Sunday, July 31, 2016

ఆర్ధిక సూత్రా లంటే (ECONOMICAL PRINCIPLES) ఏమిటి ? అవి సమాజానికి ఎంతవరకు ఉపయోగ పడుతాయి ?

ప్ర. ఆర్ధిక సూత్రా లంటే(ECONOMICAL PRINCIPLES) ఏమిటి ? అవి సమాజానికి  ఎంతవరకు ఉపయోగ పడుతాయి ?

జ : ఆర్ధికసూత్రా లంటే (ECONOMICAL PRINCIPLES)  డబ్బుకు / ద్రవ్వ్యానికి  సంభందించిన   సలహాలు  .  అవి సమాజానికి  ఎంతో కొంత  ఉపయోగ పడుతాయి . వాటిని  వినియోగించుకునే వారిని బట్టి ఆధార పడి  ఉంటాయి . మనకు  రెండు చేతులు ఉన్నాయి . వాటిని ఎన్నోరకాల అవసరాల కోసం  ఉపయోగించు కోవచ్చు . అలానే ఆర్ధిక సూత్రాలు కూడా . ఆర్ధిక సూత్రాలను  పాటించడం  వలన ఆర్ధికంగా  అభివృద్ధిని  సాధించ వచ్చు . పొదుపును పెంచుకోవచ్చు . వృధా ఖర్చును  అరికట్టవచ్చు . ఇలా  ఒక వ్యక్తి అభివృద్ధి  చెందుతే , ఆ కుటుంభం అభివృద్ధి చెందుతుంది .  ఒక కుటుంభం అభివృద్ధి  చెందుతే , ఆ సమాజం  అభివృద్ధి చెందుతుంది . ఆ సమాజం అభివృద్ధి  చెందుతే , ఆ రాష్ట్రం  అభివృద్ధి చెందుతుంది .  అలా రాష్ట్రాలు  అభివృద్ధి  చెందుతే , ఆ దేశం  అభివృద్ధి చెందుతుంది .  అలా దేశాలు అభివృద్ధి చెందితే  , ప్రపంచమే  అభివృద్ధి చెందుతుంది . ఆ ఆర్ధిక సూత్రాలు ఏమంటే ,

01. ఏదైనా  ముఖ్యమైన వ్యాపార  నిర్ణయం  తీసుకునే టప్పుడు , మన  బలాలను , బల హీనతలను , మన స్వభావాన్ని , అనుభవాన్ని , మార్కెట్ తీరును , ఆర్ధిక  స్థోమతను , వయస్సును  దృష్టిలో పెట్టుకుని  నిర్ణయం  తీసుకోవాలి . 

02. అధిక వడ్డీలకు  అప్పులున్నట్లయితే , స్థిరాస్తులను  అమ్మి అయినా  సరే ముందు  ఎక్కువ వడ్డీ గల  అప్పులు తీర్చాలి . 

03. ఎట్టి పరిస్థితులలోనూ  బ్యాంకులకు , చిట్ ఫండ్ కంపెనీలకు , ఫైనాన్స్ కంపెనీలకు  స్యూ రిటీలు  ఇవ్వకూడదు . 
04. తెలియని  వారికి  బ్యాంక్  అకౌంట్లు ఓపెన్ చేయించ కూడదు . 

05. ఎట్టి పరిస్థితులలోనూ  పని చేసే  కంపెనీ లోని  యజమానులకు అప్పులు ఇవ్వ కూడదు , ఇప్పించ కూడదు 

06. 3 నుండి  6 నెలల  ఖర్చుకు  సమానమైన  డబ్బుకు మించి  సేవింగ్  అకౌంట్లో  డబ్బులు  ఉంచ కూడదు . అంత కంటే ఎక్కువగా  ఉన్న డబ్బును   చిన్న చిన్న మొత్తాలలో  " ఫిక్స్డ్ డ్  డిపాజిట్ " చేయాలి . దీని వలన  వడ్డీని అధికంగా పొంద వచ్చు . సేవింగ్ అకౌంటులో  వడ్డీ రేటు  సంవత్సరానికి  రూ . లు . 100/- కి  4%  అయితే  , ప్రస్తుతం  ఫిక్స్డ్ డ్  డిపాజిట్ "  వడ్డీ రేటు 7.5%. ( సీనియర్  సిటిజన్స్ కు 8%) .   చిన్న చిన్న మొత్తాలలో   అనగా రూ . లు . 10,000/  25,000/ 50,000/1,00,000 , ( స్థాయిని బట్టి ) " ఫిక్స్డ్ డ్  డిపాజిట్ " ఎందుకు చేయాలంటే , ఏదైనా చిన్న  అవసరం వచ్చినప్పుడు  ,పెద్ద మొత్తాన్ని  కదిలించ నవసరం ఉండదు . పన్నులు  పడకుండా  ఉండాలంటే  , ఫామ్ జి / హెచ్  గాని , ప్రతి సంవత్సరం  ఏప్రిల్ / మే  నెలలో  సంభదిత  బ్యాంకులో  ఇవ్వాలి . ఇవి ప్రతి బ్యాంకులో ఉచితంగా  లభిస్తాయి .  అయితే  ఇవి  సంవత్సరానికి  రూ . లు . 10,000/- వడ్డీ దాటితేనే వర్తిస్తుంది. ఒక వేళా పన్నులు  కట్టే వారైయితే , టి .డి ఎస్  సర్టిఫికెట్  బ్యాంకు  నుండి తీసుకుని , జులై 31 లోపు  ఐ . టి . రిటర్నులు   ఫైల్  చేసి  క్లెయిమ్ చేసు కోవచ్చు  లేదా  ఇతర చెల్లించ వల్సిన పన్నులకు  అడ్జస్ట్  చేసు కోవచ్చు  
07.  ఏ .టి .ఎం  కార్డుల  గురించి , గుర్తు తెలియని వారి నుండి  వచ్చిన ఫోన్లకు  రెస్పాండ్  కాకూడదు .  అకౌంట్ నెంబర్  చెప్పా మన్నా , పిన్ నెంబర్ చెప్పమన్నా , అడ్రస్ చెప్పమన్నా ,  ఏ . టి . ఎం  కార్డు  ఎక్సపైర్  అవుత దన్నా  స్పందించ కూడదు . భయ పడ  కూడదు .  తరుచుగా వచ్చే అలాంటి ఫోన్ నెంబర్లను  బ్లాక్ చేయండి . 

08. లాటరీల  గురించి , ఉచిత  ఇన్స్యూరెన్స్ ల గురించి ,  గుర్తు తెలియని వారి నుండి  వచ్చిన ఫోన్లకు  రెస్పాండ్  కాకూడదు .  డబ్బులు పంపించాం మన్నా  , అడ్రస్ చెప్పమన్నా ,   స్పందించ కూడదు . భయ పడ  కూడదు .  తరుచుగా వచ్చే అలాంటి ఫోన్ నెంబర్లను  బ్లాక్ చేయండి .

09. ఎక్కువగా  బిజినెస్  జరిగే  కిరాణా  కొట్లల్లలోనే  సరుకు తీసుకోవడం వలన  నాణ్యమైన వస్తువులు లభిస్తాయి , తక్కువధరకే  లభిస్తాయి .

10. జెనెరల్ ఇన్స్యూరెన్స్ లు , మెడికల్  ఇన్స్యూరెన్స్ లు    ఆర్ధిక భద్రతకు , పొదుపుకు , టాక్స్ బెనిఫిట్స్  కు  ఉపయోగ  పడుతాయని చెబుతారు . అవును . అందులో కొంత వాస్తవం కూడా ఉంది . వీటిల్లో అనేక  లోటు పాట్లు కూడా ఉన్నాయి . వీటికంటే బదులు  ఎక్కువ ఆదాయం కొరకు , ప్రజలు  వారి వారి , అల్పాయుష్షును , దీర్గాయుస్సును , రోగాల తీవ్రతను  జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని , అల్పాయుషు   ఉన్న వారు , అధిక రోగాలు ఉన్న వారు మాత్రమే  జెనెరల్ ఇన్స్యూరెన్స్ లు , మెడికల్  ఇన్స్యూరెన్స్ లు తీసుకోవడం  మంచిది . మిగిలిన వారు  పొదుపు  చేయడానికి   మంచి మ్యూచువల్  ఫండ్స్ లలో గాని , లేదా  బ్యాంకు , పోస్టాఫీస్  పి . పి . ఎఫ్ . లేదా  ఆర్ . డి . అకౌంట్ల లో గాని  అదే లాంగ్ టర్మ్  లో పొదుపు చేయడం  వలన  ఆర్ధిక భద్రత ఉంటుంది . పొదుపు అలవాటు  పెరుగుతుంది . అధిక ఆదాయం  లభిస్తుంది . ఇన్కమ్ టాక్స్  బెనిఫిట్  ఉంటుంది .  అవసరాలకు  ఉపయోగ పడు తుంది . 

11. అధిక ఆదాయానికి , భద్రతకు , పొదుపుకు  అత్యుత్తమ  పెట్టుబడి  విధానం   భూములపై  పెట్టుబడి పెట్టడం .  అదియును  ఓపెన్  ల్యాండ్స్ . ఆ తరువాత  ఫ్లాట్స్ . వ్యవసాయ  భూములైతే  ఇన్కమ్ టాక్స్  బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . అయితే  లాంగ్ టర్మ్ పెట్టుబడులై ఉండాలి .  ఆ తరువాతనే  మ్యూచువల్ ఫండ్స్ , షేర్స్ , బంగారం , వెండి , చిట్ ఫండ్స్ , ఫిక్సడ్  డిపాజిట్స్  , ఆర్ . డి . అకౌంట్స్ , ఎన్ .  ఎస్.  సి.   సర్టిఫికెట్లు , ఇన్సూరెన్స్  పాలసీస్ , సేవింగ్ అకౌంట్స్  మొదలైనవి  వరుస క్రమంలో ఉంటాయి .

12.  ' మ్యూచువల్  ఫండ్స్  '  లలో  గాని  , ఇతర   అధిక రిస్క్ తో  కూడిన పెట్టుబడులు  పెట్టేటప్పుడు  వయస్సును దృష్టిలో పెట్టుకుని  పెట్టుబడులు పెట్టాలి . అందుకు ఒక ఆర్ధిక సూత్రం ఉంది . అది ఏమంటే  100 నుండి మన వయస్సును  తీసి వేయాలి . అలా  తీయగా  మిగిలిన  శాతాన్ని మాత్రమే అధిక రిస్క్ గల  ఫండ్లల్లో  పెట్టుబడులు  పెట్టాలి .  వయస్సు శాతాన్ని  అధిక లిక్విడిటీ ఉన్న  ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టాలి .  ఉదా :  రాము  వయస్సు  40 అనుకుందాం .  100 నుండి 40 తీసి వేస్తే  60 వస్తుంది .  అప్పుడు మన మొత్తం పెట్టుబడులలో  60 శాతాన్ని  అధిక రిస్క్ గల ' మ్యూచువల్  ఫండ్స్  '  లలో  పెట్టుబడి పెట్ట వచ్చు . అంటే ఆ వయస్సున  60 శాతం  రిస్క్ తట్టుకునే శక్తి ఉంటుంది . అలానే ఆదాయం  అధికంగా ఉంటుంది .  ఒకో సారి   తక్కువగా  ఉండ వచ్చు .  అలానే  40 శాతం  మొత్తాన్ని    తక్కువ రిస్క్ గల  ' మ్యూచువల్  ఫండ్స్  '  లలో పెట్టుబడులు  పెట్టాలి .  అప్పుడు  ఇందులో తక్కువ ఆదాయం లభిస్తుంది .  కానీ రిస్క్ ఉండదు .