Thursday, March 31, 2016

మనుష్యులను నేరస్తులుగా ( CRIME) ఎవరు మారుస్తున్నారు ?

ప్ర . మనుష్యులను నేరస్తులుగా (CRIME) ఎవరు మారుస్తున్నారు ?


జ. సాధారణంగా  ప్రతి శిషువు  ఒకే క్రమ పద్దతిలో జన్మిస్తారు .  కృత్రిమంగా ఎవరినీ  సృష్టించడం  లేదు . కాక  పోతే  వారి వారి బరువులలో , రంగులలో , ఎత్తులలో , ఆరోగ్యాలలో , ఆకృతులలో   తేడాలుండ వచ్చు .  కాని నేరస్తులుగా (CRIME)  మొఖాన  వ్రాసుకుని ఎవరూ జన్మించరు . ఒక అవినీతి పరుని బిడ్డను  " అవినీతి పరుడు " అని అనగలమా ? ఒక కుంభ కోణం దారుడి బిడ్డను  " కుంభ కోనుడు " అని అణా గలమా ?  ( అలానే బంగారు చేమ్చానో  లేదా  ఇనుప చేమ్చానో నోట్లో పెట్టుకుని ఎవరూ జన్మించరు ) ఒక వ్యక్తి  ఏవో  కారణాలతో  , ఎన్నో ప్రయత్నాలతో , వ్యయ ప్రయాసలకు ఓర్చి , తన అవసరాలకో , తన కుటుంభ అవసరాలకో , కూడ  బెట్టుకోడానికో , ఒక పొరపాటు  చేసి  నేరస్తుడుగా  పట్టుబడుతే  , వ్యవస్థలు  ఆ ఒక్కడిని చూపిస్తూ , అతడు లేదా ఆమె  చేసిన నేరాన్ని  కళ్ళకు కట్టినట్లుగా  ప్రజలకు  చూపిస్తూ , అతడు లేదా ఆమె చేసిన నేరాన్ని  అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా , పూసా గ్రుచ్చి నట్లుగా , అరటి ఆకుకు తేనె రాసి నట్లుగా  వివరిస్తూ , రేడియోలలో , టి . వి . లలో ప్రసారం చేస్తూ , పత్రికలలో  ప్రచురిస్తూ , యూ  ట్యూబ్ ల లోకి ఎక్కిస్తూ ,    ప్రతి నిమిషానికి  లక్షలాది మంది కి ( ఏ విద్యా లేని వారికి కూడా  అర్ధమయ్యే విధంగా )   ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా  తెలియ జేస్తూ   , వేలాది మందిని  నేరస్తులుగా తయారు చేస్తున్నారు . నేరాలు  ఉదా : సిమ్  కార్డులు కావచ్చు , చిట్టీలు కావచ్చు , ఎ . టి .ఎమ్ ల  లూటీ కావచ్చు , డెబిట్ , క్రెడిట్ కార్డుల  దొంగ తనం కావచ్చు , ఆన్ లైన్ మోసాలు కావచ్చు , దొంగ  సెల్ ల వినియోగం కావచ్చు , దొంగ నోట్ల చెలామణి కావచ్చు,  దొంగ సర్టిఫికెట్లను  తయారు చేయడం కావచ్చు , మరేదైనా కావచ్చు .  ఇలా తెలియ  చేస్తే  ఇక నేరాలకు అంతం ఎక్కడ ?  ఇలా చేస్తే  వ్యవస్థలకు పని  భారం తప్పదు .  వ్యయ ప్రయాసలు తప్పవు , లక్షల్లో , కోట్లల్లో  డబ్బు వృధా కాక తప్పదు . అలా కాకుండా , సూక్ష్మంగా  " సాంకేతిక విజ్ఞ్యానాన్ని వినియోగించుకుని " ఈ నేరాన్ని  చేశాడు  లేదా చేసింది . అంటే  సరిపోతుంది .  న్యాయ స్థానాలకు పూర్తీ వివరాలు సీల్డ్ కవర్లో ఇచ్చే విధంగా మార్పులు చేస్తే బాగుంటుంది .  అప్పుడే నేరాలు తగ్గు మొఖం పడుతాయి. దేశం లోని  అన్ని వ్యవస్థల అది కారులు , మేధావులు , సామాజిక వేత్తలు , సంఘ సంస్కర్తలు , రాజ కీయ నాయకులు , ఈ దిశ గా  ఆలోచనలు  చేస్తే  ఎంతో మార్పు  కనపడ వచ్చు .  

న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలా ?

ప్ర . న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలా ?

జ. న్యాయ వ్యవస్థలో ప్రస్తుతమున్న ” కొలీజియం ” విధానాన్నే కొన సాగించాలి .
అసలు ” కొలీజియం” అంటే ఏమిటి ? నలుగురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తుల ధర్మాసనం సూచనతో , సుప్రీమ్ కోర్ట్ న్యాయ మూర్తి , న్యాయ వ్యవస్థ లోని వారినే సుప్రీం కోర్ట్ , రాష్ట్ర హై కోర్టుల న్యాయ మూర్తులుగా నియమిస్తారు . న్యాయ మూర్తుల నియామకాలనే కాకుండా , ట్రాన్స్ఫర్ ల ను మరియు ప్రమోషన్లను చేపడుతారు . దీనికి గవర్నరు , రాష్ట్ర పతి ఆమోద ముద్ర తప్పని సరి. ఈ నలుగురు సభ్యులలో అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు తప్పా ఇతర వ్యవస్థ ల లోని సభ్యులు ఎవ్వరూ ఉండరు .

అయితే ఇప్పుడు ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా తీసు కొచ్చిన కొత్త విధానం ఏమంటే , న్యాయ మూర్తుల నియామకాలను పార దర్శకంగా , విశాల ప్రాతి పదికన చేపట్టడానికంటూ ” జాతీయ న్యాయ నియామకాల కమీషన్ ” (ఎన్. జె . ఎ . సి . ) ని ఏర్పాటు చేశారు . న్యాయ శాసన వ్యవస్థల నుండే కాకుండా , పౌర సమాజం నుంచి , పార్ల మెంటరీ వ్యవస్థ నుండీ ప్రజా ప్రతినిధులు ఉంటారు . అనగా ఇందులో , సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి , ఇరువురు అత్యంత సీనియర్ న్యాయ మూర్తులు , న్యాయ శాక మంత్రి మరియు ఇరువురు ఉన్నత మైన మేధావులు ( వీరిని సూచించే వారిలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి కూడా ఉంటాడు .)దీనిని సుప్రీం కోర్ట్ 16.10.2015 న కొట్టివేసింది .

సుమారుగా 70% అనేక కులాల , మతాల , ప్రాంతాల , దేశాల సామాన్య ప్రజలున్న భారత దేశంలో , వారు కొంత వరకైనా ధైర్యంగా, ప్రశాంతంగా , ఆత్మాభిమానంతో జీవించాలంటే , న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం ఉండ కూడదు . కొందరంటారు , రాజకీయ నాయక సభ్యులు కేవలం సూచనలు చేస్తారు , మిగిలిన సభ్యులు నచ్చక పోతే వ్యతిరేకించ వచ్చు,అని . ఇక్కడే ఒక గొప్ప తిరకాసు ఉంది . ఆ రాజకీయ నాయకుడి సభ్యుడి వెనుకాల , మొత్తం కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాల పాలకులు ఉంటారు . వారి వద్ద ఎంతటి అధికారం , డబ్బు బలం ,కార్య కర్తల బలం ఉంటుందో అందరికి తెల్సిన విషయమే . అలాంటప్పుడు , ఆ రాజకీయ సభ్యుడి సూచనను వ్యతిరేకించే దమ్ము , ధైర్యం ఎవరికీ ఉంటుంది చెప్పండి . కనీసం ఇప్పుడు కోర్టు తీర్పులను గౌరవిస్తున్నారు , పాటిస్తున్నారు . విమర్శించే సాహాసం కూడా ఎవ్వరూ చేయడం లేదు

కాని రేపు అలా ఉండదు . ప్రతి తీర్పు విమర్శకు తావు ఉంటుంది . రాజకీయ సభ్యుల సూచనలను వ్యతిరేకించే ఇతర సభ్యులు బిక్కు బిక్కున బ్రతుకాల్సి ఉంటుంది . న్యాయ మూర్తులకు తీర్పులు నచ్చక స్వచ్చంద విరమణ చేయ వచ్చు . అప్పుడు వ్యవస్థ మరల తిరోగమన దశలో నడువ వచ్చు .” కొలీజియం ” విధానంలో ఏమైనా లోపాలు ఉంటే సూచనలు చేయ వచ్చు . సవరణలు చేయ వచ్చు . న్యాయ మూర్తులను నియామకం చేసే అత్యంత సీనియర్ న్యాయ మూర్తులను ప్రభుత్వాలు సిఫారస్ చేయ వచ్చు . కాని ఎట్టి పరిస్థితులలోనూ న్యాయ వ్యవస్థలో , ఎన్నికల సంఘంలో , రిజర్వు బ్యాంకులో మరియు అన్ని నియంత్రణ సంస్థలలో రాజకీయ నాయకులకు సభ్యత్వం ఉండ కూడదు . వీటికి స్వతంత్ర ( స్వయం ప్రతి పత్తి) అధికారం ఉండాలి . అలా అని , ఏ వ్యవస్థను , ఏ సార్వ భౌమాదికారాన్ని కించ పరిచినట్లు కాదు . వేటి పరిధి వాటివే . వేటి అధికారాలు వాటివే .వేటి భాధ్యతలు వాటివే . వేటి గౌరవాలు వాటివే .

1000 కోట్ల కుంభ కోన దారులకు అత్యధికంగా 7 సంవత్సరాలు శిక్ష విధిస్తే ,100 రూపాయల దొంగలకు ఎన్నోరెట్లు మానసిక , శారీరక శిక్షలుంటున్నాయి . 1000 కోట్ల నల్ల ధన కుభేరులను ఏ . సి .లో , విచారిస్తే , 100 రూపాయల దొంగలను థర్డ్ డిగ్రీతో విచారిస్తున్నారు . పొట్ట కూటి కోసం చేసే 100 రూపాయల దొంగలకు వెంటనే శిక్షలు పడుతే , తర తరాల కోసం దాచిపెట్టే 1000 కోట్ల అవినీతి పరులకు యేండ్ల తరబడి శిక్షలుండవు . ఈ లోగా మల్లీ ఎన్నికలలో పోటీ చేస్తారు . గెలుస్తారు .

ఎవ్వరైనా పనిచేసేది 12 గంటలే . ఎవ్వరైనా తీసుకునేది ఆహారమే . ఎవ్వరికైనా ఉన్నవి రెండే చేతులు , రెండే కాళ్ళు , ఒకటే శిరస్సు , ఒకటే మొండెం . కాని కొందరే కొద్ది కాలం లోనే కోట్లకు పడగలెత్తు తున్నారు . మరికొందరు జీవితాంతం పేద రికంలోనే మ్రగ్గు తున్నారు , బిక్షాటనే చేస్తున్నారు . అదే అక్రమంగా సంపాదించే వారు కోట్లల్లో సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు . నిజాయితీ పరులు దినమొక గండంగా కాలం వెల్లదీస్తున్నారు . ఎక్కడుంది లోపం ? కనిపెట్టడం ఎలా ? అరికట్టడం ఎలా ? నల్ల ధనం దేశంలో , విదేశాలల్లో లక్షల కోట్లు అనుత్పాదక శక్తి గా మ్రగ్గు తుంది . ఇలాంటి సమయంలో న్యాయ వ్యవస్థకు , స్వతంత్రత లేకుండా చేయడ మంటే ప్రజా స్వామ్యాన్ని బలహీన పరచడమే అవుతుంది .

అందరికి సమాన న్యాయం అందాలంటే , ఇప్పుడున్న ” కొలీజియం ” విధానం లో నేటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని వ్యవస్థల , ప్రజల సూచనలు , సలహాలతో మరిన్ని మార్పులు చేయ డానికి అవకాశం ఉండాలి . మరిన్ని మార్పులు చేయాలి . సామాన్య పేద ప్రజలకు రక్షణ కల్పించాలన్నా , అవినీతి పరుల , నల్ల ధన కుబేరుల ను శిక్షించాలన్నా , న్యాయ వ్యవస్థలో , రాజ కీయ నాయకుల ప్రవేశం ఉండ కూడదు . ప్రస్తుతం అనేకమైన అసాంఘీక శక్తులకు , అవినీతి పరులకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభిస్తుంది . ఎలాగో అలాగా డబ్బు ఎగజల్లి గెలుస్తున్నారు . ఎన్నికల సమయంలో డబ్బు దొరికినా ఎవరికీ శిక్షలు పడిన దాఖలాలు లేవు . డబ్బు ఎగజల్లిన వారు , దానిని వడ్డీతో సహా పది రెట్లు అధికంగా సంపాదించు కోవాలని చూస్తున్నారు . ఏదో విధంగా గెలిచినా వారు , ప్రజలకు తెలియ కుండానే శాషనాలు చేస్తున్నారు . దానిని ప్రజలపై రుద్దు తున్నారు . రాష్ట్ర పతి ఎన్నికలకు విప్ లు జారి చేస్తున్నారు . ఇలాంటి కాలంలో , సామాన్య పేద ప్రజలకు , ఒకే ఒక దిక్కుగా ఉన్న , జుడీష్యరీ వ్యవస్థలో కూడా , రాజకీయ నాయకులు ప్రవేశిస్తే , సామాన్య పేద ప్రజల భవష్యత్ ఏమౌతుందో మేధావులు ఆలోచించి నిర్ణయాలు తీసు కోవాలి . సుప్రీం కోర్ట్ తీర్పును వ్యతిరేకించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో , సమర్ధించే వారు ఏ వర్గానికి చెందిన వారు ఉంటున్నారో క్షున్నంగా పరిశీలించాలి . అప్పుడు విషయం భోధ పడుతుంది . కేవలం ఒకే ఒక పాయింట్ , రాజ్యాంగ బద్ధమైన కమీషన్ అని కాకుండా , మెజార్టీ ప్రజల భవిష్యత్ , ఆర్ధిక అసమానతలు , అవినీతిని , నల్లదనాన్ని అరి కట్టే మార్గాలు అదో గతి పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది . అధికారం చేతికి రాగానే దేశం లోని , రాష్ట్రాల లోని సంపద అంతా పాలకులది గానే భావించే రోజులు పోవాలి . ప్రభుత్వ ఉద్యోగం రాగానే మాదే అధికారం అనుకునే కాలం మారాలి . ఇలాంటి విషయాలలో కట్టడికి న్యాయ వ్యవస్థ లో మార్పులు తీసుకుని రావాలి . సాధారణంగా , సామాన్యులకు , పేదలకు శిక్షలుండ కూడదు . కుంభ కోన దారుల , నల్ల ధన కుభేరుల , అవినీతి పరులకు సత్వర ఖటిన పారదర్శకమైన శిక్షలు విదిస్తూ , సామాన్యుల , పేద వారిలో ఒక భయానక వాతా వరణాన్ని క్రియేట్ చేయాలి . అప్పుడు అందరూ భయ పడుతారు . ఎవ్వరూ తప్పులు చేయరు . దేశ మంతటా విశ్రాంత న్యాయ మూర్తులచే న్యాయ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి . ఈ విధంగా చేయడం వలన కోర్టుల్లో కేసులు కూడా తగ్గుమొఖం పడుతాయి . న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే , అంత పేద , సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది . భద్రత లభిస్తుంది . సుఖ సంతోషాలు లభిస్తాయి . ధైర్యముంటుంది . లేదంటే రాజకీయ నాయకులదే , వారి కార్య కర్తలదే , బలమున్న వారిదే, అవి నీతి పరులదే , బడా అక్రమ వ్యాపార వేత్తలదే ,మోస కారులదే రాజ్య మవుతుంది .

”ఎటు పోతుందిరా …… దే శం”? ( where the country is going ?)

ప్ర . ”ఎటు పోతుందిరా …… దే శం” ? ( where the country is going ?)

జ : 

01. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
నల్ల ధనం రప్పిస్తామని ……..”2″
నరులా వంచిరి …………”నల్ల ధనం “
ఏడాదీ  దాటినా ………..”2″
జాడే లేదాయే  …….” కృష్ణా ……”2″ “ఏడాదీ “

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″

మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

టు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


02. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″

అధి కారం రాగానే ….. “2″
ప్రతి చెల్లికీ సెల్లు అనిరీ….” అధి ” “2″
యేడాదీ గడిచినా ….. “2″
సెల్లు అంటే ఘల్లు మనిరీ కృష్ణా!.. . “యేడాదీ ” “2″
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


03. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు వెచ్చించి కేంధ్రమూ …”2″
కేసుల సి .బి .ఐ కి అప్పా జెప్పే ….”2″ “కోట్లు”
అవినీతుల అరెస్టు చేస్తే ….”2″
లోకమంతా విహరించే కృష్ణా…”2″ “అవినీతుల “

మా జాతి పితా …. మా దేశ నేతా …

మా గాంధీ తాతా …..

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″



04. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
అవినీతి నడ్డుకోనా ….”2″
సి. బి .ఐ పరిశోదిస్తుంటే ….”2″ “అవినీతి”
గౌహతి హైకోర్టు సి. బి. ఐ. నే చెల్లా దనిరి ….”2″
వేల కోర్టు కేసులు ఆగ మాయే కృష్ణా…”2″ “గౌహతి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

05. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఆదరా బాదరాగా కేంధ్రమూ ….”2″
సుప్రీం కోర్టూ శరునూ జొచ్చే …. “2″ “ఆదరా “
పరిస్తితి నీ పరిశీలించీ ….”2″
కోర్టూ స్టే యిచ్చే కృష్ణా…”2″ “పరిస్తితి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

06. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
రెక్కలు లేని పక్షి సి .బి. ఐ. “2″

అధి కారాలు అడుగుతే “2″ “రెక్కలు “
గీత దాటుతే కత్తే రేస్తామనీ “2”
హిత బోధ చేసే కృష్ణా “2″ “గీత “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….’

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

07. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

ప్రజలకూ అండాగా ….. “2″
వేల చట్టాలూ ఉండగా …. “2″ “ప్రజలకూ ”
పేద ప్రజలే బలి యౌ తుండే …”2”
ధనికలూ దర్జాగా బ్రతుకూ తుండే కృష్ణా “2″ ” పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


08. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్లు వెద జల్లుతూ ,ఎన్నికల్లో ….. “2″
ఓట్లు పొందే పాలకులూ …. “2″ “కోట్లు ”
ప్రత్యర్ధుల నిధులా పైనా …”2”
నిఘా పెట్టే కృష్ణా “2″ “ప్రత్యర్ధుల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

09. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
‘లోక్ పాల్ ‘ బిల్లూ తేవాలానీ ….. “2″
అన్నా హజారే ఉద్యా మిస్తే …. “2″ “లోక్ పాల్ “
అది మనకూ గిట్టా దానీ …”2”
ఆది లోనే అడ్డుకునే కృష్ణా ..”2″ ” అది “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

10. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఎన్నికలు మొదలయ్యీ ….. “2″
అరువది యేండ్లూ దాటీనా …. “2″ “ఎన్నికలు “
ఎన్నికల ప్రక్షాలనా ….”2”
ఎన్నడు జరుగునో కృష్ణా…. “2″ “ఎన్నికల “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


11. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఎనుబది దాటిన పండు నాయకులూ ….. “2″
పోటీకి సై అంటే . …. “2″ ” ఎనుబది “
నేటి యువతీ యువకులకూ ….”2”
నిరాశే మిగిలే కృష్ణా…. “2″ ” నేటి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


12. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
తన గెలుపు పైనే నమ్మకమూ లేకా ….. “2″
బలమైనా నాయకుడూ …. “2″ “తన గెలుపు “
వేల కోట్లూ వెచ్చించీ ….”2”
పలు చోట్లా పోటీ చేసే కృష్ణా…. “2″ “వేల కోట్లూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


13. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
నాయకులూ చనీ పోతే ….. “2″
వారసులా నిలా బెట్టిరీ …. “2″ “నాయకులూ ”
జాలి ఓట్లతో గెలిచీ …”2”
ప్రజలకూ భారమైరీ కృష్ణా “2″ “జాలి ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….


ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


14. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఒక్కో కుటుంభానికీ ….. “2″
వేల కోట్ల వ్యత్యాసమూ …. “2″ “ఒక్కో”
ప్రతీ వారూ చేసేదీ పనే కదా …”2”
దీని మర్మ మేమిటో తెలియదూ కృష్ణా “2″ “ప్రతీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


15. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
తుమ్ముతే వూడేదీ తెలంగాణా ….. “2″
ఎన్నాళ్ళూ వ్రేలాడినా …. “2″ “తుమ్ముతే”
విభజనా జరుగకా ఆగదురా …”2”
విడి పోయినా కలిసే వుంటామూ కృష్ణా “2″ “విభజనా “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


16. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
లక్ష కోట్లా మొండి బకాయిీ లూ ….. “2″
పెద్ద చేపలవీ రద్దు చేసే …. “2″ “లక్ష కోట్లా ”
పేద ప్రజలా సరుకుల ధరలూ …”2”
ఆకాశాన్నీ అంటే కృష్ణా “2″ “పేద ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


17. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
మర్రీ చెట్లా నీడాలో ….. “2″
పూలా మొక్కాలూ పెరుగా నట్లే …. “2″ ” మర్రీ ”
స్వార్ధా పరులా పాలనాలో …”2”
పేద జనులూ ఎదుగరూ కృష్ణా “2″ “స్వార్ధా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….


ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


18. ఎటూ పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

సర్కారూ ఉద్యోగులకూ ….. “2″
సకలా సదుపాయాలూ …. “2″ “సర్కారూ “
ప్రైవే టూ ఉద్యోగులూ …”2”
ఏమి పాపమూ చేసిరీ కృష్ణా “2″ “ప్రైవే టూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


19. ఎటూ పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
మనిషికి ఎంత తెలివీ ఉన్నా ….. “2″
ఎన్ని కోట్లు సంపా దించినా …. “2″ “మనిషికి “
ప్రకృతీ శక్తీ ముందూ …”2”
ఎవరూ సాటి రారూ కృష్ణా “2″ “ప్రకృతీ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


20. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ధనము ఎలా సంపాదించినా ….. “2″
తెలివీ మంతూ లనిరీ …. “2″ “ధనము “
ధనము లేనీ వారినీ …”2”
తెలివీ హీనూ లనిరీ కృష్ణా “2″ “ధనము “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


21. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కంచే చేనునూ . …”2″
గంగిరెద్దుతో మేపుతే …. “2″ “కంచే”
వ్యవస్థా సర్వమూ ….”2″
గాడి తప్పునూ… కృష్ణా !……”2″ “వ్యవస్థా”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


22. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
లక్షలూ , కోట్లూ … ఎగవేసే …..”2”
బడా వ్యాపారులా …. జాడా విడీచీ ….”2″ “లక్షలూ ”
లెక్కలు సక్కంగా ఉన్నాయనీ ……”2″
చిరుద్యోగులా పై …పన్నులా…. కృష్ణా !…..”2″ “లెక్కలు ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


23. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
కోట్ల కొలదీ …. నల్లధనమూ ….”2”
స్విస్ బ్యాంకూ……. తరులూ తుంటే …. “2″ ” కోట్ల “
అరా పావూ శాతాలా పై ……”2″
మల్లా గుల్లాలా ….కృష్ణా !…..”2″ “అరా పావూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


24. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
గుమ్మా గుమ్మానీ కెల్లీ ….”2”
విచారణా చేస్తే ….. “2″ ” గుమ్మా “
బినామీ ఆస్తులా భాగోతం ……”2″
బయటా పడూ ….కృష్ణా !…..”2″ “బినామీ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


25. ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″
ఇంటీ మనిసినీ , వంట మనిషినీ …. “2”
కారూ డ్రైవరునూ ,.ఖతాలా కనికట్టూనూ “2″ ” ఇంటీ “
ఒడిసి పడుతే, నల్లధనమూ ……”2″
గుట్టూ రట్టవూ ….కృష్ణా !…..”2″ “ఒడిసి “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


26. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″

బ్రిటిష్ పాలకులా . …”2″
తరిమి కొట్టీ …. “2″ “బ్రిటిష్ ”
విదేశీ వ్యాపారాలకూ ….”2″
ఎర్ర తివాచీలా …కృష్ణా !……”2″ “విదేశీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


27. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
ఉత్పాదకా శక్తినీ …”2″
నిలిపి వేసీ …. “2″ “ఉత్పాదకా”
ఉత్తుత్తీ సేవలతో ….”2″
అభి వృద్దీ సాధ్యమా …కృష్ణా !……”2″ “ఉత్తుత్తీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….


ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


28. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
గ్రామాలు అభివృద్ధీ . …”2″
చెంద కుండా …. “2″ “గ్రామాలు “
గరీబులూ అభివృద్ధీ . ….”2″
చెందు దురా …కృష్ణా !……”2″ “గరీబులూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


29. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా …….. “2″
అవినీతీ బండారాన్నీ …..”2″
అక్రమాస్తుల గుట్టునూ ……”2″ ”అవినీతీ”
నిగ్గు తేల్చీ , శిక్షలు వేస్తే …..”2″
తెలంగాణా విభజనా చిటికెలోపనిరా కృష్ణా !….”2″ “నిగ్గు తేల్చీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


30. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
బినామీ ఆస్తులా . …”2″
బట్ట బయలూ చేసీ …. “2″ “బినామీ “
ఖజానానూ దండిగా నింపితే . ….”2″
పేద రికమే కాన రాదూ …కృష్ణా !……”2″ “ఖజానానూ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


31. ఎటు పోతుందిరా …… దే శం , ఎమయీ పోతుందిరా ….. “2″
అద్దెల కిచ్చే వారినీ …”2″
వదిలీ పెట్టీ … “2″ “అద్దెల”
అద్దెల కుండే వారీ పై …”2″
పన్నులా భారమా …కృష్ణా !……”2″ “అద్దెల “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


32. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్షా రూపాయాలా అప్పు కోసమూ . …”2″
బ్యాంకులు , సవా లక్షా కొర్రీ లేసిరీ …. “2″ “లక్షా ”
వేల కోట్లా ఎన్ పీ ఏ లు … “2″
ఎలా అయ్యేరా కృష్ణా !……”2″ “వేల ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″



33. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ రాజ్య మేలుతుంటే . …”2″
జే . డీ లక్ష్మి నారాయణా లాంటీ …. “2″ “అవి ”
సమర్ధులూ , నీతి పరులకూ … “2″
విశ్రాంతీ… ని చ్చి రీ కృష్ణా !……”2″ “సమర్ధులూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….


ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


34. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలు ఎన్ని వున్నా . …”2″
సి బి ఐ కి, సమర్ధులు లేక పోయి నా …. “2″ “చట్టాలు”
స్వయం ప్రతి పత్తీ లేక పో యినా ….”2″
అవి వున్నా లేనట్లే కృష్ణా !……”2″ “స్వయం”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


35. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భూ ఆక్రమణలూ జరిగాయనీ . …”2″
తెలంగాణా విభజనా కోరుతుంటే …. “2″ “భూ “
గత భూముల జోలికెల్లద్దనే … “2″
శరతులేమిటో కృష్ణా !……”2″ “గత “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


36. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ప్రజల పన్నులనూ . …”2″
ప్రజలకే ఖర్చు చేస్తే …. “2″ “ప్రజల”
సంక్షేమా పథకాలకూ … “2″
నాయకులా పేర్లా కృష్ణా !……”2″ “సంక్షేమా “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


37. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాలూ అనేకమున్నా . …”2″
స్వార్ధ రాజ కీయాలతో …. “2″ “చట్టాలూ”
అవినీతి పరులూ ….”2″
కుబేరులవు చుండే కృష్ణా !……”2″ “అవినీతి”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


38. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
భీమా డబ్బుల తో . …”2″
ప్రభుత్వ షేర్లు కొనిపించీ …. “2″ “భీమా”
పాలిసీ దారులా క్లేములనూ….”2″
కోర్టుల్లో నాన్చు తుండే కృష్ణా !……”2″ “పాలిసీ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


39. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
చట్టాల మీద ప్రమాణాలు చేసి . …”2″
మంత్రు లౌతారూ …. “2″ “చట్టాలు”
పదవు లొచ్చాకా ….”2″
ప్రజల మరుస్తారూ కృష్ణా !……”2″ “పదవు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


40. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కే వై సీ కీ , బ్యాంకులూ. …”2″
శొధించిరీ ఇండ్లనూ…. “2″ “కే వై సీ కీ ”
కోట్లాది రుణాలా , మంజూరీకీ … “2″
అడ్రసూ, అడుగ రెందుకూ …. కృష్ణా ! “2″ “కోట్లాది ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


41. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
బ్రిటిష్ ల నూ , వెడల గొట్టీ . …”2″
ప్రజా స్వామ్యమనే, పేరు పెట్టీ …. “2″ “బ్రిటిష్ ల నూ ”
ప్రజలనూ , ఓటు యంత్రాలుగా … “2″
మార్చే …రా ….. కృష్ణా ! “2″ “ప్రజలనూ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


42. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అడుగడుగునా , అవినీతే …”2″
ఏమీ అనీ అడుగుతే, ఎగతాలే …. “2″ “అడుగడుగునా “
అడ్డు పడ్డా మంటే … “2″
మన బ్రతుకూ , ఎడారే …. కృష్ణా ! “2″ “అడ్డు “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


43. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
డెక్కాకూ మాదిరీ .. ..”2″
అవి నీతి… మందనూ …. “2″ “డెక్కాకూ “
ఎన్నికలలో నిలువరిస్తే … “2″
దేశ దరిధ్రమూ వదులు నూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


44. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
ఎన్నికలలో … ఓడించడమూ …. “2″ “అవి నీతీ “
ప్రజలకూ , ఎన్నటికీ … “2″
సాధ్యమూ…. కాదూ…. కృష్ణా ! “2″ “ప్రజలకూ “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


45. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
అవి నీతీ .. నాయకులనూ .. ..”2″
గూండా నాయకులనూ …. “2″ “అవి నీతీ “
ఎన్నికలలో , నిలువరించడం … “2″
పార్ల మెంటుకే , సాధ్యమూ…. కృష్ణా ! “2″ “ఎన్నికలలో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


46. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఒకా అవి నీతీ పరుడూ .. ..”2″
ఒకా రౌడీ , ఒకా గూండా నిలబడుతే …. “2″ “ఒకా అవి నీతీ “
ఎవరో ఒకరూ …… “2″
తప్పకా గెలుచును, కదరా …. కృష్ణా ! “2″ “ఎవరో “
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


47. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
యిష్టాను సారమూ ….”2″
తొల గించిరీ , ఓటరూ పేర్లూ …. “2″ “యిష్టాను”
ప్రజలా ఓటు హక్కునే … “2″
హరించీ వేసిరీ …. కృష్ణా ! “2″ “ప్రజలా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….


ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


48. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
లక్ష. లాస్తీ … కుటుంబాలకూ …”2″
తెల్ల కార్డూ లేన్దిరా …. “2″ “లక్ష. లాస్తీ . ”
అద్దె కుండే …. కుటుంబాలకూ … “2″
ఆంక్ష లెందుకు రా …. కృష్ణా ! “2″ “అద్దె కుండే ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


48. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ఐ. టీ. టెక్నాలజీ ….”2″
పొట్ట నింప దూ , ఎంతో కాలమూ …. “2″ “ఐ. టీ. ”
వ్యవసాయం మరుస్తే … “2″
మన లేమూ , మరెంతో కాలమూ …. కృష్ణా ! “2″ “వ్యవసాయం ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″

49. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
ప్రపంచీ కరణా ….”2″
ఎవరీ వంచనకూ రా …. “2″ “ప్రపంచీ ”
పేదా జనులా … “2″
అనచ డానికే…. కృష్ణా ! “2″ “పేదా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


50. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
కరెంటూ ఉత్పత్తీకీ ….”2″
యిక గడ్డు కాలమే రా …. “2″ “కరెంటూ ”
సౌర శక్తీ ఉత్పత్తీ … “2″
మన కెంతో మేలురా …. కృష్ణా ! “2″ “సౌర శక్తీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


51. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
పేదా రోగులా బిల్లులూ ….”2″
‘ఆరోగ్యా శ్రీ’ వారూ చెల్లించే …. “2″ “పేదా”
లక్షలా రోగులా డిపాజిట్లూ … “2″
అధికారూలూ మింగిరీ …. కృష్ణా ! “2″ “లక్షలా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం, ఎటూ పోతుందిరా …..”2″


52. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
అక్రమాల అరికట్టేందుకు…….”2″
‘ఆర్ధిక సామాజిక సర్వే’ చేపడితే …….”2″ “అక్రమాల”
అడ్డగోలు ఆలోచనలతో ………
అడ్డుతగులుతుండిరా కృష్ణా ……”2″ “అడ్డగోలు”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


53. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
విభజనా మీ యిష్టా మనీ ….”2″
అధికారా మిచ్చిరీ …. “2″ “విభజనా”
తెలంగాణా విభాజిస్తుంటే … “2″
అవిశ్వాసా నోటీసిచ్చిరీ …. కృష్ణా ! “2″ “తెలంగాణా ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


54. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ… పోతుందిరా …. “2″
‘బుల్లెట్ట్ న్యూసూ’ లో నరులా ….”2″
వుతికీ ఆరేస్తున్నా …. “2″ ” బుల్లెట్ట్ ”
దోపిడికెన్నో దారులనీ … “2″
పట్టు వీడ కుండే  …. కృష్ణా ! “2″ “దోపిడికీ ”
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


55. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
కడుపు తిప్పలుకు చేసే…… “2″
చిల్లర దొంగలకు సిక్షలూ …… “2″ “కడుపు “
తర తరాల కొరకు దాచి పెట్టే.. …”2”
నల్ల ధన దొంగలకు బుజ్జ గింపులా కృష్ణా ……”2″ “తర తరాల “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


56. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
సర్వీస్ చార్జీల తోనే …… “2″
సామాన్యుడి నడ్డివిరుస్తుంటే …… “2″ “సర్వీస్ “
గడిచిన కాలపు , ఎఫ్ .ఎస్స్ .ఎ చార్జీలతో.. …”2”
పేదలు , నరకం చూస్తుండిరీ కృష్ణా ……”2″ “గడిచిన కాలపు “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


57. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
లక్షలాది పేద ప్రజలూ….. “2″
కూడూ గూడూ లేక చస్తుంటే …. “2″ “లక్షలాది “
రైతులకూ , డ్వాక్రా మహిళలకూ …”2”
కోట్ల రుణాలు మాఫీనా కృష్ణా ……”2″ “రైతులకూ “
ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″
మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


58. ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″

అక్రమాల అరికట్టేందుకు…….”2″
‘ఆర్ధిక సామాజిక సర్వే’ చేపడితే …….”2″ “అక్రమాల”
అడ్డగోలు ఆలోచనలతో ………”2″

అడ్డుతగులుతుండే రా కృష్ణా ……”2″ “అడ్డగోలు”

మా జాతి పితా …. మా దేశ నేతా …
మా గాంధీ తాతా ….

ఎటు పోతుందిరా …… దే శం , ఎటూ పోతుందిరా …. “2″


59. ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
ఎదురుగానే ఎలుకలెన్ని తిన్నా ........."2"
యెముడే ఏమి చేయ లేనపుడు ...... "2" "ఎదురుగానే "
అవినీతి పరుల అడ్డాలో .. ..."2''
సామాన్యుడేమి చేయ గలడు? కృష్ణా ......"2" "అవినీతి "
ఎటు పోతుందిరా ...... దే శం , ఎటూ పోతుందిరా .... "2"
మా జాతి పితా .... మా దేశ నేతా ...
మా గాంధీ తాతా ...."ఎటు పోతుందిరా"


www.margamkrishnamurthyideas.blog.com

Wednesday, March 30, 2016

పంచామృతం ( PANCHAMRUTAM) అనగా నేమి ?

ప్ర . పంచామృతం ( PANCHAMRUTAM) అనగా నేమి ?

జ . పంచామృతం ( PANCHAMRUTAM) అనగా  ఐదు మధురమైన  పదార్ధాలతో  తయారు చేయబడే  పవిత్రమైన  పానీయం .  ఆ ఐదు మధురమైన  పదార్ధాలు ఏమనగా , 01. పాలు , 02. పంచదార , 03. ఆవు నెయ్యి , 04. పెరుగు , 05. తేనె . ఇది  ఆరోగ్యానికి  ఎంతో  మేలు చేస్తుంది . 

Monday, March 28, 2016

WHY THE PEOPLE FEEL TIRED ? /మనుష్యులు ఎందువలన అలసి పోయి నట్లు గా కనిపిస్తారు ?

ప్ర . మనుష్యులు   ఎందువలన  అలసి పోయి నట్లు   (TIRED) గా  కనిపిస్తారు ?
జ . సాధారణంగా  ఎవరైనా కాయా  కష్టం , పని  చేస్తే శరీరానికి  శ్రమ  తగిలి  నీరసించి పోయి నట్లుగా , అలసి పోయినట్లు (TIRED) గా కనిపిస్తారు . అయితే  ఒకో సారి , ఏ  పని చేయ కుండానే  మనుష్యులు  అలసి పోయినట్లుగా , సొలసి పోయినట్లుగా  కానీ పిస్తారు .  అవును అది నిజమే . ఒక్కో  సారి  కంటి నిండా నిద్ర లేక పోయినా , ప్రయాణం చేసినా , మనసు బాగా లేక పోయినా ,  జరుగ వలసిన పని గురించి టెన్షన్ గా ఉన్నా , సరియయిన సమయానికి భోజనం చేయక పోయినా , ఆరోగ్యం బాగా లేక పోయినా  అలసిపోయి నట్లుగా కనిపిస్తారు. 

WHY THE PEOPLE CHANGE ACCORDING TO THE SEASONS ? / కాలాన్ని బట్టి మనుష్యులు ఎందుకు మారాలి ?

ప్ర . కాలాన్ని (TIME) బట్టి  మనుష్యులు ఎందుకు మారాలి ?
జ . జీవన చక్రం  మొదలైన దగ్గరి నుండి , కాల గమనం మొదలైన  దగ్గరి నుండి విగాదియలు , గడియలు , తిధులు ,నక్షత్రాలు , రోజులు ,  పక్షాలు , మాసాలు , రుతువులు , సంవత్సరాలు, యుగాలు మారుతున్నాయి . అందుకని  ప్రతి ఒక్కరూ కాలాన్ని (TIME)  బట్టి మారాలి . అది నిత్యం జరుగుతూనే ఉండాలి . అప్పుడే మార్పు అనేది ఏర్పడుతుంది .  నిమిష నిమిషానికి అవసరాలు మారుతుంటాయి . కోరికలు మారుతుంటాయి . ప్రాధాన్యాలు 
మారు  తుంటాయి . ఆ కారణంగానే , నాటి అనాగరికత జీవన విధానం నుండి , నేడు   నాగరిక  జీవనానికి పరిణామం  చెందింది .  చెందుతునే ఉంటుంది .  పల్లె  జీవితాల నుండి  మనుష్యులకు , పాశ్చాత్య పోకడలు అలవడు తున్నాయి . పరుగెత్తే  ప్రవాహాన్ని  ఆపడం ఎంత కష్టమో ,  పరుగెత్తే కాలాన్ని ఆపడం  ఎంత కష్టమో , నేడు  ప్రజల జీవన విధానాన్ని కూడా   ఆపడం  అంతే కష్టం . కాలానికి అనుగుణంగా మారక పోతే మనుష్యులలో కోరికలు ఉండవు .  సంపాదించాలనే , సాధించాలనే  ఆసక్తి ఉండదు . మనుషుల్లో  చురుకు దనం ఉండదు .   అలానే  మనుష్యులలో  అభివృద్ధి ఉండదు . అలానే  దేశం లో  అభివృద్ధి ఉండదు . 

Sunday, March 27, 2016

WHY ONE SHOULD GET MARRAGE & WHOM ? వివాహం (పెండ్లి) ఎందుకు చేసుకోవాలి ? ఎలాంటి వారిని వివాహం ( పెండ్లి) చేసు కోవాలి?

ప్ర . వివాహం (పెండ్లి)  (MARRIAGE ) ఎందుకు చేసుకోవాలి ?  ఎలాంటి వారిని వివాహం  ( పెండ్లి)  చేసు కోవాలి?
జ . వివాహం (పెండ్లి) (MARRIAGE ) అనేది  సృష్టి  నియమం .  దైవ  నిర్ణయం . వివాహం (పెండ్లి) వలన  ఒక స్త్రీ , పురుషుడు  కలిసి  చట్ట బద్దంగా , ధైర్యంగా కల్సి జీవించే  అవకాశం లభిస్థుంది . వివాహం (పెండ్లి)  వలన  స్త్రీ  , పురుషులు  భార్యా భర్తలుగా ఒకే ఇంట్లో నివసిస్తూ , సమాజంలో  తలెత్తుకుని తిరిగే  ధైర్యం ఏర్పడుతుంది .  వివాహం (పెండ్లి)  వలన  సంతానోత్పత్తికి  అవకాశం  కలుగుతుంది . వివాహం (పెండ్లి)  వలన  , జీవించినంత కాలం  బార్యకు భర్త , భర్తకు భార్య  తోడూ నీడగా , అండగా , ఆసరాగా  జీవించే అవకాశం ఏర్పడుతుంది . అంతే కాదు  సమాజంలో అనేకమైన సమస్యలకు  వివాహం (పెండ్లి)  చెక్ పెడుతుంది .  ముతైదువుగా  సుభ కార్యాలుకు  వెళ్ళాలన్నా , కిరాయీలకు ఇండ్లు  దొరకాలన్నా . ప్రభుత్వ  సంక్షేమ  పధకాలు అందాలన్నా  వివాహం (పెండ్లి)  తప్పని సరి . 
ఎలాంటి వారిని వివాహం  ( పెండ్లి) ( MARRIAGE) చేసు కోవాలి?
చట్ట ప్రకారం  వివాహాలు (పెండ్లిళ్ళు )  (MARRIAGES) ఆడ వారికి  18  , మగ వారికి 21 సంవత్సరాల వయస్సు  దాటినా తరువాతనే చేయాలి . ఒక వేల  అంత కుంటే ముందే వివాహం (పెండ్లి)  జరిపించినట్లవుతే  లేదా చేసు కున్నట్లవుతే  చట్ట ప్రకారం నేరం  జైలు శిక్ష , జుర్మానా  విధించ వచ్చు .  వివాహం (పెండ్లి)  అనేది  మూడు ముళ్ళు , జిలుకర బెల్లంతో ఒకటయ్యేది  కావచ్చు కాని , నూరు సంవత్సరాలు ప్రేమగా , ఎలాంటి  సమస్యలు , బాధలు , కష్టాలు  లేకుండా కల్సి జీవించ వలసినది కూడాను. మరో తరాన్ని సృష్టించాలి  . తర తరాలకు కావల్సింది అందించాలి , నేర్పాలి .   తర తరాలకు ఆదర్శంగా జీవించాలి .   అలాంటి  సృష్టికే పవిత్రమైన వివాహం (పెండ్లి)   చేసుకునేటప్పుడు  యువతీ , యువకులు కేవలం  అందాన్ని చూసో , వరకట్నం ఇస్తారనో , వరకట్నం  ఇస్తామనో ,, వెనుకాల డబ్బును చూసో ,  ఆస్తులను చూసో , మాటలను చూసో , డాబు సరిని చూసో , పలుకుబడిని  చూసో ,  సోకులను  చూసో , నాజూగ్గా ఉన్నారనో  వివాహం (పెండ్లి)  చేసుకో కూడదు . తెలుగులో ఒక సామెత వాడుకలో  ఉంది  . " అందమైన ఆడది , లేదా మగాడు  శత్రువుతో  సమానం " అని .  తరిచి చూస్తే   నిజ జీవితం లో  అనేక  మైన సంఘటనలు  చూసే ఉంటాము , చూస్తూనే  ఉంటాం . వాస్తవంగా జరిగేది కూడా అదే . నిజ జీవితంలో జరుగు తున్నది కూడా అదే . వివాహం (పెండ్లి)  కి ముందే  యువతీ యువకులు  అందం గురించి  ఎన్నెన్నో ఉహించుకుంటారు . ఎన్నెన్నో కలలు  కంటారు  . ఎన్నో ఆశలు పెంచుకుంటారు . అది సహజం .( కాని భూమి మీద నిల్చుని  ఆకాశాన్ని  తాకుతూ ఆడుకుంటా అని కోరికలు పెంచు కోవడం  భవిష్యత్తులో  కొంత ఇబ్బందికి గురి చేయ వచ్చు .)  తాళి కట్టిన మరుసటి నిమిషం నుండి , ఒకరి పై మరొకరికి  హక్కులు పెరుగుతాయి . బాధ్యతలు పెరుగుతాయి . నా భార్య అని లేదా  నా భర్త అని విపరీతమైన  ఇష్టం ఏర్పడుతుంది . నా  అందమైన భార్య పై  ఎవరి దృష్టి పడ  కూడదని , ఎవరూ మాట్లాడ కూడదని , అలానే నా  అందమైన భర్త  పై  ఎవరి దృష్టి పడ  కూడదని , ఎవరూ మాట్లాడ కూడదని  అతి ప్రేమ తో  ఉంటారు . అదే కంటిన్యూ  అవుతూ అపోహలు ,  అనుమానాలకు  దారి తీస్తుంది  , అవి శృతి  మించితే  అవమానాలు , కొట్లాటలు , చికాకులూ  పెరిగి జీవితం నరక ప్రాయం అవుతుంది . అభివృద్ధి పై పట్టు సడలు ( తగ్గు ) తుంది. భార్య భర్తల  కొట్లాటలు పెరుగుతాయి , రోడ్డుపైన పడుతారు , పోలేస్స్ స్టేషన్లకు ,  కోర్టుల దాకా  వెలుతారు . అనుమానాల వలన  విడాకులు ,  హత్యలు,  ఆత్మ హత్యలు చేసుకుంటారు . కుటుంభాలు , జీవితాలు , బంధాలు , బంధుత్వాలు  చీకటి మాయం అయినవి అనేకమున్నాయి . ( అయితే గతంలో చెడు అలవాట్లు ఉన్నవారు , విశాల హృదయం గల వారు  , ఎవరి ఇష్టం వారిదే అనుకునే వారు ,  డబ్బుకు కక్కుర్తి పడే వారు , అసమర్దులు , బల హీనులు   ఇందుకు మినహా హింపు గా  భావించ వచ్చు ). 
అందుకని వివాహం (పెండ్లి) (MARRIAGE ) చేసుకునే ముందు ,   మొదట  వారి క్యారెక్టర్ ను , వారి మనస్సును , వారి నిజాయితీని , వారి నమ్మకాన్ని , వారి  పట్టుదలను , వారి ఆర్ధిక క్రమ శిక్షణను , వారి స్వయం శక్తిని , వారి విద్యను , ఉద్యోగాన్ని , ఆరోగ్యాన్ని  , వారి  నిలకడ  తత్వాన్ని చూసి  , ఆ తరువాత నే  అందం  , నాజూకు తనం , డబ్బు  మొదలైనవి  చూడాలి .  అలానే  ఆకర్షణకు లోనయ్యో  , ఇగోతోనో , శరతులతోనో  , ఇతరుల వత్తిడితోనో , చిన్న వయసులోనే పెంచి పోషించిన  , విద్యా  బుద్దులు  నేర్పిన  తల్లి దండ్రుల  ఇష్టం లేకుండా    ప్రేమ వివాహాలు చేసుకో కూడదు .  ఇలాంటి  ప్రేమ  వివాహాలు  చేసుకోవడం  వలన 70%  వివాహాలు  చెడి పోవడమో , విడాకులు తీసుకోవడమో ,  ఆత్మ హత్యలు చేసుకోవడమో జరుగుతుంది .  




