Q.How to find the Diseases and how to control Diseases?
ప్ర. జబ్బు లను కనుక్కోవడం ఎలా ? జబ్బు లను నివారించడం ఎలా ?
జ . ఈ కాలం లో , ఏ చిన్న జబ్బు చేసినా హాస్పిటల్స్ కు వెలుతాము . పదుల సంఖ్య లో , అవసరం ఉన్నా , లేకున్నా డాక్టర్లు అనేకమైన టెస్టులు వ్రాస్తారు . జబ్బులకు మందులు కొనక ముందే , ఉన్న డబ్బులన్నీ ఊడ్చేస్తారు . పరీక్షలు వారి ల్యాబ్ ల్లోనే చేయించు కోవాలి , మందులు వారి హాస్పిటల్ లోనే కొనాలి . కొందరు హాస్పిటల్స్ వారు , అవసర మున్నా , లేకున్నా హాస్పిటల్ లోనే జాయిన్ కావాలంటారు . మరి కొన్ని హాస్పిటల్స్ వారు , చని పోయిన శవం పైనా బిల్లులు దండు కుంటారు . ఈ కారణంగా అనేక మంది నిరు పేద , సామాన్య , మధ్య తరగతి ప్రజలు , దొరికిన కాడల్లా అప్పులు చేసి , ఆ అప్పులు తీర్చలేక , రోగాలు తగ్గక ఆత్మ హత్యకు పాల్పడుతున్న వారెందరినో , మనం రోజూ చూస్తున్నాం .
మరి దీనికి పరిష్కారం లేదా ?
ఎందుకు లేదు . ఉంది . మనసుంటే మార్గముంటుంది . ఆలోచిస్తే అవకాశాలుంటాయి . ప్రయత్నిస్తే ఫలితాలుంటాయి . డబ్బులు ఆదా చేసు కోవాలన్నా , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా , అంతా మన చేతిలోనే ఉంది .
అందుకు చేయవలసిందల్లా , వారి జీవిత కాలంలో, వారికీ, వారి కుటుంభం సభ్యులకు ఎదురైనా జబ్బులను , వాటి కొరకు తీసుకున్న జాగ్రత్తలను , పరీక్షలను , మందులను ఒక డైరీ లో వ్రాసుకొంటూ పోవాలి . ఈ విధంగా వ్రాసుకుంటూ , మరల చదువుకుంటూ అనలైజ్ చేసుకుంటూ పోతే , ప్రతి ఒక్కరూ , తమ చిన్న చిన్న జబ్బులకు పరిష్కారం చూప గలిగే ఒక చిన్న డాక్టర్ కాగలరు .
"మనిషి మర్మం పరమాత్మకెరుక" అన్నట్లు , మనిషి అనారోగ్య రహస్యం శరీరానికెరుక . అంతర్గత జబ్బులకు , ప్రతి బింభం మన బాహ్య శరీరం . మనిషి లోపలి అనారోగ్య సమస్యలన్నీ , ఎప్పటికప్పుడు మనిషి శరీరం పైన కనిపిస్తాయి . వాటిని విశ్లేషించుకుని , తగు చర్యలు తీసుకుంటే శరీరానికి హాయి , డబ్బు ఆదా మరియు సమయం ఆదా అవుతాయి .
తెలుగులో ఒక సామెత , "ఆరోగ్యమే మహా భాగ్యం " అన్నారు పెద్దలు . మనం ఆరోగ్యాంగా ఉంటేనే మనకు ఎంతో సంపద ఉన్నట్టు లెక్క . అలానే ఆంగ్లంలో ఒక సామెత ఉంది , " PREVENTION IS BETTER THAN CURE" అని . జబ్బు రాక ముందే , మన బాహ్య శరీరం పై కనపడే లక్షణాలను (SYMPTOMS) బట్టి , మన శరీరంలోపల కలిగే నొప్పులను , వాంతులను , మోషన్స్ ను బట్టి తగిన జాగ్రత్తలు , నివారణ చర్యలు తీసుకోవడం మేలు అనేది దీని భావం . ఈ రెండూ మన ఆరోగ్యానికి సంబంధించినవే . ప్రతి సామెతలో , ప్రతి నానుడిలో ఎంతో అర్ధం ఉంటుంది . అనేక మంది మానవుల గొప్ప అనుభవం నుండి బయట పడిన సత్యాలే , సామెతలు . ఆ విధంగా మానవుల అనుభవాలతో గొప్ప డాక్టర్లు గా ప్రధమ చికిత్సలను అందించా వచ్చు . అనారోగ్యానికి గురి కాకుండా చూడ వచ్చు . ప్రతి ఒక్కరూ , తమ కుటుంభం వరకైనా ఒక డాక్టర్ గా మార వచ్చు . మాకు ఏమి తెలుసు అనుకుంటే , ఎప్పటికి మీరు ఏమి కాలేరు .
మనుష్యులకు సాధారణముగా వచ్చే జబ్బులు కొన్నిటిని గురించి ఇక్కడ తెలుసుకుందాం:
డయాబేటిస్ (DIABETES):
దీనినే షుగర్ వ్యాధి అని కూడా అంటారు .
డయాబేటిస్ (DIABETES), రెండు రకాలుగా ఉంటుంది . మొదటిది టైప్ -1 , రెండవది టైప్ -2.
టైప్ -1, డయాబేటిస్ (DIABETES) వలన మనకు కనబడే / ఏర్పడే లక్షణాలు :
అ ) . తరుచుగా మూత్రానికి వెళ్లడం జరుగుతుంది ,
ఆ ) . ఆకలిగా ఉండడం,
ఇ ) . తొందరగా అలిసి పోవడం,
ఈ ) . కండ్లు మంట మండటం , మసక బారడం ,
ఉ ) . గాయాలైతే తొందరగా మానక పోవడం ,
ఊ ) . అరికాళ్ళల్లో మంటలు ఏర్పడటం ,
రు ) . శరీరం మీద పలు చోట్ల గోకుడు / దురద పుట్టడం మొదలైనవి .
టైప్ -2, డయాబేటిస్ (DIABETES) వలన మనకు కనబడే / ఏర్పడే లక్షణాలు :
అ ) . అధికంగా మూత్రానికి వెళ్లడం జరుగుతుంది ,
ఆ ) . అధికంగా ఆకలిగా ఉండడం ,
ఇ ) . అధికంగా అలిసి పోవడం ,
ఈ ) . కండ్లు మంట మండటం ,మసక బారడం ,
ఉ ) . గాయాలైతే అసలే మానక పోవడం మొదలైనవి .
ఊ ) . అరికాళ్ళల్లో మంటలు బాగా పొడిచినట్లుగా ఏర్పడటం ,
రు ) . శరీరం మీద పలు చోట్ల గోకుడు / దురద పుట్టడం ,
రూ) . ఇంకను అధిక మైతే , సొమ్మసిల్లడం లేదా క్రింద పడి పోవడం జరుగ వచ్చు .
ఇలాంటి లక్షణాలు (SYMPTOMS) , ఏ ఒకటో రెండో కాకుండా కనీసం 3 - 4 ఏర్పడి నప్పుడు లేదా కనబడినప్పుడు , ఈ క్రింది నివారణ చర్యలు తీసుకోవాలి .
అ ) . తీపి పదార్ధాలు , మిఠాయిలు తినడం మాని వేయాలి ,
ఆ ) . టీ , కాఫీ లలో చక్కర మాని వేసి , షుగర్ బిళ్ళలు గాని , పౌడర్ గాని టీలో వాడాలి ,
ఇ ) . పిండి పదార్ధాలు తినడం తగ్గించాలి ,
ఈ ) . రోజుకు ఒక పూట అన్నం తిని ,మరొక పూట గోధుమ లేదా జొన్న రొట్టెలను తినడం అలవాటు చేసు కోవాలి.
ఉ ) . రోజు పరి గడుపున , రాత్రి పూట కొన్ని మెంతులు నాన బెట్టి . ఆ నీటిని త్రాగాలి .
ఊ ) . లేదా రోజూ పరి గడుపున మెంతి పౌడర్ ను పావు గ్లాస్ నీటిలో కలుపుకుని త్రాగాలి.
రు ) . వారానికి ఒక సారి మెంతి ఆకు పచ్చడిని , పూదీన ఆకు పచ్చడిని , కాకర కాయ కూరను వండుకుని తినాలి .
రూ ) . ప్రతి రోజు కొంత టైం , వారికీ సాధ్యమైన / అనుకూలమైన రీతిలో వ్యాయాయం చేయాలి,
రు ) . ఒంటరిగా ఉండకుండా అందరితో కలిమిడిగా ఉండటం అలవాటు చేసుకోవాలి .
ఈ విధంగా చేయడం వలన , ప్రాధమిక దశలో ఉన్న వారికీ పూర్తిగా కంట్రోల్ అవుతుంది . ఇక అప్పటికే టైప్ 2 లోకి వెళ్లిన వారికీ , కంట్రోల్ కావడం కొంచం కష్టం కావచ్చు . అలాంటి వారికీ , అవే లక్షణాలు కనబడుతున్నట్లయితే , ఒక సారి సరియైన డాక్టర్ కు చూపించుకుని ' బ్లడ్ షుగర్ ' పరీక్షలు చేయించుకోవాలి. దీని కొరకు 2 సార్లు రక్త పరీక్ష లు చేస్త్తారు . ఉదయం లేవగానే పరిగడుపున ఒకసారి బ్లడ్ తీసుకుని మరియు భోజనం చేశాక 2 గంటల తరువాత మరల బ్లడ్ తీసుకుని , ' బ్లడ్ షుగర్ ' టెస్ట్ చేస్తారు .
పరిగడుపున టెస్టులో రీడింగ్ 70-100 mg/dl ఉన్నా మరియు అన్నం తిన్న తరువాత టెస్ట్ లో 101 -140 mg/dl వరకు ఉన్నా నార్మల్ గానే భావించాలి . అంత కంటే ఎక్కువ గా ఉంటే మాత్రం , డాక్టర్ సూచించిన మందులను క్రమంగా వాడాలి . అలానే , పైన సూచించిన నివారణ చర్యలు కంటిన్యూ చేయాలి .
జ్వరం ( FEVER):
జ్వరం (FEVER) అనేది సర్వ సాధారణం . జ్వరం (FEVER) అనుభవం లేని వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు . అందుకని కేవలం జ్వరం (FEVER) వచ్చిందని ఏ ఒక్కరూ భయపడ నవసరం లేదు .
జ్వరాలలో కూడా అనేక రకాలు ఉంటాయి . సాధారణ జ్వరం , వైరల్ జ్వరం , మలేరియా జ్వరం , టైఫాడ్ జ్వరం , ఎల్లో జ్వరం , డెంగ్యూ జ్వరం , చికెన్ గున్యా జ్వరం మొదలైన వాటిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు .
సాధారణంగా ఒక మనిషి 'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE) 98.4 P/H డిగ్రీలు ఉంటే నార్మల్ అని చెబుతారు . ఒకవేల 'బాడీ టెంప రేచర్' (BODY TEMPERATURE) 100.4 P/H డిగ్రీలు ఉన్నా పెద్ద సమస్యగా భయపడనవసరం లేదు . అయితే 100.4 P/H డిగ్రీలు దాటి అది కంటిన్యూగా ఉన్నా , తగ్గుతూ పెరుగుతూ ఉన్నా , వెంటనే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి " బ్లడ్ టెస్ట్ " లను చేపించి దానికి అనుగుణంగా డాక్టర్ సూచించిన మందులు వాడల్సి ఉంటుంది . జ్వరం (FEVER) రక ముందే లేదా కాస్త జ్వరం (FEVER) అనేది కనబడి నప్పుడే తగిన చర్యలు తీసుకున్నట్లయితే , జ్వరం(FEVER) 100.4 P/H డిగ్రీలు దాటదు.
జ్వరం (FEVER) రావడానికి అనేక కారణాలు ఉంటాయి . ఒక్కో రకం జ్వరాని కి (FEVER), ఒక్కో రకం కారణం (REASON) ఉంటుంది .
జ్వరం (FEVER) రావడానికి కారణాలు (REASONS) :
01. అధిక పనుల కారణంగా అలసి పోవడం వలన ,
02. ఎండలో తిరగడం వలన ,
03. వాతావరణంలో మార్పులు కలగడం ,
04. కాలుష్యమైన ఆహారాన్ని భుజించడం ,
05. కాలుష్యముతో కూడిన గాలిని, విష వాయువులను పీల్చడం వలన ,
06. కాలుష్యముతో కూడిన నీటిని త్రాగి నప్పుడు ,
07. భయం వలన
08. దోమలు కుట్టడం వలన
09. జంతువులు ( కుక్కలు , పందులు ) కరువడం వలన , పక్షులు , క్రిమి కీటకాలు కుట్టి నపుడు ,
10. గాయాలు తగిలినప్పుడు ,
11. కాలినపుడు , కరెంట్ షాకు తగిలినప్పుడు ,
12. ఆపరేషన్ చేసి నప్పడు ,
13. ప్లాసిటిక్ కప్పులలో టీ లు త్రాగి నప్పుడు , ప్లాస్టిక్ ప్లేట్లల్లో టిఫిన్ , భోజనం చేసినప్పుడు , ప్లాస్టిక్ కవర్లలో పానీయాలు త్రాగి నపుడు , ఇలా అనేక కారణాల వలన , టెంపరేచర్ పెరుగడం , జ్వరం కలుగుతూ ఉంటుంది .
సాధారణ జ్వరం (FEVER):
సాధారణ జ్వరం (FEVER) అలసి పోవడం వలన , ఎండలో తిరగడం వలన వాస్తు ఉంటుంది , పోతూ ఉంటుంది . ఇలాంటి జ్వరం అయినట్లవుతే ప్యారాసిటమాల్ మందులతో తగ్గి పోతుంది .
వైరల్ జ్వరం (VIRAL FEVER):
వైరల్ జ్వరం (VIRAL FEVER) , ఇది ఇన్ఫెక్షన్ వలన వస్తుంది . అంటే కలుషితమైన ఆహారాన్ని గాని , పదార్ధాలను తిన్నపుడు , పానీయాలను గాని నీటిని గాని త్రాగి నప్పుడు , కలుషితమైన గాలిని పీల్చినపుడు , శరీరం లో , బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది . ఆ కారణంగా వైరల్ జ్వరం (VIRAL FEVER) వస్తుంది . అప్పుడు డాక్టర్ సూచించిన పారాసిటమాల్ మరియు అంటి బయాటిక్ కలిపి తీసుకున్నట్లయితే వైరల్ జ్వరం (VIRAL FEVER) రెండు మూడు రోజులలో తగ్గి పోతుంది . జ్వరం తీవ్రతను బట్టి డాక్టర్లు సెలైన్ ఎక్కిస్తారు .
TO BE CONTINUED........
నోట్ : ఇది కేవలం ప్రజల అవగాహన కొరకు మాత్రమే సూచించడం జరిగింది . ఎవరి నిర్ణయాలకు , ఎవరి ఖర్చులకు , ఎవరి ఆరోగ్యాలకు వారే బాధ్యులు . అవసరం అనుకున్న వారు , వారి జబ్బులను బట్టి , సరియయిన డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి , మందులు వాడాలి . వెళ్లిన ప్రతి సారీ ఉచితంగా చేసే టెస్ట్ లు 'టెంప రేచర్' , 'బి . పి 'ని అడిగి ప్రిస్క్రి ప్సన్ మీద వ్రాయ మని చెప్పాలి .