అంశం:ఘన చరిత్ర
శీర్శిక: ఘన చరిత్ర గల దేశం భారతదేశం
సింధులోయ నాగరికత నుండి
వేద యుగం మౌర్య సామ్రాజ్యం
గుప్త మరియు విజయనగర సామ్రాజ్యం
ముస్లిం సామ్రాజ్యాల పాలనలతో
పలు యుద్ధాలతో ఆక్రమణలతో
భారత దేశ చరిత్ర ఎంతో ఘనమైనది!
భౌగోళికంగా తూర్పున బంగాళాఖాతం
పశ్చిమాన అరేబియా సముద్రం
ఉత్తరాన హిమాలయా పర్వతాలు
దక్షణాన హిందూ మహాసముద్రం!
చతుర్వేదాలు రామాయణం
మహాభారతం భగవద్గీత ఇతిహాసాలు
పురాణాలు చతుష్షష్టి కళలు
పదునెనిమిది శక్తి పీఠాలు
ఆపదలో ఉన్న విదేశీయులను
ప్రేమతో అక్కున చేర్చుకునే ఘనత
ఆపదలో ఉన్న దేశాలకు ఆర్ధిక ఔషద
స్పుర్తి దాయకమైన దేశం భారతదేశం!
జనాభాలో రెండవ అతి పెద్ద దేశంగా
ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం గల దేశంగా
సంయమనంలో శాంతి కాముక దేశంగా
ఘన చరిత్ర గల దేశం భారతదేశం!