ఎన్నికల సంస్కరణలు (ENNIKALA SAMSKARANALU)

Election Reforms / ఎన్నికల సంస్కరణలు

 భారత దేశంలో  , ప్రతి పౌరుడి జీవితానికి  రాజకీయాలతో   సంబంధముంది . 
రాజకీయాలను  నేడు కొందరు నేతలు మాత్రమే  అధికారంతో  శాశిస్తున్నారు . దీని వలన 
దేశంలో  కొందరు మాత్రమే  కుబేరులవుతున్నారు . మెజార్టీ ప్రజలు  , పేద తనం నుండి మరింత  దిగజారిపోతున్నారు . వీరికి  చెడు  వ్యసనాలను అలవాటు చేసి , బానిసలుగా  చేసుకుంటున్నారు . వీరి పైన ఒక ముసుగు లాంటి  ఉచితాలను  పంచి , కేవలం  ఓటు బ్యాంకు గా  మార్చేస్తున్నారు . 

దీని వలన  దేశాభి వృద్ధి జరుగదు . కొందరు నేతల అభివృద్ధి మాత్రమే జరుగుతుంది . అందుకని  ప్రజలు  త్వరగా మేల్కొని , ఇలాంటి స్వార్ధ నేతలను  అరికట్టాలి . దేశ సంపదను  ప్రతి ఒక్కరు  అనుభవించాలి . రాజ్యాంగం మనకు కల్పించిన  హక్కులను  సాధించుకోవాలి . 

అందుకు ప్రజలు చేయాల్సింది  నోటుకు ఓటును వ్యతిరేకించాలి . సమర్థులైన  , నిస్వార్ధ  , నిజాయితీ గల నాయకులను , ప్రతినిధులుగా ఎన్నుకోవాలి . ప్రశ్నిచే తత్వం పెంచుకోవాలి . 

శ్రీ శ్రీ గారు అన్నట్లు , " పోరాడితే పోయేదేముంది , బానిస సంకెళ్లు తప్ప ". 
"తినగా తినగా వేమ  తీయగా ఉంటుందని " వేమన గారు అన్నట్లు  , ప్రశ్నించంగా , ప్రశ్నించంగా ఏదో  ఒక రోజు  మార్పు రాక  తప్పదు . 


For  more Videos , please watch my youtube channel :

   




























https://www.youtube.com/c/MargamSahityaYoutubeChannel2021




 

No comments: