వివాహ వ్యవస్థ (MARRIAGE SYSTEM)

 నాడు - నేడు వివాహ వ్యవస్థ :

వాస్తవంగా చూస్తే, తల్లి తండ్రులు వివాహాలను పాడు చేస్తున్నారనిపిస్తుంది. పిల్లల పెడతోవలకు  తల్లి దండ్రులే పూర్తి భాద్యత వహించాల్సి వస్తుంది  

ఇది కొందరు , అమ్మాయిల , అమ్మాయిల  తల్లుల విషయంలో మాత్రమే . అందరికి వర్తించదని 
గమనించ గలరు . ఇవి నా దృష్టికి వచ్చినవి మరియు నన్ను కాంటాక్ట్ అయిన తల్లుల  విషయాలకు  సంబంధించినవి  మాత్రమే . 


                                  


ప్రస్తుతం సమాజంలో ,ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి.

వారికి కావలసిన అర్హతలు  ఇలా ఉంటాయి : 

1. డాక్టర్ , సాఫ్ట్వేర్ ఇంజినీర్  అయి ఉండాలి .
2. అబ్బయికి సొంత ఇల్లు ఉండాలి . 
3. తల్లి దండ్రులకు ప్రభుత్వ ఉద్యోగం లేదా తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం వస్తూ ఉండాలి .
4. సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం అయి ఉండాలి .
5. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా  ఉండాలి.
6. అత్త ఉండకూడదు. ఒకవేళ ఉంటె , తమ వద్ద ఉండ కూడదు .
7. అబ్బాయి శాలరీ 6 అంకెలుండాలి .
8. అబ్బాయి విదేశాలలో  ఉద్యోగం చేస్తూ ఉండాలి.
9. అబ్బాయి , అబ్బాయి వాండ్లు  అమ్మాయి చెప్పినట్లు వినాలి .
10. అబ్బాయి , ఇళ్లటం రావడానికి సిద్ధంగా ఉండాలి .
11. జాతకాలు నూరు శాతం కలవాలి .

ఇలా ఒక శాంతాడంత  ఉంటాయి అమ్మాయిల , అమ్మాయిల తల్లి దండ్రుల  కోరికలు , నియమ నిబంధనలు .


ఏ  విషయాలకైనా ,ఫోన్ చేయ్యగానే, పదవతరగతి  చదవని  పిల్ల తల్లి మాట్లాడుతుంది. తండ్రి మాట్లాడడానికి  వీలు లేదు . అంతా కూతురు , తల్లి పెత్తనమే.  

అమ్మాయి  ఫోటో పంపించడానికి  ఇష్ట పడరు . కానీ  అబ్బాయి ఫోటో,  వివరాలు వాట్సాప్  లో పంపండి ,  మా అమ్మాయిది పంపుతాము అంటుంది !  మనం పంపిస్తే వారు పంపరు. తరవాత
మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం: 
"ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి. 
ఇంకా చూడలేదు" .
మూడవ వారం: 
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి". 
నాలుగో  వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .
ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

అమ్మాయిల విషయానికొస్తే:
ఈ మధ్య  కొందరు  అమ్మాయిలు  బాగానే  సంపాదిస్తున్నారు. అంతవరకు బాగానే  ఉంది . కానీ  అవి  (కొందరి విషయంలో ) వారి ఫ్యాషన్  కొను గొల్లకే  సరిపోతున్నాయి . ఇక ప్రతిదీ  సోషల్  అంటున్నారు . తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా  జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?
మీ ఇంట్లో  వీల్ ఛైర్ లు ఉన్నాయా?
మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?
మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?"
అని అబ్బాయి తల్లితండ్రుల
నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,
 
"మీ అమ్మ నాన్నలు మనతో 
ఉండడానికి వీలు లేదు,

నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు. 
నీ సెల్ నేను ముట్టుకోను! 

నేను వంట చెయ్యను. 
కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!
లేదా వంటమనిషి పెట్టుకుందాం..
 
నాజీతం పాకెట్ మనీ కి  లేదా  సేవింగ్స్ కోసం బ్యాంకులో , 
నీ జీతం ఖర్చుపెడదాము!"

ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు.
కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం...

లేకపోతె తాంబూలాలు లేవు. 
కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా
తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక..  విడాకుల వరకు వస్తే,
విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.
అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది...
విడాకులైనా ఏ మాత్రము 
మార్పు, బాధ లేకుండా
కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.

వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్! 

ఇలాంటి వాళ్లకు మళ్లీ ఎవరైనా  ఒకరిని  చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా?

ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే, 
మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని
ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి  తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.
ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది)
ఇవండీ!  మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు! 
అనుభ వించిన వారు చెప్పిన నగ్న సత్యాలు! 

మరో సారి  చెబుతున్నాను ,  ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి గల  అమ్మాయిలకు , అమ్మాయిల తల్లిదండ్రుల గురించి  మాత్రమె. 

పూర్వకాలంలో  ఇలా ఉండేది కాదు . ఉమ్మడి కుటుంబాలు  ఉండేవి . ఆ కుటుంభం పెద్ద ఏది చెబితే అదే  నడిచేది . ఎదురు మాట్లాడే వారు కాదు . తల్లులు  , ఇంటి గడప డేట్ వారు కాదు . నోటి నుండి మాట పెకిలేది  కాదు . ఒక నమ్మకం  మీద వివాహాలు జరిగేవి . పెద్ద వారు కూడా అటు ఏడు తరాలు  , ఇటు ఏడు తరాలు  చూసి పెళ్లి చేసే వారు . చక్కగా కాపురాలు జరిగేవి . విడాకులు అనేవి ఉండేవి కావు . 

సరే కాలం మారింది . కాలానికి  తగ్గట్టుగా ఆడ పిల్లలు చదువుతున్నారు . ఉద్యోగాలు చేస్తున్నారు . 5 అంకెల్లో సంపాదిస్తున్నారు . కాదనడం లేదు . అయితే  దానికి వినయం తోడైతే  బాగుంటుంది  అనేది  నా అభి ప్రాయం . 

డబ్బు ఎంతైనా  సంపాదిస్తారు కావచ్చు . సంపదను ఎంతైనా కూడబెడుతారు కావచ్చు . విల్లాలు , ఫామ్ హౌజులు  , కార్లు , విమానాలు  కొంటారు కావచ్చు . రాజకీయాల్లో  అధికారాలు సాధిస్తారు కావచ్చు . లేదా  పెద్ద పెద్ద హోదాలలో  ఉద్యాగాలు చేస్తారు కావచ్చు . 

 కానీ ఏమి లాభం .  అదే డబ్బుతో కాలాన్ని కొనలేము . వయసును కొనలేము . సంతోషాన్ని  కొనలేము . ఆనందాన్ని  కొనలేము . తృప్తి ని కొనలేము . ప్రశాంతతను కొనలేము . 

తెలుగులో  ఒక సామెత  ఉంది . "బెండకాయ ముదిరినా  , వయసు  ముదిరినా  దేనికి  పనికి  రావు" అని . 

For more Videos , please my  youtube channel :







No comments: