం సాధించి నట్లే లెక్క . 

తేదీ  08.11.2016 నుండి 31.12.2016  వరకు  పెద్ద నోట్లయిన  రూ . లు . 1,000/- మరియు  500/- నోట్ల  రద్దు  ప్రక్రియను  కేంధ్ర ప్రభుత్వం  ప్రకటించిన  విషయం మనందరికీ  తెలిసినదే .   

కేంద్ర ప్రభుత్వం ,  డీమానిటైజేషన్  ప్రారంభించడానికి  ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, నల్లధనాన్ని  వెలికి తీయడం , ఉగ్ర వాదాన్ని  అరికట్టడం , నకిలీ నోట్లను  అరికట్టడం ,వెలికి తీసిన  నల్ల ధనాన్ని  వినియోగించి , దేశాన్ని  అభి వృద్ధి పధం లో  నడపడం మొదలగునవి. 

అయితే , ఈ  డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా  3 నుండి  4 లక్షల కోట్ల  రూపాయల
నల్ల ధనాన్ని , బ్యాంకింగ్ వ్యవస్థ లోకి రాకుండా  బయటనే అరి  కట్ట వచ్చు. ఈ ఆదాయం  ద్వారా దేశాన్ని  వృద్ధి లోకి  తీసుకుని రావచ్చు  అనేది  కేంద్ర ప్రభుత్వ  ఆలోచన . 

3 రోజుల క్రితం  ఆర్బీఐ ( RBI ) వెలువరించిన వార్షిక  నివేదిక  ప్రకారం, చలామణి లోనుంచి  ఉప సంహ రించిన  పెద్ద  నోట్లయిన  1000, 500 రూపాయల  కరెన్సీ నోట్ల  విలువ  15.44 లక్షల కోట్ల రూపాయలు . అయితే  వాస్తవంగా బ్యాంకింగ్ వ్యవస్థ లో   డిపాజిట్ అయిన మొత్తం   రద్దయిన పెద్ద నోట్ల  విలువ  15.28 లక్షల  కోట్ల  రూపాయలు .  అంటే 16 వేల  కోట్ల  రూపాయలు  డిపాజిట్ జరుగలేదు .  దీనిని  నల్లధనం గా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం .  ఇది  పూర్తిగా నల్లధనమా అంటే చెప్పలేని  పరిస్థితి .  


కేంద్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగా డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా  3 నుండి  4 లక్షల కోట్ల  రూపాయల నల్ల ధనాన్ని , బ్యాంకింగ్ వ్యవస్థ  లోకి  రాకుండా  ఆగ లేదు .  కేవలం  16 వేల  రూపాయలు మాత్రమే  బ్యాంకింగ్ వ్యవస్థ లో  డిపాజిట్ కాలేదు. అందుకే  డీ మానిటైజేషన్  అపజయం  పాలు అయ్యింది అని , ఈ మధ్య ఏ పత్రికను చూసినా  ఇదే కనపడుతుంది . దీనికి తోడు  మరల పెద్ద నోట్లయిన 2,000 , 500 రూపాయల  ప్రింటింగ్  కు , రవాణాకు అయిన ఖర్చు  8 వేల  కోట్ల రూపాయలని  ప్రభుత్వమే ప్రకటించింది.  ఇక మిగిలినది  8 వేల  కోట్ల రూపాయలు .  బ్యాంకు వెచ్చించిన పని గంటలు , ప్రజలు పడ్డ ఇబ్బందులు , కోర్టు కేసులు , లా & ఆర్డర్  ఇబ్బందులను , ఏ టి ఎం (ATM) లను  మరల 2000, 500 నోట్లకు  అనుగుణముగా  తయారు  చేయడానికి అయినా ఖర్చు , ఆర్ధిక రంగం  కోల్పోయిన మొత్తం, చిరువ్యాపారుల  వ్యాపారాలపై నష్టం  మరియు రోజు వారి కూలీల  జీవనోపాధిపై  దెబ్బ  మొదలైన వాటిని పరిగణలోకి  తీసుకున్నట్లయితే , ఆ మిగిలిన 8 వేల  కోట్ల రూపాయలు  ఏ మూలకు సరి పోవు అనేది  కొందరు ఆర్ధిక వేత్తల , ఇతరుల  వాదన.  అందుకే  " డీ మానిటైజేషన్  వలన  నల్ల ధనాన్ని వెలికి తీయడం అటుంచి , నల్ల ధనాన్ని తెల్ల ధనంగా  తెలుపు చేసుకునేందుకు  వెసులు బాటు కల్పించిన భారీ ఆర్ధిక కోణంగా " భావించ వచ్చు అని  అంటున్నారు . దీనికి  తోడు ఇప్పుడు , బ్యాంకులు  సర్వీస్ చార్జీలను పెంచడం , పొదుపు పధకాల పై  వడ్డీ  రేటును  4% నుండి 3.5 % నికి తగ్గించడం, నోట్ల రద్దు తరువాత 2017 జనవరి , మార్చి  నాల్గవ  త్రైమాసికంలో  జి డి పి (GDP=GROSS DOMESTIC PRODUCT))  వృద్ధి రేటు 6.1% కు పడి పోవడం ( 2016 జనవరి - మార్చి నాల్గవ  త్రైమాసికంలో  జి డి పి (GDP) వృద్ధి రేటు 8%), 2017 ఏప్రిల్ - జూన్   మొదటి త్రైమాసికంలో  జి డి పి (GDP)  వృద్ధి రేటు  5.7% కి పడి  పోవడం   మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటే కొందరు ఆర్ధిక వేత్తల ,  సామజిక శాస్త్ర వేత్తల   విమర్శనలను  ఇప్పటికిప్పుడు తప్పు పట్ట లేము . 

ఏది ఏమైనా  ఆర్ధిక వేత్తలు , సామజిక శాస్త్ర వేత్తలు  జి డి పి (GDP)  గత చరిత్రను మరిచి పోకూడదు . 

2001-02 లో  జి డి పి (GDP) 5. 81%
2002-03 లో  జి డి పి (GDP) 3. 84%
2003-04 లో  జి డి పి (GDP) 8. 52%
2004-05 లో  జి డి పి (GDP) 7. 47%
2005-06 లో  జి డి పి (GDP) 9. 48%
2006-07 లో  జి డి పి (GDP) 9. 57%
2007-08 లో  జి డి పి (GDP) 9. 32%
2008-09 లో  జి డి పి (GDP) 6. 72%
2009-10 లో  జి డి పి (GDP) 8. 59%
2010-11 లో  జి డి పి (GDP) 8. 91%
2011-12 లో  జి డి పి (GDP) 6. 69%

2012-13 లో  జి డి పి (GDP) 4. 47%




2013-14 లో  జి డి పి (GDP) 4. 74%


(Source: www.statisticstimes.com)

అయితే  సరియైన  ఆధారాలు  కెళ్లెదురుగా  కనబడుతున్నపుడు  ప్రజలను ప్రక్క దరి పట్టించడం ,  మార్కెట్లను  బెంబేలు  కొట్టించాల్సిన అవసరం  లేదనుకుంటాను .  కేవలం  సైక్లోన్  వస్తేనే  , దాని నుండి కోలుకోడానికి  కనీసం  2 నుండి 3 నెలల  సమయం పడుతుంది . ఒక్కో సారి  అంత కంటే  ఎక్కువనే పట్ట వచ్చు .  అలాంటిది  దేశాన్నే  కుదిపేసిన  ' డీమానిటైజేషన్ ' నుండి కోలుకోడానికి  కొంత కాలం  పట్ట వచ్చు . 
 ఈ కొద్దీ కాలంలో  పారిశ్రామిక  ఉత్పత్తి , వ్యవసాయ  ఉత్పత్తి  మరియు అసంఘటిత  వ్యాపారాలు తగ్గడం వలన  సాధారణంగా  'జి డి పి' మరియు  అన్ని రకాల  ఇండెక్స్  తగ్గు మొఖం పడుతాయి . ఇది కొంత కాలం  సహజం అనుకుంటి బాగుటుంది .  'జి డి పి ' తగ్గినంత  మాత్రం  ఇప్పటికిపుడే  వచ్చిన  సంక్షోభం  ఎక్కడా  కనబడటం లేదు . ప్రజలలో కొనుగోలు  శక్తి  పెరిగింది . ఏ బంగారం షాపులలో  చూసినా ,  ఏ సెల్ ఫోన్ షాపులలో చుసిన , ఏ ఆటోమొబైల్ షాపులో చూసినా , ఏ వస్త్రాల  షాపులలో చూసినా , ఏ డీ మార్తులలో చూసినా  విపరీత మైన జనం ఎగబడి కొంటున్నారు . ఇది ప్రాక్టికల్ . ఇది  ఆర్ధిక వ్యవస్థకు  శుభ పరిణామం . ద్రవ్యోల్భణం  అదుపులో ఉంది . నిత్యావసర వస్తువుల  ధరలు సామాన్యంగా  ఉన్నాయి . ఒక్క పెట్రోలియం  రేట్లు పెరుగుతున్నాయి . ప్రజల డబ్బు  బ్యాంకులలో  పుష్కలంగా  ఉంది . అధిక నిల్వలతో  బ్యాంకులు  కళ  కళ  లాడుతున్నాయి . ఫారెక్స్  నిల్వలు  అదుపులో ఉన్నాయి . 'డీమానిటైజేషన్' కు తోడు 'జి ఎస్ టి' పుణ్యమా అని  ప్రత్యక్ష  పన్నులు , పరోక్ష  పన్నులు  అంచనాకు  మించి జమ అవుతున్నాయి .  ' ఆర్ బి ఐ ' రేపో రేట్  తగ్గించడం  వలన , బ్యాంకులు కూడా  రుణాల  వడ్డీ  రేట్లు తగ్గించాయి . ఇలా అనేక మైన  శుభ పరిణామాలతో  కూడిన  ఆర్ధిక వ్యవస్థ  ఉండగా , సహేతుకమైన  కారణాలు ఉన్నపుడు  కొద్దీ కాలం     ' జి డి పి ' 1 -2 % తగ్గడంవలన , కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం ,  ప్రజలను , మార్కెట్లను  బెంబేలెత్తించడం  సరి కాదనుకుంటాను .  మంచి పనులను సమర్ధించాలి . సపోర్ట్ ఇవ్వాలి , సలహాలు ఇవ్వాలి , ప్రోత్స హించాలి .  

అయితే , ఈ 'డీమానిటైజేషన్' (DEMONETISATION)  విమర్శించే మేధావులు , ఆర్ధిక  వేత్తలు  ఒక్క విషయం గమనించాలి . 

01. మరో  ప్రత్యామ్నాయం  లేదు కాబట్టి , బ్రతికుంటే  బలిసాకైనా తిని బ్రతక వచ్చని , బ్యాంకుల్లో  దాచేస్తే  , రేపు ఎలాగో తీసు  కోవచ్చని  కొందరు  అవినీతి పరులు , నల్లధన కుబేరులు , రక రకాల  చిత్ర విచిత్రాల విధానాలలో  మరియు   బినామీ పేర్లపై డిపాజిట్ చేసి , పని అయి పోయిందని  అనుకున్నారు . అను కుంటున్నారు . నల్లధనము  అయినంత  మాత్రాన , అది చెల్లుబాటు కాని ధనం కాదు . ఇది గుర్తించాలి .  ఎన్నో రోజుల నుండి  కూడా బెట్టుకున్న ధనం కదా . వారికీ   ఎన్ క్యాష్  చేసుకోడానికి , వేరే   ఆల్టర్ నేటివ్  కనబడక  బ్యాంకింగ్ వ్యవస్థలో   డిపాజిట్  చేశారు . దీనికి కేంద్ర ప్రభుత్వం  అపజయం పాలయిందని  అనడం  సరికాదు . వారు అన్నట్లుగా  నల్లధనం కేవలం  నగదు రూపంలోనే లేదు . రియలెస్టేట్  రూపంలో , బంగారం , వెండి , వజ్రాల రూపంలో , విదేశాలలో పెట్టుబడుల రూపంలో , బినామీల పేర్ల మీద , పరిశ్రమల పెట్టుబడుల  రూపంలో , పొదుపు పథకాలలో , ఇన్సూరెన్స్ పాలసీలలో , షేర్లు మ్యూచువల్ ఫండ్స్ లలో , ట్రస్టులలో , చిట్ ఫండ్ల రూపం లో , ప్రయివేటు వ్యక్తుల వద్ద  వడ్డీల  రూపంలో  అనేక  రూపాలలో  ఉంది .  ఈ  విషయం  కేంద్ర ప్రభుత్వానికి  తెలియదనుకోవడం సరి కాదు . 

02. వాస్తవంగా  చూస్తే  , బ్యాంకింగ్ వ్యవస్థ లో  పూర్తిగా  డిపాజిట్స్  చేయడం   ప్రభుత్వానికి  వరం లాంటిదే . నల్ల కుబేరులకు  శాపం  లాంటిది .  ఎలాగంటే , చలామణిలో  ఉన్న  పెద్ద నోట్ల మొత్తం  నగదు బ్యాంకింగ్ వ్యవస్థ లోకి  చేరడం వలన , ఆ మొత్తం డబ్బును  తక్షణమే సద్వినియోగం  చేసుకోడానికి  వీలు కలిగింది . మరల దానికి సమానంగా  కరెన్సీని  ముద్రించాల్సిన అవసరం , ఖర్చు  తప్పింది . సమయం  అయ్యింది . 

03. ఆ కారణంగానే  ఆర్బీఐ (RBI) రెపోరేటును  తగ్గించడం ,  తదునుగుణంగానే  బ్యాంకులు  ప్రజలకు ఇచ్చే రుణాల రేట్లను  తగ్గించ డానికి  వీలు కలిగింది .

04. అధిక  నగదు  నిల్వలతో , అధిక బ్యాంకు  చార్జీలతో , సర్వీస్ చార్జీల వడ్డనతో  బ్యాంకులు  కళ  కళ  లాడుతున్నాయి . 

05. ఎలుకల బోను లోకి  ఎలుకలు  పోవడమే  కానీ  బయటకు  రావడం  కష్టం అన్నట్లు ,  నల్ల కుబేరులు , అవినీతి పరులు  డబ్బులు  డిపాజిట్ చేయ గలిగారే  గాని , అంత సులువుగా తీసుకోలేక పోతున్నారు . తీసు కోలేరు కూడా .  ఇలాంటి  అకౌంట్లను  సుమారుగా  లక్ష  అకౌంట్లను   గుర్తించి నట్లు  ప్రభత్వం చెబుతుంది .  ఎక్కడో ఒక చోట  బ్యాంకు అధికారుల  అండతో , రాజ కీయ  పలుకు బడితో కొందరు  డ్రా చేయ గలుగుతూ ఉండ వచ్చు .  

06. నల్ల డబ్బును  , బ్యాంకులో  జమ చేయలేక పోయినా   లేదా  చేయక పోయినా  , వారు హాయిగా  వారి పనులు చేసుకుంటూ  జీవనం  సాగించ గలిగే  వారు . ఇప్పుడు  ఆ అవకాశం ఉండక పోవచ్చు . బ్యాంకింగ్ వ్యవస్థ లో  డబ్బును  పూర్తిగా డిపాజిట్ చేయడం వలన ,  కేంద్ర ప్రభత్వం  విజయ వంతం ( SUCCESS)  అయ్యిందనే చెప్పాలి . 

07. బ్యాంకుల్లో  అన్ని డిపాజిట్లు , విత్డ్రాయల్స్  తేదీలతో సహా పక్కాగా  రికార్డు అయి ఉన్నాయి . ఎంత మొత్తం డబ్బు  డిపాజిట్ అయ్యిందో  పూర్తి  వివరాలతో  ప్రతి నెలా  ఆర్బీఐ (RBI) కి వెళ్లి పోతుంటుంది . 

08. ఎవరు బినామీ , బినామీ  అకౌంట్లు ఏవో  గుర్తించ గలుగుతున్నారు . 

09. అందులో భాగంగానే , ఇన్కమ్ టాక్స్  రిటర్న్లలో కూడా  నవంబర్ 8 , 2016 నుండి  31 డిసెంబర్ ,2016 కాలంలో , రద్దయిన  నోట్ల విలువ  2 లక్షలు  దాటితే  అందులో చూపాలని   నిబంధన  పెట్టారు . అక్కడ  నిజం చెబుతారా , అబద్దం చెబుతారా తేలిపోతుంది . 

10.  అందులో భాగంగానే , ఇప్పడు కేంద్ర  ప్రభుత్వం , అట్టడుగునుండి  ( FROM THE GRASS ROOTS) సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తున్నది .  అవి  , 

i) ప్రతి ఒక్కరికీ  ఆధార్ నెంబర్ ఒకటే ఉంటుందని , విశ్వసనీయమైనదని  గుర్తించడం . ఇది గొప్ప మార్పు . ( గత ఎన్నో సం . రాల నుండి , ఇదే సోషల్ మీడియా ద్వారా  ఆధార్  ను లింక్ చేయాలంటే , ఎవరూ  నమ్మలేదు , పట్టించు కోలేదు ). 

ii)  అన్ని పొదుపు పథకాలకు  అనగా  బ్యాంకు అకౌంట్లకు , ఇన్సూరెన్స్  పాలసీలకు , షేర్స్ మరియు  మ్యూచువల్ ఫండ్స్ కు  ఆధార్ నంబరును  లింక్ చేయాలని  నిబంధన  పెట్టడం . 

 iii) పాన్  కు  ఆధార్ నంబరును  లింకు  చేయాలనీ  నిబంధన పెట్టడడం . ఒక వేల  లింక్ చేయక పోతే , ఐ .టి . రిటర్న్స్  ఫైల్ చేసినా , చేయనట్లే అని చెప్పడం , 5000 రూపాయలు  జరిమానా విధించడం. తాజాగా  31 డిసెంబర్, 2017  వరకు  ఆధార్ కు  లింక్ చేయడానికి  అవకాశం  కల్పించింది .   

iv)  అన్ని  సంక్షేమ పథకాలకు  ఆధార్ నెంబరును  లింక్ చేయడం . 

v ) జి ఎస్ టి  (GST) విధానాన్ని  జులై 1, 2017 నుండి  పకడ్బందీగా  అమలు చేయడం , దీనికి  ఆధార్ నెంబర్ ను  పాన్ నెంబర్ ను  లింక్ చేయడం , ప్రతి రిటర్నును  , డిజిటల్ సిగ్నేచర్ తో  లాగిన్ అవ్వడం ,

vi) ఎవరి  బ్యాంకు ఖాతాలో  ఎంత డబ్బు ఉంది , ఎప్పటికప్పుడు  బ్యాంకులనుండి  రిపోర్టులు తీసుకుని , అను మానిత  ఖాతాల వారికీ  ఇన్కమ్ టాక్స్  డిపార్ట్మెంట్   నోటీసులు పంపడం,

vii)  మూలం లోనే  టి డి ఎస్  ను  లేదా టి సి ఎస్ ను డిడక్ట్  చేయాలని నిబంధన పెట్టడం , ఎవరికైనా  10 రూపాయలు  టి డి ఎస్  కనిపించినా  వారి కి నోటీసులు  పంపి ఇన్కమ్ టాక్స్  రిటర్నులు  ఫైల్ చేసే విధంగా , వారిని  దారికి తీసుకుని రావడం , పన్నుల అధికారులను , పన్నులు చెల్లించే వారితో  కలువకు నీయక పోవడం , నిజాయితీగా  పన్ను చెల్లించే వారిని వేదించకుండా  చర్యలు చేపట్టడం , 

viii) నోటీసులకు  స్పందించని  వారి  ఖాతాలను  స్పందింప చేయడం , చర్యలు తీసుకోవడం ,

iX)  బినామీ  అకౌంట్లను  గుర్తించ గలగడం , వారి అసలు  కుబేరులు ఎవరో  గుర్తించ ప్రయత్నం   చేయడం , బినామీలను కట్టడి చేయ బినామీ చట్టాన్ని  పాస్ చేయడం మొదలైన  అనేకమైన  చర్యలను మనం చూస్తున్నాం . 

X)  నగదు చలామణిని కట్టడి చేయ డానికి , నిభందనలను  విధించడం  కూడా ఇందులోని  భాగమే .  

కేంద్ర ప్రభుత్వం  చెబుతున్న ప్రకారం , ఇక మరి కొన్ని నెలల్లో  , డీమానిటైజేషన్  విజయమా  , అపజయమో  చూడ వచ్చు . 

అయితే , డీమానిటైజేషన్  సంపూర్ణంగా  విజయ వంతం  కావాలంటే , ఈ క్రింది  చర్యలపై  దృష్టి సారించాలి :

01) మన వారు  బయటి వారు అని చూడ కుండా  , రాజ కీయ పలుకుబడిని  చూడ కుండా ,  నిస్పక్ష పాతంగా ,  నిస్వార్ధంగా , నిజాయితీగా , ట్రాన్స్పరెంట్  గా  చర్యలు  తీసు కోవాలి . 

02) డీమానిటైజేషన్ వలన సమకూరే  ఫలాలు , పేద మధ్య తరగతి  ప్రజలకు  ప్రత్యక్షంగాను , పరోక్షంగానూ  తక్షణమే చేరాలి . 

03) పొదుపు ఖాతాలపై  వడ్డీని  20 లక్ష ల  లోపు వారికీ  3.5% నుండి  4% కు పెంచాలి . అలానే  20 లక్షల పై  నిల్వల వారికీ  3.5%  గా  నిర్ణ యించాలి . ఇతర టర్మ్ డిపాజిట్లపై  గతంలోని వడ్డీలనే కోన సాగించాలి . సేవింగ్ అకౌంట్లపై వడ్డీని ప్రతి 3 నెలల కొక సారి  చెల్లించాలి . 

04)  అవి నీతి సొమ్ము అని , నల్ల ధనం  అని తేలిన  తరువాత , వారి వద్దనుండి  100% డబ్బును జప్తు చేయాలి . అంతే గాని  30% పన్ను , 40% పన్ను  అని వసూలు  చేయరాదు . 

05. చట్టం ముందు అందరూ  సమానులే  అనే  భావనను  ప్రజలలో కలిగించాలి . 

06. నల్ల ధనానికి  సంభందించిన  కేసులను  ప్రత్యేక  కోర్టులలో , కేవలం 90 రోజులలో  పూర్తి చేసే విధంగా నిర్ధేశించాలి . 

07) నల్ల ధన  కుబేరుల , అవినీతి పరులకు  వేసే శిక్షల ద్వారా , సామాన్య ప్రజలలో భయాన్ని కల్పించాలి , మార్పును  తీసుకుని  రాగల్గాలి  గాని ,  అమాయకంగా ఉన్నారని  ముందుగానే  పేద మధ్య తరగతి ప్రజలపై  చర్యలు  తీసుకోరాదు .  

08)  ఒక వ్యక్తి కి ఒకే బ్యాంక్ అకౌంట్  నెంబర్ , ఒకే  సెల్ నెంబర్  ఉండే విధంగా  నిబంధన  చేయాలి . పోర్ట్ బుల్  అవకాశాలుండాలి . 

09) ఆధార్ నెంబర్  నే , సెల్ నెంబర్ గా  మార్చాలి . 

10) పుట్టిన  21 రోజులకే  , ప్రతి ఒక్కరికి   'బర్త్  సర్టిఫికెట్' లాగ  'పాన్ కార్డు' ను  జారీ చేయాలి .  ప్రతి  పాన్ కార్డును  ఆధార్ కు  లింక్ చేయాలి . 

11. ట్రస్టులను (TRUSTS), ఎఫ్ డి ఐ (FDI) లను  , గుడులు గోపురాల  నిధులను  పూర్తి నియంత్రణలో  ఉంచాలి . 

12. ప్రతి  ఇంచు భూమిని  రిజిస్టర్  చేయాలి . అన్  లైన్లో  ఉంచాలి . అది  నివాస భూమి అయినా , వ్యవసాయ  భూమి అయినా  రిజిస్టర్  చేసి బినామీలను గుర్తించి  చర్యలు తీసుకోవాలి . ప్రతి రిజిస్ట్రేషన్  కు  ఆధార్ (AADHAR) ,  పాన్ (PAN)  మరియు సెల్  నెంబర్  (CELL NUMBER) ను  లింక్ చేయాలి . 

13. విదేశాల లోని  మన వారి  వ్యాపారాలపై , బ్యాంకు  ఖాతాలపై  నియంత్రణ  ఉంచాలి . విదేశాల లోని నల్ల డబ్బును  వెల్లడించాలి , రికవరీ చేయాలి . 

15. గతంలో ప్రకటించిన  బంగారు  నిల్వల నిబంధనలను  అమలు చేయాలి . 

16. పన్నులను  ఆదాయాన్ని  బట్టి మాత్రమే కాకుండా , ఖర్చును  బట్టి కూడా వేయాలి . 

17. 25 లక్షల  నికరాదాయం , ఐ . టి రిటర్నుల లో  చూపి పన్నులు  కట్టిన వారిని , సంపన్నులుగా భావించి , అన్ని సంక్షేమ  పధకాలు రద్దు చేయాలి . వీటన్నిటికీ  సిస్టమ్స్ నే అభివృద్ధి చేయాలి . 

18. ప్రభత్వ వినూతనమైన , విప్లవాత్మకమైన 'డీమానిటైజేషన్' మరియు ' జి ఎస్ టి '  లాంటి   విధానాల వలన  సమకూరిన డబ్బుపై  పూర్తి  నియంత్రణ  ఉండాలి . దానిని  తక్షణమే  అభివృద్ధికి , నిత్యావసరాల ధరలను , పేద మధ్య తరగతి  పై  పన్నుల భారాన్ని   తగ్గించడానికి  ఉపయోగ పడాలి . 

19. లోక్ పాల్  బిల్లును  పాస్ చేయాలి . దీనిని( రాష్ట్రపతికి మినహాయించి)  అందరికీ  వర్తింప చేయాలి . 

అప్పుడే  'డీమానిటైజేషన్ ' సంపూర్ణంగా   విజయ వంతం అయ్యిందని  చెప్పాలి . 

www.sollutins2all.blogspot.com







Sunday, August 27, 2017

ప్ర : సెల్ ఫోన్ /స్మార్ట్ ఫోన్ ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే ఏమి చేయాలి ?

ప్ర :  సెల్  ఫోన్ /స్మార్ట్ ఫోన్  ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే  ఏమి చేయాలి ?


జ :  సెల్  ఫోన్ /స్మార్ట్ ఫోన్  ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే  వెంటనే  ,

01. అందులోని  ఫోన్ నెంబర్లకు  ఫోన్ చేయాలి . ఒక వేల  రింగు అవుతూ  ఎవరూ  లిఫ్ట్  చేయడం లేదంటే , అది  ఎక్కడో ఒక చోట  ఉంది , మనం మరిచి పోయి ఉంటాం   అని ,  తిరిగిన  చోట్లన్నీ వెదకుతో , అక్కడికి  వెళ్లి  చూడాలి . కనబడక పోతే మళ్ళీ ఫోన్ చేయాలి .  రింగ్ శబ్దాన్ని  బట్టి   మనం  సులువుగా  ఫోన్ ను గుర్తించ వచ్చు .

02.  ఆ ఫోన్ లోని  నెంబర్లకు  ఫోన్  చేసి నట్లయితే ,  అందరూ  ఒక్క తీరుగా  ఉండరు కదా .  కొందరు  న్యాయ బద్దంగా  నడుచుకునే వారు ,  వెంటనే  లిఫ్ట్ చేసి  ' ఫోన్  పలానా  చోట పడిందండి , నా వద్ద ఉంది . వచ్చి తీసుకెళ్లండి  ' అని చెబుతారు .  వెంటనే  థాంక్స్  తెలిపి , వారి వద్దకు వెళ్లి  ఫోన్ తీసుకొచ్చు కోవాలి .  ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగినవి .

03.  ఫోన్ చేసినప్పుడు , ఒక వేల  స్విచ్  ఆఫ్ చేసి  ఉన్నట్లయితే  , దానికి మూడు  కారణాలు ఉంటాయి .  ఒకటి,  ఛార్జింగ్ లేక  ఫోన్ రింగ్ కాక పోవడం. రెండు , సిగ్నల్స్  లేక పోవడం . మూడు , ఎవరైనా తీసుకుని  , దానిలోని  సిమ్  లను  తీసివేయడం  లేదా బ్యాటరీ తీసి వేయడం  లేదా స్విచ్ ఆఫ్ చేయడం .

04. అన్ని ప్రయత్నాలు  చేసాక  , ఫోన్ ఎవరి చేతిలోనో  పడిందని నిర్ధారించుకున్నాక , ఇక మనకు దొరకదు  అనుకున్నపుడు , వెంటనే  అందులోని  సెల్ నెంబర్లను  బ్లాక్ చేయాలి .

05. సెల్ నెంబర్లను  బ్లాక్ చేయాలంటే , ఒక్కో సర్వీస్  ప్రొవైడర్ కు  , ఒక్కో పద్ధతి , టోల్ నెంబర్స్ ఉంటాయి .

06. BSNL  Cell Number  అవుతే  BSNL Service provider  టోల్  ఫ్రీ నెంబరుకు  ఫోన్ చేసి  బ్లాక్ చేయ మని చెప్పాలి .  ఉదా : BSNL Service provider  టోల్  ఫ్రీ నెంబరుకు , BSNL  సెల్  నెంబరు నుండే   ఫోన్  చేయాలను కుంటే 1503 నెంబరుకు , ఇతర నెట్  వర్క్  నుండి ఫోన్ చేయాలంటే   1800-180-1503  ఫోన్  చేసి  , రికార్డెడ్  వాయిస్ ప్రకారం  ఫాలో  అయి , చివరగా  ఆపరేటర్ తో  మాట్లాడి , సెల్ నెంబరును  బ్లాక్ చేయ మని చెప్పాలి .  అప్పుడు  వారు బ్లాక్  చేసి  మనకొక  రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు .  అటుపిమ్మట  BSNL Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన  అప్లికేషన్ ఫిల్  చేసి , ఆధార్  జిరాక్స్ కాపీ  , ఒక ఫోటో  ఇచ్చినట్లయితే  10 రూ . లు . తీసుకుని  అదే నెంబర్ తో కొత్త  'SIM' ఇస్తారు .  సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్  కంటిన్యూ  అవుతుంది . కాంటాక్ట్స్  , సిమ్  లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ  మన  సెల్ నెంబర్ ను  మిస్ యూస్  చేయడానికి , మన పైన ఇతరుల కు  సంబందించి న  కేసులు  పడకుండా  ఉండడానికి  వీలవుతుంది . 

07. అలానే  Rel.Jio  Cell Number  అవుతే, Rel.Jio  సెల్  నెంబరు నుండే   ఫోన్  చేయాలను కుంటే   Rel.Jio  Service provider  టోల్  ఫ్రీ నెంబరు 198 లేదా 199 కు లేదా ఇతర నెట్ వర్క్ ఫోన్ నుండి ఫోన్ చేయాల్సి వస్తే  1800-88-99999 కు  ఫోన్ చేసి ,ఆపరేటర్ కనెక్ట్ అయ్యాక  బ్లాక్ చేయ మని చెప్పాలి .  అటుపిమ్మట  Rel.Jio Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన  అప్లికేషన్ ఫిల్  చేసి , ఆధార్  జిరాక్స్ కాపీ  , ఒక ఫోటో  ఇచ్చినట్లయితే  ఉచితంగా  అదే నెంబర్ తో కొత్త  'SIM' ఇస్తారు .  సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్  కంటిన్యూ  అవుతుంది . కాంటాక్ట్స్  , సిమ్  లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ  మన  సెల్ నెంబర్ ను  మిస్ యూస్  చేయడానికి , మన పైన ఇతరుల కు  సంబందించి న  కేసులు  పడకుండా  ఉండడానికి  వీలవుతుంది . 

08. ఆ  తరువాత  వెంటనే  మీ  సేవద్వారా   అన్ని వివరాలతో , పత్రాలతో  కంప్లైన్ట్  చేయాలి . దానికి  వారు  145/- రూ . లు . ఫీజు  తీసుకుని  ఒక రసీదు  ఇస్తారు . దానిని  తీసుకుని వచ్చి  మరల  , మీకు  దగ్గర  లోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి F. I. R  బుక్ చేయించాలి .  మీ సెల్ కు ఇన్సూరెన్స్  ఉంటే  , మీరు సుమారు  75% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా   క్లెయిమ్  చేసుకోవచ్చు .  లేక పోతే  2 నుండి  6 నెలల  లోపు  దొరుకుతే  పోలీసులే  కాల్ చేసి ఇస్తారు.  అప్పుడప్పుడు  పోలీస్ స్టేషన్ లో  వాకబ్  చేస్తూ ఉండాలి .  చాన్సెస్  మాత్రం  1 తో 5%. 
All the best.

www.sollutions2all.blogspot.com


Saturday, August 26, 2017

ప్ర : మతి మరుపు (LOSS OF REMEMBRANCE) ఎందు వలన కలుగుతుంది ? దీనిని అధిగమించడం ఎలా ?

ప్ర : మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ? మతి మ రుపు  ఎందు వలన కలుగుతుంది ? దీనిని  అధిగమించడం ఎలా ?

మతి మ రుపు  (LOSS OF REMEMBRANCE)  అంటే ఏమిటి ?
జ : మతి మరుపు  (LOSS OF REMEMBRANCE) అనగా  జరిగిన, జరుగ బోయే  సంఘటనలు  , చేసిన , చేయ బోయే  పనులు  మరియు  పేర్లు , వస్తువులు  గుర్తు లేక పోవడం  , బంధు మిత్రులను గుర్తు పట్టలేక పోవడం , మరిచి పోవడం  మొదలైన వాటిని  మతి మరుపు  అంటారు . ఒక్కోసారి  మన  మైండు , అనుకోకుండానే  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది . ఎంతటి తెలివి గల వారైనా , క్షణ క్షణం ఎన్ని జాగ్రత్తలు  తీసుకున్నా ,  ఒక్కో సారి  మతి మరుపు  బారినుండి  ఎవ్వరూ  తప్పించుకోలేరు . ఎవ్వరూ ఎదో ఒకటి  పోగొట్టుకో కుండా  , మరిచి పోకుండా  ఉండ లేరు . ఇది నగ్న సత్యం . అంత మాత్రాన   వీరిని  తెలివి తక్కువ  వారు  అని గాని, ఎందుకు  పనికి  రాని  వారు అని గాని  అనడం , నిందించడం  తగదు.   ఒక సారి   గొప్ప శాస్త్ర వేత్త ' ఆల్బర్ట్  ఐనస్టీన్' డబ్బులు  డిపాజిట్  చేద్దామని  బ్యాంకుకు  వెళ్ళాడట .  గొప్ప  శాస్త్ర  వేత్త  కాబట్టి , తెలిసిన వారు దగ్గర వచ్చి  పలకరించడం  , నమస్కరించడం  చేస్తున్నారు . డబ్బులు డిపాజిట్ చేద్దామని  వచ్చాక  తన పేరునే  మరిచిపోయాడు . అప్పుడు  అతను  తన ప్రక్కనున్న వారిని  తన  పేరు ఏమిటో  చెప్పమన్నా డట .  వారు ముందుగా ఆశర్యపోయినా  చెప్పక తప్పలేదు . మీ పేరు  ' ఆల్బర్ట్  ఐనస్టీన్'  అని చెప్పారట .  దీని బట్టి మనకు ఏమి అర్ధమవుతుంది . మాటి  మాటికీ  పిల్లలను గాని , పెద్దలను గాని  , మతి మరుపు  అని అనడం వలన , నిందించడం వలన మతి మరుపు  అనేది మరింత  పెరిగే అవకాశం  ఉంది.  మతి  మరుపు  అనేది  ఒక జబ్బు కాదు . ఇది దీర్ఘ కాలం  ఉండదు .  

మతి మరుపు  ఎందు వలన కలుగుతుంది ? 

మతి  మరుపు కలగడానికి  అనేక మైన కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైన  కారణాలు :

01. పుట్టుకతోనే , జన్యు పరమైన  మానసిక లోపాలుండటం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

02.  అనారోగ్యం  బారిన పడటం . ఉదా : తీవ్ర  జ్వరం , హై  బి . పి  ,  టైపు 2  షుగర్  వ్యాధి , క్యాన్సర్  ,  మూర్ఛ  , హార్ట్ అటాక్ , దీర్ఘ కా ల వ్యాధులు  మొ. లైన  వాటి వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

03.  ఒక్కో  సారి  కొన్ని  కుటుంభ సమస్యల వలన లేదా  బయటి సమస్యల వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

04.  కొన్ని  అనుకోని సంఘటనల  వలన  మనసు కంట్రోల్ తప్పి  మతి మరుపు  ఏర్పడవచ్చు .

05. ఆర్ధిక  , సామజిక , రాజకీయ , శారీరక  బాధల  వలన , ఆందోలనల  వలన మతి మరుపు  ఏర్పడవచ్చు .

06. ఆహార లోపం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

07.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం వలన , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు .

08. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  వలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

09. ఇష్టం  లేని  వ్యక్తులు  తారస పడినా , ఇబ్బంది  అనిపించే  వ్యక్తులు  ఇంటికి వచ్చినా , ఇష్టం  లేని  వ్యక్తుల తో  ప్రయాణం చేసినా  , షాపింగ్ చేసిన మైండు కంట్రోల్ తప్పి , మైండ్  ఆన్  క్యాన్సియస్  లోకి వెళ్లి పోతుంది  . అప్పుడు ఏమి జరిగింది , జరుగా బోయేదేదో   గుర్తుండదు .  మన పంచేంద్రియాలు  అచేతనంగా  ఉంది పోతాయి .  ఆ విధంగా  చేతిలోని  స్టీరింగ్  చేయి సడలి  ఆక్సిడెంట్లు  కావచ్చు . చేతిలోని  వస్తువులను  మరిచి పోవచ్చు  . అందువలన  మతి మరుపు  ఏర్పడవచ్చు . 

10. అత్యంత ఇష్టమైన  వ్యక్తులు  చూసినా , కలిసినా , మాట్లాడినా  ఆ సంతోషంలో   , ఆ మైకంలో పడి  , మన  పంచేంద్రియాలు  గాడి తప్పి  నష్టాల  బారిన  లేదా  కష్టాల  బారిన  పద వచ్చు . 

11. ఆయాసం , అలసట , గాయాల పాలవడం , నిద్రలేమి  మొదలగునవి  కూడా  మతి మరుపుకు  దరి తీయవచ్చు .  

12.  వయస్సు మీద  పడుతున్న కొలది   మన పంచేంద్రియాల  శక్తి తగ్గి పోతుంది .  సుమారుగా  50 - 60 సం . రాలు  దాటా మంటే   వినికిడి శక్తి  తగ్గి పోతుంది .  కంటి చూపు  మందగిస్తుంది  , స్పర్శ  జ్ఞ్యానం  కోల్పోతాం .   రుచి  వాసన   గుర్తించ లేక పోవచ్చు . మతి మరుపు  ఏర్పడవచ్చు .

13. ఒంటరి తనం గా జీవించడం  వలన  మతి మరుపు  పెరుగుతుంది . అలానే  ఆయుస్సు కూడా  తగ్గిపోతుంది . 

మతి మ రుపు ను  అధిగమించడం ఎలా ?

మతి మరుపు  బారిన పడకుండా  ఎవ్వరూ  తప్పించుకోలేరు . అయినా  కొన్ని  ముందస్తు జాగ్రత్తలు  తీసుకోవడం వలన మతి మరుపు  బారిన పడకుండా  కొంత వరకు  తగ్గించు కోవచ్చు . అవి ,

01.  జన్యు పర లోపాలు జరుగకుండా  రక్త సంబంధీకులైన  , దగ్గరి  మేన రికాలతో వివాహాలు  జరుప కూడదు . 

02. ముందు జాగ్రత్తగా  ఆరోగ్య పరమైన  చర్యలు తీసుకోవడం వలన , జన్యులోపాలు  లేకుండా  , మెంటల్ డిజార్డర్  లోపాలు లేని  పిల్లలు జన్మించడానికి  అవకాశముంటుంది . 

03. రెగ్యులర్ గా  హెల్త్ చెకప్ చేయించుకుని  సరియయిన మందులు  వాడటం వలన  మతి మరుపును  నివారించవచ్చు . 

04. రెగ్యులర్  గా  సమతుల్య ఆహారం  ,  పాలు,  పండ్లు , గ్రుడ్లు తీసుకోవడం  వలన  మతి మరుపును  దూరం చేయవచ్చు . 

05. రెగ్యులర్ గా మెడిటేషన్ , వ్యాయామం  చేయడం వలన  మతి మరుపును తగ్గించ వచ్చు .

06. ఎల్లప్పుడూ  మానసికంగా , శారీరకంగా  ఉత్సహంగా , ఉల్లాసంగా  ఉండే విధంగా  ప్లానింగ్ చేసుకోవాలి . 

07. కనీసం  రోజుకు   6 గంటలు  (  వీలు కాకా పోతే  ఏ  సమయమైనా కావచ్చు )  నిద్రించే విధంగా  ఏర్పాటు చేసుకోవాలి . 

08. క్రమ బద్దంగా   భోజనం చేయడం  అలవరచు కోవాలి . 

09.  చుట్ట , బీడీ , సిగరెట్లు  త్రాగడం వలన  మరియు  పొగాకు , తంబాకు నమలడం  , మత్తు పదార్ధాలు , డ్రగ్స్ వాడటం  మొదలైన వాటిని  తగ్గించాలి . 

10. రెగ్యులర్  గా  మాంసాహారం  తీసుకోవడం  తగ్గించి , శాకాహారులు గా  మారాలి  . 

11.  ప్రతి వ్యక్తికి  నిత్యం ఏర్పడే సమస్యలకు  , బాధలకు  , నష్టాలకు   వేంటనే   భీతి   చెంద  కూడదు . ఆందోళనకు గురి కాకూడదు . 

12. అందరిలో  కలిసి జీవించడం  ,  ఆడటం , పాడటం , ఆహ్లాద కర వాతావరణంలో  నివసించడం వలన  మతి మరుపు ను  నివారించ వచ్చు .    ఆయుస్సును కూడా  పెంచుకోవచ్చు . 
www.sollutions2all.blogspot.com