WHAT ARE THE BENEFITS BY WRITING FINANCIAL DAIRY ? / ఆర్ధిక డైరీ వ్రాయడం వలన ప్రయోజన మేమిటి?

ప్ర . ఆర్ధిక  డైరీ (FINANCIAL DAIRY) వ్రాయడం వలన ప్రయోజన మేమిటి?
జ . ఆర్ధిక  డైరీ (FINANCIAL DAIRY)  అనగా , ఒక  కుటుంభం యొక్క లేదా ఒక వ్యక్తీ యొక్క  ఆదాయం , ఖర్చులను  రోజు  వారీగా  వ్రాసుకునే విధానమన్న మాట .  
01. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన మనకు  రోజు వారీగా  కావాల్సిన వస్తువు  లేమిటో, అవసరం లేని వస్తువు  లేమిటో  తెలుస్తుంది .  
02. ఆర్ధిక  డైరీ వ్రాయడం వలన  ఆయా కాలాలలో , ఏయే  వస్తువులకు  ఎంత ధర  ఉండేదో  తెలుస్తుంది .  
03. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన  రోజు వారీగా ఎంత ఖర్చు అవసరం ఉంటుందో , ఎంత డబ్బు అవసరం ఉంటుందో  తెలుస్తుంది .  
04. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన   ఆర్ధిక  క్రమ శిక్షణ . ప్లానింగ్ అలవాటవుతుంది . 
05. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన  ఆర్ధిక అవగాహన ఏర్పడి , జీవితంలో  ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఎదురైనా  తట్టుకునే  మనో  ధైర్యం , శక్తి  ఏర్పడుతుంది .     
06. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన ఆదాయం తగ్గినప్పుడు , ఎలాంటి ఖర్చులు తగ్గించు కోవాలో , ఎలా ఆదాయం పెంచుకోవాలో తెలుస్తుంది . దీని వలన  ఎలాంటి   ఆర్ధిక సమస్యలు  తలెత్తవు . 
07. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన , వారికి  క్రమ శిక్షణ గల వ్యక్తి  అని , కుటుంభంలో , సమాజంలో  మంచి గుర్తింపు  ఏర్పడుతుంది . నమ్మకం  ఏర్పడుతుంది . ఎదుటి వారి నమ్మకాలతో  ఎన్నో విజయాలు సాదించ వచ్చు . 
08. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన  ఎక్కడ ఎంతెంత డబ్బు అప్పు  తెస్తున్నాం , దానిని  ఏవిధంగా  ఉపయోగిస్తున్నాం , ఎంతెంత  వడ్డీ కడుతున్నాం , ఇంకెంత కట్టాలి . 
09. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన  నెల వారీగా  ఎంత పొదుపు చేస్తున్నాం . ఇంకెంత  చేయాలి .
10. ఆర్ధిక  డైరీ  వ్రాయడం వలన  ఏయే  కాలంలో  వస్తువుల ధరలు  తక్కువగా  ఉంటాయి , ఏయే  వస్తువుల ధరలు  ఎక్కువగా ఉంటాయి  అనేది తెలుస్తుంది . 
11. అన్నిటి కంటే ముఖ్యంగా , మలి  వయస్సులో  సాధారణంగా  ఆదాయం  తగ్గుతుంది . హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి . అలాంటి సమయాల్లో  , ఎలాంటి ఖర్చులు తగ్గించు కోవాలో  , ఎలా  అప్పులు  చేయకూడదో , ఎలా ఆదాయం  పెంచు కోవాలో తెలుస్తుంది . 

Saturday, March 19, 2016

WHAT ARE THE INTEREST RATES ON POST OFFICE SAVING SCHEMES ? / పోస్టాఫీసులలో , చిన్న మొత్తాల పొదుపు పధకాలపై వడ్డీ రేట్లు ఎలా మార బోతున్నాయి ?

ప్ర . పోస్టాఫీసులలో  , చిన్న మొత్తాల  పొదుపు పధకాలపై  వడ్డీ రేట్లు  (POST OFFICE  SAVING SCHEMES INTERET RATES) ఎలా మార బోతున్నాయి ?

జ . పోస్టాఫీసులలో  , చిన్న మొత్తాల  పొదుపు పధకాలపై  వడ్డీ రేట్లు  (POST OFFICE  SAVING SCHEMES INTERET RATES)  తేది . 01. 04. 2016  నుండి  ఈ క్రింది విధంగా  మార బోతున్నాయి . అయితే  తేది . 31.03. 2016  నాటికి చేసిన  పొదుపుపై  ఎలాంటి మార్పు ఉండదు . 
పోస్టాఫీసులలో  , చిన్న మొత్తాల  పొదుపు పధకాలపై   సవరించిన వడ్డీ రేట్లు:

పొదుపు పధకాలు :                              ప్రస్తుత వడ్డీ రేట్లు  %       సవరించిన  వడ్డీ రేట్లు %
                                                         (Till 31.03.2016)          (From 01.04.2016)
01. సేవింగ్  డిపాజిట్                                      4. 0                                  4. 0
02. 1 సం . డిపాజిట్                                       8. 4                                   7. 1 
03. 2 సం . డిపాజిట్                                       8. 4                                   7. 2
04. 3 సం . డిపాజిట్                                       8. 4                                   7. 4
05. 5 సం .  డిపాజిట్                                      8. 5                                   7. 9
06. 5 సం .రికరింగ్  డిపాజిట్                           8. 4                                   7. 4
07. 5 సం . వృద్దుల సేవింగ్ డిపాజిట్                9. 3                                    8. 6               
08. 5 సం .  ఎం . ఐ . ఎస్ . డిపాజిట్                8. 4                                   7. 8
09. 5 సం .ఎన్ . ఐ  . సి .  డిపాజిట్                  8. 5                                   8. 1
10, పి  . పి. ఎఫ్ . డిపాజిట్                              8.7                                    8. 1 
11. కిసాన్ వికాస  . డిపాజిట్                            8. 7                                  7. 8                                  
12. సుకన్య సమృద్ధి ఖాతా                               8. 2                                  8. 6